మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, అక్టోబర్ 2026, శనివారం

సుగంధద్రవ్యం - దాల్చిన చెక్క

దాల్చిన చెక్క సుగంధద్రవ్యం. పూర్వకాలంలో దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు లాంటి సుగంధ ద్రవ్యాలను సముద్రం ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేసి అసాధారణమైన సంపదను పోగు చేసినవారి కథలు చాలా ఉన్నాయి. దాల్చిన చెక్కను సంస్కృతంలో తృక్ అంటారు. ఇది సీన్నమామం అనే చెట్టుపైని బెరడు. దీన్ని విజయనగరాధీశులు చారుసీతా అని పిలిచేవారట. కొందరు దీన్ని లవంగపట్టు అని  కూడా పిలుస్తారు. ఆధునిక సమాజంలో చాలా తినుబండారాలు కల్తీవి లభిస్తున్నాయి. ఈ కల్తీ తినుబండారాలు తిన్నపుడు, కడుపులోని ఆ విషాన్ని తగ్గించుకోవాలంటే దాల్చిన చెక్కరసాన్ని తీసుకొంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. 

దాల్చిన చెక్క ముక్కల్ని రోజూ నమలడం వల్ల స్త్రీలలో రుతుస్రావం క్రమబద్ధమవుతుంది. పేగు క్యాన్సర్‌కు దాల్చిన చెక్క చక్కని ఔషధమని వసంత్‌లడ్డా 1999లో రాసిన పుస్తకం (ప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్‌వేదిక్ ీVAమ్ రెమిడీస్) లో పేర్కొన్నారు. దాల్చిన చెక్కను చిన్న చిన్న పేళ్లుగా విరిచి ఒకటిన్నర కప్ప్పుల నీళ్ళకు కలిపి 10 నిముషాలు మరిగించి వడపోసి ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకొంటే అమాశయ క్యాన్సర్ తగ్గుతుందని వసంత్ లడ్డా రాశాడు.  టైపు ` 2 మధుమేహవ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర నియంత్రణకు దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతోందని కాలిఫోర్నియాలోని యÖనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇన్సులిన్ హర్మోన్ విడుదల పనితీరుపై దాల్చిన చెక్క ప్రభావం చూపుతుందనీ చక్కెర స్థాయి మెరుగుపడుతున్నట్లు గుర్తించారు. అలాగే చెడు కొవ్వు (ఎన్‌డిఎల్) ను, ట్రైగ్లిసరైడ్లను తగ్గించడంతోపాటు మంచి కొల్లెస్ట్రాల్ (హెచ్‌డిఎల్)ను పెంచడంలో కూడా దాల్చిన చెక్క దోహదపడినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. స్త్రీలలో ప్రసవానంతరం వచ్చే నొప్పి (ప్రసవ పీడ) తగ్గడానికి ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిలో ఒక గ్రాము పిప్పళ్ల వేరు చూర్ణం,  500 మిల్లీగ్రాముల గంజాయి ఆకులపొడి కలిపి తీసుకోవాలి. ఇందువల్ల శైథిల్యం తగ్గి  కండరాల నొప్పి నుంచి  ఉపశమనం కలుగుతుంది. 

మÖత్ర విసర్జనలో ఇబ్బందుల నివారణకు దాల్చిన చెక్క ముక్కలు నమలాలి. ఈ చెక్క జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శరీర కాంతిని  అధికం చేస్తుంది.  రోజూ రాత్రిపూట దాల్చిన చెక్కపొడిని తింటూ ఉంటే రెండో కాన్పును వాయిదా వేయవచ్చని  జీవకుడు ప్రచారం చేశాడని ‘ది జర్నల్  ఆఫ్ ది బీహార్ రిసర్చ్‌సొసైటీ’లో పేర్కొన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి