మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, నవంబర్ 2026, ఆదివారం

వాన.. వాన.... రా..రా... మా ఇంటి దాకా..

జగాన దగా పడి కుమిలి కుమిలి ఏడుస్తున్న చెల్లెళ్లందరి కళ్లల్లోనుంచి పెల్లుబికి వస్తున్న కన్నీటి ధారల్లా రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా` 

వర్షం కురుస్తూనే ఉంది. 

ఆ కాలనీలో అన్నీ అయిదంతస్తుల అధునాతన సుసంపన్నుల నివాసాలే! కానీ ఇప్ప్పుడా మేడలన్నీ నడి సముద్రంలో నిలబడిన ఓడల్లా ఉన్నాయి. చుట్టూ  నీళ్లు... అక్కడెక్కడో మొదలైన అల్ప పీడనం... ఇక్కడ వీళ్ళని పట్టి పీడిస్తోంది. కుట్టి కుదిపేస్తోంది. 

రెండు రోజుల నుంచి నీళ్ళు లేవు... పాలు లేవు.. స్నాన పానాదులు లేవు... తిండీ తిప్పలు లేవు... మనిషికి ఆహారంకన్నా ప్రాణాధారంగా మారిన కరెంటు లేదు... టీ.వీ. లేదు... నిన్న మొన్నటి ఠీవీ లేదు... సెల్లుకు ఛార్జ్ లేదు... సొల్లుకు ఛాన్స్ లేదు... లిఫ్ట్ లేదు... వానకు షిప్టు లేదు... చెప్ప్పుకోలేని బాధ... డ్రైనేజిలన్నీ ఎగదన్ని టాయిలెట్లు కంపు కొడుతున్నాయి... ఇంట్లో ఉండలేరు, బయటికి పోలేరు... తోటకూర కాడల్లా వాడిపోయి సోఫాల్లో వాలిపోయి యమ యాతన పడుతున్నారు. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 

“ఖర్మ చాలక ఈ కాలనీలో వచ్చిపడ్డాం...” అని మొట్టమొదటి సారిగా తమను తాము తిట్టుకుంటూండగా... 

ఎట్టకేలకు... మిట్ట మధ్యాహ్నానికి .. కాస్త తెరిపి ఇచ్చింది. 

మహానగరంలో నడిరోడ్డున మొద్దు నిద్దర పోయే ‘నిర్దయ’ మాగన్నుగా కన్ను తెరిచింది. అప్ప్పుడెప్ప్పుడో చెన్నైలో తంబీలు చూపిన ఔదార్యం గుర్తొచ్చి మానవత్వం విరబూయగా మేము సైతం అంటూ ఎక్కడెక్కడి కాలనీలవాళ్లో ముందుకీ వెనక్కీ ఊగి చివరికి అక్కడికొచ్చారు. మంచినీళ్ల పాకెట్లు, పాల పాకెట్లు, బిస్కెట్ పాకెట్లతోపాటు టీవీ కెమెరా వాళ్ళతో.

వచ్చిన వాళ్లు మోకాళ్ల లోతు నీళ్ళల్లో ఈదుకుంటూ బాల్కనీలో నించున్న వాళ్ళమీదకు  పాకెట్లూ విసురుతున్నారు. 

అదుగో అలా ఈదుకుంటూ వచ్చిన సుందరం ఫస్ట్‌ఫ్లోర్ బాల్కనీలో నిలబడి ముందుకు వంగి అందుకోలేకపోతున్న పాతికేళ్ల  అందమైన అమ్మాయికోసం నాలుగు పాకెట్లు విసిరాడు. నీళ్లల్లో పడిపోయాయి. 

“అలాక్కాదు... ఓ ప్లాస్టిక్ బుట్టకు తాడు కట్టి కిందకు వదలండి..” అన్నాడు. 

“బుట్టల్లేవు, తట్టల్లేవు, తాళ్లులేవు, పేళ్ళు లేవు” అన్నదామె. 

ఈసారి పాలపాకెట్ బలంకొద్దీ విసిరాడు. గోడకు కొట్టుకొని కిందపడి పాలన్నీ బాల్కనీ పాలైనయి. 

“ఉండండి...” అంటూ వెనక్కి వెళ్ళి అయిదు నిముషాల తర్వాత ప్యాంటు జేబుల్లో మంచినీళ్ళ పాకెట్లు, టక్ చేసి చొక్కాలో పాల పాకెట్లతో వచ్చాడు. 

ఆమె బాల్కనీలోనే ఉంది. 

కాంపౌండు వాల్ ఎక్కాడు. దాని ప్రక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మ మీదకు, ట్రాన్స్‌ఫార్మర్ మీదకు, పిట్టగోడమీదకు ఎక్కి, బాల్కనీలోకి దూకాడు. 

ప్యాంటు జేబులోనుంచి మంచినీళ్ళు, టక్ చేసిన షర్టులోంచి పాల ప్యాకెట్లు తీసి ఆమెకు ఇచ్చాడు. 

“థాంక్సండీ... నిజంగా మీరు జగదేకవీరుడనిపించారు...” అన్నదామె మెచ్చుకోలుగా. 

“భలేవారే.. మీరింత కష్టపడుతూంటే చూస్తూ ఊరుకుంటామా? మీరేమీ అడవిలో లేరు, స్మార్ట్ సిటీలో ఉన్నారు. ఇలాంటప్ప్పుడు సాయం చేయకపోతే ఎందుకండీ ఎదవ బతుకు... పరోపకారార్థం ఎదవ శరీరం అన్నారు గదా...              వస్తా .. ” అని వెనుతిరిగాడు. 

“ఉండండి.. పాలు తెచ్చారుకదా.. కాఫీ పెట్టిస్తాను...తాగి వెళ్దురుగానీ.. లోపలికి రండి..” అని అపార్ట్‌మెంట్‌లోకి దారి తీసింది. 

సుందరం షర్టు జేబులోంచి సెల్‌ఫోన్ తీసి చూసుకుంటూ లోపలికి వెళ్ళాడు. 

ఆమె కాఫీ పెట్టిచ్చే లోపల మళ్ళీ వర్షం మొదలైంది. సాయం చేయడానికి వచ్చినవాళ్ళంతా గబగబా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. 

మళ్లీ దడ.. దడ...దడ మని చినుకులు. చూస్తుండగానే కుంభవృష్టిగా మారింది. 

“మళ్లీ మొదలైంది..” అన్నదామె కాఫీ ఇస్తూ...

“మరో మÖడు రోజులు ఇలాగే ఉంటుంది..” అన్నాడు కప్ప్పు అందుకుంటూ...

“అవునా... చచ్చాం... కరెంటు లేదు.. రాత్రంతా జాగారం...”

“మెయిన్ రోడ్డు మీద పెద్ద చెట్టు విరిగి పోల్ మీద పడింది. అది వంగిపోయింది. కరెంటు తీగలు తెగిపోయాయి..”

“మరి ఎప్పటికొస్తుంది...”

“వానలు తగ్గాలి కదా.. కనీసం నాలుగు రోజులు పైనే..”

“ఓవర్‌హెడ్ ట్యాంక్‌లో వాటర్ కూడా అయిపోయింది. కొద్దిగా టబ్‌లో దాచుకున్నాను.. స్నానం కూడా చెయ్యలేదు...”

“మరి నే వెళతాను” 

“ఎలా వెళ్తారు?.. ఇంత వానలో.. జారి పడిపోతారు..”

“మెట్ల మీదినుంచి..”

“సెల్లార్‌లోనుంచి వెళ్ళాలి.. అక్కడ పీకల్లోతు నీళ్ళున్నాయి...                   డ్రైనేజి నీళ్ళు.. కంపు...”

ఇద్దరూ గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నారు. 

“దంచి కొడుతోంది..” అన్నాడు. 

“నిలబడి కురుస్తోంది..” 

“కూర్చుని కూడా కురుస్తుందా?..” అని అడిగాడు. 

ఆమె నవ్వింది..

“మీ పేరు?...”

“నా పేరు సుందరమండీ... అమీర్ పేటలో సర్వీసింగ్ సెంటర్ పెట్టాను. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు రిపేర్ చేస్తుంటాను..”

“బాగానే ఉందా బిజినెస్?”

“నా కింద ఇద్దరు పనిచేస్తున్నారు... ”

“ఇంకేం బాగానే సంపాదిస్తున్నారన్నమాట...”

“సంపాదించాల్సింది డబ్బు ఒక్కటే కాదండీ.. ఇంకా చాలా వున్నాయి.. రోజూ ఒక చిన్న ప్రశంస.. ఒక చిన్న మెచ్చుకోలు... మన చేత ఎంత కష్టమైన పనిని అయినా చేయిస్తుంది...”

“అందుకు అవకాశాలు కూడా కలిసి రావాలి..” అన్నదామె.

“దేశానికి సరిహద్దులుండొచ్చు.. మనిషి చేసే పనులకు హద్దులుండొచ్చు... కానీ ఆలోచించగల మనసుకు హద్దులుండవు.. ప్రతి ఉదయం సూర్యుడు మనకోసం ఎన్నో అవకాశాలు మోసుకొస్తూనే ఉంటాడు...”

“మీరేం చదువుకున్నారు?..”

“ఉండటానికో బి.టెక్ డిగ్రీ ఉంది.. చదువంటే ఏది ఎలా చెయ్యాలో చెప్పేది మాత్రమే కాదు.. ఎప్ప్పుడెలా మసలుకోవాలో నేర్పేది కూడా అయివుండాలి చదువు...” అన్నాడు.

ఆమె నవ్వింది...

“ఇంక వెళతాను.. చీకటి పడితే మరీ కష్టం” అన్నాడు.

“ఎలా వెళతారు.. అలా...”

“నిలబడి కురుస్తుంటేనూ...” అని నవ్వాడు.

ఆమె కూడా నవ్వింది..

“కరెంట్ లేదు కదా.. చీకటి పడేలోపు అన్నం వండేస్తాను..” అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళింది.

సుందరం చుట్టూ చూస్తూ కూర్చున్నాడు. సోఫాలో చాలా  నోట్‌బుక్స్              ఉన్నాయి. 

“మీరేం చేస్తుంటారు?” 

“నా పేరు సుజాత... స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాను... ఇదిగో ఈ గాడిద చాకిరీ తప్పట్లేదు...” అన్నది నోట్‌బుక్స్ చూపిస్తూ...

“మీరొక్కరే ఉంటున్నారా?...” 

“మా పేరెంట్స్ వైజాగ్ వెళ్ళారు...”

“మీరూ వెళ్లి ఉండాల్సింది.. ఈ బాధ తప్పేది..”

“నా పెళ్లి సంబంధం సెటిల్ చేయటానికి వెళ్ళారు..” అన్నది సుజాత. 

ఆ మాట చెప్పటంలో ఆమె ఆంతర్యం వేరు..  తను ఒంటరిగా ఉంది. ఒకవేళ అతనికేదైనా దుర్భుద్ధి పుట్టినా పెళ్ళి కాబోతున్న అమ్మాయి కనుక సెంటిమెంట్ అడ్డుపడ్తుంది కదా అని.. చిన్న అబద్ధం.. చిన్న గరికపోచ ఇద్దరి మధ్యా అడ్డువేసింది.. అశోక వనంలో సీతమ్మవారిని గుర్తు తెచ్చుకొని...

“కంగ్రాచ్యులేషన్స్.. మీ కాబోయేవారేం చేస్తుంటారు?”

“ పెళ్లికి పిలుస్తాన్లెండి... ఆయన్ని పరిచయం చేస్తాను..” అన్నది.

కబుర్లతో రెండు గంటలు గడిచిపోయాయి. రాత్రి తొమ్మిదైంది. 

“భోజనాలు చేద్దాం..” అని లేచింది సుజాత. 

సుందరం సెల్‌ఫోన్ ఆమెకు ఇచ్చాడు. ఆ వెలుగులో రెండు కంచాల్లో అన్నం వడ్డించి తెచ్చింది. 

“ ఏమనుకోకండి.. పచ్చడి మెతుకులు..” అన్నది కంచం అందిస్తూ.

“జగమంతా చిత్తడి చిత్తడిగానున్న ఈ కటిక చీకటి వేళ కడుపారగ తినగా దొరికిన పచ్చడి మెతుకులు పరమాన్నము కన్న మిన్న కదా పరమేశా!” అన్నాడు కలుపుకుంటూ...

“చీకట్లో దొంగల్లా తింటున్నాం..” అన్నది.

“దొంగల్లా తినటం అంటే...ఒకటి గుర్తొస్తోంది.. చెప్పనా..”

“ తింటూ చెప్పండి.. నోరు ద్విపాత్రాభినయం చేస్తుంది..”

“ రతన్ టాటా తన  కంపెనీ మీటింగ్ స్విట్జర్‌లాండ్‌లో పెట్టుకున్నాడు. ఇక్కడ్నించి పాతిక మంది దాకా వెళ్ళారు. ఒక ీVAటల్‌లో డిన్నర్ చేస్తున్నారు... పార్టీ ఎంజాయ్  చేయాలని బోల్డన్ని ఐటెమ్స్ ఆర్డరిచ్చారు. సగం తినేసి సగం వదిలేశారు..  కొంచెం దూరంలో ఒక ముసలి జంట కూర్చొని ఒకే ఐటం తెప్పించుకొని చెరి సగం పంచుకుని తిన్నారు. వాళ్ళు ఇంత ఫుడ్ వేస్ట్ చేయటం చూసి భరించలేకపోయారు... వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగారు.. బిల్లు పే చేస్తున్నాం కదా.. అన్నారు. అందుకు వాళ్ళేమన్నారంటే.. ఆహారం దేశ సంపద.. దాన్ని వేస్ట్ చేయడం దొంగిలించడం కన్నా హీనమైంది... అని చెప్పారట. అప్ప్పుడు రతన్ టాటా ఒక పాఠం నేర్చుకున్నాడట...”

“మీరు మాత్రం పారెయ్యరు లేండి.. కొంచెమే పెట్టాను..”

“అన్నదాతా సుఖీభవ..” అన్నాడు సుందరం. 

“ఏం సుఖీభవో.. చీకట్లో.. ఆ మÖల వాష్ బేసినుంది... కంచం అక్కడ పెట్టేయండి..”

మరో గంట కబుర్లతో కాలక్షేపం అయింది. 

“నిన్న చీకట్లో ఒకందుకు భయం వేసింది... ఇప్ప్పుడు ఇంకొకందుకు భయం వేస్తోంది..” 

“నాకు అర్థమైంది.. మీ మీద మీకు నమ్మకముంది.. నా మీద నాకు నమ్మకముంది...”

“ఇద్దరం కలిసి ఉన్నందుకే భయం...” 

“నేనొకటి చెప్పనా? డ్యూటీ వేరు, బ్యూటీì వేరు.. డ్యూటీ ఈజ్ వర్షిప్.. మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున సేవ చేయటానికి వచ్చాం... నేను ఇదొక డ్యూటీగా భావించి వచ్చాను.. నాకే కాదు.. మా కాలనీకి చెడ్డపేరు రాకూడదు... మీరు నిశ్చింతగా నిద్రపోండి...” అని లేచి నిలబడ్డాడు.

“ ఆ రూంలో మీరు పడుకోవచ్చు.. గోడ పట్టుకొని పాకుతూ వెళితే బాత్‌రూం తలుపు తగులుతుంది”

“వాన ఇంకా నిలబడే కురుస్తోంది..”

“అది నిలబడితే నిలబడింది లెండి.. మీరు పడుకోండి..” అన్నది సుజాత. 

అతను రూంలోకి వెళ్లబోతుండగా చేతికి ఏదో తగిలి కిందపడింది. దభేల్ మని శబ్దం అయింది. 

“అయ్యో.. ఈ దుష్ట ధృతరాష్ట్రుడేదో చేసినట్లున్నాడు” అన్నాడు..

“వయొలిన్ కిందపడినట్లుంది.. ఫర్లేదు లెండి.. మీరా విధంగా ముందుకెళ్ళండి..” 

“తెల్లారేలోపు ఇంకెంత విధ్వంసం జరుగుతుందో... అజ్ఞానాంధకారంలో కన్నుగానక చేసిన వాటిని మీరు క్షమించాలి...” అన్నాడు. 

“కేవలం కన్నుగానక అయితే ఫర్వాలేదు.. కన్ను మిన్నుగానక ఏం చేయకండి..”

“ఔనండీ.. మనం కాసేపటికే ఇలా బాధపడుతున్నాం... నిజంగా చూపు లేనివాళ్ళు  ఎంత బాధపడతారో కదా..” అని అన్నాడు.

“వాళ్ల గురించి రేపు బాధపడుదురుగానీ... ఇవాళ్టికి ఆ విధంగా ముందుకెళ్లండి..” అన్నది. 

కాలమÖ ఆగదు, దాని వేగమÖ మారదు.. 

తెల్లారింది... 

సుందరం లేచేటప్పటికి సుజాత కాఫీ పెడుతోంది.. 

“మీ పుణ్యమా అని కాఫీ తాగుతున్నాను..” 

“మీ  పుణ్యమా అని నేనూ తాగుతున్నాను... రాత్రి దేన్నో తన్నేసినట్లున్నాను..”

“ వయొలిన్..  తీగ తెగింది...  అసలది అమ్మేయాలనుకుంటున్నాను..”

“వద్దండీ నేను బాగు చేయిస్తాను.. నా పనే రిపేర్లు చేయటం...”

సుందరం తమ కాలనీ అసోసియేషన్ వాళ్ళకి ఫోన్ చేశాడు...

“ఆ కాలనీలో మిలట్రీ దిగింది..” అన్నాడు కాలనీ ప్రెసిడెంట్. 

“దేనికి సార్ మిలట్రీ...వానదేవుడి మీద యుద్ధం చేస్తారా... మాకో నిచ్చెన కావాలి తెప్పించండి..” అని అడిగాడు సుందరం. 

మధ్యాహ్నానికి నిచ్చెన వచ్చింది. ఎంతో కష్టం మీద సుజాత నిచ్చెన మీదనుంచి కిందికి దిగింది. 

సుందరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. 

సుందరం తల్లి అన్నపూర్ణ ఆమెకు ఆహ్వానం పలికింది. 

“రోజూ టీవీల్లో పేపర్లల్లో చూస్తున్నాం.. మీ కాలనీవాళ్లెలా ఉంటున్నారా అని అనుకుంటున్నాం... మా ఇంట్లో నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండవచ్చు...” అన్నది అన్నపూర్ణ. 

“మీ ముఖంలో ఎంతో ప్రశాంతత... మిమ్మల్ని చూస్తుంటే ఎం.ఎస్. సుబ్బలక్ష్మిగారు గుర్తొస్తున్నారు..” అన్నది సుజాత.

“నేనెక్కడ.. ఆ మహాతల్లి ఎక్కడ..” అన్నది అన్నపూర్ణ.

సుజాత రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. అన్నపూర్ణకు చేదోడు వాదోడు అయింది. 

సుందరం వయొలిన్ బాగు చేయించి తీసుకు వచ్చాడు. 

కాసేపు వాయించి చూసి ‘థ్యాంక్స’ అన్నది. 

“ఎంత పాడైపోయినదైనా తెగిన తీగలు బిగించి శృతి చేసుకుంటే అద్భుతంగా పలుకుతుంది... జీవితం కూడా...” 

“నేను ఒక తప్ప్పు చేశాను.. మీరు మన్నించాలి” అన్నది సుజాత.

“తప్ప్పులు చేయుట మా వంతు.. మన్నించుటయే మీ వంతు.. అని పాడుతున్నారు కదా...”

“మొన్న అబద్ధం చెప్పాను. మా వాళ్ళు నాకు పెళ్ళి సంబంధం చూడటానికి వెళ్లారని..”

“అది అబద్ధమని నాకు తెలుసు..”

“ఎలా తెలుసు?”

“నిజంగా అన్నీ కుదిరి పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి నోసు, ఫేసు తెలియని వాడితో అంత సేపు అన్ని విషయాలు మాట్లాడదు..”

“నా గురించి కొంచెం చెప్పాలి..”

“చెప్ప్పు” 

“మా అమ్మ చనిపోయింది... మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.. వాళ్లిద్దరి మధ్యా పదేళ్ల వయసు తేడా ఉంది.. మా సవతి తల్లికి నేనంటే అంతులేని అసూయ.. కూర్చుంటే తప్ప్పు.. నుంచుంటే తప్ప్పు.. నవ్వితే తప్ప్పు.. నవ్వకపోతే తప్ప్పు... మానసికంగా

కృంగదీస్తోంది. నరకం అనుభవిస్తున్నాను.. మా నాన్న ఆ అపార్ట్‌మెంట్ నాకు రాసిస్తాడేమోనని ఆమె భయం..”

“అయితే నేనేం చెయ్యాలి?”

“ఈ సన్నివేశాన్ని కొంచెం రిపేర్ చేయాలి.. లవణాబ్ధి లంఖించు పవనాత్మజున కొక పిల్ల కాలువ పూని  గెంతు టెంత..? ఇది మీకొక లెఖ్ఖ కాదు..” 

“మా ఇంట్లో ఉండడం మీ కిష్టమేనా?”

“అది నా పూర్వజన్మ  సుకృతం అనుకుంటాను...”

నాలుగు రోజుల తర్వాత సుజాత తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు. సుజాత వాళ్లింటికి వెళ్లిపోయింది. 

నెలరోజుల తర్వాత అన్నపూర్ణ వెళ్లి సుజాతను తన కొడుక్కు ఇవ్వమని అడిగింది. 

“పాత గొడుగులు, తాళాలు రిపేరు చేసుకునేవాడికి పిల్లనిచ్చి దాని  గొంతు కోయలేం” అన్నది సత్యభామ... 

“అంతే.. అంతే..” అన్నాడు రామారావు.

ఓ రోజు సుజాత సుందరం ఇంటికి వెళ్ళిపోయింది వయొలిన్‌తో..

అన్నపూర్ణ ఉన్నంతలో లోటు లేకుండా పెళ్లి జరిపించింది. 

ఏడాదికల్లా సుజాతకి కొడుకు పుట్టాడు. కొడుక్కి కన్నకుడి వైద్యనాథన్ రామస్వామి శాస్త్రి అని పేరు పెట్టుకుంది. 

````

పదిహేనేళ్ళు గడిచాయి. వైద్యనాథన్ వయొలిన్ వాయించడంలో ఆరితేరిపోయాడు. పెద్ద పెద్ద వాళ్ళకు పక్క వాయిద్యాలు వాయిస్తున్నాడు. సోలో వయొలిన్ కచేరీలు చేస్తున్నాడు. 

వాడి చేతిలో ఏం మహత్యముందో కానీ, వాడు వాయించని రాగం లేదు,  పలికించని గమకం లేదు.. వాయిద్యం  మీద చేతివేళ్లు ఆటాడుకుంటుంటే  స్వరం అగరొత్తుల పొగలా అందమైన మెలికలు తిరిగి పోతుంది. 

కీర్తనలు వాయిస్తుంటే నాగస్వరానికి పాము పడగ విప్పి తలాడించినట్లు అంతా మంత్ర ముగ్ధులైపోవలసిందే!

గణపతి ఉత్సవాల్లో వాడికి తీరిక లేదు. రోజుకొక కాలనీకి వెళ్ళి అక్కడి వాళ్ళని సమ్మోహన పరుస్తున్నాడు. 

ఒకరోజు తల్లితో అన్నాడు.

“అమ్మా ఇవాళ నిజాం పేట దగ్గర ఏదో కాలనీ వాళ్ళుపిలిస్తే వెళ్లాను. కచేరీ అయ్యాక ఒక ముసలి దంపతులు నా దగ్గరకు వచ్చారు. ఆమె పేరు సత్యభామట. ‘దగ్గర్లోనే ఉంది.. రా..  రా.. మా  ఇంటిదాకా..’ అని పిలిచింది. వైద్యనాథన్ అంటే  నేను అరవవాడిననుకుంది. నేను తెలుగు వాడినేనని చెప్పాను..”

“వాళ్లింటికి వెళ్లావా?” 

“లేదు.. ఎందుకో వెళ్ళాలనిపించలేదు... ఎందుకమ్మా ఏడుస్తున్నావు?..” అని అడిగాడు వైద్యనాథన్.

“ఏం లేదురా కంట్లో ఏదో పడింది...” అన్నది సుజాత తల తిప్ప్పుకుని       కన్నీళ్ళు తుడుచుకుంటూ... 

క్రిస్టియన్ క్విజ్ ....

1. ‘అకెల్దమ’ అనగా ఏమిటి?

జ: రక్తభూమి (1:19)


2. బర్నబా ఏప్రాంతానికి చెందినవాడు?

జ: కుప్ర (4:36)


3. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసార గ్రహించ నావైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వియున్నది అని పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా పలికించెను?

జ: యెషయా ప్రవక్త (28:27)


1. ‘బర్నబా’ అనే పేరుకు అర్థం ఏమిటి?

జ: హెచ్చరిక పుత్రుడు (4:36)


2. నికొలాసు ఏప్రాంతానికి చెందినవాడు?

జ: అంతియొక (6:05)


3. “నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నియ్యవు” అని ఎవరు పలికిరి?

జ: దావీదు (2:27)


1. దొర్కా అను పేరుకు మÖల అర్థం ఏమిటి?

జ: లేడి (9:36)


2. రథము మీద కూర్చొని ప్రవక్తయైన యెషయా గ్రంధము చదువుచున్న నపుంసకుడు ఏ ప్రాంతానికి చెందినవాడు?

జ: ఇతియొపీయ (8:27)


3. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదు అను మాటల ఎవరు పలికిరి?

జ: సైఫను (7:53)


1. భోజన బల్లల వద్ద పరిచర్య చేయడానికి ఏర్పరచబడిన మత ప్రవిష్ఠుడు ఎవరు?

ఎ) సైఫను బి) సప్పీరా సి) నీకొలసు

జ: సి) నీకొలసు (6:5)


2. యెరూషలేము నుండి సీVAదరులు సౌలును ఎక్కడికి పంపారు?

ఎ) కొరంధీ పట్టణం బి) తార్సు సి) రోమా

జ: బి) తార్సు


3. “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి” (రెఫరెన్స్)

ఎ) 10:34 బి) 16:31 సి) 20:28

జ: సి) 20:28


1. సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి ఎవరు?

ఎ) హెరోదు రాజు బి) సౌలు సి) యÖదులు

జ: బి) సౌలు (8:03)

2. అంతియొకయ నుండి సౌలు, బర్నబాలు వెళ్ళి పోయిన తరువాత వారు దేవుని వాక్యాన్ని ఎక్కడ భోదించారు?

ఎ) పంపూలియ బి) సలామి సి) బితూనియ

జ: బి) సలామి (13:05)

3. “మీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి” (రిఫరెన్స్)

ఎ) 3:20 బి) 12:03 సి) 2:42

జ: ఎ) 3:20


1. అంతియొకయలో దేవుని కృపను చూసి సంతోషించినదెవరు?

  ఎ) బర్నబా బి) పేతురు సి) పౌలు

జ: ఎ) బర్నబా (11:23)

2. ప్రభువు ఆత్మ ఫిలిప్ప్పును ఎక్కడికి తీసుకెళ్ళాడు?

ఎ) అజోతు బి) గాజా సి) సమరయ పట్టణం

జ: అజోతు (11:23)

3. “ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము” (రిఫరెన్స్)

ఎ) 17:11 బి) 2:13 సి) 4:12

జ: సి) 4:12


1. దావీదు పరలోకం ఎక్కిపోలేదు?

జ: అవును (2:34)

2. తబితా అను ఒక శిష్యురాలు లుద్దలో ఉండెను? (యొప్పే)

జ: కాదు (9:36

3. అ.పో కార్యాలలో మొత్తం 1011 వచనాలు ఉన్నాయి? (1007)

జ: కాదు.


1. పరిసయ్యలు దేవదూతయైనను, ఆత్మయైనను కలవని ఒప్ప్పుకొంటారు?

జ: అవును (23:08)

2. బర్నబా సౌలును వెదకుటకు అంతియొకయకు వెళ్ళి అతనిని కనుగొనెను? (తార్సు)

జ: కాదు (11:25)

3. అ.పొ కార్యాలలో పెద్ద అధ్యాయం అయిన 7వ అధ్యాయం 60 వచనాలు ఉన్నాయి?

జ: అవును.


1. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు రక్తముగాను మారును? (చీకటి గా చంద్రుడు రక్తముగా)

జ: కాదు (2:20)

2. అబ్రహము కల్దీయల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను?

జ: అవును (7:04)

3. పరిశుద్ధ గ్రంథములో అ.పో కార్యాలు 44వ గ్రంథము?

జ: అవును.


1. కీషు కుమారుడు అయిన సౌలు ఏ గోత్రమునకు చెందినవాడు?

జ: బెన్యామీను (13:21)

2. పౌలు స్వస్థలాన్ని గురించి అడిగి తెలుసుకొన్న అధిపతి ఎవరు?

జ: ఫేలిక్సు (23:26, 34)

3. యోసేపుకుగల ఇత పేర్లలో బర్సబ్బా కాక మరొక పేరు ఏమిటి?

జ: యÖస్తు (1:23)


1. మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, కాల్చివేయగా వాటి వెల లెక్క చూచినప్ప్పుడు ఎంతగా ఉన్నది?

జ: యేబదివేల వెండి రూకలాయెను (19:19)

2. జాగుస్తు పటాలంలో శతాధిపతి ఎవరు?

జ: యÖలి (27:01)

3. ఫినిక్సు రేవుకుగల మరో పేరు ఏమిటి?

జ: క్రేతు రేవు (27:12)


1. ఇగుప్తులో ధాన్యము కలదని ఎవరు విన్నారు?

జ: యాకోబు (7:12)

2. అకయకు అధిపతి ఎవరు?

జ: గల్లియోను (18:12)

3. సుమెయోను ప్రవక్తకు గల మరో పేరు ఏమిటి?

జ: నీగెరు (13:01)

అమలులో ఉన్న విద్యుత్ ఛార్జీలు

కేటగిరి `1 (ఎ)`గృహావసరం` లోడ్: 500wలోపు

0`50 వరకు రూ.1`45పై. ` స.ఛా. 25రూ.

51`100 వరకు రూ. 2`80పై. ` స.ఛా. 30రూ.

101`200 వరకు రూ. 3`60పై. ` స.ఛా. 35రూ.

201`300 వరకు రూ. 5`75పై. ` స.ఛా. 40రూ.

301`500 వరకు రూ. 6`75పై. ` స.ఛా. 45రూ.

501పైన రూ. 7`25పై. స.ఛా. 45రూ.

కేటగిరి `1(బి)`గృహావసరం`లోడ్ 500wపైన

0`100 వరకు రూ. 2`80పై` 101`200 వరకు రూ. 3`60పై.

201`300 వరకు రూ.5`75పై.

301`500 వరకు రూ.6`75పై. `501పైన రూ. 7`25పై.

కేటగిరి`2(ఎ) గృహేతర అవసరం (వాణిజ్యం)`లోడ్: 500wలోపు

0`50 వరకు రూ. 3`85పై. ` స.ఛా. 30రూ.

51`100 వరకు రూ. 6`00పై. ` స.ఛా. 35రూ.

100 పైన రూ 7`00పై. ` స.ఛా. 40రూ.

కేటగిరి `2(బి)`గృహేతర అవసరం ` లోడ్: 500wపైన

0`100 వరకు రూ.6`00పై. ` 100పైన రూ.7`00పై.

కేటగిరి`2(సి)`గృహేతర అవసరం

అన్ని యÖనిట్లకు రూ.9`00పై. ` స.ఛా. 40రూ.

కేటగిరి ` 7(ఎ)`సాధారణ సరఫరా

అన్ని యÖనిట్లకు రూ. 4`50పై.

కేటగిరి `7(బి)`సాధారణ సరఫరా

200 యÖనిట్లకు రూ2`60పై. బ్యాలన్స్ యÖనిట్లకు రూ.4`50పై.

ఎత్తుకు ఉండవలసిన బరువు....

ఎత్తు పురుషులు స్త్రీలు

సెం.మీ కిలో గ్రాములు కిలో గ్రాములు

152 50 నుండి 56 వరకు  45 నుండి 51 వరకు

155 52 నుండి 57 వరకు 47 నుండి 52 వరకు

157 53 నుండి 58 వరకు 48 నుండి 54 వరకు

160 55 నుండి 60 వరకు 50 నుండి 55 వరకు

162 56 నుండి 61 వరకు 51 నుండి 57 వరకు

165 58 నుండి 63 వరకు 53 నుండి 59 వరకు

167 59 నుండి 65 వరకు 54 నుండి 61 వరకు

170 61 నుండి 66 వరకు 56 నుండి 63 వరకు

173 63 నుండి 69 వరకు 59 నుండి 65 వరకు

175 64 నుండి 70 వరకు 60 నుండి 66 వరకు

178 66 నుండి 72 వరకు 62 నుండి 68 వరకు

181 68 నుండి 74 వరకు 63 నుండి 70 వరకు

183 70 నుండి 77 వరకు 66 నుండి 72 వరకు

186 72 నుండి 79 వరకు 68 నుండి 74 వరకు

188 74 నుండి 82 వరకు 69 నుండి 76 వరకు

జన్మ లేద నామ నక్షత్రం ప్రకారం ఉంగరంలో ధరించవలసిన రత్నములు

అశ్వని నుండి రేవతి వరకు 27 నక్షత్రముల జాతకులు జన్మనక్షత్రరీత్యగాన లేదా తమ పేరును బట్టి నామ నక్షత్రం రీత్యగాని ఈ క్రింద తెలిపిన రత్నములు బంగారంతో గాని వెండితోగాని ఉంగరంలో ధరించిన వ్యాపార లాభం, ఉద్యోగలాభం, ఆరోగ్యలాభం, ధనలాభం కలిగి చేయు కార్యములందు అన్నింటా జయం కలిగి సుఖ శాంతులతో సంతోషంగా జీవనం గడుపుతారు.

నక్షత్రములు                     రత్నములు

కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ     కెంపు

రోహిణి, హస్త, శ్రవణం     ముత్యము

మృగశిర, చిత్త, ధనిష్ట     పగడము

ఆశ్లేష, జ్యేష్ట, రేవతి     పచ్చ

పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర     పుష్యరాగం

భరణి, పుబ్బ, పూర్వాషాఢ     వజ్రం

పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర    నీలం

ఆరుద్ర, స్వాతి, శతభిషం     గోమేధికం

అశ్వని, మఖ, మÖల     వైఢూర్యం

మనిషికి సాధారణంగా ఉండవలసిన బ్లడ్‌ప్రెషర్ (రక్తపోటు)

వయస్సు (పు)    సిస్టోలిక్ డయాస్టోలిక్

16`19     105`135 60`86

20`24     105`140 62`88

25`29     108`140 65`90

30`34     110`140 68`92

35`39     110`145 68`92

40`44     110`150 70`94

45`49     115`155 70`96

50`54     115`160 70`98

55`59     115`165 70`98

60`65     115`170 70`100


వయసు (స్త్రీలకు)

16`19 110`130 60`85

20`24 100`130 60`85

25`29 102`130 60`86

30`34 102`135 60`88

35`39 105`140 65`90

40`44 105`150 65`92

45`49 105`155 65`96

50`54 110`165 70`100

55`59 110`170 70`100

60`65 1156175 70`100

పంచారామముల చరిత్ర....


ఏ పురాణాలు చదివినా మనకు ముఖ్యంగా కనిపించేది దేవదానవుల యుద్ధాలు, రాక్షసుల అకృత్యాలు, అధర్మం పెరిగి ధర్మహాని కలిగినపుడల్లా మహావిష్ణువు ఆ కాలానికి తగిన విధంగా అవతారాలను ఎత్తి రాక్షసులను సంహరించిన ఉదంతాలే కన్పిస్తాయి. అలా తమ పూర్వీకులను సంహరించిన మహావిష్ణువు పై పగ సాధించడానికై యుద్ధం చేసి అతన్ని సంహరించాలన్న తలంపుతో   తారకాసురుడు అనే రాక్షసరాజు నిశ్చయించుకున్నాడు. కాని విష్ణువుతో యుద్ధం చేయడానికి తనకున్న శక్తులు చాలవని గ్రహించుకున్న తారకుడు ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించాడు. ప్రత్యక్షమైన పరమేశ్వరుడు తారాకాసునితో తాను అతని తపస్సుకు మెచ్చాడు. కనుక కావాల్సిన వరం కోరుకోమని, ఏదీ కోరినా ఇస్తామన్నాడు. వెంటనే తారకాసురుడు ఎంతో వినయంతో ఎవరి చేత, ఎట్టి ఆయుధాలతో ఏ సమయంలో కానీ చంపబడకుండా వరమియ్యమని ప్రార్థించాడు. శంకరుడు భోళాశంకరుడు కనుక తారకునికి వరమివ్వడమే కాక సముద్రమథనం అప్ప్పుడు లభించిన అమృతలింగాన్ని కూడా అతనికిచ్చి ఈ ‘అమృతలింగంతో నీ ప్రాణం ముడిపడి ఉంది. కనుక దీనిని జాగ్రత్తగా కాపాడుకో, ఈ అమృతలింగం యదాతథంగా ఉన్నంత వరకు నీకు ఏ ఆపదారాదు’ అని ఆశీర్వదించి అంతర్ధానం అయ్యాడు.

పరమేశ్వరుని ఆదేశానుసారం అమృత లింగాన్ని జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నంగా దాన్ని ఒక బంగారు తాడు బంధించి తన కంఠంలో వేలాడు తీసుకున్నాడు. అది ఎప్పుడూ అతని వక్షస్థలాన్ని అంటిపెట్టుకుని ఉంటూ అతని శివభక్తికి గుర్తుగా, అతనికి శివభక్తులలో అగ్రగణ్యునిగా పేరు తెచ్చి పెట్టింది.

వీటన్నింటితో తారకాసురుడు చాలా శక్తిమంతుడై విష్ణువుపై పగ సాధించడానికి మొదటి మెట్టుగా దేవేంద్రుడి పై దండెత్తాడు. వారి ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు జరిగిన యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోయాడు. కొందరు మహాఋషులు, దేవతలు వెంట రాగా దేవేంద్రుడు విష్ణువు దగ్గరికి వెళ్లి, తమను వెనుకటిలాగా రాక్షసుల బారి నుండి రక్షించమని వేడుకుంటాడు. వారి ప్రార్థన విన్న విష్ణువు వారికి ఇలా వివరించాడు.

‘దేవతలారా, తారాకసురుడు గొప్ప శివభక్తుడు. ఘోర తపస్సుతో శంకరున్ని మెప్పించి ఎన్నో వరాలు పొందాడు. వాణ్ణి వధించడం ఎవ్వరి వల్లా సాధ్యం కాదు. దీనికి అవసరమైన ఉపాయం పరమశివుడే సూచించగలడు కనుక మనమందరం కలిసి ఆయన్ని ప్రార్థిద్దాం పదండి’ అని వారందరిని తీసుకుని విష్ణువు కైలాసానికి వెళ్లాడు. అక్కడ వారంతా కలిసి భక్తితో శివున్ని ప్రార్థించి తారాకాసురుని వలన తమకు కలుగుతున్న కష్టాలను వివరించి వాని బారినుండి తమను రక్షించమని వేడుకున్నారు. వారి ప్రార్థనలకు సంతోషించిన శివుడు, ‘దేవతలారా, విషయాలన్నీ విన్నాను. తారాకాసురుడు నా భక్తుడు. వానికి నేనిచ్చిన వరాల వల్ల అతన్ని వధించడం అసాధ్యం. కాని మరో వైపు తారకుని వలన ధర్మానికి హాని కలుగుతున్నది. ధర్మ రక్షణ ముఖ్య కర్తవ్యం కనుక మీకు నేనొక మార్గాన్ని సూచిస్తాను. మీరంతా వెళ్లి నా కుమారుడు కుమారస్వామిని దేవతల సైన్యానికి సర్వసేనానిగా చేసి అతన్ని ముందుంచుకొని తారకుని పై యుద్ధానికి వెళ్ళండి’ అని చెప్పాడు. పరమేశ్వరుని ఆదేశానుసారం దేవతలంతా కుమారస్వామి వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించి, సర్వసేనానిగా చేసుకుని తారకాసురుని పైకి దండెత్తి వెళ్లారు. అప్పుడు జరిగిన యుద్ధంలో తారాకసురుని  సైన్యంలో అత్యధిక సంఖ్యలో సైనికులు చనిపోయినా, గెలుపు తారకునిదే అయ్యింది. రెండవసారి తారకుని పై దండెత్తి వెళ్లి అతని మెడలో అమృత లింగాన్ని చేధించినచో తప్పక విజయం లభించగలదని ఆస్త్రాన్ని ఇస్తాడు. దాంతో కుమారస్వామి రెట్టించిన ఉత్సాహంతో మరొకసారి తారకాసురుని పైకి యుద్ధానికి వెళ్లి అతని కంఠంలో వ్రేలాడుతున్న బంగారు భరణిలోని అమృత లింగాన్ని తన ఆయుధంతో పడగొట్టగా, అది ఐదు ముక్కలై ఐదు ప్రాంతాల్లో పడింది.

ముక్కలని వెంటనే ఆయా స్థలాల్లో ప్రతిష్ఠించి పెరగకుండా ఆపమని పరమశివుడు ఆదేశించాడు. అన్నింట్లోకి పెద్ద శకలం అమరారామంలో దేవేంద్రుడు రెండవ శకలం సోమారామంలో చంద్రుడు, మÖడవ శకలం క్షీరారామంలో శ్రీరామచంద్రుడు, వేరుగా త్రేతాయుగంలో, నాల్గవది కుమారరామంలో కుమారస్వామి, ఐదవది ద్రాక్షారామంలో వ్యాస భగవానుడు, అన్నింటిలో ఒకటే సమయంలో ఈ శకలాలను ప్రతిష్టించారు. అమరారామం, సోమారామం, క్షీరారామం, కుమారారామం, ద్రాక్షారామం అన్న పేర్లతో పిలవబడే ఈ ఐదు, పుణ్యక్షేత్రాలై పంచారామములుగా ప్రసిద్ధి చెందాయి.

అమరారామం

వీటన్నింటిలో ప్రధానమైనది దేవేంద్రునిచే ప్రతిష్ఠంపబడిన అమరారామం నేటి అమరావతి. ఇచ్చట ఉన్న దైవం అమరేశ్వరస్వామి, అమ్మవారు బాల చాముండేశ్వరి దేవి. క్రిందపడిన పెద్ద శకలాన్ని ప్రతిష్ఠించడానికి దేవేంద్రుడు, దేవ గురువు బృహస్పతి, తక్కిన దేవతలు ఆ స్థలాన్ని చేరే సరికే ఆ శకలం పెరిగి లింగాకృతిలోకి మారుతూ ఉంది. అది చూసిన దేవేంద్రుడు, తన గురువుతో ‘గురవవర్యా, ఇంత పెద్ద లింగాన్ని నేను ఏ విధంగా ప్రతిష్ఠించగలను, ప్రతిష్ఠించినా సామాన్యులు ఏ విధంగా లింగానికి పూజలు, అభిషేకాదులు చేయగలరు? అని అడిగాడు. దానికి దేవ గురువు ‘దేవేంద్రా దాన్ని గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదు. ముందు నీవు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించు. సామాన్య ప్రజల గురించి ఏర్పాట్లు ఆ భగవంతుడే చూసుకుంటాడు’ అన్నాడు.

దేవేంద్రుడు ఆ లింగాన్ని విజయదశమి రోజున ప్రతిష్ఠించాడని, అది అమరుల చేత ప్రతిష్ఠించబడి, అమరులు అక్కడ కొంత కాలం నివసించి స్వామిని సేవించినందు వల్ల ఆ ప్రదేశాన్ని అమరావతి అని, అక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలవడం అనాదిగా జరుగుతుంది. ఇక్కడ అర్చామÖర్తి పదిహేను అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు కలిగి తెల్లటి చలువరాయి ఉంటుంది. దేవి, శ్రీ బాల చాముండేశ్వరి కోరిన వరాలిచ్చే వరదాయినిగా ప్రసిద్ధి పొందింది.

సోమారామం

తారకాసురుని కంఠం నుండి ముక్కలైన అమృత లింగంలోని ఒక భాగం ‘గునిపూడి’ అనే చోట శివాలయంలో పడింది. శివుని ఆదేశానుసారం దేవగురువు సలహాపై చంద్రుడు లేక సోముడు దేవగణాదులతో వచ్చి లింగ ప్రతిష్ఠ చేయడం వల్ల దీనికి సోమారామం, స్వామికి సోమేశ్వర లింగంగా పేరు వచ్చింది. మÖలా విగ్రహమైన సోమేశ్వర లింగం పీఠం నుండి రెండు అడుగుల ఎత్తులో స్ఫటిక లింగంగా ఉంది. చంద్రునితో ప్రతిష్ఠింపబడినది కనుక చంద్రుని వృద్ధిక్షయాలు లింగమందు ప్రతిబింబిస్తూ, అమావాస్య రోజున గోధుమ, నలుపు, రంగులలోను, పూర్ణిమరోజు తెల్లని ఛాయలతో ప్రకాశిస్తుందని చెప్తారు. శివలింగానికి అలంకరించిన నాగాభరణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణ అన్న పేరుతో పిలువబడుతుంది. దేవి మొదటి అంతస్తులో  ఉంటుంది. ఇక్కడి కోనేరు చంద్ర పుష్కరిణి లేదా సోమగుండం అని పిలవబడుతుంది. దేవి మొదటి అంతస్తులో ఉంటుంది. ఇక్కడి కోనేరు చంద్ర పుష్కరిణి లేదా సోమగుండం అని పిలువబడుతుంది. ఆలయంలో జనార్ధనస్వామి, కుమారస్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలు నిత్య పూజలందుకోవడం వల్ల ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

క్షీరారామం

ఇక్కడ పడిన అమృత లింగ శకలంను శివుని ఆదేశంపై పెరగకుండా బృహస్పతి తగుజాగ్రత్తలు  తీసుకోగా త్రేతాయుగంలో అది శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠించబడింది. ఇక్కడి ఆలయం చాలా పెద్దది. దీని గోపురం ఆంధ్రప్రదేశంలోనే ఎత్తైన గోపురాలలో ఒకటై 120 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయంలో తారాకాసురుని వధకు ముందునుండే పూజలు జరిగేవట. ఇక్కడి స్వామి క్షీరా రామలింగేశ్వరస్వామి. దీనికి క్షీరారామం అనే పేరు రావడానికి వెనుక ఒక కథ ఉంది. సప్త మహాఋషులలో ఒకరైన కౌశిక మహర్షి కొడుకు పేరు ఉపమన్యుడు. అతను శివారాధన చేస్తూ శివునికి పాలతో అభిషేకం చేద్దాం అనుకుంటే పాలే దొరకలేదు. పాల కొరకు శివున్ని ప్రార్థించిగా శివుడు ప్రత్యక్షమై భక్తుని కోరిక తీర్చడానికై త్రిశూలంతో ఒక చెరువునే త్రవ్వి క్షీరసాగరం నుండి క్షీరం ఆ చెరువులోకి చేరేలా చేశాడు. అప్పటి నుండి ఆ ప్రాంతం మొదట పాలకోటగా పిలువబడుతూ కాలక్రమేణా పాలకొల్లుగా మారింది. ఫలవృక్షాల తోటలు, సమృద్ధిగా పాలు వుండటం వల్ల ఈ ప్రాంతం దుగ్ధతపోవనం అని కూడా పిలవబడేది. శ్రీరామునిచే లింగ ప్రతిష్ఠ జరిగినందువల్ల ఈ దేవాలయంలో ఇప్పటికి గొప్పగా నిత్యపూజలు జరుగుతూ ఉంటాయి.

ఆలయానికి ఆదాయం బాగానే ఉన్నా తగిన ప్రచారం, ఆలయ స్థలపురాణం గురించిన వివరాలు అంతగా లభించడం లేదు. దీని గురించి సామాన్య గ్రంధం ఏదైనా వెలువరిస్తే మంచిది. ఇక్కడి శివలింగం మార్బుల్ క్రిస్టల్ రాయిగా కన్పిస్తుంది.

కుమారారామం (భీమారామం)

ఇక్కడి శివలింగం స్వయంగా కుమారస్వామిచే ప్రతిష్ఠబంబడినందున కుమారారామంగాను, చాళుక్యరాజు భీమరాజు అనే ఆయన భక్తి శ్రద్ధలతో ఆలయం అభివృద్ధి చెందినది కనుక భీమారామం గాను ప్రసిద్ధి చెందింది. ఇందులోని ప్రత్యేకత, మొదటి అంతస్తులోని శివలింగం ఎత్తుగా ఉంటూ రెండవ అంతస్తు వరకు వ్యాపించి ఉండటం వలన పూజలన్నీ రెండవ అంతస్తులోనే జరుగుతాయి. ఇక్కడి ఆలయ శిల్ప సంపద చాళుక్య కాలం నాటిదై శిల్పకళావైభవంలో ప్రముఖ స్థానాన్ని పొంది ఉంది. నందీశ్వరుని విగ్రహం ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఇచ్చటి అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరి. ఇక్కడి ముఖ్యమైన విశేషం నల్లరాతితో మలచబడిన  ఉయ్యాల మండపం. భక్తితో ఎవరైనా ముట్టుకుంటే ఐదు అడుగుల ఎత్తు ఉన్న ఈ ఊయల ముందుకు వెనక్కు ఊగుతుంది. గర్భగుడికి రెండు వైపుల చండప్రచండులను ఇద్దరు ద్వాపరపాలకుల విగ్రహాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

5. ద్రాక్షారామం

పరమేశ్వరుని ఆదేశానుసారం దేవగురువైన బృహస్పతి సలహా మేరకు వేదవ్యాసుడు ఇక్కడ ఐదవ శకలాన్ని శివ లింగంగా ప్రతిష్ఠింయచాడు.

ఇక్కడి శివలింగం నల్లరాతితో 14 అడుగుల ఎత్తు కల్గి రెండంతస్తుల్లో ఉంటుంది. ఈ ఆలయంలో కృతయుగం నుండే పూజలు జరుగుతూ ఉన్నాయని స్థలపురాణం చెప్తోంది. తక్కిన ఆరామాలతో పోలిస్తే ఆ రామంలోని పరమేశ్వరుడు భక్తులకు వారి జీవితకాలంలోనే సుఖసంతోషాలను ప్రసాదించటమే కాక మోక్షాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి. భీమేశ్వర స్వామియందు నమ్మకం ఉంచితే ఆయన కరుణాకటాక్షములను పొందవచ్చునని పార్వతి దేవియే స్వయంగా వ్యాస మహర్షికి చెప్పినట్లుగా నానుడి ఉంది. దక్ష ప్రజాపతి ద్రాక్షరామం ముఖ్య పట్టణంగా రాజ్యపాలన చేశాడు. ఇక్కడే యజ్ఞగుండంలో దుమికి సతీదేవి ప్రాణత్యాగం చేసుకున్నదని పురాణగాథ చెపుతోంది.

వేదవ్యాసుడు తన శిష్య బృందంతో కాశీనగరంలో నివాసముంటూ నిత్యం దైవారాధన చేసుకుంటూ తన రటనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అలా ఉంటూనే కొంత కాలానికి అతనిలో మానసికంగా మార్పు కలిగి కొంత నిలకడను కోల్పోయాడు. ఒకనాడు అలవాటు ప్రకారం భిక్ష కొరకై నగరంలోకి వెళ్లిన వ్యాస మహర్షికి ఎక్కడా భిక్ష లభించలేదు. ఆ విధంగా రెండు, మÖడు రోజులు గడిచాక ఆకలి భరించలేక కోపంతో కాశీ నగర వాసులను శపించ బోయాడు. అప్పుడు పార్వతీ దేవి ఒక సాధారణ స్త్రీగా ఆయన ఎదుటికి వచ్చి వేద వ్యాసున్ని, లతని శిష్య బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి, షడ్రురుచోపేతమైన భోజనాన్ని పెట్టింది. ధన్యవాదములు తెలపగోరిన వ్యాసులకు ఆ స్త్రీ మరెవ్వరో కాదు కాశీ అన్నపూర్ణ అని తేలిసింది. అప్పుడు దేవి వ్యాసునితో ‘పరమేశ్వరుడు నీ ఓర్పును పరీక్షించదలిచి, నీకీ పరిస్థితి కల్పించాడు. నీవు ఆయన పరీక్షలో నెగ్గలేక పోయావు. సహనం కోల్పోయి నగరవాసులను శపించ బోయావు. కాశీ మోక్షనగరి, ఇందులో ఉండే అర్హతను నీవు కోల్పోయావు. కనుక నీవు ద్రాక్షారామానికి వెళ్లి అక్కడ యధేచ్చగా నీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించుకో ఈ నా సలహాను పాటించక పోయినట్లైతే నీవు చిక్కుల్లో పడగలవు. పరమేశ్వరుడు నీకు మరెన్నో బాధలు కలిగి నిన్ను పరీక్షించగలడు. అని చెప్పింది. మాతా అన్నపూర్ణ సలహాను అనుసరించి వ్యాసమహర్షి తన మÖడు వందల మంది శిష్యులతో పాటు ద్రాక్షారామం చేరుకున్నాడు. తనలో కలిగిన మార్పుకు ప్రశ్చాత్తపడా అక్కడే స్థీరంగా ఉంటూ తన రచనా కార్యక్రమాన్ని కొనసాగించాడు.

ఇక్కడి స్వామి వారు శివలింగం స్ఫటికారంగా ఉండి స్వయంగా భక్తులను ఆకర్షించి గలిగే శక్తి కలిగి ఉంటుంది. తక్కిన ఆలయ పరివార దేవతల విగ్రహాలు ఉండడం వల్ల శివలింగం అమరావతి లింగం కంటే ఒక అడుగు చిన్నదిగా ఉంది. రెండవ అంతస్తు వరకు వ్యాపించి ఉంటుంది. అభిషేకాదులు ప్రత్యేక పూజలు రెండవ అంతస్తులోనే చేస్తారు. భీమేశ్వరాలయం గురించి  శ్రీనాథకవి రచించిన భీమేశ్వర పురాణంలో వివరంగా వ్రాసి ఉన్నారు.

ఈ పంచారామాలు ఎంతో ప్రశస్తి కల్గి ఉన్నా వీటికి ప్రస్తుత కాలంలో ప్రచార లోపంవల్లనో, విషయ పరిజ్ఞానం కొరకు వీలుగా వాడుక భాషలో సరియైన సాహిత్యం లేకపోవటం వలనో ఈ పుణ్య క్షేత్రాలకు ఎక్కువ సంఖ్యలో భక్తులెక్కువగా రారని అన్పిస్తుంది. ఈ ఐదు ఆ రామాలను రెండు రోజుల్లో బస్సులో గాని స్వంతకార్లోగాని, టాక్సీలోగాని సులభంగా దర్శించుకుని తిరిగి రావచ్చు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ వారు కలిసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టగల్గితే రాష్ట్ర ప్రభుత్వానికే లాభం. దేవాలయ శాఖ లాభాలు కూడా పెరుగుతాయి. ఇలాంటి పనికి ఎవరైనా ముందు అడుగు వేస్తారని ఆశిస్తూ.......

దేవుడొక్కడే

పాండిచ్చేరిలో ముస్లిములు ఎక్కువగా ఉండే ప్రాంతం “వోటు కుప్పం” అనీ ఊరు ఉంది. ఇది పాండిచ్చేరి సమీపంలో ఉన్నా తమిళనాడు హద్దులోకే వస్తుంది. ఆ ఊర్లో ఓ పేద ముస్లిం కుటుంబంలో ఓరోజు.

“బేటా! అబ్బస్ క్యాకరీ రహేీVA” అంది రజియాబేగం వాడు ఉన్న గదిలోకి వచ్చి గదంటే గదని కాదు.


గురునానక్...

సిక్కుమతానికి మÖలం ఏకేశ్వరోపాసన. శ్రీకృస్ణుడి భగవద్గీత కారణంగా ఆ దైవం జగద్గురువుగా ఆరాధింపబడుతున్నట్లే, సిక్కులు సైతం తమ దైవాన్ని ‘వాహెగురు’ అని సంబోధిస్తారు. అన్ని మతాలకూ ఏదో ఒక పవిత్ర క్షేత్రం ఉన్నట్లుగానే సిక్కులకు అమృత్‌సర్‌లోని స్వర్ణమందిరం అత్యంత పవిత్రమైంది. సిక్కు మతాన్ని స్థాపించిన మహానుభావుడు గురునానక్.

నానక్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు దేవ్‌జీ. తల్లి ప్రేమతో ఇతన్ని నానక్ అని పిలిచేది. అలా ఈ మహానుభావుడు నానక్ దేవ్‌జీగా తన చిన్నతనంలో అందరిచేత గుర్తింపబడ్డాడు. నానక్ దేవ్‌జి తండ్రి మెహతా. తల్లి త్రిపుర. వీళ్లది బ్రాహ్మణ కుటుంబం. మెహతా గ్రామ కరణంగా విధులు నిర్వహించేవాడు. తల్వండీ గ్రామానికి ఆయన పట్వారి.

నానక్ దేవ్‌కు చిన్నతనం నుంచీ ప్రశ్నించడం అýవాటు. అలా ఎందుకు చేయాలి. ఇలా ఎందుకు పూజించాలి, అసలు దైవం అంటే ఎవరు? దైవాలు అంత మంది ఎందుకున్నారు? ఎవరి మతానికి తగ్గ దైవం ఆమతానికే పరిమితమా... అంటూ తల్లినీ తండ్రినీ ప్రశ్నించేవాడు. తండ్రి నవ్వుతూ ప్రశ్నోపనిషత్తు చదువు...  అన్నీ తెలుస్తాయి అనేవాడు. పదమÖడు సంవత్సరాల వయస్సు వచ్చే సరికే వివిధ మతాలలోని మÖలాల గురించి తల్లికి చెప్పేవాడు. తల్లి త్రిపుర ఆశ్చర్యంగా వినేది. ఆ వయస్సులో మతపరంగా ఉపనయనం చేసి జంధ్యం వేయాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తే నిరాకరించాడు. భగవంతుడు జంధ్యానికి మాత్రమే పరిమితం కాదనీ, జంధ్యంతో పాటు శరీరం మట్టిలో కలిసిపోతుందని చెప్పేవాడు.అన్ని మతాలకూ పరమాత్ముడు ఒక్కడే ననీ, ఆ భావన ఆత్మలో ఉండాలే కాని నూలుపోగుకే పరిమితం కాదని వాదించాడు. నానక్ దేవ్‌జీకి ఒక అక్కఉండేది. ఆమె పేరు నాన్కి. ఒక రోజు తన తమ్ముడు నిద్రిస్తుండగా అతని నుదురుపై వెలుగుతున్న జ్యోతిని గమనించింది. కాని ఆమె ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. నానక్ ఎన్నోసార్లు ఇల్లు వదిలి వెళ్లి పోయే వాడు. అలా వెళ్లి ఎక్కడెక్కడో తిరుగుతూ సూఫీ గురువులను కలిసేవాడు. సంత్ కబీర్, రవిదాస్ లాంటి తత్త్వవేత్తలను కలిశాడు. పలు మతాల్లోని కొత్తకొత్త మÖల సూత్రాలను తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చి తల్లికి చెప్పేవాడు. తన 24వ యేట పంజాబ్ రాష్ట్రంలోని బలాలకు చెందిన మÖల చంద్ర అనే వ్యాపారి కూతురు సులేఖినిని వివాహం చేసుకొన్నాడు. శ్రీచంద్రుడు, ýక్ష్మిదాస్ అనే కుమారులు ఈ దంపతులకు జన్మించారు.

నానక్ దేవ్‌జీ అక్క నాన్కి భర్త జైరామ్, సుల్తాన్‌పూర్ ప్రభుత్వ ధాన్యాగారంలో మేనేజర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. అయితే 28 సంవత్సరాల వయస్సులో ఒక ఉదయం నానక్ దేవ్‌జీ నదీ స్నానానికి వెళ్తానని చెప్పి వారం రోజులు తిరిగి ఎవరికీ కనుపించలేదు. తిరిగి వచ్చి తాను దేవుని పవిత్రాత్మను నింపుకొన్నానని ప్రకటించుకొన్నాడు. ఆ తరవాత మతసామరస్య బోధనలతో ఒక కొత్త మతాన్ని వ్యాప్తి చేయడంర, బోధనలు చేయడం ప్రారంభించాడు. నానక్‌జి తొలి శిష్యురాలు ఆయన సోదరి నాన్కి. వేలాది కిలోమీటర్లు తిరుగుతూ భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ నాలుగు ప్రత్యేకమైన ప్రదేశాల్లో నాలుగు ప్రత్యేకమైన ప్రయాణాలు సాగించారు. వీటినే ఉదాసీలు అని పిలుస్తారు.

హిందూ, ఇస్లాం మతాలలో మౌలికమైన తేడా నానక్‌కు కనిపించలేదు. హిందూ మతంలోనూ, ఇస్లాం మతంలోనూ దైవం ఒక్కడేనని నమ్ముతారు.  ఈ రెండు మతాల మÖల సిద్ధాంతాల సమ్మేళనమే సిక్కు మతం. ఇలా మత సామరస్యం కోసం పాటుపడి ఏకేశ్వరీ సిద్ధాంతం ద్వారా కొత్త నిర్వచనం చెప్పగలిగిన గురువు నానక్. సిక్కు మతానికి ఇతనే ఆద్యుడు ప్రస్తుతం ఈ మతం మరింత వృద్ధి చెంది ఔన్నత్యాన్ని పొందుతోంది. గురునానక్ దైవాంశ సంభూతుడు, నిత్య వందనీయుడు.

దసరా....

భారతీయ సంస్కృతితో స్త్రీని దైవాంశగా భావించి ఆరాధించడం ఆచారంగా వస్తోంది. వేదకాలానికి పూర్వమే శక్తి పూజ భారతదేశంలో సంప్రదాయంగా ఉండేదని దేవి పురాణం వల్ల తెలుస్తోంది. వేదాలు, ఉపనిషత్తుల్లో సైతం శక్త్వారాధన గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. నాగరికత అభివృద్ధి చెందుతున్న తొలినాళ్లలో మన దేశంలో మాతృస్వామ్యం పరిఢవిల్లింది. స్త్రీ కుటుంబానికి నాయకురాలు. బాధ్యతలు  వహించి శక్తిని ప్రదర్శిస్తూ నాగరిక సమాజానికి పునాదులు వేసింది. అందుకే ఆమె శక్తి స్వరూపిణి. కాలానుగుణంగా ఎన్ని మార్పులు వచ్చినా స్త్రీ శక్తి ఆరాధనీయంగానే కొనసాగుతోంది. ప్రతిసంవత్సరం స్త్రీని విజయరూపిణిగా పూజించాలన్నదే సమాజిక సంవిధానంగా మారింది. 

మౌలికంగా వ్యవసాయ దేశం మనది కనుక, వర్షాన్ని, అందుకు కారణంగా భావిస్తున్న వరుణ దేవుణ్ని పూజించడం సంస్కృతిలోని భాగం. శ్రావణ మాసంలో వచ్చే తొలకరిజల్లులతో ప్రారంభమై ఆశ్వయుజం తొలినాటి వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తటాకాలు, నదులు జలకళతో అలరారుతూ  పైరులు చేతికందొచ్చే స్థితి లో ఉంటాయి. ఆకాశంలో మేఘాలు తగ్గుతూ నిర్మలంగా ఉంటుంది. భాధ్రపద అమావాస్య గడచి ఆశ్వయుజ పాడ్యమి మంచి శుక్ల పక్షం ప్రారంభమవుతుంది. వినీల ఆకాశంలో చిరువెన్నెల నిండు వెన్నెలగా మారే పక్షం రోజులను పవిత్రమైనవిగా భావించి ఆశ్వయుజ పాడ్యమి నుంచి శక్తిని ఆరాధించిడం భారతీయుల ఆచారం. ఈ ఆరాధనలు ఆశ్వయుజ దశమి వరకు కొనసాగుతాయి. దేవిత్రిరాత్రి వ్రతం, దుర్గాష్టమి, మహర్నవమి పర్వదినాల పదిరోజులను దశరాత్రులు అంటారు. ఈ దశరాత్రుల పండగే దసరా! ఈ సమయంలో శరత్‌చంద్రుడు పండు వెన్నెలను వెదజల్లుతూంటాడు. అందుకే ఈ నవరాత్రులను శరత్‌నవరాత్రులని కూడా అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవిని పూజించి శక్తిగా ఆరాధిస్తారు. నవరాత్రుల చివరి రోజు విజయ దశమి పర్వదినాన్ని దసరా అని వ్యవహరిస్తారు. 

సామాన్యులు కాక శాక్తేయులు, యోగులు కూడా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వామాచారా విధానంలో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఒక్కరోజు ఒక్కో అలంకారంగా ఆరాధిస్తారు. తొలిరోజు దుర్గ, విదియరోజు బాలాత్రిపుర సుందరి, అదేరోజు సాయంత్రం గాయత్రి తదియ రోజు అన్నపూర్ణ, చవితిరోజు కాత్యాయనీదేవి, పంచమి రోజు లలిత త్రిపుర సుందరి, షష్టిన మహాలక్ష్మి, సప్తమిరోజు మహిషామర్దిని, దశమిరోజు 

శ్రీ రాజ రాజేశ్వరీ దేవి అలంకరణలతో పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇతర రూపాలతో పూజించడం ఆచారంగా వస్తోంది. దశమిరోజే దసరా పండగను ఘనంగా జరుపుకొంటారు.

తెలంగాణ ప్రాంతంలో మహాలయ అమావాస్య నుంచి సప్తమి వరకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మహాశక్తిని బతుకమ్మ పేరుతో ప్రకృతిలో వికసించిన గ్రామీణ ప్రాంతపు పూలతో అలంకరించి స్త్రీలు పండుగే చేసుకొంటారు. ఇదొక మహాద్భుతమైన సంస్కృతికి ప్రతి రూపం. ఆశ్వీయుజ శుద్ధ దశమిరోజే శ్రీరామ చంద్రుడు రావణుణ్ని వధించాడన్నది కొందరి అభిప్రాయం. పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టు పై తమ ఆయుధాలను దాచి అజ్ఞాతవాసం తరవాత విజయదశమి రోజే తిరిగి తమ అస్త్రాలను స్వీకరించారన్నది మహాభారతంలోని విరాటపర్వంలో ఉంది. మహిషాసురుడనే రాక్షసుడితో దుర్గాదేవి తొమ్మిది రోజులు దివారాత్రులు యుద్ధం చేసి విజయదశమి రోజు విజయం సాదించిందని దేవపురాణం చెబుతోంది. ఈ తొమ్మిది రోజుల్లో వివిధ దేవుళ్ల వేషాలు వేస్తూ వీధి బడుల్లో చదువు కొనే విద్యార్థులు అయ్యవారి¿ చాలు  అయిదు వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్ప్పు బెల్లాలు అంటూ ఇల్లిల్లూ ఉపాధ్యాయుని యుక్తంగా తిరిగి సందడీ చేస్తారు. నిజానికి ఆధ్యాత్మికంగా, లౌకింగా కూడా సందడి సరదాల పండుగ దసరా.

దీపావళి

        బృహదారణ్యక ఉపనిషత్తులోని మంత్రం మనిషి జ్ఞాన తృష్ణకు అద్దం పడుతుంది. అసతోమా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యం నుంచి సత్యానికి, చీకట్ల నుంచి వెలుగుల్లోకి మృత్యువు నుంచి అమృతత్వం వైపు తీసుకెళ్ల మన్నది ఈ మంత్రార్ధం. మానవుడికి చీకటి శాపం లాంటిదే. సత్యాసత్యాలకు మధ్య చీకట్లో తేడా తెలియదు. జీవనం నిర్జీవనం మధ్య భేదం తెలియదు. అందుకే ఆ ఉపనిషత్తులో దైవాన్ని ప్రార్థిస్తూ వెలుగులు ప్రసాదింమని మనిషి వేదన పడతాడు. మనిషి అవిర్భావం నుంచే వెలుగు కోసం వెంపర్లాడాడు. తిమిరంతో సమరం చేశాడు. 

చీకటి అజ్ఞానానికి, వెల్గులు జ్ఞానానికి ప్రతీకలు. జ్ఞాన సంపదకు సంకేతమే దీపావళి పండుగ. చెడును పడగొట్టి మంచికి ప్రాణం పోయడం ఈ పర్వదినంలోని అంతర్లీన  భావన. కృష్ణ పక్షంలో రాత్రిళ్లు క్రమంగా చీకట్లు పెరుగుతూ చతుర్దశి తరవాత వచ్చే అమావాస్యరోజు  రాత్రంతా భయానక చీకటి. చీకటి అనే రాక్షసుణ్ని అంటే నరకుణ్ని సంహరించి పాఢ్యమి నుంచి పండుగ చేసుకోవడం మనిషి జ్ఞాన కాంక్షకు నిదర్శనం.

నరక చతుర్దశి, దీపావళి గురించి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. మహాభారత యుద్ధాన్ని భీకరంగా నిర్వహించి దుష్టశిక్షణ చేసిన శ్రీకృష్ణుడు, నరకాసురుణ్ని సంహరించేందుకు సత్యభామను వెంట తీసుకొని వెళ్లాడు. స్త్రీల పట్ల గౌరవం, స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వాలన్న ఈ భావన పౌరాణిక ఉదంతంలో వెల్లడైంది. పురుషుడు ఎంతటి బలవంతుడైనా, ఎన్నోమార్లు పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్న నిజం నరకాసురుడి వధ సందర్భంతో తేట తెల్లమవుతుంది. మనిషిలో అంతర్గతంగా ఉన్న అజ్ఞాన్ని తొలగించి జ్ఞానం కలిగించాలనే తీవ్ర కాంక్ష దీపావళీ పండుగ వల్ల వెల్లడి అవుతుంది. 

ఈ పర్వదినం సందర్భంగా లక్ష్మిదేవిని సైతం పూరజిస్తారు. వర్షరుతువులో భూమిని దుక్కిదున్ని విత్తనాలు వేస్తారు. కార్తీక మాసం నాటికి పంటలు చేతికొచ్చే తరుణంలో ఉంటాయి. పాడి వృద్ధి చెంది పంటలతో సిరులు కలగాలని, కార్తీక పౌర్ణమి రోజు శ్రీలక్ష్మిని పూజించి కోర్కెలు కోరుతారు. మరో విశేషమేమంటే లౌకిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సిరుల కోసం మనిషి తపన దీపావళి పండుగ వల్ల వ్యక్తం అవుతుంది. దాతృత్వం, క్షమ, కారుణ్యం అనే సద్గుణాలు కలగాలంటే సహజంగా మనిషికి వెలుగుల వెల్లువ కావాలి. చీకటిలో వ్యతిరేక భావాలు కలుగుతాయి. నిశాచరత్వం ప్రస్పుటమయ్యే  ప్రమాదం ఉంది. తప్ప్పులు చేసే అవకాశాలు ఎక్కువ. అందుకే తమ సోమజ్యోతిర్గమయ అంటూ మనిషి తపనపడ్డాడు. దీపావళి పండుగ 

వెల్గుల పర్వదినం. మధుర పదార్ధాలు భుజిస్తే మాధుర్య భావాలకు కారణం అవుతాం. బాణసంచాలు కాలుస్తూ వెల్గులు అందరి ఎడదల్లో నింపాలని ప్రయత్నిస్తాం. కార్తీకం తరవాతీá వచ్చేది మార్గశిరం మాసాలలో నేనే మార్గశిరాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు. దీపావళి అనంతరం మనసుల్లో పర్యావరణంలో వెల్గులను మరింత ప్రజ్వరిల్లజేస్తూ జీవితాలను సంపూర్ణం చేసుకోవాలన్నదే పర్వదినంలో  పరమార్ధం. దీపావళి భారతీయలందరికీ ఆనందాలను ఇచ్చే పండుగ. ఆనందమే బ్రహ్మ అని అన్నారు. అలాంటి ఆనందానికి ఈ వెల్గుల దీపావళి ప్రత్యక్ష నిదర్శనం.


గాంధిజి

మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ.... ఆపేరు వినగానే అందరి హృదయాల్లో ప్రశాంతత, స్వేచ్ఛా భావాలు వికసిస్తాయి. ఎందుకంటే న్యాయం, సహనం, శాంతి, అహింసకు ఆయన ప్రతిరూపం. భారతీయులందరూ ఆయన్ని బాపూ అని గౌరవంగా సంబోధిస్తారు. జాతికంతకూ గాంధీ తండ్రితో సమానం. ఈ కర్మ భూమి పైన అలాంటి మహనీయులు ఇలా అవతరిస్తూనే ఉంటారు. వసుధైక కుటుంబంలో కలతలు, వైరాలు, వివక్షతలు, హింస నెలకొన్నప్ప్పుడు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ లాంటి యుగకర్తలు భారతదేశంలో జన్మిస్తారు. వాళ్లు తమ మాటలతో, చేష్టలతో సిద్ధాంతాలతో మానవుల్లో మంచిని, సహనాన్ని ప్రభవింపజేస్తారు. మతం కన్నా ఆ మహాత్ములకు మానవుల హితమే మిన్న. పూర్వం నుంచీ ఒకర్నొకరు గెలిచేందుకు రకరకాల ఆయుధాలను 

ఉపయోగించారు. బుద్ధుడు, గాంధి లాంటి మహానుభావులు ఆయుధాలతో కాక అహింసతో సత్యాన్ని ప్రతిబింబించే ఆగ్రహంతో ఎందరి హృదయాలనో గెలిచారు. అందుకే మోహన్‌దాస్‌కరమ్‌చంద్ గాంధీ జయంతి అక్టోబర2 ను అంతర్జాతీయ అహింసా దినంగా జూన15, 2007న ఐక్యరాజ్య సమితి ప్రకటించి గౌరవించింది.

శ్రీరామచంద్రుడిపై ఆయన తల్లి కౌసల్య ప్రభావం ఉన్నట్లు గానే గాంధీని కూడా చిన్ననాటి నుంచే తల్లి పుత్లీబాయి తన నైతిక మనోభావాలతో తీర్చిదిద్దింది. గుజరాత్‌లోని పోర్బందర్ అనే  సంస్థానానికి గాంధీ తండ్రి కరమ్‌చంద్ ప్రధానమంత్రిగా విధులు నిర్వహించినా, ఆ రాచరికపు ఛాయలు గాంధీని ప్రభావితం చేయకుండా తల్లి సామాన్యుడి గానే పెంచింది. ఆధ్యాత్మిక భావాలు గాంధీజీలో వికసించేలా చేసింది. తన చిన్నతనంలో గుజరాత్ ప్రజలు గొప్పగా ఆరాధించే జైన కవి రామచంద్ర ప్రభావం తనపై చాలా ఉండేదని గాంధీ తన ఆత్మ కథలో రాసుకొన్నాడు. మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ పెరిగి పెద్దయ్యే కొద్దీ లౌకిక విద్యలతో పాటు అలౌకిక భావాలు కూడా ఆయనలో విస్తరించసాగాయి. తన పదమÖడో యేట కస్తూరి బాయితో వివాహం, పదిహేడో యేట తండ్రి కరమ్ చంద్ మరణం లాంటి సంఘటనలు చకచకా జరిగిపోయాయి. 

గాంధీ తన పంధొమ్మిదో యేట ఉన్నత చదువుల కోసం లండన్ బయలు దేరడం ఒక మహత్తర పరిణామానికి కారణమైందనే చెప్పాలి. గౌతమ బుద్ధుడు తన భార్య యశోధరను, కొడుకు రాహులుణ్ని విడచి సత్యాన్వేషణ కోసం ప్రస్థానం సాగించినట్లే, గాంధీ కూడా తన భార్య కస్తూరిబాయి, ఆరునెలల వయస్సున్న కొడుకు హరిలాల్‌ను విడచి లండన్ వెళ్ళి న్యాయ శాస్త్రాన్ని నేర్చుకొని న్యాయాన్ని, అహింసనూ సాధన చేశాడు. ఆ తరవాత  ఆయన ఆలోచనలు సంపదకోసం కాక సమాజం ఔన్నత్యం కోసం సాగాయి. దక్షిణ ఆఫ్రిక డర్బన్‌లో ఉన్నప్ప్పుడు, భగవద్గీతతో సహా క్రైస్తవ గాస్పెల్‌నూ చదివాడు. ఈ రెండు గ్రంథాలు గాంధీకి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. శత్రువును ప్రేమించు, ఒక చెంపనే కాక మరో చెంపను చూపించు అనే భావజాలాలు గాంధీకి మార్గాన్ని నిర్దేశించాయి. ‘దేవరాజ్య నీలోనే ఉంది’ అనే టాల్‌స్టాయి రచన, థొరియా అనే సామాజిక శాస్త్రవేత్త  రాసిన శాసనోల్లంఘన అనే గ్రంథాలు గాంధీజీ ఆలోచనా సరళిని మార్చి, పరాయి పాలనలో మగ్గుతున్న భారతీయ ప్రజల స్వేచ్ఛ కోసం ఉద్యమించేలా చేశాయి.

మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ చేసిన భారత దేశ స్వాతంత్రోద్యమం గురించి ఈ రోజు చిన్న పిల్లవాణ్ని అడిగిన చెబుతాడు. ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా వాయువుల కోసం పరితపించే మానవాళికి ఆయన మార్గదర్శి. 1916లో అహ్మదాబాద్‌లోని గంగానదీ తీరాన గాంధీ ప్రారంభించిన సబర్మతీ ఆశ్రమం వార్దాలో నెలకొల్పిన సేవాగ్రామం నేడు దర్శనీయ స్థలాలుగా మారాయి.  సత్యాగ్రహం గురించి తెలియని ప్రపంచానికి శాంతియుత ఆవేశం ఎంతటి భీకరమైన ఆయుధమో తెలిపాడు. శ్రీరామ చంద్రుణ్ని మనం మనసులో పెట్టుకొని పూజిస్తాం. శ్రీకృష్ణుడి భగవద్గీతతో స్ఫూర్తి పొందుతున్నాం, మోహన్‌దాస్‌కరమ్ చంద్ గాంధీ కూడా ఇలా తరతరాల వారి హృదయాల్లో పూజనీయుడిగా ఆరాధ్యనీయుడిగా మÖర్తిభవించి ఉంటాడు. 

కంటిపాప.....

    చంద్రశేఖర్ చాలా బిజీగా ఉన్నాడు. అర్జంటుగా పూర్తిచేసి పంపించవలసిన ఫైల్సు నాలుగు ఉన్నాయి. పై ఆఫీసర్ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. పన్నెండు గంటలకు మీటింగ్ ఉంది. ఈలోగా నోట్ తయారు చేయాలి.

అటెండర్ ఒక కవరు తెచ్చి అతనిముందు పెట్టాడు. అది ఆఫీసుకు సంబంధించినది కాదని దాన్ని చూడగానే తెల్సిపోతోంది. ఆఫీసుకు పర్సనల్ లెటర్స్ రావు. అందుచేత కొంచెం ఆశ్చర్యపోతూ కవరు చించి లోపలి లెటర్ తీసి చూశాడు. గులాబీ రంగు  ఉలిపిరి కాగితం మీది పరిమళం గుప్పుమంది. ముత్యాల్లాంటి అక్షరాల వెంట చంద్రశేఖర్ చూపులు పరుగులు తీశాయి.

“ప్రియమైన చంద్రశేఖర్‌గారికి...

మీకు ఎన్నో విషయాలు తెలియజేయాలని కాగితం కలం తీసుకుంటే, ఎందుకనో కలం ముందుకు సాగటంలేదు. కళ్లు మÖసినా, తెరిచినా మీ రూపమే... నా కనుపాపలో మీ రూపమే... ఎప్పుడూ మిమ్మల్ని చూడాలనీ, వెన్నెల రాత్రుల్లో సముద్రపు ఒడ్డున మీతో చెట్టాపట్టాలు వేసుకుని నడవాలనీ, మీ మౌన రాగాలాపనలే విని తరించాలనీ అనుక్షణం అనిపిస్తుంంది. ఈ హృదయ స్పందన మీకు తెలియజేయాలని కాగితం తీసుకుంటే కలం ముందుకు సాగనని మొరాయిస్తుంది... అందుచేత ప్రస్తుతానికి ఇంతటితో సెలవు తీసుకుంటాను...మళ్లీ రేపో, ఎల్లుండో, వారానికో, నెలకో, ఆరునెలలకో... ఎప్పుడో వీలు చిక్కినపుడు హృదయవేదనా నివేదనను చేసుకుంటాను... అక్షర సుమమాలతో... అంతవరకూ ఉండనా మరి... 

పాప...మీ కంటిపాప”.

ఆ ఉత్తరం చదివి చంద్రశేఖర్ మెదడు కొద్ది సేపు పనిచేయటం మానేసింది. ఎవరీ పాప? ఈ పేరుగల వాళ్లు ఎవరూ తనకు తెలియదు. తనెవరో తెలియకుండా ఈ ప్రేమలేఖ ఎలా రాస్తుంది? పైగా చాలా సన్నిహితంగా తెల్సిన మనిషిలా రాస్తోంది.

ఫోన్ బజ్జర్ మోగింది. ఆఫీసర్ అడుగుతున్నాడు ఫైలు గురించి. నోట్ రాసి తీసుకెళ్లాడు. ఆయన చదివి విసుక్కున్నాడు.

“ఏమిటయ్యా ఇది? నేను చెప్పిందేమిటి? నువు రాసిందేమిటి?”

“సారీ సర్...మళ్లీ రాసుకొస్తాను...”

“టైం ఎక్కడుంది?” అంటూ చిరాకుపడ్డాడు.

ఆయనే తంటాలు పడి నోట్ తయారుచేసుకున్నాడు. మీటింగ్‌కు తనతో రమ్మన్నాడు. కారులో వెళ్తున్నంతసేపూ అతని దృష్టి అంతా ఆ లెటర్ మీదే ఉంది. చేతితో జేబులోని లెటర్‌ను తడుముకుంటున్నాడు. ఉండబట్టలేక కవరు తీసి మరోసారి చదువుకున్నాడు. “ఏమిటది?” అని అడిగాడు వెనక సీట్లో కూర్చున్న ఆఫీసర్.

“హృదయ వేదనా నివేదన...” అన్నాడు అసంకల్పితంగా.

“ఏమిటి?” అన్నాడయన విస్తుపోతూ.

“పాప... మీ కంటిపాప...” అన్నాడు నిద్రలో కలవరిస్తున్నవాడిలాగా. ఆయనకు అంతా ఆయోమయంగా అనిపించి ఊరుకున్నాడు.

ఒక పక్క మీటింగ్ జరుగుతోంది. అతను చేత్తో ప్రేమగా జేబులోని ఆ లెటర్‌ను తడుముకుంటున్నాడు. మీటింగ్ అయిపోయింది. కారు దగ్గరకొచ్చారు... మళ్లీ లెటర్ తీసి చూసుకున్నాడు.

“వాటీజిట్?” అని అడిగాడాయన.

“ఏం లేదు సర్...” అన్నాడు కవరు జేబులో పెట్టుకుంటూ.

కారులో వస్తున్నంత సేపు ‘ఎవరీ పాప?’ అనే ఆలోచిస్తున్నాడు. కాని ఎవరై ఉంటారో ఎంతకీ తోచటం లేదు. ఆవేళంతా ఊహల పల్లకీ మీద విహరిస్తున్నాడు. కలల అలలమీద తేలియాడుతున్నాడు.

ఇంటికొచ్చాడు. భార్య రోజా కాఫీ అందించింది. ఇవాళ ఎందుకో అతనికి సరదాగా ఉంది.

“ఏదైనా స్టార్ హÃటల్‌లో భోంచేద్దాం. ఇవాళ వంట చేయకు...” అన్నాడు.

“ఆ స్టార్ హÃటల్స్ కన్నా బ్రహ్మాండంగా నేను వంటలు తయారు చేస్తాను. ఏం కావాలో చెప్పండి...” అన్నది రోజా.

“అది కాదు. జస్ట్ అలా సరదాగా తిరిగొద్దామని...” అన్నాడు చంద్రశేఖర్ . ఇంకా ఊహలపల్లకీ మీద నుంచి దిగలేదు.

“ఇవాళ నాని గాడికి హÃమ్ వర్క్ చేసిపెట్టాలి. ఇప్పుడు కుదరదు...” అన్నది రోజా పసిపిల్లకు పాలు ఇస్తూ.

చంద్రశేఖర్ నిట్టూర్చాడు “నానిగాడికి పాఠాలు చెప్పాలి. బుజ్జిముండకు పాలు పట్టాలి. వంట చేయాలి. అంట్ల గిన్నెలు తోముకోవాలి. ఇల్లుకడిగి ముగ్గులు పెట్టుకోవాటం ఇదే దీనిలోకం. ఒక సరదా లేదు. సంతోషం లేదు. అందరూ ఎంచక్కా సినిమాలకూ, షికార్లకూ, పిక్నిక్‌లకు వెళ్తారు. కానీ రోజా మాత్రం పెళ్లి అయిన అయిదేళ్లకే ఇద్దరు పిల్లలు పుట్టేటప్పటికే మానసికంగా ముసలిదైపోయింది. ఇల్లూ, పిల్లలూ, వాళ్ల బాగోగులు... అంతకు మించి ప్రపంచంలో ఇంకేమిలేనట్లు ` అస్తమానం అవే విషయాలు మాట్లాడుతుంది.

చంద్రశేఖర్ నిట్టూర్చాడు. రాత్రి నిద్రపట్టలేదు. జేబులో లెటర్ అలాగే ఉండిపోయింది. రేపు కర్మజాలక అది రోజా కంటపడితే గొడవైపోతుంది. ఆ ఆలోచనరాగానే లేచి లైటువేసి జేబులోని లెటర్ తీసి పుస్తకాల మధ్యలో దాచేశాడు. లైటు వేసినందువల్ల రోజాకు నిద్రాభంగమైంది.

“ఏంటి లేచారు?” అని అడిగింది కళ్లు చికిలించి చూస్తూ.

“పాప.... కంటిపాప... నిద్దర రావటం లేదు... అలా కాసేపు డాబా మీద వెన్నెల్లో కూర్చుందాం...రా...” అన్నాడు.

“మీకేం... పనా పాటా? రోజంతా గొడ్డులా చాకిరీ చేసి అలసిపోయాను. కళ్లు కూరుకుపోతున్నాయి...” అన్నది రోజా పక్కన పడుకున్న పసిపిల్ల ఒంటిమీద గుడ్డ సవరించి, పిల్లమీద చెయ్యివేసి పడుకుంది.

వారం రోజుల తరువాత చంద్రశేఖర్‌కు మరో ఉత్తరం వచ్చింది. ఆత్రంగా విప్పాడు. అదే గులాబిరంగు కాగితం...అదే పరిమళ భరితం...

“ప్రియాతి ప్రియమైన చంద్రానికి...

చంద్రశేఖర్‌గారూ అంటే ఎవరో పరాయివాళ్లను పిల్చినట్లు ఉంటుంది. అందుకని చంద్రం అనే పిలుస్తాను. కిందటి ఉత్తరం రాసి వారం రోజులు అయింది. ఈ వారం రోజుల వ్యవధీ నాకు క్షణమొక యుగంలా అయింది. నాకు సదా నీ ధ్యాసే. నీ గురించి తల్చుకుంటుంటే ఏవో అందమైన ఊహలు కళ్లముందు మెదులుతాయి. నీ కోసం వెతుకుతూ నేను కొండల్లో లోయల్లో తిరుగుతున్నట్లు... తెల్లని మంచుకొండలమీద నీ కాలిగుర్తుల వెంట నడుస్తూ, లోయల్లోనుంచి వినిపించే నీ పిలుపు కోసం పరితపిస్తూ ఎక్కడెక్కడో తిరుగుతున్నట్లు...ఏ నీలి నీటి సరస్సుల ఒడ్డునో, ఏ పారిజాత వృక్షాల నీడల్లోనో నీవు నేనై, నేను నీవై...నెరవేరేనా ఈ ఆశ? నిజమైన ప్రేమ ఎప్పుడూ సుఖాంతమే నంటారు. అసలు అంతమే కాదనీ” అంటారు. ఒక్కోసారి పరిస్థితుల సంకెళ్లు తెంచుకుని పరుగెత్తుకుని నీ దగ్గరకు రావాలని ఉంటుంది. కానీ రాలేను. ఏంచేతనంటే, మనం మన కోసం బతకటంలేదు. చుట్టూ ఉన్నవాళ్ల కోసం బతుకుతున్నాం. ఏమేమో రాస్తున్నాను కదూ. ప్రేమమైకంలోనూ తాగిన మైకంలోనూ ఉన్నవాళ్లు మాట్లాడేది ఆసందర్భపు ప్రేలాపనగానే ఉంటుంది.

త్వరలోనే మనం కల్సుకోబోయే మధురమైన ఘడియల కోసం ఎదురుచూస్తూ... పాప... నీ... కంటిపాప”.

రెండో ఉత్తరం వచ్చినప్పటినుంచీ అతని అన్వేషణ ఎక్కువ అయింది. తనకు ప్రేమలేఖ రాసింది. ఎవరై ఉంటారో ఊహించసాగాడు. బస్ స్టాప్‌లో కనిపించి నవ్వుతుంది. ఆమె... అయి ఉంటుందా? ఆమెకు తన పేరూ, ఆడ్రసూ ఎలా తెలుసు? తన ఆఫీసు బిల్డింగ్‌లో అయిదో అంతస్తులో నుంచి వస్తూ లిఫ్ట్‌లో కనిపించినప్పుడల్లా చొరవగా మాట్లాడుతుంది... ఆమె అయి ఉంటుందా?

స్నేహితుడి ఇంట్లో పార్టీకి వెళ్లినప్పుడు చిన్నప్పటి ఫ్రెండ్ కనిపించి పలకరింపుగా నవ్వింది... ఆమె అయి ఉంటుందా?

రెండు నెలల కిందట తన ఆఫీసులో ఏదోపని ఉందంటూ వచ్చి వారం రోజులు తన చుట్టూ తిరిగి వెళ్లింది... ఆమె అయి ఉంటుందా?

అందరి మీదా అనుమానం... కనిపించిన వాళ్లందరినీ అదే దృష్టితో చూస్తున్నాడు. వాళ్ల దగ్గర నుంచీ వచ్చే రెస్పాన్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

బస్టాప్‌లో నిలబడ్డాడు. ఆమె వచ్చింది. దగ్గరగా వెళ్లాడు. పలకరించాలనుకున్నాడు. బస్ వచ్చింది. ఆమె బస్ ఎక్కింది. అతనూ అదే బస్ ఎక్కాడు. అరగంట తరువాత ఆమె దిగిన స్టాప్‌లోనే దిగాడు. ఆమె పక్కనే నడుస్తూ పలకరించాడు.

“ఈ మధ్య కనిపించటం లేదు...”

“రోజూ మీకు కనిపించాలని రూలు ఏమన్నా ఉందా?”

“అది కాదు పాపా. ఇదివరకు రోజూ కనిపించేవారు కదా?”

“నాపేరు పాప కాదు... మేం ఇల్లు మారుతున్నాం. ఫస్టు నుంచీ అసలు కనిపించను” అన్నదామె.

చంద్రశేఖర్ నిట్టూర్చాడు. రూట్ మార్చాడు. కనుక ఆ లెటర్ రాసింది ఈ పాప కాదన్న విషయం రుజువైంది.

ఆఫీసులో లిఫ్ట్ దగ్గర ఆమె కనిపించింది. అతను నవ్వాడు. ఆమె నవ్వింది. “ ఆర్ యÖ లేట్? అని అడిగాడు.

“లేట్... బట్ నాట్ టూలేట్...” అన్నది నవ్వుతూ

“నిన్న కనిపించలేదు?”

“ఇంటి దగ్గర చిన్నపని ఉండి రాలేదు...”

“ అంటే ఇంటి దగ్గర ఏ పనీ లేకపోతే అప్పుడు ఆఫీసుకొస్తారన్నమాట... అంతేనా పాపా?”

“ పోనీ అలాగే అనుకోండి... కాని నా పేరు పాప కాదు. నాకు ఇద్దరు పాపలు...” అని నవ్వింది.

లిఫ్ట్ ఆగింది. ఆమె వెళ్లిపోయింది. పాప కోసం అతని అన్వేషణ పూర్తికాలేదు. కనిపించిన ప్రతి వాళ్లలోనూ ‘పాప’ కనిపిస్తుందేమోనని వెతుకుతున్నాడు.

విసిగిపోయి ఇంటికి వెళ్లాడు. రోజా నవ్వుతూ కాఫీ అందించింది. ఆమె నవ్వు చాలా రోటీన్‌గా ఉంది.

ఒక అరగంట తరువాత బయటకు వెళ్లొస్తానని బయల్దేరాడు.

“నానిగాడికి షూస్ కొనాలి. వాడ్ని తీసుకెళ్లండి” అన్నది రోజా.

“ఇప్పుడు కాదులే...” అన్నాడు ముభావంగా, 

“ఎక్కడికి? సినిమాకా?”

“కాదులే... సినిమాలకూ, షికార్లకూ నువు రావుకదా...” అన్నాడు చురక అంటిస్తూ.

“నాకూ సినిమాలు చూడాలనే ఉంటుంది. పసిపిల్లతో వెళ్తే చాలా ఇబ్బంది. అది ఏడుస్తుంది. అందరూ విసుక్కుంటారు...”

చంద్రశేఖర్ నిట్టూర్చాడు. బయటకు వెళ్తుంటే ‘ఎక్కడికి’ అని అడిగింది.

“ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు” అన్నాడు కటువుగా.

“తెల్సు`కానీ ఇప్పుడు మీరేమన్న పెళ్లిచూపులకు వెళ్తున్నారా?” అని అడిగింది.

“ఆవును పెళ్లిచూపులకే వెళ్లున్నాను...సరేనా?” అన్నాడు కోపంగా.

అరగంట తరువాత చంద్రశేఖర్ స్నేహితుడి ఇంటి తలుపు తట్టాడు. పక్క పోర్షన్‌లోనే తన చిన్నప్పటి ఫ్రెండ్ ఉంటోంది...

అతను వెళ్లిన సమయానికి ఫ్రెండ్ లేడు. పక్క పోర్షన్‌లోని ఆమె కనిపించి పలకరించింది.

“బాగున్నావా చంద్రం?” అన్నది.

“బాగున్నాను. నువ్వు?”

“నేను బాగున్నానో లేదో నువ్వు చెప్పాలి...” అన్నది నవ్వేస్తూ.

“నీలో చిలిపితనం పోలేదు...”

“నిన్ను చూస్తే చిన్నతనం గుర్తొచ్చి చిన్నపిల్లను అయిపోయాను...”

“ఈ మధ్య మన ఊరు వెళ్ళావా, పాపా?”

“వెళ్లలేదు... కానీ ఆ కొత్త పిలుపేమిటి? నేను నీకు పాపలాగా కనిపిస్తున్నానా?”

“పాపగా ఉన్న రోజుల్లో పాపా అని పిలవటానికి నీకు నోరు రాలేదు. ఇప్పుడా అలా పిలవటం?” అన్నది. అందులో మందలింపు ఉంది.

అయితే తను వెతుకుతున్న పాప ఆమె కాదని తెల్సిపోయింది. వారం రోజుల తరువాత మరో ఉత్తరం వచ్చింది.

“డియర్ చంద్రం...

నీ ఆన్వేషణ పూర్తి కాలేదనుకుంటాను. జీవితంలో చాలామంది కనిపిస్తారు. చాలా దగ్గరగా వస్తారు. కానీ వాళ్లెవరూ నీ కంటిపాపలు కాలేరు. మనకు ఎప్పుడు, ఎక్కడ వివాహం అయిందీ గుర్తుంటుంది. ఆల్బమ్ తిరగేసి గుర్తుచేసుకుంటుంటాం. కానీ ఎందుకు వివాహం చేసుకున్నదీ గుర్తుండదు. జీవిత భాగస్వామిగా, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ కల్సి జీవిస్తాం అని పెళ్లినాడు ప్రమాణాలు చేస్తారు. నాలుగయిదేళ్లు గడిచేటప్పటికి, ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టేటప్పటకి, భార్యకు ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం అయిపోతుంది. భార్యగా కన్నా తల్లిగా ఎక్కువ బాధ్యతలు ఆమెను చుట్టుముట్టేస్తాయి. స్త్రీ చేతికి పసిబిడ్డను ఇస్తే చాలు, ఆమె ప్రపంచాన్నే మర్చిపోతుంది. కానీ మగవాడు అలాకాదు. భార్యకు ఇద్దరు ముగ్గురు బిడ్డలను అందించిన తరువాత కూడా తరగని చెరగని అందాలకోసం ఆరాటపడతాడు. భార్య భార్యగా కనిపించదు. తన పిల్లలకు తల్లిగా మాత్రమే కనిపిస్తుంది. ఇంక రోమాంటిక్‌గా కనిపించే మరో హిరోయిన్ కోసం ఆన్వేషణ మొదలు పెడతాడు. నీ ఆన్వేషణ ఇలా ఇంక ఎంతోసేపు కొనసాగదు. త్వరలోనే నీకు కనిపిస్తాను...

పాప... నీ కంటిపాప...”

ఆ ఉత్తరం చదివాక పాలపొంగు మీద నీళ్లు చల్లినట్లు అనిపించింది. ఈ వ్యవహారం ఏమిటో అర్థం కాలేదు.

సాయంత్రం ఇంటికి వెళ్లేప్పటికి అది తన ఇల్లేనా అన్న సందేహం వచ్చింది.

రోజా చాలా అందంగా ముస్తాబైంది. స్లీవ్‌లెస్ జాకెట్‌లో సిల్క్‌చీరలో, బ్యూటీపార్లర్ తెచ్చిన సరికొత్త అందంలో వింతగా కనిపించింది.

“ఇవాళ ఏమిటీ స్పెషల్?”

“మన మేరేజ్ డే...”

“పిల్లలు ఏరి?”

“మా వాళ్లింట్లో వదిలిపెట్టాను. త్వరగా స్నానం చేసి రండి. సినిమాకు వెళ్లి, హÃటల్లో భోంచేసి... డబ్బుంటే హÃటల్లోనే రూం బుక్ చేసి...”

“ఏమిటి చాలా జోరు మీద ఉన్నావు?”

“జోరు నాది కాదు మీది...” అన్నది నవ్వుతూ

చంద్రం రోజా వైపు చూశాడు. అతని కళ్లల్లో ఆమె పాప కనిపించింది.

వెన్నెలొచ్చింది....

వెన్నెల ఆ రోజు ఆఫీసుకు వెళ్ళేటప్పటికి`తమ కార్పోరేషన్‌కు కొత్త చైర్మన్ వస్తున్నారన్న విషయం తెల్సింది.

ఒక గంట తరువాత ఆయన గురించిన మరి కొన్ని వివరాలూ మోసుకొచ్చారు స్టాఫ్. కొత్త చైర్మన్ పేరు సూర్యప్రకాష్. యువకుడు. రాజకీయాల్లో పైకి వస్తున్న యువకెరటం. బాగా పలుకుబడి గల వ్యక్తి. మనిషి చాలా మంచివాడు. ఎవరేది అడిగినా ‘కాదు, లేదు’ అనకుండా ఇచ్చేసే దానకర్ణుడు.

వెన్నెల ఆ కార్పోరేషన్‌లో బాద్యతయుతమైన పదవిలో ఉంది. పరిపాలనా సంబంధమైన విషయాలు చూడవల్సిన డ్యూటీ ఆమెదే. ఆరు నెలల నుంచి చైర్మన్ పదవిలో ఎవరూ లేనందువల్ల ఆ రూం తాళం వేసి ఉంది. ఇప్ప్పుడు రూం తెరిపించి సోఫాలు, కార్పెట్స్, కర్టెన్స్ దగ్గర నుంచీ అన్నీ కొత్తవి తెప్పించి, ఈ గది అందాలను ఇనుమడింప చేసింది. ఇన్‌డోర్ ప్లాంట్స్ పెట్టించింది. కారు దగ్గర నుంచి కాఫీ కప్పులదాకా సిద్ధంగా ఉంచింది.

సూర్య ప్రకాష్ ఇల్లు ఎక్కడో తెల్సుకుని, పుష్పగుచ్ఛాలతో ఆయన ఇంటి ముందు కారు దిగింది. బయట లాన్‌లో ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. వెన్నెల లోపలికి వెళ్లేప్పటికి హాల్లో ప్రముఖులు కూర్చుని తేనీరు సేవిస్తున్నారు. అందరి మధ్యా ఉన్న సూర్యప్రకాష్ ఒక పక్క ఫోన్‌లో మాట్లాడుతూ, మరో పక్క చిరునవ్వులతోను, క్రీగంటి చూపులతోను అందరినీ పలకరిస్తున్నారు.

వెన్నెల ఆయన దగ్గరకు వెళఙ్ల పూలగుచ్చం ఇచ్చి తనను తాను పరిచయం చేసుకోబోయింది.

“నేను...”

“వెన్నెల... ఈ కార్పోరేషన్‌కే  వెన్నెల వెలుగు కావాలి మీరు...” అన్నాడు సూర్యప్రకాష్. ఆది పొగడ్తో, వ్యంగ్య బాణమో తెలియక ఆమె ఇబ్బంది పడుతుంటే పక్కనే ఉన్న మరెవరో అన్నారు.

“మీరు సూర్యప్రకాష్ అయితే, మీ సెక్రటరీ వెన్నెల వెలుగు అన్న మాట... భేష్ బావుంది...”

ఈ మాటలు ఎప్పుడో ఎక్కడో విన్నట్లుగా ఉంది`గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తుండగానే సూర్యప్రకాష్ అన్నాడు.

“నన్ను గుర్తుపట్టలేదా? కాలేజీలో మనం క్లాస్‌మేట్స్...”

“ అయితే మీరు ఓల్డ్ ఫ్రెండ్స్ అన్నమాట...” అన్నాడు అక్కడున్న మరో వ్యక్తి.

“ఫ్రెండ్స్ అంటే మేం ఫ్రెండ్స్ కాదు... కానీ క్లాస్‌మేట్స్ అని మాత్రం చెప్పగలను...” అన్నాడు సూర్యప్రకాష్ నవ్వుతూ “మీరు ఏది కాదనీ అనరు... అవుననీ అనరు... అందుకే రాజకీయాల్లో పైకి రాగలుగుతున్నారు...” అన్నారు మరోకరు సూర్యప్రకాష్ వెన్నెల వంక తిరిగి... “మళ్లీ మనం ఇలా కల్సుకోవటం చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది... అన్నాడు. వెన్నెల ముఖం మీద నవ్వు వెలా తెలా పోయింది. ఆయన దగ్గర సెలవు తీసుకుంది.

వెన్నెల రోబోయే చైర్మన్‌కు పాత ఫ్రెండ్ అన్న విషయం అప్పుడే ఆఫీసులో గుప్పుమంది. కొందరు ఆమెను అభినందిస్తుంటే, మరికొందరు ఆరాధనా భావంతో చూస్తున్నారు. మరికొంత మంది చనువుగా వచ్చి తమ కోరికలు వెలిబుచ్చి ఆమె సహాయం కోరుతున్నారు. కొన్నాళ్లుపాటు ఇంక ఆఫీసులో వెన్నెలది ఆడింది ఆట పాడింది పాట అవుతుందని అందరూ అనుకుంటున్నారు కానీ`వెన్నెల మాత్రం అలా అనుకోవడం లేదు. ఆమెకు గతం అంతా కళ్లముందు కదులుతోంది...

కాలేజీలో చదివే రోజుల్లో ఈ సూర్యప్రకాష్ పెద్ద హీరోలా తిరిగేవాడు. చదువు మీద శ్రద్ధ లేదు. పరీక్షలో కాపీ కొట్టి , ఏదోవిధంగా గట్టెక్కడమే ధ్యేయంగా పెట్టుకునేవాడు. అతని దృష్టి వెన్నెలమీద పడింది. ఆమెను ఆకర్షించేందుకు పడరానిపాట్లు పడ్డాడు. ఆమె ఇష్టాయిష్టాలు ఏమిటో కనుక్కుని ఆమేరకు నడుచుకున్నాడు. అయినా ఆమె నుంచి రెస్పాన్స్ లేదు. దారికాచి ఆమెతో మాటలు కలిపాడు. ఆమె పట్టించుకోలేదు. ప్రేమలేఖలు రాశాడు. వాటిని చించిపారేసింది. ఆమెతో అన్నాడు “ ఎవరైనా ప్రేమలేఖ రాశారంటే, అందులో కొత్తగా చేప్పేదేం ఉండదు. అలా ఏమీలేని దాన్ని కొత్తగా చెప్పటంలో ఎంతో ఆనందం ఉంటుంది.”

“ప్రేమ అనేది ఒక మాససిక ఉన్మాదంలాంటిది. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏవో పిచ్చిపనులు చేస్తారు. వాటి గురించి నేను పట్టించుకోను...” అన్నది.

“అతను ఆమెమీద ఆశ వదులుకోలేదు. పదేపదే వెంటపడుతుంటే తనను మర్చిపొమ్మని చెబుతూనే ఉంది. “ఒక మనిషిని ప్రేమించాలంటే అతని గుణగుణాలు నచ్చాలి. అతని నడవడికని మెచ్చాలి. ఇలా వెంటపడి వేధించుకు తింటే ప్రేమ కలగదు` అసహ్యం వేస్తుంది...” అన్నది ఆమె.

“ప్రేమించటం, ప్రేమింప చేసుకోవటం అదొక అందమైన కల. ఆ కల నిజం కావాలని కోరుకోవటం అత్యాశ కాదు...” అన్నాడు. ప్రేమలోను, యుద్ధంలోను విజయం సాధించేందుకు ఎవరి మార్గాలు వారికి ఉంటాయి. అతని మార్గం ఆమెకు నచ్చనంతమాత్రన నిరుత్సాహపడకూడదని అనుకున్నాడు. ఒకసారి అందరిలోనూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు. “దీన్ని ఏమంటారో తెల్సా? పాణిగ్రహణం అంటారు” అన్నాడు సీరియస్‌గా.

ఆమె అతని చెంప పగలకొట్టింది “దీన్ని ఏమంటారో కూడా తెల్సుకో” అన్నది.

కొద్ది రోజులు ఆమె కాలేజీకి వెళ్లలేదు. ఒక ఆకతాయి వెధవకి భయపడి చదువు మానుకోవటంలో అర్థం లేదని మళ్లి క్లాస్‌కు హాజరుకావటం మొదలెట్టింది. ఇంక వెన్నెల కాలేజీకి రాదేమో అనుకున్న సూర్యప్రకాష్‌కు క్లాస్‌లో ఆమె కనిపించగానే బోలెడంత ధైర్యం వచ్చింది.

“ప్రేమికుల మధ్య వచ్చే కలహం కత్తితో నీటిని నరకటం లాంటిది. ఆ నీరు మళ్లీ ఒకటిగా కల్సిపోతూనే ఉంటుంది. అలాగే మనం కూడా...” అన్నాడు.

“నేను నీ పిచ్చివేషాలకు భయపడి చదువు మానెయ్యదల్చుకోలేదు. ఇంతవరకూ చేసిన తప్పులన్నీ క్షమిస్తూ వచ్చాను. ఇకనైనా బుద్ధి తెచ్చుకోకపోతే, జీవితంలో నువ్వు మర్చిపోలేని శిక్ష పడుతుంది” అన్నది.

“నువ్వు నిజంగా నన్ను శిక్షించాలనుకుంటే, నన్ను పెళ్లి చేసుకో. అటు నువ్వు శిక్షించినట్లూ ఉంటుంది. ఇటు నా కోరిక  తీరినట్లూ ఉంటుంది.” అన్నాడు అతని అల్లరి మితిమీరిపోయింది. ఆమెకు సహనం చచ్చిపోయింది.

ఒక బంధువు దగ్గరకెళ్ళి విషయం అంతా చెప్పింది. ఆయన కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడాడు. ప్రిన్సిపాల్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు. ప్రిన్సిపాల్‌కు కంప్లయింట్ ఇచ్చినందుకు అతనికి కోపం వచ్చింది. ఎలా పగతీర్చుకోవాలా అని ఆలోచించి, ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ప్రిన్సిపాల్ డిబార్ చేశాడు. మళ్ళీ ఎక్కడా చదువుకునే వీల్లేకుండా చేశాడు. తరువాత కొద్ది నెలలకే వెన్నెల ఆ ఊరినుంచి బయటపడటంతో ఆ కథ అంతటితో ముగిసింది. క్రమంగా ఆమె స్మృతిపథం నుంచీ అతను చెరిగిపోయాడు.

ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ ఇలా ప్రత్యక్షమయ్యాడు. సూర్యప్రకాష్ ఎలాంటివాడో వెన్నెలకు తెల్సు కక్ష తీర్చుకోకుండా వదిలిపెట్టడు. ఇప్పుడు అతని రూపంలో బలమైన సర్పం కనిపిస్తోంది. ఆ సర్పం తనని మింగేస్తుంది. వెళ్ళిపోవటం నయం`అనుకుంది వెన్నెల.

సూర్యప్రకాష్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. స్టాఫ్ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మీటింగ్ పెట్టారు. అయన్ను ఆకాశానికి ఎత్తారు. వేనోళ్ళ పొగిడారు. సూర్యప్రకాష్ ఆఫీసు అంతా తిరిగి అందరి పేర్లూ తెల్సుకున్నాడు. ఆయన సీట్లో కూర్చోని వెన్నెలను పిల్చాడు. ఆమె తన రాజీనామా కాగితాన్ని ఆయన ముందు పెట్టింది.

“ఎందుకు రిజైన్ చేస్తున్నావు” అని అడిగాడు సూర్యప్రకాష్

“వ్యక్తిగత కారణాలవల్ల...”

“ఏమిటవి?”

“అవి మీకు అనవసరం...”

“సరే... ఈ రాజీనామాను డైరెక్టర్సు మీటింగ్‌లో ఆమోదించాలి. నీ స్థానంలో మరొకరిని వేయాల్సి ఉంటుంది. అంతవరకూ నువ్యు కంటిన్యూ కావాలి” అన్నాడు సూర్యప్రకాష్.

ఆమె మాట్లాడలేదు. మర్నాడు ఆఫీసుకు రాగానే సూర్యప్రకాష్ వెన్నెలను పిలిచాడు. “రెండు మÖడు యÖనిట్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. అందుకు కారణాలు ఏమిటో గుర్తించి, నష్టాలనుంచి బయటపడటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తగిన సూచనలు ఇస్తూ ఒక రిపోర్ట్ వారంరోజుల్లో తయారుచేసి ఇవ్వు” అన్నాడు.

“అది నా డ్యూటీ కాదు...” అని స్పష్టంగా చెపిం్పందామె. 

“నేను ఈ కార్పోరేషన్‌కు చైర్మన్‌ను. ఇందులో ఉన్న వాళ్ళంతా నేను ఏ పనిచెబితే ఆది చేయాలి...” అన్నాడు.

వెన్నెల ఆయన రూం నుంచి బయటకు వచ్చింది. ఆ కార్పొరేషన్‌లో జరిగే అవకతవకలన్నీ ఆమెకు తెల్సు. వాటిని నివారించాటానికి ఏం చేయాలో కూడా తెల్సు. ఆ రిపోర్టు తయారుచేయటం ఆమెకు కష్టమైన పనేమికాదు. కాకపోతే తనకు సంబంధంలేని పని. తనచేత చేయిస్తున్నాడు. పైవాళ్ళు కిందవాళ్ళను వేధించుకుతినే పద్ధతిలో ఇదోకటి`అనుకుంది వెన్నెల అయినా తనేమిటో తన సామర్థ్యం ఏమిటో అతనికి తెలియజెప్పినట్లూ ఉంటుందని నాలుగురోజుల్లోనే నివేదిక ఆయనకు పంపించింది.

సూర్యప్రకాష్ ఆ నివేదిక చదివిన తరువాత, ఆ కార్పొరేషన్‌కు ఆమె సేవలు ఎంత అవసరమో తెలుసుకున్నాడు. డైరెక్టర్స్ మీటింగ్‌లో ఆ రిపోర్టుపై చర్చించాక ఆమెచేసిన సూచనలు అమలు జరిపేందుకు అంగీకరించారు. వెన్నెలకు అందరిదగ్గర నుంచీ ఊహించని ప్రశంసలు లభించాయి. ఇది ఆమె కలలో కూడా ఊహించని పరిణామం. సూర్యప్రకాష్ వెన్నెలను పిల్చి అభినందనలు తెలిపినపుడు ఆమె అడిగింది “నేను రాజీనామా చేశాను. ఎప్పుడు రిలీవ్ చేస్తున్నారు?” అని

“ఆఫీసులో నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? నీకు మగవాళ్ళమీద సదభిప్రాయం లేదనుకుంటాను. ఏవైనా సమస్యలుంటే చెప్పు... వాళ్ళను మారుస్తాను...” అన్నాడు.

“మగవాళ్ళతో నెగ్గుకురావటం ఆడవాళ్ళకు ఎప్పుడూ సమస్యకాదు. మగవాడితో`ఒక్క మగవాడితో నెగ్గుకురావాల్సి వచ్చినప్పుడే సమస్యలు ఎదురవుతాయి...” అన్నది వెన్నెల.

“అర్థమైంది. బహుశా నా మీద నీకు ఇంకా కోపం పోలేదనుకుంటాను...” అన్నాడు.

“కాదు, నా మీద మీకు కోపం పోలేదని చెప్పండి. మీరు పగబడితే వదిలిపెట్టరని తెల్సు. కొన్నేళ్ల కిందట`ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలియక దెబ్బకొట్టాను. నా వల్ల మీ చదువు ఆగిపోయింది. అందుకు మీరు నన్ను ఎప్పటీకి క్షమించరని తెల్సు...” అని ఆగిపోయింది.

“నీ వల్ల నా చదువు ఆగిపోయిన మాట నిజమే. కొన్నాళ్లపాటు నీ మీద కోపం ఉన్నమాట నిజమే. చదువుకుని ఉంటే ఒక గుమాస్తాని అయి ఉండేవాడ్ని. మహా అయితే నీలాగా ఒక సెక్రటరీని కాగలిగి ఉండేవాడిని. చదువు అగిపోయినందువల్లనే రాజకీయాల్లో దిగాను. ఒకనాడు నువు అన్న మాటలు నాకు ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాయి ` ఒక మనిషిని ప్రేమించాలంటే అతని గుణగుణాలు నచ్చాలి. అతని నడవడి కని మెచ్చాలి. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల ప్రేమను, అభిమానాన్ని పొందాలి. వాళ్లందరూ మెచ్చేలా నా నడతను మార్చుకున్నాను. కనుకనే ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను... నువు పనిచేస్తున్న కార్పొరేషన్‌కే నేను రావటం కేవలం కాకతాళీయం. వచ్చీరాగానే నష్టాల్లో ఉన్న యÖనిట్స్‌ను బాగుచేసేందుకు సాయపడ్డావు. అప్పుడూ ఇప్పుడూ కూడా నువు నా అభ్యున్నతికే తోడ్పడుతున్నావు... అందుకే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను...” అన్నాడు.

వెన్నెల మౌనం వహించింది.

“నీ అనుమానాలు నాకు తెల్సు. నన్ను ఇంకా ఆనాటి సూర్యప్రకాష్‌గానే ఊహించుకుని భయపడుతున్నావు. నిన్ను వేధించుకుతిన్న వ్యక్తి ఎప్పుడో అంతరించిపోయాడు. ఇప్పుడు నీ ముందున్నది మరో వ్యక్తి... కొత్త అవతారం ఎత్తిన సూర్యప్రకాష్‌కు నీ మీద ఎనలేని కృతజ్ఞాతాభావం ఉంది. నీ రుణం ఎలా తీర్చుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నాను... ఈ ఆఫీసులో నీ పరపతిని పెంచటం కోసమే ఆ రిపోర్టు తయారుచేసే బాధ్యత నీకు అప్పగించాను...అందుకు త్వరలోనే నీకు ప్రమోషన్ వస్తుంది...ఇంత చెప్పినా ఇంకా నువు నన్ను ద్వేషిస్తూ ఉంటే, నా దగ్గర పనిచేయకూడదూ అనుకుంటే, నీ రాజీనామాను ఇప్పుడే ఆమోదిస్తాను” అన్నాడు.

ఆమె తన రాజీనామాను ఆమోదించమని కోరింది.

“ఎవరు ఏది కోరినా నేను కాదనను. అది నా పాలసీ. నాకు ప్రత్యక్ష్యంగా పరోక్షంగా ఎంతో సహాయం చేసిన నువ్వు నా నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకుంటే... నేను నీకు అడ్డు రాను...” అన్నాడు.

ఆ రోజే ఆమె రిలీవ్ అయింది.

ఆ ఆఫీసు నుంచి బయటకొస్తున్నపుడు పడగనీడ నుంచి బయటపడుతున్న ఫీలింగ్ కలిగిందామెకు. ఆ కార్పొరేషన్ డైరెక్టర్లలో ఒకరైన ఫణిభూషణరావు వారం రోజుల తరువాత వెన్నెల ఇంటికి ఫోన్ చేశాడు. వెన్నెల ఒక ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థకు మెంబర్ సెక్రటరీగా నియమితురాలైంది. ఈ ఉద్యోగం ఆమెస్థాయిని పెంచింది. ఇప్పుడామెకు ఎంతో తృప్తిగాను సంతోషంగానూ ఉంది. రెండు నెలల తర్వాత ఒక రోజు హÃటల్లో ప్రభావతి కనపడింది. ఇది వరకు వెన్నెల పనిచేసిన కార్పొరేషన్‌లో అదే పోస్ట్‌లో ఇప్పుడు ప్రభావతి పనిచేస్తోంది. అందుచేత వాళ్ల సంభాషణ అంతా సూర్యప్రకాష్ గురించే జరిగింది.

“ఆయన చాలా మంచివాడు పర్సనల్ లైఫ్ మాత్రం దారుణం అయనకూ, ఆయన భార్యకూ సరిపడదు. ఆమెకు రేస్‌లు, పేకాటలాంటి వ్యసనాలేవో ఉన్నాయట. ఈయనకు ఆమె వైఖరి నచ్చలేదు. విడిపోయారు. ఒక్కోసారి చాలా దిగాలుగా ఉంటాడు. ‘జీవితంలో కోరుకున్నది లభించలేదు. అదొక ట్రాజెడీ. లభించిన దానితో రాజీపడలేకపోతున్నాను. ఇది అంతకన్నా పెద్ద ట్రాజెడీ...’ అని అంటుంటాడు. ఆయన ఒక భగ్నప్రేమికుడనుకుంటాను. భార్య అయినా అర్థం చేసుకుని ఉంటే బావుండేది.  ఎంత మంచి పేరు సంపాందించుకున్నా, ఆయనకు మనశ్శాంతి లేదు పాపం...” అని చెప్పింది ప్రభావతి.

మరో సందర్భంలో ఫణిభూషణరావు వెన్నెలతో చెప్పాడు. “నీకు ఈ కొత్త ఉద్యోగం ఇప్పించడంలో నేను నిమిత్తమాత్రుడ్ని. అసలు నీకు ఈ పోస్టు ఇప్పించింది సూర్యప్రకాష్. నిజానికి ఈ పోస్టుకు చాలా హైలెవెలో రికమండేషన్లు వచ్చాయి. సూర్యప్రకాష్ పట్టుబట్టి, ఎవరెవర్నో కల్సుకుని తన పలుకుబడి అంతా ఉపయోగించి నీకి ఉద్యోగం ఇప్పించాడు. అతని కారణంగానే నువు రిజైన్ చేశావనీ, అందుచేత నీకు అంతకన్నా మంచి ఉద్యోగం ఇప్పించాలని పట్టుబట్టాడు. ఈ రోజుల్లో అంత సున్నితంగా ఆలోచించే వాళ్లున్నారంటే నమ్మలేకపోతున్నాను”.

ఫణిభూషణరావు మాటలు విన్న వెన్నెల కృతజ్ఞాతాభారంతో కుంగిపోయింది.

ఆ రోజు రాత్రి సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆయన బయట లాన్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. వెన్నెల వెళ్లి ఆయనకు ఎదురుగా నిలబడింది.

‘నమస్కారం’ అన్నది. కళ్లు మÖసుకుని హెడ్‌ఫోన్‌లో పాటలు వింటున్న ఆయనకు ఆమె మాటలు వినిపించలేదు. వెన్నెల ఆయన పాదాలను తాకింది. ఆయన ఉలిక్కిపడి కళ్లు తెరిచి చూశాడు. లేచి నిలబడ్డాడు. ఆమె ఆయనకు ఇదివరలో ఎన్నడూ లేనంత చేరువుగా ఉంది. ఆయన రెండు చేతులూ చాచాడు. వెన్నెల సూర్యప్రకాష్ కౌగిట్లో ఇమిడిపోయింది.

చంద్రుడు మబ్బుల చాటునుంచి బయటకొచ్చాడు.

“వెన్నెలొచ్చింది” అన్నాడు సూర్యప్రకాష్. ఆమె తలొంచుకుంది.

ఆచార్యులకు పాదాభివsదనం.....

సముద్రాల వెంకట రంగా రామానుజ చార్యులు

అచార్యావర్యులు శ్రీమాన్

శాస్త రత్నాకర ` శాస్త విద్వన్మణి

సముద్రాల వేంకటరంగ

రామానుజాచార్యుల

చరణార విందములకు

దాసనదాసుడను

ధర్మపురి శ్రీనివాసుండును

శతపత్రములతో శరణగతుడనై

అంతటి వరదాయిని “మానస

పుత్రరత్నమును బోలిన వారల

కరకమల`నయనదృక్కుల

ప్రసరింపులు స్మృతిపథం నా గ్రంథానికి

హరిచందనాలు ` వికసిత ఉషస్సులు

అంతేకాదు వారి మహాన్విత ఆశీస్సులు

నా కలానికి ` గళానికి మానస సరోవరములు

అందుకే నిరంతరంగా నేశరణాగతుడను

ఆచార్య చాతకపక్షీవలె

మంగళశాసనములకై నిరీక్షించి

నిరసించిన నా మదికి చిగురుపూతల

లేత వాయువుల ఆత్మానాభూతిగా అవరించి

సప్తజన్మముల ముక్తిఫలములు

కల్గింపచేసిన మీరు నాపై కల్గించిన

మంగళశాసనములకు జన్మజన్మలలో

మీ సేవకింతుడునైన భృత్యుడను

శ్రవణం కీర్తనం విష్ణో:

స్మరణం పాదసేవనం

ఆర్చనం వందనం దాస్యం

సౌఖ్యం ` ఆత్మనివేదనం

వీటికి గల పరమార్థంతో గ్రహించి

కామాగ్ని నుంచి జన్మిస్తున్న దేహాలు

చితాగ్నిలో భస్మమవుతున్నాయి

మరో ఆగ్నిలో మనిషి మనుగడలు

సార్థకం కలుగజేసుకొనబడుతున్నాయి

అదే జ్ఞానాగ్ని కర్మలను దహిస్తుందని

ఇదే జ్ఞాన తేజంలో ఆత్మను పరమాత్మను

పరమాత్మను గూర్చి తెలుపు ఆచార్యులను

ఆచరించాలనే మీ సాహిత్యాల పవిత్రతను

గ్రహించాను`తలంచుటకై సదా

నా అన్యదా శరణం నాస్తి త్వమేవా

శరణం మమ ` తస్మాత్ కారుణ్య

భావేనా రక్ష ` రక్ష ` ఆచార్యవర్య

నమోనమ: ` అస్మత్ గురుభ్యోనమ:

అభినందన పద్య సుమమాల

సతత సాహిత్య సేవాపరులు సౌజన్యమÖర్తులు నగు శ్రీయుత కపిలవాయి లింగమÖర్తి దంపతుల “కల్యాణవర్షపర్వ” శుభ సంర్భమున అంద జేసికొనిన అభినందన పద్య సుమమాల


తే.గీ. కపిలవాయికవీంద్ర ఆకాంక్ష దీర

బరగు కల్యాణ వర్ష పర్వంబు నాకు

హర్ష మొనగూర్చునట్టి యాహ్వాన మంది

పంపుకొను చుంటి ప్రేమను పద్యమాల


సీ. ప్రాచీన దంపతుల్ పార్వతీ పరమేశ్వ

రులు మిమ్ము నిచ్చలు రూఢి గాను

ఆశీర్వదించుచు ఆయు రారోగ్య ఐ

శ్వర్యాదు లొసగుచు సంతతమును

సంరక్ష సేయగ సమ్మోదమును బొంది

సత్పుత్ర పౌత్ర ప్రశంసనీయ

జీవితంబునను విజేతలై sTÖ విధి

కల్యాణ వత్సర గర్వ పర్వ


తే.గీ. శోభ నందుచు దివ్య ప్రభావ మలర 

భాసిలుచు నుంటి నయ్య! సౌభాగ్య గరిమ

మీకు సరియునో, లేకను, మించినది యొ,

అట్లు గాకను, కడమ వయస్సు వార

లెల్లరును, సంతసింపుచు సుల్ల మలర

బాధ్యతల నిర్వహించియు భద్రముగను

రాణ దేలుచు నుంటిరి లలిత రీతి

నయముగను లింగమÖర్తి మీనాక్షులార!

వాగ్దేవీ సేవా పరాయణా!


చం. ముదిమిని నైన మీరలును మోదముతో మురిపెంబుతో సదా

నాద స్వరూపులో యనగ నాణెముతో, రచనా విచారమున్

ఆదరముంచి బ్రోచుచును, అందరకున్ మరి యస్మదాదులన్ 

సీదయు దీర్చి నిచ్చలు సుసేవ్య మనం పులకింప జేయుడౌ

మత్తకోకిల

మÖర్తి! మీ దగు స్ఫూర్తి నేమని ముచ్చటించెద నే నికన్ 

కీర్తి కాములు సాధుమÖర్తు లొకే విధంబున జీవనం

బార్తి యన్నది లేని తీరున “ఔ” నన్గడియించి, వి

స్ఫూర్తితో మరి “పెళ్లియేడు”ను పొంగి రంగుగ జూపితౌ


ఉ. ఊహల ఊయలూపుచును ఉగ్రు డుమాసతి జంట దివ్యవై 

వాహిక పర్వమో యనగ భాసిలు మీ దగు నట్టి నేటి ఉ 

ద్వాహ సువత్సరోత్సవ శుభాసవ మెంతయు మైక మీయ సం

దేహము లేదు. శంభు డుమ, దీవన లిచ్చియు బ్రోతు రిద్ధరిన్.


శా. మాణిక్యాంబకు వేంకటాచలునికిన్ మావోన్నతిన్ సల్పగా

వాణీ జిహ్వుడు లింగమÖర్తి ఘనవిద్వాంసుడవన్యుండు, స

చ్ఛేణీ మధ్యము, దార్య సన్నుతుడు మైత్రీబంధాభిలాషా తమ

త్రాణుం, దుత్తము, దాంద్య్రసాహితికి సుత్రాముండునన్ గల్గి తాన్


మ. స్తుతిపాత్రంబగు శాస్త్రముల్, స్మృతులు, సప్తోకంబులౌ కీర్తనల్, 

కతలున్, నాటకముల్, జరిత్రములు, సత్యాస్యంబులుం, బీఠికల్

వితత వాఖ్యలు, సద్విమర్శలు కళా విన్యాస తాత్పర్యముల్, 

క్షితి తత్త్వంబు లుదాహృతిల్, హరికధల్, క్షేత్రాల మహత్యముల్


మ. శతకంబుల్, హృదయానుభూతులును, సంస్కారార్థ సద్భోధనా

తతు, లింపౌ సురమందిరాళి చరితల్, కావ్యాంతరాలంకృతీ

గత సవ్యాఖ్య విధాన సంకలనముల్, గావ్యాళియందుత్తమా

ప్రతిమాష్టోత్తర కావ్యవిఘ్నప నుతుల్ ప్రస్తావనల్ జేసి దాన్