నా చిన్నతనంలోనే నన్ను వదిలి అనంతంలో కలిసి పోయినా నా మనసు వీడని పూజ్యలైన నాన్నకు, అంతా తానై మమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడాలని నిరంతరం తపించే పూజ్యులైన అమ్మకు అనేక ప్రణామాలు.
పరిశోధనాంశాన్ని సూచించటమే కాక ఈ పరిశోధనకు పర్యవేక్షత వహించి తగు సూచనలిచ్చి నా ఆలోచనా పరిధిని పెంచి చూపుల్లోనే అనంతమైన ఆప్యాయతను, ప్రోత్సాహాన్ని కనబరిచి శిష్యవాత్సల్యంతో పాటు పుత్ర వాత్సల్యాన్ని కూడ చూపించి నన్ను ఆశీర్వదించిన ‘గురూజీ’ కె.కె. రంగనాథాచార్యులకు హృదయ పూర్వక అభివందనాలు.
ఈ పరిశోధన మొదలుకొని సదా నా అభ్యున్నతిని కోరుకుంటూ నాపై ఎంతో అనురాగం చూపించిన ఆచార్యులు జి.వి. సుబ్రహ్మణ్యంగారికి, రవ్వా శ్రీహరిగారికి, ముదిగొండ వీరభద్రయ్యగారికి, ఆనందరామం గారికి, పరిమి రామనరసింహంగారికి, ఎన్.ఎస్.రాజుగారికి, శరత్‌జ్యోత్స్నారాణిగారికి, అరుణకుమారిగారికి కృతజ్ఞతాంజలులు.
తులనాత్మక అధ్యయన శాఖలో నాపై ఎంతో ప్రేమను కనబరచిన మేడమ్ చిత్రాఫణిక్కర్ గారికి, శివరామ్ ఫడిక్కల్ గారికి నా నమస్సులు. నా జీవితానికి ఒక వెలుగునిచ్చి ప్రతి అడుగులో నా అభివృద్ధిని కాంక్షిస్తూ, కొండంత అండను, దైర్యాన్ని నాకిస్తూ, లక్ష్యాన్ని పదే పదే గుర్తు చేస్తూ, నాపై నిండైన పుత్రవాత్సల్యాన్ని కనబరిన అక్కయ్య రమాలాలకు అనేక ప్రణామాలు.
నేను చేసే ప్రతి పనిని ఎంతో గొప్పగా తలచి ఎంతో సంబరపడే నా అన్నయ్య శ్రీ. కె. కృష్ణమÖర్తికి, అన్ని సందర్భాలలో అన్ని వేళలలో నా కష్టాల్ని, దుఃఖాన్ని పంచుకున్న స్నేహశీలి శ్రీ మడుగు నాగరాజుకు నమస్సుమాంజలి.
ఎంతో ఓర్పుతో నా పరిశోధనకు అందమైన అక్షర రూపాన్ని ఇచ్చిన నా మిత్రుడు పి. కొండయ్యకు, ఈ పరిశోధనాగ్రంథాన్ని పుస్తకంగా తీసుకురావడానికి తగిన సూచనలు చేసిన అన్నయ్య కపిలవాయి అశోక్‌బాబుగారికి కృతజ్ఞతలు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా సదా నావెంట ఉంటూ నాన్నగా నేను వాళ్ళకు ఇవ్వాల్సిన సమయాన్ని కూడా నాకే ఇస్తూ వాళ్ళ సమయాన్ని కూడా నా కొరకు ఇస్తున్న నా కూతుళ్ళు వాగ్దేవికి, విద్మహేకు ఆశీస్సులు. వీరి ఋణం ఈ జన్మకు తీరేది కాదు.
నాకు అక్షరాలు రాయించిన నాటి నుండి నేటి వరకు జ్ఞానబిక్ష పెట్టిన నా గురువులందరికి సవినయంగా పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి