మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, అక్టోబర్ 2026, గురువారం

సముద్రాల జూనియర్.....

 కామెడియన్ శివరావు ‘ అగ్నిమం త్రం’ పిక్చర్ తీయాలను కున్నాడు. దానికి నా చేత రాయించు కోవాలని అతని సంకల్పం. అప్పుడే నాకు సముద్రాల జూనియర్ అనే పేరు పెట్టాడు.... ఒకటి రెండేళ్ళ తర్వాత వినోదా పిక్చర్స్ డి. ఎల్. 

శాంతి చిత్రానికి నా చేత పాటలు రాయించి ‘సముద్రాల జూనియర’ అని పేరు వేశాడు. అరా ఈ పరి శ్రమలో పని చేసే ఇద్దరు ప్రము ఘఖులు చేసిన నామకరణం ప్రచా రమై. ప్రసిద్ధమైంది స్థిరపడిపోయింది. వా సముద్రాల ల్మీకిరామాయణం వ్రాసిన శ్రీనివాస శిరోమణి ఒక నాడు- చిన్నప్పుడు నా జాతకం చూసి, ఒరేయ్, నిన్ను రాఘవాచా చార్యుల కొడుకనరురా: మీ నాన్నను’రామా నుజం నా ‘న్న’ అంటారు,” అన్నాడు. నేను సముద్రాల జూనియర్ అయిన తరువాత, మా నాన్న “సము దాల సీనియర” అయినాడు. అంతకు ఆయన ఒట్టి “ సముద్రా ముందు ల”గా ఉండేవాడు.... శిరోమణిగారి జోస్యం అలా ఫలించింది. 

ఇప్పుడు నేను ‘సముద్రాల జూని జూనియర్ యరే’. ఎన్. టి. రామారావుగారు మొదలు తక్కుంగ.ల మిత్ర బృందమంతా ‘జూనియర్ భాయ’ అనే అంటారు. 

కాని, మా నాన్నకు ‘ఆచార్య మా రామానుజు’ ని మీది అభిమానం కొలదీ “వేంకట (అది ఇలవేలుపు) రామానుజస్వామి’ అని నామకర ణం చేశాడు. మదరాసు విశ్వవిద్యా లయం నన్ను వేంకటరామానుజా చార్యులుగా బి. ఎస్.సి పట్టభద్రుని చేసింది. కేవలం “ఎస్. వి. రామా నుజం, బి. ఎస్. సి.’గా ఆదాయపు పన్ను పుచ్చుకుంటోంది మదరాసు గవర్నమెంటు.... ఇవి ఇవి నా కేశవనా మాలు... మరొక్కటి మిగిలిపోయింది మాలు...మరొక్కటి అది నాన్న పెట్టిన పేరే....నేను కవిగా “భారతి”లో పద్యాలు అచ్చు అయిన రోజుల్లో అవి “సముద్రుడు” అనే పేరుతో వచ్చినై. 

మాయా లోకం’లో నేను రాసిన పాటలకు ‘సముద్రుడు’ అనే పేరే ఉందని జ్ఞాపకం. “సముద్రులు” అని నా పద్యాలు, నాన్న పద్యాలు, కలిపి “కడలి పొంగులు” అనే పేరుతో ముద్రించాం. “సముద్రాల” ముద్ర అప్పుడే నా మీద పడింది. 

కన్న తండ్రి అంటే ఇంట్లో కటిక నియంత. తండ్రి తలవాకిట వస్తే, తాము దొడ్డి దారిన తప్పుకుంటారు! పిల్లల తండ్రులైనా వారికీ పిరికి పోదు. అందుకు కారణం పసితనం లో వారికి తండ్రి కలిగించిన భయమే. మా నాన్న నన్ను అలా 

విజయ ఇద్దరు స్త్రీలు ఒక చోట చేరితే ఎన్నో సమస్య- కె.ఆర్.విజయ 

పెంచలేదు. చిన్నప్పుడు నాన్న కసిరి కొట్టినట్టు నాకు వ్యక్తస్మృ తిలో ఏమీ జ్ఞాపకం లేదు. పద హారు నిండగానే, పుత్రుని-మిత్రుడు లాగా చూడాలని ఆయన సిద్ధాంతం. ఆ వయసు నుంచే ఆయన “కామ శాస్త్రం” మొదలు “వ్యోమశాస్త్రం” వరకూప-రమాణువు మొదలు పర వరకు -ఎన్నో విషయాలు దైవం చెప్పి, మనం చదివి తెలుసుకోవా ల్సినవి ఎన్నో ఉన్నాయన్న ఒక జిగీష కలిగించారు. ఈ రోజుకూ ఆయన చదవందే నిద్రపోరుబీ నాకూ అదే అలవాటు వచ్చింది. 

నేను ఇంటర్మీడియేట్ చదివే నాటికే పద్యాలు రాయసాగాను. ఒక తమిళ చిత్రంలో య. సావిత్రి ప్రేయసి పద్యాలు కూడా రాశాను. అవన్నీ ఆయన చదివి, తప్పొప్పులు సవరించి ఇచ్చేవారు. నాకు సాహి త్యంలో డిగ్రీ పుచ్చుకోవాలని ఉండేది. ఆయన నన్ను బి. ఎస్.సి చదివించాడు. రేడియో ఇంజినీరింగ్ చదివించి, వాహినీ స్టూడియోలో రికార్డిస్ట్గా వేయించాడు. ఏ ఉద్యోగ మైనా బానిసత్వమే కాని, ఇంజనీ రైతే కొంత స్వేచ్ఛ ఉంటుందని, సినీ రచయితగా తాను పడిన కొన్ని బాధలు తన బిడ్డకు ఉండకూడదని ఆయన అభిప్రాయం కావచ్చు. 1949 జనవరిలో నేను వాహినీ సౌండ్ డిపార్ట్మెంట్ లో చేరేవాటికి ఆయన రచనలకు నేను కొంత చేదోడు వాదోడుగా ఉండడం కొందరు నిర్మాతలకు తెలుసు. వారందరూ “మీ అబ్బాయి కవి కావల్సినవాడే” అని కోడై కూశారు. మÖడేళ్ళ తర్వాత తప్పని సరై ‘నీ మొహాన నా రాతే రాసి ఉంటే తప్పేదేముం ద’ని ఒప్పుకున్నారు నాన్న. 1952 ఫిబ్రవరిలొ నాన్న ఒద్దన్నా-సము ద్రాల జూనియర్ పేరుతో నేను సినిమా రచయితనయ్యాను. 

నా పదమÖడవ ఏడు వరకు నేను మా ఊళ్ళోనే చదివాను. నేను మద్రాసుకు వచ్చిన కొత్తలో బి.ఎన్. రెడ్డిగారు “మీ తమ్ముడెప్పుడొచ్చా డు?” అన్నారట. మా నాన్న “నా పెద్ద కొడుకండీ,” అని చెప్పారట. అదేమిటో మరి ఈ రోజుకూ మేము అన్నదమ్ముల్లాగే తిరుగు తాం. నా నెరసిన తల, ముందు విశృంఖలంగా నేను పేలే అవాకులు చవాకులు: నాన్న ముందే నేను సిగరెట్లు కాల్చడం వగైరా 

“ శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న కథ”లో గణేష్ చూసిన కొత్త వాళ్ళెవరూ మేము తండ్రి కొడుకులమంటే ‘ఆ!’ అన కుండా ఉండలేరు. టేబుల్ ముందు కూచొని రాసేటప్పుడు - ఇద్దరం వాటి రచయితలమే. ‘మన సందున కృతక సాంప్రదాయాల ఆనకట్టలు అనవసరం’ అని ఆయన అభిప్రా యం.... ఆయన అంత అతి అధు నాతన, విశాల దృక్పథం గలవ్యకి. 

మా నాన్న మహారాజు కాక పోవచ్చు. కన్న తండ్రిగా నాకు లోటూ చేయలేదు. చదువుకునే రోజుల్లో కావల్సినంత డబ్బు ఇచ్చా డు. సంపూర్ణ స్వాతంత్య్రం ఇచ్చా డు. కాని, కట్టు తాళ్ళ కొసలు ఆయన చేతిలోనే ఉన్నాయి. తెం పుకోవలసిన అవసరం నాకు రా లేదు. ఆనాడే కాదుబీ నేటికి కూడా... నాకంటే ముందు తాను ఇంటికి వస్తే, ‘వాడిని కూడా రానీ. ఇద్దరం కలిసే తింటాం.’ అని ఏ వేళైనా సరే- అలా ఎదురు చూస్తూ కూచుంటాడు నాన్న ఒకవేళ నేనేముందు వస్తే, “అబ్బాయి పడుకున్నాడా?” అని అడుగుతాడు-పని ఉన్నట్లు ఒకసారి కనీసం కనపడైనా వెళ్ళాలి పని లేకపోయినా సరే. కడుపు తీపి అలా అనిపిస్తుందేమో! అందుకే “కన్నమనసు వెన్న లాటిదిబీ బిడ్డ మనసు గడ్డ గడ్డ లాటిది” కాబోలు. అన్నారు 

నాన్న ‘అసమా” రోగి కావడం, ఆ సమయంలో నేనే పక్కన ఉండి ఉపచారాలు చేయవలసి రావడం- మమ్మల్ని మరీ ఆత్మీయులను చేసిం దేమో! నడి పడుచు రోజుల్లో ఎప్పు డైనా పది రోజులు ఊళ్ళో లేకపోతే “పని ఉంది. ఎక్కువగా వస్తోంది,” అని రాస్తే, వెంటనే పరు గెతు కొచ్చేవాడ్ని. ఆయన పది రోజులు ఊళ్ళో లేకపోతే నాకూ తోచదు. చెప్పిన రోజుకు రాకపోతే - నాకు కోపం కూడా వసుంది బహుశా ఆయన్ని విడిచి ఉండలేక పోవడమే కారణం కావచ్చు. 

నాన్నంటే నాకు భయం లేదు. కాని, నా మాట ఆయన కాదనడు. నాతో చెప్పకుండా ఆయన ఏమీ చెయ్యడు. నాన్న నడక్కుండా నేనూ. ఏమీ చేయలేను. ఈ నాటికీ నాన్న రెండో ఆట సినిమాకు ‘నన్ను పోని. వ్వడు. నేను పోను-కార్డు ఉండి కూడా. ఆయనకు దగ్గు తెర వస్తే, ఎందరు పక్కన ఉన్నాసరే-“అబ్బా యిని పిలవండి,” అంటాడు. నా చేతితో వీపు నిమిరి, “తగ్గిపోయింది, “నాన్నా!” అంటే, ఆయనకు ధైర్యం. దగ్గు తగ్గుతుంది కూడా. అది మా అనుబంధం. 

కన్నతండ్రి నెత్తిన గొడులాటి వాడన్నారు. నాన్న నా కదే కాదుబీ 1. ఆప్తమిత్రుడు. బ్ర ీVA్మపదేశం చేసిన తండ్రి- గురువు, దైవం. మా “నాన్న నడిచే పుస్తకాలయం. ఒక క్షమాసముద్రం కరుణా నవాంబు పూరం. ఆ మనసు పాదరసం. ఒక్కోసారి అజ్ఞానంలో తునాతున కలు చేసినా - చేరతీసుకుంటే, మన్నించి, మళ్ళీ అతుక్కుంటుంది. ఆతడనేక యుద్ధముల ఆరియు తేరిన వృద్ధమÖర్తి. నేనో తరుణుండ- ఎన్నో విషయాలలో.... అది సత్యం. 

ఆయన అవధానాలు చేసిన కవి. .మనతో ఒక విషయం ధారాళంగా మాట్లాడుతూ, మరో విషయం ఆలో చించ గలడు. మేధాసంపన్నుడు. ఆయన ఆశయవాదేగాని, లౌకికుడు కాదుబీ అవకాశవాది అసలే కాదు. అందుకే కవిగానే మిగిలిపోయాడు. అందరికీ మా నాన్నలాటి నాన్నే “రంగులరాట్నం” చిత్రంలో నటించిన రేఖ దొరికితే, కొడుకులెంతైనా సుఖపడ తారు. కాని, అలాటి నాన్న చాలా దుర్లభుడు. నా పితృకారకుడు, పితృ స్థానాధిపతి, మహెచ్చలో వర్గోత్త మాంశలో ఉన్నాడు అది నాపూర్వ పుణ్యం. నా పితృభాగ్యం. అంతటి పూర్వపుణ్యం అందరికీ కావాలిగా? 

సముద్రాల సీనియర్ జగమెరికిన బ్రాహ్మడు. అంతటి ప్రసిద్ధు డైన కొడుకును కన్న తండ్రి పుణ్య శాలే. కాని, ఆ పుత్రుని నలుగురూ పొగడగా - పుత్రోత్సాహం పొందే రోజు, మా తాత చూడనోచుకోలేదు. “ఆచారీ, నీ బిడ్డ తండ్రి పేరు నిల బెడతాడులే,” అని అంటే, పొంగి పోయే అదృష్టం మా నాన్నకుంది. అది ఆయన పురాసుకృతం, పుత్ర భాగ్యం. 

నాన్న పెద్దవాడై పోతున్నాడు.... చలి రోజులలో ముసుగు పెట్టుకొని, నడి మంచాన కూచుని, ఆస్తమా దగ్గు తెరతో రొప్పుతూండగా-ఒకటి రెండు సార్లు “నాన్నా, నాన్నా!” అని పిలిచిన పలక్కపోతే, భయ మేస్తుంది. ఏ మతు బిళ్ళో వేసుకుని బోసి నోరు తెరిచి ఆ వృద్ధమÖర్తి సుషుపిలో ఉన్నప్పుడు - పక్కన కూచుంటే, గుండె గొంతు లోకి వస్తుంది: 

నాన్న....మా నాన్న .... నా సర్వ స్వం.... భగవంతుడా, నన్ను ఒంటరి వాడ్ని చెయ్యకు. నా తండ్రికి ఆరో గ్యం ప్రసాదించు. దీర్ఘాయుష్మం తుడ్ని చెయ్యి- అని ప్రార్తిస్తుంది.. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి