మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, అక్టోబర్ 2026, శనివారం

యానాది అంకమ్మ గురించి మాట్లాడేదెవరు? (నిర్బంధ బాల కార్మికుడు వెంకటేశ్ విషాద గాధ)

యానాది గిరిజన సమాజానికి చెందిన మన్నెపల్లి అంకమ్మ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి దగ్గర గూడూరు. అంకమ్మ కటిక పేదరాలు. ఆమెకు చదువు రాని కారణంగా ఆమె ఎప్పుడు జన్మించిందో ఆమెకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలో ఆమె చెప్పలేదు. అంకమ్మకు ఒకతనితో వివాహం జరిగింది. ఆ భర్త ద్వార అంకమ్మకు చెంచు కృష్ణ (15), రావు లక్ష్మమ్మ (12) మరియు వెంకటేశ్‌లు జన్మించారు. మొదటి భర్త మరణించడంతో అంకమ్మ ప్రకాష్‌ను పెళ్ళి చేసుకుంది. 

రెండు సంవత్సరాల క్రితం (2023లో) ముత్తు అనే అతను నెలకి రూ.24,000 జీతం ఇస్తాడని, అతని దగ్గర పనికి కుదరాలని అంకమ్మ తల్లి చెప్పడంతో అంకమ్మ ఆమె భర్త ప్రకాశ్ బాతులు పెంచుకునే రైతు ముత్తు దగ్గర పనికి కుదిరారు. 60 సంవత్సరాల వయసు కలిగిన ముత్తు నెలకు 24000 ఇస్తానని నమ్మబలకుడంతో అంకమ్మ భర్తతో కలిసి అతని పశువులు మేపడానికి, అలాగే తిరుపతి దగ్గర సత్యవేడు పట్టణంలో వున్న ముత్తు మిఠాయిల దుకాణంలో పని చేయడానికి ఒప్పుకుంది. అందుకు ముత్తు రూ. 1500 అంకమ్మకు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. 

అప్పటి నుండి అంకమ్మ ఆమె భర్త ప్రకాశ్ ముత్తు యొక్క బాతులని మేపడం ప్రారంభించారు. అయితే ముత్తు ఇస్తానన్న 24,000 నుండి అడ్వాన్స్‌గా ఇచ్చినవి రూ. 1,500 పోతే మిగిలిన రూ.9000 ఇవ్వనే లేదు. అంకమ్మ ప్రకాశ్ లు ముత్తు బాతులు మేపుతు పొలాల్లోనే పడుకునేవారు. ఆ బాతులని ఎవరూ ఎత్తుకు పోకుండా ఉండడానికి రాత్రులు నిద్ర కాయాల్సి వచ్చేది. 

రాత్రుళ్ళు పొలాల్లో తేళ్ళు, పాములతో భయపడాల్సి వస్తుండేది. ప్రతీ వారం బాతులని మేపుకుంటూ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చేది. ఈ పనులు కష్టంగ వుందని భావించిన అంకమ్మ ప్రకాష్‌ను అడ్వాన్స్ తీసుకున్న రూ.15000 తిరిగి ముత్తుకు ఇచ్చి ఈ పని (నిర్బంధపు) నుండి వైదొలగాలనుకున్నారు. ఇదే విషయం అంకమ్మ ముత్తుకు చెప్పింది. అందుకు ముత్తు ఒప్పుకోకపోగా తిరస్కరించాడు. 

ఆ తరువాత అంకమ్మ భర్త ముగ్గురు పిల్లలను తీసుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తుర్కపల్లి గ్రామానికి వెళ్లి అక్కడ 12 ఎకరాల నిమ్మతోట యజమాని శివారెడ్డి దగ్గర జీతం వుండి జీవించసాగింది. 

తన మొదటి భర్త మరణానంతరం చివరి సారిగా నిర్వహించవలసిన ఆచారాలు నిర్వహించడానికి అంకమ్మ మరియు ప్రకాశ్ గూడూరుకు వెళ్ళారు. తన దగ్గర అడ్వాన్స్ తీసుకుని పని (జీతం) చేయకుండ వెళ్ళిపోయిన అంకమ్మ, ప్రకాశ్ ల కోసం ఇన్ని రోజులు వెతుకుతున్న ముత్తుకు వారు గూడూరుకు వచ్చారని తెలిసింది. కోపంతో రగిలి పోతూ ముత్తు గూడూరుకు వెళ్ళాడు. అంకమ్మ తన దగ్గర జీతముంటానని రూ. 42,000 తీసుకుని పని చేయకుండ వెళ్ళి పోయిందని ఆరోపించి అక్కడున్న వారందరి ముందు తల్లి చేయకపోతే తీసుకున్న డబ్బు కింద కొడుకు పని చేయాల్సి వుంటుందని అప్పటికి (2033 జూన్ నాటికి) ఏడేళ్ళ వయసున్న అంకమ్మ రెండవ కొడుకు వెంకటేశ్‌ను ముత్తు బలవంతంగ తనతోపాటు తీసుకెళ్ళాడు. అట్ల తనతో పాటు తీసుకుపోయిన వెంకటేష్‌ను ముత్తు బాతులు మేపడానికి తమిళనాడు రాష్ట్రం సత్యవేడుకు వెళ్ళాడు. 

వెంకటేశ్‌ను ముత్తు తీసుకెళ్ళడంతో పుట్టెడు దుఃఖంతో అంకమ్మ ఇద్దరు పిల్లలు భర్తతో గూడూరు నుండి నెల్లూరు జిల్లా తుర్కపల్లికి వెళ్ళింది. అప్పటి నుండి రెండు సంవత్సరాల కాలం పాటు అడ్వాన్స్ తీసుకున్న రూ. 15000 రూపాయల కింద వెంకటేశ్ ముత్తు దగ్గరే పనిచేసాడు. 

2025 ఏప్రిల్ 9వ తారీఖున అంకమ్మ తన కుమారుడు వెంకటేశ్ తో ఫోన్లో మాట్లాడింది. తాను ముత్తు బాతులు మేపే పనిలో వున్నానని, మాట్లాడడానికి సమయం కూడా లేదని ప్రస్తుతం తాను తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో వున్నానని, ఎప్రిల్ నాటికి తొమ్మిదేళ్ళ వయసున్న వెంకటేశ్ తన తల్లితో చెప్పాడు. ఆ సందర్భంగ ముత్తుకు ఇవ్వవలసిన రూ. 42000 తీసుకొని రెండు రోజులలో అక్కడికి వచ్చి డబ్బులు ముత్తుకు ఇచ్చి నిన్ను ఇంటికి తీసుకువస్తానని అంకమ్మ కొడుకుతో నమ్మకంగ చెప్పింది. మధ్యాహ్నం ఏం తిన్నావని అంకమ్మ కొడుకును అడగగా “నిన్న నీళ్ళు కలిపిన అన్నం తిన్నానని, నిన్నటి కంటే ఇవ్వాళ నయమని ఈ రోజు “పెరుగన్నం తిన్నానని” వెంకటేశ్ తల్లితో చెప్పాడు. ఇవి అంకమ్మ తన కొడుకుతో మాట్లాడిన చివరి మాటలు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి