మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, అక్టోబర్ 2026, శనివారం

తెలుగు - ఇంగ్లీష్ సాహిత్యాలలో దేశి సాహిత్య పరిణామం

 తెలుగు - ఇంగ్లీష్ సాహిత్యాలలో దేశి సాహిత్య పరిణామం 

ప్రపంచంలో ప్రతి భాషకు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఆ ప్రత్యేక లక్షణంతోనే ఆయా భాషలు తమ ఆస్థిత్వాన్ని నిలబెట్టుకుంటు వికాసం చెందుతుంటాయి. వికాస పరిణామ క్రమంలో ఇతర భాషలతో, భాషా సాహిత్యాలతో పరిచయం వల్లనో లేక ప్రభావం వల్లనో కొంత మార్పుకు గురవుతాయి. ఇది భాషా సాహిత్యాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. కాని ఈ సందర్భంలోనే భాష తన ఉనికిని కాపాడుకుంటుంది. తెలుగులో ప్రాక్ నన్నయ యుగం నుండి నేటి వరకు సాహిత్యం అనేక ప్రభావాలకు లోనౌతూ మార్పు చెందుతూ వస్తుంది. ప్రభావం చేత మార్పు అన్నది ఒక్క తెలుగు భాషకే పరిమితం కాదు ఇంగ్లీషు భాషా సాహిత్యాలలో కూడా ఇటువంటి మార్పును గమనించవచ్చు. తెలుగులో దేశి సాహిత్యం అంటే ఏమిటి అన్న విషయం తేలాలంటే ముందుగా దాని పూర్వపరాలు పరిశీలించాలి. స్థూలంగా సంస్కృత సంప్రదాయాలను, మర్యాదలను పాటిస్తు చేసిన రచనా పద్ధతిని మార్గ పద్ధతి అని అంటాం. స్థానిక సంప్రదాయాలను, మర్యాదలను పాటిస్తూ చేసే రచనా పద్ధతిని దేశి సంప్రదాయంగా అని పేర్కొనవచ్చు. కవిత్రయం వారి మహాభారతం మార్గ పద్ధతికి ఉదాహరణ. పాల్కురికి సోమన్న బసవపురాణం దేశి పద్ధతికి ఉదహరణగా చెప్పవచ్చు. మొదట సంగీత నాట్యాలలో ఉపయోగించిన మార్గ దేశి పదాలు కన్నడ సాహిత్యంలో చోటుచేసుకొని తెలుగులో ప్రవేశించాయి. నృపతుంగుడి (కీ.శే. 815-877) కవిరాజమార్గంలో దేశి గురించిన ప్రస్తావన ఉంది. పంపకవి విక్రమార్జునవిజయం లోను, రన్నకవి గదాయుద్ధంలోను మల్లికార్జుని సూక్తీసుధార్ణవములోను ఈ లక్షణాల ప్రస్థావన ఉన్నట్లు తెలుస్తుంది. 

తెలుగులో మార్గ దేశి పదాలను కవిత్వపరంగా వాడిన కవి నన్నెచోడుడు. కుమారసంభవం కావ్యపీఠికలో నాలుగుసార్లు మార్గదేశి భేదాల ప్రస్థావన ఉంది. 

మునుమార్గ కవితలోకంబున వెలియగ దేశికవిత బుట్టించి తెనుం 

గును నిలిపి రంధ్ర విషయంబున జనచాళుక్యరాజు మొదలుగ బలువుర్ 

పూర్వం లోకంలో మార్గకవిత ఉంటే, చాళుక్యరాజు మొదలుగా చాలా మంది రాజులు దేశి కవితను తెలుగులో నిలిపారు. పూర్వం మార్గ కవిత తెలుగులో ఉండేదని, చాళుక్య రాజుల ప్రోద్భలంతో దేశి కవిత తెలుగులో అభివృద్ధి చెందిందనీ దీని ఆధారంగా సంస్కృత కవితే మార్గమని, దేశ భాషలోని కవిత దేశి కవిత అనీ వేదం వెంకటరాయశాస్త్రి లాంటి వారు అభిప్రాయపడ్డారు. 

సాధారణ ప్రజానీకపు నిత్యజీవిత వ్యవహారంలో నుండి అవిర్భవించిన కవితే దేశి కవిత. ఏ సాహిత్యంలోనైనా మొదట ఇలాంటి కవితే పుట్టుకొస్తుంది. ఆ తర్వాతే రాజభాషలోని కవితలు వెలువడుతాయి. తెలుగులో సంస్కృత మర్యాదలు పాటిస్తూ వెలువడ్డ కవిత్వాన్ని నిబద్ధ కవిత్వమని చెప్పొచ్చు. దేశీయ సంప్రదాయాన్ని అంటే స్థానిక సంప్రదాయాన్నీ, స్థానిక ఛందస్సులను స్వీకరిస్తూ చేసిన రచన అనిబద్ధ కవిత అంటాం. 

శార్దూలము, మత్తేభము, చంపకమాల, ఉత్పల మాలల్లాంటి పద్యవృత్తాలు సంస్కృతం నుండి స్వీకరించబడినవి. అందువల్ల ఇవి మార్గ సంప్రదాయ ఛందస్సులు. తరువోజ, సీసము, మధ్యాక్కర మొదలైనవి స్థానిక దేశీ ఛందస్సులు. తెలుగులో మొదటగా దేశి ఛందస్సులోనే పద్యాలు రాశారు. అయితే ఈ ఛందస్సులు ఆదరించనందుకే పదవ శతాబ్దం నుండి మార్గ పద్ధతికి చెందిన పద్యాలు రూపుదిద్దుకున్నట్లు భావించవచ్చు. అందువల్లే నన్నయాదులు మార్గ సంప్రదాయాన్ని పాటిస్తూ భారతాంధ్రీకరణ చేసి ఉంటారు. 

తెలుగులో దేశి పద్ధతికి పెద్దపీఠం వేసినవాడు నన్నెచోడుడు. దేశీ మార్గాలను దేశియాలుగా చేయాలనే ఉద్దేశంతో కొన్ని దేశి సంప్రదాయాలను నెలకొల్పాడు. ఉదాహరణకు కుమారసంభవంలోని గజానన వృత్తాంతం, శివుడిని అవమానించుటకు దక్షుడు యజ్ఞాన్ని ప్రారంభించటం దేశి సంప్రదాయానికి సంబంధించిన ఆలోచనలే. అట్లాగే సేవలకు కూలిగా జొన్నలు కొలవడం, పార్వతికి ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో అక్షరాభాస్యం చేయించటం లాంటి అంశాలు ఆనాటి తెలుగు సంప్రదాయాలు, ఇట్లాంటి అనేక దేశి సంప్రదాయాలు తన కవితలో ఆదరించాడు నన్నెచోడుడు. 

నన్నెచోడుడు ప్రారంభించిన దేశి కవిత సంప్రదాయాన్ని పెంచి పోషించినవాడు పాల్కురికి సోమనాథుడు ఈయన కావ్యవస్తు స్వీకరనలో, ఛందస్సులో, భాషలో పూర్తిగా స్థానిక సంప్రదాయాలను ప్రతిబింబించే రచనలు చేశాడు. సంస్కృత వృత్తాలను కాదని తేట తెనుగు ఛందస్సు ద్విపద ఛందస్సులోనే ‘బసవపురాణం’ అనే మహా రచన చేశాడు. అందులోనూ సంస్కృత పురాణాలలోని కథలను కాకుండా ఈ నేలపై నడయాడిన మహాభక్తుల కథలను, భాషలను, ఆచార వ్యవహారాలను స్వీకరించాడు. అంతేకాకుండా ద్విపద, శతకం, ఉదాహరణలనే కొత్త తెలుగు కవితా శాఖలనూ ప్రారంభించాడు. 

దేశి కవితా మార్గంలో సోమన శైవసాహిత్యాన్ని ఆదరిస్తే దీనిని ఇతర అంశాలకూ విస్తరించిన వాడు గోనబుద్ధ భూపతి, ఈయన క్రీ.శ.1260 ప్రాంతం వాడు. ఈయన దేశి ఛందస్సు- ద్విపదలో రంగనాథరామాయణాన్ని రాశాడు. ఇందులో ఊర్మిళాదేవి నిద్ర, లక్షణ దేవరనవ్వు, సులోచనా వృత్తాంతం మొదలైనవి వాల్మీకి రామాయణంలో లేని దేశి కవితా భావనలు. ఇదే ధోరణి తిక్కనలోనూ కొంత కనిపిస్తుంది. నన్నయ సంస్కృత సమాసభూయిష్టమైన రచనను, సంస్కృత వృత్తాలను ఎక్కువగా ఉపయోగిస్తే, తిక్కన పలుకుబడిలో, ఊహలో, సంభాషణలలో అచ్చమైన దేశి కవిత్వం చూడొచ్చు. తిక్కనకు వృత్తాలను సమర్ధంగా ప్రయోగించే శక్తి ఉన్నా ఎక్కువగా తేటగీతులను ఆటవెలదులను ప్రయోగించాడు. 

అట్లాగే దేశి పద్ధతిలో ప్రయాణించిన వాడు క్రీ.శ. 1205-1320 ప్రాంతానికి చెందిన కృష్ణమాచార్యుడు. ఈయన దేశి కవితా మార్గంలో చూర్ణికలను, సింహగిరి నరహరి వచనాలను, శఠగోప విన్నపాలను రాశాడు. శ్రీనాథుడు మొదట్లో ద్విపదను ఆదరించకపోయినా అటు పిమ్మట వృద్ధాప్యంలో జనులందరు భక్తితో చదువుకొనుటకు బాలచంద్రుని యుద్ధంలోని భాగాలను మంజరీ ద్విపదలు రాశాడు. ఇతనికి సమకాలికుడైన పోతన తెలుగులో మొదటి దండకమైన ‘భోగినీదండకాన్ని’ రాశాడు. ఆ తరువాత గౌరవద్విపదలో నవనాథచరిత్ర, హరిశ్చంద్రుపాఖ్యానం రాశాడు. తాళ్ళపాక కవులు వైష్ణవమత వ్యాప్తికోసం రాసిన పదాలు, సంకీర్తనలు, ద్విపద కావ్యాలు, శతకాలు, ఉదాహరణలు. వచనము, రగడ, మంజరి ద్విపదాలన్నీ దేశి కవితా శాఖలోనివే. అన్నమాచార్యుని భార్య తిమ్మక్క సుభద్రా కల్యాణాన్ని మంజరీ ద్విపదను పోలిన గేయాల్లో రచిస్తే ఈయన కుమారుడు పెద తిరుమాలాచార్యుడు రాగతాళ సమన్వితాలైన విన్నపాలను ‘వేంకటేశ్వర నీతి శతకం, వెంకటేశోదాహరణం, శృంగార దండకం, చక్రవాత మంజరి’ లాంటి కీర్తనలు దేశి పద్ధతిలోనే రాశాడు. అన్నమయ్య మనుమడు చిన్నన్న ద్విపద ఛందస్సులు కీర్తనలు రాయడంలో ప్రసిద్ధులు. పరమయోగి విలాసము, అన్నమాచార్య చరిత్ర ఈయన దేశికవితకు ఉదాహరణలు. 

లభ్యమైన యక్షగానాలలో మొదటిదైన కందుకూరి రుద్రకవి (1508) సుగ్రీవ విజయంలో ద్విపదలు, ఏలలు, దరువులు మొదలైన దేశీ రచనలెన్నో ఉన్నాయి. దక్షిణాంధ్ర యుగంలో దేశి కవితకు ఆదరణ పెరిగింది. ఈ కాలంలో విజయరాఘవుడు స్వయంగా సాంగత్యం అనే దేశి ఛందస్సులో శృంగార సాంగత్యం, సంపంగి మన్నారు సాంగత్యం అనే రెండు రచనలు చేశాడు. ఈ కాలంలో చెప్పుకోదగ్గ వాళ్ళల్లో క్షేత్రయ్య, గిరిరాజకవి, నారాయణ తీర్థులు, పల్లవి గోపయ్యలాంటి కవులు దేశికవితకు గొప్ప మేలు చేశారు. ఈ కాలంలోని కూలనమ్మ పదాలు, పోలేరమ్మ పాటలు, చెంచెత పాటలు మొదలైనవి దేశి కవితా రూపాలే. వేమన రచించిన పద్యాలు ఆటవెలది ఛందస్సులో ఉండి దేశి కవితను పతాకస్థాయికి తీసుకెళ్ళాయి. ఆధునిక కాలంలో గురజాడ ముత్యాల సరాలు దేశి కవితకు పునర్జన్మను ప్రసాదించాయి. ఈ నాటికీ జానపద సాహిత్యంలోని సింహభాగం దేశి కవితా రూపమే. ఇలా అనేక విధాలుగా విరాజిల్లుతూ తెలుగు సాహిత్యంలో దేశి కవితా పద్ధతి ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. 

ఇట్లాగే ఇంగ్లీష్ సాహిత్యంలో కూడా సాహిత్యం ఎన్నో మార్పులుకు గురవుతూ సామాన్యుని భాషలోకి రాగలిగింది. అతిసరళమైన భావాల్ని సరళంగానే చెప్పగలిగింది. ఇంగ్లీష్ సాహిత్య చరిత్రను పరిశీలిస్తే ఆయాకాలలో ఎట్లా మార్పుకు గురవుతూ ఈనాటి ఆధునిక ఇంగ్లీష్ గా మార్పు చెందిందో తెలుస్తుంది. 

ప్రపంచభాషగా స్థిరపడ్డ ఇంగ్లీషు అనేక మార్పులకు గురైంది. ప్రస్థుతం మాట్లాడుతున్న ఇంగ్లీషు అనేక భాషల మిశ్రమం. స్థూలంగా ఇంగ్లీషు భాషను Oశ్రీd జుఅస్త్రశ్రీఱsష్ట్ర, వీఱddశ్రీవ జుఅస్త్రశ్రీఱsష్ట్ర, వీశీdవతీఅ జుఅస్త్రశ్రీఱsష్ట్రగా విభజించారు. ప్రాచీణ ఇంగ్లీషు భాషను మొదట తెలుసుకుంటే అది ఆధునిక ఇంగ్లీషు భాషగా ఎలా మారిందో తెలుస్తుంది. ఏ భాషైనా మొదట అది సామాన్య జన భాషగానే మొదలౌతుంది. అలా మొదలైన భాషే పండిత భాషగా, రాజభాషగా, కావ్యభాషగా మార్పుచెంది కొంత విలక్షణతను, ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రపంచంలో అన్నీ భాషలలో ఇలానే జరుగుతుంది. ఇంగ్లీషు భాషలో కూడా ఇలాంటి మార్పు కనబడుతుంది. 

క్రీస్తుశకం 600 నుండి 1100 వరకు ఉన్నటువంటి భాషను ఓల్డ్ ఇంగ్లీషు భాషగా లేక ఆంగ్ల సక్సెనా భాషగా పిలుస్తారు. ఇది అనేక మాండలికాల మిశ్రమం. ప్రధానంగా నాలుగు మాండలికాలు ఓల్డ్ ఇంగ్లీషు కాలంలో ఉన్నాయి. 

1) Tష్ట్రవ wవssవఞ dఱaశ్రీవct - ష్ట్రఱస్త్రష్ట్రశ్రీy జూశీశ్రీఱsష్ట్రవd dఱaశ్రీవct. మొదట్లో ఈ మాండలికంలోనే సాహిత్యం కొనసాగింది. 

2) Tష్ట్రవ అశీతీtష్ట్ర uఅbతీaఱఅ dఱaశ్రీవct - థేమ్స్ నది చుట్టు ప్రక్కల ప్రాంతం వారి వ్యవహారిక భాష. 

3) Tష్ట్రవ ఎవతీcఱaఅ dఱaశ్రీవct ఈ మాండలికం ఫేమ్స్ మరియు హంబర్ నదుల పరివాహ ప్రాంతంవారిది. ఇతర మాండలికాల ప్రభావం ఇందులో కనిపిస్తుంది. 

4). Tష్ట్రవ kవఅtఱsష్ట్ర dఱaశ్రీవct - ఒక ప్రత్యేకతను సంతరించుకున్న మాండలికం. ఖవఅt పట్టణవాసులు ముఖ్యంగా దక్షిణ తూర్పు ఇంగ్లాండ్ ప్రాంతం వారి భాష. 

ప్రధానంగా ఈ నాలుగు మాండలికాలలోనే 600 Aణ 1100 Aణ వరకు ఆనాటి భాషా సాహిత్యాలు కొనసాగాయి. ఓల్డ్ ఇంగ్లీషులోని అనేక పదాలు మాడ్రన్ ఇంగ్లీషులో మార్పుకు గురైనాయి. 

ష్ట్రu-ష్ట్రశీw, scవశీtaఅ-sష్ట్రశీశీt, fశీt fశీశీt, scవaజూ-sష్ట్రవవజూ, cyఅఅ-kఱఅ, cవఅవ - kఅవవ తీఱష్ట్రt - తీఱస్త్రష్ట్రt ఈ మార్పు భాషా భాగాలన్నింటిలో కనిపిస్తుంది. 

అనేక మాండలికాల కలయికతో ఉన్న ఓల్డ్ ఇంగ్లీషులోకి ఇతర భాషా పదాలు చేరటం వల్ల విపరీతమైన మార్పుకు లోనైంది. 1017లో డ్యానిష్ రాజు ‘నట’ ఇంగ్లాడు రాజైన తరువాత డానిష్ ప్రభావం ఇంగ్లీషు భాషమీద పెరిగింది. దీనినే స్కాండినేవియా ప్రభావం అంటాం. స్కాండినేవియా అంటే డెన్మార్క్, నార్వే, స్వీడన్, ప్రాంత మనిషి అని లేక భాష అని అర్థం. దాదాపు 18 సం? వీరి పరిపాలనలో స్కాండినేవియా ప్రభావం పరిపాలన రంగంలో, న్యాయరంగంలో యితరేతర అనేక అంశాలపై ప్రభావం చూపింది. 

ఙఱశ్రీశ్రీవస్త్రవ, by శ్రీaw, శ్రీశీcaశ్రీశ్రీaw, శ్రీaw, శ్రీవస్త్ర, skఱఅ, skuశ్రీశ్రీ, buశ్రీశ్రీ, kఱd, bఱతీtష్ట్ర, kఅఱfవ, తీacవ, dశీwఅ, wఱఅdశీw, takవ, caశ్రీశ్రీ, cut, dఱవ లాంటి పదాలు స్కాండినేవియా భాషా పదాలే. 

ఇంగ్లీషు భాషమీద అత్యంత ప్రభావం చూపిన భాష ఫ్రెంచి భాష అనే చెప్పాలి. 1066లో నార్మన్ విజయంతో దాదాపు మÖడువందల సం. ఫ్రెంచిభాష ఇంగ్లీషు పై ప్రభావం చూపింది. ఇదే విషయం భాషా శాస్త్రవేత్తలు దృవీకరిస్తూ ఫ్రెంచి మొత్తంగా ఇంగ్లీషుని నాశనం చేసిందని అంటారు. చివరికి kఱఅస్త్ర, నuవవఅ, శ్రీశీతీd అనే పదాలన్నీ ఫ్రెంచి పదాలే. ప్రభుత్వ పరిపాలనా రంగంలో, మిలిటరీ రంగంలో, న్యాయసంబంధిత రంగంలో, మతంలో, ఆహార పదార్థాలలో, సాంఘిక జీవన రంగంలో చివరికి ఫ్యాషన్ రంగంలో ఫ్రెంచి ప్రభావం కనిపిస్తుంది. 

cతీశీwఅ, వఎజూఱవతీవ, తీశీyaశ్రీ, autష్ట్రశీతీఱty, statవ, తీవఙవఅuవ, తీవcశీతీd, aతీఎy, అaఙy, aతీఎs, వఅవఎy, జూవacవ, battశ్రీవ, cశీఎbat, baతీ, judస్త్రవ, adఙశీcatవ, జూవtఱtఱశీఅ, తీవశ్రీఱస్త్రఱశీఅ, cశీat, fతీశీck, జూవttఱcశీat, kవతీcష్ట్రఱవజూ, dఱఅఅవతీ, suజూజూవతీ, fవast, tastవ ఇలాంటి అనేక పదాలు ఫ్రెంచి భాష పదాలే. 

అట్లాగే రోమన్స్ ఇంగ్లాడ్ను ఓడించి వారితో పాటు గ్రీకు భాషను తమతో తెచ్చారు. కాని గ్రీకు ప్రభావంగా వచ్చిన పదాలు ఎక్కువగా మత సంబంధితమే. ఉ? acadవఎy, bఱbశ్రీవ, tతీaస్త్రవdy, dఱaఎశీఅd, astతీశీశ్రీశీస్త్రy. by tష్ట్రవ వఅd శీf tష్ట్రవ 16tష్ట్ర cవఅtuతీy, Gతీవవk was a శ్రీaఅస్త్రuaస్త్రవ శీf శీఞfశీతీd aఅd ్పుశీఎbతీఱdస్త్ర. ఆ రోజుల్లో గ్రీకు గొప్ప గౌరవం అందుకున్న భాష. అదే విధంగా లాటిన్ భాషా ప్రభావం ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో, వైద్య రంగంలో దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ విధంగా రూపు సంతరించుకున్న ఇంగ్లీషు భాషా సాహిత్య పరిశీలన అవసరం. 

స్థూలంగా ఇంగ్లీషు సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇదమిత్తంగా ఇది దేశి సాహిత్యం అని దేశికాని సాహిత్యం అని కాని చెప్పటం అంత సులభమైన విషయంకాదు. 14-16 శతబ్దాలలో గ్రీకు, రోమన్ కావ్యాల ప్రభావ ఫలితంగా ఏర్పడిన సాహిత్యాది లలితకళా పునరుజ్జీవనం, పునరుద్ధరణ ఒక భాగంగా పరిశీలిస్తే అంతకు ముందున్న సాహిత్యం ఒక భాగంగా చూడాలి. సాంస్కృతిక పునరుజ్జీవనం తరువాత సాహిత్యంలో వచ్చిన మార్పును మరో భాగంగా పరిశీలిస్తే కాని దేశికవితా అంటే ఇదే అని చెప్పటం కుదురుతుంది. సాంస్కృతిక పునరుజ్జీవం ఇటలీ ద్వారా ఇంగ్లాండుకు క్వీన్ ఎలిజెబెత్ 1 (1558-1603) కాలంలో వచ్చింది. అంతకు ముందున్న సాహిత్యం అంతా మతం మరియు దాని పోషణలో కూడుకుకున్నదై ఉండేది. సాంస్కృతిక పునరుజ్జీవనంతో చర్చి ప్రభావంతో కూడిన మత సాహిత్యం తగ్గింది. ఎలిజెబెత్ కాలం లేక 16వ శతాబ్దం ముందు వరకు ఉన్న సాహిత్యం అంతా పండిత సాహిత్యంగానే ఉంది. ఈ కాలంలో ఉన్నటువంటి కవులు ఎక్కువగా సామాన్యుని జీవితం ఇతివృత్తంగా కాకుండా రాజులు రాజ్యాలు గురించి రాయటమే కనిపిస్తుంది. షేక్స్పియర్, స్పెన్సర్, చాసర్, బినాన్సన్, సిడ్నీ, మార్లో లాంటి కవులు ముఖ్యులుగా ఎలిజెబెత్ కాలంలోనివారు. 

షేక్స్పియర్- కింగ్లియర్, టెంపెస్ట్, సానెట్-123, 126. ఎడ్మన్ స్పెన్సర్- ది ఫెయిరీక్వీన్. చాసర్- ప్రొలోగ్ టు ది కాంటర్బరి టేల్స్, బిన్ జాన్సన్-ఎవిరి మ్యాన్ ఇన్ హిస్ హ్యూమర్. లాంటి రచనల్లో ఇతివృత్తాలు ఏవి సామాన్యునికి చెందినవి కావు. ఈ కాలంలో వచ్చిన కావ్యాల్లో ప్రధాన ఛందస్సుగా సానెట్, సానెట్ అంటే ఒక చిన్న పద్యంలో అద్భుతమైన భావాలు పలకటం. సానెట్ ఇటాలియన్ సొనెటో నుండి వచ్చింది. ఇది 14 లైన్లతో కూడిన పద్యం. ఇది రెండు భాగాలుగా కూర్చబడుతుంది. మొదటి భాగాన్ని ఆక్టివ్ అంటారు. ఇది 8 లైన్స్తో ఉంటుంది. abba abba అనే రైమ్లో ఉంటుంది. రెండవ భాగం sవstవt ఇది ఆరులైన్స్లో ఉంటుంది cdవ cdవ లేక ccd ccd. సానెట్ సాంస్కృతిక పునర్జీవనం సమయంలో ప్రసిద్ధికెక్కిన ఛందస్సు. షేక్స్పియర్ సానెట్ మరో విధంగా ఉంటుంది. ababbcbccdcdవవ భాగంగా ఉంటుంది సానెట్ను ఒక్కొక్క కవి ఒక్కో విధంగా విభజించి రాశారు. కాని 14 లైన్స్ మాత్రం అందరికి ఒక్కటే. ఈ సానెట్ పద్ధతిలో కవులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికే వాడారు కాని సామాన్యునికి అర్ధమయ్యె విధంగా రాసిన ఉదాహరణలు తక్కువ అనే చెప్పాలి. 

ఉదాహణకు, స్పెన్సర్ రాసిన ‘ఏమోరిటి’ లో 

Oఅవ day I wతీశీtవ ష్ట్రవతీ అaఎవ uజూశీఅ tష్ట్రవ stతీaఅd, 

దీut caఎవ tష్ట్రవ waఙవs aఅd wasష్ట్రవd ఱt away: 

Aస్త్రayఅవ I wతీశీtవ ఱt wఱtష్ట్ర a sవcశీఅd ష్ట్రaఅd, 

దీut caఎవ tష్ట్రవ tydవ, aఅd ఎadవ ఎy జూayఅవs ష్ట్రఱs జూతీay.

‘ఙayఅవ ఎaఅ్ణ, ‘saఱd sష్ట్రవ%, ‘tష్ట్రat dశీవst ఱఅ ఙaఱఅవ assay, 

A ఎశీతీtaశ్రీశ్రీ tష్ట్రఱఅస్త్ర sశీ tశీ ఱఎఎశీతీtaశ్రీఱఓవ, 

ఖీశీతీ I ఎy sవశ్రీఙవ sష్ట్రaశ్రీశ్రీ శ్రీykవ tశీ tష్ట్రఱs dవcay, 

Aఅd వవk ఎy అaఎవ bవవ wఱజూవd శీut శ్రీykవwఱఓవ్ణ 

‘చీశీt sశ్ణీ, ‘నuశీd I, ‘శ్రీవt basవతీ tష్ట్రఱఅస్త్రs dవఙఱఓవ 

Tశీ dy ఱఅ dust, but yశీu sష్ట్రaశ్రీశ్రీ శ్రీఱఙవ by faఎవ: 

వీy ఙవతీsవ yశీuతీ ఙఱతీtuవs తీaతీవ sష్ట్రaశ్రీశ్రీ వtవతీఅఱఓవ, 

Aఅd ఱఅ tష్ట్రవ ష్ట్రవఙవఅs wతీytవ yశీuతీ స్త్రశ్రీశీతీఱశీus అaఎవ. 

ఔష్ట్రవతీవ wష్ట్రవఅas dవatష్ట్ర sష్ట్రaశ్రీశ్రీ aశ్రీశ్రీ tష్ట్రవ wశీతీశ్రీd subdవw, 

Ouతీ శ్రీశీఙవ sష్ట్రaశ్రీశ్రీ శ్రీఱఙవ, aఅd శ్రీatవతీ శ్రీఱfవ తీవఅవw్ణ ఉన్న ఈ సానెట్లో abadcdcdవfవt పద్ధతిలో ఉంది. దాదాపు 19 శతాబ్దం వరకు దాదాపు వచ్చిన కవులందరి కావ్యాల్లో ఇతివృత్తం కాని ఉపయోగించిన ఛందస్సుకాని సామాన్యునికి దగ్గరగా లేదనే చెప్పాలి. 

stతీవss సెలబుల్ uఅ stతీవss సెలబుల్ ప్రధానంగా కవిత్వ స్థాయిని నిర్ణయిస్తుంది. ఇంగ్లీషు భాషా సాహిత్యంలో stతీవss, uఅ-stతీవss సెలబుల్స్ కవిత్వం ఉంటుంది. ఇండిపెండెంట్గా నిలవగలిగిన పదం ఒక సెలబుల్. ఇంగ్లీషు కవిత్వంలో మÖడు సెలబుల్స్ ఉంటే ట్రైమీటరు అనీ, నాలుగు సెలబుల్స్ ఉంటే ఎట్రామీటరు, 5 సెలబుల్ని పెంటామీటరు, ఆరు సెలబుల్స్ ఉంటే ఎక్స్ అని అంటారు. ఈ పద్ధతిలో వచ్చిన కవిత్వం కొంత మార్పుకు గురైంది. అట్లాగే కప్లెట్, ట్రిప్లెట్, క్వార్ట్ పద్ధతిలో సెలబుల్స్ ఉండి నాలుగు స్టానాలలో కవిత్వం ఉంటుంది. ఈ పద్ధతిలో వచ్చిన కవిత్వం కూడ సామాన్యజనానికి దగ్గరైంది. 

19వ శతాబ్దంలో వచ్చిన కవిత్వం ప్రధానంగా సామాన్యునికి దగ్గరై ప్రకృత్తిని, పల్లె జీవితాన్ని ఆ కవిత్వంలో ప్రతిబింబించింది. సామాన్య విషయాల్నీ సామాన్యున్నీ తమ కవితా వస్తువుగా స్వీకరించింది. ఈ ప్రధాన మార్పు వర్డ్సువర్తు 1798 రాసిన లిరికల్ బ్యాలెన్స్ ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. లిరికల్ బ్యాలెట్స్లోలో ఉన్న ఇతివృత్తం ప్రకృతి పట్ల ప్రేమ, సామాన్యుడి జీవితంపై అభిమానం మనకు కనిపిస్తుంది. కార్రిడ్జ్, కీట్సు, షెల్లీ, టెన్నిసన్, బ్రౌవింగ్, ఆర్నాల్డ్, ల్యాంబ్, హార్డి మొదలగు కవులు సామాన్య భాషలో భావాల్ని తమ కవిత్వంలో పలికించారు. వర్డ్సు వర్తు - టిన్స్టర్న్ ఎబ్బె, ది ప్రెలూడ్ ఇంటిమేషన్ టు ఇమ్మార్టలిటీ 

కాల్రెడ్జ్- రైమ్ ఆఫ్ ది ఆన్సియంట్ మ్యారినర్, కుబ్లుకాన్, 

షల్లీ - టు ఎ స్కైలార్క్, ఓడ్ టు ది వెస్ట్ విండ్. 

కీట్స్ - ఓడ్ టు నైటింగేల్, ఓడ్ ఆన్ ఎ గ్రెసియన్ అర 

టెన్నిసన్ - ది లోటస్ ఈటర్స్, యులిసెస్ 

బ్రౌవింగ్- మై లాస్ట్ డచెస్, 

అర్నాల్డ్ - డోవెర్ బీచ్ లాంటి రచనల్లో మనకు సామాన్యునికి దగ్గరైన విషయం, భావాలు కనిపిస్తాయి. ఉదాహరణకు: వర్డ్సు వర్తు ఓటు ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మార్టలిటిలో 

Tష్ట్రaఅks tశీ tష్ట్రవ ష్ట్రuఎaఅ ష్ట్రవaతీt by wష్ట్రఱcష్ట్ర wవ శ్రీఱఙవ 

Tష్ట్రaఅks tశీ ఱts tవఅdవతీఅవss, ఱts jశీys aఅd fవaతీs 

Tశీ ఎవ tష్ట్రవ ఎవaఅవst fశ్రీశీwవతీ tష్ట్రat bశ్రీశీws caఅ స్త్రఱఙవ 

Tష్ట్రశీuస్త్రష్ట్రts tష్ట్రat dశీ aftవఅ శ్రీఱవ tశీశీ dవవజూ fశీతీ tవaతీs 

ఈ కవిత్వంలో కవి చిన్ననాటి అనుభవాల్ని సామాన్య భాషలో సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో రాయటం జరిగింది. 

అట్లాగే కాల్రెజ్డ్ రైమ్ ఆఫ్ ది ఆన్సియంట్ మ్యారినర్ లో 

ఔatవతీ, watవతీ, వఙవతీy wష్ట్రవతీవ, 

Aఅd aశ్రీశ్రీ tష్ట్రవ bశీaతీds dఱd sష్ట్రతీఱఅk, 

watవతీ, watవతీ, వఙవతీy wష్ట్రవతీవ, 

చీశీతీ aఅy dతీశీజూ tశీ dతీఱఅk. 

అన్న మాటల్లో తన చుట్టూ నీళ్ళు ఉన్నా అవి కాలుష్యబారిన పడటం చూసి కవి గొప్పగా స్పందించాడు. మరో ఉదాహరణ: షల్లీ ఓడ్ టు ది వెస్ట్ విండ్ లో 

Oష్ట్ర, శ్రీఱft ఎవ as a waఙవ, a శ్రీవaf, a cశ్రీశీud! 

I faశ్రీశ్రీ uజూశీఅ tష్ట్రవ tష్ట్రశీతీఅs శీf శ్రీఱfవ! I bశ్రీవవd! 

అన్న కవిత్వంలో మనిషి జీవిత అనుభవం చెప్పటం, సామాన్యుని జీవితం కవితా వస్తువు కావటం గమనిస్తాం. ఇలా 19వ శతాబ్దం తరువాత వచ్చిన సాహిత్యం అంతా సామాన్యుని జీవితం ఆధారంగా ఉందని చెప్పవచ్చు. తెలుగు ఇంగ్లీషు భాషా సాహిత్యంలో వచ్చినటువంటి మార్పు భాషపరంగా, ఇతివృత్తపరంగా అభివ్యక్తి పరంగానో కాక ఆలోచన విధానంలో కూడ గణనీయమైన మార్పును సంతరించుకుంది. ప్రపంచీకరణ వైపు పయనిస్తున్న మనిషికి సజీవ దృశ్యాలు ఎంతో ప్రేరణను కలిగించటం వల్ల సాహిత్యంలోకూడా కొత్త కొత్త ఆలోచనలు అభివ్యక్తీ కరణలు చోటు చేసుకుంటున్నాయి. 

తెలుగు ఇంగ్లీషు సాహిత్యాల పరిణామం పరిశీలిస్తే సామాన్యుని మాటల్లో సామాన్యుని జీవితం ఆవిష్కరిస్తేనే సాహిత్యం అభివృద్ధి చెందుతూ వికాసదిశగా పయనిస్తుందని తెలుస్తుంది. ఇరు సాహిత్యాల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే కొన్ని పోలికలు, సమాన లక్షణాలు కనిపిస్తాయి. ఏదేశ సాహిత్యంలోనైన, ఒక్కొక కాలంలో ఒక్కో విధంగా మార్పు చెందుతూ కనిపిస్తుంది. స్థూలంగా ప్రపంచంలోనే అన్ని దేశాల నాగరికత వికాసం ఎట్లాగైతే రోజు రోజుకు మార్పు చెందుతుందో అట్లాగే సాహిత్యంలో కూడా మార్పు జరిగింది. ఇటు అటుగా ఈ మార్పు అన్ని దేశ సాహిత్యాలలో కనిపిస్తుంది. తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యాలలో వచ్చిన దేశి పద్ధతి సామాన్యుడి భాషను భావాల్ని ప్రతిభింబించడంలో ఒకే మార్గంలో పయనించడం కనిపిస్తుంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి