వైకుంఠం అంటే నిరంతరం ఆనందం కలిగించే క్షేత్రం అని అర్థం. కుంఠం అంటే అవరోధం. వి(వై)కుంఠం అంటే ప్రతిuంధకాలేవీ లేని ప్రదేశం! నిరంతరం ఆనంద దాయకమైన స్థలం అని అర్థం. ఆ క్షేత్రంలో ఉండేది పరమాత్మ. ఆత్మ నిరాకారము... నిర్గుణము. ఆత్మకన్నా పరమోన్నతమైంది పరమాత్మ. ఆత్మకు రూపం లేదు. భగవద్గీతలోని సాంఖ్య యోగంలోని 23వ శ్లోకంలో శ్రీకృష్ణుడు నిర్వ్దందంగా చెప్పాడు. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలవు, వాయువు ఎండింప జాలదు, నీటితో తడుప వీలు కానిది, ఆత్మను శోషింపజేయనూ లేవు. ఆత్మనిత్యమైంది. సర్వవ్యాప్తమైంది. స్థిరమైంది. సనాతనమైంది. ఆత్మ ఇంద్రియాలకు కనపడదు. మనస్సుకూ అందనిది. అకారవికారాలు లేనిది అంటాడు శ్రీకృష్ణుడు . సరిగ్గా ఇలాంటి లక్షణాలే పరమాత్మకూ ఉన్నాయి. పరమాత్మ సైతం భౌతికమైన కళ్ళకు కనుపించడు. సనాతనుడు. స్థిరమైనవాడు.
ఈ పరమాత్మ స్థానం ఏది? ఎక్కడ ఉంటాడు.. ఎవరికి తెలియదు! తెలుసుకొన్న వాళ్లు ఆ పరమాత్మలో లయమైపోతున్నారు. ఆయన సర్వవ్యాపకుడని అంటారు. ఇక్కడ అక్కడ అనిగాక ఆ పరమాత్మ సర్వోపగతుండని ప్రహ్లాదుడు చెబుతాడు. గజేంద్రమోక్షం లోని ఒక పద్యం ప్రకారం అలవైకుంఠపురంలో... ఆ మÖలన ఉన్న సౌధం దాపల, మందార వనాంతర అమృతం చేరువలో ఆ రమా వినోది నాగేంద్రం మీద శయనించి ఉన్నాడని పోతన అంటాడు. ఎక్కడుందీ వైకుంఠం? ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? సర్వవ్యాపకుడై విశ్వాంతరాళాలను ఎలా గమనిస్తున్నాడు? ఆ పరమాత్మ కంటితో జీవ రాశుల పాపపుణ్యాలను ఎలా చూడగల్గుతున్నాడు? లోకానులోకాలను ఎలా వీక్షించగల్గుతున్నాడు. ఆ పరమాత్మకు సమయసమయాలున్నాయా? ఇలాంటి ప్రశ్నలెన్నో సాధారణ సాధకుడి మదిలో మెదుల్తు ఉంటాయి.
ఎన్నో నక్షత్రాలు పుడుతున్నాయి, నశిస్తున్నాయి. గ్రహలు పురుడు పోసుకొంటున్నాయి. కాలం చెల్లిన తరవాత విచ్ఛిన్నమవుతున్నాయి. నక్షత్రాలు పుట్టినపుడు, గ్రహలు విచ్చిన్నమవుతున్నపుడు 2,11,426 లక్షల టన్నుల ఊష్ణ శక్తి విడుదల అవుతుందని అంతరిక్ష శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. సూర్య ఉష్ణోగ్రత కన్నా ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. ఇలాంటి ఎన్నో నక్షత్రాల పుట్టుక, నాశనం సదా జరుగుతూ ఉండే ప్రక్రియ. ఇంతటి శక్తిని ఆ పరమాత్మ ఎలా తట్టుకోగలుగుతున్నాడు... ఎలా నియంత్రించగలుగుతున్నాడన్నది సామాన్యుడి మేథస్సు పరిష్కరించలేని ప్రశ్న. నిజానికి ఈ కోటాను కోట్ల విశ్వాలన్ని సెకెనుకి 2025 కి.మీ వేగంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తున్నాయని శాస్త్రజ్ఞలు తేల్చారు. పాలపుంతలు, విశ్వాలు, ఇలా ప్రయాణిస్తూ ఏ లక్ష్యం వైపు సాగుతున్నాయో ఇంకా శాస్త్రజ్ఞలు ఊహించలేకపోతున్నారు.
అయిÔ,û ఏదో ఊహకు అందని శక్తి ఈ చలనాలను, విశ్వాల పుట్టుక నాశలను నియంత్రిస్తోందని మాత్రం వాళ్లు తెలుసుకొన్నారు. ఆ శక్తి రూప లక్షణాలు ఏమిటన్నవి ఇంకా శేష ప్రశ్నగానే ఉంటోంది. నిజానికి ప్రాచీన రుషులు ఈ శక్తిని గురించి పరిశోధనలు చేసిన మాట నిజం. భరధ్వజుడు, అగస్త్యుడు, భృగువు, కుత్సుడు లాంటి మహార్షులు ఈ దిశగా పరిశోధనలు చేసి కొంత విజయం సాధించారు. భృగు మహర్షి సశరీరంగా వైకుంఠం వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి. సాధారణ ఆత్మకన్నా ఉన్నతమైన పరమాత్మ మÖల శక్తిగా ఎక్కడో ఉన్నాడని కొందరు రుషులు వేదకాలనానికి పూర్వమే తెలుసుకున్నట్లు భావించవచ్చు. 32 వేల సంవత్సరాలకు పూర్వం చెక్కబడినవిగా భావిస్తున్న కొన్ని మానవాకృతులు బీహార్ లోని ధరణి, హర్యానాలోని చప్పర్ గ్రామాల్లోని అరణ్య ప్రాంత్రంలో కనపడ్డాయి. ఈ ఆకృతులు ధ్యాన ముద్రలో ఉన్నాయి. ఆనాటి ఆదిభౌతిక పరిశోధకుల జ్ఞాపకార్థం వీటిని చెక్కి ఉంటారని కొందరు విశ్లేషిస్తున్నారు.
నిర్ధుష్టంగా తేలాల్సిన అంశం మరోటి ఉంది. పరమాత్మ మÖల శక్తి భూనభోంతరాళల్లోనే సుదూర పరిమాణంలోనో ఎక్కడో ఒక స్థలంలో కేంద్రీకృతం అయి ఉండాలి. ఆ స్థలం ఏదిశలో ఉంది? ఆ స్థలంలో కాలపరిమితులు ఉన్నాయా? సాపేక్ష సిద్ధాంతం అక్కడ వర్తిస్తుందా? అక్కడ వేగం ఎలాంటిది...లాంటి ప్రశ్నలు ఎన్నెన్నో ఉద్భవిస్తాయి. ఇష్టాంశ (క్వాంటమ్) సిద్ధాంతం ఈ అన్వేశణకు పరిష్కారాన్ని అందిస్తుందని భృగు మహర్షి నమ్మినట్లు తెలుస్తోంది. కాంతి కన్నా వేగంగా ప్రయాణించగల్గితే పరమాత్మ మÖల శక్తి గురించి తెలుసుకోవచ్చని, అలా ప్రయాణించడం సాధ్యమేనని భృగువు రాసిన భృగు సంహిత లో పేర్కొన్నాడు. ఆయన 10వేల సంవత్సరాలు జీవించి ఉంటారని అంటారు. సూర్యుడి వెలువడుతున్న అలలకు వ్యతిరేక దిశలో ఆయన ప్రయాణించాడని అంటారు. సూర్యుడి నుంచి ప్రయాణించే కిరణాల్లో కోట్లాది కాంతికణాలు (ఫోటాన్స్) ఉంటాయి. ఈ కణాలకు, తమ కిరణాల గుండా ప్రయాణించే సాధనాన్ని/జీవిని అంతరిక్షం వైపు తోసేగుణం
ఉందని భౌతిక శాస్త్రజ్ఞులు సైతం నమ్ముతున్నారు. అమెరికాలోని కొందరు ఔత్సాహిక అంతరిక్ష పరిశోధకులు కలసి టెన్జీరో ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త పాల్ గిలిస్టర్ ఒక పరిశోధాత్మక వ్యాసంలో అంతరిక్ష సూర్యకాంతి కిరణంలోని కాంతి కణాల గురించి వివరిస్తూ ఈ కణం, తన కిరణం లోకి చేరిన సాధకాన్ని దేన్నైనా వ్యతిరేక దిశలో పైపైకి తోస్తుందని పేర్కొన్నాడు. పర్యవసానంగా ఒక వేయి కాంతి సంవత్సరాల కాలంలో విశ్వంలోని ఏ పరిధి (డైమన్షన్) లోకి అయినా చేరవచ్చనది సిద్ధాంతం. ఇలా ప్రయాణించడం వల్ల సాధనజీవి విలయనం (రూపు కోల్పోవడం) సంభవిస్తుంది. పరమాణువుగా రూపు దాల్చి తన వేగాన్ని మరింత పెంచకొంటు ఉర్ధ్వవిశ్వంతరాళల్లోకి చేరుతాడు. భృగువు వైకుంఠానికి ఇలాగే ప్రయాణించి ఉంటాడు.
ఆ సిద్ధాంతం ప్రకారం వైకుంఠాన్ని చేరాలంటే ఆ స్థలం ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే లక్ష్యాన్ని నిర్ణయించుకోగలగాలి. ఆ లక్ష్యం ఎక్కడ? భౌతిక శాస్త్ర ఇష్టాంశ (క్వాంటమ్) సిద్ధాంతం ప్రకారం అంతరిక్షంలో పది పరిణామాలు (డైమెన్షన్లు)
ఉన్నాయి. వైకుంఠం ఆరో డైమెన్షన్లో ఉందని భృగు సంహిత వల్ల అవగతమవుతోంది. మనం అంతరిక్షంలోని మÖడో డైమెన్షన్లో ఉన్నాం. అందువల్లనే ఈ చర్మ చక్షువులతో మనం ఆ పరమాత్మను చూడలేకపోతున్నాం. మరింత సైద్ధాంతిక లోతుల్లోకి వెళ్తే మనం నివసిస్తూన్న భూమి ఈ డైమెన్షన్లలోని మొదటిది ఎక్స్, వైల సమ్మిళితమైన డైమెన్షన్ రెండోది. ఈ సమ్మిళితానికి ఇరుసు లాంటిదే మÖడో డైమెన్షన్. మనం నివసిస్తున్నది ఈ మÖడు డైమెన్షన్లు కలిగివున్న ప్రపంచంలో! నాలుగో డైమెన్షన్ అంతరిక్షంలో కాలం గమిస్తూ(సాగుతూ) ఉంటుంది. దీని ద్వారా మÖడు డైమెన్షన్ల అంతరిక్షం (మన పాలపుంత) కాలనుగుణంగా ఎలా మార్పు చెందుతోందో నాలుగో డైమెన్షన్లోని అంతరిక్షం నుంచి గమనిస్తే అవగతమవుతుంది.
మానవుడు మరణించిన తరవాత అతడిలోని ఆత్మ ఈ నాలుగో డైమన్షన్ లోకి చేరుతుంది. ఈ కేంద్రం నుంచి అధోఅంతరిక్షంలోని ఒకటి, రెండు, మÖడో డైమెన్షన్ల లోని లోకాలను పరికించవచ్చు. మానవుడి ఆత్మ నాలుగో డైమెన్షన్‌లోకి చేరిన తరవాత సతర్కంగా ( లాజికల్‌గా) తన బంధువులు హితులు, సన్నిహితులు తన శరీరం పై బడి శోకించడం చూడగల్గుతుంది. ఈ డైమెన్షన్లోనే యమలోకం ఉందంటారు. ఆ తరువాత అన్నింటికన్నా ముఖ్యమైందీ, కీలకమైందీ అయిదో డైమన్షన్ లోని అంతరిక్షం. ఇక్కడ చేరిన వ్యక్తి దృష్టి సాధారణ చర్మచక్షువులు కన్నా అతీతంగా మారిపోతుంది. కోటాను కోట్ల విశ్వాలను, నక్షత్ర సముదాయలను, పాలపుంతల్లో జరుగుతున్న మార్పులను ఇక్కడికి చేరిన జీవి క్షుణ్ణంగా పరిశీలించగలుగుతాడు. సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు కదలికలు సైతం అక్కడ చేరిన ఆత్మ దృష్టికి అందుతాయి.
సరిగ్గా ఇక్కడే వైకుంఠం ఉంది! ఇక్కడి నుంచే శ్రీ మహావిష్ణువు (పారమార్థిక మÖలశక్తి) కోటాను కోట్ల విశ్వాలను, వాటిలోని జీవులను/జీవకణాలను గమనిస్తూ ఉంటాడు. అక్కడ నిరంతరం వెలుగులే! ఆ వెలుగు కోసమే తమసోమజ్యోతిర్గమయ/ మృత్యోర్మా అమృతంగమయ అంటూ తపిస్తారు. అక్కడికి వెళ్లిన జీవి/ఆత్మ పరమాత్మలో విలీనంకావలసిందే. మానవుడి ఆత్మ పరిమితులు యమలోకం వరకే. ఆ తరవాత పునరపిజననం.. పునరపి మరణం!! అందుకే అయిదో పరిమాణంలోని వైకుంఠం చేరిన ఆత్మ పరమాత్మగా మారి జన్మ రాహిత్యం చెందుతుంది. ఈ అయిదో డైమెన్షన్లోని గర్భోదక సముద్రం పై శయనించి ఉండే వాడే శ్రీమహావిష్ణువు. ఈ పరమాత్మ సనాతనడు. భూమిపైన ఉన్న గురుత్వాకర్షణ శక్తికన్నా 10 కోట్ల రెట్లు గురుత్వాకర్షణ శక్తి ఈ లోకం
( అయిదో డైమెన్షన్)లో అధికం! అందుకే అక్కడికి చేరిన ఆత్మ తీవ్ర గురుత్వాకర్షణ శక్తికి లోనై పరమాత్మలోలయం అవుతుంది. వైకుంఠంలో కాలము, చీకట్లు భౌతిక మనసులు
ఉండవు. ఇక్కడ సదా అంతరాయం లేని ఆనందమే. అందుకే వైకుంఠాన్ని ఆనందనిలయమని భృగు మహర్షి అన్నాడు. ఎంతో వేగంతో ఈ కోటాను కోట్ల విశ్వాలు అందులోని ఆత్మలు వైకుంఠం వైపే అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఏదో ఒక రోజు ఆ వైకుంఠం లోని తీవ్ర గురుత్వాకర్షణ శక్తికి లోనై అవి వైకుంంఠాన్ని చేరి లయమవుతాయి. ఆ మహా లయాన్నే మహా ప్రళయం అంటారు. ఆ తరువాత బ్రహ్మ ఆవిర్భావం, శ్రీ మహావిష్ణువు నుంచి లయం వేరై, అయకారుణిగా (శివుడిగా) మారి తిరిగి విశ్వాలు ఆవిర్భవిస్తాయి ఇలా ఈ జనన మరణాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఆ పరమాత్మ పరమార్థిక క్రీడ ఇది. విశ్వాలు క్రీడా ప్రాంగణాలు. జీవులు క్రీడాకారులు. పరమాత్మ అక్కడ శయనిస్తూ ఇలా ఆట ఆడిస్తూనే ఉంటాడు. ఆయనను చేరడానికి మనం ఎప్ప్పుడు పరితపిస్తూ ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాంటి జన్మ రాహిత్యమే జీవుడి లక్ష్యం.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి