శతాధిక గ్రంథకర్త, కవి పండితోత్తముడు, అధ్యాపక శిరోమణి, పరిశోధక పంచాననుడు డా.కపిలవాయి లింగమూర్తిగారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే “పద్యానికి హారతిపళ్ళెం, పరిశోధనకు ప్రమాణపత్రం, పదజాలానికి కోశాగారం అందించి తొమ్మిది దశాబ్ధాల నిండుజీవితాన్ని తెలంగాణ సారస్వతానికి అంకితం చేసిన విశేష వ్యక్తిత్వం కపిలవాయి లింగమÖర్తి గారిది”. ఆయన స్పృశించని ప్రక్రియ లేదు. శతకాలు, కావ్యాలు, సంకీర్తనలు, చరిత్రలు, ఉదాహరణలు, నవలలు, జీవితచరిత్రలు, ఆత్మకథ, నాటకాలు, అనువాదాలు, కథానికలు ఇలా లింగమÖర్తిగారు తన కలంతో నిరంతర సాహిత్య సృష్టిచేస్తూ వచ్చారు. కపిýవాయి గారు ప్రాచీనసాహిత్యం, చరిత్ర, పరిశోధన మీద ప్రధానంగా దృష్టి సారించినప్పటికి ఆధునిక సృజన ప్రక్రియలను వదిలిపెట్టలేదు. ఆంగ్ల ప్రభావంతో తెలుగులోకి వచ్చిన కథానిక ప్రక్రియలోను తనదైన ప్రతిభను కనబరిచారు.
కపిలవాయి లింగమూర్తి గారు, తను కలంపట్టిన తొలిరోజుల్లో రెండు సంవత్సరాల (1959`61) పాటు కృష్ణాపత్రికలో కథలు రాశారు. శీర్షిక ‘కల్పనాకథలు’ పేరుతో ఒక కాలంలా వచ్చాయి. ఈ కథలు అర్థశతాబ్ధి దాటిన తరువాత 2015 లో సాహిత్య దుందుభి మహబూబ్‌నగర్ వారి చొరవతో అందులోని కొన్ని కథలను మాత్రమే పుస్తకంగా అచ్చువేశారు. ‘కపిలవాయి లింగమÖర్తి కథానికలు’ పేరుతో వచ్చిన ఈ పుస్తకంలో మొత్తం ఆరు కథలు ఉన్నాయి. ఇంకా పుస్తకం రూపంలోకి రానివి చాలానే ఉన్నాయి. 1959 సంవత్సరం అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మÖడు సంవత్సరాలు అయింది. వెల్లువలా తెలుగు పత్రికలు స్థాపించబడి తెలుగుభాషా, సాహిత్యాల సుసంపన్నత దిశగా ప్రవహిస్తున్న కాలం. ఈ క్రమంలో 1901 లోనే ఏర్పడిన కృష్ణాపత్రిక సాహిత్యసేవలో ఎప్ప్పుడూ ముందంజలోనే ఉందని చెప్పవచ్చు. ఆనాటి సమాజానికి అనుగుణంగా కపిలవాయి గారు ప్రామాణిక భాషను కథల్లో ఉపయోగించారు. తెలుగుభాషలోని మాధుర్యాన్నంత నుడికారాలు, సామెతలు, జాతీయాలను సందర్భానసారంగా ఉపయోగించారు. శిల్ప నిర్మాణంలో కొత్తదనాన్ని పాటించారు.
కథనంలో ‘ఆమె కథ ఒక్కటే ఉత్తమపురుషలో సాగింది. మిగిలినవి ప్రథమ పురుషలో ముందుకు సాగాయి. సామాజిక పరమైన వస్తువులను తీసుకొని వాస్తవికదృష్టితో, అనుభూతి ప్రధానంగా కథలను రాశారు. వీరి కథల్లో శీర్షిక పెట్టడంలో విలక్షణత కనిపిస్తుంది. పండితులైన వారు వచనాన్ని రాసినప్పటికి ఎంతటి సృజనాత్మక వాక్యాలుగా వొదిగిపోతాయో ఈ కథలు చదివితే తెలుస్తుంది.
‘జీవిత సంధ్యలు’ కథలో వస్తువు ఒక జమిందారీ కుటుంబ వాతావరణం. యజమాని స్వేచ్ఛా ప్రవృత్తి కలిగినవాడు. తెలంగాణలో స్వాతంత్య్రానికి పూర్వమున్న భూస్వామ్య వ్యవస్థ మÖలాలు ఆ తరువాత చాలా కాలంపాటు కొనసాగుతూ వచ్చాయి. రచయిత తన చిన్నప్ప్పుడు దొరల కాలాన్ని అనుభవించాడు. కాబట్టి ఆ పరిణామాన్ని పాఠకులు అర్థమయ్యేలా చిత్రించారు. భూస్వామ్య వ్యవస్థ మÖలాలు ఎప్ప్పుడైతే సమÖలంగా తుడుచుకుపోయాయో దొరలు రూపం మార్చుకొని రాజకీయరంగ ప్రవేశం చేసి, నగరాల్లో స్థిరపడటం, వ్యాపారాల్లో ముందంజలో ఉండటం గమనించదగిన విషయం. కథా ఎత్తుగడలో “చినబాబు శ్రీహరిరావు గారి నాడు యింటికి వస్తారు. వచ్చినప్ప్పుడల్లా విందులకోసం ఎవరినో ఒకరిని వెంటేసుకురావడం పరిపాటే. ఆయనకు ఈ తడవ విశేషంగా తన సానిదాన్ని కూడా తీసుకు వస్తున్నాడని తెలిసిందది పద్మినీదేవికి” అన్నమాటలు ఆనాటి సామాజిక రుగ్మతలను తెలియజేస్తుంది. భర్త ప్రవర్తిస్తున్న తీరు భార్య పద్మినీదేవికి నచ్చకపోయినప్పటికి ఎదిరించలేని స్థితిలో
ఉంది. అధికారం చేతిలో ఉన్న ధనికుడు శ్రీహరిరావు ఏంచేసిన నడుస్తుందనే తీరులో ప్రవర్తించిన తీరు కథలో చిత్రించబడింది.
‘అభిమాన దేవత’ కథలో భారతి, కాంతారావులు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. కాంతారావు ప్రభుత్వ ఉద్యోగస్తుడే కాని చాలినంత జీతం వచ్చే గొప్ప ఉద్యోగంలో లేడు. అందుకని కాంతారావు ఇంటిలో పిల్లలు పెరుగుతున్న కొద్ది సంసారాన్ని నడపటం కష్టమౌతుంది. ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి భార్య కూడా ఉద్యోగం చేసే బాగుంటుందని భర్త కోరుకుంటాడు. కాని భార్య పిల్లల పెంపకంలో నిమగ్నమవడం వలన ఉద్యోగం చేయలేకపోతుంది. వారిరువురి మధ్య పెళ్ళైన కొత్తలో ఉన్న అనురాగం రాను రాను సన్నగిల్లుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికి భార్యభర్తల మధ్య ప్రేమ, అనురాగాలు సన్నగిల్లకూడదని ధ్వన్యాత్మక చెప్పిన కథ ‘అభిమాన దేవత’.
‘ఆగిపోయిన కథ’ లో పార్వతి కథానాయకురాలు ఆమె తండ్రి రామన్న పంతులు, ఆమె అన్న నరసింహం, తండ్రి బడిపంతులు కాబట్టి ఎక్కువ జీతం వచ్చేది కాదు. అందుకే ఆ రోజుల్లో ‘బతకలేక బడిపంతులు’ అనే సామెత వచ్చింది. రామన్న పంతులు తన పిల్లలకు చిన్న వయస్సులోనే పెళ్ళిళ్ళు చేయాలనుకుంటాడు. అతని ఇంట్లో మేనల్లుడు ఉంటాడు కాని ప్రయోజకుడు కాదు. కూతురుకు గొప్పింటి సంబంధం చూసి పెండ్లి చేస్తాడు. దాంతో ఇంట్లో ఉన్న మేనల్లుడు కోపంతో ఇల్లువదిలి వెళ్ళిపోతాడు. కాలం ఎప్ప్పుడూ ఒకేలా
ఉండదు. తానొకటి అనుకుంటే దైమమొకటి తలచినట్లుగా పార్వతి భర్త అనారోగ్యం పాలై చిన్నవయస్సులోనే చనిపోతాడు. పార్వతి విధిలేక పుట్టింటికి వచ్చి చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ కాలాన్ని వెళ్ళదీస్తుంది. పార్వతి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లో తన మేనబావను కలుసుకుంటుంది. ఆగిపోయిందనుకున్న తన మోడుబారిన జీవితం తన మేనబావ ప్రేమతో తిరిగి చిగురించడం మొదలుపెడుతుంది. జీవితంలో ఎగుడుదిగుడులు ఉంటాయని కథ చెప్తూనే మధ్యతరగతి జీవితాల వాస్తవికతను కళ్ళకు కడుతుంది.
‘ఆమె’ కథ ఉత్తమ పురుషలో నడుస్తుంది. బస్సు బయలు దేరేటప్ప్పుడు కథ మొదలౌవుతుంది. “బస్సు పాలెం బస్టాండ్‌లో ఆగింది. ప్లాటుఫారం ఎంత రద్దీగా ఉందో లోపల అంతే రద్దీగా ఉంది”. విశ్వం, అతని స్నేహితుడు సత్యం బస్సెక్కి సీటు దొరకక వెనక్కి వెళ్ళి నిల్చుంటారు. వారికి ఒకవైపు సీట్లో ఇద్దరు మహిళలు కూర్చోని, చుట్టు ఉన్న జనాన్ని గురించి మరిచిపోయి వారిరువురి కష్టసుఖాలను గురించి మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణలో విశ్వానికి, అతడి స్నేహితుడికి అర్థమయ్యింది ఏమిటంటే వారి భర్తల తాగుడువల్ల కుటుంబాలకు జరిగే అనర్థాలను ఒక్కటొక్కటిగా తెలియవచ్చాయి. అయినా కూడా భారతీయ స్తీలు సహనంతో సంసారాన్ని నడుపుతారన్న విషయం తెలిసింది. ఈ కథలో స్తీలు వారి కష్టాల గురించి చెప్తుంటే పురుష పాత్రలు వినడంలోనే కథలోని ఆంతర్యం దాగి ఉంది. ‘ఓ పురుషులు’ ఒకసారి ఆలోచించండి? అన్నట్లుగా పాఠకులను సమాయత్త పరిచినట్లుగా ఈ కథ ముగుస్తుంది.
‘అనాథ’ కథ కరుణ రసభరితంగా సాగింది. పెంటమ్మ అందరిలాగానే చదువుకొని గొప్ప జీవితం గడపాలనుకుంది. తల్లి కూలిపని చేసి పెంటమ్మను చదివించింది. తన బిడ్డ తనలా శ్రామికురాలు కాకుండా గొప్పగా జీవితంలో రాణించాలని తల్లి కలలు కనింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు పెంటమ్మ చదువుకునే రోజుల్లో ప్రేమలో పడింది. ప్రియుడు చూపించే ప్రేమ నిజమని నమ్మింది. సమాజంలో నిజమైన ప్రేమికులకంటే అవకాశవాదులే ఎక్కువగా ఉంటారన్న లోకసత్యం, లౌక్యం తెలియని పెంటమ్మ ప్రియుడికి సర్వం అర్పించి మోసపోతుంది. తన కన్నతల్లికి భారమై జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ఆడవాళ్ళు సమాజంలోని మాయను నమ్మకూడదని, ముల్లు విస్తరు మీద పడినా, విస్తరు ముల్లు మీద పడినా విస్తరుకే నష్టమన్న జీవన సత్యాన్ని కథ చెప్తుంది.
‘చాటువులు’ కథలో సమాజంలోకి ముసుకు దొంగల వాస్తవిక ప్రవృత్తిని కండ్లకు కడతాడు. గ్రామంలో ఆర్.ఎం.పి డాక్టరుగా సేవలందిస్తున్న డాక్టరుకు ఆ వూరిలో ప్రాక్టీసు పెట్టకముందే పెళ్లై ఉంటుంది. వృత్తిని అడ్డుపెట్టుకుని నచ్చిన అమ్మాయిలను నయాన్నో భయాన్నో తన దారిలోకి తెచ్చుకుంటాడు. ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడతాడు. ఆ వూరి గ్రామప్రజలు మాత్రం అతన్ని దేవుడిలాగా భావిస్తుంటారు. ఒకరోజు డాక్టరు రాత్రిపూట కనపడకపోతే ఆ వూరిజనం మరియు భార్య కూడా దొంగలు కిడ్నాప్ చేశారని, ఎత్తుకెళ్ళారని అనుకుంటారు. కాని డాక్టరు మధుకరరావు ఆ రోజు రాత్రి అమ్మాయి సేవలో ఉన్నాడన్న విషయం కథలో సాక్ష్యంగా నిలిచిన రమణ పాత్రకు మాత్రమే తెలుసు. ఇలాంటి సంఘటనలు లోకంలో అనేకం ఉంటాయి. కథలో ఒక పురుషుడి మనస్తత్వాన్ని, సమాజంలో అతడికిచ్చిన స్వేచ్ఛను అతను ఏ విధంగా అవకాశంగా మలుచుకున్నాడో తెలియజెప్పే కథ చాటువులు.
ఈ విధంగా కపిలవాయి లింగమÖర్తి గారు రాసిన కథల్లో అనేక జీవన సత్యాలు, మధ్యతరగతి మందహాసం, స్తీలకు ఉంటే కష్టసుఖాలు, లోకం తీరుతెన్నులు వస్తువులుగా ఉండి సందేశాత్మకతతో పాఠకులకు ఆలోచింపజేస్తాయి. రచయిత కథను నడపడంలో శిల్పం మీద దృష్టి పెట్టి రాశారు. వాక్యాల్లో, భావాల్లో రసపుష్టిని ప్రదర్శించారు. భాషలో నుడికారపు సొంపులు దర్శనమిస్తాయి. దొప్ప క్రింది దోసిలివోలె, చూసివత్తమమ్మ సుదతులార వంటి నుడికారాలు కథల సౌందర్యాన్ని పెంచుతాయి. పిల్లకాకికేం తెలుసునమ్మ ఉండేలు దెబ్బ, ఇంతేమి, ఇంతేమి ఈతకు లోటేమి, మన గుమ్మడికాయలు మంచివైతే వీధిలో ఎందుకు దొర్లుతాయి వంటి సామెతలు అర్థపుష్టిని పెంచుతాయి. ఈ విధంగా కపిలవాయి గారు కథారచయితగా తన సత్తాను చాటుకున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి