మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

మహామృత్యుంజయ మంత్రం

మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో, 12వ మంత్రంగా వస్తుంది. దీనినే “త్య్రంబక మంత్రము”, “రుద్ర మంత్రము”, “మృత సంజీవని మంత్రము” అని కూడా అంటారు. 

ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.13.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి జపించటం ఒక ఆచారంగా వస్తున్నది. కాని ఇది వాస్తవానికి మోక్షాన్ని ప్రసాదించమని శివున్ని ప్రార్థించే సాధనా మంత్రంగా రూపొందించబడినది. 

గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా సనాతన ధర్మంలో ఒక సుప్రసిద్ధమైన మంత్రము. 

మంత్రం: 

ఓం త్య్రంబకం యజామహే 

సుగంధిం పుష్టి వర్ధనం 

ఉర్వారుక మివ బంధనాన్ 

మృత్యోర్ముక్షీయ మామృతాత్ 

ప్రయోజనం: 

చనిపోతామనే భయంతో ఉన్న వారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు. దీర్ఘరోగం తో బాధపడేవారు ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని నిత్య పారాయణగా ఆచరిస్తే శివుడు ఆ రోగం బారినుంచి వారిని, తీగనుంచి దోసకాయను దూరం చేసినట్లు, దూరంచేస్తాడు. 

విశేషాలు: 

ఈ మంత్రమునకు ఋషి- వసిష్ఠుడు, ఛందస్సు- అనుష్టుప్, దేవుడు శివుడు, శ్రీ మృత్యుంజయ త్య్రంబకేశ్వరుడు, బీజము “హామ”, శక్తి దేవి అమృతేశ్వరి. 

ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడట.. 

అర్థం: సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే, మÖడు కన్నుల పరమేశ్వరా నిన్ను పూజిస్తున్నాను. తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షమును ప్రసాదించుము. 

మృత్యుంజయ స్తోత్రము 

ఇది కాక, మృత్యుంజయ స్తోత్రము లేదా మహామృత్యుంజయ స్తోత్రము అనే స్తోత్రం కూడా ఉంది. ఈ స్తోత్రానికి మార్కండేయుడు ద్రష్ట. స్తోత్ర పాఠంలో కొద్ది పాదాలు దిగువన ఇవ్వబడినవి. 

1. ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠం ఉమాపతిం

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

2. కాలకంఠం కాలమÖర్తిం కాలాగ్నిం కాలనాశనం

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

3. నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి 

4. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి  

మహా మృత్యుంజయ మంత్ర పద తాత్పర్యాలు :

ఓం పరిపూర్ణపరబ్రహ్మం ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది, అనంతరం ఒక గొప్ప నాదంగా రూపొందింది. ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని అ-ఉ-మ అనే అక్షరాల సంగమమే ఓంకారం. 

“అ”- కారం, ఋగ్వేదం నుండి - ఉ”- కారం, యజుర్వేదం నుండి  మ కారం సామవేదం నుండి జనించాయి. 

ఈ మÖడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మÖలం. నాదం. ఆ నాదం... పరబ్రహ్మ రూపం. ఓంకారం ప్రార్థనగా మొదట సాధన చెయ్యాలి. 

త్య్రంబకమంటే మÖడు నేత్రములు. భూత, భవిష్యత్, వర్తమానాలకు ప్రతిరూపమైన నేత్రం, శివుని మÖడవ నేత్రం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగిన మÖడవ నేత్రం ఉన్నందున శివుడు త్రినేత్రుడు అనబడుతున్నాడు. శివుని భ్రూమధ్యంలోనున్న సూక్ష్మరూప నేత్రం మÖడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని ఈ మÖడవ నేత్రానికి దాహక శక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. 

యజామహే : అంటే ధ్యానిస్తున్నానని అర్థం సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. 

సుగంధిం : సు-మంచిదైన, గంధ- సువాససన ద్రవ్యం. మంచి వాసనలతో కూడుకొన్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు ఆ స్వామి మనపై తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. 

పుష్టివర్ధనం : అంటే మనం పుష్టిగా శక్తి వంతంగా ఉండేవిధంగా ఆ స్వామి సర్వత్రా నెలకొని మనని పోషిస్తున్నాడు. సృష్టి యావత్తూ ఆయన అధీనంలో ఉంది. 

ఉర్వారుకం ఇవ బంధనం : దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనల్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కించుతాడు.. 

మృత్యోర్ముక్షీయ : అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మృత్యువు నుంచి కూడా మనకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం.... 

అమృతాత్ : మృత్యువు నుంచి రక్షించడమంటే భౌతికపరమైన మరణం నుంచి మాత్రమే కాదు. జనన మరణ రహితమైన అమృతో పేయమైన మోక్షాన్ని ప్రసాదించమని శివుడు అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. ఆ శివుడు మనను రక్షించుగాక!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి