మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

మంత్ర శక్తి

లోకమంతా నాదమయం. అది ఆది నాదం.. ‘ఓం’ కారం. అదే సృష్టికి మÖలం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అనంతమైన శబ్ద సముదాయంలో అపారశక్తి కలిగినవి బీజాక్షరాలు. ఆ బీజాక్షరాలతో నిండినవే మంత్రాలు. అందుకే మంత్రాలకు ఉన్న మహత్తు ఊహకు అందనిదన్నది ఋషి వాక్యం. 

మానవ దేహంలో సహజ సిద్ధమైన శక్తి ఉంది. ఆధ్యాత్మికమైన ప్రేరణతో ఆ శక్తి ఉప్పొంగుతుంది. దాన్ని ఉపయోగించుకొని, సరైన మంత్రాలతో, ధ్యానాలతో, పవిత్రమైన వాతావరణంతో మనం దివ్యత్వానికి దగ్గర అవుతాం. 

ఈ సృష్టి అంతా శక్తి ప్రకంపనలేనని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెబుతోంది. ఈ సృష్టి సమస్తం సంక్లిష్టమైన శబ్దాల అమరికలే ఆ అమరికలలో, కొన్ని శబ్దాలను మÖల శబ్దాలుగా ఋషులు గుర్తించారు. వీటినే మనం ‘మంత్రాలు’ అంటాం. ఆ బాహ్య మంత్రశక్తి మనలోని అంతఃశక్తితో మమేకమైతే లభించేది అమృత తత్త్వమే.. 

‘ఒక మంత్రంతో ఇదంతా జరుగుతుందా?’ అని తార్కికులు ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ మన సంస్కృతిలో ఉంది. 

ఒక రోజు, కైలాసం లో వున్న శివుడి దగ్గరకు గొప్ప సిద్ధులు కలిగిన ఒక యోగి వచ్చాడు. అప్పుడు అక్కడ శివభక్తులు “శంభో శివ శివ శంభో” అంటూ శివ నామస్మరణ జనిత తన్మయత్వంతో ఆనంద తాండవ నృత్యం చేస్తూ కనబడ్డారు. ఎందుకు ఈ భక్తులు ఎప్పుడూ ఈ మంత్రాలు పఠించడం? ఏం ప్రయోజనం? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వారికి దీన్ని ఆపమని ఎందుకు చెప్పడం లేదు?” అని అడిగాడు. 

శివుడు అతణ్ణి చూసి, నవ్వి ‘నువ్వు ఒక పని చెయ్యి’ అని అక్కడ ఉన్న ఒక పురుగును చూపించాడు. అది భూమి మీద పాకుతోంది. ? దాని దగ్గరికి వెళ్లి నువ్వు ‘శివ శంభో అని ఉచ్చరించు, ఏం జరుగుతుందో చూద్దాం’ అన్నాడు. ఆ యోగి భుజాలు ఎగరేసి, అయిష్టంగానే సరేనన్నాడు. అతను ఆ పురుగు దగ్గరకు వెళ్లి ‘శివ శంభో’ అనగానే, ఆ పురుగు చచ్చి పడిపోయింది. 

ఆశ్చర్యం! ఆ యోగి నివ్వెరపోయి, ఏమిటిది? ఈ మంత్రం ఉచ్చరిస్తేనే ఆ పురుగు చచ్చి పోయింది’ అన్నాడు. 

శివుడు నవ్వి అక్కడ ఎగురుతున్న ఆ సీతకోకచిలుకని చూపించాడు. దాన్ని చూసి ‘శివ శంభో అనమన్నాడు. అప్పుడు జ్ఞాన యోగి లేదు. నాకు ఆ సీతకోకచిలుకను చంపడం ఇష్టం లేదు” అన్నాడు. శివుడు ప్రయత్నించమన్నాడు. జ్ఞాన యోగి సీతాకోకచిలుకను చూసి ‘శివ శంభో’ అన్నాడు. సీతాకోకచిలుక చనిపోయింది. ఇదేమిటి? ఈ మంత్రం యొక్క ఫలితం ఇదైతే, ఎవరైనా దాన్ని ఎందుకు ఉచ్చరించాలనుకుంటారు?” అని జ్ఞానయోగి అడిగాడు. 

శివుడు ఇంకా చిరునవ్వుతోనే, అడవిలో చెంగున తిరిగే ఒక అందమైన జింకను చూపించాడు. దానిపై దృష్టి పెట్టి, ‘శివ శంభో’ అనమన్నాడు. లేదు, నాకు చంపడం ఇష్టంలేదు” అన్నాడు జ్ఞాన యోగి. అందుకు శివుడు, ఫరవాలేదు. అను” అన్నాడు జ్ఞాన యోగి శివ శంభో అన్నాడు. జింక చనిపోయింది. అతడు పూర్తిగా కలవరపడ్డాడు. ఈ మంత్రం ఉద్దేశ్యం ఏమిటి? ఇది అన్నిటినీ  చంపుతోంది” అని ప్రశ్నించాడు దిగులుగా భయంతో.

ఈలోగా శివుని ఆశీర్వాదం కోసం అప్పుడే పుట్టిన శిశువుతో ఒక తల్లి వచ్చింది. శివుడు జ్ఞాన యోగిని చూస్తూ, ఈ బిడ్డ కోసం ఆ మంత్రం చెప్పరాదూ?” అని అడిగాడు. లేదు, నేను అలాంటి పనులు చేయాలనుకోవడం లేదు. శిశువును చంపడం నాకు ఇష్టం లేదు” అన్నాడు. శివుడు ప్రయత్నించు” అని అతణ్ణి ముందుకు తోశాడు. జ్ఞాన యోగి ఆ పిల్లవాని దగ్గరకు చాలా ఆందోళనతోను భయంలోను వెళ్లి ‘శివ శంభో’ అన్నాడు. ఆ శిశువు లేచి కూర్చొని “నేను ఒక పురుగుగా ఉన్నాను, ఒక మంత్రం నన్ను సీతాకోకచిలుక రూపంలోకి మార్చింది. మరొక మంత్రంతో నీవు నన్ను జింకగా చేశావు. ఇంకొక మంత్రంతో- నన్ను మానవునిగా చేశావు. మరొకసారి ఉచ్చరించు, నాకు దివ్యత్వాన్ని పొందాలని ఉంది’ అని అన్నాడు. అదీ ఒక మంత్రానికి ఉన్న శక్తి యోగికి జ్ఞానోదయమయ్యింది. అప్పటి నుంచి శివ నామ మంత్రోచ్చారణ ను మరవకుండ ఆ యోగి దేశ దేశాలు తిరుగుతున్నాడు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి