భారతీయ సాహిత్య వికాసాన్ని అలాగే ఆధునిక సమాజాన్ని 19వ శతాబ్దంనుంచి ప్రారంభిస్తూ సాంస్కృతిక పునర్జీవన ఫలితంగా, సమాజంలోను, సాహిత్యంలోను మార్పులు చోటుచేసుకుంది అని రాస్తుంటాం మనం. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగిన సామాజిక పరిణామాన్ని దాని నేపథ్యాన్ని తెలుసుకోకుండా, ప్రస్తావించకుండా సాహిత్యాన్ని, సమాజాన్ని ప్రస్తావించలేం. పదిహేను, పదహారో శతాబ్దాలలో యÖరోపియన్ సమాజంలో వచ్చిన బహుముఖ ప్రగతి ఆధునిక నాగరికతకు పునాది వేసింది. ఈ బహుముఖ ప్రగతి స్థూలంగా ‘రి నైసాన్స’ (పునర్జీవనం) గా చరిత్రకారులు అభివర్ణించారు. క్రీస్తుపూర్వంనాటి సాంప్రదాయకళలు, సాహిత్యం పట్ల యÖరోపియన్లు ఆసక్తి చూపిస్తూ అధ్యయనం చేశారు. ‘రినైనాన్స’ లో మానవతావాదం, సాంప్రదాయిత చోటు చేసుకున్నాయి.
పునర్జీవ వికానం ఐదు అంశాలలో కనిపిస్తుంది. 1. అచ్చుయంత్రం కల్పన, తత్ఫలితంగా వచ్చిన విజ్ఞానవ్యాప్తి 2. ప్రాచీన గ్రీకు, రోమన్ సంస్కృతీ సంప్రదాయాలపట్ల ఆసక్తి, పర్యవసానంగా వచ్చిన సాంప్రదాయికతా, మానవతా ధోరణులు 3. లలితకళ్ళల్లో వచ్చిన పరిణామాలు 4. దేశభాషా సారస్వతాల వికాసం 5. శాస్త్రవిజ్ఞానం. అచ్చుయంత్రం కనిపెట్టడం ఆధునిక నాగరికతా వికాసానికి తొలిమెట్టుగా పేర్కొనాలి. కాగితం ఆధునిక సమాజంలో ఒక కొత్త సమాజాన్ని సృష్టించింది. కాగితం వల్ల వేలకొద్ది పుస్తకాలు ముద్రింపబడి ప్రజలకు అందుబాటులో వచ్చాయి.
యÖరప్ సంస్కృతిలో మార్పు చోటుచేసుకుంది. సాహిత్యంలో ప్రాసలు, అనుప్రాసలతో కూడిన కవిత్వం, శిల్పంలో వింతైన ధోరణులు వచ్చాయి. ముఖ్యంగా 16వ శతాబ్దం వరకు గ్రీకుభాషా సారస్వతాల బోధన, పఠనం, సాహిత్య అధ్యయనం ప్రచారమైంది. ఈ పరిణామాన్ని ‘నూతనవిద్య’ (న్యూలెర్నింగ్) అన్నారు. దాంతో మానవుని గురించి ఆలోచించడం ప్రారంభమైంది. చరిత్రకారులు, హెజ్ మానవుని గురించి ఆలోచించారు.
ఆధునికయుగ ఆరంభంలో గ్రీకు, లాటిన్‌లకూ, ఆ భాషల్లో ఉన్న ప్రాచీన సారస్వతానికి ఆత్యున్నతగౌరవం, ఆదరణ లభించిన కారణంగా పెట్రార్క్, బొకాషియో వంటివారు దేశభాషలతో ఆధునిక భావాలతో, వస్తువులతో సాహిత్య రచన చేసారు. ముఖ్యంగా బొకాషియో సుందరమైన రచనలు చేసాడు. ఈయన రాసిన కొన్ని ప్రేమకథల రచనలను (ఇటాలియన్ భాషలోనే ఉన్నాయి) వాటికి నవల అనే పేరు పెట్టారు.
ప్రపంచంలో జరిగిన మరో గొప్ప మార్పు ఐరోపాఖండంలో జరిగిన పరిణామాలు ముఖ్యంగా 18వ శతాబ్దంలో ఆర్థికరంగంలో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం, రాజకీయరంగంలో సంభవించిన అమెరికా స్వాతంత్య్రం, ఫ్రెంచి విప్లవం చెప్పుకోదగినవి. రాజకీయరంగంలో సంభవించిన రెండు సంఘటనలు ప్రపంచంతో రాచరిక వ్యవస్థకు స్వస్తిచెప్పి సంపూర్ణ ప్రజాస్విమిక వ్యవస్థకు నాందీవాచకం పలికాయి. 19వ శతాబ్దంనాటి ఐరోపా అంతా ఫ్రెంచి విప్లవ ప్రభావానికి లోనైంది. పురాతన ఆచార సంప్రదాయాలు, భావాలపై ఫ్రెంచి విప్లవం ధ్వజమెత్తింది. మత వ్యవస్థపైన రాచరికవ్యవస్థలైన ఫ్రెంచి విప్లవం తీవ్రంగా నిరసించింది. స్వేచ్ఛ (లిబర్టీ) సమానత్వం (ఈక్వాలిటీ) సౌభ్రాతృత్వం (ఫ్రాటెర్నిటీ) అనే గొప్ప ఆశయాలు చిగురించాయి. వాటి సాధనకై సామాన్య ప్రజలు భూస్వామ్య రాచరికవ్యవస్థపై తిరుగుబాటు ప్రకటించాయి. ఈ పరిణామాన్ని ప్రపంచవ్యాప్తిగా ప్రజలు ఆహ్వానం పలికారు. మేధావులలో లౌకికమైన సామాజికమైన భావాలు చిగురించాయి.
ప్రకృతి ఆరాధన, హేతువాదదృష్టి లాంటి సైద్ధాంతిక ఆలోచనలు ప్రజలను ప్రభావితం చేసాయి. అప్పటివరకూ ఉన్నభూస్వామ్య వ్యవస్థ, బానిస వ్యవస్థ, వర్గాదిక్యతలు రద్దుకావడంతో...వ్యక్తి తెరపైకి వచ్చాడు. వ్యక్తి శ్రేయస్సు, వ్యక్తి సుఖం, ప్రధానమని ప్రజలు గమనించారు. రూసో రాజకీయతత్వంతోపాటు ఇంగ్లాండ్, అమెరికా రాజ్యాంగాల ప్రభావంతో సంఘంలో ప్రతివ్యక్తి సమానమనే భావన కలిగింది. వ్యక్తి హక్కులు సంక్రమించాయి.
మానవులంతా పుట్టుకతో సర్వస్వతంత్రులు సమాన హక్కులున్నవారు. పౌరశ్రేయస్సుమÖలం. వాక్‌స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రాలు కూడా ప్రధానం అని మానవుడు గ్రహించాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ తత్వవేత్తలలో ఒకరైన జాన్‌జాక్వీన్ రూసో. ఇతని రచనలు రెండు శతాబ్దాలపాటు అనేక దేశాల రాజకీయ భావాలపై ప్రభావాన్ని కలిగించాయి. మానవునికి ఇతను పెద్దపీట వేసాడు. ‘మానవుడు స్వేచ్చగా జన్మించాడు, కాని సర్వత్రా బంధితుడే అని (సోషల్ కాంటాక్ట్ గ్రంథంలో) పేర్కొన్నాడు రూసో. శ్రమకు (లేబర్), ఉత్పత్తి (ప్రొడక్షన్) సహజసంపదతో మానవునికి కృషి జోడించినపుడే సంపద ఉత్పన్నమవుతుంది. ఇది విప్లవాత్మక ఆర్థిక సంపదకు కూడా గుర్తింపు లభించింది ఈ సూత్రమే సామ్యవాదానికి మÖలం అని చెప్పొచ్చు.
ఫ్రెంచి విప్లవం కేవలం ఫ్రాన్స్‌కే పరిమితం కాలేదు. దాని ఫలితాలు అనేకమైన దేశాలలో ప్రతిఫలించాయి. 19శతాబ్దంలో ప్రష్యాసార్జీనియా, ఇంగ్లాండ్‌తో పాటు మన దేశంలో కూడా చోటుచేసుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో ఫ్రెంచివిప్లవ నినాదాలైన స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం లాంటివి ప్రోత్సాహాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు.
మానవశ్రమకు ఎప్పుడయితే గుర్తింపు కల్గిందో, సంపన్నదారులు మానవుని ప్రమేయం తక్కువగా గల యాంత్రికశక్తి ఉపయోగించి వస్తూత్పత్తి చేయటం ప్రారంభించారు. ఈ మార్పునే మనం ‘పారిశ్రామిక విప్లవం’ అంటున్నాం. పారిశ్రామిక విప్లవ ఫలితంగా వస్త్ర, ఇనుము, ఉక్కు, కాగితం మొదలైన వస్తు ఉత్పత్తి జరిగింది. ఇంకా ఆధునిక సమాజంలో జరిగిన గొప్ప పరిణామం. రష్యా విప్లవం నియంతృత్వ రాజ్యాన్ని భూస్థాపితం చేసి, సోషలిజం, సామ్యవాదం భావాల నిర్మాణం చేసింది. ఈ విప్లవం ప్రపంచంలో పెనుమార్పులను తీసుకొచ్చింది.
రష్యాలో (1825) మొదట నికోలస్ నిరంకుశ ధోరణివల్ల దేశంలో ఉద్రిక్త పరిస్థితులమధ్య అరాజకవాదం (అనార్కిజం) శూన్యవాదం (నిహిలిజం) సామ్యవాదం (సోషలిజం) మార్క్సిస్ట్‌వాదం (మార్క్సిజం) ప్రచారంలో ఈ వాదాలపట్ల ప్రజలు ఆకర్షితులైనారు. ఆ భావాలచేత పెట్టుబడిదారి వర్గంపై (కాపిటలిస్ట్‌లు) వ్యతిరేకంగా పోరాడారు. భూస్వాముల పెట్టుబడిదారుల తీవ్రదోపిడిని ప్రజలదృష్టికి తీసుకొచ్చి వారితో చైతన్యాన్ని ప్రజ్వలింపజేసి విప్లవభావాలను రగిలించినవారు విద్యావేత్తలు తమ సాహిత్యం ద్వారా కవులుకూడా ప్రజలను చైతన్యపరిచారు వారితో టాల్‌స్టాయ్, గోర్కి, కర్టినోత్, చెకటోవ్ ముఖ్యులు. గోర్కి తన అమ్మ నవలలో శ్రమజీవులైన కార్మికులకడగండ్లను కన్నులకు కట్టినట్లు వర్ణించాడు. జర్మనీ దేశానికి చెందిన కారల్‌మార్క్స్, ఫెడరిక్ ఏంజిల్‌లు సామ్యవాదానికి ఒక నిర్దుష్టమైన రూపాన్నిచ్చి ఉద్యమాన్ని రూపొందించారు. చరిత్రకు గతితార్కికవాద దృక్పథంలో ఒక అర్థాన్నిచ్చి సంఘంలో పెట్టుబడిదాని వర్గానికీ, కార్మిక వర్గానికీ నానాటికీ ఆంతరం పెరిగి అధికారం కోసం వర్గ సంఘర్షణ (క్లాస్‌వార్)తప్పక జరుగుతుందనీ, దీనిలో శ్రామికులకే జయం లభిస్తుందనీ వారు సమానత్వ ప్రాతిపధికపై మొదటివర్గరహిత తర్వాత రాజ్యరహిత కమÖ్యనిస్టు వ్యవస్థను ఏర్పాటు చేస్తారని ఎలుగెత్తి చాటారు. 1848 కారల్‌మార్క్స్ తన సిద్ధాంతాన్ని కమÖ్యనిస్టు మేనిఫెస్టో వివరించాడు. మార్క్స్ సిద్ధాంతాలను దేశంలోనే కాక ప్రపంచదేశాలలో ప్రచారం పొందాయి.
మొదటి ప్రపంచయుద్ధం అనంతరం రష్యా తదితర దేశాలలో విప్లవం ఆవిర్భవించింది. 1918లో రష్యా రాజ్యాంగం ఆమల్లోకి వచ్చింది. శాంతి, భూమి, రొట్టె (పీస్, లాండ్, బ్రెడ్) ను ప్రజలందరికీ ప్రసాదించాలి అనే భావనను వ్యక్తం చేసిన లెనిన్, భూస్వాములనుంచి భూములను తీసుకుని పేద ప్రజలందరికి పంచిపెట్టాడు. భూమి ప్రజలందరి సొత్తు అని ప్రకటించాడు. అంతేకాదు పరిశ్రమలను మÖయించి ప్రభుత్వమే పరిశ్రమలను నడిపేట్టు చేసాడు. వ్యక్తిగత ఆస్థిని రద్దుపరచాడు. ఈయన అవలంభించిన విధానాలు రష్యా పునర్నిర్మాణంతోపాటు ఆధునిక ప్రపంచగతిని మార్చవేసిందని చెప్పవచ్చు.
భారతదేశంలో ఆధునిక సమాజపరిణామాలు
మొఘల్ పాలకుల అనంతరం అంటే క్రీ.శ. 1707లో మొగల్‌పాదుషా ఔరంగజేబ్ మరణంతో భారత రాజకీయ రంగంలో పెనుమార్పులు సంభవించాయి. పాదుషాల మధ్య కుతంత్రాలు మొదలయ్యాయి. మహారాష్ట్రులు రాజకీయంగా పుంజుకున్నారు. అక్కడక్కడ సంస్థానాల పాలకులు స్వతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. వర్తక వ్యాపారుల నిమిత్తం వచ్చిన పశ్చిమ దేశాల వర్తక కంపనీలు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి విషమించింది. ఇదే అదనుగా భావించిన బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ. 1757 ప్లాసీయుద్ధం అనంతరం భారతదేశంలో బ్రిటిష్ అధికారానికి అంకుర్పారణ చేసింది. 1764 బాక్సార్ యుద్ధంతో ఆ తర్వాత 1800 సంవత్సరకాలంనాటికి బ్రిటిష్‌వారు సార్వభౌములైనారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం అంతటా పాలనను విస్తరించింది. భారతదేశంలోని ఆర్థికరంగాన్ని ఇంగ్లాండ్ (బ్రిటన్) అవసరాలకు అనుగుణంగా మార్చి వేసింది. దాంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. వ్యవసాయరంగంలో ఆసియా వర్షానికంతటికి తల్లి అని పారిశ్రామికంగా ప్రపంచానికే వర్క్‌షాప్ పేరు పొందిన భారతదేశం బ్రిటిష్ మోసపూరిత పాలనవల్ల ముడి సరుకులను ఎగుమతి చేసి ఉత్పత్తి అయిన సరుకులను దిగుమతి చేసకునే దేశంగా మారిపోయింది.
బ్రిటిష్ అవసరాలకోసం రైల్వే, స్టీమర్ (సముద్రమార్గం) రోడ్ మార్గాలను నిర్మించుకుని ఆర్థికదోపిడి, వనరుల దోపిడీకి పాల్పడింది బ్రిటిష్ ప్రభుత్వం. నిరంతరాయంగా, నిరాటంకంగా కొనసాగుతున్న దోపిడికి వ్యతిరేకంగా, అరాచకాలకు, నియంతృత్వపుపోకడలకు విరుద్ధంగా, హింసకు వ్యతిరేకంగా 1857లో సపాయిలు, తిరుగుబాటు చేసారు. భారతదేశ చరిత్రలో దీనిని మొదటి స్వాతంత్య్రోద్యమంగా పేర్కొన్నారు చరిత్రకారులు. క్రమంగా భారతీయులలో 1857 నుండి జాతీయతాభావం ధృడంగా మారిపోయింది. రైల్వేలు, రవాణామార్గాలు, సముద్రమార్గాలు పరిపాలనా రంగంలో సంస్కరణలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా
భారతదేశంలో బ్రిటిష్‌వారు పరిపాలన వ్యవస్థకు పటిష్టమైన పునాదులు నిర్మించారు. అవి ఒకరకంగా సామాజికంగా భారతదేశానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఒకటి సివిల్ సర్వీసెస్, పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, బ్రిటష్‌విద్యావాధానం, బ్రిటిష్ రెవెన్యూ విధానం, అలాగే శాశ్వతశిస్తువిధానం, రైత్వారీవిధానం, ముఖ్యంగా 1854లో రూపొందించిన ఛార్లెస్‌వుడ్ నివేదికకు ఆధునిక విద్యాభివృద్ధికి ఒక మాగ్నాకార్టాగా అభివర్ణించవచ్చు. ఈ నివేదిక ఆధారంగా వివిధ రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఆధునిక సమాజపురోగతికి, జాతి చైతన్యానికి విశ్వవిద్యాలయాలు ప్రధాన భూమికను పోషించాయి. వీటితోపాటు వివిధ సామాజికోద్యమాలు ఆధునిక భారతదే సమ్పుానిర్మాణంలో చోటు చేసుకున్నాయి.
బ్రిటిష్ పాలకుల పోకడవల్ల భారతదేశంలో కుల ఉద్యమాలు తలెత్తాయి. కొన్ని కులాలకు సహాయం చేయటం, కులప్రాతిపదిక జనాభా లెక్కలు వేయటం, అగ్రకులస్థులు బలహీణవర్గాలపై, నిమ్నజాతులపై వివక్ష చూపించిన కారణంగా సామాజికోద్యమాలు ఆవర్భివించాయి. ఈ ఉద్యమాలు భారత స్వాతంత్య్రోద్యమానికి ఉపయోగపడ్డాయి. అవి జస్టిస్ ఉద్యమం. ఇది బ్రాహ్మణులకు వ్యతిరకంగా సాగినఉద్యమం. దీనిని అత్యంత శక్తివంతమైన ఉద్యమంగా పేర్కొనవచ్చును. సి.ఎస్.మొదలియర్, టి.ఎమ్.నాయర్, పి. త్యాగరాయశెట్టిలు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. విద్య, ఉపాధి, రాజకీయ, సామాజికంగా బ్రాహ్మణాధిక్యతను నిరసించారు. ఇదేసమయంలో ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభమైంది. పెరియార్‌గా పిలువబడే ఇ.వి. రామస్వామి నాయకర్ దీనిని ప్రారంభించాడు.
1924లో ప్రారంభమైన ఉద్యమం, మనువాదానికి వ్యతిరేకంగా సాగింది. పురోహితులు లేకుండా వివాహాలు జరిపించడం, దేవాలయాలలో బలవంతంగా ప్రవేశించడం, విగ్రహాలను పడగొట్టడం లాంటి చర్యలకు పురిగొల్పింది. గాంధి వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ ఉద్యమం కూడా నడిపాడు. నారాయణగురు కేరళలో వీరు బ్రాహ్మణవాదులకు వ్యతిరేకంగా అంటరాని తనానికి (అస్పృశ్యత) వ్యతిరేకంగా రోరాడాడు. ఒకే మతం, ఒక దేవుడు, ఒక కులవం ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలలో మేధావులలో ఇది బలంగా నాటుకుంది.
నారాయణగురు ప్రభావం వల్ల కట్టమంచి రామలింగారెడ్డి, మైసూర్‌లో ప్రజామిత్ర సంస్థను ఏర్పాటుచేసి మైసూర్ రాష్ట్రంలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని ఉదృతం చేసాడు. ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్న సందర్భంలోనే ఇతర రాష్ట్రాలలో కూడా సామాజిక ఉద్యమాల ప్రభావం పడింది. ఆ ప్రభావంతోనే మహారాష్ట్రలో జ్యోతిబాపూలే నాయకత్వంలో బ్రాహ్మణవ్యతిరేకోద్యమం అత్యంత ప్రతిష్టాత్మకంగా, శక్తివంతంగా కొనసాగింది. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిరసిస్తూ ‘గులాంగిరి’ అనే గ్రంథాన్ని రచించాడు. అట్లాగే 1873లో సత్య శోధక్ సమాజాన్ని స్థాపించారు. జ్యోతిబాపూలే ప్రభావంతో, అంబేద్కర్ అస్పృశ్యతను నిరసించి, బడుగు, బలహీనవర్గాలకోసం పోరాటం లేవనెత్తారు. అంబేద్కర్ ‘బహిష్కృత హితకారిణి’ అనే పళ్ళను బొంబాయిలో స్థాపించారు. కులనిర్మూలనకోసం పోరాటం చేసాడు. అస్పృశ్యత నివారణకు కూడా పోరాడాడు. ఇట్లా దేశప్రజలను సామాజికంగా చైతన్యం చేసేపనిలో ఆయన ఉన్నారు. స్వయంకృషి, ఆత్మవిశ్వాసం, మానవుని మనుగడకు అత్యంతావశ్యకాలు. మనము అందరివలెనే అన్నీ చేయగలం. ఆయన మాటలు నిమ్నజాతులకు అలోచింపజేసాయి. ఆధునిక భారత సమాజ నిర్మాణంలో కార్మిక, రైతు ఉద్యమాలు సంఘసంస్కరణోద్యమాలు పాలు పంచుకున్నారు. ఈ ఉద్యమాలు భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి ఊతం ఇచ్చాయి. జమిందారి పారిశ్రామిక వర్గాలకు సరైన గుణపాఠం నేర్పాయి.
భారతదేశ చరిత్రలో 19వ శతాబ్దం అనేక మత సంస్కరణ ఉద్యమాలతో అట్టుడికిపోయింది. ప్రపంచదేశాలతో జరగిన యుద్ధాలు, సంఘర్షణలు, విప్లవాలు, పోరాటాలు, సాహిత్య కళారంగాలు వచ్చిన పరిణామాలు భారతదేశంలో కవులు కళాకారుల మేధావులపై సామాజికోద్యమకారులపై ప్రభావం చూపాయి. అంతకంటే ప్రధానమైన బుద్ధుని బోధనలు, మాహవీరుని బోధనలు భారత ప్రజలపై ప్రభావాన్ని చూపాయి. అరాచకవాదం, సామ్యవాదం, హేతువాదం, మానవతావాదం, రినైసాన్స్ లాంటి పాశ్చాత్యదేశంలో వచ్చిన ఆధునిక సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన మనవారు వాటిని మరో కొత్తకోణంలో మనదేశంలో ప్రారంభించారు.
ముఖ్యంగా యÖరప్‌దేశంతో ఆవిర్భవించిన రినైసాన్స్ (పునరుజ్జీవనం) ఆధునిక భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రేరణనిచ్చింది. ఆ ప్రేరణతో రాజారామ్మోహన్‌రాయ్ 1814లో కలకత్తా నగరంలో ఆత్మీయసభను స్థాపించాడు. దానిద్వారా విగ్రహారాధనను, కులవ్యవస్థను, మత కర్మకాండలను నిరిసంచాడు. 1828 ఆగస్ట్ 20న ఆత్మీయ సభ బ్రహ్మసభగా ఆ తర్వాత బ్రహ్మసమాజంగా ఆవిర్భవించింది. తత్వశాస్త్రం, సాsఘికశాస్త్రంతోపాటు భౌతికశాస్త్రాల అధ్యయనం పాఠ్యాంశంగా తను స్థాపించిన వేదాంతకళాశాలలో ప్రవేశపెట్టారు.
గిఫ్ట్ టు మొనో దిసీస్ అనే గ్రంథం పర్షియన్‌భాషలో రచించారు తన ఆశయాలకు ఈ గ్రంథం అద్దం పడుతుంది. గో బాక్ టు వేదాస్ షంటూ శుద్ధి ఉద్యమం ప్రారంభించినవారు. దయానందుడు 1875లో ఆర్యసమాజం స్థాపించి భారతదేశాన్ని సాంస్కృతికత వైపు నడిపించాడు. ముదిరిపోయిన ఆచారవ్యవహారాలు, వర్ణవ్యవస్థ, విగ్రహారాధన మొదలైన అంశాలను దయానందుడు కూడా నిరసించాడు. స్త్రీ విద్య, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. 1867లో ప్రార్థనాసమాజం ఏర్పడింది. దీనిని ఆత్మారాం పాండురంగడు స్థాపించాడు. ఈ సంఘంలో సభ్యులైన ఆర్.జి. భండార్కర్, మహదేవ గోవిందరనడే లాంటివారు మహిళలకు రాత్రి పాఠశాలలు నెలకొల్పారు. అనాథలకు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు.
మానవతాదృక్పథం కలిగిన రామకృష్ణను బోధనలు భావనలు ప్రచారం చేయడానికి 1867 వివేకానందుడు రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేసాడు. 1875లో దివ్యజ్ఞానసమాజం ఏర్పడింది. దీనినే థియొసాఫికల్ సొసైటీ అంటారు. మేడమ్ ల్లో వటిస్కి, కల్నల్ ఆల్కాట్‌లో దీనిని ఆమెరికాలో స్థాపించారు. 1893 ఐర్లాండ్ దేశానికి చెందిన అనిబీసెంట్ దీనిలో చేరారు. దీంతో భారతదేశంలోకి దివ్యజ్ఞానసమాజం పనిచేయడం ప్రారంభించింది. హిందూసంస్కృతిని కాపాడటం, హిందూమత పునరుద్ధరణం ఆశయాలుగా, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమానత అనేవి ముఖ్యసూత్రాలుగా పనిచేసింది. ఈ సంస్థలన్ని సామాజిక కోణంలో ప్రజలను చైతన్యపరచడానికి పనిచేసాయి. ముఖ్యంగా హిందుత్వ భావాల్ని దేశసంస్కృతి సంప్రదాయాల కనుగుణంగా ఆ పరిధిలోని కార్యక్రమాలు నిర్వహించాయి.
భారతదేశంలో రాజకీయోద్యమాలు
స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా భారతదేశంలో కాంగ్రేస్ స్థాపన జరిగింది. నిజానికి ప్రపంచంలో ఏర్పడిన రాజకీయాలకు నేపథ్యం పరాయిపాలనలో ఉన్నతమప్రాంతంలేదా తమదేశ అస్తిత్వంకోసం, స్వతంత్ర పాలనకోసం పోరాడే సందర్భంలోనే రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఆవిధంగానే బ్రిటీష్ పాలకుల నియంతృత్వ పోకడలను అణచివేసి, స్వతంత్రదేశంగా భారతదేశం ఆవర్భవించాలని, పరాయిపాలనకు చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్నాయి. ఆ కోణంలో చూసినపుడు ప్రజలను సమాయత్తపరచాలంటే ఒకటేమిటి లేదా సంఘం లేదా పార్టీలు అవసరమవుతాయి. భారత రాజ్యాంగం కేంద్రంలోనూ, రాష్ట్రాలలోను ప్రాతినిథ్య ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యం రాజకీయపార్టీలులేకుండా పనిచేయలేదు. ఎందుకంటే రాజకీయపార్టీలు, ప్రజాభిప్రాయాన్ని సమీకరించి సంఘటితపరచి ప్రకటించడంలోనూ, ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడంలోనూ, రాజకీయ అంశాలపై ప్రజలను జాగృతపరచి వారిబాధ్యతలను తెలియజేయడంలోనూ కీలకపాత్ర వహిస్తాయి.
జాతీయ ప్రయోజనాలను పెంపొందించే లక్ష్యంతో కొన్ని అంగీకంత సూత్రాల ద్వారా ఐక్యంగా ఉండే ప్రభాసముదాయమే రాజకీయపార్టీ అనీ ఎడ్మండ్ బర్క్ భావించాడు. 1885లో భారత రాజకీయ కాంగ్రెస్ పార్టీ అవతరించింది. ఇది మొన్నటి రాజకీయపార్టీ, ఇది స్వతంత్య్ర ఉద్యమంలో ప్రజలను జాగృతం చేసేందుకు తీవ్రంగా కృషిచేసింది. ముస్లింలీగ్ ఇది ముస్లిం గుర్తింపుకోసం పుట్టిన రెండవపార్టీ.
కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ ఏర్పడిన పార్టీ. స్వరాజ్య పార్టీ ఇది1922 లో ఏర్పడింది. ముఖ్యంగా బ్రిటిష్ విధానాలను ప్రతిఘటించాలని ఆవిర్భవించింది. ఇది నాలుగు లక్ష్యాలతో ఏర్పడింది. భూస్వాములు,రైతుల మధ్య కార్మికులు, యజమానుల మధ్య సుహృద్భావ సంబంధాల ఏర్పాటు. బ్రిటిష్ పారిశ్రామికవేత్తల ఆధీనంలో భారతదేశం పెట్టుబడులు మళ్లించకుండా చూడటం, స్వస్థతతో కూడిన జాతీయజీవనం, భారతీయుల స్వయంబ్రహ్మత్వం లాంటి సంస్కరణలత్తనం ఏర్పడింది. చిత్తరంజన్ మరణం తర్వాత పార్టీ తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది.
భారతదేశంలో రెండో జాతీయ రాజకీయపార్టీ భారతకమల స్వపార్టీ bం.ఎన్. రాయ్, ఎస్. ఎ. చాంగేలు భారతదేశంలో కమÖ్యనిస్టుపార్టీ 1925 డిసెంబర్ 26న స్థాపించారు. ఈ పార్టీ భారతదేశంలోని రాష్ట్రాలలో ప్రత్యామ్నాయంగా నిలవడటమే కాక, 1957 ` 59 మధ్యకాలంలో, కేరళ రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాలలో పార్టీ బలపడింది. 1964లో కమÖ్యనిస్టుపార్టీలో సైద్ధాంతికమైన బేధాభిప్రాయాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా, భారత్ ` రష్యా సంబంధాలు,భాత్ ` చైనా సంబంధాలు కాంగ్రెస్ పార్టీపట్ల అనుసరించే వ్యూహాల కారణంగా పార్టీ చీలిపోయింది. కమÖ్యనిస్టు పార్టీ (మర్క్సిస్టు) అనే పార్టీ ఆవిర్భవించింది.
మÖడవ జాతీయ పార్టీగా (భారతీయ) జనతాపార్టీ దేశంలో ఆవర్భివించింది. ఇవేకాకుండా వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు స్థాపించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఇవి స్థాపించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ, తమిళనాడులో ద్రవిడమున్నేటకగజం (డిఎంఆర్) అన్నా డి.ఎం.కే (ఎఐఎడింఎంకె) పార్టీ ఇది తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాలలో స్థాపించబడింది. ఆ తర్వాత శిరోమణి అకాళిదళ్, నేషనల్ కాన్ఫరెన్స్ మరియు అస్సాం గణపరిషత్ మహారాష్ట్రలో శివసేన, ఉత్తరప్రదేశ్‌లో బహుజనసమాజ్‌పార్టీ అలాగే సమాజ్‌వాద్‌పార్టీలు, ఆయా రాష్ట్రాలలో ఆవిర్భవించాయి. ఇవి, భాషా, ప్రాంతీయ, వాద అభివృద్ధి విద్యా, ఉపాధి మొదలైన అంశాలు ప్రధానం చేసుకుని ప్రజాభిప్రాయాన్ని చూరగొన్నాయి. 1982 సెప్టెంబర్‌లో పార్టీ స్థాపించి, డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలలో విజయవంతంగా గెలిచారు.
రాజకీయపార్టీలే కాకుండా ఆ ప్రభావంతో అనుబంధంగా ఏర్పడిన విద్యార్థి, కార్మిక, యువజన, శ్రామిక, సాంస్కృతిక సంస్థల ప్రభావం సమాజంలో కనపిస్తుంది. రాజకీయ పార్టీలు విస్తృతమైన సమాజాన్ని తమ చేతుల్లో లేదా తమ ఆధీనంలో ఉంచుకోవడానికి చూస్తాయి. అలాంటప్పుడు, ఆయా వర్గాల మద్దతు అవసరం ఉంటుంది. ప్రజాకళామండలి, జననాట్యమండలి, అరుణోదయ లాంటి సంస్థలు, కమÖ్యనిస్టు నేపథ్యాన్ని తమ, కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. ఒకరకంగా విప్లవ పోరాటాల వైపు ప్రజలు ఆసక్తి కనబరచడానికి ఇవి బాగా ఉపకరించాయి. సి.ఐ.టి.యు, ఏ.ఐ.టి.యు.సి., ఐ.ఎన్.టి.యు.సి. లాంటి కార్మికసంస్థలు, ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి.
కాంగ్రెసేతర, జాతీయపార్టీగానే కాకుండా కమÖ్యనిస్టుపార్టీ ప్రగతిశీల భావాలతో, పీడిత, తాడిత ప్రజలనుండి అభిమానాన్ని పొందింది. దేశంలో ఉన్న అన్ని రకాల ప్రజలు ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలు కమÖ్యనిస్టుపార్టీకి జేజేలు పలికారు. కార్మికులు, కళాకారులు, కర్షకులు, తమకు కావలసిన సమాజాన్ని నిర్మించుకోవడానికి, రాజకీయకోణంనుంచి కొందరు ప్రజాస్వామికమైన సంస్థలను మరికొందరు ప్రయత్నించారు. సమాజంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఆధునిక సాహిత్యంపై ప్రభావాన్ని చూపించాయి. ప్రగతిశీల భావాలుగల సామాజికవేత్తలు, సాహిత్యవేత్తలు అవతరించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కమÖ్యనిస్టుపార్టీ స్థాపించబడింది. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది. భాష, జాతి, సంస్కృతి అనే ముఖ్యమైన అంశాలతో తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ అవతరించింది.
మానవుడు సంఘజీవి. అందుకే తోటి వారితో కలిసి వ్యవహారాలు కొనసాగించే ప్రయత్నం చేస్తాడు. ఇందుకు సాధనంగా భాషను ఎంచుకున్నాడు. సమాజం అంటే మనుషులచేత నిండి, సకల జీవరాశి మÖలమైన వ్యవస్థ. మనిషి వ్యక్తం చసే అభివ్యక్త నైపుణ్యం, సాధనం భాష. మాటలద్వారా, పదాలు, వాక్యాలుగా నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం చేసే కర్త కవి. ‘కవిర్మనిషిః పరిభూఃస్వయంభూః’ అంటాం. చర్మచక్షువుల కతీతమైన జ్ఞానాన్ని సందర్శించి నడుస్తున్న, నడవబోయే కాలానికి మంచి తయారు చసే వ్యక్తి కవి. కవి ద్వారా వ్యక్తమైన, లిఖితమైన సంపదంతా సాహిత్యమే. సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం సమాజహితాన్ని కోరడం. అందుకే నన్నయ ‘విశ్వశ్రేయః కావ్యం’ అన్నాడు మహాభారతాన్ని జగత్ హితంకోసం రచిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
సర్వమానవాళితో నిండి ఉన్న ఈ సమాజంలో రకరకాల మనుషులుంటారు. రకరకాల గుణాలతో, లక్షణాలతో, అభిప్రాయాలతో మెలగు తుంటారు. ‘మంచి ` చెడు‘ల మధ్య ఎప్పుడూ పోరాటం జరసుగుతూనే ఉంటుంది. మంచిని నిర్మించాలని తహతహలాడుతూనే అదే తహ, తహ చెడు’ వెంటాడుతుంది. మంచి ` చెడుల మధ్య జరుగుతున్న పోరాటంలో ‘మంచి’ నిర్మించి, చెడును పరిత్యజిస్తూ సదాచరణతో కవి, రచయిత ఎప్పటికప్పుడు జాగ్రత్తతో ఉంటూ తనకళ్ళముందు జరుగుతున్న దృశ్యస్థితిని వర్ణించుకుంటూ వెళ్తాడు. అంటే సమాజానికి సాహిత్యాన్ని జూడిస్తూ ఇలా ఉండాలి ` అలా ఉండకూడదు అనే మార్గాన్ని చూపిస్తూ దిశానిర్దేశం చేస్తాడు. విస్తృతమైన సమాజానికి సాహిత్యం వెలుతురు, కాంతి, దీపం, కందిళి. సాహిత్యం నిర్మించే తోవలో పయనించడమంటే మంచిసమాజాన్ని నిర్మించడమే. లోకశ్రేయస్సును కోరుకుని లోక కళ్యాణానికి బాటలువేసే ఒక మంచి సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంది సాహిత్యం.
సాహిత్యంలో రెండు ఉపకరణాలుంటాయి. ఒకటి ఉపదేశం, రెండోది ఆనందం. ఉపదేశాత్మక సాహిత్యాన్ని నిర్మిస్తూనే ఆనాందాత్మకమైన సాహిత్యాన్ని అంతర్భాగం చేయడం, కవి తన రచనలను ఎందుకు తయారు చేసాడన్న ప్రశ్న వేసుకుంటే ప్రయోజనంకోసం చేసాడన్న సమాధానం వస్తుంది. ఏ ప్రయోజనం అన్నపుడు ఆనందం మరియు ఉపదేశం.
కోహ్లర్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త జంతువులమీద వివిధ రకాల పరిశోధనలు చేసి ఆ పరిశోధనలు తాను రచించిన ది మెంటాలిటీ ఆఫ్ ఏమ్స్ అనే గ్రంథంలో వివరించాడు. అందులో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ప్రేమ, ద్వేషం, సానుభూతి, వైషమ్యం, స్నేహం, మాత్సర్యం, సహజానుబంధం, సంతాపం, సుఖం, నిస్పృహ, సంబంధస్పృహ, సామాజిక ఐకమత్యం అనే మానవ సమాజ మౌలిక లక్షణాలు జంతువుల్లో ఉన్నాయి. కానీ వాటికి భాషలేదు. ఇక్కడే మానవునికి జంతువుకూ కొంచెం తేడా ఉంది. పైన చెప్పిన అన్ని లక్షణాలు జంతువులకు, మానవులకు ఉన్నాయి. అయితే జంతువులకు లేనిది మానవునికి ఉన్నది మనస్సు. అలాగే మానవుడు మాట్లాడతాడు. జంతువులు మాట్లాడలేవు. మనోవికాసానికి ప్రతీక మనసు.
మానవుల సామాజిక ప్రవర్తనకు మÖలం పునరుత్పాదకత. స్త్రీపురుషుల సహకారన్నిహిత్యం వల్ల సామాజికవృద్ధి జరిగి సమాజం విస్తృతమైంది. ఒకరిపై ఒకరు ఆధారపడుతూ స్నేహసంబంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ వ్యక్తిగా సాధించలేనిది, సమిష్టిగా సాధించాలనుకొన్నాడు. శ్రీశ్రీ అన్నట్టు వ్యక్తికి బహువచనం శక్తి అన్నాడు. ఆ క్రమంలోనే వివిధ సామాజిక రాజకీయ సంస్థలు ఏర్పడ్డాయి.
వ్యక్తి, కుటుంబం, సమÖహం, సముదాయం, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, భౌగోళికత, ప్రాంతం, భాష, సంప్రదాయాలు, సంస్కృతులు ఏన్నీ అంతర్లీనంగా ఉంటాయి. ఎప్పుడయితే కుటుంబ వ్యవస్థ ఏర్పడిందో అక్కడినుంచి మానవుల ఆహార నియమాలు, అలవాట్లు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, పండగలు, కథలు, మతవిశ్వాసాలు ప్రారంభమైనాయి. వీటినే మనం సంస్కృతి అంటున్నాం. సంస్కృతి నుంచే మానవ సాంస్కృతిక అభివృద్ధి చెందుతుంది. కళ, సాహిత్యం, జీవన విధానాలు, భాష, మతం, సంస్కృతికి ప్రధాన అంగాలుగా ఉండి సమాజాన్ని సంసారవంతమైన మార్గంలో నడిపించడానికి అవసరమవుతాయి. భారతదేశంపైకి ఆర్యులు దండెత్తి వచ్చి ద్రావిడ సంస్కృతిని విధ్వంసం చేశారనే చారిత్రక సత్యాలు మనకు తెలుసు. సమాజంలో వర్గం, కులం అనే భేదబీజం ఉద్భవించిన నాటినుండి మనుషుల మధ్య దూరం పెరిగింది.
మÖడువందలకోట్ల సంవత్సరాలక్రిందట ఈ భూగోళం ఉద్భవించిందని మరో 150 కోట్ల సంవత్సరాల తర్వాత విశ్వంలో జీవ పదార్థం పుట్టిందని ఓ పది లక్షల సంవత్సరాల నడుమ వానరరూపం పోలిన మానవుడు అవతరించాడు. మళ్లీ 50వేల సంవత్సరాల క్రిందట ఆధునిక మానవజాతికి అంకురార్పణ జరిగింది. మరో 40 వేల సంవత్సరాలు గడచిన తర్వాత కొత్తరాతియుగంలో మానవజాతిశకం ప్రారంభమైంది. ఇది శైశవదశ దాదాపు క్రీ.పూ. 6 వేల సంవత్సరాలనాడు వ్యవసాయానికి మానవుడు నాంది పలికాడు. అప్పటినుంచి మానవజాతివికాసం ఉరకలెత్తే ప్రవాహంలాగా సాగింది. స్థిరనివాసాలు ఏర్పడటంతో సహజీవనం అనివార్యమైంది. సహజీవనం వల్ల వ్యక్తులమధ్య సామాజిక సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ సామజిక సంబంధాలే సమాజానికి పునాది. మానవుడు బతికి బట్టకట్టాలంటే సమాజం అవసరం. సహజీవనం సమాజం సహకారం లేనిది ఏ వ్యక్తి మనుగడ సాధించలేడు. మానవుడు, వ్యక్తి పరస్పరాశ్రయాలు వ్యక్తులు లేనిదే సమాజం ఉండదు. సమాజం లేకపోతే వ్యక్తికి సామాజిక మనుగడ మ్రగ్యమవుతుంది.
తనచుట్టుముట్టు ఉన్న వాతావరణం నుంచి మానవుడు ప్రత్యేక సామాజిక గుర్తింపుకోసం పరితపించాడు. అంటే మానవుడు సామాజిక జీవనాన్ని ఆకాంక్షించాడు. అందుకే వివిధ సామాజిక సంబంధాల అల్లికే సమాజం అని మైకైవర్ పేర్కొన్నాడు. సమాజం అంటే కేవలం కొంతమంది వ్యక్తుల సమÖహం కాదు. వారిమధ్య నిరంతరం నెలకొని ఉండే పరస్పర చర్య సంక్షిప్తరూపం అని లాపేజ్ అనే సామాజిక శాస్త్రవేత్త పేర్కొన్నాడు.
సమాజం అంటే ఒక విస్తృతమైన భౌగోళిక, సమÖహాల మానవ నిర్మాణం అని చెప్పాలి. ఇంత విస్తృతమైన సమాజానికి ఒక విలక్షణ సంస్కృతి ఉంది. ఎపుడైతే కొంతమంది వ్యక్తులు నిర్దుష్ట భౌగోళిక ప్రాంతంలో నివసిస్తారో వారి మధ్య శాశ్వత సామాజిక సంబంధాలు ఏర్పడ్డాయో అపుడు వారికో జీవనవిధానం ఉంటుంది. తరతాలుగా ఉమ్మడి సంప్రదాయాలు విశఆ్వసాలు, సామాజిక కట్టుబాట్లు, విలువలు కళారూపాలు విద్యావిధానం నైతిక ప్రవర్తనలు ఏర్పడతాయి. వీటన్నిటిని కలిపి ఆ సమాజ సంస్కృతిగా ముద్రవేస్తాం. ఇది మానవ నిర్మితం.
సమాజాలు ప్రపంచంలో అతి ప్రాచీనకాలంనుండే ఉన్న మనకు వివిధ శాస్త్రాలద్వారా తెలుస్తుంది. అయితే సామాజిక జీవనం మానవులకు మాత్రమే లేదు. మానవేతరాలైన అల్పజంతువులలోను, క్రిమికీటకాలలో కూడా సామాజిక జీవనం ఉంది. జంతువుల సామాజిక జీవనమే మానవ జీవనానికి మాతృక అయి ఉంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం.
తెలుగు సాహిత్య కళాశాలలో చాలామందిని మార్క్సిజం వైపు వాళ్ల రచనల్లో సామాన్య మానవులు వాళ్ల వాస్తవిక జీవితాల్లోని కష్టనష్టాలు, తమ కష్టనష్టాలనుండి బయటపడటానికి తామే నడుం బిగించవలసిన అవసరం ఆధునిక తెలుగు సాహిత్యకారుల కర్తవ్యం. 1964 కమÖ్యనిస్టు ` మార్క్సిజంగా విడిపోయి 1966లో మావో సాంస్కృతిక విప్లవం బయలుదేరింది.1967 మార్చి 3 కిసాన్ సభా సమావేశంలో కలుసుకున్న గ్రామాల్లో భూములను ఆక్రమించుకుంటూమరొక పొయ్యే ఉద్యమాన్ని ప్రారంభించిటానికి నిర్భయంతో సాగారు. ఆ నిర్ణయప్రకారమే చారు జమీందారు కానుసన్యాలు నాయత్వాన పేదరైతాంగం డార్జిలింగ్ జిల్లాలోని నగుల్బరీ గ్రామ భూస్వాముల భూములను సాయుధులై ఆక్రమించాఅ. ఎప్రిల్, మే నెలల్లో ఉద్యమం నడిపాయి. చారు జమీందారు నాయ దిన్నాసు 1969 మే 1 న భారత కమÖ్యనిస్టు పార్టీగా సిపిఐఎంఎల్ గా ఆవిష్కరించారు.
ప్రాచీనకాలంనుంచి మానవ జీవితాన్ని సుఖమయం చేసేందుకు తత్వవేత్తలు అన్నే సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఈ ప్రక్రియలో అంతర్భాగంగానే ఆధునికయుగంలో కారల్‌మార్క్స్ అనే జర్మన్ తత్త్వవేత్త (1818`1883) ఒక నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సంపగ అభివృద్ధికి సంబంధించిన ఉత్పత్తి రీతులు సామాజిక సంబంధాల ప్రభావాన్ని..........దాని నుంచే ఆర్థిక, రాజకీయ, సాంఘిక స్కంృతీ వ్యవస్థ ఆవిర్భవిస్తాయి. మార్క్స్ సిద్ధాంతంలోని మÖలాంశం. సిద్ధాంతం ప్రకారం ఆది మానవ సమాజంలో ఉత్పత్తి సాధనాలు సమానంగా ఉండేవి. కాలక్రమేనా కొంతమంది స్వార్థపరులు వాటిని సొంతం చేసుకోవడం ఫలితంగా వ్యక్తిగత ఆస్తిపాస్తులు, దాని ననుసరించి వర్గాలు వాటి మధ్య ఘర్షణ ప్రారంభమయింది.
ఆధునిక ప్రభుత్వాలు పెట్టుబడీదారి వర్గ పరిష్కృత యంత్రాలు కోట కార్మికులు వాటిని విప్లవాల ద్వారా కూలదోసి వాటి స్థానంలో తమ నియంతృత్వంలో పనిచేసే ప్రభుత్వాలను ఏర్పాటు చేసారు. ప్రభుత్వాలు పెట్టుబడిదారీ వ్యవస్థను అంతంచేసి దాని స్థానంలో సోషలిస్ట్ వ్యవస్థను నిర్మిస్తాయి. తద్వారా వినూత్న మానవ ఉత్పత్తి సాధనాలు సమాజం అవుతాయి.
ప్రతి వ్యక్తి అతడు చేసిన పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దురాశ దాటిన తర్వాత కమÖ్యనిస్టు సమాజం ఏర్పడింది. ఇందులో వర్గాలు వాటిని రక్షించి ప్రభుత్వాలు ఉండవు. ప్రజల నుండి ఏర్పడి సామాజిక జాగ్రత్తలను నిరూపించాలంటూ ప్రతి వ్యక్తి అతడి అవసరాలకు సరిపడా సరుకాలు లభిస్తాయి. ఆ సిద్ధాంతం శయనసాపు మొట్టమొదటిసారిగా 1917 నం 7 రష్యాలో విప్లవం 1200 సంక్షిప్త ప్రపంచ చరిత్ర.
1946 జులై నుండి 1951 వరకు జరిగిన తెలంగాణ పోరాటం అధునిక భారతదేశ చరిత్రలో అత్యంత పెద్ద రైతాంగ గెరిల్లా యుద్ధంగా చోటుచేసుకున్నది. తెలంగాణ పోరాటం 1600 చ. మైళ్లకుపైగా విస్తరించిన 3000గ్రామాలలో గల 3 మిలియన్ల ప్రజలని ప్రభావితం చేసింది. నల్లగొండ జిల్లాలోని జనగాం తాలూకా విస్తృతదేశయాత్ర తెలంగాణ భరత కిరాతాత్మకమైన జమీందారులో ఒకడు. 40,000 ఎకరాల పొలం కల్గినవాడు.......బడిన కిరాయిగూండాలపై రజక...పొలం పరిష్కరించడానికి ప్రయత్నించిన అప్పి కొమురయ్య హత్య చేయబడిన రోజు 1946 జులై 4 నుండి తెలంగాణా తిరుగుబాటు ప్రారంభమైంది. (369`ఆధునిక భారతదేశం (1885`1947) సుమిత సర్కార్ అన్నారు. పేగన్ అనే చరిత్రకారుడు లౌకిక సమాజ ఆవశ్యకతను వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి