మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2026, శుక్రవారం

వేదాలలో గణపతి

వసుధైక కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు... 

మనం వినాయకచవితి రోజున పూజా కార్యక్రమాన్ని పౌరాణిక పద్ధతిలో, నిర్వహిస్తాము. వినాయకుడి ప్రతిమను నానావిధ పత్ర పుష్పాలతో అర్పించి, ఆ దేవుని ఆశీస్సులను పొందుతాము. అయితే ఋగ్వేదం లోను, ఆదర్వణ వేదంలో అంతర్భాగమైన గణపత్యోపనిషత్తులోను ఈ వినాయక ప్రార్థŠనను 

ఉద్దేశించారు అవదరించండి. ఇవి వేదోక్త మంత్రములు బహు శక్తి సమన్వితములు. కావున వీటిని శ్రద్ధగా వినాయక పూజ కార్యక్రమాలలో పఠించటం సర్వదా శుభకరం మంగళకరం. 

ఋగ్వేది ప్రార్థన 

గణానాంత్వా గణపతిగ్ హవామహే

కవిం కవీనాం ఉపమశ్రవస్తమం

జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత 

ఆనశృణ్వన్ నూతిభిస్సీదసాదనం... 

గణపత్యుపనిషత్ 

అధర్వణ వేదం 

ఇది అన్ని ఉపనిపత్తులులో చిన్నది ఇందులో ప్రథమంగా ఒక శాంతి మంత్రము, తరువాత ఉపనిషత్ మంత్ర భాగము, తదుపరి ఫలశ్రుతి మంత్రము చెప్పబడ్డాయి. 

మొదట శాంతి మంత్రం... 

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః

భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః

ఫిరై రంగై స్తుష్టువాగం సస్తనూభిః

వ్యశేమదేవ హితం యదాయుః 

స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః

స్వస్తి నుః పూషా విశ్వవేదాః

స్వస్తి నసార్ధ్యో అరిష్టనేమి

స్వస్తినో బృహస్పతిర్ధధాతు 

ఈ మంత్రాన్ని ప్రతి శుభ కార్యాల్లో పఠించాలి. 

ఆర్థం : ఈ శాంతి మంత్ర భావం సమున్నతమైనది భారత దేశ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని చాటి చెప్పుతుంది. 

ఓ దేవతలారా ! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక ! మా నేత్రములు సర్వకాల సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే చూచేదముగాక. మాకు ప్రసాదించిన ఆయుష్యు, దేహము,  అవయవములతో మేము మిమ్ములను సదా స్తుతించు చుందుము గాక. మాకు మంచి ఆయుష్యం, దేహ ధారుడ్యము, మంచి అవయవ సౌష్టవము శక్తిని ప్రసాదించుము. మహర్షులు, ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జేకూర్చుగాక! సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడెన సూర్యుడు మాకు శుభమును కలుగ జేయుగాక! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి  మాకు 

శుభమును అనుగ్రహించుగాక! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక! 

ఓం శాంతిః శాంతిః శాంతిః 

ఓం నమస్తే గణపతయే

త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి

త్వమేవ కేవలం కర్తా

త్వమేవ కేవలం ధర్తా

త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ... 

సర్వం ఖల్విదం బ్రహ్మాత్వం సాక్షా దాత్మానీ నిత్యమ్  `1 

ఋతం వచ్మి సత్యం వచ్మి `2 

అవత్వం మామ్ ఆవ వక్తారమ్ అవ శ్రోతారమ్

అవ దాతారమ్ అవ ధాతారమ్

ఆవా నూచాన మవ శిష్యమ్ అవ పశ్చాత్తాత్ 

అవ పురస్తాత్ 

అవో తరా త్తాత్ 

అవ దక్షిణా త్తాత్ అవ చోర్ధ్వత్తాత్

అవా ధరా త్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ 

త్వం వాయుః త్వం చిన్మయః

త్వమానందమయః త్వం

బ్రహ్మమయః త్వం సచ్చిదా నందా

ద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి 

త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి `4 

సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం

జగదిదం త్వత్త స్తిష్ఠతి సర్వం జగదిదం

త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి 

త్వం భూమి రాపోనలో నలో నభః

త్వం చత్వారి వాక్పదాని `5 

త్వం గుణత్రయా తీతః 

త్వమ్ అవస్థాత్రయా తీతః 

త్వం దేహ త్రయాతీతః 

త్వం కాల త్రయాతీతః 

త్వం మÖలా ధార స్థితోసి నిత్యమ్ 

త్వం శక్తి త్రయాత్మకః 

త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్ 

త్వం బ్రహ్మా 

త్వం విష్ణు 

త్వం రుద్ర 

త్వం ఇంద్ర 

త్వం అగ్ని 

త్వం వాయు 

త్వం సూర్య 

త్వం చంద్రమా 

త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్ `6 

గణాదిన పూర్వ ముచ్చార్య వర్ణాదీం స్తదనం తరమ్ 

అనుస్వారః పరతరః 

అర్ధేందు లసితమ్ 

తారేణ ఋద్దమ్ 

ఎతత్తవ మను స్వరూపమ్ 

గకారః పూర్వ రూపమ్ 

అకారో మధ్యమ రూపమ్ 

అనుస్వారశ్చాంత్య రూపమ్ 

బిందు రుత్తర రూపమ్ 

నాదః సంధానమ్ 

సగంహితా సంధిః 

సైషా గణేశవిద్యా 

గణక ఋషి: 

నిద్రుత్ గాయత్రి చ్చందః 

శ్రీ మహా గణపతి ర్దేవతా 

ఓం గం గణపతయే నమః `7 

ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి 

తన్నో దంతిః ప్రచోదయాత్ `8 

ఏకదన్తం పాశ మంకుశ ధారిణమ్ 

హసైర్బిభ్రాణం మÖషక ధ్వజమ్

లంబోదరం శూర్పకర్ణకం రక్త గంధాను 

లిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్ 

భక్తానుకంపి నం దేవం జగత్కారణ మచ్యుతమ్ 

ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్ 

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః `9 

ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః 

ప్రమథ పతయే నమస్తేస్తు లంబోదరాయ 

ఏకదంతాయ విఘ్నవినాశినే శివ సుతాయ

శ్రీవరద మÖర్తయే నమో నమః `10 

ఏ తద థర్వ శీర్షం యోధీతే 

స బ్రహ్మభూయాయ కల్పతే 

స సర్వవిఘ్నేర బాధ్యతే 

స సర్వతః సుఖ మేధతే 

స పంచ మహా పాపాత్ ప్రముచ్యతే 

సాయ మధీయానో దివస కృతం పాపం నాశయతి 

ప్రాత రధీయానో రాత్రి కృతం పాపం నాశయతి 

సాయం ప్రాతః ప్రయుంజానో యపాపో భవతి 

ధర్మార్థ కామ మోక్షం చ విందతి 

ఇదమ థర్వశీర్షమ శిష్యాయ న దేయమ్ 

యో యది మోహాద్ దాస్యతి స పాపియాన్ భవతి 

సహస్రా వర్తనాద్యం యం యం కామమ ధీతేతం తం 

తమనేన సాధయేత్ `11 

ఫలశ్రుతి: 

అనేన గణపతి మభిషించతి 

స వాగ్మీ భవతి 

చతుర్ద్యా మనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి 

ఇత్య థర్వణ వాక్యమ్ 

బ్రహ్మా ద్యాచరణం విద్యాన్ని బిభేతి కదాచనేతి `12 

యో దూర్వాంకురెర్యై జతి స వైశ్రవణోపమో భవతి 

యో లాజైర్యజతి స యశోవాన్ భవతి 

స మేధావాన్ భవతి 

యో మోదకసహస్రేణ యజతి స వ్చాతఫలమవాప్నోతి 

యః సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వంలభతే `13 

అల్జీ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రాహయిత్వా సూర్య వర్చస్వీ భవతి 

సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వాజప్త్వా సిద్దమంత్రో భవతి 

మహా విఘ్నాత్ ప్రముచ్యతే 

మహా దోషాత్ ప్రముచ్యతే 

మహా పాపాత్ ప్రముచ్యతే 

మహాప్రత్య వాయాత్ ప్రముచ్యతే 

స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి 

య ఏవం వేద 

ఇత్యుపనిషత్ `14 

త్రికరణ శుద్ధిగా ఈ మంత్రపఠనం చేసిన శ్రద్ధాళువులైన భక్తులు సర్వపాప వినిర్ముక్తులై, పుణ్య సముపార్జితులై బుద్ధిమంతులై, గుణవంతులై అఖండ విద్యా పారంగతులై సూర్యవర్చస్సుతో విరాజిల్లి మోక్షాన్ని పొందగలరు. 

వేదములోని గణపతి అధర్వ శీర్షం లోని కొన్ని మంత్రాలు వాటి అర్థాలు తెలుసు కుందాము.” 

త్వం గుణ త్రయాతీతః - త్వం ఆవస్థా త్రయాతీతః త్వం దేహత్రయాతీతః - త్వం కాల త్రయాతీతః త్వం మÖలాధార 

స్థితోసి నిత్యమ్ - త్వం శక్తి త్రయాత్మకః

త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్

త్వం బ్రహ్మ, త్వం విష్ణుః, త్వం రుద్రః

త్వం ఇంద్రః, త్వం అగ్నిత్వం వాయుః

త్వం సూర్యః త్వం చంద్రమా

త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్

తా:- నీవు సత్వ, రజ, తమో గుణములకు అతీతుడవు నీవు జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతుడవు. నీవు స్థూల, సూక్ష్మ, కారణ శరీరములకు అతీతుడవు. నీవు భూత, భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతుడవు. నీవు నిత్యం నా శరీరంలోని ‘మÖలాధారచక్రం’ నందు అది వసించి యున్న వాడవు. నీవు ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపుడవు. 

యోగులు, మహార్షులు అందరూ నిత్యం నిన్నే ధ్యానింతురు. నీవు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపుడవు. నీవు ముల్లోకములకు అధిపతివి. అగ్ని, వాయు, సూర్య, చంద్రాదులు నీ ఆధీనములో వున్నారు. సృష్టి సమస్తము నీ యందే ఇమిడి యున్నది. నీవు సర్వవ్యాపకుడవు కూడా, ‘గణక మహార్షి’ చెప్పిన ఈ విషయాలను మేము అవధారణ చేస్తున్నాము. 

ఓమ్ నమో వ్రాత పతయే - 

నమో గణపతయే నమః ప్రమథ పతయే 

నమస్తే అస్తు లంబోదరాయ ఏక దంతాయ విఘ్న నాశినే

శివ సుతాయ వరద మÖర్తయే నమః 

తా:- సమస్త దేవతలకు, ప్రమథ గణములకు అధిపతివైన ఓ గణేశా  నీకు ప్రణామములు. నీవు లంబోదరుడవు, ఏక దంతుడవు, సమస్త విఘ్నములను నాశనం చేయువాడవు. మహా శివుని కుమారుడవు మరియు భక్తుల కోరికలను తీర్చువాడవు అయిన ఓ వినాయకా

నీకు మేము ప్రణమిల్లుతున్నాము హిందూ ధర్మ వారసులైనందుకు మేము ఎంతో సంతోషముతో గర్విస్తున్నాము! 

శుభమ్ భూయాత్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి