మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, అక్టోబర్ 2026, ఆదివారం

కందుకూరు నియోజకవర్గం

కందుకూరు నియోజకవర్గం, ఐదు మండలాలు, ఒక మున్సిపాలిటీ, 99 పంచాయితీలు, 269 బూతులు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. 2004 నుంచి 2019 వరకు అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పార్టీ కనీసం ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 1994 నుంచి 2004 వరకు టిడిపి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న దివి శివరాంగారు విజయం సాధించడం జరిగింది. 2004 సంవత్సరంలో శివరాంగారు 7879 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మానుగుంట మహీధర్ రెడ్డిపై ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 2009లోనూ వీరిరువురి మధ్య పోటీ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహీధర్ రెడ్డి, టిడిపిపార్టీ అభ్యర్థి దివిశివరాంపై 4243 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట జరిగిన అసెంబ్లీఎన్నికలలో, ఈ నియోజకవర్గంలో వైసిపి పార్టీ అభ్యర్థి పోతుల రామారావు చేతిలో టిడిపి పార్టీ అభ్యర్థి దివి శివరాం గారు సుమారు 3806 ఓట్ల తేడాతో కోల్పోవడం జరిగింది. వరుసగా మÖడుసార్లు ఓటమిపాలైన శివరాం గారు ఎన్నికల బరినుంచి పక్కకు పోయినప్పటికీ, టిడిపిపార్టీ రాజకీయాల్లో నియోజకవర్గం నందు కీలక పాత్ర పోషిస్తున్నారు. 

2014లో విజయం సాధించిన పోతుల రామారావు గారు 2016 సంవత్సరంలో టిడిపి పార్టీలోకి ప్రవేశించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో టిడిపిపార్టీలో 2016 వరకు కార్యకర్తల మధ్య ఎటువంటి వర్గాలు లేవు. 2016 పోతుల రామారావు గారు టిడిపి పార్టీ లోకి చేరిన తర్వాత, రామారావుగారు మండలానికి ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించుకొని, సామంత రాజుల పాలన మాదిరిగా పరిపాలించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టిడిపి పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం, దివి శివరాం గారేనని కొన్ని సామాజిక వర్గాలు అంటున్నాయి. ఈ నియోజకవర్గంలో సామాజికవర్గాల పరంగా పరిశీలించినట్లయితే కమ్మ సామాజిక వర్గం 45000, ఎస్సీ సామాజిక వర్గం 40000 బీసీల సామాజికవర్గం (అన్నీ కలిపి) 45000, మైనారిటీ సామాజిక వర్గం 13000, శక్తి సామాజిక వర్గం 10000 మరియు ఇతరులు ఉన్నారు.

దివి శివరాం గారు గతంలో టిడిపిపార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వరుసగా మÖడు సార్లు ఓడిపోయిన తర్వాత కూడా పదవీ వ్యామోహం ఇంకా తగ్గలేదని స్పష్టమైంది. 2014 వరకు కూడా శివరాం గారు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, తర్వాత తలపునేని వెంకటేశ్వరరావు గారికి ఏఎంసి చైర్మన్ బాధ్యతలు అప్పగించి, వారిద్వారా కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని ప్రజలు చెబుతున్నారు. 2019 ఎలక్షన్లకు ముందు వెంకటేశ్వర రావు గారిని, శివరాం గారు కావాలని వైసీపీ పార్టీలోకి పంపించారని కూడా చెబుతున్నారు. వెంకటేశ్వర్ రావు గారికి మరియు దివి శివరాం గారికి ఇప్పటికీ పరస్పర సంప్రదింపులు ఉన్నాయని ప్రజలు స్పష్టం చేశారు. దివి శివరాం గారికి 2014 ముందు లేని అవినీతి ఆరోపణలు 2014 తర్వాత విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. దివి శివరాం గారిపై వ్యక్తిగతంగా తన సామాజిక వర్గంలోని ప్రజలలో కూడా వ్యతిరేకత చోటుచేసుకుంది. 

కొంతమంది తన సామాజిక వర్గ ప్రజలు శివరాం గారిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు ఎవరినీ ఎదగనీయరు అని, ఎవరితోనూ సక్రమంగా మాట్లాడారనీ, చాలా కోపిష్టి అని ఆరోపణలు వెలువడ్డాయి. ప్రతి చిన్న విషయానికి అతిగా ఆవేశపడతారని, ఏ ఒక్కరు కూడా ఒక రోజుకు మించి తన దగ్గర పని చేయలేరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ యొక్క లక్షణాల వలన ఈ నియోజకవర్గంలో టిడిపిపార్టీ యొక్క గెలుపుపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఈ లక్షణాలన్నింటినీ అధిష్టానం గుర్తించి, వీరి  యొక్క వైఖరి మారేలా తగిన సలహాలు ఇస్తే , పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. 

దివి శివరాం గారి యొక్క భార్య, దివి సౌభాగ్య గారు కూడా 2019 ఎలక్షన్లలో పోతుల రామారావు గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని నియోజకవర్గంలోని మహిళలు సర్వే సంస్థకు వివరించారు. పైగా సంస్థ సభ్యులు దివి శివరాం గారితో సంప్రదింపులు జరుగుతున్నప్పుడు, 1999 సంవత్సరం వారి విజయం తర్వాత ఇప్పటివరకు 

ఈ నియోజకవర్గంలో టిడిపి పార్టీ గెలవలేదని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ విశ్లేషణను గమనిస్తే దివి శివరాం గారికి ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుపు కన్నా, తన యొక్క ీVAదాకి ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తున్నట్టు స్పష్టమైనది. అదేవిధంగా శివరామ్ గారిని సంస్థ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, వారు తగిన సమాధానం ఇవ్వడానికి స్వల్పంగా తడబడినట్లు గమనించడం జరిగింది. 

నియోజకవర్గంలో టిడిపి పార్టీ ఓడిపోయినా పర్లేదు గాని, శివరాంగారికి మాత్రం ప్రత్యేక ీVAదా ఉండాలని కోరుకుంటున్నట్లు వారి మాటలద్వారా స్పష్టమైంది. నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తున్నప్పుడు, కందుకూరు పట్టణ పరిధిలో శెట్టి సామాజిక వర్గంలో ఉన్న  ప్రజలు శివరాం గారు టిడిపి పార్టీలో ఉన్నంతకాలం వారు ఓటు వేసేలా  లేరని ప్రస్తావించారు. బడుగు బలహీన వర్గాలను తక్కువ చేసి మాట్లాడతారనే వాదనలు క్షేత్రస్థాయి కార్యకర్తల నుండి వినిపించాయి. ఏదైనా సామాజిక వర్గం ప్రజలు పార్టీలో చేరడానికి వస్తే “వీడి వల్ల మనకు ఏమవుతుంది” అన్న చులకన భావంతో తక్కువ చేసి మాట్లాడతారని ప్రజలు వారి అభిప్రాయాన్ని చెప్పారు. పైగా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో దివి శివరాం గారి భార్యని రాబోయే ఎన్నికలలో చైర్మన్‌గా పోటీ చేయబోతున్నట్లు పలురకాల ప్రజలు చెబుతున్నారు.

2019 వ సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో టిడిపి పార్టీ అభ్యర్థి పోతుల రామారావు  గారు ఓడిపోయిన తర్వాత, తను నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. పోతుల రామారావు గారికి అనారోగ్యం కారణంగా రెండు సంవత్సరాల పార్టీకి మరియు  నియోజకవర్గానికి దూరంగా ఉన్న మాట వాస్తవమే. కానీ సంస్థ సభ్యులు వారితో సంప్రదించినప్పుడు, 2019లో తన ఓటమికి ప్రధాన కారణం శివరాం గారి భార్య,  మరియు శివరాం గారు కూడా అని ప్రస్తావించారు. తను టిడిపి పార్టీ లోకి చేరిన తర్వాత ఆరు నెలల సమయం శివరామ్ గారిని అర్థం చేసుకోవడానికి సరిపోయిందని, మిగిలిన సంవత్సర కాలంలో కందుకూరు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పుకొచ్చారు. 

కానీ వాస్తవ రూపంలో కూడా నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు రుజువైంది. కానీ ప్రజలను సంస్థ సభ్యులు పోతుల రామారావు గురించి ప్రశ్నించినప్పుడు, వారికి ఆరోగ్యం బాగోలేక దూరంగా ఉన్నారని కొందరు, ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం వైపు చూడలేదని మరికొందరు, వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కానీ పోతుల రామారావు గారిని సంస్థ సభ్యులు సంప్రదించినప్పుడు, పార్టీ అధిష్టానవర్గం తనని ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకోమని అడిగినప్పుడు, వారు 2022 అక్టోబర్‌నుంచి యాక్టివ్‌గా ఉంటానని అధిష్టానంతో వివరించినట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని గమనించినట్లయితే, పోతుల రామారావు గారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు పరోక్ష పద్ధతిలో సంస్థకు వివరించారు.

     2019 సంవత్సరంలో నియోజికవర్గంలో టిడిపి పార్టీ ఓటమి తర్వాత, ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకునే బలమైన నాయకుడు కనిపించలేదు. కానీ స్థానికంగా ఉన్న శివరాంగారు కూడా ఈ కార్యకర్తలను పట్టించుకోలేదు. 2020లో తనకు హార్ట్ ఆపరేషన్ అయిందని, తను కూడా ఒక సంవత్సరం విశ్రాంతి తీసుకున్నారని ప్రజలు చెబుతున్నారు. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఉన్న ఓలేటివారిపాలెం మండలానికి సంబంధించిన బడేవారిపాలెంకు చెందిన ఇంటూరి రాజేష్ అనే వ్యక్తి వ్యాపారరంగంలో అంచెలంచెలుగా ఎదిగి, ప్రజాసేవ చేయాలని తపనతో మొదట పోతుల రామారావు గారిని కలవడం జరిగింది. 

పోతుల రామారావు గారితో, రాజేష్‌గారు తన ఆలోచన గురించి వివరించినప్పుడు రామారావుగారు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. తద్వారా నియోజకవర్గంలో ఉన్న దివి శివరాం గారిని కలవడం జరిగింది. దివి శివరాం గారు రాజేష్ గారిని ప్రోత్సహించి పార్టీలోని పెద్దలకు పరిచయం చేసి వారికి ఒక పోస్ట్‌ని ఇప్పించారు. తర్వాత కాలంలో ఇంటూరి రాజేష్ గారికి, దివి శివరాం గారికి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. దివి శివరాం గారు రాజేష్ గారిని పక్కన వేసుకుని మరీ ప్రతి గ్రామంలో తిరిగి పంచాయతీ ఎన్నికలలో రాజేష్‌గారి చేతుల మీదుగా కొంత ఆర్థికసహాయం చేయడం జరిగింది. సుమారు 80 లక్షల రూపాయలు పంచాయతీ ఎన్నికలకు తను ఖర్చు పెట్టినట్టుగా రాజేష్ గారు వివరించారు. టిడిపి పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, మరియు దివి శివరాం గారు కలిసి కొన్ని నామినేటెడ్ పోస్టుల లిస్టు తయారు చేస్తున్న సమయంలో, ఇంటూరి రాజేష్ గారు తనకు సంబంధించిన ఒక ఇద్దరికి ఇవ్వాలని కోరారు. కానీ దివిశివరాం గారు ఇంటూరు రాజేష్ గారి మాటలు పట్టించుకోలేదని, తనకిష్టం వచ్చిన వారికే పోస్టు ఇచ్చారనే కోపంతో, తనకు పార్టీ ఇచ్చిన పోస్ట్‌కి రాజేష్‌గారు రాజీనామా చేశారు. ఈ విషయంలో రాజేష్ గారికి క్షణికావేశం ఉన్నట్లు స్పష్టమైంది. రాజకీయ నాయకులకు క్షణికావేశం పనికిరాదు. 

ఈ విషయంలో రాజేష్ గారికి, శివరాం గారికి మధ్య కొంత ఘర్షణ జరిగింది. శివరాం గారికి రాజేష్‌గారి పైన కొంత వ్యతిరేక భావం మొదటిగా ఏర్పడింది. కానీ  ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే నిజానిజాలు అర్థమవుతాయి. తర్వాత కాలంలో అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, దివి శివరాం గారు గ్రామ గ్రామాల్లో చందాలు వసూలు చేసి కార్యక్రమం చేద్దామని అన్నారని, కానీ ఇంటూరి రాజేష్‌గారు మొత్తం ఖర్చు తానే పెడతానని అన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. 

అమరావతి పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో దివి శివరాం గారి ఫోటో ఎక్కడా కనిపించలేదని, శివరాం గారి కోపం “అగ్నికి ఆజ్యం పోసినట్లుగా”  రెట్టింపయింది. రాజేష్‌గారి మీద శివరాం గారికి అసూయ, ద్వేషం మొదలైనాయి. రాజేష్ గారు తనకంటూ ప్రత్యేకంగా సొంతంగా ఆఫీస్‌ని ఏర్పరుచుకున్నారు. దివి శివరాంగారేమో కార్యకర్తలను వారింటికి పిలుచుకోవడం, రాజేష్ గారు కార్యకర్తలను ఆఫీస్ దగ్గరికి రమ్మని అనడం, ఇలా వీరిద్దరి మధ్య ఒకరికి ఒకరికి గ్యాప్ ఏర్పడింది. దివి శివరాంగారికి ఇంటూరి రాజేష్ గారి మీద ఏర్పడిన ఇగో ఫీలింగ్ వల్ల మాత్రమే ఇరువురి మధ్యలో భేదాలకు దారి తీసింది.

దివి శివరాంగారు ఓలేటివారిపాలెం మండలానికి సంబంధించిన బడేవారిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరావు గారికి చాలాకాలం కిందట నుంచి అప్పుఉన్నారని తెలిసింది. ఈ క్రమంలో ఇంటూరి నాగేశ్వరావు గారు, దివి శివరాం గారిని తన డబ్బుల గురించి  అడిగినప్పుడు  ఇంటూరి నాగేశ్వరావుకి ఈ ఆలోచనను  ప్రస్తావించి ఉంటారని ప్రజలు అంటున్నారు. కానీ వాస్తవిక రూపం ఏంటంటే ఇంటూరి నాగేశ్వరావు గారికి దివి శివరాం గారు అప్పు ఉన్న మాట వాస్తవమే. కానీ ఇంటూరి నాగేశ్వరావుగారు, శివరాంగారి విషయంలో పూర్తిగా నమ్మకుండా తన యొక్క మిత్రబృందం (యార్లగడ్డ మురళి) ఉపయోగించి టిడిపి పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులతో (టి.డి.జనార్ధన్)  సంప్రదింపులు జరిపి తనకు కావలసిన ఇన్ఛార్జ్ పోస్టును తెప్పించుకున్నారని పలు వర్గాల ప్రజలు చెబుతున్నారు. 

దివి శివరాంగారు నాగేశ్వరరావు గారిని బాగా ప్రోత్సహించారని, సమన్వయ కమిటీ లిస్టును కూడా దివి శివరాంగారే దగ్గరుండి తయారు చేయించారని  కొంతమంది కార్యకర్తలు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మొదట 42 మంది సభ్యులతో వచ్చిన లిస్టు, 29 మంది సభ్యులకు ఎలా మారిందని రాజేష్‌గారు తన అనుమానాన్ని వ్యక్తపరిచారు.

ఇంటూరు నాగేశ్వరావు గారిని సంస్థ సభ్యులు సంప్రదించినప్పుడు, ఇంటూరి నాగేశ్వరావుగారిలో గమనించిన విషయం, వీరు ఎక్కువగా రిజర్వుడుగా ఉంటారని అర్థమైంది. తనకు నమ్మకం కలిగిన వారికి మాత్రమే అన్ని విషయాలు చెబుతున్నట్లు స్పష్టమైంది. ఈ విషయానికి సంబంధించి నాగేశ్వరావుగారి యొక్క అనుచరులను ప్రశ్నించినప్పుడు, “ఇంటూరి నాగేశ్వరావు గారు  ఇన్ఛార్జ్ పోస్టును డబ్బులు ఇచ్చి కొన్నారని   ఈ విషయాన్ని నాగేశ్వర రావు గారు స్వయంగా వీరితో అన్నట్లు కొంతమంది కార్యకర్తలు అంటున్నారు.” ఈ విషయంపై ఇంటూరు నాగేశ్వరరావు గారిని సంస్థసభ్యులు ప్రశ్నించినప్పుడు, తను కొంచెం తడ పడినట్లుగా అనిపించింది. అదేవిధంగా వీరు కొంత మంది కార్యకర్తలతో పార్టీ సీనియర్ నాయకుల గురించి కొంచెం వేరే విధంగా మాట్లాడినట్లు తన తోటి అనుచరులు చెబుతున్నారు. దీనివలన పార్టీ సీనియర్ నాయకుల మీద స్థానిక కార్యకర్యకర్తలలో పలు ప్రశ్నలు మొదలయ్యాయి.

ఇంటూరి నాగేశ్వరావు గారు వ్యాపారంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నప్పటికి, రాజకీయంలో వారికి ఇంకా అనుభవం రావాల్సి ఉంది. గతంలో వీరి భార్య సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం మినహా వీరికి మరే ఇతర రాజకీయ అనుభవం  లేదు. గతంలో ఇంటూరు రాజేష్‌ని ప్రోత్సహించిన దివి శివరాం గారు  ప్రస్తుతం  ఇంటూరి నాగేశ్వరరావుని కూడా ప్రోత్సహిస్తున్నట్లు  తెలుస్తుంది. అదేవిధంగా  ఇంటూరి నాగేశ్వరరావు గారికి శివరాం గారిపై పూర్తి విశ్వాసం లేదు అన్నట్లు తెలుస్తుంది. ఇంటూరి నాగేశ్వరరావు గారు కూడా వారిపై పూర్తిగా ఆధారపడకుండా తన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టమైంది.

ఇంటూరి నాగేశ్వరరావు గురించి ప్రజల్లో సంస్థ సభ్యులు సర్వే నిర్వహించినప్పుడు, వీరు ఇంకా  గ్రామాలలోకి ప్రవేశించలేదు అని స్పష్టమైంది. వీరి పేరు ప్రజలకు పరిచయం అయినప్పటికీ వీరిని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు అతి తక్కువ మంది ఉన్నారు. ఇంటూరు నాగేశ్వరరావు గారికి పని చేయాలనే తపన చాలా ఉన్నట్లు గమనించడం జరిగింది.  కానీ వీరి పనులకు దివి శివరాం గారు కొంత అడ్డుకట్ట వేసేలా ఉన్నట్లు కూడా గమనించడం జరిగింది.

ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గారిపై ప్రజలలో ఒక తెలియని వ్యతిరేకత కనపడింది. మహేందర్‌రెడ్డిగారు పైన పైన నటిస్తారని, లోలోపల తను చేయవలసిన కార్యక్రమాలు చేస్తారని చెబుతున్నారు. కొంతమంది టిడిపి కార్యకర్తలను పరోక్ష పద్ధతిలో బెదిరిస్తున్నట్లు కూడా ప్రజలు చెబుతున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే గారి మీద పోటీ చేయాలంటే టిడిపి పార్టీ అభ్యర్థికి...

1. నియోజకవర్గం మీద మంచి పట్టు ఉండాలి.

2. నియోజకవర్గంలోని విభిన్న సామాజిక వర్గాల మీద సరైన అవగాహన ఉండాలి.

3. మహీధర్ రెడ్డి గారి వ్యూహాలను అదుపుచేసే తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు ఉండాలి.

4. అభ్యర్థి, తన చుట్టూ ఉన్న కార్యకర్తలను అంచనా వేసే సామర్థ్యం కలిగి ఉండాలి.

5. ముఖ్యంగా మహీధర్ రెడ్డి  గారిని ఓడించాలంటే ఆర్థికపరమైన శక్తి బలంగా ఉండాలి.

6. ఓపిక, సమయస్ఫూర్తి, మరియు స్వయం నియంత్రణ శక్తి బలంగా ఉండాలి.

ఈ లక్షణాలు, ఏవి కూడా అటు ఇంటూరి రాజేష్‌లో, ఇటు  ఇంటూరి నాగేశ్వరరావు లో కనిపించలేదు. కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నారే తప్ప, మిగిలిన వాటిలో వీరికి పెద్దగా అవగాహన లేదు. పైగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని గైడ్ చేస్తున్న దివి శివరాం గారికి ఓపిక, సమయస్ఫూర్తి, మరియు సహనం ఇటువంటి ఏమీ లేవు అన్నట్లు సర్వే ద్వారా ప్రజలు వివరించారు.

ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో  క్షేత్రస్థాయిలో సంస్థ సర్వే నిర్వహించిన ప్పుడు  కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు పూర్తిగా టిడిపి వైపు రావాలంటే దివి శివరాం గారిని కొంత తటస్థం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా టిడిపి పార్టీ నుంచి ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అని ప్రజలను ప్రశ్నించినప్పుడు వీరిద్దరి పేరు గాకుండా పోతుల రామారావు గారి పేరు వినిపించడం గమనార్హం. మహీధర్ రెడ్డి గారిని ఢీ కొట్టాలంటే పోతుల రామారావుగారు అయితే బాగుంటుందని, వారు వస్తే అన్ని సామాజిక వర్గ ప్రజలు తనని ఆదరిస్తారని ప్రజలు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టిడిపి పార్టీ గెలవాలి అంటే.....

అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు అయినప్పుడు...

1. తాను స్వయం నియంత్రణ శక్తిని కూడగట్టుకోవాలి.

2. తన అనుచరులతో రహస్యాలను ఎక్కువగా పంచుకోకూడదు.

3. నియోజకవర్గం మీద క్షేత్రస్థాయిలో పూర్తి అనుభవాన్ని సంపాదించుకోవాలి.

4. దివి శివరాం గారిని  పూర్తిస్థాయిలో విశ్వసించకుండా, తనకంటూ ప్రత్యేక  కార్యాచరణను రూపొందించుకోవాలి.

5. సాయంత్రం సమయంలో జరిగే పూజా కార్యక్రమాలు కొన్నింటికి దూరంగా ఉండాలి.

6. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు తన తోటి అనుచరులతో పంచుకోకూడదు.

7. ఎప్పటికప్పుడు పార్టీ అధికార వర్గాలతో సంప్రదించి తగిన సలహాలు స్వీకరించి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది.

8. గతంలో పోటీ చేసిన పోతుల రామారావు గారిని, మరియు తను కార్యవర్గాన్ని కూడా సంప్రదించి అందరిని సమన్వయ పరుచుకుని ముందుకు వెళ్లవలసి ఉంది.

9. కార్యకర్తల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించవలసి ఉంటుంది.

10. బడుగు, బలహీన వర్గాల ప్రజలను చులకనగా చూడకుండా వారియొక్క ఆత్మగౌరవాన్ని సంపాదించుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయవలసి ఉంది.

11. వీరు ముఖ్యంగా పబ్లిక్‌లో మాట్లాడుతున్న సమయంలో, సమయస్ఫూర్తితో వ్యవహరించవలసి ఉంటుంది.

12. ఎవరు ఎన్ని రకాలుగా దూషించినా, తన సహనాన్ని కోల్పోకుండా ఓపికగా సమాధానం  చెప్పవలసి ఉంటుంది.

13. దివి శివరాం గారి యొక్క మాటలను క్షేత్రస్థాయిలో గమనించి ప్రజలతో మాట్లాడే సమయంలో జాగ్రత్త  వహించవలసి ఉంటుంది.

ఒకవేళ అభ్యర్థి పోతుల రామారావు గారు అయితే...

1. సామంత రాజుల పాలనకు స్వస్తి పలకాల్సి  ఉంటుంది.

2. మండలాల క్షేత్ర స్థాయి కార్యకర్తలందరిని ఒకేలా చూడవలసి ఉంటుంది.

3. బూత్‌స్థాయి పర్యవేక్షణ వీరికి చాలా అవసరం ఉంటుంది.

4. ప్రజాసమస్యలను వీరే స్వయంగా వినవలసి ఉంటుంది.

5. పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఎవరిని నమ్మకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.

6. దివి శివరాంగారి మాటల వల్ల ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండడం కోసం తగిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది.

కందుకూరు నియోజకవర్గంలో సుమారు 7500 శాంపిల్స్‌ను సేకరించి మా సంస్థ సర్వే నిర్వహించినప్పుడు వెలువడిన విషయం, నియోజకవర్గంలో టిడిపిపార్టీ బలంగా ఉన్నది. కానీ పార్టీనీ నడిపించడానికి సమర్థవంతమైన నాయకుడిని ఇంకా పార్టీ తీసుకురాలేదని స్పష్టమైంది. 

దివి శివరాంగారి యొక్క వైఖరి ప్రజలను మరియు కార్యకర్తలు పలురకాల ఇబ్బందులకు గురిచేస్తున్నది. దివి శివరాం గారు, వారి భార్య విపరీత చర్యలకు కళ్ళెం వేయవలసి ఉంటుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి