వివేకచూడామణి, వేదాంత పంచదశి మొదలైన పుస్తకాలలో ఒక విషయం చాలా బాగా చెప్పారు. అది ఈ విధంగా వుంది.
అస్తి భాతి ప్రియం నామ రూప చేత్యంశ పంచకం
ఆద్యత్రయం బ్రహ్మ రూపం తదోద్వయం జగత్ రూపం
భావం:
అస్తి అనగా - సత్యం
భాతి అనగా - జ్ఞానం
ప్రియం అనగా అనందం
అనగా సత్య జ్ఞాన ఆనందం (సచ్చిదానంద స్వరూపం)
ఇది పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూప లక్షణం.
ఇది ఎప్పటికీ మారదు.స్థిరం. శాశ్వతం నామ అనగా పేరు, రూప అనగా ఆకారం, ఈ రెండూ జగత్తు యొక్క లక్షణం. ఇవి మారుతూ వుంటాయి. ఎందుకంటే జనించి గతించే పరిణామ శీల లక్షణమైన జగత్తుకి నామ రూపాలు మారుతూ వుండడం సహజమే కదా!
అందువల్ల మారుతూ వున్న జగత్తు లో మారని పరిపూర్ణ పర బ్రహ్మ స్వరూపం, అనేక నామ రూపాలను ధర్మసంరక్షణార్థం సంతరించుకుంటుంది. త్రేతాయుగంలో రాముడు, ద్వాపరంలో కృష్ణుడు. ఒకరే ఇరువురిలోను ఉన్నది సచ్చిదానంద స్వరూపమే.
కానీ జగత్తులో నామ రూపాలు వేరు. మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సత్పురుషులలో సచ్చిదానంద స్వరూపమే. అంతేకాని మారుతూ వుండే నామ రూపాలు కాదు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి