మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, అక్టోబర్ 2026, శనివారం

కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు....ఐలయ్య

  ఉపాధ్యాయుడు అనే పదానికి ఒక పరిపూర్ణమైన అర్థం ఉంది. ఉపాధ్యాయుని దృష్టిలో సమాజంలో నివసించే ప్రజలంతా ఒక్కటే భారతదేశంలో ఉండబడిన కుల, వర్గ, మత, జాతుల అందరి దృష్టిలో ఒక ఆలయం ప్రతి పల్లెలో ఉంది. అ ఆలయమే పాఠశాల అందులో ఉపాధ్యాయులు (దేవుళ్ళు) అందిరికి సమానం, అందులో ఉండే ఉపాధ్యాయులకి కూడా భారతదేశంలో నివసించే వారందరూ వారికి సమానమే. ఇది ఉపాధ్యాయుడికి ఒక పరిపూర్ణ అర్థం, 

దురదృష్టావశాత్తు తెలంగాణలో ఆ ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చి న మహనీయుడు, ఆపర మేధావి అయిన ఐలయ్య గారు, పాఠశాలలో ఉండే విద్యార్థులందరికి విద్యను బోధించాలి కాని ఐలయ్య గారు విధ్యార్థుల్లో లేని కొత్త ఆలోచనలు కల్పిస్తూ కుల, వర్గలుగా విభజిస్తు విధ్యార్థులను మరియు సమాజాన్ని రెండుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిస్థాయిలో హిందూమత వ్యతిరేకి అయిన కంచ ఐలయ్య మొన్నటికిమొన్న బ్రహ్మాణ కులస్థుల పై నోరు పారేసుకోవడం, హిందు మతం పై ఆరోపణలు చేయడం ఇలా అనునిత్యం ఏదో ఒకరకమైనా ఆరోపణలు చేస్తూ మీడియాలో ఉండాలనేది ఈ ఐలయ్య కోరిక. 

“సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు” అనే పుస్తకం రాసిన ఐలయ్యగారి ఆలోచన విధానం చూస్తుంటే ఇలా నిత్యం ఏదో ఒక పనికిమాలిన రాతలు రాస్తూ మీడియాలో ఉండాలనేది ఐలయ్య ఆలోచన విధానం. మన తెలంగాణలో ఒక నాణుడి ఉంది “బట్ట కాల్చి మీద వేయడం” ఇలా హిందూ మతం మీద, అగ్ర కులాల మీద ఇలా చేయడం చూస్తుంటే ఐలయ్య ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని అర్థం అవుతుంది. “కోమాటి కులం” కులవృత్తి వ్యాపారమనేది అందరికి తెలిసిన విషయమే. 

గుప్తుల కాలం గురించి మాట్లాడిన కంచ ఐలయ్య గారు ఆనాడు వ్యాపారం ఒక కోమటి కులం వారే చేసేవారు. ఈ రోజు సబ్బండ కుల, వర్గ, మత, జాతుల ప్రజలు భాగమైనారు. ఆనాటి నుండి నేటి వరకు భారతదేశంలో ఎక్కువ శాతం సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నవి ఒక్క కోమటి కులం మాత్రమే, ఎలాంటి స్వలాభపేక్ష లేకుండా సంపాధించిన దాంట్లో కొంత మొత్తాన్ని సమాజసేవకోసం ధనాన్ని వెచ్చిస్తున్న కులం కోమటి కులం. ఇలా సమాజ సేవలో అన్ని కులాల, వర్గాల, మతాల వారికి అండగా ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయÖతను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న కులం కోమటి కులం. ఇలా సబ్బండ కుల, జాతుల, వర్గాల ప్రజల సమస్యలను తమ కుటుంబ సమస్యలుగా భావించి సమా సమాజశ్రేయస్సు కొరకు నిరంతరం పోరాటం చేస్తున్న కులం కోమటి కులం. ఇలా సమాజ సేవ ఒకటే కాకుండా భారతదేశంలో తక్కువ చదువు చదివి నిరుద్యోగులుగా ఉన్నవారికి, నిరాక్షరాసులకు ఎక్కువ శాతం ఉద్యోగులు కల్పిస్తూ, వారికి జీవనభృతి కల్పిస్తున్న కులం కోమటి కులం మాత్రమే.

కోమటి కులస్థులు దేశభధ్రతలో భాగం కాలేదు, వారు మాంసం తినరు కనుక వారు బలహీనులు అనే ధోరణిలో పుస్తకాలు రాసిన అజ్ఞాని ఐలయ్య గారికి కోమటి కులస్థులు చాలా ధైర్యవంతులమని, శారీరకంగా ధృఢమైన వాళ్ళమని, మేథాసంపత్తి కలిగిన వాళ్ళమని గర్వంగా చెప్తున్నాము, అందుకు ఒక ఉదాహరణగా ఆనాడు భారతదేశ స్వతంత్య్రం కోసం పోరాడిన గాంధీ కోమటి కులస్థుడే మరియు ప్రత్యేక ఆంధ్ర రాష్టం కోసం పోరాడిన అమరజీవి పోట్టి శ్రీరాములు కూడా కోమటి కులస్థుడే. ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు అందరికి తెలిసినవే. ఆ పరిస్థితుల్లో కూడా బయపడకుండా ముందుకు వచ్చిన గాంధీ గారు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, శాంతియుత మార్గంలో ఉధ్యమాన్ని నడిపించి భారతీయులందరిని ఏకం చేసి స్వతంత్య్రం సాధించటంలో కీలక పాత్ర పోషించిన గాంధీ కూడా కోమటి కులం చెందిన వ్యక్తే ఇది చాలదా కోమటి కులస్థులకి ధైర్యం, శారీరకదృఢత్వం కల్గి ఉన్నరనటానికి ఇది ఒక ప్రతీక.

న్యాయ కోవిధుడు, రాజ్యంగ నిర్మాత మరియు బహుమేధావి, సమాజ మార్గదర్శి డా॥ బి.ఆర్. అంబేడ్కర్ గారు వంటి మహనీయుడు కేవలం దళితుల ఆరాధ్యధైవం అని సంభోందించిన ఐలయ్య గారు ప్రతి భారతీయుడిని అవమాన పరిచారు. అంబేడ్కర్ గారు ఒక కులానికి చెందిన ఆరాధ్యుడు కారు, సమాజంలో జీవించే ప్రతి మానవుడికి ఆరాధ్యుడు అవుతారు. కోమటి కులస్థుల ఇళ్ళల్లో గాంధీ గారి చిత్రపటాలు ఉండవని దానికి కారణం గాంధీ గారి మీద  కోమటి కులం వారికి గౌరవం లేదు అని తప్ప్పుబట్టినారు ఐలయ్య గారు. 

గాంధీ గారి చిత్రపటం ఇంట్లో ఉన్నంత మాత్రన గౌరవం అని, లేకపోతే గౌరవం లేనట్లు కాదు. ఆ గౌరవం అనేది వారి గుండెల్లో ఉండాలి. ఆనాటినుండి యావత్తూ కోమటి కులస్థుల గుండెల్లో గాంధీ గారు చీరస్మరణీయుడుగా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా ఉంటారు. ఇది మన ఐలయ్య గారి గొప్ప మేధాసంపత్తికి నిధర్శనం. ఉపాధ్యాయుడు అనే వ్యక్తి సమాజంలోని లోపాలను సరిచేసి సమాజం మొత్తం కూడా సరియైన మార్గంలో నడిపించే దిక్యూచి ఉపాధ్యాయుడు, అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఇటువంటి ఐలయ్య గారు ఉండడం చాలా బాధకరం.

ఈ విధంగా వ్యాసాలు, పుస్తకాలు వ్రాస్తున్నా కంచ ఐలయ్యను చూసి జీవాలు కూడా నవ్వుకుంటున్న పరిస్థితి, ఐలయ్య రచనలు చూసి తన గోల్ల కురుమ, యాదవ జాతి మొత్తం కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావడం చాలా బాధకరం. మాంసం తింటేనే శారీరక ధృఢత్వం కలిగి, తెలివైన వ్యక్తిగా ఎదుగుతారని అనుకునే వ్యక్తి ఒక ఐలయ్య గారు మాత్రమే, అసలు మాంసహారానికి, శారీరక ధృఢత్వం, ఎదుగుదలకి ఎలాంటి సంuంధం లేదని తెలియని వ్యక్తి ఐలయ్య. 

        ఈ రోజుల్లో వ్యాపారం చేసే కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అయితే ఇదే వ్యాపారం మిగతా సబ్బండ కుల, వర్గ, జాతుల వారు చేస్తున్నారు మరి వారు ఏలాంటి స్మగ్లర్లో ఖచ్చితంగాఐలయ్య గారు సమాధానం చెప్పాలి. కోమటి కులస్థుల మనోభవాలు దెబ్బ తీసే విధంగా రాసిన పుస్తకాన్ని మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి