మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

బొడ్డుపల్లివారి వంశం


బొడ్డుపల్లి గ్రామము ప్రస్తుతము నల్లగొండ జిల్లాలోని దేవరకొండ తాలూకాలో తాటికొల్లం దగ్గర ఉంది. ఈ వంశీయులిప్పుడు ఎనగండ్ల పల్లె, కొత్తపల్లి గోలకొండ, చింతపట్ల, నోముల, బాలానగరం, ముదివెన్ను , శంషాబాద్ హైదరాబాద్ లో వ్యాపించి ఉన్నారు.

భాగ్యనగరంలోని చెన్నరాయని గుట్టలో (చాంద్రాయణగుట్ట) ఈ వంశంవారు పూర్వం నుండి ఉన్నారు. వారు మÖడు నాలుగు శాఖలుగా చీలిపోయినారు. ప్రస్తుతం ఇక్కడిశాఖనే ఒకటి నాగర్ కర్నూలులో స్థిరపడింది. 

ఈ వంశీయులు బహుకుటుంబీకులు. చెన్నరాయని గుట్టలోని ప్రస్తుత వంశానికి మÖలపురుషుడు వెంకయ్య. ఆయన పత్ని వెంగమాంబ. వీరికి కిష్టయ్య అనేకుమారుడు కలిగినాడు. ఆయన భార్య రంగనాయకమ్మ. వీరికి నరసయ్య అనే కుమారుడు కలిగినాడు. ఆయన యిల్లాలు లక్ష్మమ్మ. 

ఈ దంపతులకు బ్రహ్మయ్య-కేశవాచారి అని యిద్దరు కుమారులు కలిగినారు. ఈతరం వరకు వీరు కులవృత్తియైన స్వర్ణ, శిల్పం లోనే జీవించినారు. అగ్రజుడైన బ్రహ్మయ్యాచార్యుల ధర్మపత్ని శ్రీమతి చెన్నమ్మ. వీరికి ఏడుగురు కుమారులు, అయిదుగురు కూతురులు కలిగినారు. నరసింహాచారి, మాణిక్యాచారి, చక్రపాణి, శ్రీహరి, వాసుదేవాచారి, మురళీధర్, గోవర్థన్, కుమార్తెలు నాగమణి, శిరోమణి, విజయ, శాంత, అరుణ. 

బ్రహ్మయ్యగారి కుమారులు నరసింహాచారి నుండి కులవృత్తిని విడిచి విద్యావంతులై ఉద్యోగ ప్రవృత్తులైనారు. నరసింహాచారి గవర్నమెంటు టెక్స్ట్ బుక్స్ చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్గా రిటైరైనాడు. 

మాణిక్యాచారి వీ.దీ.దీ.S, వీS. జు.చీT. చేసి డాక్టరై విదేశాలలో గూడ పనిచేసి వచ్చినాడు. చక్రపాణి, శ్రీహరి వ్యాపారాలలో స్థిరపడగా వాసుదేవాచారి, మురళి రాష్ట్రప్రభుత్వంలో, గోవర్ధన్ ఇసిఐఎల్‌లో ఉద్యోగాలు చేసారు.

నరసింహాచార్యుల భార్య రమామణి. ఆయనది తాతగారి పేరు. వీరికి కాళిదాసు, శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ అనే నలుగురు కుమారులు, కృష్ణకుమారి, పద్మ, శ్రీదేవి, సంధ్య అనే నలుగురు కూతురులు కలిగినారు. 

నరసింహాచారిగారి చివరి కూతురు సంధ్యను నాగర్ కర్నూలు కపిలవాయి లింగమÖర్తి గారి రెండవ కుమారుడు అశోక్‌బాబుకు ఇచ్చినారు. ఆయన పెద్ద కుమారుడు కిశోర్‌బాబు. ఆయన భార్య బాలకిష్టమ్మ ఉరఫ్ భార్గవీదేవి నాగర్ కర్నూలు చింతపట్ల మురహరి గారి ఏకైక పుత్రిక. ఈ మురహరిగారు భాగ్యనగరం నుండి చీలిపోయిన బొడ్డుపల్లివారి శాఖవాడే కావటం ఒక యాదృచ్ఛికం. ఈ విధంగా ఆయన వియ్యంకులిద్దరు ఒకే గోత్రీకులు ఒకే శాఖవారైనారు. 

నరసింహాచారి కుమారులలో కాళిదాస్ వీ.దీ.దీ.S., ణ.A. చేసినారు. ఆయన ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీలో ‘అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర’గా పదవీ విరమణ చేసినారు.

ప్రస్తుతము మహాబూబ్ నగర్ జిల్లా, గొల్లపల్లిలో స్వామి రామేశ్వరానంద గారిచే స్థాపింపబడిన ‘లలితాంబిక తపోవనాని’కి ఫౌండర్ ట్రస్టీగా ఉంటు దాని కార్యనిర్వాహణ భాద్యతలు పర్యవేక్షిస్తున్నారు. 

మిగతా ముగ్గురు కుమారులు శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్ ఉన్నత విద్యానంతరం ప్రభుత్వ ఉద్యోగాల కాశపడక స్వంతంత్ర జీవనులై వేర్వేరు వ్యాపారాలలో స్థిరపడినారు. వారుకుడా తమ వంతు సంఘ సేవ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. 

17-10-2004న లింగమÖర్తిగారు తమ వివాహ షష్టిపూర్తిని ఘనంగా జరుపుకున్నారు. సహస్ర చంద్రదర్శనోత్సవం కూడ జరుపుకున్నారు. (17-5-2011) 2012 సం.లో ఈ నరసింహాచారిగారు తమ సహస్రచంద్ర దర్శనోత్సవాన్ని ఎనుబది రెండు కలశాలు ప్రతిష్టించి త్రిరాత్రోత్సవంగాను మహా ఘనంగా జరుపుకున్నారు. 

శ్రీ బొడ్డుపల్లి నరసింహ్మాచారి గారు గుంటూరు జిల్లాలోని పాండ్రపాడు గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ అంజనేయ విగ్రహ ప్రతిష్ఠకు సహాకరించినారు. సహస్ర చంద్ర దర్శనోత్సవ సందర్భంగా జీడిమెట్లలోని వారి ఫ్యాక్టరీలో ‘ఆభయాంనేయ’ ప్రతిష్ఠ జరిపించినారు. 

నరసింహాచారిగారి సహస్ర చంద్ర దర్శనోత్సవానికి కొంతముందే వారి కుమారులు తమ తల్లి గారి ఊర్ధ్వకాయాన్ని బంగారు పూతతో చేయించి ఆరామమేర్పరచి ప్రతిష్ఠించడం ఒక విశేషం. దానికి ‘రామ ఆరామ విరామ మందిరమ’ ని నామకరణం చేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి