మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, అక్టోబర్ 2026, శనివారం

ధనియాల పొడి

ధనియాల పొడి వాసన దర్వాజాలను దాటి పోతుందన్నది తెలంగాణ సామెత. ధనియాలు మÖలకంగా కొత్తిమీర పంటకు వాడే విత్తనాలు, ధనియాలు కు పుట్టినిల్లు. మధ్యధరా దేశాలు దీన్ని సంస్కృతంలో ధన్యాకమని అంటారు. తగినంత ఉష్ణోగ్రత ఉండే అన్ని ప్రదేశాల్లో పండుతుంది. పెరట్లో పూర్వ ధనియాలను నాటి కొద్దిపాటి స్థలంలో కొత్తిమీర పండించేవారు. 

కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకును కలిపి తెలంగాణాలు హరామసాలా (ఆకుపచ్చని) మసాలా అంటారు. కొత్తిమీర, పుదీనా అనేవి సహజ ద్వంద పదాలు. ఈ కొత్తిమీర పంటకు వాడే ధనియాలు మంచి సువాసనను కలిగి ఉంటాయి. ధనియాల పొడిని కూర ఉడికి తయారై  పోయి పై నుంచి దింపే ముందు ఆ వంటకంపై జల్లుతారు. ఆ పరిమళం చాలు ఆకలి పుట్టించడానికి! సాంబారులో ధనియాల పొడి వేయకపోతే అది సాంబారే కాదని తమిళులు అంటారు. అయితే ధనియాలలో ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి. 

ధనియాలు శరీరంలో నుంచి ఊహ్లాన్ని తొలగిస్తుంది. ధనియాల కషాయం తాగితే మÖత్ర విసర్జన సాఫీగా ఉంటుంది. ధనియాలు లైంగిక శక్తిని సైతం పెంపొందిస్తాయని జీవకుడు రాశాడు.  రక్తంలో చక్కెరను సైతం ధనియాల కషాయం  తగ్గిస్తుంది. శరీరంలో మంటలు తగ్గిస్తుంది కనుక ఆయుర్వేదంలో దీన్ని వితున్నక అని కూడా పిలుస్తారు. ధనియాలు మొక్క దశలో ఉన్నప్ప్పుడు కొత్తిమీర అని పిలుస్తాం. ధనియాల్లో ఔషధ గుణాలన్నీ కొత్తిమీరలోనూ ఉన్నాయి. 

ధనియాల కషాయం వల్ల సుఖ నిద్ర కలుగుతుంది. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి నేతిలో వేయించి ఉప్ప్పు కొద్దిపాటి కలిపిన ముద్దతో రోజూ అన్నంలో మొదటి ముద్దగా తింటే రుచి, జీర్ణశక్తి కలుగుతుంది. రెండు చెంచాల ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్ళతో మరిగించి వడపోసుకొని రెండుపూటలా కొన్ని నెలలపాటు సేవిస్తే శరీరంలో క్రొవ్వు కరిగిపోతుంది. ధనియాల కషాయం కిడ్నీలను (మÖత్రపిండాలను) ఉత్తేజపరుస్తుంది. మÖత్రపిండాల్లో ఇన్‌ఫెక్షన్ ఉండదు. ధనం కోల్పోతే ధనియాలనమ్ముకొని సంపాదించాలని పూర్వం జూదగృహాల్లో సూచించేవారట. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి