మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, అక్టోబర్ 2026, శనివారం

లవంగ మొక్క

లవంగ మొక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ భూమిపై లభ్యమవుతున్న మొక్కల్లో లవంగ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవతలు సైతం ఈ మొక్కను ఇష్టపడతారని మైత్రాయనీయ ఉపనిషత్తులోని ఆరో ప్రపథకంలో పేర్కొన్నారు. అందుకే లవంగాన్ని దేవకుసుమ అని కూడా  అంటారు. లవంగంలో పరిమళంతో సహా విలువైన పోషకాలున్నాయి. 

ఇందులో కర్బనోదజాలు (పిండి పదార్థాలు) సున్నం, భాస్వరం, పొటాషియం అనే క్షారధాతువు, లవణాలు, ఉదజహరికామ్లము (హైడ్రోక్లోరిక్ యాసిడ్... దీన్నే శంఖ ద్రావకం అని కూడా వ్యవహరిస్తారు.) మాంగసం (మ్యాంగనీస్) తో సహా విటమిన్ ఏ,సిలు ఉన్నాయి. ఈ మొక్క పుట్టిల్లు ఇండోనేషియాలోని ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్ దీవులు. ఇండోనేషియాలో హైందవం ప్రభలంగా ఉన్న  సమయం (క్రీ.పూ 400)లో జావా ద్వీపాన్ని పరిపాలించే శ్రీ జంబుపతి  అనే రాజు మగధ రాజ్యాన్ని సందర్శించిన సందర్భంగా తన వెంట తెచ్చిన మొక్కల్లో లవంగ మొక్క కూడా ఒకటి. ప్రస్తుతం లవంగ మొక్క బ్రెజిల్, భారత్, వెస్టిండీస్, మారిషస్ జింజిబార్, శ్రీ లంక దేశాల్లో పండిస్తున్నారు. 

ఈ మొక్క 5 మీటర్ల ఎత్తువరకూ ఎదుగుతుంది.  పెద్ద ఆకులు, గుత్తులు గుత్తులుగా పూలు ఉంటాయి. తాజాగా ఉన్నప్ప్పుడు కాస్తా గులాబి రంగులో ఉన్న మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు  రంగులోకి మారుతాయి. ఈ మొగ్గలే లవంగాలు. పాళిభాషలో లవంగి  అంటే నాజూకైనది అని  అర్థం. లవంగాన్ని వంటకాల్లో మాంసాహారులే కాదు, శాఖాహారులూ వాడతారు. ఇది శృంగార పేరితమని వామదేవశాస్త్రి రాసిన ‘ది లాస్ట్ సీక్రెట్స్ ఆఫ్ ఆయుర్వేద’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు. ఈ వామదేవశాస్త్రి తరువాతి కాలంలో క్రైస్తవం స్వీకరించి డేవిడ్ ఫ్రాలేగా వ్యవహరింపబడుతున్నాడు. లవంగాలు పంటి నొప్ప్పులకు చక్కని ఔషధం.  రెండు లవంగాలను బుగ్గన పెట్టుకొంటే మద్యం తాగాలన్న కోరిక మాయమవుతుందట. జలుబుతో బాధపడేవాళ్లు చేతి రుమాలుపై రెండు మÖడు చుక్కల లవంగ నూనెను చల్లి వాసన పీలిస్తే ఫలితం ఉంటుంది. 

లవంగం నుంచి తైలం సంగ్రహం (తయారు చేయడం) అంత సులువేమీ కాదు.  తొలుత పచారీ కొట్టులో 15 లవంగాలు (ీVAల్ క్లోవ్స్)ను కొనాలి. ఒక ఔన్సు (దాదాపు 281/2 గ్రాముల తైలం తీయవచ్చు. లవంగాల సంఖ్య ఎంత అధికంగా ఉంటే తైలం అంత ఘాటుగా ఉంటుంది. అవసరమైనంత ఆలివ్ (కుదురుజువ్వి) నూనె తీసుకోవాలి. ఈ నూనె వల్లే లవంగాల్లోని ధాతువులు వెలుపలికి వస్తాయి. ఒక  ఔన్సు లవంగ నూనె కోసం ఒక ఔన్సు  ఆలివ్ తైలం అవసరం.  లవంగ తైలం సంగ్రహం  చేసిన తర్వాత పోసి పెట్టేందుకు శుభ్రమైన నల్లని సీసాను, మÖతను సేకించాలి. నల్లని సీసాలో తైలం పాడవకుండా ఉంటుంది. అయితే నల్లని సీసాలోకి పోయాలి.  ఆ తరువాత ఆలివ్ తైలంలో కొనుక్కొన్న లవంగాలను వేసి అవి బాగా అడుగుకు చేరేవరకు సమయం ఇవ్వాలి. ఈ సమయంలో తైలం వడగట్టేందుకు అవసరమైన గుడ్డ (గాజ్) తీసుకోవాలి. ఒక ఔన్సు ఆలివ్ తైలంలో లవంగాలను వేసేముందు చేతులను శుభ్రం చేసుకోవాలి.   

ఔన్సు ఆలివ్ తైలంలో 15 లవంగాల కన్నా ఎక్కువ కూడా కలపవచ్చు. అయితే లవంగాలు ఎంత ఎక్కువగా కలిపితే తైలం అంత ఘాటుగా తయారవుతుంది. ఆ తరువాత ఆ సీసా మÖతను గట్టిగా  బిగించి నాలుగైదుసార్లు తైలం,లవంగాలు బాగా కలిసిపోయేట్టు కదపాలి. మÖత గట్టిగా బిగించిన సీసాను చీకటి స్థలంలో రెండు వారాలు జాగ్రత్తగా కాపాడాలి. ఆ తరువాత నల్లని సీసాలోని లవంగాలు, ఆలివ్ తైలం మిశ్రమాన్ని ఒకగుడ్డ (గాజ్) లో వేసి మÖట కట్టి  ఆ మÖటను మరో శుభ్రమైన సీసామÖతిపై జాగ్రత్తగా ఆ తైలంలో ఆ సీసాలోకే జారేట్టు పెట్టాలి. ఆ మÖటలోంచి మెల్లిగా సీసాలోకి బొట్టు బొట్టుగా జారిన తైలమే లవంగ తైలం. అయితే లవంగ తైలాన్ని వైద్యుని సలహా మేరకే వినియోగించాలి. ఆహారంలో లవంగాలను ఏ రూపంలోనైనా వాడడం వల్ల క్యాన్సర్లు, హృద్రోగాలు, మధుమేహం, కీళ్ళవాతం, మతి మరుపు లాంటి వ్యాధులు దరి జేరవని ఆయుర్వేదం చెబుతోంది. క్షయవ్యాధిగ్రస్తులు లవంగం, వెల్లుల్లి, తేనె కలిపి రోజూ ఉదయం తీసుకొంటే వ్యాధి తగ్గుమొగం పడుతోందని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన రసాయన శాస్త్రజ్ఞుల పరిశోధన( 1943)లో వెల్లడైంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి