నాలుగువైపుల గోడలు
నాలుగు దిక్కులలాగ
అందులో నేను సూర్యున్ని
వెలిగే చుక్కలు విద్యార్థులు
అక్షరంతో అల్లుకున్న బంధం నాది
అంతులేని ఆనందం వారిది
బోర్డుపై రాస్తున్న అక్షరాలు
విద్యార్థులకు వెలుగునిస్తాయి
ఒంటరిగా కూర్చోనివ్వదు
ఆ నాలుగు గోడల మధ్య
అక్షరం నాట్యం చేస్తుంది
పదాలను, వాక్యాలను
పరిగెత్తిస్తుంది
మెదళ్ళను తొలుచుకొని
పారాడుతుంటాయి
నిండుగ ఉన్నప్పుడు
ఆకాశంలో చుక్కలు
గుంపుగా ఉన్నట్టుంది
పలుచబడ్డరోజే
తీరని బాధ
ఏమైనా తరగతి
తరగతి గదే
పాఠం బాగా చెప్పిన రోజు
బాగా భోజనం చేసినట్టు ఉంటుంది.
చెప్పని రోజు తినకుండా
పస్తులున్నట్టు ఉంటుంది
నేను ముఖ్యంగా
పస్తులుండడానికి
ఇష్టపడను
ఎప్పటిలాగే
తరగతి గదిలోనే
ఉండాలన్నది నా కోరిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి