1. ప్రతి సంవత్సరము ఇద్దరు సాహితీవేత్తలకు డా.కపిలవాయి లింగమÖర్తి- మీనాక్షమ్మ పురస్కారము, కపిలవాయి కిషోర్ బాబు - భార్గవీదేవి పురస్కారం ఇవ్వదలచినాము. పురస్కార గ్రహీతలకు నగదు, మెమెంటో ప్రశంసాపత్రం అందజేస్తాము. ఆర్థిక వనరులను బట్టి సర్వసభ్య సమావేశం నిర్వహించి నగదు బహుమతి ని నిర్ణయిస్తాము.
2. కవుల రచనలు పుస్తకావిష్కర సభలు నిర్వహిస్తాము
3. కవి సమ్మేళనాలు ఇతర సాహిత్య గోష్టులు నిర్వహిస్తాము
4. డా.కపిలవాయి లింగమÖర్తి గారి ఆముద్రిత గ్రంథాలతో పాటు ఇతర ప్రముఖ కవుల గ్రంథాలను కూడా ముద్రణకు ప్రయత్నిస్తాము.
5. వివిధ సాహిత్య సాంస్కృతిక విషయాలపై అవగాహన కొరకు సాహిత్య ఉపన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాము
6. పాఠశాల, కళాశాల, స్నాతక, స్నాతకోత్తర విద్యార్థులకు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాము.
7. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ గ్రంథాలయాలకు విశ్వవిద్యాలయాలకు డా.కపిల వాయి లింగమÖర్తిగారి రచనలుతో పాటు ఇతర ప్రముఖ రచనలు కూడా అందజేస్తాము
8. సభ్యుల అనుమతితో ఇతర సాహిత్య, సమాజహిత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము.
9. సంస్థ ఆశయాలు ఉద్దేశాలు కలిసే ఇతర సంస్థలతో కూడా కలిసి వేదిక పంచుకొని కార్యక్రమాలలో పాలు పంచుకుంటాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి