తన రచనలకు తానే అభిప్రాయాన్ని రాసుకోవడం లేదా ఇతరుల రచనలకు తాను రాసిన అభిప్రాయాన్ని ‘ముందుమాట, ఆముఖం, తొలిపలుకులు, పీఠికలు’ అని అంటారు. డా. కపిలవాయి లింగమÖర్తి గారు ఇతరకవుల రచనలకు ఔదార్యమైన అభిప్రాయాలను రాసారు. వాటినే ఆయన ‘పీఠికలు’ అని చెప్పుకున్నారు. ముందుమాట, అవతారిక, ఆముఖం, తొలిపలుకులు మొదలైన మాటలకంటే సాహిత్యలోకంలో ‘పీఠికనే’ ప్రాచుర్యం పొందింది. ఫార్వర్డ్, ప్రెఫెస్ అనే ఆంగ్లపదాలకు ‘ముందుమాట, తొలపలుకులు, మున్నుడి’ అనే అర్థాలున్నాయి. ఇదే అర్థం పీఠికలకు వర్తిస్తుంది. పీఠికకు పర్యాయంగా ఉపోద్ఘాÛతం, అవతారిక, భూమిక, ప్రస్తావన, ఆముఖం, అనే మాటలు వినియోగంలో ఉన్నాయి. చలం మాత్రం శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యానికి ‘యోగ్యతా పత్రం’ అనేమాటను వాడారు. ఇది ప్రయోగమే. ఇలాంటి ప్రయోగం కపిలవాయిగారు చేసారు. కొందరు సాహిత్యకారులు ప్రస్తావన, ఉపోద్ఘాతం, భూమిక, పరిచయం అనే పదాలను వినియోగిస్తూ ముందుమాటలు రాసారు.ఈ మధ్య అభినందనలు, ఆశీస్సులు, శుభాకాంక్షలు అంటూ కూడా రాస్తున్నారు. తెలుగు పీఠికలపై పరిశోధన చేసిన
డా. చంద్రశేఖర్రెడ్డిగారు పుస్తకానికి రాసిన ముందుమాటలలోని చాలా పదాలకు సాధికారికమైన
ఉదాహరణలను తెలిపారు.
పీఠికలు ప్రధానంగా రెండురకాలు. 1. కవి తనకు తానుగా తనరచనా విశేషాలను రాయడం, 2. ఇతరుల రచనలను పరిశీలించి ఆ రచనా విశేషాంశాలను రాయడం.
పీఠికలు ప్రారంభంలో పద్యరచనలో ప్రారంభమై, వచనంలోకి, వ్యాసంలోకి మారాయి. అవి ఎన్ని పేజీలలో ఉండాలి? ఎంతనిడివి ఉండాలనే నియమం లేదు. ఇప్పుడంటే రెండు మÖడు పేజిలలో రాస్తున్నారు.
పీఠికలు - నేపథ్యం
‘పీఠిక’ ప్రక్రియగా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించడానికి పాశ్యాత్య సాహిత్య ప్రభావం
ఉంది. ముద్రణకు రచనలు ఎప్పుడు నోచుకున్నాయో ‘పీఠిక’ కూడా ఆసమయంలోనే ప్రారంభమైంది.
భారతదేశంలో ముద్రణ ప్రారంభమైంది క్రీ.శ. 1560 లో మొదట ముద్రణ యంత్రాలను పోర్చుగీసువారు గోవాలో ప్రారంభించారు. అయితే క్రీ.శ. 1560లో ‘ది స్పిరిచ్చువల్ కాపీడియం ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ’ ముద్రించబడింది. దీనిని బాస్టర్ డీలియో రాసారు. పాశ్చాత్యులు భారతదేశంలో మిషనరీ విద్యావ్యవస్థను ప్రారంభించడం వల్ల ముద్రణ అనివార్యమైంది. ఫలితంగా మద్రాసు, కలకత్తా, బొంబాయిలలో ముద్రణా యంత్రాలు స్థాపించబడినాయి. పుస్తకముద్రణ వికసించింది. వందలాది పుస్తకాలు ముద్రితమయ్యాయి. కీ.శ 1746`47 జర్మనీలో హాలే అనే పట్టణంలో తెలుగులో ‘మోక్షాని కొంచ్చు పొయ్యే దోవ’ ముద్రించబడింది. తెలుగులో ఇంచు మించుగా కీ.శ. 1800 తర్వాతనే ముద్రణ ప్రారంభమయ్యింది. మద్రాసు రాష్ట్రంలో ఈస్టిండియా కంపనీ ఉద్యోగులకు తెలుగుభాష నేర్పించాలంటే వ్యాకరణం అవసరం అయ్యింది. అందుకే మొదటగా వ్యాకరణం పుస్తకాలను ముద్రించారు.
తెలుగు సాహిత్యగ్రంథాలను వెలికి తీసి, వాటిని పరిష్కరించి, ముందుమాటలను రాసి ముద్రించిన ఘనత సి.పి.బ్రౌన్కే దక్కుతుంది. ఈస్టిండియా కంపని నుంచి ఉద్యోగిగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి తెలుగు కావ్యాలను పరిష్కరించి ముద్రించడం ప్రవృత్తిగా చేసుకున్నాడు. రచనలకు ముద్రణా సంస్థలు ‘పీఠికలు’ రాయడం బహుశా సి.పి. బ్రౌన్ నుంచే ప్రారంభమైందేమో. ఆయన తెలుగులో వ్యాకరణ గ్రంథాలను, నిఘంటువులను, ప్రబంధాలను ఇంకా ఎన్నో సాహిత్య రచనలను ముద్రించాడు.
పీఠికలు కేవలం రచనకారుల ముఖస్తుతి చేయడానికో, నిందించడానికో కాదు. లేదా ఎవరిరచనను వారు గొప్పగా చెప్పుకోవటానికో కాదు. ‘పీఠిక’ ఆ రచన విశేషాలను, సమకాలీన స్థితిగతులను, కవితావిశేషాలను తెలిపేదిగా ఉండాలి. అతియోశక్తిగా ఉండకూడదు. ఆంగ్లంలో కూడా పీఠికలకు నిర్వచనాలు ఉన్నాయి.
1. preface an introduction at the beginning of a book explaining its purpose. Thanking people who helped the author (cambridge Dictionary) 2. (Foreword) a short piece of writing at the beginning of a book, Sometimes Praise by Famous Person or someone who is not the writer.
నన్నయ తన శ్రీమధాంద్రమహాభారతానికి ‘అవతారిక’ రచించాడు. అందులో పూర్వకవిస్తుతి, ఇష్టదేవతాస్తుతి, రచనాప్రవేశానికి కారణాలు, ఆనాటి స్థితిగతులు, రాజరాజ నరేంద్రుని పరిపాలనా విశేషాలను అవతారికలో పేర్కొన్నాడు.
చలం, శ్రీశ్రీ మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం రాస్తూ అందులో రచనా విశేషాలతో పాటు సమకాలీన స్థితిగతులు పేర్కొంటూ కవిత్వపుకాలం అంతమయింది. నగలూ, అపురూపకళలూ, సూర్యకిరణాల్ని ఎరగని అందాలు గతిస్తున్నట్టే కవిత్వమÖ గతించింది. కవిత్వానికి కూడా తన ప్రయోజనం తానే చెప్పుకోవలసిన గతి పట్టింది. ‘ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందకు
ఉంది? ఏంచేస్తోంది?’ అని దిఖ్ఖరించి అడిగితే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్త్యుత్తరం’ అని చలంగారు రాసారు. అందుకే చలం యోగ్యతా పత్రం చదివితే చాలు మహాప్రస్థానం చదవనవసరం లేదన్నంతగా పేరు వచ్చింది. కనుక ‘పీఠికలనేవి ముఖం చూసుకునే అద్దం లాంటివి’. అవి రచనాకారుడి అంతరంగాన్ని, రచన ఉద్దేశాన్ని ఆవిష్కరిస్తాయి.
‘పీఠికలు’ మొహమాటానికో, అభినందించటానికో కాదు, రచనాకారుడి శ్రమను, కవితా విశేషాలను వెల్లడించడానికి ఉపయోగపడతాయి.
శ్రీనాథుని ‘శ్రీ భీమేశ్వరపురాణము’ కావ్యానికి ‘అనుశ్రుతి’ అనే పీఠిక రాస్తూ ఎన్నో విశేషాలను తెలిపాడు డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ.
పింగళిసూరణ కళాపూర్ణోదయము కావ్యానికి ‘సూరనార్యుడు’ శీర్షికతో పీఠికరాస్తూ ఈ గ్రంథము సరస మద్భుతమునై మనోరంజకమగు ననుట ధ్రువము. నేటికి సాటి లేక యద్వితీయమై విలసిల్లెడి ఈ మహాకావ్యమాచంద్రార్కమాంధ్ర సరస్వతి కంఠ మలంకరించు గాక’ అని మల్లాది సూర్య నారాయణశాస్త్రి గారు పేర్కొన్నారు.
శ్రీశ్రీ, గజ్జల మల్లారెడ్డి శంఖారావానికి పీఠిక రాస్తూ మల్లారెడ్డి కవిత్వం ఇప్పటికే బహుజనాదరణ పొందింది. ఇవాళ నేను దీన్ని ప్రత్యేకంగా సిఫారసు చేయవలసిన పనిలేదు. ఏదో లాంఛన ప్రాయంగా నాకు తోచిన నాలుగు ముక్కలు రాసి నా ఆనందాన్ని పాఠకులందరితోనూ పంచుకోవడానికి ప్రయత్నించాను, మంచికవిత్వం తన్నుతానే రికమెండ్ చేసుకుంటుంది అన్నాడు. కొంతమంది రచనాకారులు గొప్పగొప్ప కవులతో పీఠికలు రాయిస్తారు. ఎందుకుంటే ఆ రచనలకు గొప్పతనం చేరుతుందని, గొప్పవాళ్లతో పీఠిక రాయించడం రచనాకారుడికి గొప్ప ఆనందాన్నిస్తుంది.
శ్రీశ్రీ అన్నట్టు రచన శిల్పంతో కూడి ఉంటే జనాదరణ పొందుతుంది. కేవలం గొప్పకవులు పీఠికలు రాసినంతమాత్రాన అవి గొప్ప రచనలుగా నిలబడలేవు.
కొందరు గొప్ప కవి పండితులు గొప్పకవుల, రచనలకే పీఠికలు రాస్తారు. దారినపోయే దానయ్యలకు రాయరు. పేలవమైన రచనలకు ‘పీఠికలు’ రాస్తే వారి ప్రతిభాపాఠవాలకు విఘాతం కలుగుతుందనే భావన ఉంటుంది. మరికొందరు సంఖ్యా నియమానికి లోనయ్యి అడిగిన ప్రతిరచనాకారుడి రచనకు ‘పీఠిక’ రాసి తమ ఔదార్యం నిలుపుకుంటారు. ఇంకొందరు రచనాకారులను ప్రొత్సహిస్తూ పీఠికలు రాస్తారు.
కపిలవాయి లింగమÖర్తిగారు పాతకాలానికి, కొత్తకాలానికి పరిచయం ఉన్న కవి పండితుడు. అందుకే వర్తమాన కవులను ప్రోత్సహించాడు. ఎన్నోరకాలుగా సాహిత్య, పరిశోధక సందేహాలను చాలా ఓపికగా తీర్చుతూ ఉండేవారు. నాగర్ కర్నూల్ చుట్టు పక్కలనే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలోని ప్రాంతాలనుండి వచ్చేసాహిత్యాభిలాషులకు సహాయం చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. అందువల్ల యువకవులను ప్రోత్సహిస్తూ పీఠికలను మొక్కుబడిగా కాకుండా రచనలలోని విశేషాంశాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. కొందరి రచనలలో చారిత్రక విశేషాలను వెలువరించారు.
కపిలవాయి లింగమÖర్తి గారు పుస్తకాలకు రాసిన పీఠికలను జాగ్రత్తగా భద్రపరచి ఈ మధ్య కొన్నింటిని ‘కపిలవాయి పీఠికలు’ అనే శీర్షికతో ప్రచురించాడు వారి కుమారుడు సాహిత్య పిపాసి¾ శ్రీ కపిలవాయి అశోక్బాబు. తండ్రి రచనలను సృష్టిస్తే కుమారుడు నిత్యచైతన్యుడై వాటిని ప్రచురించే కార్యక్రమాన్ని స్వీకరించాడు. అశోక్బాబు తండ్రిలాగే కవి అయితే ఆయన రచనల ద్యాసే ఉండేది. కానీ, తండ్రిగారి రచనల ప్రచురణను తన బాధ్యతగా స్వీకరించారు కనుక అవి నిరాటంకంగా ప్రచురణకు నోచుకుంటున్నాయి.
కపిలవాయిలింగమÖర్తి అశోక్ బాబుకు ఆర్థికసంపదకంటే రచనా సంపదను కానుకగా ఇచ్చారు. కనుక అది అశోక్బాబు పర్యవేక్షణలో జాగ్రత్తగా ఉంటుంది. అదే ఆర్థిక సంపద అయితే తరిగిపోయేది. ఈ సందర్భంగా వారిని అభినందించాలి. ‘కపిలవాయి పీఠికలు’ పుస్తకంలో అరవైమÖడు మందికవుల రచనలకు పీఠిక£లు ఉన్నాయి. వాటినే నే నేను పరిశోధనా వ్యాసానికి తీసుకున్నాను.
ఇందులో ఇమ్మిడిశెట్టి చంద్రయ్య రచించిన ‘మృత్యుంజయ శతకానికి’ కపిలవాయి లింగమÖర్తి అనేక విశేషాలతో ‘ఆముఖము’ శీర్షికతో రాసిన మాటలు మÖలరచనకు ఫ్రౌఢతను కలుగజేస్తున్నాయి. ‘అసతోమా సద్గ్గమయ ` తమసోమా జ్యోతిర్గమయ `మృత్యోర్మా అమృతంగమయ’ ఈ శ్లోకాన్ని సందర్భాను సారంగా ఉదహరిస్తూ, జీవుడు, జీవునిగా ఉన్నంత వరకు మృత్యువు తప్పదు. అది తప్పినంత కాలము తద్భయము కూడా తప్పదు. అతనికి ఆ భయముకంటే మించిన భయంకర భావన మరియొకటి ఉండదు. అందువల్ల అతడు మరణ భయము నుండి విముక్తుడై యమృతత్వము నందవలసి ఉన్నది. అట్టి స్థితినే ముక్తి లేక మోక్షమని అందరు అన్నారు. చరమాంకంలో మనిషికి మరణభయము ఉంటుంది. మనిషి మరణాన్ని ఎలా జయించాలనేదే ‘మృత్యుంజయ శతకము’ వెల్లడిస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని కపిలవాయిగారు శ్లోకం చెప్పారు. కవికి అద్వైతదృష్టి ఉండాలని, అది ఇమ్మడిజెట్టి చంద్రయ్యలో కనిపిస్తుందని చెప్పాడు. కవి ఉద్దేశాన్ని పసిగట్టి పీఠిక రాయడం గొప్పగా అనిపిస్తుంది.
‘ఆఫీసు తత్త్వాలు’ పెంటమరాజు నరసింగరావు రచించాడు. దీనికి కపిలవాయిగారు ‘తత్త్వదర్శనం’ పేరులో ఆ రచనావిశేషాలను తెలిపాడు. ‘తత్త్వం’ అనేపదాన్ని నిర్వచిస్తూ తత్త్వం ఒక వస్తువు యొక్క నిజ స్వరూపం. తత్త్వం ఆధ్యాత్మిక పరిభాష. ‘తత’ అంటే అది ‘త్వం’ అంటే నీవు తత్వమసి మహా వాక్య చతుష్టయంలో ఒకటి. దానిలో ‘తత’ అంటే, పరబ్రహ్మ పదార్థానికి, ‘త్వం’ అంటే జీవునికి సంకేతం కాబట్టి ‘ఒరే పిచ్చినాయినా! నీవు కేవలం జీవుడవు మాత్రమే కావు, ఆ పరబ్రహ్మ స్వరూపుడివే సుమా! ఈ సత్యాన్ని తెలుసుకో అనేది తత్వమసి యొక్క తాత్పర్యం.అందు చేత సామన్యుడికి ఆ విషయాన్ని అవగాహన చేయటానికి వేదాంతంలో ఈ తత్త్వాలు ఆవిర్భవించినవి. ఈ తత్త్వవా్మఙయానికి సాహిత్యంలో శ్రీకారం చుట్టినవాడు వేమన యోగి. దానికి సమగ్రమైన రూపం కల్పించింది పోతులూరి వీరబ్రహ్మంగారని కపిలవాయి గారు నిర్థారించారు. ‘చిల్లర రాళ్లకు మ్రొక్కుతు ఉంటె చిత్తము చెడునుర ఒరెఒరే’. అనేది సామాన్యతత్త్వమైతే. “ఊదే తిత్తుల పైగా నుండే ఉన్నవి తెలియర ఓరన్నా” అనేది మార్మిక త్వమని, తత్వాన్ని రెండు శాఖలుగా పేర్కొని, శ్రీనరసింగరావు ఆఫీసు తత్వాలు మొదటి కోవకు చెందుతాయని చెప్పాడు. “ఉత్తరం ముట్టిన దానికి చాలదు బలం ` ‘దక్షిణ ముడితే తప్ప కదలదు అక్కడి కలం’ అని రాసి కవి పద్యానికి ఇది ఈనాటి కార్యాలయాల పరిస్థితి. అందుచేత వాటిని కార్యలయాలు తప్ప కార్యాలయాలు’ అనలేము. ఆఫీసులనే రథాలకు ఈనాడు క్లర్కులు ముందు చక్రాలు ఆఫీసర్లు వెనక చక్రాలు ముందు చక్రాలు తిరగకుంటే వెనక చక్రాలు తిరిగినా లాభముండదు కదా! అంటూ కవి అంతరంగాన్ని పీఠికలో ఆవిష్కృతం చేసాడు లింగమÖర్తిగారు.
ప్రభుత్వ ఆఫీసులంటే ఒకరకమైన భావన సమాజంలో నాటుకుపోయింది. దాన్ని కవి వర్ణిస్తే ఆ ఉద్దేశాన్ని పీఠికలో నిలబెట్టారు.
‘తూర్పు కనులెర్ర చేస్తే’ కవితా సంపుటికి ‘శుక్రతార’ శీర్షికతో తన అభిప్రాయాన్ని రాసారు డా. కపిలవాయి లింగమÖర్తిగారు ‘శీర్షికనే’ చాలా విలక్షణంగా పెట్టారు సమయస్ఫూర్తితో వ్యవహరించే సాహితీవేత్త. అందులో ఆయన భాషగురించి ఇలా చెప్పారు. భాష అనేది భావానికి దుస్తుల వంటిది. దుస్తులు సంప్రదాయ సిద్ధంగా ఉన్నప్పుడే ఎవరికైనా ఆ వ్యక్తి హూందాగా, గౌరవప్రదంగాను కనిపిస్తాడు. ప్రాచీన కవికి కవిత్వంలో మొదటి వరసలో ప్రతిభా, వ్యుత్పత్తి అభ్యాసాలని రెండవ వరుసలో యతి గణ ప్రాసలని, మÖడవ వరుసలో రసధ్వని అలంకారాలని ఎన్నో నియమాలుండేవి. కాని ఈనాడు వీటన్నింటినికి మినహాయింపులున్నా ఇప్పుటి కవులు మాత్రం తమ భావానికి బిగువు దుస్తులో, బికినీ దుస్తులో జిప్సీదుస్తులో, జీరాడే దుస్తులో వేస్తున్నారు. కాని సామాన్యమైన సాంప్రదాయ దుస్తులు గూడా సరిగా వేయలేకపోతున్నారు.
ఈతరంలో మన జిల్లాలో యువకవి రంగినేని సుబ్రహ్మణ్యం మాత్రం పై విషయానికి ఆపవాదుగా కనిపిస్తున్నాడు అంటాడు.
లింగమÖర్తిగారు సాంప్రదాయకవి. వారి రచనలలో భక్తి విశ్వాసం, దేవాలయాల ప్రస్తావన పుష్కలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సమాజం పోకడలు సంప్రదాయవాదులకు గిట్టవు. మనుషులు వేషం, భాష మార్చి జీవిస్తున్నారు. వర్తమానకవులు అలాగే ఉన్నారు. భాష వినియోగం, భావ వినిమయం పలుచగా ఉంటుంది. ఇప్పటి కవిత్వంలో ఛందస్సు కనిపించదు. నానీల లాంటి పనికిరానివి ‘కవిత్వం’ పరువు తీస్తున్నాయి.
కవి రంగినేని సుబ్రహ్మణ్యం గురించి మాత్రం చాలా గొప్పగా రాసారు లింగమÖర్తిగారు. సుబ్రహ్మణ్యం యొక్క హృదయం భావసంపద దాన్ని వెలయించటంలో భాషా ప్రజ్ఞ ఆటుపోటులతో హద్దులు మీరకుండా మైదానంలో పారుతున్న నదివలె శైలిలో ప్రసన్నత ఉన్నవి. అని ప్రోత్సాహకంగా ‘పీఠిక’ రాయడం లింగమÖర్తిగారి ఔదార్యాన్ని తెల్పుతుంది. మొక్కుబడిగా రాయకుండా కవిని అతని కవితా శక్తిని అంచనావేస్తు ‘పీఠిక’ రాయడం అంత సులువు కాదు.
పీఠిక రాసేవారికి సాహిత్యజ్ఞానం మాత్రమేకాక పూర్వగ్రంథ పరిశీలన ఉండాలి. అంటే వేదాలు, పురాణాలు, భారత రామాయణ భాగవతాలను అధ్యయనం చేసి వుంటే ‘పీఠికలు’
ఉన్నతస్థాయిని పొందుతాయి.
కపిలవాయి లింగమÖర్తి గారు ‘మాతృశతకానికి’ చాలా గొప్పగా పీఠిక రాసారు. దీనిని దేవకాటమరాజు నరసింహులు రచించారు. మాతృశతకములో ‘మాతృ’ అనే పదం ఉన్నందుకు లింగమÖర్తిగారు. ‘మాతృ’ శబ్ధానికి ఉన్న ప్రాశస్త్యాన్ని స్పృశించారు.
“భూప్రదక్షిణ షట్కోనా `కాశియాత్రాయుతాయచ
సేతుస్నాన శతైైర్వచ్చ- తత్భలం మాతృ వందనం”
తల్లికి, తండ్రి,ఆచార్య అతిథులకంటే వేదశాస్త్రాల్లో గౌరవం ఉందని చెప్పాడు. ఆరు సార్లు భూప్రదక్షిణం, వందసార్లు సేతుస్నానం, వేయిసార్లు కాశిని దర్శించినంతŠఫలం ఒక్కసారి భక్తితో వందనం చేస్తే కలుగుతుంట. అంటూ నేటి కాలంలో తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తున్న తీరును దుయ్యబట్టారు. ఈనాటి తలిదండ్రులను తలచుకున్నప్పుడు మాత్రం వారెంత పాపం చేసి ఈ పుత్రులను కన్నారో అన్నంత ఆవేదన కూడా అప్పుడపుడు కలుగక మానదు. కనుక పేటిక చిన్నదైనా దీనిలో చిరంజీవి కాటమరాజు అనంతమైన అమ్మ మహిమను అల్పాక్షరాలతో తన శక్తి మేరకు కూర్చే ప్రయత్నం చేసాడు అని పీఠిక రాసాడు.
అయితే లింగమÖర్తిగారు పుణ్యం చేసుకున్నారు. అశోక్బాబులాంటి కొడుకు ఉండటంవల్ల ఆనంద్ లాంటి మనవడు ఉండడం వల్ల లింగమÖర్తిగారి సమస్త సాహిత్యాన్ని కర్తవ్యంగా తీసుకుని కాపాడుతూ వస్తున్నారు. అముద్రితాలను ముద్రించడం లింగమÖర్తి గారి సాహిత్యానికి పేరు తీసుకునిరావడం, సదస్సులలో సహకరించడం, పురస్కారాలు అందించడం లాంటి కార్యక్రమాల ద్వారా లింగమÖర్తిగారి ఋణం తీర్చుకుంటున్నారు.
కపిలవాయి లింగమÖర్తి గారు రాసిన మరో పీఠిక పాలమÖరు జిల్లా సంకీర్త్తనా సాహిత్యం. ఇది పరిశోధన గ్రంథం. పాలమÖరు జిల్లాలో విస్మరణకు గురయిన సంకీర్తనకారులను గుర్తించినదీ గ్రంథం. దీనికి రాసిన పీఠికలో చారిత్రక అంశాలను స్పృశించారు. అంతేకాదు సంకీర్తనల వినియోగాన్ని కూడా గొప్పగా చెప్పారు. రచయిత గురించి ఇప్పటికే భాస్కర్ సేకరించింది. రాకమ చర్ల వెంకటదాసు గారి కాలం తరువాతదే గాని, అంతకంటే మొదలు భజన సమాజాలు లేవా? మరి ఆనాటి సాహిత్యమేది? దాని ఆనవాలు కూడా తెలియడం లేదు. కనుక ఈ భాస్కరయోగిని ప్రేరణగా తీసుకుని భావి పరిశోధకులు ఇంకా కొంత వెనకకు వెళ్లవలసి ఉంది. సాహిత్య పరిశోధన అనంతమైనది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతుంటాయి.
‘ముంగిలి’ తెలంగాణా పరిశోధన గ్రంథం, అలాగే తెలంగాణ అలాగే సాహిత్య చరిత్రగా కూడా చూడాలి. ఈగ్రంథంలో తెలంగాణాలో విస్మరణకు గురయిన సాహిత్యకారుల, సంకీర్తన కారుల వివరాలు ఉన్నాయి. డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఎంతో శ్రమకోర్చి కూర్చిన గ్రంథం. ఇప్పటివారికి ఇదే ప్రామాణిక గ్రంథంగా నిలిచింది.
‘నాగర్ కర్నూల్ జిల్లా గ్రామాల చరిత్ర’ దీనిని కపిలవాయి కిశోర్ బాబు రచించారు. ఇది ఎంఫిల్ సిద్ధాంత గ్రంథం. భారతదేశంలో కైఫీయతులు సేకరించిన మెకంజీ ప్రభావం వల్ల కపిలవాయి లింగమÖర్తి గారికి మహబూబ్నగర్ జిల్లా స్థానిక, చరిత్రలు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందంట. ఈ పీఠికలో ఆయనే చెప్పుకున్నారు. అందువల్ల దానిని సఫలీకృతం చేయడానికే కిషోర్ బాబుకి “నాగర్ కర్నూల్ జిల్లా గ్రామనాలు’ అనే అంశాన్ని ఎంఫిల్ డిగ్రీకోసం సూచించారు కపిలవాయి లింగమÖర్తి గారు. కిషోర్ బాబు పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసాన్ని
ఉస్మానియా యÖనివర్సిటీకి సమర్పించారు.
వీరికి పరిశోధనా అగ్రగణ్యలు కీ.శే. ఆచార్య బిరుదురాజు రామరాజు గారు పర్యవేక్షకులు. నాగర్ కర్నూల్ జిల్లా గ్రామ నామాలు’ ఉన్నతమైన పరిశోధనా గ్రంథం. వారి సలహాలు, సూచనలతో సిద్ధాంత వ్యాసాన్ని తీర్చి విశ్వవిద్యాలయానికి సమర్పించి ఎంఫిల్ డిగ్రీని అందుకున్నారు అశోక్బాబు.
‘నువ్వుల వాన’ రచయిత్రి శ్రీమతి పద్మాలయ ఆచార్య. ఈమె వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తిరీత్యా హరికథా కారిణి. తండ్రి ద్వారా సంక్రమించిన సాంస్కృతిక వాసనను బిగిసిపట్టి పాటలు, పద్యాలు పాడుతూ ఉంటారు. అంటే ఆమె కళాకారిణికూడా. నేను ఆమెకు శిష్యున్ని. నాతో నాటకాలు వేయించింది. గొప్ప సాంస్కృతిక శక్తి ఆమె.
ఆమె రాసిన ‘నవ్వుల వాన’ పుస్తకానికి ‘హాసవికాసం’ అనే పీఠికను రాస్తూ నవ్వు అంటే ఏమిటి? దాని ప్రయోజనాన్ని గొప్పగా చెప్పారు కపిలవాయి లింగ మÖర్తిగారు. నవ్వు నాలు గందాల చేటు’ అని సామెత ఉన్నా ‘ నవ్వు మనో మాలిన్యాలను తొలగించే పువ్వు అనే సూక్తి ఉంది. అందరూ నవ్వలేరు, నవ్వించలేరు. ఈ నవ్వులో తాను నవ్వకుండా ఇతరులను నవ్వించగలవాడు దిట్ట అని లింగమÖర్తి గారు అన్నారు.
ఈ మనిషికి వేషగత హాస్యం, చేష్టాగత హాస్యం, వాగ్గతహాస్యం అనే మÖడు విధాలుగా నవ్వు ఉంటుందని కూడా చెప్పారు.
నవ్వురానురాను ‘ప్రహసనంగా’ మారి ప్రక్రియగా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించిందని కూడా చెప్పారు. ఈ పీఠికలో రచయిత్రి హాస్యకుడిని గొప్పగా చెప్పారు. అలాగే సాహిత్యంలో హాస్య కవుల రచయితలను స్పృషించారు. చిలకమర్తి, పానుగంటి, భమిడిపాటు, మణిమాణిక్యం, కందుకూరి లాంటివారిని వారి ‘హాస్య’ సృష్టిని గుర్తు చేసారు. కపిలవాయి లింగమÖర్తి గారు చారిత్రక సాహిత్యకారులు కనుక పూర్వ పరిశీలన గావించినవారు కనుక వారు సునాయసంగా ఏ కవి, రచయిత గురించి అయినా, సమయస్ఫూర్తితో ఆవిష్కరించగలరు.
సఖుడా! వివరించనా సందాపురం బిచø్చయ్య రచించారు. ఈశతక రచనకు ‘అభిప్రాయం’ అనే శీర్షికతో పీఠిక రాసారు డా. లింగమÖర్తి గారు. ఇందులో ‘కవి’ కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ఎన్నోవిశేషాలు స్పృశించారు. ఈనాటిదంతా ఆకలి కవితŠ్వమే అంటే సమాజంలోని అశాంతికి, దుర్మార్గానికి విప్లవానికి మÖలమంతా ‘ఆకలి’ అనియే ఆధునికుల విశ్వాసం మరియు నినాదం అంటూ ఆధునిక కవుల బాధ్యతను, పోరాటాల రచనల ఉద్దేశాన్ని వెల్లడించారు. సందాపురం బిచ్చయ్య గృహంలో భార్యనే గొప్పది ఎప్పుడు ఆమె ఆనందంగా ఉంటే ఆగృహం స్వర్గంలా ఉంటుందన్న అభిప్రాయాన్ని కపిలవాయి లింగమÖర్తి గారు అంగీకరించారు. ఈ మాటల నుంచే ‘సఖుడా! వివరించనా’ శతకం ఆవిర్భవించిందని అన్నారు.
పీఠికలలో ఎవరూ పాటించని సమీక్షించని విషయాలు డా. కపిలవాయి లింగమÖర్తిగారు పాటించారు. అదేûమిటంటే ఒక పదం దొరికినా, వాక్యం కనిపించినా? పేరు కనిపించినా దాని పుట్టుపూరోహిత్తరాలను స్పృశించనిదే మరోమాట మాట్లాడరు ఆయన. వనపట్ల సుబ్బయ్య రచించిన ‘మశాలు’ కవితా సంపుటి పీఠికకు ‘సమాలోచనం’ అని శీర్షికపెట్టి.. కవికి ఇంటి పేరు వనపట్ల ఎలా వచ్చిందో చెప్పారు. అంతేకాదు ఆ పదానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. ‘ఎం.ఏ. చేసినా కులవృత్తికి సాటిరాదు గువ్వల చెన్న’ అనే నానుడితో వనపట్ల తన కులవృత్తిని ఎంచుకుని జీవిస్తున్నాడని చెప్పారు. ‘మశాలు’ అనే పదాన్ని వేదం వెంకటరాయశాస్త్రి ప్రతాపరుద్రాయ నాటకంలో - నీకు చంద్రుడు మశాలు’ అని వినియోగించారని తెలిపారు. ఎంత సాహిత్యజ్ఞానం ఉంటే ఇలా సందర్భానుసారంగా చెప్పే జ్ఞానం అలవడుతుంది. అందుకే కపిలవాయి లింగమÖర్తిగారిని ఒక విజ్ఞాన గ్రంథంగా ఒక సాహిత్య నిఘంటువుగా చెప్పాలి.
వేద్దారం మధుసూధన శర్మ ‘సమాలోకనం’ పుస్తకానికి ‘అంతరావలోకనం’ అనే శీర్షికతో పీఠిక రాసి వారి సాహిత్య అంతరంగాన్ని ఆవిష్కరించారు లింగమÖర్తిగారు. ఈ రచనలో ఉన్న అనేక చారిత్రక సాహిత్య విశేషాలను సందర్భానుసారంగా పీఠికలో స్పృశించారు.
‘పక్షి గీత’ వచన కవితాసంపుటి. దీనిని మైనా వెంకటేశ్ అనే వర్తమాన కవి రచించాడు.. దీనికి పక్షి గీత - ఒక దర్శనం’ అనే శీర్షికతో పీఠికరాస్తూ ఇది ఒకసామాన్యమైన పక్షిజాతి ఆత్మకథగా ఉంది. పాలపిట్ట జాతీయపక్షియై తమ జాతి కంతా గూడా ప్రతినిధిగా నిలిచిందన్నారు.
కేవలం పాలపిట్టను ఆధారంగా చేసుకున్న ఈ కవితా సంపుటి గురించి చర్చిస్తూ అనేకమైన విజ్ఞాన విషయాలను వెల్లడించారు. అంతేకాదు ‘ఆత్మ-పరమాత్మల’ గురించి పీఠికలో రాయడం వల్ల కపిలవాయి గారి విజ్ఞాన, జ్ఞాన పాండిత్యం వెల్లడవుతుంది. రోబో 2.0 సినిమా అంతా కూడా ‘పావురాల’ జీవితం చుట్టూ తిరుగుతుంది. అంతరించిపోతున్న పావురాల జాతిని కాపాడటం కోసం ఒక వృద్దుడు చేసిన పోరాటం ఆ సినిమాలో కనిపిస్తుంది.
ఈ కవితా సంపుటి పక్షుల భవితవ్యం కోసం ఆరాట పడిందని తెలుస్తుంది.
ముగింపు
డా. కపిలవాయి లింగమÖర్తి ఎంతో ఔదార్యం ఉన్న కవి, పరిశోధకుడు, చారిత్రక సాహిత్యానువేక్షణను సాగించి వాటి వెలికితీతకోసం పరితపించాడు. పరిశోధననే ఊపిరిగా, శ్వాసగా, మలచుకున్నాడు. ఒక తెల్ల పేపర్ కనిపిస్తే రాయడం, ఒక పదం కనిపిస్తే దాని వ్యుత్పత్తిని చెప్పడం, ఒక ప్రాంతం కనిపిస్తే దాని పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకోవం వంటి అంశాలన్నీ వారి పరిశీలన, పరిశోధనాతత్వాన్ని తెలియజేస్తాయి. వృద్ధ్యాప్యంలో ఉన్నా వయసు పరిశోధకుడిలా అంటే యువ పరిశోధకుడిలా ప్రవర్తించడం వారి పరిశోధన తపనకు నిదర్శనం.
ముఖ్యంగా నా ఈ పరిశోధనా వ్యాసంలో కపిలవాయిలింగమÖర్తిగారి ‘పీఠికల’ రచననే తెలపడం. ఆయన పీఠకలను రాసేటప్పుడు చాలా విలక్షణంగా శీర్షికలు పెట్టి, రచయితల రచనాంతరంగాన్ని పరిశోధనాతత్త్వంతో ఆవిష్కరించడమేగాక, సమయానుకూలంగా చారిత్రక, భౌగోళిక అంశాలను వెల్లడించడం కపిలవాయి గారి జ్ఞానానికి నిదర్శనం. చారిత్రక, సాహిత్య అంశాలను వేదపురాణకాలం నుండి గ్రహించి ఆ అంశాలు కవుల రచనాంశాలకు సమన్వయించడం వారికే చెల్లింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి