ద్రోహం
అవును
మనం అందరం
నమ్ముతం
విశ్వసిస్తం
ఆప్యాయంగా
మాట్లాడుతుంటే
ఎంతగానో
పొంగిపోతాం
వసంతం పరిగెత్తినట్టు
మన క్షేమం కోరుతున్నరని
అనుకుంటుంటం
కానీ ఒకరోజు
తప్పక
తెలుస్తుంది
ద్రోహం అనేది
పడగవిప్పుతుంది
పొగలా అంతటా
క్రమ్ముకుంటుంది
విషం కక్కుతుంది
వాడి మాటలు
విషంతో నిండినవని
వాడిచేతలు ద్రోహమని
వాడొక ద్రోహి యని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి