మహాకవి కాళిదాసు ఈనాడు లేడు... వుంటే ఆమెను చూచి భావోద్వేగంతో మరో రసమయ కావ్యాన్ని రాసేవారేమో....
కవిసార్వభౌముడు శ్రీనాధుడీరోజులేడు.. ఆ ఆనందాన్ని ఓ కందంలో అభివర్ణించడానికి....
కానీ
ఓసి శిరీష పేశాల రసోజ్జ్వల మానసరాగలాలసా!
ఈ సువిశాల సుందర మహీవలయమ్మను చిత్రశాలలో
ఏ సుమనోజ్ఞ సృష్టి చివురు లెత్తెనో కృష్ణకుమారి రూపమై
వాసుర స్నిగ్ధ సంహిత మహాచ్ఛవిభూత శరీర వల్లరి!!
అని సాంధ్యశ్రీ వంటి ఈతరం కవులు ఆశుకవితలు చెప్పి ఆరాధించారు. అందంతో, అభినయంతో ప్రేక్షకు హృదయాలను కొల్లగొట్టిన వెండితెర వెలుగుల రాణి కృష్ణకుమారి.
తెలుగు సినిమా స్వర్ణయుగం నుండి వర్ణయుగం వరకూ విభిన్న పాత్రలు పోషించిన అభినేత్రి కృష్ణకుమారి జ్ఞాపకాలతో వెళతే....
నా గురించి గుర్తు చేసుకోవడానికి పెద్ద కష్టమేమిలేదు., ఎందుకంటే నాకు తీరికదొరికతేచాలు... నేను చేసే పని అది!
నన్ను నేను అర్థం చేసుకోగల్గితే లోకం అర్థం అవుతుంది. నాగురించి నేను అదే తరస్కరించుకుంటూ వుంటాను ఎప్ప్పుడూ! జీవించడానికి జీవితాన్ని దిద్దుకోవాలని మొదటినుండి ప్రయత్నించేదాన్ని ! అందులో గెలుపు సామాన్యంగా అందుతుందా? ఓడించేది, ఏడ్పించేది -తిట్టించేది,, నాపై నాకే విశ్వాసం లేకుండా చేసేది.... భలే తమాషా! ‘ఆద్మీ’ సినిమా చూశానొకసారి. ‘లైఫ్ ఈజ్ ఫర్ లివింగ’ అనే దానికి మకుటం ప్రకటించారు శాంతారాం. అందుకే నన్ను నేను హెచ్చరించుకుంటూ, నాకు నేను ధైర్యం చెప్ప్పుకుంటూ నాకై నేను దారి చేసుకుంటూ, ముందుకు నడిచాను. అదృష్టాన్ని వెతుక్కునే స్థితిలో ఎన్నో దెబ్బలు తిన్నాను. చివరకు స్థిర పడగలిగాను.
నేను 06-03-1936న పుట్టాను. మా ఫాదర్ టేకుమళ్ల వెంకోజీరావుగారు అమ్మ శచీదేవి. ఆయన పేపర్ తయారీ ఎక్స్‌ఫర్ట్. ఇంగ్లాండులో మÖడు సంవత్సరాలు దాని గురించి బాగా స్టడీ చేసి వచ్చారు. ఆంధ్రాపేపరు మిల్లులో పేపరు ఎక్స్‌ఫర్ట్‌గా ఉన్నత వుద్యోగం చేసేవారు. మద్రాసు, రాజమండ్రి, కలకత్తా, అస్సాం.... ఇలా చాలా చోట్ల ఉద్యోగం చేశారు. ఆస్తమాను బదిలీలు అవుతుండేవి. అలా కలకత్తా దగ్గర ‘నైహతి’లో పనిచేస్తున్నప్పుడు నేను అక్కడే పుట్టాను. తర్వాత రాజమండ్రి వచ్చేశాం.
మా నాన్న గారికి మేమంటే చాలా ప్రేమ. ఎప్పుడూ కోపగించుకునే వారు కాదు. మా పెంపకంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపేవారాయన. విదేశీపద్ధతులంటే ఇష్టపడేవారు. అలాగే మమల్ని పెంచారు. అప్పుడు మా యింట్లో స్వామి అనే బట్లర్ వుండేవాడు. మానాన్న ‘మెనూఛార్ట’ తయారు చేసేవారు. టైం ప్రకారం ఆనియమం అందరూ పాటించాల్సిందే. టేబుల్ మానర్స్ అలవాటు చేశారాయన.
ఇంట్లో సంభాషణలన్నీ ఇంగ్లీషులోనే జరిగేవి. కానీ మా అమ్మ పిల్లలకు తెలుగు కూడా రావాలని ఓ మాష్టారును నియమించింది. కాతేరు విలేజ్ నుంచి రోజూ ఆయన (సుబ్బారావుగారు) వచ్చి మాకు సంగీతం, తెలుగు నేర్పేవారు.
తర్వాత కాలంలో సినిమాల్లో నృత్యదర్శకుడు వి.జె.శర్మ (జగన్నాధశర్మ) గారు అప్పుడు రాజమండ్రిలోనే వుండేవారు. ఆయన దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాం. అక్క (‘షావుకారు’ జానకి)కు నేర్పడానికి వస్తే నేను కూడా వెంటబడి కాలికి గజ్జెలు కట్టుకుని ఆ కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నాను. మా అక్క, నేను ఒకే స్కూలులో చదువుకున్నాం.
చిన్నప్పుడు అక్కకు, నాకు చాలా తేడా వుండేది. అక్కకు కోపం వస్తే తెగ అల్లరి చేసేది. నేనేమో కామ్ గోయింగ్. నోరు మెదపకుండా ఏ మÖలకో చేరి పోయేదాన్ని. చక్కగా దువ్వుకున్న జుట్టును పీక్కుంటూ మÖతి ముడుచుకుని కూర్చునేదాన్ని. ‘కృష్ణ ఎక్కడర్రా?’ అంటూ మా అమ్మ వెతుక్కుంటుంటే లోలోపల నవ్వుకునేదాన్ని. చివరికి ఓమÖల చీకటిలో జుట్టు పీక్కుంటూ కూర్చున్న నన్ను కనిపెట్టి మా అమ్మ అనునయించి నా అలక తీర్చేవారు. సిల్కు బట్టలు తప్ప మరోరకం బట్టలు వేసుకునే దాన్ని కాను. చిన్న ప్రాక్, గౌను, రెండు జడలు, ఆ రూపం, వేషం అన్నీ చూచ్చి నన్ను ‘జిప్సీ’ అని ముద్దుగా పిలిచేవారంతా. అక్కా, నేను రాజమండ్రిలో గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూలులో కొన్నాళ్లం చదువుకున్నాం. 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. మా నాన్నగారికి ‘డైరక్టర’ ఆఫ్ ఇండస్ట్రీస’ పదవి వచ్చి మద్రాసుకు ట్రాన్స్‌ఫర్ అయ్యాం. దాంతో మేమంతా మద్రాసొచ్చేశాం.
అప్పట్లో ‘బాల’ పత్రికా సంపాదకులు న్యాయపతి రాఘవరావు, కామేశ్వరమ్మగార్లు బాలల వినోద కార్యక్రమాలు నిర్వహించే వారు, ‘బాలానందం’ అని రేడియోలో ప్రోగ్రామే వచ్చేది. మేమిద్దరం బాలానంద సంఘంలో చేరాం. చింతాద్రి పేటలో ఇల్లు, ఆంధ్ర మహిళాసభలో స్కూలు. జగన్నాధశర్మగారు అప్పటికే మద్రాసొచ్చేసారు. దాంతో డాన్సు కంటిన్యూ చేశాం. ‘ఆంధ్రమహిళాసభ’లోనే మెట్రిక్ చదువుకున్నాను. దుర్గాబాయమ్మగారికి మా అక్క చెల్లెళ్ల మంటే చాలా ప్రేమ, మురిపెంగా చూసుకునేవారు. మా అక్కయ్యను మెచ్చుకునేది. నన్ను ‘మÖగది’ అని, “ఏం - మÖగమ్మాయ్!” అంటూ పలుకరించేవారు.
దుర్గాబాయమ్మగారు పిల్లలందర్నీ పెట్టి “తులాభారం” నాటకం ఆడించారు. నేను నటించాను. ఒకరోజు దుర్గాబాయమ్మ గారు అక్కను ఏదో విషయంపై మందలించారు. భలే రోషం అక్కకు ఠపీమని లేచి పుస్తకాలు తీసుకుని స్కూలుకి గుడ్‌బై కొట్టేసి, నన్ను కూడా బరబరమని లాక్కుని యింటికొచ్చేసింది. నన్ను కూడా స్కూలుకెళ్లదని చెప్పేసింది.
పరీక్షలు దగ్గరపడ్డాయి. నాకు వయసు చాలదు. పరీక్షలు రాయడానికి వయసు పరిమితి వుంటుందనే విషయం తెలీక నేను కూడా పరీక్షరాస్తానని మొరాయించాను. పరీక్ష తప్పకుండా ప్యాసవుతానని భీష్మించుకుని ఏడ్చాను. “సరే! ఓణీ, లంగా కాకుండా చీర కట్టుకుని రా, చూద్దాం” అన్నారు దుర్గాబాయమ్మగారు. కానీ, ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఒప్పుకోలేదు. దాంతో ఆ చాన్సు పోగొట్టుకున్నాను.
అక్కతో కలసి సినిమాలు తెగచూసేదాన్ని. “స్వర్గసీమ” విడుదలైన రోజులవి. ఎక్కడ విన్నా “ఓహోహో పావురమా” పాడీ! నేను పి.భానుమతి గారి ఫాన్! ఆమె నటించిన ఆ చిత్రం ఎన్నిసార్లు చూచినా తనివి తీరదు. నేను ఇంట్లో, బయటా కూడా “ఓహోహో పావురమా” అంటూ కూనిరాగాలు తీసుకుంటూ తిరిగీ దాన్ని ఆ రోజుల్లో.
బెంగుళూరు హైస్కూలు భవనం నిర్మాణ సహాయార్థం ఒకసారి సి.కె.నగరాజారావుగారు మద్రాసు కొచ్చారు. ఆయన కోరికపై నేను, అక్క భరతనాట్య ప్రదర్శన బెంగుళూరులో ఇచ్చాం. మేమిద్దరం బెంగుళూరు ప్రయాణం కోసం సెంట్రల్ స్టేషన్‌లో నిల్చుకుని వుండగా మెరపులా కనిపించారు భానుమతిగారు. ఎర్రటి వర్ణం, నల్లటి చీర కట్టుకుని హడావుడిగా నడుస్తున్నారు. స్టేషన్‌లో అందరూ ఆమెనే చూస్తూ వుండిపోయారు. నేనూ చూశాను. ముందుకు వెళ్లిపోయిన అక్క నన్ను రమ్మని అరుస్తోంది.
“మొద్దూ! అలా నిలబడిపోయావేం? రా, రైలు టైం అయింది”- అంది. “సిస్టర్! అటు చూడు.... భానుమతి!” అన్నాను. “అయితే ఏంటి, వుండనిలే” అని విసుక్కుంది అక్క. అక్కకు ఎదురు చెప్పలేక “భానుమతి నాకు అక్క కాగూడదూ? ఎంత బావుండేది - నేను భానుమతి సిస్టర్నని చెప్పుకోవడం ఎంత గర్వంగా వుండేది? అనుకుంటూ అక్కవెనక వెళ్లిపోయాను. అలా మాట్లాడాలనుకుని మాట్లాడలేకపోయిన నా అభిమాననటిని మళ్లీ చూస్తానని, ఆమెతో కలసి నటిస్తానని ఆనాడు కలలోనైనా వూహించలేదు. అదే కదా జీవితం. భానుమతి గారితో కలసి “అంతస్తులు” (), “పుణ్యవతి” () చిత్రాల్లో నటించాను. అయితే “అంతస్తులు” బాగా పేరు తెచ్చి పెట్టింది.
బెంగుళూరులో మా డాన్సు ప్రోగ్రామ్‌కు పదివేలరూపాయలు వసూలయింది. ఆ తర్వాత కేసరీ హైస్కూలు (చెన్నై)లో మరో ప్రదర్శన ఇచ్చాం. ఆరోజుల్లో భరతనాట్యానికి మా సిస్టర్స్‌కి మంచి పేరుండేది. ‘బాలానందం’ తరపున రేడియో డ్రామాల్లో విరివిగా పాý£్గనేదాన్ని.
“పట్నావాసం” అనే ధారావాహిక నాటకంతో అక్కకు బాగా పేరొచ్చింది. ఈ నాటకమే బి.ఎన్.రెడ్డి గారిని ఆకర్షించింది. ఆ సమయంలోనే అక్కకు వివాహం జరిగింది. మా అక్క పెళ్లి భలే వేడుకగా జరిగింది. అంత ఆనందంగా జరిగిన ఆ వేడుక, ఆ వివాహం అక్కకు సంతోషాన్ని యివ్వలేదనే విషయం గుర్తు కొచ్చినప్పుడల్లా నా గుండె బాధతో బరువెక్కిపోతుంది. సరే, అక్క పెళ్లి అయిపోగానే మేం అస్సాం వెళ్లి పోయాం (నాన్న గారి ఉద్యోగరీత్యా)
అక్కడ “సెయింట్ మేరీస్ కాన్వెంట్ అండ్ హైస్కూలు”లో చేరాను. అస్సాంలో u£త్తిగా ఒంటరితనం. మద్రాసులో అయితే అక్కతో కలసి చదువుతూ, తిరిగేదాన్ని. తిట్టుకున్నా, కొట్టుకున్నా కలసే వుండేవాళ్లం. అస్సాంలో వుండే రోజుల్లో అంతా అక్కతో కలసి తిరిగిన జ్ఞాపకాలే. కానీ చేయగలిగిందేమో లేదుగదా, అమ్మ చెప్పే కథలు వింటూ కాలం గడిపేదాన్ని.
మా నాన్నగారికేమో పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలు. షిల్లాంగ్ క్లబ్బులో ఆయన మెంబర్. అస్సామీ వాళ్ల వేషభాషలన్నీ చాలా వింతగా తోచేవి. ‘సిడ్లి’ మహారాణి మంజులాదేవి (పిఠాపురం రాజాగారి కూతురు) మాకుటుంబంతో కొంత చనువుగా వుండేది. మా నాన్నగారు అక్కడ చార్‌ద్వార్ అడవుల్లో “బాంబూ రిసెర్చి”కి తరచూ వెళ్లేవారు. నేను “డాడీ - ఐటూకం”. అని కలసి వెళ్లేదాన్ని. అక్కడ నేనొక పెద్ద గండాన్ని తప్పించుకున్నాను. అలా ఓ సారి అడవిలో వెళ్తూవుండగా కుంభవర్షం ప్రారంభమైంది.
దట్టమైన అడవి! వర్షంలో దారి కన్పించడం లేదు. పెద్దపెద్దగా పక్షులు, జంతువులు అరుస్తున్నాయి. “డోన్ట్‌వరీ - స్టడీ - బికాషస” అని డాడీ అంటూనే వున్నారు. డ్రైవర్ ఎంత జాగ్రత్తగా నడుపుతున్నా కారు పట్టుతప్పింది. ‘చచ్చాం’ అనుకున్నాం. కాని దేవుడి దయవల్ల ఆ కారువెళ్లి ఓ పెద్ద చెట్టుకు గుద్దుకుని ఆగిపోయింది. మా అదృష్టం బాగుండి బయట పడ్డాం.
నేను చక్కగా భరతనాట్యం చేస్తాననే సంగతి అందరికీ తెలిసిపోయిందక్కడ. దాంతో షిల్లాంగ్ క్లబ్బులో నా డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.
నాకు వచ్చింది ఒక్కటే నాట్యం భరతనాట్యం! కానీ అస్సాంలో వాళ్లకి ఆ నాట్యం తెలీదు. ఒక వేళ ఆ నాట్యం చేసినా, ఆ పాటలు పాడేవారెవరు? సిడ్లీరాణిగారు మాత్రం మరీ పట్టుబట్టారు. సరే మా అమ్మే పాడుతునన్నారు. ఆర్కెస్ట్రాను పిలిపించి, ట్రైనింగ్ యిప్పించి, డాన్సు ఏర్పాటు చేశారు.
మా అమ్మ పాడిన అష్టపది, లలిత లవంగ, బాలగోపాలా తరంగం అన్నింటికీ నాట్యాభినయం చేశాను. సిడ్లి రాణీగారైతే పరమానంద పడిపోయి నన్నెత్తుకుని దీవించారు. తనతో ఒకసారి విద్యాపూర్ కోటలోకి వచ్చి అభినయించాలని కోరింది. ఆమె కోరిక ప్రకారం కోటలో నాట్యం చేశాను. రాణీ మంజులాదేవి గారే స్వయంగా నన్ను అలంకరించడం, ఆమె దస్తులు ఇచ్చి నగలు పెట్టడం నాకింకా గుర్తు. నా ఆట, అమ్మ పాట కోటలోని వారందరినీ తన్మయుల్ని చేశాయి. మా నాన్న ంసతోషపడిపోయారు. “నువ్వు పెద్ద ఆర్టిస్టువై పోతావ్! ఆ రోజున ఈ డాడీని మరిచిపోకేం?” అంటూ నవ్వారు. నాపేరు, నేను చేసిన డాన్స్ గురించి అస్సాం పత్రికల్లో వచ్చింది. “షిల్లాంగ్ టైమ్స” అనే దినపత్రికలో నన్ను పొగుడుతూ ఓ పెద్ద వ్యాసం రాశారు. పేరు పత్రికల్లో వస్తే వచ్చే ప్రయోజనమేమిటో కూడా తెలీదు నాకా రోజుల్లో. అయితే మా నాన్న, అమ్మ మాత్రం ఆ ‘కట్టింగ్స’ జాగ్రత్త చేసి “మా కృష్ణడాన్స్ చేసింది.. పత్రికలు ఎల్లా రాశాయో చూశారా?” అంటూ వచ్చిన వాళ్లతో చెప్పుకుంటూ మురిసిపోయేవారు.
బీహార్‌లో వుండేటప్పుడనుకుంటాను.... నేను, అక్క కలసి షాపింగ్ కెళ్లాం. ఓ దుకాణం ముందు బాదం కాయలు కుప్పగా పోసుకుని అమ్ముతున్నారు. వాటిని కొనుక్కుని అక్కడే కొట్టుకుని మేమిద్దరం తింటున్నాం. దాన్ని దూరం నుంచి మా నాన్నగారు చూశారు. ఇద్దరం యింటికి రాగానే వీధుల్లో పడి తింటారా? అని వీపు చిట్లకొట్టేశారు. అంత స్ట్రిక్టుగా వుండేవారాయన.
మా ఫ్యామిలీ మొత్తం ఒకసారి బెనారస్ వెళ్లాం. గంగానదిపై పడవలో వెళ్లి హరిశ్చంద్ర ఘాటు, కాశీరాజు భవనం చూచి వచ్చాం. మా నాన్న అందర్నీ గంగా స్నానం చేయమన్నారు. ఎముకలు కొరికేసే చలిలో, చన్నీళ్లతో స్నానం చేయాలంటే బద్ధకంగా వుంది. అక్కకు ధైర్యం జాస్తి - “నేను స్నానం చేయను” అంది. నాన్న ఎంతో చెప్పి చూసారు. అక్క వినలేదు - అక్క చేయనంటే వదిలేస్తారు గదా - నేను కూడా తప్పించుకోవచ్చని చూస్తున్నాను.
నాన్నకు కోపమొచ్చి కొట్టేసారు అక్కను. గభాల్న గంగలోకి దిగిందామె. అంతకంటే ముందుగా నేను దిగేసాను - నకెక్కడ దెబ్బలు పడతాయోనని! ఆ రోజులన్నీ గుర్తుకు వస్తుంటే ఆనందంగా వుంది. కొట్టినా, తిట్టినా మా అమ్మ, నాన్నలు ఎంత ఆపేక్షగా వుండేవారో!
అక్కతో కలసి మెట్రిక్ పరీక్ష పాసయ్యాను. ఆ రోజుల్లో షిల్లాంగ్‌లో తరచూ భూకంపాలు వచ్చేవి. మానాన్న ఏదో క్యాంప్ కెళ్లినప్పుడు, భూకంపంమొచ్చి ఇý్లంతా తలక్రిందులై పోయింది. దాంతో మా అమ్మ భయపడిపోయింది - సరేనని మేమంతా మరోసారి మద్రాసు (14.06.1949) వచ్చేశాం. మా నాన్న అక్కడే వుండి వుద్యోగం చేసేవారు.
నేను శుక్ర జాతకురాలినని, మచి కళాకారణి అవుతానని మా నాన్న పదేపదే మా అమ్మతో చెప్పేవారు. ప్రతినెలా 500 రూపాయలు మా ఖర్చులకు పంపేవారు. మÖసాపేట్ వీధిలో మేం ఒక యిల్లు అద్దెకు తీసుకుని వుండేవాళ్లం. ఒకరోజు మానాన్న “కృష్ణకు డాన్సు చేయడం ఇష్టం. ఆ యిష్టాన్ని మనం భగ్నం చేయకూడదు నాకు సి.పుల్లయ్య గారు బాగా ఆత్మీయులు. వారిని కలుసుకుని మన అమ్మాయికి నాట్యం నేర్పించు అంటూ వుత్తరం రాశారు అమ్మకు.
అమ్మ పుల్లయ్యగార్ని కలుసుకుని విషయం చెప్పారు. ఆయన అప్పుడు ‘జెమినీ’లో డైరెక్టరుగా వర్క్ చేస్తున్నారు. “సరే - అయితే స్టూడియోకి పంపించండి” అన్నారాయన. అలా నేను తొలిసారిగా జెమినీ స్టూడియోలో అడుగు పెట్టాను.
ఛోప్రా, జయశంకర్, దండాయుధ పిళ్లై - గార్ల దగ్గర రకరకాల నృత్యాలు నేర్చుకున్నాను.
ఆ రోజుల్లో కస్తూరి శివరావుగారు చాలా టాప్ కమెడియన్! ఆయన ఓ రోజు నన్ను చూసి ‘కెవేÖకు తగ్గ ఫేస’ అన్నారు. స్వంతంగా ‘అగ్నిమంత్రం’ అనే చిత్రం తీసే ప్రయత్నంలో వున్నారు - ఆయన మా అమ్మను కలుసుకుని నన్ను ఆయన చిత్రంలో హీరోయిన్ వెయ్యమన్నారు. మంగయ్యగారు మేకప్ వేసారు. బౌనా గారు స్టిల్సు తీశారు. శివరావుగారు వెళ్లే ప్రతి ఆఫీసులోనూ, నా గురించే చెబుతూ ‘చక్కటి ఫీచర్స’ అని మెచ్చుకుంటూ వుండేవారట. నేను మాత్రం ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచించలేదు - చూడడం వరకే నా పని. అక్క పాటికి అక్క సినిమాల్లో వున్నా, నేనేమీ పట్టించుకునేదాన్నికాదు, ఆ స్టిల్సు కూడా అమ్మ తీయిస్తే తీయించుకున్నాను.
నాకు సినిమా ఛాన్సు అనుకోకుండా వచ్చింది - ఎలాగంటే “రాణీ - నూనెలో చూసుకో - అయిన వారిని కానుకో” అనాలి. కురుమద్దాల రామచంద్రరావు గారి డైరెక్షన్. ఆ డైలాగ్ చెప్పేసాను. ‘ఓ.కే’ అన్నారంతా! మా అమ్మ మాత్రం మొదట్లోనే నూనెలో చూడం అంత మంచిది కాదని భయపడ్డారు. నేను మాత్రం ఏం జరిగినా అంతా ఆ భగవంతుని దయ అనుకుని ఊరుకున్నాను. అలా ప్రారంభమైంది నా తెర జీవితం.
వెంట వెంటనే “ప్రియురాలు” (), “మరదలు పెళ్లి” (), “చిన్నమ్మకథ” () ఇలా వరుసగా చేశేసారు. నటించడం వరకే నా పని. కాల్షీట్లు యివ్వడం, మనీ మేటర్స్ అన్నీ మా అన్నయ్యే (రాము) చూసుకునేవారు. మా అమ్మ నా అంతస్తును దిగజార్చకూడదని, కాశీపట్నంలో వున్న 20 ఎకరాల భూమిని 12 వేలకు అమ్మేసి ఒక హిల్మన్ కారు కొనిచ్చారు. ఏదో నటిస్తూ వున్నాను. మా అక్క సినిమాల్లోకి వెళ్లడమే పెద్దటాక్. ఇక నేను కూడా సినిమా హీరోయిన్ కావడంతో మా బంధువులు నుండి పెద్ద ప్రాబ్లం ఎదురయ్యింది. వెంకోజీ కూతుళ్లతో సినీమా వేషాలు వేయిస్తన్నాడని కామెంట్స్ చేసేవారు. కానీ నేనుగానీ, మా అమ్మగాని వాటిని లెక్క చెయ్యలేదు. ఆ తర్వాత సక్సెస్, డబ్బు, పేరు వచ్చిన తర్వాత మళ్లీ దగ్గర చేరారు. జానకి, కృష్ణకుమారి వాళ్లు మా చుట్టాలు అని చెప్పుకున్నారు.
అదేం ఖర్మమో పిక్చర్స్ అయితే చేశాను, నాకు పేరొచ్చింది గానీ నిర్మాతలకు డబ్బురాలేదు - వరుసగా ప్లాప్స్. వాహినీ రెడ్డిగారి “బంగారు పాప” () పరిస్థితీ అంతే. ప్లాపుల కృష్ణకుమారని పేరు కూడా వచ్చేసింది. కొన్ని పత్రికలైతే ‘మీ తీర్పు’ అనే శీర్షిక పెట్టి నేను నటి కాదని, కాలేదని రాసాయి. ఎక్కడ చూచినా నా ప్రసక్తే! కొత్త కాంట్రాక్ట్స్ రాలేదు. దానికితోడు ఇన్‌కంటాక్స్ ప్రాబ్లెమ్ వొకటి వచ్చిపడింది. మనసుకు శాంతి లేకుండా పోయింది. పరిశ్రమలోకి అడుగుపెడుతూనే అన్నా దక్షిణాది భాషల్లో 20 చిత్రాల్లో నటించేందుకు అవకాశం రావడమేమిటి? ఒక్కసారిగా యింతదారుణమైన పరిస్థితి దాపురించడం ఏమిటి? అనే ప్రశ్నలతో ఒక పరిశీలన చేసుకున్నాను. మా అమ్మ తొలిరోజు షూటింగ్ నాడు నూనెలోకి చూచిన ఫలిం ఇది అని అంటుండేది. సరే మంచి రోజులు రాకపోతాయా? అని ఎదురు చూసేదాన్ని.
ఈ సందర్భంలో ఎల్.వి.ప్రసాద్ గారి గురించి చెప్పాలి.
నాగురించి విన్న ప్రసాద్ గారు ఒకనాడు నన్ను తీసుకురమ్మని ఇంటికి కారు పంపించారు. భగవంతున్ని ప్రార్థించుకుంటూ వెళ్లాను. సారంగపాణి స్ట్రీట్‌లో వుండేది ఆయన ఆఫీసు. నేను కారు దిగగానే “రామ్మా... ముహూర్తంకు టైం అయిపోతోంది... నువ్వు మొదట మా ఆఫీసు తెరవాలి. లక్క్ష్మీప్రొడక్షన్సు ప్రారంభిస్తున్నా” అంటూ ఎల్.వి.ప్రసాద్‌గారు ఆప్యాయంగా పలకరించారు. నాకు ఒకటే భయం. నా గురించి బయట ఏమనుకుంటున్నది ఈయనకు తెలీదేమో అనుకుంటూ సందేహించాను. ప్రసాద్‌గారు ఇది కనిపెట్టేసి, దైర్యాన్ని చెప్పి ‘ప్లాప్ అనేది యాక్టర్ తప్పుకాదు, తప్పంటూ వుంటే అది అందరి కృషిలో లోపం” అన్నారు. నేనెప్పటికీ అది మర్చిపోలేను.
ప్రసాద్‌గారిచ్చిన ధైర్యంతో - లక్క్ష్మీ ప్రొడక్షన్స్ కార్యాలయం తెరచి, కుడికాలు లోపల పెట్టాను. “ఇలవేల్పు” చిత్రం స్టార్టు చేశారు. అందులో రేలంగి ప్రక్కన కామెడీ వేషం ఇచ్చారు. రేలంగి గారు - “ఏనుగు పక్కన ఏలకను పెట్టారేమిటి సార” అని అనేసారు. ప్రసాద్‌గారు కొంచెం బాధపడి - “ఫరవాలేదు, ఈ చిత్రం 100 రోజులాడుతుంది” అన్నారు. అన్నట్లుగానే “ఇలవేల్పు” శతదినోత్సవాలు చేసుకుంది. ‘చల్లని పున్నమి వెన్నెలలోన’ అన్నపాట మామీద చిత్రీకరించిందే. ‘ఇలవేల్పు’ సక్సెస్ నాకు పునర్జన్మనిచ్చింది. నేను నష్టజాతకురాలు కాదని నిరూపించిన ప్రసాద్‌గారికి నేనెప్పుడూ కృతజ్ఞురాలిని.
ఆ వెంటనే విఠలాచార్యగారు “వద్దంటే పెళ్లి” ()లో బుక్ చేశారు. తర్వాత ఇండస్ట్రీలో నేను వెనుదిరిగి చూడలేదు. “మగవారి మాయలు” (), “గంగాగౌరీ సంవాదం” (), “సతీసుకన్య” (), “రమాసుందరి” () ఇలా చాలా చేశాను. “జయవిజయ” () చిత్రంలో విఠాలాచార్య, కాంతారావు గార్లతో నా కాంబినేషన్ ప్రారంభమైంది. మాతృసంస్థలా విఠల్ ప్రొడక్షన్స్ నన్ను ప్రోత్సహించింది. నేనీనాటికి మీకు గుర్తున్నానంటే ఆ జానపద చిత్రాలే కారణం. నేను ఒక్క కాంతారావు గారితోనే 28 జానపద చిత్రాల్లో నటించాను.
1960 సం॥లో ‘కనకదాసన’ అనే కన్నడ చిత్రానికి గాను ఆ భాషలో ఉత్తమనటిగా ఎంపికయ్యాను. రాజ్‌కుమార్ సరసన నటించానందులో, తర్వాత ఆయనతో ఏడెనిమిది చేసుంటాను.
హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి. జూపిటర్ పిక్చర్స్ దీక్షిత్ ప్రోత్సాహంతో ‘కభీ అంధేరా కభీ ఉజాలా’ అనే హిందీ సినిమాలో చేశాను. హిందీలో నా పేరు ‘రతి’. అప్పటికే హిందీలో నా పేరుతోటే మరోనటి వుండడంతో నా పేరు మార్చాల్సి వచ్చింది. నాకెందుకో తెలుగు, తమిళ భాషల స్టూడియోల్లో వున్నంత ఆరోగ్యకరమైన వాతావరణం హిందీరంగంలో కన్పించేది కాదు. అందుకే బాబూబాయి మిశ్రాగారు ఎంతగా అడిగినా హిందీలోకి వెళ్లలేదు.
అక్కినేని నాగేశ్వరరావు గారితో నా మొదటి చిత్రం “పెళ్లికానుక” () బాగా సక్సెస్ అయింది. ‘పులకించని మది పులకించు’ అనే పాట నాపై చిత్రీకరించబడిందే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే డైలాగ్‌డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్‌లోని మెళుకువలు నేర్పించారాయన. ఆ తర్వాత మా కాంబినేషన్‌లో సుమారు పది చిత్రాలో నటించాను. హీరోయిన్‌గా ఏడు చిత్రాలు చేశాను.
నాగేశ్వరరావు గారితో నేను నటించిన “భార్యాభర్తలు” () నా నటజీవితంలోనే ఓ మైలురాయి. పి.ఏ.పి సుబ్బారావుగారు నా మీద నమ్మకంతో ఆ టీచర్ పాత్ర యిచ్చారు. మొదట ఆ పాత్రకు జమునగారిని అనుకున్నారట - కారణాంతరాల వల్ల ఆమె వేయకుంటే నేను వేసాను. sTÖ చిత్రంతోనే పి.ఏ.పి. యÖనిట్‌లో అడుగుపెట్టాను. కేంద్ర ప్రభుత్వం రజతపతకం పొందిందా చిత్రం. 1961లో ఉత్తమనటిగా నేను ఎంపికయ్యాను. ఎవార్డ్స్ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లాను, తీరా వెళ్తే అక్కడ దుర్గాబాయమ్మ గారు వున్నారు. ఆమె నన్ను గుర్తు పట్టి “ఏమిటీ? sTÖ మÖగమ్మాయికే sTÖ అవార్డు?” అంటూ ఆశ్చర్యపడి, “బెస్టఆఫ్‌లక” అని దీవించారు. పి.ఏ.పి.లో నేను నటించిన చిత్రాలన్నీ సక్సెసే. “కులగోత్రాలు’2 () మెరిట్ సర్టిఫికేట్ సంపాదించింది. “పునర్జన్మ” () చిత్రంలో నా నటనకు మద్రాసు ఫిలిం ఫాన్సు నుండి ఉత్తమనటిగా అవార్డు వచ్చింది. నాకు ఫాన్ క్రేజీ తెచ్చింది “భార్యాభర్తలు” చిత్రమే. “కులగోత్రాలు” ఔట్‌డోర్ షూటింగ్ అయ్యాక నేను, నాగేశ్వరరావుగారు ఏకబిగిన 500 ఆటోగ్రాఫ్‌లిచ్చాం. “తిరుపతమ్మకథ” () షూటింగ్ అయిపోయి రైల్లో వచ్చేస్తుంటే మహిళా ప్రేక్షకులు పూలు, పళ్లు పట్టుకుని, “నువ్వు దేవతవమ్మా” అంటూ పరుగెత్తి రావడం గుర్తుకొస్తే నా కిప్పటికీ ఒళ్లు పులకరిస్తుంది. వాళ్ల అభిమానానికి నా కళ్లు చెమర్చాయారోజు.
కాంతారావుగారి తర్వాత ఎక్కువ చిత్రాలు చేసింది ఎన్.టి.రామారావుగారితోనే “దేవాంతకుడు” (), “వినాయకచవితి” (), “ఇరుగుపొరుగు” (), “అగ్గిపిడుగు” (), “మర్మయోగి” (), “ఉమ్మడి కుటుంబం” () వంటి చిత్రాలన్నీ మా కాంబినేషన్‌లో వచ్చినవే.
రామారావుగారు ఎంత సరదాగా వుండేవారో, పనిలో వున్నప్పుడు అంత స్ట్రిక్ట్‌గా వుండేవారు. డిసిప్లిన్, టైంకి రావడం, పాత్రల పట్ల సీరియస్‌నెస్ రామారావుగారి దగ్గరే నేర్చుకున్నాను.
రామారావుగారితో నటించిన “లక్షాధికారి” () సినిమా టైంలో జరిగిన ఓ సంఘటనే ఇప్పటికీ థ్రిల్లింగ్‌గానే వుంటుంది. ‘మబ్బులో ఏముంది’ డ్యూయెట్ షూటింగ్‌లో పాటంతా అయిపోయి చివర్లో చేతులు పట్టుకుని హమ్ చేస్తూ సముద్రం ఒడ్డునే జాలీగా నడవాలి. చివర్లో వున్నట్లుండి చాలా పెద్ద అల వచ్చి మా మీద పడింది. నాకు స్విమ్మింగ్ రాదు. ఉక్కిరిబిక్కిరై నీళ్లు మింగేశాను. ఏమౌతుందో తెలీలేదు. అంత ప్రవాహంలోనూ రామారావుగారు నా చెయ్యి వదలలేదు. వదిలింటే కొట్టుకుపోయేదాన్నేమో. అది నాకు పునర్జన్మ లాంటిది.
మరో సంఘటన “బందిపోటు” షూటింగ్ జరుగుతోంది. గిండీ అడవుల్లో గుర్రపు స్వారీ చేయవలసి వచ్చింది. నాకు గుర్రపు స్వారీ రాదు. ‘ఇది మైల్డ్ హార్స్, ఆడగుర్రం, భయం లేదు వెళ్లండి” అన్నారు విఠలాచార్యగారు. స్వారీ చేయక తప్పలేదు. వెళ్తుంటే సడన్‌గా అది స్పీడ్ పెంచేసింది. ఆ సమయంలో కూడా రామారావుగారే నాకు సహాయం చేసి నన్ను కాపాడారు.
కాంతారావుగారితో కూడా యిలాంటి సంఘటనే ఒకటుంది. “వరలక్క్ష్మీవ్రతం” () చిత్రం షూటింగ్ జరుగుతున్న రోజులవి. ఔట్‌డోర్‌కని ఏర్కాడ్ కొండలమీదకు వెళ్లాం. ఆ సినిమాలో కూడా గుర్రం మీద స్వారీ చేసే సీనుంది. నాకొకే భయం. కానీ దర్శకుడు విఠలాచార్యగారు వదలరు - ఎక్కక తప్పిందిగాదు, అది మచ్చిక చేయబడ్డ గుర్రమే! అన్నారు. కానీ అదేం ఖర్మమో మరి - నేను కూర్చున్నానో లేదో - అంతే! పరుగో పరుగు - నేను ఆపలేను - పైకి అరవలేను. ఆ గుర్రం ఆగేలా లేదు. కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాలు! ఆ గుర్రం చివరకు కాంతారావు (హీరో) గారి ధర్మమా అని అదుపులోనికి వచ్చింది ఆ గుర్రం... “ఆ! మరేమిటనుకున్నారు? రౌతు కొద్దీ గుర్రం అంటే అదే!” అని ఆయన హీరోయిటిక్‌గా ఓ డైలాగ్ అన్నారు.
కొంగర జగ్గయ్యగారితో “గుడిగంటలు” (), “కానిస్టేబుల్ కూతురు” () “వీలునామా” () వంటి చిత్రాలు చేశాను. “గుడిగంటలు” షూటింగ్‌లోనే ఓ సంఘటన జరిగింది. ఔట్‌డోర్ షూటింగ్‌కు అందరం త్రివేండ్రం వెళ్లాం. నేను ఒక చిన్న వెదురుపుల్ల తీసుకుని గోళ్లు చూచుకుంటూ, పక్కవాళ్లతో మాట్లాడుకుంటూ, గోటిలోకి వెదురుపుల్ల గుచ్చేసుకున్నాను. ఆ పుల్లలోపలికి దిగబడిపోయింది. రక్తం కారిపోయింది. జగ్గయ్యగారిది చూచారు. వెంటనే దాన్ని ఆయన పీకేసి, ‘ఇంజెక్షన’ యిప్పించారు. బాండేజి తనే కట్టారు. అప్పటినుంచి అలాంటి వెదురుపుల్లలు గానీ, సిరెంజీలనుగానీ చూస్తే జగ్గయ్యగారే గుర్తుకొస్తారు.
ఇక నాటకరంగానుభవాలు నా జీవితంలో తక్కువే. చిన్నప్పుడు వేయడమే, సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాటకం వేసింది ఒకసారే. నీలం సంజీవరెడ్డిగారి పిలుపుతో జాతీయ నిధి సేకరణకు ఆర్టిస్టులంతా పర్చటించాం. విజయవాడ, కర్నూలు, హైదరాబాద్‌లలో ప్రదర్శనలిచ్చాం. ఎన్.టి.రామారావుగారు మా బృందానికి నాయకుడు. అక్కినేని నాగేశ్వరరావు, సూర్యకాంతం గార్లతో కలసి “దేశంకోసం” అనే నాటికను ప్రదర్శించాను. పదిలక్షల రూపాయలు పైగా sTÖ ప్రదర్శనల వలన పోగుచేసి జాతీయ రక్షణనిధికి సమర్పించాం ఆ రోజుల్లో. అదొక అపూర్వ సంఘటన. మైసూరు వరద బాధితుల కోసం జాతీయ కరువు సహాయనిధికి కూడా ఆర్టిస్టులతో కలసి నిధులు సేకరించాను.
నేను హీరోయిన్‌గా వుండగానే ఫీల్డు నుండి తప్పుకున్నాను. మా వారి పేరు అజయ్‌మోహన్. వాళ్లు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్సు. వాళ్లు రాజస్థానీ మార్వాడీస్. నన్నెంతో ఇష్టపడి వివాహం చేసుకున్నారాయన. 12.03.1969న మా పెళ్లయ్యింది. పెళ్ళి కాగానే సినిమాలు వదిలేశాను.
పెళ్లయిన రెండేళ్లకు మళ్లీ అనుకోకుండా ఫీల్డులోనికి వచ్చాను. పి.ఏ.పి.సుబ్బారావుగారి మాటను కాదనలేక “భార్యాబిడ్డలు” ()తో రీఎంట్రీ చేశాను. అంతే మళ్లీ విజృంభించాను. “ఆనందనిలయం” (), “మానవుడు దానవుడు” (), “వింతదంపతులు” (), “బంగారు భూమి” (), “కొత్తకాపురం” (), “యశోదకృష్ణ” () ఇలా చాలా చేశాను. 1983కి పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టేశాను.
అక్క ఓసారి బాబా దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన నన్ను ఆశీర్వదించి ఓ లక్క్ష్మీపతకం వున్న గొలుసు నా మెళ్లో వేశారు. ఆయన ఆశ్రమంలో కాస్త ప్రశాంతత లభించింది. ఆయన వైటుఫీల్డులో వుండేటప్పుడు జమునగారు, అంజలిగారు అంతా వస్తారు. పాతకబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తాం.
మళ్లీ యిన్నేళ్లకు దాసరిగారి ప్రోత్సాహంతో ఆయన నిర్మించిన “పూల్స” ()లో నటించాను. నిజానికి నటించాలని లేదు గానీ, ఆయన మాటను తిరస్కరించడం భావ్యం కాదుగనుక చేశాను.
నేను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 150 చిత్రాలు చేసి వుంటాను. అన్నపూర్ణ, పి.ఏ.పి., విఠల్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద కంపెనీలు నన్ను ఎంతో గౌరవంగా చూసుకునేవి. రామశర్మగారి దగ్గర నుండి రమణమÖర్తి గారి వరకూ ప్రతిహీరోతోనూ దాదాపుగా నటించాను. ప్రస్తుతం బెంగుళూరులో మా ఎస్టేట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడప్పుడూ బి.సరోజ, జయంతి లాంటి సన్నిహితులతో మాట్లాడుతూ వుంటాను. నాకూతురు దీపిక ఎం.ఎ (ఫిలాసఫీ) చేస్తోంది. టోటల్‌గా నేను అదృష్టవంతురాలినే. అటు ఇండస్ట్రీలోనూ, ఇంట్లోనూ నా గౌరవం నేను నిలుపుకోగలిగాను. నాకదే పదివేలు. ప్రేక్షకులు మదిలో రాజకుమారిగానే నిలిచిపోయాను అదే అవార్డు - ఇంతకంటే చెప్పుకోవలసినదేమీ లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి