స్వప్నసీమలో విహరించు కాని స్వప్నలే నిన్ను పాలించేలా చేసుకోకు బాగా ఆలోచించు, కాని ఆలోచించడమే ధ్యేయంగా పెట్టుకోకు, నీకు విజయం... పరాజయం ఎదురవుతాయి. నీ హృదయం నరాల స్నాయువులతో కష్ఠించాలి అప్ప్పుడే నువ్వు నీద్వేయాన్ని సమీపించగలవు. ప్రతి నిమిషం ఎంతో విలువైంది, అందులో 60 సెకండ్లు ఉన్నాయి అనే విషయం గ్రహిస్తే ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ కూడా మన తంగెడ బావుట ఎగురుతుంది. అనే కవితా పంక్తుల్లోని మర్మం ఎరిగి మసలుకుంటే విజయం సాధించడం పెద్ద కష్టం కాదు అని నిరూపించాడు మన తంగెడ టైగర్ తుమ్మల శివకుమార్.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తుమ్మల నారాయణ, అచ్చెమ్మ దంపతుల ప్రథమ సంతానం శివకుమార్, కావలసినంత భౌతిక, మానసిక బలం సమకూర్చుకొని కిక్ బాక్సింగ్‌లో సత్తా చాటాడు. కిక్ బాక్సింగ్ అంటే ఎదుటివారిని శక్తిని కొలది కోట్టే విద్యే అనుకుంటాం కాని కిక్ బాక్సింగ్ అంటే వివిధ పోరాట క్రీడల కలయిక. భౌతిక బలం మానసిక బలాలను గుండెల నిండ నింపుకొని తంగెడ బావుటా భూజాన వేసుకొని రెండు బంగారు పతకాలు, ఒక బ్రాంజీ పథకంతో తంగెడ ఉనికిని దేశవ్యాప్తంగా చాటాడు. శివకుమార్ శక్తిసామర్ధ్యాలు ఒక పరిశీలిస్తే.... చత్తీస్‌ఘడ్‌లో ఏకంగా 2800 మంది తలపడిన గోద్రాలో 12 మందిని చిత్తూ కరిపించి అంచెలంచెలుగా అందలమెక్కి బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నాడు.
వైజాగ్‌లో 800 మంది పాల్గోన్న గోద్రాలో 5 పోరాటాలు చేసి బంగారు పథకాన్ని సోంతం చేసుకున్నాడు. అంతటితో ఆగక తంగెడ ఖ్యాతిని దేశ మొత్తం చాటుదామనే ఆలోచనతో ఢీల్లిలో 3200 మంది తో ఏర్పాటైన ప్రోగ్రాంలో పాల్గొని బ్రాంజీ పథకాన్ని సోంతం చేసుకున్నాడు. ఇన్ని విజయాలు సోంతం చేసుకున్న తుమ్మల శివకుమార్ ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా పోరాడి తంగెడ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పాలని ఆశిస్తూ....
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి