రావణుడు మానవుడే! ప్రవృత్తిరీత్యా అతడొక అహంభావి. హింసా మార్గాన్ని ఎన్నుకుని ఎదిగాడు. ప్రపంచలోని సుఖాలనన్నింటినీ అనుభవించేందుకు రావణుడు చేయని ప్రయత్నంలేదు. శారీరక బలం, అధికార బలం బలగాలతో సాధించలేనిదేమీ లేదని భావించే మÖర్ఖుడు. అయినా అన్నీ తెలిసిన వాడు. అతని జ్ఞానం ఏ స్థాయికి చేరిందంటే మంచి చెడులనే కర్మలను తానే స్వయంగా నిర్వచించుకొన్నాడు. తాను చేసిందల్లా మంచి, తనకు నచ్చని దంతా చెడుగా భావించే రాణణుడొక అసాధారణ మానవుడు అయినా అతన్ని అందరు అసురుడుగా సంబోధించేవారు.
రుగ్వేదంలోని దశమ మండలం 156 వ శ్లోకంలో సురుల గురించి వివరించారు. విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో వరుణుడు అంతరిక్షంలోసంచరించేందుకు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. యాస్కుడు రచించిన నిరుక్తం ప్రకారం సృష్టి ఆదిలో మÖడు కోట్ల దేవతలను పవిత్రతను చూకూర్చాల్సిన అవసరం వచ్చింది. వరుణుడు నిర్దేశించిన పథం (దారి)లో సూర్యుడు తొలిసారి గమనం చేస్తూ ఈ మÖడు కోట్ల దేవతలపై తన తొలి కిరణాలను ప్రసరింపజేశాడు. అలా సూర్యుని వల్ల పవిత్రులైన దేవతలను సురులుగా గుర్తించారు. పవిత్రులైన దేవతంలందరు మంచి కార్యాలు చేస్తూ సృష్టికి ఆధారమయ్యారు. కాల క్రమేణా భూమిపై నిర్మించిన మానవుల్లో కొందరు దేవతలను అనుసరిస్తూ, ఆరాధిస్తూ మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకొన్నారు. భూమిపై లభించే అన్ని సుఖాలను అనుభవించడం కోసం చెడు పనులు చేసే మానవులు మరికొందరు జీవించారు. సహజంగానే ఇలాంటి వ్యక్తులను, వ్యక్తుల సముదాయాన్ని అసురులుగా వర్గీకరించారు. అంటే అపవిత్రులన్నమాట. ఈ అసుర తత్వం గల రావణుణ్ని కూడా అసురుడుగా గుర్తించారు. అందుకే రావణుడు రావణాసురుడయ్యాడు. పది తలలూ, ఇరవై చేతులూ ఉన్న రావణుడి రూపం రామాయణం చదివిన ప్రతి వ్యక్తికీ ఒక గొప్ప పత్రినాయకుడిగా సుపరిచితం. నిజంగా అతనికి పది తలలూ, ఇరవై చేతులూ ఉండేవని ఎందుకు భావిస్తారో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఎందరో పరిశోధకులు పలు రకాలుగా రావణుడి రూపం గురించి విశ్లేషిస్తారు. తుచ్చమైన తొమ్మిది రకాలైన భావోద్రేకాలను, క్రోధం, అహంకారం, ఈర్ష్య, సుఖం, దు:ఖం, భయం, స్వార్థం, ఉద్రేకం, అత్యాశ, అనే తొమ్మిదింటిని దుష్ట మేధస్సులుగా పూర్వులు వర్గీకరించారు. మనిషికి గల సహజ శిరస్సుతోపాటు ఈ తొమ్మిది భావోద్రేకాలు గల రావణుడ్ని దశకంఠుడన్నారని పౌరాణికుల భావన. ఈ భావోద్రేకాలు ఆత్మోన్నతికి అడ్డంకులుగా భావించారు. సహజమైన మేదస్సు మాత్రమే గౌరవించతగింది. ఈ తొమ్మిది దుష్ట ఆలోచనలతో సతమతమౌతున్న సహజమేధస్సుతో జీవించిన రావణున్ని రామాయణంలో దశకంఠుడిగా చిత్రీకరించారు. ప్రకృతి మనుషులందరినీ ఒకే విధంగా సృష్టించింది. పుట్టడంలో రాముడికీ, రావణుడికీ ఎంత మాత్రమÖ తేడా లేదు. రామాయణంలోని ఈ పాత్రలు రెండు మానవులే. ప్రవర్తనా తీరులను అనుసరించి శ్రీమద్రామాయణంలో శ్రీరాముడు ధర్మానికే మÖర్తిమంతమయ్యాడు. రావణుడ్ని చిత్రీకరించడంలో వాల్మీకి అతని తొమ్మిది ముఖాలన్నీ పైకి లేవకుండా అణచలేకపోయాడు. అందుకే రాముడు నాయకుడై దేవుడయ్యాడు. రావణుడు ప్రతినాయకుడై రాక్షసుడయ్యాడు. జీవితాన్ని ఆత్రుతగా కౌగలించుకొని అనుభవించాలని ఆరాటపడే వ్యక్తి రావణుడు. రావణుడెంత మేధావి అంటే, అతడు తన లాంటి వ్యక్తుల కూటమిని కూర్పు చేసి తనకంటూ ఒక జాతిని ఏర్పాటు చేసుకొన్నాడు. ఆ జాతి మొత్తం, ఏ కొందరో మినహా, రావణ ప్రవృత్తినే అనుసరిస్తూ జీవించారు.
రావణుడి తండ్రి విశ్రవుడు. విశ్రవుడు పులస్త్యుని కొడుకు. ఈ పులస్త్యుడు బ్రహ్మ మానస పుత్రుడు. రావణుడి తండ్రి విశ్రవుడు. పుట్టుకతోనే మహాజ్ఞాని. బ్రహ్మ మానస కుమారుడైన పులస్త్యునితో సమానమైన జ్ఞాని. తపస్సు చేసుకొనేవాడు. విశ్రవుడు చూడ చక్కనైన వాడు. యుక్త వయస్సులో కిన్నెర స్త్రీలు, యక్ష కన్యలు ఇతణ్ని ఆకర్షించేందుకు ప్రయత్నించారట. విష్ణు ధర్మోత్తర పురాణంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. విశ్రవుడు ధార్మిక సంశయాల నివృత్తికోసం భూరధ్వజాశ్రమానికి వెళ్ళినపుడు ఆ రుషి కుమార్తె దేవపర్ణి అతడ్ని ప్రేమించింది. తన తండ్రి భరధ్వజుని వద్దకు వెళ్లి తన మనసులోని మాటను చెప్పింది. విశ్రవుడి గుణగణాలు తెలసిన భరద్వజుడు తన కూతురి కోరికను మన్నించి, ఆమెను విశ్రవుడికి ఇచ్చి ఆశ్రమంలో వివాహం జరిపిస్తాడు. ఈ దంపతులకు జన్మించినవాడే వైశ్రవుణుడు. విశ్రవుడు ఎంత అందమైనవాడో వైశ్రవణుడు అంత కురూపి. అందుకే వైశ్రవుణ్ని కుబేరుడు అని పిలిచేవారు. బేరువు అంటే శరీరము. అందమైన శరీరం లేనివాడు కనుక వైశ్రవుణ్ని కుబేరుడు అని కూడా వ్యవహరించారు. కుబేరుడు ఎంతటి కురూపో అంతటి శివ భక్తుడు. పూర్వజన్మలో ఇతని పేరు గుణనిధి. ఎంతో శివభక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొంది ఆ తర్వాత విశ్రవుడి కొడుకుగా జన్మించాడు. చిన్నతనంలోనే కుబేరుడు శివుని గూర్చి కఠోర తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్థాలను సేవించి తపస్సు చేశాడు. తరవాత మరి కొన్ని సంవత్సరాల గాలి మాత్రమే శ్వాసించి తపస్సు చేశాడు. తరవాత మరికొన్ని సంతత్సరాలు గాలి మాత్రమే శ్వాసిం చి తపమాచరించాడు. అటు తరవాత గాలిని కూడా పీల్చకుండా వేయిసంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ కఠోర తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతణ్ని లోకపాలకుడిగా, ధనానికి అధ్యక్షుడిగా చేసి4 అంతర్దాన మవుతాడు. అయితే కుబేరుడికి తాను ఎక్కడ నివసించాలో తెలియక బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై కుబేరుడికి శంఖనిధి, పద్మనిధులతో సహా పుష్పక విమానం ప్రసాదిస్తాడు. త్రికూట పర్వతం పైన సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పురాన్ని కుబేరుడి పరం చేసి అక్కడ నివసించాలని చెబుతాడు. పూర్వం ఈ లంకలో లోకాలను బాధించే దుష్టు జాతి రాజ్యం చేసేది. శ్రీహరి వల్ల భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు. అంక అంతా నిర్జనంగా ఉండడంతో కుబేరుడు, బ్రహ్మ సలహపై లంకను జీవిస్తుండాడు. తన తల్లి దండ్రులతో సహా లంకకు చేరి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి