మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, అక్టోబర్ 2026, శనివారం

వాము లేని ఇల్లు రోగాలకు పుట్టినిల్లు


వాము గురించి తెలియని తెలుగు లోగిలి బహుశ: ఉండదేమో. వామును వంటల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగిస్తారు. ఈ మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పూల నుంచే వాము విత్తులు వస్తాయి. వాము శరీరంలో వాతాన్ని తగ్గిస్తుంది. కడుపు నొప్పికి ఇది చక్కని మందు. వాము నూనె అన్ని వ్యాధులకుమంచి మందు. వామును నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్ప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వామును బుగ్గనపెట్టి నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతు సంక్రమణం(ఇన్‌ఫెక్షన్) తగ్గుతుంది. వామును తేనెలో కలిపి తీసుకొంటే మÖత్ర పిండాలలో ఉన్నరాళ్ళు మÖత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. ప్రసవానంతరం బాలింతలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి. మైగ్రేయిన్ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తుంటే కొద్ది సమయంలోనే సమస్య తీరిపోతుంది. 

ఉబ్బసవ్యాధిగ్రస్తులు వాము బెల్లం కలిపి తీసుకుంటే తగ్గుతుందని చరకుడు సూచించాడు.  గుండె వ్యాధులు రాకుండా వాము నిరోధిస్తుందని కూడా ఆయన పేర్కొన్నాడు. పంటి నొప్పికి  వాము నమిలి పుక్కిట పెట్టుకోవడం వల్ల సమస్య తీరిపోతుంది. దగ్గు ఆగకుండా వస్తూంటే తమలపాకులో వాము కలిపి నమిలి రసం మింగితే చక్కని పరిష్కారం లభిస్తుంది. వృంద మాధవ విధానం ప్రకారం వాము చూర్ణాన్ని మజ్జిగలో కలిపి తీసుకొంటే కడుపులో బల్లలు కరిగిపోతాయి. జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల సంక్రమణకు వాము మంచి  మందు. చింతపండు గుజ్జు, నెయ్యి, తేనెతోపాటు వాము పొడిని కలిపి తీసుకొంటే సంభోగ శక్తి పెరుగుతుందని వాత్స్యాయనుడు రాశాడు. వాము లేని ఇల్లు రోగాలకు  పుట్టినిల్లు అన్నది సామెత! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి