హనుమకొండనియోజకవర్గంలో గత కొంత కాలంగా రాజకీయాలలో భారీ మార్పులు సంభవిస్తూ వస్తున్నాయి. ఈ నియోజకవర్గం నందు 2018 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆరఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ తన సమీప ప్రత్యర్థి అయిన రేవూరి ప్రకాష్ రెడ్డిగారిపై సుమారు 36451 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం జరిగింది. రేవూరి ప్రకాష్‌రెడ్డి గారు కూటమిలో భాగంగా టిడిపి పార్టీ నుండి బరిలో దిగి పరాజయం పాలయ్యారు.
ఇదే సంవత్సరంలో జనతా పార్టీ నుండి బరిలో దిగిన ధర్మారావు మార్తినేని గారు కేవలం 4% ఓట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 2014 లో బిజెపి పార్టీ అభ్యర్థికి 13% ఓట్లు వచ్చినప్పటికీ 2018 లో ఓట్ బ్యాంక్ పడిపోవడం తనపై ఏర్పడిన వ్యక్తిగత వ్యతిరేకతకు దారి తీసింది. 2009 నుండి 2018 వరకు వరుసగా టిఆరఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ విజయం సాధిస్తూ రావడం జరుగుతుంది. కానీ గత ఆరు నెలలుగా తెలంగాణలో జరుగుతున్న భారీ పరిణామాలు ఈ నియోజకవర్గంపై చాలా ప్రభావం చూపెడుతున్నాయి.
వ్యక్తిగతంగా దాస్యం వినయ్ భాస్కర్‌పై ప్రజలలో మంచి అభిప్రాయమే ఉన్నప్పటికీ, సంస్థ సభ్యులు సర్వే నిర్వహిస్తున్నప్పుడు అతను కొన్ని అక్రమాలకు పాల్పడ్డాడని, భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు. రాబోయే ఎన్నికలలో వీరిపై వాటి ప్రభావం కనిపించే అవకాశమున్నది. టిఆరఎస్ పార్టీపైన ఏర్పడిన భిన్నాభిప్రాయాలవలన ఈ నియోజకవర్గంలో బిజెపిపార్టీ పట్టు సాధిస్తూ వస్తోంది. సంస్థ సభ్యులు సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఈ నియోజక వర్గంలో ఎక్కువ శాతం అక్షరాస్యత ఉన్నందున రాబోయే ఎన్నికలలో వారు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపించింది. గత ఆరునెలలనుంచి ఈ నియోజకవర్గంలో బిజెపి పార్టీ యొక్క గ్రాఫ్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఈ జిల్లా అధ్యక్షురాలైన రావు పద్మగారు గతంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బరిలో ఉన్నప్పటికీ తాను ఒక అధ్యక్షురాలుగా మాత్రమే ప్రజలకు పరిచయమై ఉన్నారు. కానీ సంస్థ సభ్యులు ప్రజల్లో వ్యక్తిగత ప్రశ్నలు “బిజెపి పార్టీ నుండి ఎవరు బరిలో ఉంటే బాగుంటుంది?” అని అడిగినప్పుడు అనూహ్యంగా ఏనుగుల రాకేష్ రెడ్డి గారి పేరు వినిపించడం గమనార్హం. ఈ నియోజక వర్గంలో ఉన్న అన్ని డివిజన్లలో కలిపి సుమారు 46% వ్యక్తిగత గ్రాఫ్‌ను సంపాదించుకున్నారు. సుమారు 7500 సాంపిల్స్‌ను సేకరించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించినప్పుడు ఈ నియోజకవర్గం నుండి టీఆరఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలిగే శక్తి కేవలం ఒక రాకేష్‌రెడ్డి గారికి మాత్రమే ఉంటుదని ప్రజలు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. టిఆరఎస్ పార్టీకి ఈ నియోజకవర్గంనుండి ఎదుర్కోవాలంటే అభ్యర్థికి సమయస్ఫూర్తి మరియు ట్రబుల్షూటర్గా శక్తిసామర్థ్యాలుండాలి. రాకేష్‌రెడ్డి గారిని ట్రబుల్ షూటర్‌గా మరియు మంచి వక్తగా ప్రజలు గుర్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై సత్వరమే స్పందించేశక్తి వీరికి మాత్రమే ఉన్నదని ప్రజలు తమ నిర్ణయాన్ని సంస్థతో తెలిపారు. ప్రజాసమస్యలను అర్థం చేసుకునే శక్తి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయ పరచుకునే శక్తి కూడా బలంగానే ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు.
డివిజన్ల పరిధిలో ఉన్న బిజెపి పార్టీ కార్యకర్తలను సంస్థ సభ్యులు సంప్రదించినప్పుడు భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. జిల్లా అధ్యక్షుల మీద అసహనం మరియు అసంతృప్తి వెలిబుచ్చారు. కార్యకర్తలను ఆకర్షించడంలో మరియు ప్రజాబలాన్ని సంపాదించడంలో రావు పద్మ గారు విఫలం అయినట్టు నియోజకవర్గంలో స్పష్టంగా కనిపించింది. ఇటువంటి పరిణామాల మధ్య బిజెపి పార్టీ నుంచి బరిలో ఉండబోయే అభ్యర్థికి అటు కార్యకర్తలను ఇటు ప్రజలని ఆకర్షించే శక్తి బలంగా ఉంది. ఏనుగుల రాకేష్‌రెడ్డి కన్నా టిఆరఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ గారికి వ్యక్తిగతంగా గ్రాఫ్ కొంత బలంగానే ఉన్నది. వరుస విజయాలతో దూసుకెళుతున్న వినయ్ భాస్కర్‌కి అడ్డుకట్ట వేయాలంటే ఈ నియోజకవర్గంలో ఒక్క బీజేపీ పార్టీకి మాత్రమే సాధ్యమౌతుంది అని ప్రజలు నిర్ణయించినట్లు అర్థమవుతుంది. కనుక బిజెపి పార్టీ నుండి బరిలో ఉండబోయే అభ్యర్థులను ప్రజలు క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నారు.
ఏనుగుల రాకేష్‌రెడ్డి గారు గత కొంతకాలంగా ప్రజలను ఆకర్షించే కార్యక్రమాలు చేయడంలో విజయం సాధిస్తూ వస్తున్నారు. వీరికి ముఖ్యంగా కొన్ని కాలనీల పరిధిలో యÖత్ ఫాలోయింగ్ చాలా బలంగా కనిపించింది. ఇప్పటికే పలు కాలనీలలో కొంతమంది ప్రజలకు ఆర్థికంగా సహాయపడినట్లు చెబుతున్నారు. అన్ని సామాజికవర్గ ప్రజలను రాకేష్రెడ్డిగారు కలుపుకొనిపోతున్నట్లు ప్రజలు ప్రస్తావించారు. ఈ విషయంలో వినయ్‌భాస్కర్ కొంత వెనుకంజలో ఉన్నట్లు స్పష్టమైంది. బిజెపి పార్టీలో నుండి బరిలో ఉన్న రావుపద్మ, ధర్మారావు, మరియు రాకేష్రెడ్డిలలో ముగ్గురిలో పోలిస్తే ప్రజాకర్షణ సాధించుకునే శక్తి కేవలం రాకేష్‌రెడ్డి గారికి మాత్రమే ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొంత కాలంగా వారు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు మరింత దగ్గరవుతూ వస్తున్నారు.
బిజెపి పార్టీ యొక్క గ్రాఫ్ గత 6 నెలలుగా క్రమంగా పెరుగుతూ రావడానికి ప్రధాన కారకులుగా నిలిచారు. ఈ నియోజక వర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో టిఆరఎస్ పార్టీ నుండి దాస్యం వినయ్ భాస్కర్ మరియు బిజెపి పార్టీ నుండి ఏనుగుల రాకేష్‌రెడ్డి మధ్యలో పోటీ జరిగితే, గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ రాకేష్‌రెడ్డి కాకుండా బిజెపి పార్టీ నుండి మరే ఇతర వ్యక్తులు నిలబడినా ప్రజల ఓటింగ్ ఏకపక్షం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కనుక రాష్ట్రంలో పెరుగుతున్న బిజెపి పార్టీ యొక్క గ్రాఫ్, ఈ నియోజకవర్గంలో పెరుగుతున్న బిజెపిపార్టీ యొక్క గ్రాఫ్ సమాంతరంగా
ఉన్నందున ఈ నియోజకవర్గం నుండి బిజెపి పార్టీ అభ్యర్థి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సంస్థ సభ్యులు పలువురు టీఆరఎస్ కార్యకర్తలను సంప్రదించినప్పుడు, వారి నుండి కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది టిఆరఎస్ కార్యకర్తలు కూడా మార్పు కోరుకుంటున్నట్టు స్పష్టమైంది. కానీ వారికి ఈ నియోజకవర్గం నుండి బలమైన ప్రతిపక్ష నాయకులు కనిపించక పోవడంవల్ల ప్రస్తుతానికి మాత్రం తటస్థంగానే ఉన్నారు. ఇప్పటికైనా బిజెపిపార్టీ ఆలస్యం చేయకుండా ఈ నియోజక వర్గంలో ఒక బలమైన అభ్యర్థిని నియమిస్తే, టీఆరఎస్ కార్యకర్తలు చాలామంది బిజెపి పార్టీలోకి చేరే అవకాశం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇప్పటికే కొంతమంది టిఆరఎస్ కార్యకర్తలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేగారి పైన అసహనంతో తటస్థంగా ఉంటున్నారని ప్రజలు చెబుతున్నారు. టిఆరఎస్ పార్టీ కార్యకర్తలలో వచ్చిన ఈ మార్పు బిజెపి పార్టీ తన వైపుకు మార్చుకోవాలంటే అభ్యర్థి ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్న కొంతమంది బిజెపి అధికారవర్గం గతంలో జరిగిన ఎన్నికల్లో కొంత అక్రమాలకు పాల్పడినట్టు, ఇదే పార్టీలో ఉన్న కార్యకర్తలు సంస్థ సభ్యులతో వివరించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు మరియు జిల్లా అధ్యక్షులకు సమన్వయలోపం అధికంగా ఉన్నట్లు కనిపించింది.
ఈ సమన్వయలోపం ఇకపై కూడా ఇలానే ఉంటే రేపు మరోసారి టిఆరఎస్ పార్టీ విజయం సాధిస్తుందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నియోజకవర్గం నుండి చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం పలు చర్చలకు దారి తీస్తుంది. “రాబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? అని ప్రజలు అడిగినప్పుడు” ప్రజలు సుమారు 41%, టీఆరఎస్, 34% బిజెపి ని ఎంచుకోవడం జరిగింది. కేవలం 13% మాత్రమే కాంగ్రెస్‌ని ఎంచుకోవడం స్పష్టంగా కనిపించింది. మిగిలిన 12% ప్రజలు తమ నిర్ణయాన్ని చెప్పడానికి సుముఖంగా కనిపించలేదు. ఒకవేళ ఈ 12% ఓటర్లలో సుమారు 7% బిజెపి కి జత కలిస్తే టిఆరఎస్ పార్టీకి, బిజెపి పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకా సమయం మిగిలి ఉన్నందున, ఈ మిగిలిన సమయంలో బిజెపి పార్టీ ఈ నియోజకవర్గం నందు తీసుకునే సరైన నిర్ణయాలు పార్టీ గెలుపుకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత రాజకీయాలలో చూసినట్లయితే జిల్లా బిజిపిపార్టీ అద్యక్షులకు టిఆరఎస్ పార్టీని ఎదుర్కొనే వాక్చాతుర్యం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో టిఆరఎస్ పార్టీని ఓడించాలంటే, డబ్బు ఒక్కటి మాత్రమే ప్రామాణికం కాదు కాబట్టి, టీఆరఎస్ పార్టీకి ఘాటుగా సమాధానం ఇవ్వగలిగే మంచి వాక్చాతుర్యం మరియు సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తికి బిజెపి పార్టీ అవకాశం ఇస్తే, సుమారు 3`7% ఓట్ల మెజార్టీతో పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇదే నియోజకవర్గంలో బిజెపి పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి మరొక వ్యక్తి ధర్మారావు గారు. వీరు గతంలో పలుమార్లు పోటీ చేసినప్పటికీ, తన గ్రాఫ్‌ను క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ధర్మారావుగారి మాటతీరు, కార్యకర్తలపై తాను ఉపయోగించే పదజాలం, వీరిపై ఒక రకమైన వ్యతిరేక భావన ఏర్పడటానికి కారణమని సర్వేలో తెలిసింది. వ్యక్తిగత గ్రాఫ్‌లో వీరు చాలా వెనుకబడినట్టు కనిపించింది.
గతంలో జరిగిన ఎన్నికలలో వీరు కొంత అక్రమాలకు పాల్పడినట్లు కూడా కార్యకర్తలు చెబుతున్నారు. దీనివలన వీరిపై ప్రజాకర్షక బలం సన్నగిల్లింది. ఇటువంటి పరిణామాల మధ్య వీరు బరిలో ఉంటే ప్రజలు ఓటు వేయడానికి సుముఖంగా లేనట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కనుక ఈ నియోజకవర్గం నుండి టిఆరఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలంటే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి సమయస్ఫూర్తి మరియు సామర్థ్యం రెండూ ఉంటేనే ప్రతిపక్ష పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రేపు జరుగబోయే త్రిముఖ పోటీలో బిజెపిపార్టీ అభ్యర్థి రావుపద్మ గారైతే బిజెపి పార్టీ మÖడోస్థానంలో ఉంటుంది. కానీ ఒకవేళ బిజెపి పార్టీ అభ్యర్థి రాకేష్‌రెడ్డి గారైతే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి