మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, అక్టోబర్ 2026, శనివారం

ద్రేక్కాణ చక్రం

ద్రేక్కాణం: ఒక రాశిలో 3 ద్రేక్కాణములు ఉంటాయి. ఒక రాశి 9 నక్షత్ర పాదములు కలిగి ఉంటాయి. 3 నక్షత్ర పాదములు ఒక ద్రేక్కాణం అవుతుంది. అదే డిగ్రీలలో అయితే ఒక రాశి 30 కలిగి ఉంటే 0`10 లు ప్రధమ ద్రేక్కాణం. 10 ` 20 రెండవ ద్రేక్కాణం, 20 ` 30 తృతీయ ద్రేక్కాణం అగును.

3వ భావము యొక్క కారకత్వములను తోతుగా పరిశీలించుటకు ద్రేక్కాణ చక్రము ఉపయోగ పడుతుంది. 3వ భావము యొక్క కారకరత్వములు ధైర్యము, దగ్గరి ప్రయాణములు, అన్నదమ్ములు ముఖ్యముగా తన తరువాత పుట్టినవారు, వారియొక్క ఆరోగ్యము, సహజ గుణములు, ఆయుష్షు, వారితో జాతకునికి ఉన్న సంబంధము, వారినుండి జాతకునికి కలుగు కష్టనష్టములు తెలుసుకొనవచ్చును.  3వ భావాధిపతి మరియు కారకుడు కుజుడు ఈ చక్రం పరిశీలించుటలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తాడు.

ద్రేక్కాణ చక్ర నిర్మాణంలో 0 ` 10 ప్రధమ ద్రేక్కాణం అదే రాశిలో ఉంటుంది. 10 ` 20 ద్వితీయ ద్రేక్కాణం అదే రాశి నుండి 5వ రాశిలో ఉంటుంది. 20 ` 30 వ తృతీయ ద్రేక్కాణం అదే రాశి నుండి 9వ రాశిలో ఉంటుంది. చరరాశిలో ప్రథమ ద్రేక్కాణం, స్థిర రాశిలో ద్వితీయ ద్రేక్కాణం, ద్విస్వభావ రాశిలో తృతీయ ద్రేక్కాణం ఉత్తమమైనవి. ఈ ఉత్తమ ద్రేక్కాణములపై లగ్నము, లగ్నాధిపతి, చంద్రుడు మొదలగు శుభగ్రహములు ఉన్నపుడు జాతకం ఎక్కువ బలము కలిగి, జాతకుడు ఉన్నత కుటుంబంలో జన్మించి జీవితంలో బాగ అభివృద్ధి చెందుతాడు.

ఆయుద ద్రేక్కాణం: మేషం 1, 3 ; మిథునం 2 Ê 3; సింహం 3 వది, కన్య 2 వది, తుల 3 వది, ధనస్సు 1 Ê 3, మకరంలో 3 వది. ఈ ద్రేక్కాణంలో చంద్రుడు ఉండగా జిన్మించిన వారు క్రూరమÖన మనస్తత్వం కలిగి చెడ్డపనులు చేయుదురు. హింసించే గుణము కలిగి యుండి, హత్యలు చేయుటకు వెనకాడరు. 

ఈ ద్రేక్కాణం ప్రయాణములు చేయుట వలన ప్రమాదములు కలుగును, ఆటల పోటీలకు ఈ ద్రేక్కాణంలో బయలుదేరి వెళ్ళుట వలన ఓటమి కలుగును.

సర్ప ద్రేక్కాణం: కర్కాటకం 2Ê3, వృశ్చికం 1, మీనం 3: ఈ ద్రేక్కాణంలో చంద్రుడు ఉండగా జన్మించిన వారు అధికమైన కోపము, ఈర్ష్య, ద్వేషములు కలిగి యుంటారు, మరియు బాలారిష్టం కలిగి యుంటారు. ఈ ద్రేక్కాణంలో ప్రయాణములు చెడును కలిగిస్తాయి.

పక్షి ద్రేక్కాణం: సింహం 1,  తుల 1Ê2,  ధనుస్సు 2, కుంభం 1:  ఈ ద్రేక్కాణములలో చంద్రుడు ఉండగా జన్మించిన వారు స్థిరమైన మనస్తత్వమును కలిగియుండరు. వీరు ఒక ఉద్యోగంలో గాని, ప్రదేశంలో గాని స్థిరముగా ఉండరు. వీరు ఎక్కవగా తిరిగుతూ చేయు ఉద్యోగములు ఇష్టపడతారు. ఇతరులకు  హాని కలిగించే మనస్థత్వము కలిగి యుంటారు.

చతష్పాద ద్రేక్కాణం: మేషం 2, వృషభం 2 Ê 3, కర్కాటకం 1, సింహం 2, వృశ్చికం 3.  చంద్రుడు ఈ ద్రేక్కాణముల యందు అండగా పుట్టినవారు నీతి నియమములు లేక పశు ప్రవృత్తిని కలిగి యుంటారు.

పాశధర ద్రేక్కాణం: వృషభంలో 1 వది, మకరంలో 1 వది, వృశ్చికంలో 2 వది.  ఇది బాలారిష్టము కలిగియుంటుంది. కోర్టు కేసులలో వ్యతిరేకమైన తీర్పు వస్తుంది.

ఖర ద్రేక్కాణం: జన్మ లగ్నము లేదా జన్మ రాశి నుండి 23వ ద్రేక్కాణము ఖర ద్రేక్కాణము అగును. ఈ ద్రేక్కాణము యొక్క దశ లేక అంతర్దశలలో తీవ్రమైన కష్టనష్టములు, ప్రమాదములు, కొన్ని సందర్భములలో మృత్యువు కూడ సంభవించును. అష్టమాధిపతి యొక్క దశలో 22వ ద్రేక్కాణాధి పతి అంతర్దశలో ఇటువంటివి జరగవచ్చును.

1. రాశి చక్రమందు లగ్నాధిపతి ఆత్మ, 

పంచమాధిపతి జీవాత్మ,

భాగ్యాధిపతి పరమాత్మ.

ఈ మÖడు గ్రహములకు ద్రేక్కాణ చక్రమందు పరస్పర సంబంధము కలిగి యున్నచో జాతకుడు ఉన్న స్థాయికి వచ్చి సుఖసంతోషములతో జీవించును.

2. రాశి చక్రములో గ్రహము ఉన్న ద్రేక్కాణాధిపతి ఆ గ్రహమును చూచిన ఎడల ఆ గ్రహము మంచి ఫలితము ఇచ్చును. ఉదా: గురువు తులా రాశియందు 10 1 20 ల మధ్య ద్వితీయ ద్రేక్కాణము యందున్న గురువు శని యొక్క ద్రేక్కాణములో ఉండును. కావున శని గురువును వీక్షించినచో గురువు మంచి ఫలితములు ఇచ్చును.

3. ద్రేక్కాణాధిపతి పాప గ్రహములు రవి, కుజ, శని అనిన జాతకుడు నీతి నియమములు లేనివాడు, కౄరుడు కోపిష్టి అగును.  అదే శుభగ్రహములు గురు, శుక్ర, బుధ, చంద్ర అయిన శాంత స్వభావి, సద్గుణములు కలిగి యుండి అందరి అభిమానము పొందును.

4. ద్రేక్కాణ చక్రములో 3వ బావము తన తరువాత పుట్టిన వానిని 5వ భావము ఆ తరువాత పుట్టిన వానిని తెలియజేయును. 11వ భావము తనకున్న పెద్దవానిని 9 వ భావము వాడికన్న పెద్దవాడిని తెలియ జేయును. తన తరువాత పుట్టిన వారికి కుజుడు కారకుడు. తనకన్న పెద్దవారికి గురువు కారకుడు. అదే స్త్రీలు అయిన శుక్రుడు కారకుడు అవుతున్నాడు.

5. ద్రేక్కాణ చక్రమందు 3, 11 వ భావాధిపతులు కారకులైన కుజ గురువులు బలముగా ఉన్న జాతకుడు ధైర్యవంతుడు, కష్టపడి పనిచేయవాడు, నైపుణ్యము కలవాడు అయి అన్నదమ్ముల సహాయ సహకారములు పొందును.

6. ద్రేక్కాణ చక్రమందు లగ్నాధిపతి కేంద్ర కోణములయందు గాని, ఉచ్చయందు లేదా మిత్ర క్షేత్రమందున్న జాతకుడు ఉన్నత కుటుంబములో జన్మించును. శుభఫలితములు కలుగును.

7. ద్రేక్కాణ చక్రములో లగ్నాధిపతి నీచయందు శతృస్థానముల యందుండి పాపగ్రహముల సంయోగము దృష్టి కలిగియున్న జాతకుడు చెడు ఫలితములు ఎదుర్కొనును. మనోవిచారలములు, దు:ఖము కలుగును.

8. మÖడవ భావములో ఉన్న గ్రహములను బట్టి గెలుపు ఓటమిలను తెసుకోన వచ్చును.

9. ద్రేక్కాణ చక్రములో అష్టమ రాశి ఖర రాశి అగును. దాని అధిపతి ఖరేష్ అగును. ద్రేక్కాణ చక్రములో ఖరేష్ అన్న భావము యొక్క కారకత్వముల వలన జాతకుడు అంతర్గతముగా బాధపడును. 

ఉదా: ఖరేష్ 6 వ భావములో ఉన్నఎడల శతృవులు, ఋణములవలన బాధపడును.

10. లగ్నాధిపతి సర్ప ద్రేక్కాణముపై ఉండుట మంచిది కాదు. జాతకుడు ఇతరులను చూచి ఈర్ష్య పడును. ఇతరుల పతనమునకు రహస్యముగా పనిచేయును. భార్యకు అంతుపట్టని రోగములు కలిగియుండును. పంచమ లేదా భాగ్యాధిపతి ఈ ద్రేక్కాణముపై ఉన్నపుడు జాతకుడు ఎంత కష్టపడిననూ జీవితంలో అభివృద్ధి చెందలేడు. ప్రతి పనిలోనూ అపజయం కలుగును. దశమాధిపతి ఈ ద్రేక్కాణముపై ఉన్న వృత్తిలో అభివృద్ధి ఉండదు.

11. అష్టమాధిపతి లేదా శని ఆయుద ద్రేక్కాణముపై ఉన్నపుడు ప్రమాదముల వలన మరణము సంభవించును.

12. బలమైన లగ్నము లగ్నాధిపతి వలన తమ్ముడు లేదా చెల్లెళ్ళను కలిగి యుంటారు.

13. ద్రేక్కాణ చక్రములో ధన యోగములు ఎక్కువ మంది అన్నదమ్ములను తెలియ జేయును.

14. ద్రేక్కాణ చక్రంలో రాజ యోగములు అన్నదమ్ముల యొక్క కీర్తి ప్రతిష్టలు వారి యొక్క ఉన్నత స్థితి, అభివృద్ధిని తెలియజేయును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి