మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, అక్టోబర్ 2026, మంగళవారం

ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?.....ఈనాటి ఈ బంధం ఏనాటిదో

ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది

ీVAరున వీచే గాలికా.. చిరుగాలికా..

ఉరకలు వేసే నీటికా.. సెలయేటికా..

ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?

‘ఈనాటి ఈ బంధం ఏనాటిదో’ సినిమాకు కథ అందించిన మన్నవ బాలయ్య స్వయంగా రచించిన గీతం ఇది. “ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ...” అని ఇదే సినిమాకు పాట రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే “ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?” గీతరచన కూడా చేశారని చాల మంది భావించారు. ఆ విధంగా బాలయ్యకి రావల్సిన పేరు రాలేదు. 

‘ఈనాటి బంధం ఏనాటిదో’ సినిమా నాటికి బాలయ్య సుమారు 20 ఏళ్ల నుంచి నటుడిగా కొనసాగుతూనే ఉన్నారు. అప్పటికి ఆరేళ్ల క్రితమే నిర్మాతగా కూడా మారారు. అంత అనుభవం, పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ కూడా గీత రచయితగా ఆయన అజ్ఞాతంగా ఉండిపోవల్సి వచ్చింది. మామÖలుగా నటులు, ఇతరేతర సాంకేతిక నిపుణులు కథకులైతే, రచయితలైతే అవధులు మించిన ప్రచారం వస్తుంది. ఇక వాళ్ళు పాటలు కూడా రాస్తే, వారి పేరు ీVAరెత్తుతుంది, బహుముఖప్రజ్ఞాశాలి, సకల కళావల్లభులు వగైరా కీర్తి కిరీటాలతో. కానీ, నటుడు, నిర్మాత కూడా అయిన బాలయ్య ఎందుకు అజ్ఞాత రచయితగానే మిగిలిపోయారు? 

’An artist’s recognition for their work is intrinsically tied to their identity and legacy’- అంటారు. ఒక సృజనాత్మక రచనను మరొకరికి, ముఖ్యంగా ఒక లబ్ధప్రతిష్టుడికి ఆపాదించినప్పుడు, ఒక లోతైన అదృశ్య భావన అంటే unjustified  invisibility కి దారితీస్తుంది. ఆ  invisible author అనుభవం - బాలయ్యలో ‘ఈనాటి బంధం ఏనాటిదో’ సినిమా వల్లనే కలిగింది అని చెప్పడానికి లేదు. మనకి తెలిసింది అదేబీ కానీ,  plagiarism అనే వెయ్యికొండెల ఆక్టోపస్ తిరుగాడే సినీ ప్రపంచంలో అప్పటికే 20 ఏళ్లుగా ఉంటున్న బాలయ్యకి అటువంటివి ఎన్ని ఎదురయ్యాయో, అంతకంటే చేదు అనుభవాల్ని ఆయన ఎన్ని చవిచూశారో. ఆ తెరచాటు ‘అదృశ్య రచయిత’  అనుభవం బహుశా బాలయ్యలో తన భవిష్యత్ సృజనాత్మక ప్రయత్నాలను తనవిగా లోకం గుర్తించేలా ఒక లోతైన, బహుశా అత్యవసరమైన ప్రయత్నాల దిశగా ఆయనని నడిపించి ఉండొచ్చు. ‘నా అస్తిత్వానికి సంబంధించిన  నిజం ఎవరికి తెలుస్తుంది?’ అనే ఈ అంతర్గత సంఘర్షణ, ఆయనని నిర్మాణ- దర్శకత్వాల వైపు నడిపించిన ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేసి ఉండవచ్చు.

ఇంతకుముందు చెప్పుకున్నట్టు - plagiarism  కేవలం మన తెలుగు సినీరంగానికి మాత్రమే పరిమితమైనది కాదు. Ghostwriters, Uncredited Screenwriters - హాలీవుడ్ లో కుప్పలుతెప్పలుగా ఉన్నారు. బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలకి, బ్లాక్ బస్టర్ సినిమాలకి వెనక ఉండేదంతా వారే. creenplay ని మెరుగుపరచడానికి లేదా వాటిని పూర్తి చేయడానికి నియమించబడే అసంఖ్యాక “స్క్రిప్ట్ డాక్టర్లు” లేదా uncredited  రచయితల గురించి ఆలోచించండి. వారు తమ సృజనాత్మకత, సంభాషణలు మరియు ప్లాట్ ఆలోచనలను projects లో దట్టిస్తారు. అయితే చివరి క్రెడిట్ అసలు రచయితకు లేదా దర్శకుడికి వెళ్తుంది. వారి పని తుది ఉత్పత్తికి అంతర్భాగంగా మారుతుందే గానీ, దాని అసలు సృష్టికర్తగా వారి గుర్తింపు తొలగించబడుతుంది. అలా తెరచాటున మగ్గిపోతారే గానీ, చిన్నపాటి అభినందన, ప్రజాభిమానానికి కూడా నోచుకోరు. 

dmond RostandరచించినCyrano de Bergerac అనే క్లాసిక్ నాటకం-  invisible author  కలిగించే వ్యథ, మానసిక నష్టాన్ని సజీవంగా చిత్రీకరిస్తుంది. 

ఆ నాటకంలో protagonist - Cyrano ఒక అద్భుతమైన కవి, మాటల మాంత్రికుడు.Roxane ని ప్రగాఢంగా ప్రేమిస్తాడు. కానీ వికారంగా అనిపించే తన గద్ద ముక్కు కారణంగా తన భావాలను నేరుగా వెల్లడించడానికి సంకోచిస్తాడు. అందుకోసం అందమైన యువకుడుChristian ని తన ప్రేమవ్యక్తీకరణకి ఒక వాహికగా వాడుకుంటాడు. =శీఞaఅవ ని ఆకట్టుకోవడానికి క్రిస్టియన్ కి సహకరిస్తాడు. ఏ మాత్రం మాటకారి, సరస సంభాషణా చాతుర్యం లేని క్రిస్టియన్ పేరుతో ప్రేమలేఖలు, ఉద్వేగభరితమైన ప్రసంగాలను వ్రాస్తాడు సైరనో.  సైరనో తన హృదయాన్ని, తన తెలివిని మరియు రోక్సాన్ పట్ల తన గాఢమైన ప్రేమను ఈ మాటలలో నింపుతాడు. ఆమె ఆ ప్రేమలేఖలు, ఆ మాటల ప్రేమలో పడుతుంది - సహజంగానే ఆ పదాలన్నీ పూర్తిగా క్రిస్టియన్ వే అనుకుంటుంది. ఆ తీయని ప్రేమకథకు అసలు రచయిత  సైరనో, అయినప్పటికీ అతను తెరవెనుక అదృశ్యంగా మరియు వినిపించకుండా ఉండిపోతాడు, తన మాటలను ప్రేమించే తన ప్రేయసి, తన గుర్తింపును కాకుండా, మరొకరిని ప్రేమించడాన్ని చూసి నొప్పిని అనివార్యంగా అనుభవిస్తాడు. తన సొంత ప్రేమకథను ghostwrite  చేయడం సైరనోకు లోతైన అంతర్గత సంఘర్షణకు దారితీస్తుంది. రోక్సాన్ హృదయాన్ని గెలుచుకోవడంలో తన నిజమైన కళాత్మకతకు అతనికి ఎటువంటి గుర్తింపు లభించదు, తన మాటలు, తన ఆత్మ, మరొకరికి ఆపాదించబడుతున్నప్పుడు కలిగే నిశ్శబ్ద వేదన మాత్రమే. సైరనో పరిస్థితులు అతని ప్రేమకథకు ప్రత్యేకమైనవి అయినప్పటికీ, అంతర్లీన సూత్రం ఒక కళాకారుడికి సమానంగా ఉంటుంది: “నా నిజం ఎవరికి తెలుస్తుంది?” అనే భావన! అది    తరచుగా అటువంటి కళాకారులు, రచయితలలో తమను తాము స్థాపించుకోవాలని, తదుపరి ప్రాజెక్ట్ పూర్తిగా తమదేనని అనిపించుకోవాలనీ బలమైన కోరికను రేకెత్తిస్తుంది. వారిని showrunnersగా,  నిర్మాతలు లేదా దర్శకులుగా మారుస్తుంది.

కాబట్టి, ‘ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?’ పాట పరంగా బాలయ్యని చూస్తే, అందులో బాలయ్య స్వకీయత కూడా ఉందనుకోవచ్చు: “ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?/ నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది”- అని ఊగిసలాడింది బాలయ్య మనసు, సుదీర్ఘమైన తన సినీ జీవితంలో. ఒక నటుడు-  నిర్మాత కావడం సహజమే. తమ కెరీర్ కోసం, పురోగతి కోసం నటులు  నిర్మాతలుగా మారిన చరిత్ర ఉంది. తన ఆలోచనలకి, ఆశయాలకీ, తన కథలకి దృశ్యరూపం ఇచ్చేందుకు నిర్మాణ, దర్శకత్వ విభాగాల్లోకి ప్రవేశించిన వారిలో బాలయ్య ఒకరుగా గుర్తించబడ్డారు. ఇంకా లోతుగా చూస్తే, అదృశ్య రచయితగా, అజ్ఞాత సృజనకారుడిగా తెరచాటున మిగిలిపోవడానికి కారణమైన అనుభవాల్ని సవాల్ చేస్తూ బాలయ్య నిర్మాత -దర్శకుడు అయ్యారని అనుకోవచ్చు. 

Aaron Sorkin, Shonda Rhimes- వంటి హాలివుడ్ సాంకేతిక నిపుణుల అనుభవాలు కూడా ఇటువంటివే. ఆరోన్ సోర్కిన్- తన విలక్షణమైన రచనకు ప్రసిద్ధి చెందినవాడు. కానీ, అంతకుముందు ఆయన పాత్ర తెరమరుగున ఉన్నదే. తర్వాత తన ప్రాజెక్టులలో చాలా వాటికి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. అలానే షాండా రైమ్స్! ఒక రచయిత్రి స్థాయి నుండి మొత్తం పర్యవేక్షించే శక్తివంతమైన షోరన్నర్, నిర్మాతగా కూడా మారింది ఆమె. అటువంటి అన్వేషణ, తపనల ప్రత్యక్ష ఫలితమే బాలయ్య సుదీర్ఘ సినీజీవితంలోని బహుముఖప్రజ్ఞకి దారితీసింది అనవచ్చు.

నిజానికి మన్నవ బాలయ్య సినీ ప్రపంచంలోకి ప్రవేశమే అసాధారణమైనది. ఆయన చెన్నైలోని గిండీ ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు. ఈ సాంకేతిక నేపథ్యం -  ఒక క్రమబద్ధమైన, తార్కిక ఆలోచనతో పాటు ద్రవ, సహజమైన సృజనాత్మకతను కలిగి ఉన్న మనస్సును సూచిస్తుంది. సినీరంగంలోకి ఆయన ప్రవేశం actఱఅస్త్ర scష్ట్రశీశీశ్రీs ద్వారా జరగలేదు, బదులుగా కళాశాల నాటకాల ద్వారా ప్రేరణ పొందింది.  

‘I’ve learned it’s important not to limit yourself. You can do whatever you really love to do, no matter what it is’  అంటాడు, ప్రముఖ నటుడు Ryan Goslingబాలయ్య బహుముఖ ప్రజ్ఞను  ర్యాన్ గోస్లింగ్ మాటలు ప్రతిఫలిస్తాయి.  ఒకే రకమైన మÖస పాత్రలకు పరిమితం కాకుండా విభిన్న పాత్రలను స్వీకరించడానికి ఆయనకున్న సుముఖతకు గోస్లింగ్ కోట్ సరిగ్గా సరిపోతుంది. బాలయ్య ఇంజనీరింగ్ నేపథ్యం వల్ల అబ్బిన విశ్లేషణాత్మక ఆలోచన - adaptability, మానవ మనస్తత్వం మీద లోతైన అవగాహన కలిగించాయి. చిత్ర నిర్మాణ దక్షతకి అది తొలి పునాది. ఒక ఇంజనీర్ మనస్సు సినిమా నిర్మాణంలోని సాంకేతిక, లాజిస్టికల్, సంస్థాగత సంక్లిష్టతలను గ్రహించగలదు. నటుడిగా ఆయన అనుభవం కథనం నిర్మాణం, పాత్ర అభివృద్ధి, భావోద్వేగ ప్రామాణికత మరియు నటనలోని సూక్ష్మ నైపుణ్యాల మీద విలువైన అంతర్దృష్టిని అందించింది. ఆ సమ్మిశ్రితం, ఆ బహుముఖ ప్రజ్ఞ ఫలితం ఏమిటంటే - బహుళ ప్రతిభను కలిగి ఉండటం కాదుబీ ఇది సినిమా నిర్మాణాన్ని వివిధ కోణాల నుండి సమగ్రంగా, బహుళ-పరిమాణాల అవగాహనతో చూడగలగడం నేర్పింది బాలయ్యకి. ఈ సామర్థ్యం, ఒక దర్శకుడికి అత్యంత కీలకం, ఎందుకంటే అది సినిమాను కేవలం కళగా కాకుండా, సూక్ష్మంగా ప్రణాళిక చేయబడిన మరియు అమలు చేయబడిన కళగా చూడటానికి అనుమతిస్తుంది.

Walt Disney అంటాడు: ‘‘We don’t make movies to make money. We make money to make more moviesµ అది బాలయ్యకి అతికినట్టు సరిపోతాయి. 1970లో బాలయ్య తన స్వంత నిర్మాణ సంస్థ, ‘అమృత ఫిల్మ్స’ను స్థాపించారు. ఈ సంస్థ ఒక వ్యాపార సంస్థ కాదు, ఆయన తన సమగ్ర సృజనాత్మక ఆశయాలను నెరవేర్చుకోవడానికి కీలకమైన వాహిక. ఇది ఆయనకు కోరుకున్న స్వయంప్రతిపత్తిని అందించింది. ఒక నిర్మాణ సంస్థను స్థాపించడం మరియు నిర్వహించడం అనేది బలమైన కళాత్మక దృష్టిని మాత్రమే కాకుండా, గణనీయమైన వ్యవస్థాపక నైపుణ్యాన్ని, ఆర్థిక నష్టాన్ని భరించడానికి సుముఖతను, బలమైన ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలను కూడా కోరుతుంది. ఈ చర్య బాలయ్య యొక్క కళాత్మక దృష్టికి అతని నిబద్ధత ఎంత లోతైనదో చూపిస్తుంది. అలా సమర్థవంతంగా “వ్యవస్థాపక కళాకారుడు” అయ్యారు బాలయ్య. బాహ్య పరిమితులు లేకుండా తన సృజనాత్మక output కి మద్దతు ఇవ్వడానికి, దానిని ప్రకటించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించారాయన. ఇది కేవలం నటన లేదా రచనకు మించి ఉంటుంది.

బాలయ్య మనసులో చెలరేగే సంక్షోభాలకి, సంచలనాలకీ ఆయన తీసిన తొలి చిత్రం ‘చెల్లెలి కాపురం’ సరైన దర్పణం. ఆ చిత్రకథ plagiarism  గురించే. అది ఓ అదృశ్య కళాకారుడి, అజ్ఞాత రచయిత ఆత్మకు అద్దం. నల్లని అనాకారి అయిన ఓ కవి రచనలు - ఒక మోసగాడి పేరిట చలామణి అవుతాయి. అది సంక్లిష్టమైన నైతిక,  భావోద్వేగ సమస్యలకు దారితీయడం అనే కథాంశాన్ని కలిగి ఉంటుంది - ‘చెల్లెలి కాపురం’ సినిమా. ‘చెల్లెలి కాపురం’ కేవలం ఒక వాణిజ్య లేదా వినోద ప్రాజెక్ట్ కంటే చాలా ఎక్కువబీ ఇది ఒక లోతైన వ్యక్తిగత కళాత్మక ప్రకటన, కళాత్మక గుర్తింపు, ఇంకా సమగ్రతకి సంబంధించిన లోతైన సవాళ్లపై ఒక రకమైన విమోచన లేదా బహిరంగ వ్యాఖ్యానం. తన స్వంత నిర్మాణ సంస్థ కింద ఈ నిర్దిష్ట కథను తెరపైకి తీసుకురావడం ద్వారా, బాలయ్య సృజనాత్మక నియంత్రణ గురించి చాటి చెప్పడమే కాకుండా, తన స్వంత జీవిత అనుభవాలతో లోతుగా ప్రతిధ్వనించే కథనాన్ని గణనీయమైన రీతిలో ప్రదర్శించారు. అంటే ఆ సినిమా వ్యక్తిగత పోరాటాన్ని సార్వత్రిక కళగా మార్చింది, చిత్రం యొక్క ప్రాముఖ్యతను దాని plot కి మించి కళాకారుడి ప్రయాణం, గుర్తింపు కోసం శాశ్వత అన్వేషణ గురించి ఒక మెటా-కథనంగా మార్చింది.

ఆ సినిమా కథకి ఆధారం బాలయ్య స్వయంగా రచించిన నాటకం “నలుపు తెలుపు”. నిర్మాతగానే కాకుండా, ఉత్తమ కథకుడిగా  ప్రతిష్టాత్మక నంది అవార్డును గెలుచుకున్నారు బాలయ్య ఆ చిత్రానికి. ఆ నేపథ్యంలోంచి “ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?/ నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది” పాట రచనని తరచి చూస్తే, బాలయ్య వ్యక్తిత్వం, మÖర్తిమత్వం ఆవిష్కారమౌతాయనడంలో సందేహమేముంది.







దీశ్రీuతీb: 

‘ఈనాటి ఈ బంధం ఏనాటిదో’ సినిమాకు కథ అందించిన మన్నవ బాలయ్య స్వయంగా రచించిన గీతం ఇది. “ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ...” అని ఇదే సినిమాకు పాట రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే “ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?” గీతరచన కూడా చేశారని చాల మంది భావించారు. ఆ విధంగా బాలయ్యకి రావల్సిన పేరు రాలేదు. 

ఒక సృజనాత్మక రచనను మరొకరికి, ముఖ్యంగా ఒక లబ్ధప్రతిష్టుడికి ఆపాదించినప్పుడు, ఒక లోతైన అదృశ్య భావన అంటే uఅjustఱfఱవd ఱఅఙఱsఱbఱశ్రీఱty కి దారితీస్తుంది. ఆ ‘ఱఅఙఱsఱbశ్రీవ autష్ట్రశీత్ణీ అనుభవం - బాలయ్యలో ‘ఈనాటి బంధం ఏనాటిదో’ సినిమా వల్లనే కలిగింది అని చెప్పడానికి లేదు. మనకి తెలిసింది అదేబీ కానీ,  జూశ్రీaస్త్రఱaతీఱsఎ అనే వెయ్యికొండెల ఆక్టోపస్ తిరుగాడే సినీ ప్రపంచంలో అప్పటికే 20 ఏళ్లుగా ఉంటున్న బాలయ్యకి అటువంటివి ఎన్ని ఎదురయ్యాయో, అంతకంటే చేదు అనుభవాల్ని ఆయన ఎన్ని చవిచూశారో. 

‘ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?’ పాట పరంగా బాలయ్యని చూస్తే, అందులో బాలయ్య స్వకీయత కూడా ఉందనుకోవచ్చు: “ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?/ నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది”- అని ఊగిసలాడింది బాలయ్య మనసు, సుదీర్ఘమైన తన సినీ జీవితంలో.  తన ఆలోచనలకి, ఆశయాలకీ, తన కథలకి దృశ్యరూపం ఇచ్చేందుకు నిర్మాణ, దర్శకత్వ విభాగాల్లోకి ప్రవేశించిన వారిలో బాలయ్య ఒకరుగా గుర్తించబడ్డారు. ఇంకా లోతుగా చూస్తే, అదృశ్య రచయితగా, అజ్ఞాత సృజనకారుడిగా తెరచాటున మిగిలిపోవడానికి కారణమైన అనుభవాల్ని సవాల్ చేస్తూ బాలయ్య నిర్మాత -దర్శకుడు అయ్యారని అనుకోవచ్చు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి