వసుధ + ఏవ కుటుంబకం వసుధైవ కుటుంబకం.
ఈ శ్లోకపాదం - మహా ఉపనిషద్ లో 6వ అధ్యాయం
71, 72 73 వ శ్లోకాలలోను, ఋగ్వేదంలోను కనబడుతుంది.
వసుధ=భూమి (భూమి మీద నివసించే సమస్త ప్రాణులు)
ఏవ నిజంగా
కుటుంబకం=కుటుంబమే అని అర్థం
ఇక శ్లోకం అవలోకించండి
అయం బంధురయం నేతి గణనా లఘుచేతసామ్
ఉదార చరితానాంతు వసుధైక కంటుంబకమ్
భావా భావ వినిర్ముక్తం జరా మరణ వర్జితమ్
ప్రశాంతకలనారభ్యం నీరాగం పదమాశ్రయ
ఏషా బ్రాహ్మీ స్థితిః స్వచ్చా నిష్కామ విగతా మయా
ఆదాయ విహరన్నోవం సంకటేషు నముహ్యతి
ఈ శ్లోకాలలో ఎంతో గొప్ప విలువైన మన సనాతన సామాజిక జీవన విధాన సూత్రాలను వివరించారు మన ఋషి వర్యులు.
ఈ భూమి మీద జీవించే ప్రతి ప్రాణి నీకు బంధువు. వీడు నా వాడు, వాడు నావాడు కాదు, అని అల్ప బుద్ధి కలవారు మాత్రమే భావిస్తారు. విశాలమైన బుద్ధి కలవారు అన్ని ప్రాణులు తమ బంధువులని తలుస్తారు. అలా భావించే వారు భావాభావాల నుండి జరామరణాలనుండి విడిపోయి బ్రహ్మానందం పొందుతారు. ఇలా బ్రహ్మానందం పొందడానికి ప్రాతిపదిక ఈ వసుధ మీద జీవించే సమస్త ప్రాణులు నా బంధువులే అని భావించి జీవించడం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి