మనలో చాలా మందికి ఈ ఆధ్యాత్మిక విషయాలు తెలుసనుకుంటారు. అయితే మన చిరంజీవులకు ముఖ్యంగా ఈ తరం, నవతరం అది యువతరం నిరంతరం వారికి అన్వేషణ జిజ్ఞాసాలే ధ్యేయాలు, గన్యూలు. వారికి ఈ విషయాలను విపులంగా విడమరచి వివరించగల సమయం గానీ ఓపిక గానీ లేక పోవడం వల్ల మనం చెప్పలేకపోతున్నామని అనుకుంటున్నాను. మీ సహృదయ అంగీకారంతో ఈ విషయం వారికి తెలియజేసే ప్రయత్నం. చేస్తాను.
సమయాభావం వల్లనో సంశయభరిత మనస్సు వల్లనో చెప్పలేకపోయే వారికి నా ఈ సంకలనం ఏమాత్రమైనా ఉపయోగ పడితే నా ఈ శ్రమ ఫలించిందనుకుంటాను.
ఇక మొదలు పెడదామా? ఇందులో వేదములు, ఉపనిషత్తులు, పురాణాలను, ధర్శనాలు పరిశీలింతాము.
దర్శనాలు అంటే ఏమిటి?
వీటి యొక్క నిర్వచనం మాత్రమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కేవలం ప్రవేశించే ప్రయత్నమే తప్ప వాఖ్యానం కాదు.. ఐతే వాటిని మనం చదవే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ప్రశ్న ఉత్తర రూపంలో ఉంటాయి గమనించగలరు.
1.ప్రశ్న. వేదములు అంటే ఏమిటి?
ఉత్తరం: వేదములు భగవద్ వచన రూపములు. భగవంతుని ద్వారానే తెలుపబడినవి. అవి అపౌరుషేయములు. అంటే ఏ ఒక వ్యక్తిగాని వ్యక్తులు గాని రచించలేదు. వస్తుతః వేదం భగవంతుని కంటే అన్యం కాదు. వేదవిశ్వాసం భగవద్ విశ్వాసం. భగవంతుణ్ణి నమ్మే సనాతన ధర్మ కర్మా చరణులందరూ వేదములను గురించి తెలుసుకోవాలి. వేదాధ్యయనమైతే మరీ మంచిది.
ఒక ముఖ్య విషయం. వేద నిరాదరణం భగవత్ నిరాదరణమే. అందుకే వేదములను ఎవరూ నిందించరాదు. విమర్శించరాదు, ఖండించరాదు. ఇది మనమందరం ముందుగా తెలుసుకోవాలి.
విద అను ధాతువు చే వేదమను శబ్దం ఉద్భవించినది. ఏ ప్రమాణము చేతనైనను తెలియని దానిని తెలియ జేయునది వేదం. వేదం అంటే జ్ఞానం. జ్ఞానమంటే ఆత్మ స్వరూపం అట్టి ఆత్మజ్ఞానం విశ్వవ్యాప్తం అయితే అదే బ్రహ్మమని తత్త్వార్థం.
అభ్యుదయ నిఃశ్రేయన సాధనము లగు సమస్త ధర్మములను తెలుపునవి వేదములే అంటే ఈ లోకంలోను, పరలోకంలోను సుఖ జీవనానికి ఆధారమైన ధర్మమును భోధించి జీవ బ్రహ్మైక్య జ్ఞానమును ప్రసాదించునది వేదమే. అదియే దాని నాదము. ఆ నాదమే మన జీవన నినాదం. కాబట్టి మనం, హిందూ బందువులందరం వేదాధ్యయనం చేయాలి. లేకపోతే కనీసం కొన్ని వేద మంత్రాలను గురువుల దగ్గర గాని, పెద్దల దగ్గరగాని నేర్చుకుని నిత్యం స్మరించాలి. స్మరిస్తే తరిస్తాం. మరిస్తే మనుగడే మృగ్యం...
2.ప్రశ్న: వేద రచన ఎట్టిది?
ఉత్తరం: వేదము, పద్యము, గానము, గద్యములతో గూడిన ఒక మహత్తర రచన. ఈ రచనా భేదమును అనుసరించి వేదము, ఋక్కు, యజస్సు, సామము, అని మÖడు విధములుగా విభజింపబడినది. ఇందు ఆధర్వణ వేదము అంతర్గతము. ఈ వేద విభజన చేసింది వ్యాసమహర్షి. అందుకే వారిని మనం వేద వ్యాసుడు అని అంటాము
3. ప్రశ్న: వేదములు ఎన్ని?
ఉత్తరం: వేదములు నాలుగు. అవి
1. ఋగ్వేదము
2. యజుర్వేదము
3. సామ వేదము
4. ఆధర్వణ వేదము
4. ప్రశ్న: వేదములెన్ని కాండములను కలిగి యున్నది?
ఉత్తరం: వేదము కాండత్రయాత్మకమై యున్నది.. అవియే
1. కర్మ కాండ
2. ఉపాసనా కాండ(భక్తి)
3. జ్ఞాన కాండ.
5. ప్రశ్న: ఈ వేదములలో శాఖలు ఎన్ని?
ఉత్తరం: ఋగ్వేదం 21 శాఖలు
యజుర్వేదం 109 శాఖలు
సాము వేదం 1000 శాఖలు
అధర్వణ వేదం 50 శాఖలు
6. ప్రశ్న: వేదములలో విభాగములెవ్వి..?
ఉత్తరం: వేదములలో మÖడు విభాగములు కలవు. అవి
1. సంహిత
2. బ్రాహ్మణము
3. అరణ్యకము
1. సంహిత = పద్య గద్యాత్మిక మంత్రభాగము
2. బ్రాహ్మణము = పద్య గద్య మంత్ర భాగము నకు గల పరమాద్భుత వ్యాఖ్యానము.
3. అరణ్యకము: పరమ ఋషులు అరణ్యములలో ఉంటూ నియమ పూర్వకంగా గురుముఖతః విని మనన మొనర్చి తెలిసికున్న పరమానుభవమునే అరణ్యకమని అందురు.
ఈ ప్రకారం మంత్రము (సంహిత), బ్రాహ్మణము, అరణ్యకము అను మÖడు విధములగు వైదిక సాహిత్యము యొక్క సాధారణ నామమే శృతి అనబడును.
7.ప్రశ్న ఉపనిషత్తనగా అర్థమేమి?
ఉపనిషత్తులు అనునవి ఋగ్‌యజుసామఅధర్వణ వేదముల అంతిమ భాగములుగా అలరారుచు పరబ్రహ్మ స్వరూపమును సుస్పష్టంగా ప్రతిపాదించున్నవి. అందుకే వీటిని శ్రుతి శిరస్సులనియు వేదాంతము అనియు అందురు.
ఉత్తరం: ”ఉప”-ని-షత్
ఉప”- ని యను ఉపసర్గలు -సద” - అనే ధాతువు తో జేరి ఉపనిషద్ అయినది.
ఉప-ఉపాగమ్య-అనగా సద్గురు సన్నిధిలో, గురూపదేశమును పొంది, ని = నిశ్చయముగలిగి నిష్టతో విచారణము చేయు శిష్యుల యొక్క అజ్ఞానాన్ని, సద=్ తొలగించునది ఏదో అదియే ఉపనిషత్తు. అనగా ఒక శిష్యుడు నిష్ఠతో, సంపూర్ణ వైరాగ్య భావంతో, సద్గురువుల సన్నిధిలో ఏ విద్యాభ్యాసం వల్ల తన అజ్ఞానాన్ని తొలగించుకుని పరబ్రహ్మను పొంద గలుగునో ఆ విద్యకే
“ఉపనిషత్తులు” అని పేరు.
8. ప్రశ్న: ఉపనిషత్తుల లక్షణం ఏమిటి..?
ఉత్తరం: ఉపనిషత్తుల కమణీయ శ్లాఘనీయ లక్షణం సత్యాన్వేషణయే. ఇంకా ఇటువంటివే ఎన్నో లక్షణాలు కలిగి ఉండుట చేత ఉపనిషత్తులు గొప్ప మహిమా సత్తువలు గల తత్త్వశాస్త్రంగాను ముగ్ధ మనోహరమైన అమర వా్మఙయంగాను నేటికీ రాణిస్తున్నది. శ్రద్ధాళువులు, ఏకనిష్ఠులు, అయిన గురు శిష్యుల సందోహం, చిన్న చిన్న గోష్టులలోను పెద్ద పెద్ద సభలలోను జరిగే చేతనా పూర్వక సంభాషణా మధురిమలు, అనుభూతుల దివ్య శిఖరాలపై ఆలోచనల ఆరోహణలు, మనోజ్ఞమైన స్వేచ్ఛాగీతాలు, మానవాళిని జాతి కుల లింగ పరంగా విభజింపక మనిషిని మనిషిగా పరిగణించడం లాంటి లక్షణాలతో విలసిల్లుతోంది ఈ ఉపనిషత్ సార సాగరం.
9.ప్రశ్న: సత్యం అంటే ఏమిటి.?
ఉత్తరం: కాలత్రయేతి తిష్ఠతి- ఇతి సత్యం. మÖడు కాలాల్లో స్థిరంగా ఏదిఉండునో ఆది సత్యం.
10. ప్రశ్న: సత్యాన్ని ఋగ్వేదం ఏమంది.!?
ఉత్తరం: “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” సత్యం ఒక్కటే. దాన్ని తెలుసుకున్నవారు అనేక విధాలుగా వ్యక్తం చేస్తారు. ఉపనిషత్తుల గురించి మరింత సమాచారం ఈ సందర్భంగా మీకు విన్నవించడం జరుగుతున్నది.
ఒక విషయం మీరు గమనించగలరు. ఇది సమాచారమే తప్ప వ్యాఖ్యానం కాదు. కేవలం మీకు, ముఖ్యంగా నవ యువ తరం వారికి అవగాహన కొరకు నివేదిస్తున్న సమాచారం.
సమాజంలో ప్రతి ఒక్కరూ గ్రహించవలిసిన అమÖల్యమైన జ్ఞాన సంపద ఈ ఉపనిషత్తులలో నిక్షిప్తమై వుంది. వ్యక్తి యొక్క కుటుంబ, సామాజిక బాధ్యత గురించి, అతను ఆచరించవలసిన ధర్మం గురించి ఉపనిషత్తులలో పేర్కొనబడిన విషయాలు సర్వకాలాలకూ అనుసరణీయాలైనవి.
సమాజంలో ఉన్న వివిధ వర్గాలకి చెందిన మనుషులంతా మనకి
ఉపనిషత్తులలో గోచరిస్తారు. “సత్యాన్వేషణకు అందరూ అర్హులే”- అని చెప్పడానికి సత్యకామ జాబాలి లాంటి పురుషోత్తములు, గార్గీ మైత్రేsTÖ లాంటి స్త్రీరత్నాలు కనిపిస్తారు.
ఏది తెలుసు కోవడం వల్ల మరేదీ తెలుసు కోవాలసిన అవసరం లేదో, ఏ విద్యాభ్యాసం వల్ల నీ-నా అనే భేద భావం లేకుండా మనమంతా ఒకటే నన్న భావనతో విశ్వమానవ సౌభ్రాతృత్వం మనలో వెల్లి విరిస్తుందో ఆ
ఉపనిషద్ విద్యా దీప శిఖ మనలను అమృతత్త్వం వైపు నడిపించుగాక.
11. ప్రశ్న: ఉపనిషత్తులు ఎన్ని?
ఉత్తరం: అష్టోత్తర శతం.. అనగా 108.
1. ఋగ్వేద ఉపనిషత్తులు......10
2. శుక్లయజుర్వేదాంతర్గత ఉపనిషత్తులు 19
3. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులు 32
4. సామ వేదోపనిషత్తులు....... 16
5. ఆధర్వణ వేదోపనిషత్తులు.....31
మొత్తం = 108.
11. ప్రశ్న: ప్రధాన మైనవి ఏవి?
ఉత్తరం: ఈ 108లో దశోపనిషత్తులు మిక్కిలి ప్రధాన మైనవి.
వీటికి శంకరభాష్యం కలదు.
12. ప్రశ్న: దశ ఉపనిషత్తులు ఏవి..?
ఉత్తరం: క్రింద పేర్కొనబడినవే దశ ఉపనిషత్తులు.
1. ఈశావాస్యోపనిషత్(ఈశోపనిషత్)
2. కేన
3. కఠ
4. ప్రశ్న
5. ముండక
6. మాండూక్య
7. ఐతరేయ
8. తైత్తరీయ
9. ఛాందోగ్య
10. బృహదారణ్యక
ఆది శంకరులు ఈ దశ ఉపనిషత్తులకు భాష్యం వ్రాసారు. ఐతే శంకరులు శ్వేతాశ్వతరోపనిషత్తు నృసింహతాపని ఉపనిషత్తులకు కూడా భాష్యాలు వ్రాశారని కొందరి అభిమతం
1. ఈశావాస్యోపనిషత్తు: (ఈశోపనిషత్)
ఇది ఉపనిషత్తులలో అగ్రగణ్యమైనది. శుక్ల యజుర్వేద విభాగంలో వాజసనేయ సంహితలోని 40వ అధ్యాయమే ఈ ఉపనిషత్తు. తత్యన్ అధర్వణుడు అనే ఋషి శ్రేష్ఠుడు తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తును ఈశావాస్యోపనిషత” అని అంటారు. భగవంతుని సాక్షాత్కారం కొరకు బోధింపబడిన ఈవిద్యను ఈశ విద్యా అని కూడ అందురు.
ఈ ఉపనిషత్తు ఒక మహత్తరమైన శాంతి మంత్ర శ్లోకంతోను, సర్వ
ఉపనిషత్తులకే మకుటాయమానమైన శ్లోకంతోనూ ప్రారంభమై మనలను పరవశింప జేస్తుంది. మన హృదయ సాగరాలలో దివ్యానుభూతి తరంగాలను జనింపజేసి మనలను పునీతులను చేసే శరత్‌చంద్ర చంద్రికలే ఈ శ్లోకాలు.
శ్లోకం: పూర్ణమదః పూర్ణ మిదం
పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ
పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః ....
అర్థం: పరిపూర్ణ పర బ్రహ్మము నుండి పరిపూర్ణ మైన లోకం ఉద్భవించగా, మిగిలిన శేషమÖ పూర్ణమే.
ఇది ఎట్లు కుదురుతుంది.!?
దీనికి సమాధానం.... ఒక దీపం ద్వారా ఇంకొక దీపం వెలిగించి నప్పుడు మొదటి దీపజ్యోతి లో వెలుతురు తక్కువ కాదు కదా.! రెండవ దీపం ఎక్కువ కూడా కాదు. మిగిలింది ఏమిటి.? రెండు దీపాలు జాజ్వల్యమానంగా పూర్ణంగా వెలగడం. అలాగే విద్యా దానం కూడా.
ఇక ఈ శ్లోకం అంతమందు తాపత్రయ నివారణార్థం
శాంతిః శాంతిః శాంతిః అంటూ 3 సార్లు శాంతిని ఆపేక్షిాస్తున్నారు.
13. ప్రశ్న. తాపత్రయము అనగానేమి?
ఉత్తరం: తాపం G త్రయము తాపత్రయము.
మనందరము మÖడు రకములైన తాపములతో బాధపడుతున్నాము. అవి.
1. ఆధ్యాత్మిక తాపం :శారీరిక, మానసిక రుగ్మతల వల్ల కలుగు బాధలు
2. ఆది భౌతిక తాపం : ఇతర జీవ జంతువుల మానవులవల్ల కలుగు బాధలు.
3. ఆదిదైîవిక తాపం : అకస్మాత్తుగా కలిగే ప్రమాదాలవల్ల, తుఫాను భూకంపాది ఘటనలో వల్ల కలిగే బాధలు. వీటి నుండి మనకు బాధలు లేకుండా శాంతిని ప్రసాదించమని ప్రార్ధన..
ఇక ఈ ఉపనిషత్తుకే తలమానికమైన శ్లోక ప్రారంభపదమే ఈ
ఉపనిషత్తు పేరుగా ప్రసిద్ధి చెందిన రెండవ శ్లోకం. అవధరించండి.
శ్లో: ఓం ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం
జగత్ తేన త్యక్తేన భుంజీధా మా గృధః కస్య స్వీధనం
ఈశావాస్య అనే ఈ మంత్రం తో ప్రారంభమైనది కనుక ఈ ఉపనిషత్తుకు ‘ఈశావాస్యోపనిషత’ లేదా ‘ఈశావాస్య ఉపనిషత’ అని పేరు వచ్చింది.
శ్లోకార్థం : పరమాత్మ చేతనాచేతన మయమైన జగత్తును మనకొరకే సృజించాడు. పరిణామ శీలమైన ఈ జగత్తులో లభించే సమస్త సంపదలను మీ మీ యోగ్యతలను బట్టి, అవసరానికి తగ్గట్టుగా త్యాగ బుద్ధితో అనుభవించండి. అంటే భగవంతున్ని నిరంతరం భజిస్తూ కర్మ ఫలత్యాగ బుద్ధిచే ఈ సంపదలను అనుభవించమంటుంది. అంతే కాదు పరుల సంపదను ఆశించవలదని కూడా చెబుతున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి