మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

హరే కృష్ణ మంత్రం

హరే రామ హరే రామ

రామ రామ హరే హరే 

హరే కృష్ణ హరే కృష్ణ 

కృష్ణ కృష్ణ హరే హరే 

ఇది అందరికీ తెలిసిన మంత్రమే కదా! ఆబాల గోపాలుర నాలుకలపై నాట్యమాడే దివ్య మంత్రమే.. 

షోడశ పద సమన్వితమైన ఈ మంత్రం, పరమ పావన మానవ జీవనానికి ఊపిరిలూదిన మహా మంత్ర రాజం. ప్రకృతి పురుషుల అభిన్నత్వ, పరిపూర్ణ దివ్య సమాగమ, సంబోధనా పూర్వక ఉపనిషత్ ప్రతిపాదిత ప్రార్ధనయే ఈ మహా మంత్రం. ఈ రోజు ఈ మహా మంత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా! 

ఈ మహా మంత్రం 16 పదాలతో శ్రీవైష్ణవం లో ప్రస్తావించబడింది. కలి సంతారణ ఉపనిషత్తు లోనిది. 15వ శతాబ్దం నుంచి ఈ మంత్ర ప్రాముఖ్యత పెరిగింది. దీనిని ఒక గొప్ప భక్తి ఉద్యమం క్రింద మార్చినవారు చైతన్య మహాప్రభు”. 

ఈ మంత్రం పరమాత్ముని యొక్క రెండు అత్యద్భుత నామాలతో కూడి ఉంది, అవియే కృష్ణ మరియు “రామ”. ఈ మంత్రమును జీవ సాఫల్య మంత్రము గాను ముక్తి ప్రదాయిని గాను భారతదేశం లోను వెలుపల కూడా బాగా ప్రాచుర్యం కల్పించినవారు భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారు. వారు తమ ఉద్యమాన్ని, హరే కృష్ణ ఉద్యమం ద్వారా విదేశాల్లో విరివిగా ప్రచారం చేసారు. దీనినే IచీTజు=చీATIOచీAL SO్పుITY ఖీO= ఖ=ISHచీA ్పుOచీS్పుIOUSచీజుSS.. (IS్పుOచీ) అని అంటారు.

హరే కృష్ణ మంత్రం, పరమాత్మ యొక్క పరమ పవిత్ర నామ రూపాలని మÖడు విశిష్ట పదాలతో ప్రార్ధించడం ఈ మంత్రము యొక్క విశిష్టత. ఆ పదాలు మామÖలు పదాలు కావు. భావగర్భితములు, మహమాన్వితములు, శక్తి వంతములు.

అవియే 

1. హరే అనే పదం 4 సార్లు 

2. కృష్ణ అనే పదం 4 సార్లు 

3. రామ అనే పదం 4 సార్లు

వస్తుంది. మొత్తం 16 పదాలు షోడశ పదాలు. షోడశ కర్మలకి ప్రతీకగా చెబుతారు. ఇందులో ఒక కవితా పూర్వక అనుష్టుప్ ఛందస్సు వుంది. ఉపనిషత్తులో అసలు మంత్రం ఈ క్రింది విధంగా ఉంది: 

హరే రామ హరే రామ 

రామ రామ హరే హరే 

హరే కృష్ణ హరే కృష్ణ 

కృష్ణ కృష్ణ హరే హరే 

హరే కృష్ణ హరే కృష్ణ 

కృష్ణ కృష్ణ హరే హరే 

హరే రామ హరే రామ 

రామ రామ హరే హరే 

సంస్కృతం లో మంత్రం యొక్క ఉచ్చారణ: 

ష్ట్రవతీవ kతీsఅవ తీవ: kతీsఅవ 

kతీsఅవ kతీšఅవ తీవ ష్ట్రవతీవ. 

తీవ. తీa ఎవ ష్ట్రవతీవ: తీa ఎవ 

తీaఎవ తీaఎవ తీవ: ష్ట్రవతీవ: 

సంస్కృతం బహుళ అర్ధాలను తెలిపే ఒక సుందర మైన భాష. అందువల్ల, ఈ మంత్రానికి బహుళ వివరణలు ఉన్నాయి, ఇవన్నీ సరైనవిగా పరిగణించబడతాయి. 

1.హరే అనే పదం హరి ని సూచిస్తుంది హరి విష్ణువు యొక్క మరొక పేరు. ‘హరి’.. అంటే చాలు అది భ్రాంతిని పాపాన్ని పూర్తిగా తొలగిస్తుంది”.  “హరి అను రెండు అక్షరములు హరియించును పాపములనంబుజనాభా. హరి నీ నామ మహత్యము. హరి హరి పొగడంగ వశమే హరిశ్రీ కృష్ణ” అని కదా భాగవతం చెబుతున్నది. 

2.మరో వ్యాఖ్యానం: సంభోదనా విభక్తి వంటిది ఉంది. అది హరే...., హరే అంటే పరమాత్మలోని దివ్యము, అనంతమÖ, అవ్యక్తమÖ అయిన చైతన్యం. ఆదియే రాధా రాధ కృష్ణుని యొక్క శక్తి. కృష్ణ శక్తి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద ప్రకారం, హారే అనునది భగవంతుని యొక్క శక్తి. 

కృష్ణ మరియు రాముడు భగవంతుడిని సూచిస్తే హరే అన్నం పదం వారిలోని దివ్యంగా ప్రకాశించే చైతన్యాన్ని సూచిస్తుంది. 

భగవంతున్ని షడ్గుణైశ్వర్య సంపన్నునిగా ఆకర్షణీయమైనవానిగా అన్ని ఆనందాలకు మÖలంగా పరిగణిస్తాము. కాని వారి ఈ గుణములకు ఆధారం ఒక శక్తి. అదియే చైతన్యం. దివ్య చైతన్యం. 

“శివ శివా, శివ శివా, శివ శివా” అని ప్రార్థనానంతరం లేదా పారాయణానంతరం మనం అంటున్నాము కదా.! ఇందు లో “శివ”- శంకరున్ని, ‘శివా’ పార్వతి దేవిని సూచిస్తాయి. అలాగే హరే అంటే రాధ ని అంటే లక్ష్మీదేవి నీ కృష్ణ అంటే వాసుదేవుడైన విష్ణువు నీ సూచిస్తున్నాయి. కృష్ణ చైతన్యం మన మనస్సుపై అనంతమైన ప్రభావం కలిగిస్తుంది అంతే కాదు పావన నవ జీవన స్పృహను కూడా కలిగిస్తుంది. ఈ స్పృహ అనేది మన జీవన శక్తి. 

మనం ఈ మంత్ర శబ్దం వినగానే మనలో అతీంద్రియ ప్రకంపనలు కలుగుతాయని శృతి వచనం. మరి ఇందులో ఓం కానీ నమః కానీ లేవు కదా? ఇది మహామంత్రమని ఎలా పరిగణించాలి? అనే సందేహం కలుగక మానదు. సమాధానం ఏమిటంటే ఈ రెండూ కూడా అందులోనే అంతర్లీనంగా వున్నాయంటారు మహాత్ములు. 

ప్రకృతి పురుషులు అభిన్నత్వ తత్త్వాన్ని, పరిపూర్ణ వైభవాన్ని హరే కృష్ణ అని తలిచినంతనే అన్ని అవ్యక్త భావాలు వ్యక్తమై మనకు అలౌకిక ఆనందాన్ని ప్రసాదించే ఈ మంత్రం కలి యుగంలో సంభవించే అన్ని అనర్థాల రోగాలకు దివ్యౌషధమట కలి దోష హరణ వాంఛా కలితులమైన  మనందరికీ.. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి