మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, అక్టోబర్ 2026, ఆదివారం

గుడివాడ నియోజక వర్గం

   గుడివాడ నియోజకవర్గం నందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో  2004 నుండి 2019 వరకు రెండుసార్లు మాత్రమే టిడిపి పార్టీ విజయం సాధించడం జరిగింది. గతంలో టిడిపి పార్టీకి కంచుకోటగా గుడివాడ నియోజకవర్గం ఉండేది. 2014 సంవత్సరం తర్వాత అనూహ్యంగా పార్టీ రాజకీయాలలో భారీ మార్పులు సంభవించాయి. 2004 నుండి 2019 వరకు వరుస విజయాలతో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు / కొడాలినాని గారు దూసు కెళుతున్నారు. కొడాలి నాని గారు 2004 మరియు 2009లో టిడిపి పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొడాలి నాని గారు వైయస్సార్ సిపి పార్టీలోకి చేరడం జరిగింది. తద్వారా 2014, 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నాని గారు విజయం సాధించడం జరిగింది. మొదటిసారి విజయం సాధించినప్పుడు తన ప్రత్యర్థి అయిన కటారి ఈశ్వర్ కుమార్ పైన సుమారు 8864 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009లో పిన్నమనేని వెంకటేశ్వరరావు పై సుమారు 17633 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొడాలి నాని గారు పార్టీ మారిన తర్వాత, 2014లో టిడిపి అభ్యర్థి అయిన రావి వెంకటేశ్వరరావు గారిపై 11537 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొడాలి నాని గారు, టిడిపి పార్టీ అభ్యర్థి అయిన దేవినేని అవినాష్ (దేవినేని నెహ్రు కుమారుడు) గారి పైన సుమారు 19479 ఓట్ల మెజార్టీతో నాలుగో సారి విజయం సాధించడం జరిగింది. ఇలా కొడాలి నాని విజయం సాధించిన ప్రతీసారి ప్రతిపక్ష అభ్యర్థులు మారుతున్నప్పటికీ, కొడాలి నాని గారిని ఓడించ లేకపోయారు.

        కొడాలినాని గారు పెద్దగా చదువుకోకపోయినా, రాజకీయరంగంలో తనదైనపాత్ర పోషిస్తున్నారు. కొడాలి నాని గారికి రాజకీయంగా పునాది వేసింది టిడిపి  ప్రభుత్వం అయినప్పటికీ, ప్రస్తుతం టిడిపి పార్టీనే తన ప్రత్యర్థిగా మార్చడం జరిగింది. సంస్థ సభ్యులు చాలా గోప్యంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నప్పుడు కొన్ని అనూహ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సంస్థ సభ్యులు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తున్నప్పుడు ప్రతీ గ్రామంలోని ప్రజల్లో ప్రతి పదిమందిలో సుమారు ఆరు నుంచి ఏడు మంది కొడాలి నాని వారిపై వ్యక్తిగతంగా  వ్యతిరేకతతో ఉన్నారు. ఈ విధంగా ఏర్పడిన వ్యతిరేకతను టిడిపి పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి రావి వెంకటేశ్వరరావు గారు తనకు అనుకూలంగా మలుచుకోవడానికి కావల్సిన కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. రావి వెంకటేశ్వరరావుగారిపై ప్రజల్లో నమ్మకం 

ఉన్నప్పటికీ వారు ఇంకా ధైర్యంగా ముందుకు రావడం లేదని ప్రజలు చెప్తున్నారు. టిడిపి పార్టీ ఇన్ఛార్జి, తన కార్యకర్తలు ధైర్యంగా అడుగు ముందుకు వేసినప్పుడు మాత్రమే  గ్రామాలలో నాని గారిపై  ఏర్పడిన వ్యతిరేకతను బలోపేతం చేయడం జరుగుతుంది. 

కొడాలి నాని గారు 2019 లో గెలిచిన తర్వాత  బాగా బిజీగా ఉంటున్నట్టు ప్రజలు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రజలకు కొంచెం దూరంగా ఉంటున్నట్టు ప్రజలు చెబుతున్నారు. కొడాలి నాని గారి నోటి దురుసు తనం ప్రజలను బాగా ఇబ్బందులకు గురి చేస్తుంది. గతంలో అతని నోటి దురుసు వలన చంద్రబాబు నాయుడు గారిని పలు రకాలుగా  దూషించినందుకుగాను, “అన్నం పెట్టిన పార్టీకే ద్రోహం  చేస్తున్నాడు”  అనే వాదనలు ప్రజల నుండి వినపడ్డాయి. ఇటువంటి వ్యతిరేకతను కొడాలి నాని గారు చాలావరకు సంపాదించుకున్నారు.

ఎవరైనా కార్యకర్తలు అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, వారి పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మంత్రిగా ఉండి కూడా  ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని, ఇప్పటివరకు కనీసం ఒక పని కూడా సరిగా చేయలేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

గుడివాడ టౌన్ పరిధిలో సర్వే నిర్వహించినప్పుడు, మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ఇంకా జరగలేదు. రూరల్ మండలంలోని ఈ గ్రామాలను మున్సిపల్ పరిధిలో కలపడం వలన, మున్సిపాలిటీ 36వ వార్డు నుండి 39 వార్డులకు మారడం జరిగింది. ఇంకా ఎలక్షన్లు జరిగనప్పటికీ, ఇప్పటికే వైయస్సార్ సిపి పార్టీ తరఫున కొడాలి నాని గారు ముగ్గురికి చైర్మెన్ పదవి ఆశలను చూపించడం జరుగుతుంది. కమ్మ సామాజిక వర్గం నుండి విజయ్ అనే వ్యక్తికి (గతంలో నాని గారికి ఐదు కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేశాడు), యాదవ సామాజిక వర్గం నుండి గొర్ల శ్రీను అనే వ్యక్తికి, కాపు సామాజిక వర్గం నుండి ఆడప బాబ్జి అనే వ్యక్తికి మాట ఇచ్చినట్టు సమాచారం చేరింది. కానీ అనుకోని సంఘటనలు నడుమ ఆడప  బాబ్జి అనే వ్యక్తి  మరణించడంతో, టౌన్ పరిధిలో కొంత   నిరుత్సాహం ఏర్పడింది. అదేవిధంగా దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, పాలేటి చంటి అను మొదలగు కార్యకర్తల తోటి తన కార్యక్రమాలు నిర్వహిస్తూ  గుడివాడ ప్రజలను  కొంతమేరకు భయాందోళనలకు గురి చేస్తున్నారు.  కొడాలి నాని గారి యొక్క విపరీత చర్యలు, నియంత్రణ లేని  పోకడలు రాబోయే ఎన్నికల్లో వారి ఓటమికి మార్గాలు ఏర్పరుస్తాయి. 

కొడాలి నాని గారి యొక్క ఓటమికి మార్గాలు ఏర్పడుతున్నప్పటికి, దానిని అనుకూలంగా మార్చుకోవడానికి సరైన టిడిపిపార్టీకి అభ్యర్థి లేకపోవడం గుడివాడ నియోజకవర్గంలో 

ఉన్నటువంటి టిడిపి  కార్యవర్గాన్ని సతమతానికి గురిచేస్తుంది.  గత ఎన్నికలలో టిడిపి పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన దేవినేని అవినాష్ గారు వైయస్సార్ సిపి పార్టీలో చేరడం పలువురిని నిరాశకు గురి చేసింది. స్థానికంగా ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు గారు గత కొంత కాలం నుండి నియోజకవర్గంలో “మన ఊరు - మన రావి”  అనే పేరుతో గ్రామాలలో పర్యటిస్తున్న పటికి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.  నియోజకవర్గంలో టిడిపి పార్టీకి ఓటు బ్యాంకు బలంగానే ఉన్నప్పటికీ,  ఇక్కడ టిడిపి పార్టీ నుండి సమర్థవంతమైన నాయకులు లేరు. కొడాలి నాని గారిని  ఓడించాలంటే, ఈ నియోజకవర్గం నందు టిడిపి పార్టీకి మంచి సమయస్ఫూర్తి ఉన్న నాయకుడు అవసరం. ఇటువంటి నాయకుడిని 

ఈ నియోజకవర్గంలో బరిలో దింపినట్లయితే  కొడాలి నాని గారి ఓటమి తథ్యం.

రావి వెంకటేశ్వరరావు గారు స్వతహాగా వ్యాపారవేత్త. వారి తండ్రి రావి శోభనాద్రి గారు ఈ నియోజకవర్గం నుండి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. తండ్రి తరువాత శోభనాద్రి గారి మొదటి కుమారుడు హరి గోపాల్ గారు 1999 ఎన్నికలలో విజయం సాధించడం జరిగింది.

2004లో టిడిపి పార్టీ నుంచి వెంకటేశ్వరరావు గారు టికెట్ ఆశించినప్పటికి కొడాలి నాని గారికి అవకాశం లభించింది. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ నుండి రావి వెంకటేశ్వరరావు గారు పోటీ చేసి సుమారు 21582  ఓట్లను సంపాదించుకున్నారు. 2014లో కొడాలి నాని గారు వైయస్సార్ పార్టీ మారిన తర్వాత, టిడిపి పార్టీ అభ్యర్థిగా రావి వెంకటేశ్వరరావు గారికి అవకాశం లభించింది. కానీ ఓడిపోవడం జరిగింది. 2019 ఎన్నికలలో మరోసారి టికెట్ వస్తుందని ఆశించిన వెంకటేశ్వరరావు  గారికి ఎదురు దెబ్బ తగిలింది. కానీ రాబోయే ఎన్నికలకు ముందుగానే గుడివాడ నియోజకవర్గం నందు ఇన్చార్జిగా నియమించినప్పటికీ, చివరికి టికెట్ వస్తుందో లేదో అని అయోమయంలో ఉన్నట్లు అనిపించింది.

కొడాలి నాని గారి పైన వ్యతిరేకత ఉన్నందున, టిడిపి పార్టీ ముందుగానే 

ఈ నియోజకవర్గం నందు తన అభ్యర్థిని ప్రకటించి సరియైన వ్యూహాలను రచిస్తే, చాకచక్యంగా ఎంతో సమయస్ఫూర్తితో కొడాలి నాని గారిని ఓడించే అవకాశాలు ఉన్నాయి. కానీ టిడిపి పార్టీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.  2014లో రావి వెంకటేశ్వరావు ఓడిపోయిన తర్వాత, తనను పార్టీ సరిగా పట్టించుకోలేదని, తన సుమారు 30 కోట్లు ఖర్చు పెట్టినా కూడా తనకు ఎటువంటి పదవి బాధ్యతలు అప్పగించ లేదని కొంచెం నిరాశగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళంలో తనకు రావలసిన టెండర్‌ను పార్టీ సభ్యులు ఇతరులకు అప్పగించారని పార్టీ కావాలనే తనను ఇబ్బందులకు గురిచేసింది అనే అనుమానంతో 

ఉన్నారు. తను వ్యాపారవేత్త  కావడం వలన, రాజకీయాన్ని కూడా ఒక వ్యాపార  కోణంలో చూస్తున్నట్లు అనిపిస్తుంది. బహుశా ఈ కారణాల వల్లనే, ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తన కార్యాచరణను రూపొందించలేదని స్పష్టమవుతుంది. కనుక పార్టీ అధిష్టాన వర్గం  కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి  మంచి వ్యూహాలను రక్షించవలసిన సమయం ఆసన్నమైంది.

గుడివాడ నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తున్నప్పుడు కొన్ని నిజాలు వెలుగులోకి రావడం జరిగింది. మండలంలోని కొన్ని గ్రామాలలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు కొంతమంది మత మార్పిడి చేసుకుని  క్రిస్టియన్ లోకి  చేరారని ప్రజలు చెబుతున్నారు. అదేవిధంగా, ఈ నియోజకవర్గం నుంచి ఉన్న రైతులు వాళ్ల బాధలను పట్టించుకునే నాయకుడు ఎవరూ లేరని బాధపడుతున్నారు. ధాన్యం  అమ్మి మÖడు నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు డబ్బులు అందలేదని బాధపడుతున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కొంతమంది ఆఫీసర్లు, స్థానిక పార్టీ నాయకులు చెప్పిన వారికి మాత్రమే డబ్బుల్ని పంపిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. కనుక స్థానిక టిడిపి పార్టీ ఇన్చార్జ్ రైతులను సంఘటితం చేసి వారి పక్షాన నిలిచి వారిని ఆకర్షించే కార్యక్రమాలు చేసినట్లైతే పార్టీ గెలుపుకి పెద్ద పీటం వేసిన వారవుతారు. ఈ నియోజకవర్గంలో సుమారు 30 శాతం ప్రజలు రైతులు 

ఉండటంవల్ల, వారి ఓటింగ్ పార్టీ గెలుపుకు దారితీస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ నియోజకవర్గంలో ఉన్న మÖడు మండలాల్లో గుడ్లవల్లేరు మండలం టిడిపి పార్టీకి కొంచెం బలంగా ఉంటుంది. ఈ మండలంలోని నాలుగు గ్రామాలు మినహాయించి మిగిలిన అన్ని గ్రామాలలో టిడిపి పార్టీ కొంచెం మెరుగ్గానే ఉంది. ఈ మండలంలోని మండల అధ్యక్షుడు కొంచెం ఆరోగ్యపరంగా బాగా లేకపోవడం వల్ల, ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమాలు సరిగా జరగడం లేదు. మండల అధ్యక్షుడు బాగా సమర్థమైన నాయకుడు కావడం వలన, వారికి సమన్వయం చేస్తూ మరి ఇతరుల కైనా బాధ్యతలు అప్పగించి పార్టీ కార్యక్రమాలను అన్ని గ్రామాలలో కొనసాగించవలసి ఉన్నది.  అదేవిధంగా కొన్ని గ్రామాల్లోని కార్యకర్తలను ప్రక్షాళన చేసి, మంచి సమర్థవంతమైన గ్రామ శాఖ అధ్యక్షులను  నియమించివలసి ఉన్నది. అదేవిధంగా నందివాడ మండలంలోని మండల అధ్యక్షుడు, సమయస్ఫూర్తిలో సరిగా లేనందు వలన పార్టీ కార్యవర్గానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం 

ఉంటుంది.  కనుక నందివాడ మండల అధ్యక్షులుగా, ఒక బలమైన నాయకుడు అని నియమించ వలసిన అవసరం ఉన్నది. 

ఈ విధంగా గుడివాడ టౌన్ పరిధిలో ఉన్న పార్టీ ఆఫీసులో  పనిచేసే సిబ్బందికి సహనం లేకపోవడం వలన, పార్టీ ఆఫీస్‌కి వచ్చే కార్యకర్తలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక పార్టీ ఇన్చార్జ్ ఈ నియోజకవర్గం నందు మొదటగా  పార్టీ ఆఫీస్ నుండే ప్రక్షాళన మొదలుపెట్టి, పార్టీ గెలుపుకు పునాదులు వేయవలసిన అవసరం ఉన్నది. ఈ నియోజకవర్గంలో గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, పార్టీ కార్యకర్తలు తన కోసం పని చేస్తున్నారే తప్ప, పార్టీ కోసం ఏ ఒక్కరూ పని చేయడం లేదని స్పష్టమవుతుంది. దీనివలన ప్రజలకు కార్యకర్తలకు ఈ మధ్యన  సమన్వయం తెగిపోయే అవకాశం 

ఉంటుంది. కనుక పార్టీ ఇన్చార్జ్, తను నియమించే నాయకులను పార్టీ కోసం పని చేసే విధంగా మార్చుకోవలసిన అవసరం ఉంది.

ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గం నందు కొడాలి నాని గారిని ఢీ కొట్టాలి అంటే,  బరిలో ఉండబోయే అభ్యర్థికి సహనం మరియు సమయస్ఫూర్తితో పాటు ఆర్థికంగా కూడా బలంగా ఉండవలసిన అవసరం ఉంది. డబ్బుని ప్రామాణికంగా చూసుకుంటే కొడాలి నాని గారిని ఓడించడం కష్టం కనుక డబ్బుని ప్రామాణికంగా తీసివేసి, సమయస్ఫూర్తితో కొడాలి నాని గారి పై వచ్చిన వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు అయితే, కచ్చితంగా రాబోయే ఎన్నికలలో కొడాలి నాని గారు ఓడిపోయే అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఈ నియోజకవర్గం నందు ఇప్పటినుండి టిడిపి పార్టీ తన అభ్యర్థికి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను, గమనించి అడుగులు ముందుకు వేయవలసి ఉన్నది.

గుడ్లవల్లేరు మరియు నందివాడ మండలంలోని గ్రామాలలో టీడీపీ ఓటుబ్యాంకు స్థిరంగానే ఉన్నప్పటికీ వారికి సమర్థవంతమైన నాయకుడు కనపడటం లేదు. తను మండలంలో టిడిపి కార్యకర్తలు వారిని సమన్వయపర్చి పార్టీ ఇన్ఛార్జి ముందుకు పోవాల్సి ఉంది. అదేవిధంగా నందివాడ మండలం లోని రుద్రపాక గ్రామంలో ఉన్నటువంటి పిన్నమనేని బాబ్జీగారు  కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలవడానికి సన్నద్ధం అవుతున్నారు. బాబ్జీ గారికి విశ్లేషణ పూర్వకంగా మంచి ఉన్నప్పటికీ రాజకీయంగా చాలా అనుభవాన్ని  సంపాదించుకోవలసి ఉంది. రావి వెంకటేశ్వరరావు గారు ఈ మండలాల్లో బలాన్ని సంపాదించుకోవాలంటే పిన్నమనేని వెంకటేశ్వరావు గారి అనుభవాన్ని తనకు జత కలుపుకోవలసి ఉంది. ఇప్పటికే రావి వెంకటేశ్వరరావుగారు ప్రారంభించిన కార్యక్రమాలకు  సంబంధించి పిన్నమనేని వారి కుటుంబానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ముందుకు వెళుతున్నారని ఆరోపిస్తున్నారు. కనీసం రాబోయే ఎన్నికలలో టిడిపి పార్టీలో వర్గాలు ఏర్పడకుండా ఉండాలంటే ముందునుండి రావి వెంకటేశ్వర రావుగారు అందరినీ సమన్వయపరుచుకుని ముందుకు వెళ్లాల్సి ఉంది.

ఈ నియోజకవర్గం నుండి జనసేన పార్టీకి కేవలం 5 శాతం మాత్రమే ఏర్పడింది. జనసేన పార్టీకి మండలస్థాయిలో మరియు గ్రామస్థాయిలో సరియైన కార్యకర్తలు లేకపోవడం గమనార్హం. నియోజకవర్గ పరిధిలో కాపు ఓటింగ్ ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం లోపాల వల్లే జనసేన పార్టీకి పెద్దగా ఓటింగ్ పడే అవకాశం లేదు. ఒకవేళ కొడాలి నాని గారిపై ఏర్పడిన అసంతృప్తి మరియు టిడిపిపార్టీ నుంచి నాయకత్వలోపాల వలన జనసేన పార్టీ బలపడే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనకు పన్నెండు వేల నుంచి పది వేలు ఓట్లు పడే అవకాశం నియోజకవర్గం నందు ఉన్నవి. కనుక టిడిపి పార్టీ ఇన్ఛార్జి క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని మరియు పార్టీ అభ్యర్థుల్లో గమనించి వారిని కూడా ఆకర్షించే కార్యక్రమాలను చేపట్టి టీడీపీ పార్టీకి ఆ బలాన్ని చేకూర్చే బాధ్యత ఇన్ఛార్జికి మాత్రమే ఉన్నది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి