సాహిత్యసీమకు ఎన్ని దిశలున్నాయో అన్నిదిశలలో లింగమూర్తిగారి దర్శనం మనకు దొరుకుతుంది. ఆ మేరకు వారు చతుర్ముఖులుగాకాక చతుర్దశముఖులుగా కనిపిస్తారు. చతుర్ముఖుని నాల్కమీద వసించిన ఆ వాణి, తనకు భక్తుడూ, చతుర్దశముఖుడూ ఐన కపిలవాయిలింగమÖర్తిగారి నాల్కపైనీ చేరి వారి ఆజీవం సేవలూ, పూజలూ అందుకుంది. వారినిగూర్చి మనం ఇంతగా చెప్ప్పుకున్నా ఒకదశలో ‘నేను దేశికవినేగాని మార్గకవినిగాను’. అంటూ తమగురించి తామే చెప్ప్పుకున్న విషయంలో వారి ఒద్దిక, సత్యసంధతలను ప్రత్యేకంగా చెప్ప్పుకోవలసి ఉంది. దేశికవిమాత్రమే అయితేనేం? దాంతో తరిగిందేమీ లేదు. అదేదో లేమి అనుకుంటే దేశికవితను, దేశీయతను కించపరచినవార మవుతాం.
ఇక కపిలవాయివారి మాటల్లోనే విశ్వకర్మ అనే విషయానికివద్దాం. సృష్టి నామరూపాత్మకం కనుక దానికధిష్ఠానమైన పరబ్రహ్మతత్త్వంకూడ శబ్దబ్రహ్మ, విశ్వబ్రహ్మ అని రెండువిధాలయింది. అట్లా ద్విధావిభక్త మైన ఆ బ్రహ్మం సాకారంలో బ్రహ్మయై ప్రణవాది వేదాలను, విశ్వబ్రహ్మయై జగాలను సృజించటమైంది. ఈ విశ్వబ్రహ్మకు విశ్వకర్మ అని పేరు. విశ్వకర్మ అనే పేరుకు విశ్వాన్ని సృజించినవాడనీ, అతడు సృష్టించిన విశ్వంలో దాని ప్రగతికి కర్మచేసేవాడనీ రెండురకాల అర్థాల్నీ చెప్పవచ్చు. కనుక ఈ విశ్వాన్ని సృజించిన బ్రహ్మ తొలివరుసలో ఆదివిశ్వకర్మకాగా, దీన్ని నడపడానికి అతనిచే నియమింపబడిన త్రిమÖర్తులు, అష్టదిక్పా లకులు, నవగ్రహాలు అనబడేవారు రెండోవరుసలోకి వస్తారు. సృష్టికర్తయైన ఈశ్వరుని పురాణాలు సాకారుడని అంగీకరించి విశ్వకర్మ అని వ్యవహరించాయి. ఆతడెట్లా ఉండునో ఆర్షఋషులు తమ ద్రష్టత్వాన వర్ణించగా, శిల్పులు తమ సమాధిబలంతో నామరూపాలను మృద్దారుశిలాలోహాదులలో తీర్చారు. సాకారుడైన ఈ విశ్వకర్మ పంచముఖుడు. పంచాననుడన్నా అదే అర్థం. అతని నిశ్వాసంనుండి ప్రణవాది వేదాలు ఉద్భవిం చాయి. ముఖాలనుండి సానగాదులు జనించారు. నేడు మనకు పురాణాల్లో కనిపించే విశ్వకర్మ, అతని వంశజులైన మను, మయ, త్వష్ట, విశ్వరూప, వృత్ర, కశ్యపులు మొదలైనవారు దేవతాయుగానికి చెందినవారు కాగా సానగ, సనాతనాదులు మహర్షులయుగానికీ, నలనీలాదులు రామాయణ కాలానికీ, మయ, తక్షకాదులు మహాభారతకాలానికీì చెంది కనిపిస్తారు. వీరిలో నలాదులు వానరజాతికి, తక్షకుడు నాగజాతికి చెందిన విశ్వకర్మలు. ఇట్లా సాగిపోయింది కపిలవాయిగారి మాటల్లో విస్తారమైన విశ్వకర్మపరిచయం.
విశ్వకర్మ అంటే పరాత్పరుడైన విశ్వకర్మ అనే. విశ్వకర్మలు అన్నపుడు ఆయన వంశంలో జనించిన వారనే అర్థం రూఢమైంది. వారు మనుమయాది దేవగణంలోని వారైనా, నేటికాýంలోని పంచదాయిలనైనా అట్లాగే చూడాల్సి ఉంది. విశ్వబ్రాహ్మణశబ్ద మొకటుంది. విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మబ్రాహ్మణ శబ్దాలమీద చర్చ చాలాకాలంగా ఉంది. చర్చచేసే వారిలో వారివారి జిహ్వబలం వారిని నిలబెడుతూ వస్తూంది. ఎంతగా ఎన్నివిధాలుగా చర్చించినా ఈ చర్చంతా ఒక్క పంచదాsTÖ (పంచానన) వర్గంమీదే. బ్రహ్మయై సృష్టించటంతో విశ్వకర్మ విశ్వబ్రహ్మ అయినాడు. దాంతో అతని సంతతి విశ్వబ్రాహ్మణశబ్దంతో గుర్తింపబడింది. తుదిని చెప్పేదేమంటే విశ్వకర్మ ` విశ్వబ్రాహ్మణ శబ్దాలు ఒకరకంగా పర్యాయాలే అని.
కపిలవాయిగారు తాము విశ్వకర్మలు. తమ దైవం విశ్వకర్మ. తమ రచనలలో ఆ విశ్వకర్మనుగూర్చిన కొన్ని వ్యాసాలను మాత్రమే విశ్వకర్మమయం చేశారు. అన్నందుకు విశ్వకర్మవంశస్తులపై మాతృశ్రీ కడియం పాటి గురుగోవిందమాంబచరిత్ర, ఆంధ్రపూర్ణాచార్యుడు, శివరామబ్రహ్మేంద్రయోగిచరిత్ర, శ్రీ నారాయణ దాసు రామాచార్యుల జీవితచరిత్రవంటి గ్రంథాలు ఒకటి అరా, అవీ విడిగా వ్రాశారుగాని వాని కనీస ప్రస్తా వనలుకూడా మరెక్కడా రానీయలేదు. తమ యే యితర రచనల్లోనూ ఈ విశ్వకర్మ ప్రసక్తులకు తావీయలేదు. వారి సంయమనం అంత గొప్పది.
కపిలవాయివారి రచనల్లోకి తొంగిచూసి విశ్వకర్మలనుగూర్చీ, వారి కర్మనుగూర్చీ వారేం చెప్పారో తెలుసుకోబోతే మున్ముందుగా చెప్ప్పుకోవలసిన గ్రంథం ‘స్వర్ణశకలాలు’. కావ్యాలలో ముఖ్యంగా ప్రాచీన కావ్యాలలో తాము చూసిన విశ్వకర్మల ప్రసక్తులను ఈ గ్రంథంలో ఎత్తిచూపి వానికి తమదైన వ్యాఖ్యానంచేశారు. గ్రంథంపేరే స్వర్ణశకలాలు. ఆ మేరకు స్వర్ణకారులయిన విశ్వజ్ఞవిశ్వకర్మవంశీయుల కర్మ, కర్మఫలాలు వర్ణించబడటం చూస్తామీ గ్రంథంలో. ఏ పుట పట్టుకున్నా బంగారు తునుకల్లాంటి పద్యాలు కనిపిస్తాయి. ఉదాహరణమొకటి చూద్దాం`
“గరళపుముద్ద లోహమవగాఢ మహాశనికోట్లు సమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి, యురగాధిపు కోరలు పట్టుకార్లు ది
క్కరటి శిరంబు దాయ లయకారుడు కమ్మరి వైరివీరసం
హరణ గుణాభిరాముడగు మైలమభీమన ఖడ్గసృష్టికిన్.”
‘ఏఱువభీముని ఖడ్గం’ అనే శీర్షికతో ఉదాహరించిన ఈ పద్యం వేములవాడ భీమకవి చాటువట. ఈ పద్యంలో పేర్కొనబడిన వస్తువులన్నీ శివునిపరంగా ఉండేట్లు చెప్పబడ్డాయి. లోహం శివుని కంఠంలోని గరళం, అశని అంటే పిడుగు. పిడుగుకు హీరమనీ, శివునికి హీరుడనే పేర్లూ ఉన్నాయి. ప్రళయకాలంలో కురిసే పిడుగులు సమ్మెటపోటులు, శివుని నయనాగ్ని కొలిమి, ఆయన నలంకరించిన ఉరగాల (పాముల) కోరలు పట్టుకారులు, దిక్కరటిశిరం అంటే దిగ్గజశిరం డాకలి. ఈ రహస్యాలన్నీ విప్పిచూస్తే లయకారుడు. అంటే శివుడు. ఆ శివుని కమ్మరిగా ఉపమించి వర్ణించిన ఈ పద్యంలో విశ్వకర్మ ఛాయామాత్రంగా కని పించటాన్ని విప్పిచెప్పారు కపిలవాయిగారు. శివుణ్ణి భీముడనీ అంటారు. ఓజులు అని విశ్వకర్మీయు ల్నంటాం. ఇక్కడ భీమకవి ఈ భీముణ్ణి (శివుణ్ణి) భీమోజును చేశాడంటారు కపిలవాయిగారు. మొత్తంపై శివుణ్ణి మనుబ్రహ్మగా, విశ్వకర్మగా రూపుకట్టించిన ఈ పద్యానికి వారు చేసినవ్యాఖ్యానంలో తామున్నూ విశ్వకర్మను తలచుకున్నట్లే అయింది.
ఈ వరుసలోనే చిమ్మపూడి అమరేశ్వరుని ‘విక్రమసేనం’ లోని అశోకవృక్షవర్ణన. ‘గణపవరంవారి కమ్మరి’ అనే శీర్షికలో గణపవరపు వెంకటకవి ప్రబంధరాజవేంకటేశ్వర విలాసం’ లో వసంతుణ్ణి కమ్మరిని చేసిన ఘట్టం ఉందని పేర్కొని వివరించారు. ఇట్లే మట్ల అనంతరాజు ‘కకుత్సవిజయంలో’ వర్ణించిన వడ్రంగిని పట్టి చూపించారు. ‘సింహాసనద్వాత్రింశిక’లోని మÖడవకథలో గౌళికుడనే మయకుమారుడు కఱ్ఱతో గరుత్మంతునిచేసి ఏకంగా తాను శ్రీమహావిష్ణురూపాన్ని ధరించి రాకుమారిని వరించిన సందర్భాన్ని ముచ్చటించారు. ‘గణపవరంవారి కొలిమిలో కాలినగుండు’, ‘కొరివిగోపరాజుగారి పడెచ్చు’, ‘అయ్యలరాజుగారి అగసాల’, ‘ఆంధ్రభోజుని అతుకు’ ‘పినవీరన పూతకడియం’, ‘భట్టుమÖర్తిచేసిన బంగారుబొమ్మ’, ‘వడ్డాదివారి వెండికంచం’, ‘నరహరిపండితుని పసిడిపూదె’ ఇట్లాంటి శీర్షికలలో ప్రాచీనకావ్యాల్లోని పద్యాల అచ్చట్లు ముచ్చట్లలో చోటుచేసికొన్న విశ్వకర్మీయులను తమ వ్యాఖ్యానాలతో దర్శింపజేశారు. అంతేకాదు, గతశతాబ్దంలో గోపాలపేటప్రభువు తమ కేశంపేట, గోపాలపేటలలో ఆలయాలకు ద్వారాలు, మకరతోరణాలు, దేవతామÖర్తు లకు కిరీటకవచాలు చేయటానికి పెదమర్రూరులోని తల్లోజు హనుమంతాచారిని పిలిపించుకున్నాడట. రేమద్దులలో పని సాగుతుండగా ఆ ప్రభువొకమారు పరిశీలనకన్నట్లుగా వచ్చి, హనుమంతుగారూ ! మీరు మంచి పనివారని విన్నాం. మీ పనితనం ఎలాంటిదో మాకెన్నడూ చూపకపోతిరి? అన్నాడట. ఆ తర్వాత ఒకనాడు ఆ ప్రభువు కొలువులో ఉండగా హనుమంతాచారి వెళ్ళాడట. తన దగ్గరున్న రెండు బంగారు తుమ్మెదలను రెక్కలునొక్కి ప్రభువుదిశకు విసిరాడట. అవి ఎగురుతూపోయి ప్రభువుమీద వాలాయట. తనమీద ఏదో పురుగు వాలిందనుకొని ప్రభువు విదలించబోతే హనుమంతాచారి వారించి వెళ్ళి తుమ్మెదలను తీసి తన జేబులో వేసుకున్నాడట. ఆశ్చర్యమÖ ఆనందము కలుగగా ఆ ప్రభువు ఆ ఆచారికి ఒక యిల్లు బహుమానంగా యిచ్చాడట. ఆ హనుమంతాచారివంశంవారు ఇప్పటికి గోపాలపేటలో ఉన్నారట. అట్లే మొలుగర అనే ఊళ్ళోని ఒక విశ్వకర్మ వెండితీగతో చిన్న చేపనుచేసి పళ్ళెంలో నీళ్ళుపోసి ఆ నీళ్ళలో ఆ చేపను వదిలితే పళ్ళెంచుట్టూ తిరిగిందట. ఇట్లాంటి సందర్భాలనూ ప్రోవుచేశారీ గ్రంథంలో. సూటిగా పరాత్పరుడైన విశ్వకర్మను తీసుకోకపోయినా ఆయన ప్రభావాన్ని, ఆయన వంశీయులను ఈ వ్యాసాల్లో పాఠకులముందుకు తీసుకువచ్చారు కపిలవాయివారు.
కపిలవాయివారి సాహిత్యంలో విశ్వకర్మ అనే విషయం చెప్ప్పుకోవలసివస్తే వారు వచనంగా కూర్చిన ‘విశ్వకర్మపురాణం’ చెప్ప్పుకోక తప్పదు. దీనికి మÖలం వేంకటాచార్యకృతమైన పది ఆశ్వాసాల పద్యగ్రంథం. వ్యాసభగవానుని రచనల్లో ఉన్న అనేక కథలలో ఇరుక్కుపోయి ఉన్న విశ్వకర్మసంబంధి విషయాలను చిక్కుల్ని విడదీస్తూ సృష్టించబడింది ‘విశ్వకర్మపురాణం’. వీపూరి వెంకటాచార్యులు తాను ఒకనాటి ముమ్మనాచార్యుని వంశంవాడనని చెప్ప్పుకున్నాడు. ఈయన కాలక్రమంలో నల్లగొండజిల్లాకు తరలివచ్చి నివాసం చేసుకొని, పెందోటరాజ్యంలో ఉంటూ శ్రీనాథుడుకూడా వ్రాసిన విశ్వకర్మపురాణం ఒకటుండేదని ఆ నాటికి వినికిడే కాని గ్రంథం లభ్యంకాలేదనీ, అందుకే తాను విశ్వకర్మపురాణం వ్రాస్తున్నానని చెప్ప్పుకున్నాడట. ఈ పెందోటరాజ్యం నాగార్జునసాగర్ రిజర్వాయర్లో మునిగిపోయి కథల్లోమాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ నాగరఖండం అనే గ్రంథంగురించి కొంత చెప్ప్పుకోవలసి ఉంది. పెందోటసామ్రాజ్యాన్ని ధవళేశ్వరపు మార్కండేయుడు పాలించిన రోజుల్లో ఆయన కోర్కెపై వ్యాసకృతమైనదీ సంస్కృతంలో ఉన్నదీ అయిన స్కాంద పురాణంలోని నాగరఖండం ఆంధ్రీకరించబడి తాళపత్రాల్లో పద్యగ్రంథంగా కూర్చబడిందట. పెద్దకాలంపిదప ఆ పద్యగ్రంథానికి కడపజిల్లా కానిస్టేబుల్ రాయవరపు పూర్ణయాచారి ప్రతి వ్రాయించి, మతుకుమిల్లి రామకృష్ణకవి అనే పండితునిచే తాత్పర్యాలు వ్రాయించి నూటామÖడు సంవత్సరాల క్రిందట అచ్చువేయించాడు. ఇటీవల ఆ గ్రంథానికి సనాతనసాహితీసమితి వారు పునర్ముద్రణ తీసుకువచ్చి దానికి మళ్ళీ వందసంవత్సరాల ఆయువుపోసి పుణ్యంకట్టుకున్నారు. ఇక అసలు విషయానికొస్తే ` ఆ నాగరఖండంలో ఉన్నదంతా విశ్వకర్మ చరిత్రమే. దీని భూమికమీదే వెంకటాచార్య విశ్వకర్మపురాణం వ్రాశారని ఊహించవచ్చు. అయితే అదీ పద్యగ్రంథమే. కపిలవాయిగారు ఆ గ్రంథాన్ని వచనంగా చేయటానికి ముందే అదేపని కురిచేటి చెంచయ్యగారు చేయగా వారి గ్రంథానికి పీఠిక వ్రాయవలసి వచ్చిందట కపిలవాయిగారికి. ఏమయితేనేం తరువాతికాలంలో తమ చిరకాలసంకల్పం నెరవేరుస్తూ తామును ఈ వచనరూప విశ్వకర్మపురాణం రూపొందించారు. ఇక వారి వచనరచన ఎంత ఆహ్లాదంగా ఉంటుందో క్రొత్తగా చెప్పేపనిలేదు.
విశ్వకర్మ (వంశీయు) లకు తాము రూపొందించే మాంగల్యంతో విడదీయరాని బంధముంది. మాంగల్యానికితోడు ఐదువలు ధరించే పవిత్రమైన ఆభరణాలు, తదితర ఆభరణాల విశేషాలతో కూర్చిన గ్రంథం ‘మాంగళ్యశాస్త్రం’. ఆభరణాల తయారీ, వానికి సంప్రదాయాలతో ఉన్న ముడి, ఏయే కాలాలలో ఏ యే ఆభరణాలు వాడుకలో ఉండేవి, ఎవరు ఏయే సమయాýలో ఏ ఆభరణాలు ధరించటం శ్రేయం, ఆ యా ఆభరణాలకున్న ప్రత్యేకతలు మొదలైన విషయాలెన్నో ఏకరువు పెట్టారు కపిలవాయిగారీ గ్రంథంలో. దీనికి మÖలం వారికి తమ యింటిలోనే శిథిలావస్థలో దొరికిన ఒక ప్రాచీనగ్రంథమట. ఆ గ్రంథప్రతిని తీసికొని చూచి డా॥జ్ఞానానందగారు కన్నడంలోకి అనువదించారు, ప్రచురించారు. ఆపైన తెలుగులో కపిలవాయిగారి వ్రాతతో ప్రచురణం జరిగింది. దొరికిన మాంగళ్యశాస్త్ర్రంలోని అంశాలేకాక తమ పరిశోధనలో తేలిన ఎన్నెన్నో విశేషాలను ఈ గ్రంథంలో జతకూర్చి విస్తరింపజేశారు. ఈ గ్రంథంలో ఆభరణాల విశేషాల్తోపాటు అక్కడక్కడ విశ్వకర్మ (వంశీయు) ల ముచ్చట్లును సాగాయి. తమ ‘మాంగళ్యశాస్త్రం’ జ్ఞానానందగారు కన్నడంలోకి అనువ దిస్తే, ఆ జ్ఞానానందగారి కన్నడగ్రంథం ‘విశ్వబ్రాహ్మణులు ` సంస్కృతీ అనుకరణలు’ ను కపిలవాయిగారు తెలుగులోనికి అనువాదం చేశారు. ఇదో చిత్రమైన సన్నివేశం. ఈ గ్రంథనామంతోనే ఇదంతా విశ్వకర్మ, విశ్వకర్మీయుల విశేషాలు, విషయాలతో నిండి ఉంటుందని తెలిసిపోతుంది. విశ్వకర్మసాహిత్యంలో ఇదొక అమÖల్యగ్రంథంగా చెప్ప్పుకుంటారు.
కపిలవాయిగారి రచనల్లో విశ్వకర్మ, విశ్వకర్మల విస్తార వివరణలు చోటుచేసికొన్న రచనల్లో వారు వేరువేరు కాలాలలో, వేరువేరు పత్రికలకై వ్రాసిన వ్యాసాలు ఓ పాతికవరకున్నాయి. ఈ వ్యాసాలసంకలనం ‘విశ్వకర్మవిలాసం’ పేర ఇటీవల వెలుగులోకి వచ్చింది. ‘హరవిలాసం’ హరునిచరిత్రను, ‘విజయవిలాసం’ విజయుని తీర్థయాత్రాచరిత్రను పట్టిచూపినట్లు, విశ్వకర్మ ప్రభావవైభవాలు, విశ్వకర్మ పరివారం, వారి చరి తలు, ఆయా చరితల భూమికలను తత్సంబంది óవిజ్ఞానాన్ని కపిలవాయిగారు విస్తృతంగా పరచి నింపిన ఈ గ్రంథానికి ‘విశ్వకర్మవిలాస’మన్న పేరు బాగా కుదురుకుంది. విశ్వకర్మల యింటిపేర్లు, మతాలు, సంప్రదాయాలు, తెలుగువారి సొమ్ములు, వివిధాభరణాలు వంటి ఓ అరడజను వ్యాసాలను అనుబంధాలనుకుంటే తక్కినగ్రంథ మంతా విశ్వకర్మమయం. ఈ గ్రంథంలోని కొన్ని వ్యాసాలను గమనిస్తే ` ఆదియుగంలోని విశ్వకర్మల విషయం మొదలుపెట్టి, పురాణాల్లో విశ్వకర్మవంశం, విశ్వకర్మలు, వారి కళాప్రాశస్త్యాలు, ప్రాచీనసమాజంలో విశ్వకర్మలస్థానం , విశ్వవ్యాప్తమైన విశ్వకర్మసంస్కృతి, మనదేశం, విశ్వకర్మలు, వారి శిల్పం, విశ్వకర్మమయం జగత్, వేమనదృష్టిలో విశ్వకర్మ, విశ్వకర్మల వృత్తివాచకాలు, వివిధమతాలకు విశ్వకర్మలుచేసిన సేవలు, విశ్వబ్రాహ్మణులు ` వారి కర్తవ్యం, శిల్పసాహిత్యాలు, విశ్వకర్మలు ` విశ్వబ్రాహ్మణులు, ఆంధ్రదేశంలోని శాసనశిల్పులు, భరతడు విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణుల మతం, వారి కొన్నిగోత్రాలు అంటూ సాగాయి ఈ వ్యాసాలు. ఈ గ్రంథాన్నిగూర్చి డా॥జ్ఞానానందగారు నిIt ఱs as స్త్రశీశీd cతీవatఱశీఅ as tష్ట్రat శీf Vఱswakaతీఎa్ణs sశీశ్రీవy uఅఱనuవ cతీవatఱశీఅ wఱtష్ట్ర dవaశ్రీఱఅస్త్ర bతీఱశ్రీశ్రీఱaఅcవ. Aశ్రీశ్రీ sశీశ్రీవy అవw.” అంటూ ప్రశంసించారు. స్థపతి, వేదాధ్యాయి, శిý్పశాస్త్రపండితులు, జ్యోతిషప్రవీణులు, అయిన వేదబ్రహ్మ శ్రీ ఆచార్య తామాడ మోహన రావుశర్మగారు (బెంగళూరు) “సనాతన భారతదేశచరిత్ర తెలుసుకోవాలని అపేక్ష ఉన్న ప్రతిభారతీయుడు (తెలుగువారుమాత్రమే కాదని) ఈ పుస్తకం సంగ్రహించి చదువుకోదగ్గది.” అన్నారు.
సృష్టిచక్రంనడిచే కర్మ, సృష్టిలోని మానవులయొక్క జీవితచక్రంనడిచేకర్మ అని విశ్వకర్మలకర్మలు రెండువిధాలు. సృష్టిచక్రంనడిపేకర్మ త్రిమÖర్తులకు చెందగా, దేవతలు ` అంటే ఆనాటికి మానవులేకాగా వారి జీవితాలకు కావలసిన వస్తువాహనాలు మొదలయినవానిని సృష్టించియిచ్చిన మను, మయ, త్వష్ట మొదలయినవారికి చెందింది జీవితచక్రం నడిచేకర్మ. దాంతో వారు ద్వితీయశ్రేణి విశ్వకర్మలు.
విష్ణుసహస్రంలో, గరుడపురాణంలో, స్కాందపురాణంలో, ఋగ్వేదంలో, ఐతరేయబ్రాహ్మణంలోను తుదకు దయానందసరస్వతి చేసిన ప్రస్తావనలలోను విశ్వకర్మ చిరునామాను పట్టిsTÖయగల అంశాలు కని పిస్తాయన్నారు. కళాప్రపూర్ణ, దర్శనాచార్య బ్రహ్మ శ్రీ కొండూరు వీరరాఘవాచార్యులుగారు తమ ‘విశ్వకర్మ విశ్వరూపం’లో సానగాదులు విశ్వకర్మ పంచముఖాలనుండి, భృగువు మొదలయినవారు ఆయన మనసు నుండి జనించారని అథర్వవేదంలోని ఒక మంత్రానికిగల వ్యాఖ్యానంవల్ల తెలుస్తుందన్నారు. అందువలన సానగాదులైన పంచార్షేయులు, భృగ్వాదులైన సప్తార్షేయులును విశ్వకర్మలే అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్నే ఉల్లేఖిస్తూ అదెట్లాగో తెలిపే ప్రయత్నం కపిలవాయిగారు తమ వ్యాసంలో చేశారు. ఈ వరుసలో ఆదివిశ్వకర్మ త్వష్ట, అంగీరసులు, ఇంద్రుడు, అశ్వినులు, ఋభువులు, హయగ్రీవుడు, త్వష్టపుత్రులు` రుద్రులు, ఆదిత్యులు, సాధ్యులు, విశ్వేదేవులు, మరుత్తులు, చాక్షుషుడు, చాక్షుషీవిద్య, వైవస్వతమనువు, పురాణాలలోని ఎందరో దేవతల ముచ్చట్లు ప్రోవుచేశారు తమ వ్యాసాలలో.
‘పురాణములందలి విశ్వకర్మ’ అనే వ్యాసంలో` ఈ విశ్వకర్మ స్వయంభువు. ఈ విశ్వకర్మకు విరాట్పు రుషుడు, ఈశ్వరుడు, బ్రహ్మ అని వ్యవహారాలు. అతడు పంచముఖుడు. ఆ ముఖాలకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములని వ్యవహారం. ఈ పంచముఖాలు పంచభూతాలకు చిహ్నాలు. ఈ ముఖ పంచకంనుండి పంచబ్రహ్మలు ఉద్భవించి విశ్వబ్రాహ్మణులకు గోత్రర్షులుగా నిలిచారు. స్కాందపురాణంలోని నాగరఖండం ప్రకారం ఈ పంచబ్రహ్మలు పంచవేదాలకు ప్రవర్తకులైనారు.
విశ్వకర్మ వేదాల్లో విరాట్పురుషునిగా,మహర్షిగా, మంత్రద్రష్టగా, ఆచార్యుడుగాను, పురాణాల్లో మహాశిల్పిగాను దర్శనమిచ్చాడు. ఇదంతా విశ్వకర్మవంశవృక్ష వివరణలో కనిపిస్తుంది. మనువుసంతతిలో ప్రారంభంలో మొదటిబ్రహ్మకు స్వయంభువుడనే పేరు. అతని కుమారుడు స్వాయంభువు. అతడు మొదటి మనువు. ప్రభువు, ధర్మశాస్త్రకర్త కూడాను. అతని రాజ్యం సరస్వతీ, దృషద్వతీనదుల మధ్యన ఉండేది. ఈతని కాలంలోనే సూక్ష్మశరీరదృష్టి ముగిసి, స్థూలశరీరదృష్టి భూలోకానికి సంబంధించింది మొదలయింది. ఈతని కాలంలోనే విష్ణువు అవతారాలెత్తటం ప్రారంభించాడు. వానిలో ఈ స్వాయంభువునకు కూతురైన అకూతి రుచి, ప్రజాపతులకు లక్ష్మీనారాయణులు, దక్షిణాయజ్ఞులుగా జనించి దంపతులయినారట. ఈ యజ్ఞుడే వరాహరూపంలో హిరణ్యాక్షునిచంపి రసాతలంలో మునిగి ఉన్న భూమినుద్ధరించగా నాటినుండి శ్వేత వరాహకల్పం ప్రవర్తింపజేయబడింది. తమ తాతయైన స్వాయంభువుచేసే యజ్ఞాలకు విఘ్నం కలిగిస్తున్న జంభాసురుని చంపి ఆపై యజ్ఞరక్షణకు, లోకపాలనకుగాను యింద్రపదవిని యేర్పరచి తానే దానిని అధి ష్ఠించి నాడు యజ్ఞుడు. ఈ మనువుకాలంలోనే భరతముని అవతరించి నాట్యశాస్త్రం సృజించాడు. సృష్టిక్ర మంలో ఈ యజ్ఞమనువు మిక్కిలి ముఖ్యుడట. స్వాయంభువుని భార్య శతరూప, కుమారులు ప్రియవ్రత ఉత్తానపాదులు. ప్రియవ్రతుని భార్య పంచబ్రహ్మలలో చివరివాడైన విశ్వజ్ఞుని కూతురు బర్హిష్మతి. వారికి పదిమంది కుమా రులు. ఒక్క కూతురు ఊర్జస్వతి. ఈ కుమారులలో పెద్దవాడు అగ్నీధ్రుడు. ఆతని కుమారుడు నాభి. ఆతని పాలనవలన భారతదేశానికి ముందుగా అజనాభమని వ్యవహారం ఏర్పడింది. ఈ నాభికుమారుడు ఋషభుడు. ఇతడు ద్వంద్వాతుడు, తాత్త్వికుడు. ఈతనిని జైనులు తమ మÖలపురుషునిగా స్వీకరించారు. ఋషభుని కుమారుడు జడభరతుడు. ఈతని పాలనలో అంతవరకు అజనాభమని పేరుపడిన దేశము భరత దేశమని పిలువబడింది. ఇట్లాంటి విశేష విషయాలెన్నో తమ పరిశోధనాఫలాలుగా ఏర్చి కూర్చినారీగ్రంథంలో కపిలవాయిగారు.
కపిలవాయిగారు ఈ వ్యాసాలలో చెప్పిన ప్రతివిషయానికి వేద, పురాణ, ఉపనిషదాది ప్రాచీన సాహిత్యంలో ఆధారాలవిషయంగా అనుమానించే పనేలేదు. ఎందుకంటే వారు పరిశోధించకుండా ఏ విష యమÖ వ్రాతలో పెట్టరు. ఈ వ్యాససంపుటిలో` మనువు పరికరనిర్మాత, త్వష్ట సకల ప్రాణినిర్మాత. ఆయన కుమారుడు విశ్వరూపుడు త్రిశిరుడు. ఇంద్రబృహస్పతుల నడుమ ఏర్పడిన దూరం, ఆపై విశ్వరూపుడు బృహస్పతిస్థానంలో దేవతలకు గురువుకావటం, ఆయన రాక్షసులకు యజ్ఞభాగాలిప్పించటం, అది గిట్టని ఇంద్రుడు గురువనికూడా చూడకుండా విశ్వరూపుని వధించటం, ఆతని కుమారుడు వృత్రుడు ఇంద్రునిపై పగతీర్చుకోబోతూ చదివినమంత్రం తప్ప్పుగా ఉచ్చరించి ఇంద్రునిచేతిలో తానే చనిపోవటం, బిల్హణుని రాజతరంగిణిలో ఉన్న కాశ్మీరచరిత్రం, కశ్మీరంలో నేడున్న లోయ పెద్ద సరస్సయి ఉండగా, అక్కడ రాక్షసులు దేవతలను ఇబ్బందిపెట్టడం, కశ్యపుడు వరాహరూపాన ఆ సరస్సుకు గండికొట్టగా నిర్జలమైపోయిన పిదప రాక్షసులను చంపివేయటం, అక్కడే ఉంటున్న నాగులు పలుదిక్కులకు పారిపోయి పట్టణాలు కట్టుకోవటం, అవియే నేడు శేషనాగ్, తక్షకనాగ్, వాసుకీనాగ్ మొదలయిన పట్టణాలుగా మిగలటం, కశ్యపుడు రాక్షసులను వధించిన ఆ ప్రదేశం కశ్యపమారంగా పిలువబడి కాలగమనంలో కాశ్మీరం కావటం, వరాహరూపంలో గండికొట్టినప్రదేశం వరాహమÖలమే కాలగమనంలో బారాముల్లా కావటం ` ఇలా విశ్వకర్మచరిత్రను విప్పి చెబుతూ చెబుతూ ఎంతో చరిత్రను సమాంతరంగా ఈ వ్యాసాల్లో గ్రంథస్థంచేశారు కపిలవాయిగారు. ఇట్లాంటి విషయాలే మరికొన్ని ` భగీరథుడు గంగను భూమికి తేవటంతో ఆ గంగకు భాగీరథియని పేరు వచ్చింది. గంగలోమునిగిన భూమిని కశ్యపుడు పైకితేవటంతో ఆ భూమికి కశ్యపి అని పేరువడింది. దేవతల కంటె ముందు స్వర్గాధిపత్యం రాక్షసులదేనట. వారి తామస, రాజస గుణాలతిశయింపగా తరువాతి కాలంలో ఆ ఆధిపత్యం దేవతలదైపోయింది. రాక్షసుడంటే రక్షణయందు సమర్థుడని ఉన్న అర్థం తరువాతికాలంలో విపరీతమయిపోయిందట. అయితే వారికాలానికి శుక్రుడు, మయుడు వారి గురువులుగా, ఆస్థానశిల్పులుగా ఉండటంతో వారిమీదకూడా రాక్షసముద్ర పడిందికాని నిజానికి వారు దానవులుకారట. తక్షకుని నిర్మాణమైన తక్షశిలా నగరవిశేషాలు, అక్కడి విద్యాలయం, పరీక్షిత్తు, జనమేజయుడు, సర్పయాగం (అది నాగులపై జనమే జయుడు చేసిన దండయాత్రగా అర్థంచేసుకోవాలట) ‘హనుమచ్ఛిల్పశాస్త్రం’ లోచెప్పబడిన పాంచాలశబ్ద విశేషం, పాంచాలురంటే (విశ్వ) బ్రాహ్మణులే అనీ, పాంచాలం బ్రాహ్మణరాజ్యమే అనీ, ఆర్యావర్తాన్ని వీడివచ్చిన విశ్వబ్రాహ్మణులు, తెనాలిరామలింగకవి సృజించిన ‘ధీరజనమనోవిరాజితం’ లో చెప్పబడిన పరిమళచోళుని మరియు విశ్వబ్రాహ్మణుల కథ, కళింగదేశంలో జరిగిన ధర్మపాలవృత్తాంతంవంటి కావ్యాలలో మిగిలిపోయి, చరిత్రలో కనుమరుగైౖన విశ్వబ్రాహ్మణుల విషయాలు, ఆనాటి ప్రభువులకు, ఇటు ప్రజలకును ఈ విశ్వబ్రాహ్మల అవసరం ఉండటాన్ని, శాసనలేఖకులుగాను, ఈ మతం ఆ మతం అనకుండా అన్నిమతాలకు విశ్వకర్మలుచేసిన సేవలు, అనుభవించిన వైభవాలు, అందుకున్న కరణీకాలు, కుట్రలపాలై పోగొట్టుకున్న కరణీకాలు, వాద ప్రతివాదాల్లో ప్రతివాదులను ఓడించి పునర్వైభవం సాధించటాలు ` ఇట్లా పెక్కు గ్రంథాలలో తమకు దర్శన మిచ్చిన విశ్వకర్మలకు సంబంధించిన విషయాలెన్నో పరిశోధించి కపిలవాయిగారు ఈ వ్యాసాల్లో అందిం చారు . గురుతుంచుకోదగిన విషయమింకొకటి ` విశ్వకర్మలలో (పంచబ్రహ్మలలో) మొదటివాడైన మనువు (మనుబ్రహ్మ) భుక్తికి, చివరివాడైన దైవజ్ఞుడు ముక్తికి కారణమవుతుండగా ఈ నడిమివారు మానవుని ఇహ యాత్ర సుఖంగా సాగటానికి వస్తువాహన, పాత్రాదులు నిర్మించి సాయపడటం ప్రత్యేకించి ఎత్తిచూపారు.
కృషికర్మను ఒక యజ్ఞంగా, యజ్ఞపురుషుడు ఇచ్చే కామితార్థంగా సస్యాన్ని అభివర్ణిస్తూ ఈ యజ్ఞానికి కావలసిన పరికరాలన్నీ అందించే కమ్మరికొలిమి యజ్ఞవేదిక అవుతుందన్నారు. ఒకవేళ ఆ కర్మశాలలో కృషియజ్ఞానికి కావలసిన ఆయుధాల ఉత్పత్తి కాకపోతే లోకంలో అన్నముండదు. అది భూమిలోనే ఉండిపో తుంది. సస్యరూపంలో చేతికందదు. ఆ యజ్ఞానికి విశ్వకర్మల దోహద మెంతముఖ్యమో చెబుతూ పోయారు కపిలవాయిగారు. విత్తనం భూమిలో చేరగా, భూగర్భంలోని అగ్నితో, యజ్ఞపురుషునిలా అంకురం వెడలి వృద్ధిచెంది సస్యమైనట్లు చెప్పిన పిదప కమ్మరి కొలిమిని యజ్ఞకుండమనటం కొంత ఇరుకయిన విషయమని పిస్తుంది. యజ్ఞావసరాలన్నీతీర్చే విశ్వకర్మనూ, ఆతని కొలిమినీ గొప్పచేసే క్రమంలో ముందేచెîప్పిన కృషి క్రియాక్రమాన్ని వదలివేయటంలో కపిలవాయిగారు ఏమరుపాటుకు గురయ్యారేమో అనిపిస్తుంది.
విశ్వకర్మలగురించి చాలాచాలా చెప్పారీవ్యాసాలలో. ‘విశ్వకర్మమయం జగత’ అనే వ్యాసంలో తమ వైనవీ, యోచింపదగినవీ అయిన అభిప్రాయాలెన్నో చెప్పారు. విశ్వకర్మ అన్న పదంలోనే కర్మ అనే పదం ఉంది. ఆమేరకు కర్మజీవులంతా విశ్వకర్మాంశజులేకాక తప్పదు. జగత్తు అంటే నడిచేది అని అర్థం. మరి కర్మ అనేది లేకపోతే జగత్తుకు నడక ఉండదుగా ! కాబట్టి వృత్తికారులంతా తమతమ వృత్తులు కట్టిపెడితే లోకం అతలాకుతలం అవుతుంది. ఇదంతా చెబుతూ కర్మ అనేది దైవాంశసంబంధి. దాన్ని సవ్యంగా వినియోగించు కోవాలితప్ప అపసవ్యంగా ఉపయోగించరాదనీ హెచ్చరిస్తారు వారు.
అన్ని యుగాలలోనూ భారతదేశానికి సాటిదేశాలలో వన్నె, వాసి తెచ్చింది విశ్వకర్మయొక్క పంచ ముఖోద్భవులైన మనుమయాదుల శిల్పమే అన్నది విస్మరించలేని విషయం. చెప్ప్పుకుంటూపోతే ఎన్నెన్నో ఉదంతాలు విశ్వకర్మ ` అర్థాత్ విశ్వకర్మీయుల సామర్థ్యాన్ని, పరోపకారగుణాన్ని చాటుతున్నాయి.
శ్రీశైలంగురించి చెప్పబోతే శివయ్యను వేరుచేసి చెప్ప్పుకోలేం. తిరుపతినిగూర్చి మాటాడబోతే ఏడుకొండలవానిని దాటుకొని ఏమీ చెప్పలేంకదా ! ఇపుడీ గ్రంథంలో విశ్వకర్మీయులనుగూర్చి చెప్పినా, విశ్వకర్మల కర్మలనుగూర్చి చెప్పినా అంతా విశ్వకర్మమయం జగత్ అన్నట్లుగా అంతా ఆ పరాత్పరుడైన విశ్వకర్మనుగూర్చి చెప్పినట్లే అనుకోక తప్పదు. అట్లా ఆలోచించిన సందర్భంలో వారి ‘నమో నమః కవి పంచాననాయ’ అనే పేర కూర్చిన వారి పద్యసంకలనమÖ చెప్ప్పుకోవలసి ఉంది. తామెరిగిన ఎనిమిదిపదుల పైన విశ్వబ్రాహ్మణకవుల పరిచయం అక్షరబద్ధంచేసి, వర్ణించారు. చదివినవారికి ఆ పరిచయాలు, పరిచయం చేయబడిన కవులకును ఎంతో ఆనందాన్ని పంచగల గ్రంథమిది.
విశ్వకర్మవిలాసంలోని వ్యాసాలవిషయాలన్నీ చూస్తే కడలిని కడవలో నింపటం గుర్తుకొస్తుంది. ఈ వ్యాసాలు కూర్చటానికి వారు ఎన్నెన్ని గ్రంథాలు పరిశీలించారో ! ఇన్ని విషయాలు ప్రోవుచేయటానికి ఎంతెంత ఎక్కడెక్కడ వెదికారో ! అని నివ్వెరపోక తప్పదు. ఈ రచనలో పేర్కొన్న గ్రంథాల పట్టికవేస్తే ఏబదికిపైగా గ్రంథాలు గమనించవచ్చు. ఇక ఆయా గ్రంథాలనుండి పేర్కొన్న వ్యక్తులపేర్లకు లెక్కేలేదు. వాని పట్టికలుచూస్తే చాలు ఈ వ్యాసాల్లో ఎంతెంతగా విశ్వకర్మనుగూర్చిన కథలు వ్రాసిపెట్టారో ఊహించటానికి.
కపిలవాయిగారేది వ్రాసినా విషయమంతనూ ఒక చరిత్రగారూపొందించి వ్రాసినట్లుచూస్తాం. కారణం` వారికి చరిత్ర, పరిశోధన రెండూ ప్రియాతిప్రియాలు. ఆ సంగతి కనిపెట్టినవారెందరో బ్రతిమాలి బామాలి అర్థించి, తమ వంశచరిత్రలు వ్రాయించుకున్న సందర్భాలున్నాయి. చివరగా ఒకమాట, వారిని అందరూ పరిశోధక పంచాననుడంటారు. కాని ఈ విశ్వకర్మవిలాసం చదివాక విశ్వకర్మనుగూర్చి ఇంత పరిశో ధనచేశారుకదా ! ఆయనను పరిశోధకపంచాననుడేకాదు, పంచాననపరిశోధకుడును అనాల్సివస్తుంది. ఈ గ్రంథమంతా పంచాననునిమీది పరిశోధనే మరి. పంచాననుడంటే విశ్వకర్మయే కదా !