కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పినట్లుగ దొంగలు రోజుకో కొత్త పద్దతిలో తమ స్టైల్ మార్చుతు దొంగతనాలకు పాల్పడుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు కింద పడ్డాయని ఒక మహిళ దృష్టి మరల్చి బంగారు నగలు నగదు కలిగిన సూట్‌కేసుతో పరారైన సంఘటన గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిదిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం చింతల్‌కు చెందిన కే. శ్రీనివాస్, పద్మావతి దంపతులు తాడేపల్లిగూడెంలో బందువుల ఇంటికి వెళ్ళి తిరిగి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ స్టేషన్లో దిగారు. టిఫిన్ చేసేందుకు స్టేషన్ ఎదురుగా ఉన్న స్వాతి టిఫిన్ సెంటర్‌కు వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి పద్మావతి దగ్గరకు వచ్చి మీ పదిరూపాయల నోట్లు కింద పడ్డాయని చెప్పాడు. దీంతో ఆమె తన చేతిలో ఉన్న సూట్‌కేసును కింద పెట్టి నోట్లను తీసుకోసాగింది. ఇదే అదనుగా అగంతుకులు సూట్‌కేసును ఎత్తుకొని పారిపోయారు. సూట్‌కేసులో 10తులాల బంగారం ఆభరణాలు, పదివేల రూ॥లు నగదు ఉన్నాయని బాధితులు గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విధంగా 100రూ॥ ఆశించి 10వేలు రూపాయలు నగదుతో పాటు బంగారం కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతునే ఉన్నాయి. ఇదీ కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పి హెచ్చరించినదే.
వేయి మందిని చంపి ఒక్కడే బ్రతికేటి చీడపురుగులు యిలలో పుడతారు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా, ప్రపంచంలో దాదాపు అన్ని ఉగ్రవాద బాధిత దేశాలే నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో వరుస బాంబు పేలుళ్ళతో, ఆత్మహుతి దాడులతో, కారు బాంబులతో, తుపాకి కాల్పులతో, ఉచకోతలతో శాంతి స్థాపన పేరుతో దాడి చేసి భీభత్సం సృష్టిస్తున్నారు. ఈ దాడుల మÖలంగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
1. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్లూటీవో) టవర్లను ఉగ్రవాదులు విమానాలతో ఢీ కొట్టి కూల్చడంతో 2993 మంది మరణించారు.
2. 2004 సెప్టెంబర్ 1న ఒక పాఠశాలలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం వల్ల 300 మంది స్కూలు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
3. 1948 రజాకార్ల నాయకుని చేతిలో చనిపోయిన వారి సంఖ్య లక్షల మీదనే ఉంది. 1947లోనే కాశిలో జరిగిన దురంతాలు ఈ తరం వారికి తెలియవు.
4. వేలు పిళ్ళె తమిళ టైగర్ ప్రభాకరన్ చేతిలో వేలాది సింహళీయులు చంపబడ్డారు.
5. 1959 ప్రాంతంలో ఒక్క టిబెట్‌లోనే 6లక్షల మంది బౌద్ధులను పంచన్లామాతో సహా బందించి చైనా హత్య చేసింది ఇదంతా “ప్రజాహితం కోసం” అని చెప్పారు.
6. 1984లో భారత ప్రధాని ఇందిరాగాంధీని ఆమెసిక్కు అంగరక్షకుడు కాల్చి చంపాడు. ఆ తర్వాత ఢిల్లీ వీదుల్లో వేలాది అమాయకులైన సిక్కులు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు.
7. 2014లో టిక్రిత్లోని స్పెయిచర్ శిభిరంలో ఉగ్రవాదులు 1700 మందిని అమానుషంగా హతమార్చారు.
8. గుజరాత్లో జరిగిన అల్లర్లలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
9. ఉగ్రవాదులు తాజాగా జులై 2016లో ఇరాక్ రాజదాని బాగ్దాద్‌తో వరుస పేలుళ్ళతో బాంబుదాడులకు తెగబడింది. ఈ పేలుళ్ళలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇలా వివిధ ఉగ్రవాదసంస్థలు చేసే దాడులతో ఒక్కొక్కరు వేలాది మంది ప్రాణాలు తీస్తున్నారు. ఇప్ప్పుడు ఐఎసఐఎస్ అనే కొత్త ఉగ్రవాద సంస్థవారు భూగోళంపై హిందువులు, క్రైస్తవులు, యÖదులు ఉండకూడదని ప్రకటించారు. హిట్లర్ చేతిలో ఆనాడు ýక్షలాది యÖదు జాతీయులు హతులైనారు. స్టాలిన్ రష్యాలో చేసిన మారణహÃమం మానవత్వానికి మాయనిమచ్చ ఈ విధంగా కాలజ్ఞానం ప్రకారం వెయ్యి మందిని చంపి ఒక్కడే బ్రతికేటి చీడ పురుగులు పుట్టినారు. ఇది కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పి హెచ్చరించినదే.
ఈత చెట్టు ఒకటి పుట్టి అది రాత్రిళ్ళు పరుండి ఉదయంబున నిల్చుండేను
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మామÖలుగా ప్రాణమున్న మనుష్యులు జంతువుల పక్షులు మాత్రమే రాత్రిళ్ళు పరుండి పగులు మేల్కొవడము జరుగుతుందికాని 1976 గుంటూర్ జిల్లాలో ఇసుకపల్లి అనే గ్రామంలో ఈత చెట్టు ఒక్కటి రాత్రిళ్ళు పరుండి పగలు నిల్చోవడం జరిగింది మరియు 2016 జూన్‌లో ప్రకాశం జిల్లాలో అద్దంకి మండలం కొండముంజలూ గ్రామంలో రావుల సుబ్బారావు అనే రైతు తన పొలంలో గల బావి దగ్గరున్న ఈత చెట్టు క్రింద ఒక రోజు తన బైక్‌ను పార్క్ చేసి పొలం పని చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో బైక్ దగ్గరగా వెళ్ళగా ఈత చెట్టు బైక్‌పై పడి ఉండటం చూసాడు. తర్వాత చెట్టును ప్రక్కకు నెట్టి బైక్‌పై ఇంటికి వచ్చాడు. రోజు మాదిరిగానే మరుసటి రోజు ఉదయం బావి దగ్గరకు వెళ్ళగా భూమిపై పడిపోయిన ఈత చెట్టు నిలబడి ఉండటం చూచి ఆశ్చర్యపోయాడు. ఆరోజు సాయంత్రం వరకు పొలం దగ్గరుండి పని ముగించుకొని ఇంటకి వెళ్ళే సమయంలో చెట్టు దగ్గరకి వెళ్ళి చూడగ అది పూర్తిగా భూమిపై పరుండి ఉండటం చూసాడు. అంటే ఇది మనుష్యుల మాదిరిగానే రాత్రిళ్ళు పరుండి పగలు నిలబడుతుందని అర్థమైంది. ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన తర్వాత గ్రామంలో చెప్పగా గ్రామస్తులు వెళ్ళి ఈతచెట్టును పరిశీలించగా ప్రతిరోజు ఈతచెట్టు రాత్రిళ్ళు పరుండి పగలు లేచి నలబడటం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. గ్రామస్తుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్.టి.వి వాళ్ళు ఈతచెట్టు దగ్గరకు వెళ్ళి పగలు రాత్రిళ్ళు అక్కడే కూర్చొని కెమెరాలు ఏర్పాటు చేసి చెట్టు ఏవిధంగా పడుకొని నిల్చుంటుందని గమనించారు. ఈత చెట్టు చీకటి పడగానే పరుండి మరి ఉదయాన్నే లేచి నిలబడటం కెమెరాలో బంధించారు. ఈ విషయాన్ని టీవిలో తండోపతండాలుగా వచ్చి ఈత చెట్టుకు పసుపు, కుంకుమలు పెట్టి టెంకాయలు కొట్టి హరతులిచ్చి భజనలు చేశారు. ఇదంత వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే జరుగుతుందని అక్కడి వారంత చర్చించుకోవడం జరిగింది ఇది కాలజ్ఞాన మహిమే 17వ శతాబ్దంలో చెప్పినదే.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి