మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, అక్టోబర్ 2026, ఆదివారం

గన్నవరం నియోజకవర్గం (కృష్ణాజిల్లా)

    గన్నవరం నియోజకవర్గంలో 2009 నుండి 2019 సంవత్సరం వరకు జరిగిన మÖడు అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మÖడుసార్లు టిడిపి పార్టీ విజయం సాధించడం జరిగింది.  2009 అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముద్రపోయిన వెంకటేశ్వరావు పైన టిడిపి పార్టీ అభ్యర్థి దాసరి బాలవర్ధనరావు సుమారు 15,295 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఈ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన బత్తిన రామా మోహన రావు సుమారు 11 శాతం ఓట్లను సాధించడం జరిగింది. అదేవిధంగా 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పార్టీ నుంచి వల్లభనేని వంశీ మోహన్ గారికి అవకాశం లభించింది. వల్లభనేని వంశీ మోహన్ గారు తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుత్త రామచంద్రరావు గారి పైన సుమారు 9,548 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వల్లభనేని వంశీ మోహన్ గారికి టిడిపి పార్టీ నుండి మరొకసారి అవకాశం లభించింది. ఈ ఎన్నికలలో వల్లభనేని వంశీ మోహన్ గారు తన సమీప ప్రత్యర్థి ఆయన వైఎసఆర్‌సిపి పార్టీ అభ్యర్థి  యార్లగడ్డ వెంకటరావు గారి పైన కేవలం 990 ఓట్ల మెజార్టీతో మాత్రమే విజయం సాధించడం జరిగింది. 2014 సంవత్సరంతో పోలిస్తే వల్లభనేని వంశీ మోహన్ గారికి ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ ఆధిక్యత విషయంలో బలహీన పడుతూ వచ్చారు. తర్వాత కొంత కాలానికి వల్లభనేని వంశీ గారు టిడిపి పార్టీ నుండి వైయస్సార్‌సిపి పార్టీలోకి వెళ్లడం జరిగింది.

వల్లభనేని వంశీ గారు పార్టీ మారిన తర్వాత తన సొంత క్యాడర్ గతంలో టిడిపి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వంశీగారి అడుగుజాడల్లో నడిచినట్లు ప్రజలు చెబుతున్నారు. స్థానికంగా వైయస్సార్‌సిపి పార్టీలో నుండి పోటీచేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు గారు, మరియు వల్లభనేని వంశీ మోహన్ గారు మరియు రామచంద్రరావు గారు.... ఇలా కేవలం ఒక్క వైసీపీ పార్టీలోనే మÖడు వర్గాలుగా కార్యకర్తలు విడిపోయారు. యార్లగడ్డ వెంకట్రావు గారు ఓడిపోయిన తర్వాత తనపై ప్రజల్లో సానుభూతి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. వల్లభనేని వంశీ గారు పార్టీ మారిన తర్వాత కొంతమంది వైసిపి పార్టీ కార్యకర్తలకు తనపై అసంతృప్తి ఏర్పడింది. కానీ ప్రజలలో సర్వే నిర్వహిస్తున్నప్పుడు వల్లభనేని వంశీ గారు బడుగు బలహీన వర్గాలను బాగా కలుపుకుపోతారని ఇతనిపై వ్యక్తిగతంగా కొంతవరకూ అభిమానం ఏర్పడింది. వల్లభనేని వంశీగారిపై క్షేత్రస్థాయిలో ఉన్న టిడిపి ఓట్‌బ్యాంక్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావు గారు బడుగు బలహీన వర్గాలను కలుపుకోవడంలో కొంత విఫలమైనట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నప్పుడు కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలు సుమారు 40 శాతం వల్లభనేని వంశీగారిపై వ్యతిరేకత ప్రదర్శించారు. ఈ వ్యతిరేకత రాబోయే ఎన్నికల్లో  వల్లభనేని వంశీ గారి యొక్క విజయానికి ఎదురు దెబ్బతీసేలా ఏర్పడింది. 

ఈ నియోజకవర్గంలో  టిడిపి పార్టీ నుంచి ఇన్చార్జిగా ఉన్న బచ్చుల అర్జునుడు ప్రజలను ఆకట్టుకోవడంలో విఫలమవుతూ వస్తున్నారు. బచ్చుల అర్జునుడు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా కాలం పాటు వీరు నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. కొంతకాలం కింది నుండి మాత్రమే తన సొంత సామాజిక వర్గమైన యాదవ సామాజిక వర్గంలో ప్రజలను కలుస్తున్నట్లు చెబుతున్నారు. సంస్థ సభ్యులు ఈ విషయంపై బచ్చుల అర్జునుడిని ప్రశ్నించినపుడు కరోనా కారణంగా అతను ప్రజలకు కొంత దూరంలో ఉన్న మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు. బచ్చుల అర్జునుడికి స్వతహాగా ఈ నియోజకవర్గం మీద పూర్తిస్థాయిలో పట్టు లేకపోవడం గమనార్హం. ఇతను నియోజకవర్గ పరిధిలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ప్రజలను ఆకట్టుకోలేక పోతున్నారు అనే విషయం సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గంలో టిడిపి పార్టీ గెలవాలి అంటే ఇక్కడ బచ్చుల అర్జునుడు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అయినప్పటికీ గెలుపును నిర్ణయించలేము.

ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి రాబోయే ఎన్నికల్లో, ఒకవేళ వల్లభనేని వంశీ మోహన్‌గారికి మరొకసారి అవకాశం ఇస్తే, టిడిపి పార్టీ నుండి ఎవరు బరిలో ఉంటే బాగుంటుంది అని ప్రజలను ప్రశ్నించినప్పుడు సుమారు 45% ప్రజలు యార్లగడ్డ వెంకట్రావు గారి పేరుని ప్రస్తావించడం జరిగింది. కానీ ప్రస్తుతం యార్లగడ్డ వెంకట్రావు గారు వైసీపీ పార్టీలో ఉన్నారు. ఒకవేళ వెంకట్రావు గారు టిడిపి పార్టీలోకి వస్తే టిడిపి పార్టీ గెలిచే అవకాశాలు  ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ యార్లగడ్డ వెంకట్రావు గారు టిడిపి పార్టీలోకి వస్తే, తనతోపాటు ఉన్న వైకాపా పార్టీ కార్యకర్తలు సుమారు 60 శాతం మంది టీడీపీలోకి వస్తే గాని టిడిపికి బలం చేకూరే అవకాశం లేదు. కనుక యార్లగడ్డ వెంకటరావు గారి టిడిపి పార్టీ ప్రవేశంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి 

ఉంటుంది. మరో 30 శాతం ప్రజలు గద్దె రామ్మోహన్ గారి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారు ఇదే నియోజకవర్గంలో గతంలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. వీరిపై ప్రజలలో పూర్తిస్థాయిలో నమ్మకం ఉన్నది. ప్రస్తుతం వీరు విజయవాడ తూర్పు నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు. ప్రజల్లో వీరిపై ఉన్నా నమ్మకంతో, సంస్థ సభ్యులు వీరిని సంప్రదించడం జరిగింది. వీరికి ఆర్థికపరంగా గతంలో కూడా టిడిపి పార్టీ సహాయం చేసింది. రాబోయే ఎన్నికలలో గన్నవరం నుండి అవకాశం ఇస్తే పోటీ చేస్తారా అని ప్రశ్నించినపుడు, వారు కొంత ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవ సామాజిక వర్గం ప్రజలను సంస్థ సభ్యులు సర్వే నిర్వహించినప్పుడు ఈ సామాజిక వర్గంలో ఎక్కువ శాతం ప్రజలు బచ్చుల అర్జునుడుకి సానుకూలంగానే ఉన్నప్పటికీ, బచ్చుల అర్జునుడు గారు ఈ నియోజకవర్గానికి తగిన వాడు కాదని  ప్రజలు చెబుతున్నారు. కనుక పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బచ్చుల అర్జునుడు గారు ఈ నియోజకవర్గంలో 

ఉన్నటువంటి టిడిపి క్యాడర్‌ను సమానంగా కలుపుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇదే నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన దాసరి బాలవర్ధన్ రావు గారు కూడా రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. 

ఈ నియోజకవర్గంలో వైయస్సార్ సిపి పార్టీ అభ్యర్థిని ఓడించడానికి టిడిపి పార్టీ బలమైన  నాయకుడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. 

సర్వే సంస్థ సభ్యులు సర్వే నిర్వహిస్తున్న సమయంలో, రాబోయే ఎన్నికలలో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని అడిగినప్పుడు సుమారు 40 శాతం ప్రజలు టిడిపి పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. అదేవిధంగా 8 శాతం ప్రజలు జనసేన పార్టీ వైపు ఉన్నారు. ఒకవేళ టిడిపి పార్టీ జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే రాబోయే ఎన్నికలలో వైసిపి పార్టీ ఓడిపోతున్నడంలో ఎటువంటి సందేహం లేదు. వల్లభనేని వంశీగారు ఈ నియోజక వర్గంలో పూర్తిస్థాయిలో ఎదుర్కొంటున్నారు. కొంతకాలం కిందట చంద్రబాబు గారి కుటుంబాన్ని దూషించినందుకు గాను నియోజకవర్గంలో ఉన్న భిన్న సామాజిక వర్గ ప్రజలు వంశీగారి యొక్క ప్రవర్తనను తప్పు పడుతున్నారు. వీరిపై వ్యక్తిగతంగా ఎక్కువ శాతం వ్యతిరేకత తోడైంది. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో వంశీ గారికి మరొకసారి అవకాశం  ఇస్తే, నియోజకవర్గ ప్రజలు తనపై ఉన్న వ్యతిరేకతతో  వల్లభనేని వంశీ గారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది జరగాలి అంటే టిడిపి పార్టీ నుండి ప్రజలకు నమ్మకం కలిగించే   విధంగా, ఒక బలమైన మరియు సమర్థవంతమైన నాయకులు ఈ నియోజకవర్గంలో నుండి బరిలో దించవలసి ఉంటుంది.

వంశీ దారికి అనుకూలమైన అంశాలు:

1. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా అందుబాటులో ఉండటం

2. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేస్తూ వారితో సంప్రదింపులు జరపడం.

3. నియోజకవర్గంలో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేయించడం.

4. నియోజకవర్గంలోని ప్రజలకు అనుకూలమైన సమయంలో అందుబాటులో ఉండటం.

5. యువతకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్లడం.

వంశీ గారికి ప్రతికూల అంశాలు:

1. తనతో పాటు టిడిపి నుంచి వైసిపికి మారిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వడం

2. ఇప్పటికే ఉన్న వైసిపి వర్గాన్ని సరిగా పట్టించుకోకుండా దూరంగా ఉంచడం

3. మొదటినుంచి గ్రామంలో ఉన్న కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి వారిని ఇబ్బందులకు గురి చేయించడం.

4. ప్రతి గ్రామంలోని గ్రూపు రాజకీయాలను ఎంకరేజ్ చేయడం.

5. యాదవ సామాజిక వర్గంలో సమన్వయంగా  లేకపోవడం.

ఒకవేళ వైసీపీ నుంచి వల్లభనేని వంశీమోహన్ గారు పోటీ చేస్తే:

1. వ్యక్తిగత  ఇమేజ్‌తో ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది.

2. ఆర్థికంగా బాగా వెసులుబాటు కలిగిన వ్యక్తి కావడం మరొక ప్లస్ పాయింట్.

3. కమ్మ సామాజిక వర్గ ప్రజలు అతనికి వ్యతిరేకంగా ఉండడం టిడిపికి ప్లస్ పాయింట్

4. నియోజకవర్గంలో ఉన్న పాత వైసిపి వర్గాన్ని పట్టించుకోవడం ఇతనిపై వ్యతిరేకతకు దారితీస్తుంది.

ఒకవేళ వెంకట్రావు గారు వైసిపి పార్టీ నుండి పోటీ చేస్తే.

1. వ్యక్తిగత ఇమేజ్ వల్ల వంశి గారి కంటే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది

2. కమ్మ సామాజిక వర్గ ప్రజలు వెంకట్ రావు గారికి పూర్తిస్థాయిలో సహకరిస్తారు

3. వీరిపై ఏర్పడిన సానుభూతి వలన మరికొంత బలం చేకూరే అవకాశం ఉంది.

4. వీరిపై గ్రామాలలో  క్షేత్రస్థాయిలో పర్యటించ లేదు. కనుక వీరిపై వ్యతిరేకత ఏర్పడింది.

ఒకవేళ వెంకట్రావు గారు టిడిపి పార్టీ నుండి పోటీ చేస్తే.:

1. వీరి పేరు మీద సానుభూతి వలన ఓటింగ్ ఎక్కువ పడే అవకాశం ఉంది.

2. వల్లభనేని వంశీ గారి మీద ఏర్పడిన వ్యక్తిగత వ్యతిరేకత వలన మరికొంత ఓటింగ్  జత కలిసే అవకాశం ఉంది. 

3. కమ్మ సామాజిక వర్గ ప్రజలు పూర్తి స్థాయిలో వీరికి సహకరించే అవకాశం ఉంటుంది.

4. వీరితో పాటు వైసిపి కేడర్ కూడా వస్తే టిడిపి పార్టీకి పూర్తి స్థాయిలో బలం చేకూరుతుంది.

5. జగన్ ప్రభుత్వం పై ఏర్పడిన వ్యతిరేకత, మరియు వీరిపై ఏర్పడిన సానుభూతి రెండూ కలిసి ఎక్కువ శాతం మెజార్టీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

ఏది ఏమైనప్పటికీ ఈ నియోజకవర్గంలో టిడిపి పార్టీ విజయం సాధించాలంటే...

1. బచ్చుల అర్జునుడు ప్రస్తుత ఇన్చార్జిగా ఉన్నప్పటికీ ప్రజాకర్షణ కార్యక్రమంలో విఫలమవుతున్నారు. కనుక పూర్తిస్థాయిలో ఇక్కడ ఇంచార్జ్‌ను  నియమించాల్సి ఉంటుంది.

2. యార్లగడ్డ వెంకట్రావు గారు టిడిపి పార్టీలోకి ప్రవేశించినట్లైతే టిడిపిపార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వెంకట్రావుగారితో పాటు తన తోటి కేడర్ కూడా టిడిపిలో ప్రవేశించాల్సి ఉంటుంది.

3. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ గారికి ఈ నియోజకవర్గం మీద పట్టు ఉన్నందున, వారిని కూడా సమన్వయ పరుచుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

4. ఈ నియోజక వర్గంలో ఉన్నటువంటి పాత టిడిపి క్యాడర్ అందరిని సమన్వయపరిచి పార్టీ విజయం కోసం పని చేసేలా ప్రోత్సహించవలసి ఉంటుంది.

5. ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న బచ్చుల అర్జునుడు అన్ని సామాజిక ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి.

6. ఈ నియోజకవర్గంలో టిడిపి క్యాడర్ మొత్తాన్ని పునర్నిర్మాణం చేయించుకోవాల్సి 

ఉంటుంది.

7. విజయవాడ రూరల్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఉన్న కమ్మ సామాజిక వర్గం ప్రజలను ఆకర్షించడానికి మరింత శ్రమించవలసి ఉంటుంది.

8. బాపులపాడు మండలంలో ఉన్న ఎస్సి ఓటర్లలో వారికి తగిన బలమైన నాయకుడు వారి సామాజిక వర్గంలో లేకపోవడం కొంత ఇబ్బందులకు గురి చేస్తోంది.

9. ఒకవేళ గద్దె రామ్మోహన్ గారు ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే కూడా టిడిపి పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి.

10. ఇప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఒక బలమైన అభ్యర్థిని ఇన్చార్జిగా నియమించకపోతే టిడిపి పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి