మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, అక్టోబర్ 2026, మంగళవారం

మాయాబజార్

శ్రీ మల్లాది రామకృష్ణ శాస్తిగారు పేరు పెట్టిన ‘సరాగమాల’ ప్రారంభమైనప్పుడు... సుమారు నలభై యేళ్ల క్రితం.... ‘సినిమా పాటలను తక్కెడెయ్యడానికి ఒక శీర్షిక కూడానా’ అని విస్తుపోయిన వాళ్లు లేకపోలేదు, విడవక చదివిన వాళ్లతోపాటు. ఇప్పుడు సినిమాపాటలపై చదువుకొనిన వారు, పరిశోధనలు జరిపి డాక్టరేటులు సాధిస్తున్నారు!

ఔరా కాలమహిమ అని నేను విచారించడం లేదు. ముఖేముఖే సరస్వతీ అన్న విషయం విశ్వవిద్యాలయులకీనాటికి తెలిసింది కదా అని సంతోషిస్తున్నాను.

ప్రబంధయుగంలో వసు, మనుచరిత్ర లెంత గొప్పవో, ఆంధ్రుల దేశ చరిత్రలో కాకతీయుల దెంతటి విశిష్టస్థానమో, సంఘానికద్దంపట్టే పద రచనలో సారంగపాణి దెంతటి పెద్ద పీటో, భారతీయ పౌరాణిక చిత్రాలలో తెలుగు “మాయాబజార”ది అంతటిది. అసమదీయల్లారా! సందేహం లేదు.

ఇంతవరకూ sTÖ కథతో భారతీయ “మాయాబజార”, “వత్సలా కల్యాణం” “శశిరేఖా పరిణయం”, “సురేఖాహరణ”, “వీర ఘటోత్కచ” అన్న పేర్లతో వచ్చిన సినిమాలు ఒకటి మÖకీ, పది టాకీలు. వేరే పేర్లతో యిదే కథ రావడానికంత ఆస్కారం లేదు.

మొదటిది మÖకీచిత్రం “మాయాబజార్ ఉరఫ్ సురేఖా హరణ” (1925) దర్శకుడు బాబూరావ్ పెయింటర్. ఇందులో కృష్ణుడు వి. శాంతారాం.  మొదటి టాకీ, హిందీలో పై రెండు పేర్లతోనే 1932లో విడుదలైనది. దర్శకుడు నానుభాయి వకీల్.

మÖడవది అరవంలో ఆర్.పద్మనాభన్ తీసిన “మాయాబజార్ ఉరఫ్ వత్సలా కల్యాణం” (1935) నాల్గవది పి.వి. దాసు తెలుగు చిత్రం “మాయాబజార్ ఉరఫ్ శశిరేఖా పరిణయం”. ఇందులో శాంతకుమారి శశిరేఖ. అయిదవది మరాఠీలో జి.పి.పవార్ నిర్మించిన “మాయాబజార” (1939) ఆరవది హిందీ మరాఠీలలో దత్తా ధర్మాధికారిది  “మాయాబజార్ ఉరఫ్ వత్సలాహరణ” (1949) ఏడవది నానాభాయి భట్ నిర్మించిన “వీర్ ఘటోత్కచ్ ఉరఫ్ సురేఖా హరణ” హిందీలో అదే సంవత్సరం విడుదలయ్యింది. హీరోయిన్‌గా యిది నటి మీనాకుమారికి మÖడవదో నాలుగోదో.

ఎనిమిదవది : తెలుగు తమిళాలలో “శశిరేఖా పరిణయం” “వత్సలా కల్యాణా”లని మొదట తలపెట్టి చివరికి రెండు భాషల్లోను “మాయాబజార” (1957)గానే విడుదలయిన ప్రస్తుతాంశమైన చిత్రం. ఇది పధ్నాలుగేళ్ల తరువాత అదే పేరుతో హిందీలోకి అనువదింపబడింది (1971).

తొమ్మిదవది బాబూభాయి మిస్తీ హిందీలో నిర్మించిన “మాయాబజార” (1958) మన చిత్రం తరువాతి సంవత్సరమే విడుదలై తెలుగు, అరవం, కన్నడ భాషల్లోనికి “వీర ఘటోత్కచ”గా పరివర్తింపబడినది. ఇందు నాయిక అనితా గుహ, పదవది హిందీలో శాంతీలాల్ సోనీ తీసిన “వీర్ ఘటోత్కచ” (1970). 

పదకొండవది తిరిగి బాబూభాయి మిస్తీ తీసిందే “మాయాబజార” (1984) హిందీ గుజరాతీ భాషల్లో, రంగుల్లో.

పాటల పట్టికలు చూస్తే వీటన్నిటిలో శ్రీకృష్ణుడి బాలలీలలపైన ఓ పాట ఉంటుంది. అలానే ‘విధి’ గురించి, ‘భళిభళి’ లాగ. నాయికా నాయకుల యుగళ గీతాలు, నాయిక విరహగీతం సరేసరి. లక్ష్మణకుమారుని ఆట పట్టించేది కొన్నిటిలో, మాయా శశిరేఖ ‘నాపెళ్లటే’ అనేది కొన్నిటిలో. పల్లవి పట్టి చూస్తే నికరంగా యిది ‘రక్షలు రక్ష’ ల్లాంటి మాయాబజార్‌దనే తెలిసేది ‘పురానా దో నయే లో (పాత బట్టలిచ్చేసి కొత్తవి తీసుకోండి) ‘అహ నాపెళ్లంట’ లాంటిది ‘మొహే దుల్హన్ బనాదె సఖీ’ (నన్ను పెళ్ళికూతుర్ని చెయ్యండహే) దత్త ధర్మాధికారి 1949లో నిర్మించిన హిందీ మరాఠీ చిత్రాల్లో ఉన్నవి.

ఎన్నో కథ లిన్నిసార్లు తీసి వుండరు. ఈ కథకింత ప్రాబల్యం ఉండటానికి కారణం? 1930 ప్రాంతాలలో దక్షిణ దేశంలో sTÖ నాటకం హిందీ గుజరాతీ భాషల్లో ధర్వాడ, పార్శీకంపెనీలు వేసినట్టు తెలుస్తున్నది. తెలుగులో మొదటి “మాయాబజార” సినిమా వచ్చిన తరువాత సురభి కంపెనీవారు 1950 ప్రాంతాలలో రాయించుకొన్న నాటకంలో ‘వివాహభోజనంబు’ (ఆ సినిమాలో ఉన్న వరసే, విజయా చిత్రంలో విజయవంతమైన పాటకు దగ్గరి చుట్టమే) పల్లవీ వరసా వాడుకొన్నారు. అంతేకాదు. 1940 తరువాత రెండు గ్రామఫోన్ రికార్డుల కెక్కిన ‘జానకీ శపథం’ హరికథలో - బి.నగరాజకుమారి చెప్పింది - పెళ్లి భోజనాల వర్ణన sTÖ పల్లవితోనే sTÖ వరసలోనే వుంది.

పురాణిక్ ఎన్‌సైక్లోపీడియా, పూర్వగాథాలహరులలో శశిరేఖ, సురేఖ, వత్సల పేర్లే నమోదు కాలేదు. కాబట్టి యిది అష్టాదశ పురాణాలలో లేనిదీ వింధ్య పర్వతశ్రేణి కటూ యిటూగా ప్రచారంలో ఉన్న పుక్కిటి పురాణమనీ ఊహించవలసి వుంటుంది. కాని కథలో చోటు చేసుకున్న మంత్ర తంత్రాలూ, వీర శృంగారాలు, అద్భుత బీభత్సరసాలూ, అంతర్లీనంగా ప్రవహించిన కరుణా, శ్రీకృష్ణుని వలన శిష్టులకు లభించిన రక్షా, దుష్టులకు ప్రాప్తించిన శిక్ష చూపరులనన్నివిధాలుగా తృప్తిపరచ గలిగేవి. అదీ దీని ఆరు దశాబ్దాల ప్రాచుర్యానికి కారణం.

ఈ వస్తువుతోనే కాస్త మారుతారుగా తయారైన “మరో మాయాబజార” “ఘటోత్కచుడు” sTÖ సన్నివేశాలను ఉపయోగించుకొన్నవే. ఇన్నేళ్లుగా యిన్నిరకాలుగా యావద్భారతాన్ని అలరిస్తున్న sTÖ కథకు మÖలమేమిటీ అన్న విషయం ఎవరూ ఆలోచించినట్లు లేదు. ప్రాంతీయ పురాణమైతే ఏ ప్రాంతం? ఏ కవికపోల కల్పితమో అయితే ఎవరా కవి? ఏమా రచన? ఎప్పటిది? ఇవన్నీ తెలుసుకోవడం ఊకదంపుడు కాదు. సాహిత్య మÖలక్షీరమథనమే. దీనికి కావలసింది ఆ మంధర కవ్వాన్ని మÖపున మోయగలిగిన మంధరధరుడే. ఆ తరుణం కావాలి. ఆ ప్రయత్నానికి నాంది పలుకగలదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి