మొత్తం పేజీ వీక్షణలు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, అక్టోబర్ 2026, శనివారం

ఎం. బాలయ్య....విలక్షణ నటుడు....నిర్మాత....

తెలుగు సినిమా పరిశ్రమలో అందరికీ సుపరిచితులు బాలయ్య. నటన పట్ల పెద్దగా ఆసక్తి కనబచక పోయినప్పటికీ, ఆయనలో దాగివున్న నటనా నైపుణ్యం, ప్రతిభ వెండితెర మీదకు ఆయన జీవితాన్ని నడిపించింది. 350 చిత్రాల్లో తన సహజ నటనను ప్రేక్షకుల ముందు ప్రదర్శించిన విలక్షణ నటుడు బాలయ్య. 76 ఏళ్ల బాలయ్య, సినీ నటుడుగా, నిర్మాతగా, కథా రచయితగా, దర్శకుడుగా అనుభవాలతో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి, సహృదయుడు. నిండుగా నవ్వడమే తప్ప, కోప్పడ్డం తెలీని ఈ అసాధారణ నటుడి జ్ఞాపకాలు ఈ వారం...

నేను 09-04-1930 న గుంటూరు జిల్లా, అమరావతి మండలం చావపాడు గ్రామంలో జన్మించాను.  శ్రీ మన్నవ గురవయ్య, శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లు నా తల్లిదండ్రుటు. మాది మొదటి నుండీ వ్యవసాయ కుటుంబం. నా యిద్దరు సోదరులు ఇప్ప్పుడూ అక్కడే వ్యవసాయం చూసుకుంటున్నారు. ఒక తమ్ముడు మైనింగ్ ఇంజనీరు.

చావపాడు u£త్తిగా చిన్న గ్రామం. ఆ కాలంలో చదువుకోవడానికి బడికూడా లేని వూరు.  అందుకని నేను పక్క వూళ్లో పైవేటుగా రెండో ఫారం వరకు చదువుకుని, 1942లో గుంటూరు హిందూ కాలేజీ హైస్కూలులో మÖడో ఫారంలో ప్రవేశించాను.  హాస్టల్‌లో వుంటూ శ్రద్ధగా చదువుకుని స్కూలు ఫైనల్ ప్యాసయ్యాను.

హైస్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో నాకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు.  గుంటూరులో చదువుకుంటూ, నేను సంవత్సరానికి ఏ ఐదో, ఆరో సినిమాలు చూసుంటాను. 1946 లో స్కూల్ ఫైనల్ పాసైన తర్వాత, నాకు చిన్న సమస్య వచ్చింది - మా వాళ్లందర్నీ విడిచిపెట్టి - దూరంగా మద్రాసులో చదువుకోవాల్సి వచ్చింది! ఐతే, ‘స్టాండర్డు’ కోసం, క్రమశిక్షణ కోసం, ప్రాపంచిక పరిచయాల కోసం నేను చెన్నెí ‘లయోలా’ కళాశాలలో ‘ఇంటర’ లో చేరాను. 1948 లో నేను ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ప్యాసయ్యాను.

ఇంటర్ తర్వాత, నాకు ఇంజనీరింగ్ కాలేజీలోనూ, మెడికల్ కాలేజీలోనూ సీట్లు వచ్చాయి. నాకు డాక్టరు చదవడం పట్ల పెద్ద ఆసక్తి లేకపోవడంతో, ఇంజనీరింగ్‌లో చేరాను.  1948 నుంచి 1952 వరకు గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాను.

1948 వ సం॥లో ఒక విచిత్రం జరిగింది - ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నప్ప్పుడు నేను గనక ‘స్టేజి’ ఎక్కక పోయుంటే - నేను అనుకున్నట్లు ఇంజనీరుగానే వుండిపోయేవాడినేమో! మనం అనుకున్నదొకటైతే, దైవ నిర్ణయం ఇంకోవిధంగా వుండవచ్చు.  ఎవరే విధంగా అనుకుంటే ఆ విధంగా జరిగి తీరుతుందని ఎవరమÖ చెప్పలేం. కలెక్టరు అవుదామని కలలుగన్న వాడు స్కూలు టీచరు కావచ్చు, గుమాస్తాగా బ్రతుకుదామనుకున్న వాడు సామాన్య వ్యక్తిగానే వుండిపోవచ్చు.  ఈ మార్పులన్నీ పరిస్థితుల కాల ప్రభావాల వల్ల, విధి నిర్ణయానుసారం జరుగుతూ వుంటాయి.  అదే విధంగా నేను ఇంజనీరు అవుదామనుకుంటే సినిమా నటుడనయ్యానంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు!  తమిళంలో ఒక సామెత వుంది - తాను అనుకున్నదల్లా నెరవేరితే, మనిషి దేవుడు లేడంటాడట.

కాలేజీలో ఏదో సందర్భాన ఒక చిన్న నాటిక ప్రదర్శించాల్సి వచ్చింది.  మిత్రులంతా నన్ను ఉత్సాహం లేని నేను, ఆ భయం వల్ల  ససేమిరా ఒప్ప్పుకోలేదు. కానీ మిత్రుల ప్రోద్బలం నా పట్టుదలను గెలిచింది! ఆ నాటికలో ముఖ్యపాత్ర ధరించాను. ఆ ప్రదర్శనలో నేనేం జేశానో నాకు తెలీదు. ఆ రోజున నన్ను ఆ స్టేజి మీద చూసినవాళ్లకు నాలో సినిమా నటుడి లక్షణాలు ఏ మాత్రం కన్పించలేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం బాగా కన్పించాయి.  అతని పేరు తాడి కృష్ణమÖర్తి. నాతోనే ఇంజనీరింగ్ చదువుకునే వాడు. ప్రదర్శన కాగానే నన్ను అభినందించిన ఒకే ఒక వ్యక్తి కృష్ణమÖర్తి.  

మా కాలేజి విద్యార్థులు ఒకసారి ఆచార్య ఆత్రేయ గారి ‘పరివర్తన’ నాటకం వేశారు.  ఆ నాటకం బాగుండాలని, తాపీ చాణక్య గారిని ఆహ్వానించి, నాటకాన్ని డైరెక్టు చెయ్యమని కోరారు. అప్ప్పుడే నాకు చాణక్య గారితో పరిచయమైంది.  అప్ప్పుడాయన “పల్లెటూరి పిల్ల” చిత్రానికి బి.ఎ. సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేస్తున్నారు.  ఆ తర్వాత నాకు ధైర్యం చెప్పి, నాటకాల్లో వేషాలు వెయ్యమన్నది కూడా చాణక్యగారే. మÖడో సంవత్సరంలో నేను తెలుగు సమితికి కార్యదర్శిగా ఎంపికయ్యాను. ఆ సంవత్సరం మళ్లా నాటకం వెయ్యాల్సి వచ్చింది.  ఆచార్య ఆత్రేయ దగ్గర ‘ప్రగతి’ అనే నాటకం రాయించాం. తొలిసారిగా అంతర్ కళాశాల నాటక పోటీలు పచ్చయ్యప్ప కళాశాలలో నిర్వహిస్తే అందులో మేం పాý£్గన్నాం. ఈ నాటకాన్నే చాణక్యగారే నడిపారు.  ఆ ‘ప్రగతి’ నాటకంలో నేను పారిశ్రామిక వేత్త పాత్ర వేశాను. నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది.  దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగి మంచి నాటకాలు వేయగలను అని అనుకున్నాను.

తర్వాత కూడా నేను కాలేజీ నాటకాల్లో పాý£్గన్నాను. 1952 లో నేను ఔ.జూ. (Uలిబీనీబిదీరిబీబిజి) డిగ్రీ తీసుకున్నాను.  మద్రాసు బాడ్వేలో వున్న సెంట్రల్ పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో, అసిస్టెంటు లెక్చరర్‌గా, ప్రప్రథమంగా 1953 లో ఉద్యోగంలో ప్రవేశించాను. ఎనిమిది నెలల పాటు ఆ ఉద్యోగం చేశాను. ఆ సంవత్సరంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు పైలట్ ఆఫీసరుగా సెలక్టయ్యాను కూడా, కానీ మిలిటరీ వాతావరణం, ముఖ్యంగా మా అమ్మకు నచ్చలేదు.  దాంతో ఆ లైను మానేశాను. సెంట్రల్ పాలిటెక్నిక్ నుంచి నేను కాకినాడ పాలిటెక్నిక్‌లో చేరాను. మÖడు సంవత్సరాల పాటు ఆ కాలేజీలోనే లెక్చరర్‌గా వున్నాను.  1955 మార్చిలో నాకు కమలాదేవితో వివాహం జరిగింది. మా శ్రీమతి ప్రముఖ కథా రచయిత్రి ఆర్.ఎస్. వసుంధరాదేవికి సొంత సోదరి.

సరే, అలా ఆ లెక్చరర్ ఉద్యోగం కూడా నాకు సంతృప్తి నివ్వలేదు. సొంతంగా నేను ఒక వర్క్‌షాపు పెట్టుకుని నడుపుకుందామనే ఆలోచన వచ్చింది.  ఆ తర్వాత సంవత్సరంలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను.  అనుభవం కోసమని, నేను మద్రాసు సుందరం మోటార్సులో చేరాను. అప్ప్పుడే ఎల్.వి.ప్రసాద్ గారు నన్ను పిలిచి ‘మÖవీటెస్టు’ చేశారు.  ఆ టెస్టు ‘ఉత్సాహకరమైన ఫలితాలను’ ఇచ్చింది.

మా బంధువు ఒకాయన రాయఘడ్ పంచదార ఫ్యాక్టరీలో జనరల్ మేనేజరుగా ఉండేవారు. ఆయన “ఖాళీగా వున్నావు గదా, ఇక్కడకొచ్చి కొన్నాళ్లు ఈ ఫ్యాక్టరీ అది చూద్దువు గాని రా” అని కబురు చేశాడు.  సరేనని నేను రాయఘడ్ చేరుకున్నాను.  నాకు తెలీకుండా నీడలాగా, సినిమా ఛాన్సు కూడా నా వెంటే రాయఘడ్ చేరుకుంది.

ఎల్.వి. ప్రసాద్ గారు తీసిన ‘మÖవీటెస్ట’ ను ‘ప్రతిభా’ సంస్థ అధినేత ఘంటసాల కృష్ణమÖర్తి గారు చూశారు. ఆయన వెంటనే నన్ను రమ్మని ఉత్తరం రాశారు. అప్ప్పుడాయన “దొంగలున్నారు జాగ్రత్త” నిర్మించబోతున్నారు. నాలో ఏ మాత్రం ఉత్సాహం కలుగలేదు.  ప్రతిభా వాళ్లు నాకోసం చాలా ప్రయత్నం చేశారు. 

1957 లో నేను తిరువత్తియÖర్ వర్క్‌షాపులో అసిస్టెంటు ఇంజనీరుగా జేరాను. నా ఉద్యోగాన్ని నేను చూసుకుంటూ పోయానే ÔŸప్ప ఆ సినిమా నీడను గమనించలేదు.  సినిమా ఆలోచన నా తలలో లేనే లేదు. ఆ తర్వాత ‘అనుపమా’ సంస్థ అధినేత కె.బి. తిలక్ గారు తమ తొలిచిత్రం “ఎం.ఎల్.ఏ.”లో ఒక పాత్రలో నటించమని అడిగారు. నేనే దాన్ని వద్దనుకున్నాను. 

1957 జూలైలో మళ్లీ నాకు పరిశ్రమ నుండి పిలుపు వచ్చింది.  ఈసారి చాణక్య గారు సారథి వారి తరపున పిలిపించాడు. నిలకడ లేని లైను - పెళ్లయి ఒక పాపకు తండ్రిని కూడ. ఇప్ప్పుడు సినీ రంగం వద్దులే అని సుతిమెత్తగా చెప్పాను. హీరో వేషం రావడం ఎంత అరుదైన అదృష్టమో వివరించారు. ఆఖరికి సరేనని ఒప్ప్పుకున్నాను. అలా 1957 లో నా చిత్రరంగ ప్రవేశం జరిగింది. సారథీ వారి “ఎత్తుకు పైఎత్తు” లో హీరోగా నటించాను.  ఇంజనీరు కావలసిన వాడు నటుడయ్యాడా? నటయోగం వున్నవాడు ఇంజనీరు అవుదామని ఆశించాడా? - నాకు అర్థం కాలేదు. 

“ఎత్తుకు పైఎత్తు” లో హీరోయిన్‌గా షావుకారు జానకి గారు చేశారు.  ఆ తర్వాత కథానాయకునిగానే “పార్వతీ కల్యాణం” (1958), “మనోరమ”, “భాగ్యదేవత” (1959), “చివరకు మిగిలేది”, “కుంకుమ రేఖ” (1960), “గుళ్లో పెళ్లి”, “కృష్ణప్రేమ” (1961), “మోహినీ రుక్మాంగద” (1962), “తల్లీ బిడ్డలు” (1963) చిత్రాల్లో నటించాను. వాటిల్లో సావిత్రి గారితో నటించిన “కుంకుమ రేఖ”, కృష్ణకుమారి గారితో చేసిన “మనోరమ” చిత్రాలంటే చాలా ఇష్టం. ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మొహమ్మద్ “మనోరమ” లో నాకు చాలా మంచి పాటలు పాడాడు. ఆ రోజుల్లో తలత్ నాకు పాటలు పాడడాన్ని చాలా విశేషంగా చెప్ప్పుకునేవారు.  దానికి రమేష్ నాయుడు గారు సంగీత దర్శకుడు.

నేను మొదటి నుంచీ కూడా చాలా సున్నిత మనస్కున్ని, నాకు తెలిసి నేనెవరినీ ఇన్నేళ్ల ఇండస్టీలో ఎవర్నీ నొప్పించి ఎరుగను. నాలాంటి స్వభావమే డి.వి. నరసరాజు గారిది. వారి సాన్నిహిత్యమంటే నాకు చాలా ఇష్టం. ఆయనా ఈ మధ్య పోయారు. సరే... నే చెప్పేదేమిటంటే మొదటి నుంచీ కూడా ఏదైనా సంఘటన చూస్తే విపరీతంగా స్పందించే వాణ్ణి. ఆ స్పందనలో నుంచే నాలో కథా రచయిత పుట్టుకు వచ్చేవాడు. ఆ రోజుల్లో ‘తుఫాన’ అని ఓ పత్రిక వుండేది. ఆ పత్రికా సంపాదకులు ఏదైనా రచన ఇమ్మని అడిగితే, నేను స్పందించిన ఒక సంఘటననే ‘నలుపు-తెలుపు’ టైటిల్ లో పది సంచికలకు సీరియల్‌గా పంపాను. ఆ కథే నిర్మాత అయ్యాక అమృతా ఫిలిమ్స్ పతాకంలో తీసిన తొలి చిత్రం “చెల్లెలి కాపురం” (1971).

హీరో వేషాలు తగ్గిపోయాక, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాను.  “పాండవ వనవాసం” (1965), “u£బ్బిలి యుద్ధం” (1964), “బభృవాహన” (1964), “రక్తసింధూరం” (1967), “నిండు మనసులు” (1967), “ఊరికి ఉపకారి” (1972), “చిరంజీవి రాంబాబు” (1978)... ఇలా సుమారు 200 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాను. అలా నటించిన చిత్రాల్లో “అల్లూరి సీతారామరాజు” (1974), “అంకుశం” (1992) చిత్రాలంటే నాకు చాలా ఇష్టం.

నటుడుగా వుండేటప్ప్పుడు ఎందుకనో కాస్త అసంతృప్తిగా3 వుండేవాడ్ని.  సినిమా రంగంలోకి అనవసరంగా వచ్చేశానా అని అనిపించేది. ఆ అసంతృప్తిని అప్ప్పుడప్ప్పుడూ మిత్రులతో అంటుండేవాడ్ని. అంతలో పర్వతనేని చంద్రశేఖరరావు (శ్రీ ఫిలిమ్స్), కాట్రగడ్డ శ్రీనివాసరావు (నవయుగ) గార్ల ప్రోత్సాహంతో ‘అమృతా ఫిలిమ’ స్థాపించి తొలిసారిగా “చెల్లెలి కాపురం” తీశాను.  ఆ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లో స్వర్ణ నంది వచ్చింది. “చెల్లెలి కాపురం” సినిమా విడుదలైన రోజున నేను పొందిన థ్రిల్‌ను, అనుభూతిని నేనెప్పటికీ మరువలేను. దాని తర్వాత వరుసగా తొమ్మిది చిత్రాలు నిర్మించాను.  అందులో “ఊరికిచ్చిన మాట” (1981) చిత్రం దగ్గర నుంచి నేను నిర్మించిన చిత్రాలకు నేనే దర్శకత్వం వహించాను.  ఆ చిత్రానికి కూడా కాంస్య నంది వచ్చింది. అంతేగాకుండా ద్వితీయ ఉత్తమ కథగా అవార్డు గెల్చుకుంది.

మీకో నిజం చెప్పనా... నటుడు అనిపించుకోవడం కంటే, నిర్మాత అన్పించుకోవడంలోనే ఆనందం ఉంది. నిర్మాతగా నేనెంతో సక్సెస్ అయ్యాను.  ఒక సినిమాకు, అది ఏరకమైన సినిమా అయినా సరే, కథ అనేది చాలా ముఖ్యమైనదని నా నమ్మకం. “ఊనీలిజీలి రిరీ దీళి లీబిఖి తీరిజిళీ శినీబిశి బీబిదీదీళిశి లీలి బీళిజీజీలిబీశిలిఖి లీగి బి వీళిళిఖి రీశిళిజీగి”. ఒక మంచి కథ ఉన్నప్ప్పుడు అది చిత్రంలో ఎలాంటి లోపాన్ని కన్పించనివ్వదు అని సుప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు ఫ్రాంక్ కాప్రా అన్నాడు.  కథను ఎన్నిక చేసుకోవడంలో కూడా కొన్ని గమ్మత్తులు జరుగుతాయి.  మేం తీసిన “చుట్టాలున్నారు జాగ్రత్త” (1980) చాలా బాగా విజయవంతమైంది. దాన్ని ఏ.వి.ఎం. వాళ్లు రజనీకాంత్ హీరోగా “పోకిరి రాజా” అనే పేరుతో తమిళంలో తీశారు. అదే వంద రోజులు నడిచింది. హిందీలో తీయడానికి ఒక నిర్మాత మా దగ్గర హక్కులు కొన్నాడు.  కానీ వాళ్లు నిర్ణయించుకున్న దర్శకుడికి ఆ కథ నచ్చలేదు.  అందుకని “చుట్టాలున్నారు జాగ్రత్త” కథకు సంబంధించిన హక్కులను పద్మాలయాకు అమ్మేసి వేరే కథను వాళ్లు కొనుక్కున్నారు. పద్మాలయా వాళ్లు “చుట్టాలున్నారు జాగ్రత్త” కథను “మవాలీ” అనే పేరుతో హిందీలో తీసి విడుదల చేస్తే 25 వారాలు విజయవంతంగా నడిచింది. మా కథ కాదని వేరే కథను తీసుకుని నిర్మించిన చిత్రం ‘ప్లాప’ అయింది. 

1973 లో “నేరము-శిక్ష” అనే సినిమా మా అమృతా ఫిలింస్ పతాకం కింద నిర్మించాం. దానికి కె. విశ్వనాథ్ గారు దర్శకులు.  సినిమా పూర్తయి, తొలి కాపీ కూడా వచ్చిన రోజుల్లో నాకు బాగా కావాల్సిన వారి ద్వారా ఒక డిస్టిబ్యూటర్ వచ్చి చిత్రం చూశాడు. నాతో ఏ మాటా చెప్పకుండా వెళ్లిపోయాడు. తర్వాత మా స్నేహితుడు ఫోన్ చేసి “బాలయ్య గారూ! మీ చిత్రం వాళ్లకి నచ్చలేదట. మీరేమీ అనుకోకండి” అన్నాడు. “నేరము-శిక్ష” విడుదల తర్వాత విషయం అందరికీ తెలిసిందే గదా! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఎంత తెలివితేటలున్నా, ఎంత సినిమా పరిజ్ఞానం వున్నా, కొన్ని సందర్భాల్లో ప్రతి మనిషి పప్ప్పులో కాలు వేస్తుంటాడు.  విడుదలకు సిద్ధంగా వ్ను సినిమా చూసి కూడా మనం సరైన తీర్పు యివ్వలేక పోతుంటే - కథ మాత్రం విని ఇది మంచి సినిమా అవుతుందా? కాదా? అని  చెప్పడం ఎంత కష్టమో ఆలోచించండి.

నా వరకు నేను ఒక కథాంశాన్ని పట్టుకుంటే దాన్ని ఆరు మాసాలు నుంచీ సంవత్సర కాలం పాటు పిండి, పాకం పడతాను. అంతేగాక నా ఒక్కడి అభిప్రాయాలైతే గానుగెద్దులా ఒకే గాటిలో తిరుగుతా యేమోనని, నాకు హితులు, సన్నిహితులు అయిన వాళ్లను కూర్చోబెట్టి కథ వినిపించి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుని దాని ప్రకారం మార్పులు చేసుకుంటాను.  ముఖ్యంగా ఇంట్లో వాళ్లకు నచ్చేటట్లు చూసుకుంటాను.  నేను నిర్మించిన చిత్రాలను ఇదే పద్ధతిలో నిర్మించినవే.

అయితే ముందు తీసిన ఆరు చిత్రాలకు కె. విశ్వనాథ్, కె.ఎస్.ఆర్. దాస్, డి.ఎస్. ప్రకాష్‌రాజు, బి.వి.ప్రసాద్ వంటి అనుభవజ్ఞులు దర్శకత్వం వహించారు. వారి అభిప్రాయాల ప్రకారం కథల్లో మార్పులు, చేర్పులు చేశాను. తర్వాత నాలుగు చిత్రాలకు కథ, నేనే రాసుకుని చిత్రానువాదం డైరెక్షన్ చేశాను.

“పీపుల్ బిలో థర్టీ ఆర్ పూల్స్ అండ్ దోజ్ అబౌవ్ థర్టీ ఆర్ రాస్కెల్స” (ముప్ఫెí యేళ్లలో వున్న వారు మÖర్ఖులు, ముప్ఫెí ఏళ్ల పైబడిన వారు దుర్మార్గులు) అన్నాడొక ఇంగ్లీషు కవి. అంటే యుక్తవయస్సులో ఉన్నప్ప్పుడు సంఘసేవ, దేశోద్ధారణ అనే కొన్ని ఆదర్శాలతో మనిషి హృదయం నిండి ఉంటుంది.  ఉడుకు రక్తం ఉరకలేస్తూ వుంటుంది.  యుక్త వయసు దాటిందనుకోండి - పెళ్లవుతుంది, భార్య పిల్లలు. ఇలా కుటుంబ బాధ్యత నెత్తిన పడుతుంది. తన భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలి? అనే ఆలోచన వస్తుంది.  అప్ప్పుడా దేశసేవ, సంఘసేవ అనే ఆదర్శాలు గంగలో కలిసిపోతాయి.  అదే విధంగా నేను కొత్తగా చిత్ర నిర్మాణం మొదలు పెట్టినపుడు - సంఘ సంస్కరణ చేయాలి, దేశంలో వుండే ప్రజల్నంతా మన సినిమాలతో మంచి మార్గంలో ప్రయాణింప చేయాలి. ప్రతి చిత్రంలోనూ నీతి వుండాలి. ఇలా ఎన్నో ఆశయాలతో నిర్మాణం ప్రారంభించాను. ఆ వూపులోనే నా సినిమాల్ని ఏదో ఒక నీతిని దృష్టిలో పెట్టుకుని తీశాను.

“బాహ్య సౌందర్యం కంటే అంత్ణ సౌందర్యం గొప్పదని” చెల్లెలి కాపురంలో చెప్పాను. “మనిషికి మనసే సాక్షి / మనిషి విధించే కక్ష శిక్ష తప్పినా / మనసు విధించే శిక్ష తప్పదు / నేరానికి శిక్ష తప్పదు - తప్పదు” అని “నేరము-శిక్ష” లో చెప్పాను.  “సన్మార్గంలో సాధించిన స్వల్పం / సకల జనులు హర్షించే శిల్పం / పెడదారిన పొందిన పెన్నిథి / అడుగడుగున ఆపద సన్నిథి / ఇదే భిన్న మార్గాల వ్యధ అన్నదమ్ముల కథ” అని “అన్నదమ్ముల కథ” (1975) లో చెప్పాను.  ఇలా నీతులు చెప్ప్పుకుంటూ పోతే జనం వినడం మానేశారు. ఏదో విశ్రాంతి కోసం,  వినోదం కోసం, సినిమాలు చూడడానికి వస్తే నీతులు, నీతులు అంటూ విసుగెత్తిస్తున్నారని భావించారు. ‘మనకి నీతులు చెప్పడానికి వీళ్లకున్న అర్హత ఏమిటి?’ అని నిందిస్తున్నారు ప్రజలు.

ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్తాను - 

ఒక కాలేజీ వార్షికోత్సవ సభకు ఓ సినీ కవి ముఖ్య అతిథిగా పాý£్గన్నాడు. బ్రహ్మాండంగా నైతిక విలువల్ని గురించి ఉపన్యాసం ఇచ్చేశాడు.  విద్యార్థులందరూ ముగ్ధులై విన్నారు. కార్యక్రమం ముగిసింది. విద్యార్థులంతా ఆయన ఉపన్యాసం ధాటికి ఉత్తేజితులైపోయి స్వయంగా ఆయన్ను కలుసుకోవాలని ఆయన బస చేసిన విశ్రాంతి గృహానికి వెళ్లారు. వాళ్లు అక్కడికి వెళ్లే సరికి ఆ కవిగారు మద్యం సేవిస్తూ దర్శనమిచ్చారు. విద్యార్థులు ఆశ్చర్యపోయారు. మనసు ఉండబట్టలేక ‘సార్! కొద్దిసేపటి క్రితమే కదా మీరు మాకు ఎన్నో నీతులు చెప్పారు! మరి మీరేమిటి ఇక్కడ.... ఇలా... మద్యం సేవిస్తున్నారూ’ అని అడిగారు.

దానికి ఆయన ఇచ్చిన బదులు ఇది - “నాలుగు రోడ్ల కూడలిలో వుండే పలక చెక్క మీ వూరికి దారి చూపిస్తుంది గానీ, ఆ వూరికి తాను పోదు” అన్నాడు. నీతులు చెప్పే ప్రతివారూ వాటిని ఆచరించాలని గానీ, ఆచరిస్తారని గాని అనుకోవడం పొరపాటు. నీతుల్ని బోధిస్తూ చిత్రాలు నిర్మించడం వల్ల చేదు ఫలితాలు చవి చూశాను. నీతులు వెగటు పుట్టి జనం అలాంటి చిత్రాల్ని చూడడం మానేస్తారు.  ఫలితం చిత్రం బాగా ఆడదు. చివరకు నిర్మాత నష్టపోతాడు అనే నిజం అనుభవ పూర్వకంగా గ్రహించాను. 

ఈ కారణాల వల్ల - మేము కూడా వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తే మంచిదనే నిర్ణయానికొచ్చాం. అలా నిర్మించిందే “ఈనాటి బంధం ఏనాటిదో” (1971). ఆ చిత్రాన్నిర జనం బాగా ఆదరించారు. అంటే అధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు చిత్రాల ద్వారా ఆశించేది వినోదం మాత్రమే అన్న నిజం ఋజువైంది. అంటే నీతి లేకుండా చిత్రాల్ని నిర్మించాలని నా ఉద్దేశం కాదు. తియ్యని మాత్రలలో చేదు మందుని నింపి మనం మింగుతున్నట్లుగా వినోదం ప్రధానంగా తీసుకుని అందులోనే నీతిని ప్రబోధించే విధంగా చిత్రాలు నిర్మించాలన్న మాట.

కాలం మారింది, ప్రేక్షకుల అభిరుచులు మారాయి. పరిశ్రమలో కొత్త పోకడలు చోటు చేసుకున్నాయి. హీరో వర్షిప్ పెరిగింది. దాంతో మాలాంటి సీనియర్ నిర్మాతలు కొంత వెనకబడ్డాం. అయినా ఫరవాలేదు. పరిశ్రమలో మళ్లీ మంచిరోజుý£స్తాయనే నమ్మకం ఉంది. నేను నా సినిమాల్లో కూడా ఎప్పటికప్ప్పుడు కొత్తవారిని ప్రోత్సహిస్తూ వచ్చాను. సత్యేంద్రకుమార్ (నటుడు), రామచంద్రయ్య (కెమెరా), యోగానంద్ (కెమెరా), ఇక మా అబ్బాయి. తులసీరాం ప్రసాద్ (నటుడు)లకు మా చిత్రాల ద్వారానే తెరకు పరిచయం చేశాను.

సొంతంగా చిత్రాలు తీయడం మానుకున్న తర్వాత “తాజ్‌మహల”, “మల్లీశ్వరి”, “పెళ్లిసందడి”, “పెద్దరికం”, “అన్నమయ్య”, “మన్మథుడు”, “పెద్దన్నయ్య”, “వీధి” - ఇలాంటి చిత్రాలు చాలానే చేశాను. ప్రస్తుతం సుమంత్ కథానాయకుడుగా నటిస్తున్న “చిన్నోడు” చిత్రంలో నటిస్తున్నాను.  ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి.  అందరికీ వివాహాలయిపోయి మనవళ్లు, మనవరాళ్లు కూడా ఎదిగిపోయారు. ముగ్గురు మనవళ్లు విదేశాల్లో వున్నారు. ఒక నటుడుగా, నిర్మాతగా, వ్యక్తిగా ఈ డెభ్బెí ఐదేళ్ల తెలుగు చలన చిత్రరంగంలో7 పదుగురి దగ్గరా మంచి అనిపించుకున్నాను.  ఆర్థికంగా గానీ, ఆరోగ్యపరంగా గానీ నాకు ఎలాంటి బాధలు లేవు. ఇక మీదట కూడా రోజులు ఇబ్బంది లేకుండా గడిచిపోతే చాలు! అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు.  


కుచల కుమారి....మేటి నర్తకి.. సరసాల జవరాలను...

తెలుగు సినిమా ప్రస్థానంలో నర్తకిగా మరపురాని నృత్యాలెన్నింటినో చేసి ప్రేక్షక మహాజనుల చేత వహ్వా అనిపించుకున్న మేటి నర్తకి కుచల కుమారి.  ‘సరసాల జవరాలను...’ (సీతారామకల్యాణం), ‘కొమ్ములు తిరిగిన మగవారూ...’ (భట్టి విక్రమార్క), ‘నెలనడిమి వెన్నెల రేయి...’ (జయసింహ), ‘రంగరంగేళి...’ (భార్యాభర్తలు) వంటి వందలాది అపురూప గీతాలకు మరపురాని నృత్యాలు చేసి ఈనాటికి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కుచలకుమారి జ్ఞాపకాలు ఈ వారం...

మా స్వస్థలం తంజావూరు. ‘సంగీతం కుచలాంబాల’ అంటే ఆ రోజుల్లో ఎరుగని వారు చాలా తక్కువ మంది. ఒక్క తంజావూరు నగరంలోనే కాకుండాదక్షిణా పథమంతటా కూడా ఆమె పేరు ఇంతో అంతో కళాశక్తి గల వారికి పరిచితమే. ఆమెకు ఐదుగురు అమ్మాయిలు. అందులో పెద్దమ్మాయి సరస్వతి. ఆమె కూతురే నేను. మా అమ్మ సోదరీమణులలో ఒకరు సుప్రసిద్ధ నటి. టి.ఆర్.రాజకుమారి. జెమినీ వారి “చంద్రలేఖ”, “మనోహర” చిత్రాల్లో ఆమె టాప్ హీరోయిన్. మా ఇంట్లో అందరూ సినిమా రంగంలో పనిచేసిన వారే.  మా పిన్ని మాట అలా ఉంచితే మా అమ్మ కూడా సినిమా నటే. ఆమె 1935 లోనే సినిమారంగంలోకి వచ్చింది. “పార్వతీ కల్యాణం”, “వికటయోగి”, “గంగావతరణ’, “మణి మేఖలై” మొదలైన సినిమాల్లో నటించింది. మా మేనమామ టి.ఆర్. రామన్న. ఈయన తెలుగు, తమిళ భాషల్లో పెద్ద నిర్మాత. తెలుగులో “కార్తవరాయని కథ”, “ఇంటికి దీపం ఇల్లాలే”, “మంచి చెడు” వంటి పెద్ద చిత్రాల్ని నిర్మించారు.  ఆయనకు ముగ్గురు భార్యలు. వాళ్లలో ఇద్దరు సుప్రసిద్ధ కథానాయికలు. బి.ఎస్. సరోజ, ఇ.వి. సరోజ. సరోజ తమిళంలో పెద్ద హీరయిన్. ఇ.వి. సరోజ తెలుగులో కూడా చాలా చిత్రాల్లో నృత్యాలు చేసింది. “ఇంటికి దీపం ఇల్లాలు”, “ఇద్దరు మిత్రులు” వంటి చిత్రాల్లో కథానాయిక వేషాలు వేసింది.  ఇక తెలుగు, తమిళ భాషల్లో ఆనాటి కుర్రకారును హుషారు పరచిన శృంగార నర్తకీమణులు జ్యోతిలక్ష్మి, జయమాలిని, ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు నా కజిన్ సిస్టర్స్. ఇదీ మా కుటుంబ నేపథ్యం.

మా అమ్మ అనేక తమిళ చిత్రాల్లో నటించింది కానీ ఎందువల్లనో తారాపథం ఆమెకుర అందని మ్రావి పండయ్యింది.  దాంతో ఆమె తిరిగి తంజావూరు వెళ్లిపోయింది.  అక్కడే నేను 06-12-1937 లో జన్మించాను. నేను పుట్టిన తర్వాత బ్రతుకు తెరువు కోసం  మా అమ్మ మళ్లీ మద్రాసు వచ్చింది. నాకు ఒక తమ్ముడు. పేరు శేఖర్. అతను ఓ వాచీ కంపెనీలో పనిచేస్తున్నాడు.  ప్రస్తుతం నేను అతని దగ్గరే ఉంటున్నాను.  నా ముద్దుపేరు కుచిలీ, గుజిలీ. ఇప్పటికీ తెలిసిన వాళ్లు నన్ను అలాగే పిలుస్తారు.  నా ఏడవ ఏటనే మా అమ్మ వళ్ళువుర్ రామయ్య పిళ్లెí దగ్గర భరతనాట్య శిక్షణ కోసం చేర్పించింది.  అప్ప్పుడే టి.నగర్‌లోని ‘విద్యోదయ’ స్కూలులో విద్యాభ్యాసం చేశాను. అక్కడ నాల్గవ ఫారం వరకూ చదివి, ఆపైన హోలీ ఏంజిల్స్ కాన్వెంటులో చదివి ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి చేశాను.

విద్యోదయలోనే సుప్రసిద్ధ నటీమణి కాంచన, నా సహాధ్యాయి. చిన్నప్ప్పుడు కాంచన చాలా అందంగా ఉండేది. వాళ్ల అమ్మ బేబీ కాంచనకు ఆ రోజుల్లోనే లిప్‌స్టిక్, రంగురంగుల గౌన్లు, రిబ్బన్లు, షూస్ వేసి చాలా నాజూకుగా స్కూలుకు పిలుచుకొని వచ్చేది.  మా అందరిలోనూ కాంచన చాలా ప్రత్యేకంగా కన్పించేది. ఆ తర్వాత నేను విద్యోదయ నుండీ హోలో ఏంజిల్స్‌కు మారడంతో మా స్నేహం కొనసాగలేదు.  మళ్లీ నేను సినిమాల్లో పెద్ద నర్తకి గా ఉన్నరోజుల్లో ఒక రో జు ‘న్యూటోన్ స్టూడియో’ లో షూటింగ్‌లో ఉండగా కన్పించింది. దగ్గరకొచ్చి ‘ఏమే కుచిలీ, ఎంత పెద్ద స్టార్‌వి అయిపోయావు’ అని ముద్దు పెట్టుకొని ప్రశంసలతో ముంచెత్తింది. నేను “కాంచనా! నీవు నాకంటే అందంగా ఉన్నావు. సినిమాల్లో సిన్సియర్‌గా ప్రయత్నించు, పైకొస్తావు” అన్నాను.  “ఆ... నాకెవరిస్తారు అవాకాశాలు” అని తేలికగా మాట్లాడేసి వెళ్లిపోయింది.  కొన్నేళ్ల తరువాత డైరెక్టరు శ్రీధర్ దర్శకత్వంలో ‘కాదలిక్క నేరమిళ్లెí’ చిత్రంలో కథానాయికగా ఊహించని తారాపథానికి వెళ్లిపోయింది కాంచన.

అయితే కాంచన నాకు చాలా మంచి స్నేహితురాలు. మొదట్లో నాతో ఎలా ఉండేదో, తారాపథానికి వెళ్లిన రోజు, ఈ రోజూ నాతో అలాగే ఉంది. గర్వం లేదు. ఎప్ప్పుడు చెన్నెí వచ్చినా నన్ను కలవకుండా వెళ్లదు. నేనంటే తనకు ఎంతో ఇష్టం.  తరచూ పుట్టపర్తిలో కలిసేవాళ్లం. ఎద్దరమÖ సాయిబాబా భక్తులమే.

నేను రామయ్య పిళ్లెí గారి దగ్గర భరతనాట్యాన్ని 1950 వరకూ క్షుణ్ణంగా నేర్చుకున్నాను.  నేను ‘ఆరంగేట్రం’ ఇవ్వకుండానే నాట్యప్రదర్శనలివ్వడం ప్రారంభించాను. అది సంప్రదాయ విరుద్ధమైనా ఆ రోజుల్లో సాహసమే.

మా పిన్ని (టి.ఆర్. రాజకుమారి) అప్పట్లో తమిళంలో టాప్ హీరోయిన్ గనుక నా సినీరంగ ప్రవేశం చాలా సులువుగానే జరిగింది. మా పిన్ని నేను చాలా చిన్న పిల్లను కదా, ముద్దుగా ఉంటానని సినిమా షూటింగ్ýకు తీసుకువెళ్లేది. ఏడవ ఏటనే “మహామాయ” అనే తమిళ చిత్రంలో కన్నాంబ కూతురు పాత్ర ధరించాను. చిన్న పిల్లను కదా, మొదటి రోజు ఆ లైట్లు, కెమెరాలు ఆ హంగామా అంతా చూసి భయపడిపోయాను. కన్నాంబ నన్ను ఒళ్లోనే కూర్చోబెట్టుకొని, లాలిస్తూ, బుజ్జగిస్తూ మధ్యమధ్యలో చాక్లెట్లు, బిస్కట్లు తీసిస్తూ నా భయం పోగొట్టింది. అప్పటి నుండీ కన్నాంబ గారు నన్ను సొంత కూతురులాగే చూసుకునేది. నేను ఎంత పెద్దస్టార్‌ని అయినా ఆమె చాక్లెట్లు, బిస్కట్లు తీసివ్వడం మానలేదు. కన్నాంబ పోయిన రోజు మా అమ్మే చనిపోయినంతగా ఏడ్చాను నేను. 

ఆ తర్వాత “ప్రభావతి”, “కృష్ణభక్తి”, “పెళ్లికూతురు”, “పరాశక్తి”, “వాళప్పి రందవళ”, “నన్‌బన”, “రక్తకన్నీర”, “లైలామజ్ను” వంటి  అనేక తమిళ చిత్రాల్లో చాలా నృత్యాలు చేశాను. ముఖ్యంగా జెమినీ వారి “అవ్వయార” చిత్రంలో కౌమారదశలో ఉన్న ‘అవ్వయార’ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాను.  ముద్దుý£లికే నా ముఖంలో ముగ్ధత్వమÖ, అప్రతిహతమైన భగవద్విశ్వాసాన్ని ఆ చిన్నతనంలోనే చాలా బాగా ప్రకటించానంటూ అప్పటి పత్రికలన్నీ నా గురించి చాలా బాగా రాశాయి.  అవ్వయార్‌గా కె.బి. సుందరాంబాల్ కు ఎంత పెద్దపేరు వచ్చిందో ప్రాయంలో ఉన్న అవ్వయార్‌గా నాకూ అంతే పేరు వచ్చింది.

ఇక ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో సుమారు పదేళ్లు నా నృత్యం లేకుండా ఉండేది కాదు. తమిళంలో బాగా పేరు వచ్చిన తర్వాత బి.ఏ. సుబ్బారావు గారు “రాజు పేద” (1954) చిత్రంలో మొట్టమొదటి సారిగా అవకాశమిచ్చారు. అందులో ‘కళ్లు తెరచి కనరా’ అన్న పాటకు నేను చేసిన నృత్యం ఆంధ్రదేశాన్ని మారుమ్రోగించింది. సినిమాలో కథకు అన్వయిస్తూ చేసిన నృత్యమది. ఆ పాట విజయవంతం కావడంతో తెలుగులో కూడా నర్తకిగా వెంటవెంటనే బుక్ అయిపోయాను.  1954 నుండి 1965 వరకూ మాగ్జిమమ్ నా డాన్స్ లేకుండా తెలుగు, తమిళ చిత్రాలు ఉండేవి కావు. ప్రేక్షకులు నా పాట, నృత్యం లేకుంటే చాలా నిరాశపడుతూ ఉత్తరాలు రాసేవారు. అదో స్వర్ణయుగం.

ముఖ్యంగా ఎన్.టి.రామారావుగారి సొంత చిత్రాల్లో నాకు చాలా అవకాశాలు కల్పించారు. ఎన్.ఏ.టి. బానర్ అంటే నా డాన్సు ఉండాల్సిందే. “జయసింహ” (1955) లో ‘నెలనడిమి వెన్నెలరేయి...’, “పాండురంగ మహాత్మ్యం” (1957) లో ‘ఎక్కడోయి ముద్దుల బావ...’, “సీతారామకల్యాణం” (1961) లో ‘సరసాల జవరాలను...’ నాకు బాగా పేరు తెచ్చిన నృత్యాలు. ఎన్.టి. రామారావు గారికి నేనంటే చాలా ఇష్టం. నేను చాలా చిన్నదాన్నే అయినా “ఏమండీ! కుచలకుమారి గారూ!” అని చాలా గౌరవంగా సెట్స్ మీద సంబోధించే వారు నా నృత్యాలంటే మక్కువ ఎక్కువ. అందుకే నా డాన్స్‌లు షూటింగ్ జరుగుతున్నంత సేపు ఆయనే ట్రాలీ స్వయంగా తోసేవారు. ఆయన సోదరుడు త్రివిక్రమరావు గారు షూటింగ్ రోజుల్లో ఇంటికి వచ్చి స్వయంగా కారులో తీసుకువెళ్లే వారు. పారితోషికాలు చాలా ఖచ్చితంగా ఉండేవి ఎన్.ఏ.టి.లో.

ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, గుమ్మడి, నేను “జయసింహ”, శత దినోత్సవాలకు ఆదోని, కడప, నంద్యాల, కర్నూలుకు వెళ్లాం. కర్నూలు అయితే వేలాదిమంది ప్రేక్షకులు మాకు నీరాజనాలు పట్టారు. వాళ్ల అభ్యర్థన మేరకు బహిరంగ వేదికపై నేను మళ్లీ ‘నెల నడిమి వెన్నెల రేయి...’ అనే పాటను అభినయించాను. అప్పటికి సంతృప్తి పడ్డారు అభిమానులు.

నాకు తెలుగులో మంచిపేరు తెచ్చిన మరో నృత్యం “దొంగరాముడు” (1955) లో ‘లేవోయి చిన్నవాడ...’ కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ పాటను ఆంధ్ర ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ఇక్కడ చెప్ప్పుకోవాల్సింది నా నృత్యదర్శకుల గురించి. శర్మ, వెంపటి పెదసత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమÖర్తి, కె.ఎస్.రెడ్డి... మొదలైన పెద్ద నృత్యదర్శకుల దగ్గర నేను పనిచేశాను. అయితే పసుమర్తి కృష్ణమÖర్తి గారి దగ్గర పనిచేయడాన్ని నేను చాలా కంఫర్టుగా ఫీలయ్యేదాన్ని.  ఆయన ఆర్టిస్టులకు పూర్తి స్వేచ్ఛ నిచ్చేవారు.  నాట్యంతో పాటు ఎక్స్‌ప్రెషన్‌కు చాలా ప్రాధాన్యత నిచ్చేవారు. కూచిపూడి మీద ఎక్కువ శ్రద్ధ ఆయనకు.

ఆయన నృత్య దర్శకత్వంలో “భట్టి విక్రమార్క”, “భార్యాభర్తలు” చిత్రాల్లో చాలా మంచి నృత్యాలు చేశాను. ‘కన్నెపిల్ల సొగసు చూడు మహారాజా’ అనే పాట ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేసింది. భార్యాభర్తల్లో పసుమర్తి నా చేత చాలా నృత్య ప్రయోగాలు చేయించారు.  నాదేమో ఓ సాధారణ నర్తకి పాత్ర నేనాడుతుంటే కథానాయకుడికి నాముఖంలో నాయిక (కృష్ణకుమారి) కన్పిస్తుంది.  ఆమేనని నాయకుడు భ్రమించి సంతోషపడుతూంటాడు. ఆ మాయ అంతరించి పోతుంటే కలవరపడుతుంటాడు.  ఆ రెండు అభినయాలు నా చేత ఏకకాలంలో పసుమర్తి గారు అభినయింపజేసేవారు.

ఇక దర్శకుల విషయానికొస్తే తమిళంలో ఎం.వి. రామన్, తెలుగులో ఎల్.వి. ప్రసాద్ గారు నాకు నచ్చిన దర్శకులు. వారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు నాకు నర్తకిగా మంచిపేరు తెచ్చిపెట్టాయి.  తెలుగులో “కనకతార”, “గౌరీ మహాత్మ్యం”, “కాళహస్తి మహాత్మ్యం”, “భలేబావ”, “శ్రీకృష్ణలీలలు”, “మహాకవి కాళిదాసు” మొ॥ చిత్రాల్లో చక్కటి నృత్యాలు చేశాను.  తమిళంలో జి.వరలక్ష్మి నిర్మించిన “హరిశ్చంద్ర”, కన్నాంబ గారి “దక్ష యజ్ఞం” నన్ను టాప్ డాన్సర్‌గా పరిశ్రమలో నిలబెట్టాయి.

ఇక్కడొక మాట చెప్ప్పుకోవాలి. ఎందుకనో తెలుగులో నేను ఒక నర్తకిగానే గుర్తించబడ్డాను. అయితే తమిళ నిర్మాతలు, దర్శకులు నన్ను నటిగా ప్రోత్సహించారు. ముఖ్యంగా సి.ఎస్. రావు దర్శకత్వం వహించిన “పోనమచ్చాన్ తిరుంబివందాన” అనే తమిళ చిత్రంలో శివాజీ గణేషన్ ప్రక్కన హీరోయిన్‌గా వేశాను. అలాగే మలయాళంలో ప్రేమనజీర్, నేను సీతారాములుగా “సీత” అనే చిత్రంలో నటించాం. నాకు ఆ పిక్చర్ చాలా బాగా పేరు తెచ్చింది. ప్రసిద్ధ తమిళ రచయిత ‘కల్కి’ రాసిన నవల “కళ్వనిన్ కాదలి” చిత్రంలో శివాజీగణేషన్ చెల్లెలుగా, “గూండుక్కిలి” అనే చిత్రంలో శివాజీగణేషన్ ప్రేయసిగా ముఖ్యపాత్రలు ధరించాను.  “కొంజుం సలైంగై” అనే చిత్రంలో నేను సావిత్రి, కుమారి కమల ముగ్గురం కలసి హీరోయిన్‌లుగా నటించాం. అందులోనే నాకు, కమలకు చాలా మంచి పోటీ డాన్సు ఒకటుంది.  ఆ నృత్యం మా ఇద్దరికీ మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

నేను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తం 200 చిత్రాల్లో నృత్యాలు, పాత్రలు ధరించాను. ఆ రోజుల్లో నేను, ఇ.వి.సరోజ, రాజసులోచన, రీటా, ఎల్. విజయలక్ష్మి... ఇలా చెలా మంది నర్తకీమణులుగా ఉండేవాళ్లం.  మాలో ఈర్ష్యాసూయలు ఉండేవి కావు.  ఎవరి చిత్రాలు వాళ్లవి, ఎవరి డాన్సులు వాళ్లవి. ఒక్కోసారి ఇద్దరు, ముగ్గరం కలసి కూడా నృత్యాలు చేసేవాళ్లం. అలా పద్మినితో కలసి “మరుమగళ”, “కావేరి”, రాగిణితో కలసి “మాంగల్యభాగ్యం”... ఇంకా చాలా చేశాను. ఎం.జి.ఆర్.గారు నన్ను బాగా అభిమానించేవారు. “మధురై వీరన’ అనే చిత్రంలో ఆయన హీరో. అందులో నా నృత్యానికి మంచి ఆదరణ లభించింది. దాంతో ఆయన మద్రాసు నుండి మధురై వరకూ ఆ చిత్ర విజయోత్సవాలకు తీసుకువెళ్లారు. కన్నడంలో ఉదయకుమార్ గారు రెండు మÖడు అవకాశాలు ఇచ్చారు. మలయాళంలో ఊర్వశి శారదతో కలిసి “మరియ కుట్టి”, “మాణిక్య కొట్టారం”చిత్రాల్లో నటించాను. ఏ భాషలోనైనా నా మాటలు నేనే చెప్ప్పుకునే దాన్ని.  నాకుర డబ్బింగ్ లేదు. నాకే కాదు  ఏ నటీనటులూ డబ్బింగును ఆశ్రయించే వారు కాదు. ఏ భాషలోని డైలాగులనైనా నేను తమిళంలో రాసుకుని ఉచ్ఛరించే దాన్ని. దాని వల్ల లిప్ మÖవ్‌మెంటు కరెక్టుగా వచ్చేది. 

సినిమా రంగంలో ఎంత పేరు తెచ్చుకున్నా నేను నృత్య ప్రదర్శన లివ్వడం మానలేదు.  నా తొలి నృత్యప్రదర్శన తిరుపప్ప్పు±రులో ఒక వివాహ సందర్భంలో 1954 జూన్ నెలలో జరిగింది.  ఆ తర్వాత నేనే సొంతంగా ఒక డాన్స్ ట్రూపు నడిపాను.  అందులోనే సుకుమారి ఒక నర్తకి (‘మురారి’ చిత్రంలో మహేష్ బాబు బామ్మ). ఆమె తర్వాత్తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో పెద్ద నర్తకిగా పేరు తెచ్చుకుంది. ఆమె సినిమాల్లోకి రాకముందు నా ట్రూపులోనే డాన్సులు చేసేది. అలా నేను నా  ట్రూపులో ఆంధ్ర, తమిళ ప్రాంతాల్లో సుమారు 500 నృత్యప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. కర్నూలు, ఒంగోలు, నర్సరావుపేట, రాజమండ్రి మొదలైన ప్రాంతాల్లో నాకు సినిమా నర్తకిగానే గాక సంప్రదాయ నర్తకిగా చాలామంచి పేరు ఉండేది. కర్నూలులో అయితే ఒకసారి నా నృత్య ప్రదర్శనలో ప్రజల్ని నియంత్రించడం చాలా కష్టమైపోయి ఆ జిల్లా కలెక్టరు, పోలీసు అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఈ సినిమాలు, డాన్సు ప్రోగ్రామ్స్ వల్ల నేను పెళ్లి కూడా చేసుకోలేదు.  కళారంగంలోనే ఉండిపోవాలనుకున్నాం.  వివాహం వల్ల ఇంట్లో పురుషాధిక్యత ఎక్కువై నా నాట్యానికి ఎక్కడ అవాంతరం ఏర్పడుతుందోననే భయంతోనే పెళ్లి చేసుకోలేదు.  అయినా నాకేం చింతలేదు.  అయితే మధ్యలో ఆర్థికంగా చాలా చిక్కుల్లో పడ్డాను.  బంధువులందరికీ అప్ప్పులపై హామీలిచ్చి వాళ్లు కట్టకుంటే నేను కట్టాల్సి వచ్చింది. అందువల్ల శరవణ్ మొదలియార్ వీధిలో ఉన్న పెద్ద ఇల్లు చాలా చౌకగా అమ్మేయాల్సి వచ్చింది.  దాంతో నిలువ నీడ కోల్పోయాను.  ఆ సమయంలో కరుణానిధి గారు ఒక ప్రభుత్వం వారి ఇల్లును నాకు చాలా చౌకగా అద్దెకు ఇప్పించి ఆదుకున్నారు.  ఇప్ప్పుడు అదే ఇంట్లో నా తమ్ముడి కుటుంబాన్ని నా దగ్గరే పెట్టుకొని ఉంటున్నాను.

ఆ తర్వాత ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి డా॥ జె. జయలలిత నన్ను ఆర్థికంగా ఆదుకున్నారు. ప్రతినెలా ఐదు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తున్నారు.  ఆ డబ్బుతో నా శేష జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది. జీవితంలో ఎన్నడూ ఎవరూ పూర్తి సంతోషంగా ఉండలేరు. కేవలం సాధు పుంగవులు మాత్రమే పూర్తి సంతోషంగా ఉండగలరు.  నేను కూడా మానసికంగా సాధు జీవితానికి అలవాటు పడ్డాను.  దైవ చింతన తప్ప నేను మరొక పని ప్రస్తుతం చేయడం లేదు. అయితే అప్ప్పుడప్ప్పుడు పాతవాళ్లు, స్నేహితులు గుర్తుకు వచ్చినప్ప్పుడు నాలో నేనే ఏడ్చుకుంటాను. అప్పట్లో గిరిజ (హాస్యనటి), ప్రముఖ నటి ఎస్.వరలక్ష్మి నాకు మంచి స్నేహితురాళ్లు. వారిద్దరూ పోయారు. ఆ ఆవేదన నన్ను కలచి వేస్తుంటుంది. ప్రస్తుతం సచ్చు (“మాయాబజార” లో చిన్న శశిరేఖ, తర్వాత్తర్వాత తమిళంలో పెద్ద హాస్యనటి) కాంచనల లతో నా కష్టసుఖాలు చెప్ప్పుకుంటుంటాను.  జయలలిత గారిని అప్ప్పుడప్ప్పుడూ కలిసి మాట్లాడి వస్తుంటాను. జయలలిత తల్లి సంధ్య నన్ను బాగా అభిమానించేవారు. ఆ అభిమానమే జయలలిత కూడా నాపై చూపిస్తుంటుంది.

తెలుగులో నర్తకిగా నా చివరి చిత్రం రామానాయుడు గారి మొదటి చిత్రం “రాముడు భీముడు”, ఆ తర్వాత కె. బాలచందర్ తీసిన “మన్మథలీల” చిత్రంలో హలం ఆంటీగా క్యారెక్టర్ వేశాను. అవే నా చివరి చిత్రాలు. రామానాయుడు గారు ఆర్టిస్టులను గౌరవించే నిర్మాత. చాలా గొప్ప హృదయం ఉన్నవారు. “రాముడు భీముడు” శత దినోత్సవాల్లో బంగారంతో తయారుచేసిన రింగ్ వాచీ బహూకరించారు. “సురేష్ ప్రొడక్షన” విలువలతో కూడిన సంస్థ. ఆ మధ్య తమిళంలో “జానకి” అనే టెలీ సీరియల్ లో నటించాను. ప్రస్తుతం ఏవైనా కార్యక్రమాలకు పిలిస్తే వెళుతుంటాను.  నాకు కలై సెల్వం, మా గురువు గారు రామయ్య పిళ్లెí పేరుతో ఒక అవార్డు వచ్చాయి.  తెలుగు ప్రాంతాల్లో నాకేమీ అవార్డులు రాలేదు.  అయినా బాధ లేదు.  అరవై సంవత్సరాలుగా నన్ను, నా నృత్యాల్ని అభిమానిస్తున్న వారికి నేనెప్పటికీ ఋణపడి ఉంటాను. ప్రేక్షకులకీ, పరిశ్రమకీ ధన్యవాదాలు.


కాంచన....నర్తకి, నటీమణి.....మనసే అందాల బృందావనం

రెండు దేవులపల్లి కృష్ణశాస్తి పాటలతో ఒక దానితో (ఎవరే పిలిచేరల్లన మెల్లన  మల్లీశ్వరి) ప్రవేశించి, మరొక పాటతో (నీలమోహన రారా, డా॥ ఆనంద్) ప్రేక్షక హృదయాల్లో సుస్థిరముద్ర వేసుకున్న నర్తకి, నటీమణి కాంచన.

ప్రతిభ ఉన్నా, పెద్దల ప్రాపు దొరకాలి. దర్శకుల చేయÖత అందాలి. ఈ రెండూ కలిపి తన అదృష్ట రేఖ కాదా?అని తన రేకను పండించుకున్న అభినేత్రి కాంచన.

1964 నుండి 1980 వరకు ఒకటిన్నర దశాబ్దకాలం తెలుగు, తమిళ సినిమా రంగాలను సమ్మోహనపరచిన ‘కాంచన’ జ్ఞాపకాలు ఈ వారం...

నేను 16-08-1939 లో పుట్టాను.  మా స్వస్థలం విజయవాడ అయినా, మా నాన్నగారి వృత్తిరీత్యా మేము చెన్నెíలో స్థిరపడ్డాం.  నేను చెన్నెíలోనే పుట్టాను. మా నాన్నగారు శ్రీ పి. రామకృష్ణశాస్తి, ఛార్టెడ్ ఇంజనీరుగా పనిచేసేవారు. మా అమ్మగారు శ్రీమతి విద్యుద్వల్లి తాయారు. నాకొక చెల్లెలు.  ఆమె పేరు గిరిజ. విజయావారి “పెళ్లి చేసి చూడు” లో బాలపాత్ర పోషించింది ఆమే.  శశిరేఖ అనే పేరుతో కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. 

స్వతహాగా మంచి కట్టుబాట్ల మధ్య పెరగడం వల్ల చిన్నప్ప్పుడే నాకు చక్కటి అభిరుచి కల్గింది.  చిన్నతనం నుంచే నాకు సంగీతమంటే విపరీతమైన ఇష్టం.  రేడియోలో వచ్చే పాటల్ని ఆసక్తిగా వింటూ - ఆ గొంతులతో నా గొంతు కలిపి పాడుతూ ఆనందిస్తూ ఉండేదాన్ని.  మరీ ఇష్టమైన పాటలు వచ్చినపుడు కాళ్లు కదుపుతూ వచ్చీరాని గంతులు కూడా వేస్తూ ఉండేదాన్ని.

మా అమ్మానాన్నలు నా లోని కళాతృష్ణను గమనించి నాట్యంలో ప్రవేశపెట్టారు. నా తొమ్మిదవ ఏటనుంచో వడయార్ రామయ్య పిళ్ళెíగారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను.  నా అసలు పేరు వసుంధరాదేవి. ఇంట్లో వాళ్లు ‘వసూ’ అని, బయటివాళ్లు ‘దేవి’ అని పిలిచేవాళ్లు. మా నాన్న గారికి సినిమావాళ్లతో బాగానే పరిచయాలుండేవి.  “మల్లీశ్వరి” చిత్రమే నాకు తొలి సినిమా అనుభవం.  బి.ఎన్. రెడ్డి గారు నన్ను చిన్నమల్లి వేషానికని అడిగారు. నాకూ ఉత్సాహం, మా పెద్దల ప్రోత్సాహం ఉన్నాయి గనక, తప్పకుండా వేస్తానని చెప్పాను.  మొదట్లో ఆయన మల్లీశ్వరి పాత్రని పద్మిని గారి చేత వేయించాలనుకున్నారు.  నాలో ఆమె పోలికలున్నాయని, చిన్న మల్లిగా నేను సరిపోతాననీ అనుకున్నారు.  కానీ తర్వాత ఆ పాత్రను భానుమతి గారు వెయ్యడంతో, కాస్త దగ్గర పోలికలు గల బేబి మల్లిక చేత వేయించారు. ఎలాగూ నా చేత పాత్ర వేయించాలనుకున్నారు గనుక, నాట్య ప్రదర్శనంలో ప్రధానంగా వచ్చే గోపిక వేషం ఇచ్చారు.

హైస్కూలు విద్య ముగించి చెన్నెí ఎతిరాజ్ కాలేజీలో చేరాను.  ఆ కాలేజీలో ప్రదర్శించే అనేక నాటకాల్లో పాý£్గనేదాన్ని. అక్కడి వాళ్లతో మంచి నటిగా ప్రశంసలు పొందాను.  కొన్ని బహుమతులు గెల్చుకున్నాను. ఇంటరు పూర్తి చేసిన తర్వాత చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. పరిస్థితులు అలా వచ్చాయి.  మంచి సంపన్నుల కుటుంబమే అయినా, ఎందుకో ఆ సమయంలో చితికిపోయారు. ఇల్లు నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకున్నాను.  అదే విషయమై ఆలోచిస్తూ ఒకరోజు ఆకాశం వంక చూస్తూ పడుకున్నాను. ఒక విమానం గాలిలో పోతోంది.  నేను మన సంప్రదాయంలో ఉన్న స్తీలెవరైనా ఇందులో పనిచేస్తుంటారా? అని అనుకున్నాను. సరే మనం చేద్దాం అనుకున్నాను.  అలా 1960 లో ఎయిర్‌లైన్స్‌కి అప్లెí చేశాను. ఇంటర్వ్యూకి పిలిచారు.  ఎయిర్ హోస్టస్‌గా వేశారు అధికారులు.  రెండేళ్లు ఆ ఉద్యోగం చేశాను.

విమానాల్లో ఎంతోమంది పెద్దవాళ్లు, సినీ, రాజకీయరంగ పురుషులు తరచూ ప్రయాణం చేస్తుండేవారు. ఒకసారి నేను హోస్టెస్‌గా ఉన్న విమానంలో సంగం థియేటర్ (బెంగుళూరు) యజమాని మాంద్రే, హిందీ నటుడు దిలీప్‌కుమార్ గార్లు ప్రయాణం చేస్తున్నారు. మాంద్రే గారు నన్ను చూసి “మీకు సినిమాల్లో నటించడం పట్ల ఆసక్తి ఉందా?” అని అడిగారు. “నేను తప్పకుండా” అని చెప్పాను.  ఎందుకంటే నాకు సినిమా కొత్తేమీ కాదు. మెట్రిక్ చేసేటప్ప్పుడు ఆర్ట్ డైరెక్టర్ వాలి గారు అంజలీ పిక్చర్స్‌లో ‘నాగకన్య’ పాత్రకు ఒక యువతి కావాలని అన్వేషిస్తూ మా ఇంటికి వచ్చి ఒక బంగారు నక్లెసు పారితోషికంగా ఇస్తామని చెప్పి మా ఇంట్లో వాళ్లతో మాట్లాడి తీసుకువెళ్లారు.  అలాంటివే “శ్రీకృష్ణలీలలు” (1959), “భట్టి విక్రమార్క” (1960) చిత్రాలలోని పాత్రలు. అయితే అవేవీ దర్శకుల చేతుల్లో పడి మెరుగులు దిద్దబడిన పాత్రలు కావు. ఏదో ఒక షాట్, రెండు షాట్లు అంతే... కనుక వాటిని నేనెక్కడా చెప్ప్పుకోను కూడా.

సరే  మాంద్రే గారు అన్నారు కదా! అని మళ్లీ ఆలోచించాను. అసలు జీవితమే అంత! అదొక మహాప్రవాహం. ఈ ప్రవాహం ఎట్నుంచి ఎటుపోతుందో ఎవరూ చెప్పలేరు. ఆనకట్టలు కట్టినా, ప్రయోజనం ఉండదు. మనం ఆశించిన ప్రకారం ఈ ప్రవాహం ఎప్ప్పుడూ పరుగెత్తదు. దాని లక్ష్యం దానిదే. మధ్యలో అనేక మలుపులు తిరుగుతుంది.  అనేక బండరాళ్లనూ, కొండలనూ ఎదుర్కొంటుంది.  ఒక చోట నెమ్మదిగానూ, మరోచోట జోరుగానూ సాగుతుంది.  చెప్పొచ్చేదేమిటంటే ఈ ప్రవాహాన్ని ఒక మార్గం గుండా మళ్లించాలని మనం అనుకున్నా, మళ్లించటం మాత్రం మన తరం కాదు.  అదేవిధంగా మలుపు తిరుగుతున్నప్ప్పుడు కూడా తిరగనివ్వకుండా నిరోధించటం కూడా మన శక్యం కాదు. అది ఎట్నుంచి ఎటు వేళ్లాల్సిన రేఖ ఉన్నదో - అట్లా వెళ్లవలసినదే! అందుకే నేను ఆశించిన విధంగా జరిగినందుకు ఎప్ప్పుడూ ఆశ్చర్యపోలేదు. 

బాంబేలో నాకు మేకప్ టెస్టు జరిగింది.  మహేష్‌కౌల్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రమది. ఆ టెస్టు ఓ.కే. అయింది.  ఆ రోజుల్లో  ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరేటప్ప్పుడు గానీ, వదిలేటప్ప్పుడు గానీ మనం డిపాజిట్ కట్టాలి.  మాంద్రే గారు డిపాజిట్ ఇచ్చేసి u£ంబాయి వచ్చేయమన్నారు నన్ను.  నేను “సరే చూద్దాం” అని చెప్పి వచ్చేశాను.

బాంబేకి వెళ్లేటప్ప్పుడు మరో సంఘటన జరిగింది.  నేను వెళ్తున్న ఫ్లెíట్ లోనే డైరెక్టర్ శ్రీధర్ “దిల్ ఏక్ మందిర” చిత్ర నిర్మాణం పనిమీద బాంబే వెళుతున్నాను. కోవే చెళియన్ అనే తమిళ నిర్మాత కూడా అందులోనే ప్రయాణం చేస్తున్నారు.  ఆయన నన్ను పిలిచి “సినిమాల్లో వేషం వేయటం మీకు ఇష్టమేనా?” అని అడిగారు.  ఆయనే శ్రీధర్‌కు నన్ను పరిచయం చేశారు. ఆయన నన్ను తన సినిమాలో చేయమన్నారు.  నేను బాంబే వెళుతున్న సంగతి చెప్పాను. “బాంబే పిక్చరు లేకపోతే నాకు వర్క్ చేయండి” అన్నారాయన. మాంద్రేగారు ఒప్ప్పుకోమన్నారు. అటూ ఇటూ రెండు పడవల మీద ప్రయాణం చేయడం ఇష్టం లేక శ్రీధర్ గారు సినిమాలో పనిచేయడానికే నిశ్చయించుకున్నాను.

ఆ రోజుల్లో పరిస్థితులు అలాంటివి. తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకోవాల్సిన స్థితి లేదప్ప్పుడు. అంతా గందరగోళంగా ఉంది పరిస్థితి. డబ్బు అవసరం చాలా ఉంది. అందుకోసం ఏదూఓ ఒకటి చేయాలి.  అమ్మా నాన్న బాగుంటేనే కదా మేం బాగుండేది. కనుక తల్లిదండ్రులను సంప్రదించడం ప్రశ్నే కాదక్కడ. పరిస్థితిని బట్టి అలా చేసుకొంటూ పోయాను.  అలా శ్రీధర్ గారి “చిత్రాలయ” సంస్థకు నటిగా మొదటి సంతకం చేశాను. ఆ చిత్రం “కాదలిక్క నేరమిళ్లెí”. తమిళంలో తొలి ఈస్ట్‌మన్ కలర్ చిత్రమదే.  ముత్తురామన్ అందులో హీరోగా నటించారు. ఆ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించి, తమిళంలో నేను పెద్ద స్టార్‌ని అయిపోయాను.  డైరెక్టర్ శ్రీధర్ గారే నా పేరు కాంచనగా మార్చి, వెండితెరకు పరిచయం చేశారు.  ఎందుకంటే తమిళంలో వైజయంతి మాల గారి తల్లి వసుంధరాదేవి ఉండేవారు. అంచేత ఆ కన్ప్యూషన్ లేకుండా, పేరు మార్చారు. పైగా ఆ పేరు పాతగా ఉందనేది మరో కారణం. తెలుగులో నేను బుక్ అయిన మొదటి చిత్రం రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ వారి “వీరాభిమన్యు” (1965) అయినా ముందుగా విడుదలైన చిత్రం “ప్రేమించి చూడు”. “వీరాభిమన్యు” తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ నిర్మించబడింది. రెండు భాషల్లోనూ నేను ‘ఉత్తర’ పాత్రను ధరిస్తే తమిళంలో ఎ.వి.ఎమ్.రాజన్, తెలుగులో శోభన్‌బాబు ‘అభిమన్యు’ పాత్రధారణ చేశారు. రవికాంత్ నగాయిచ్, వి.మధుసూదనరావు, ఆరుద్ర, సీ॥ సముద్రాల, డూండీ వంటి మహనీయుల సమిష్టి కృషి ఫలితంగా “వీరాభిమన్యు” ఘనవిజయం సాధించింది.  నా చలనచిత్ర జీవితానికి మంచి పునాదులు వేసిన చిత్రమది.  శోభన్‌బాబు, నేను భయపడుతూ భయపడుతూ నటించాం.  మధుసూదనరావు గారు శోభన్ గారి మీద విపరీతంగా కేకలేసేవారు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే ముందు ఒక కీలకమైన సన్నివేశానికి శోభన్‌బాబు గారు కొత్త. ఆ కారణంగా ఆయన ఎంతో శ్రమపడి నటిస్తున్నప్పటికీ సరైన ‘ఎఫెక్ట’ వచ్చేది కాదు.  ఎప్పటికీ టేక్ ఓకే అయ్యేది కాదు. పైగా ఆయనకు జ్వరం. చివరకు చిత్ర నిర్మాత డూండీ గారికి విసుగొచ్చి ‘మరి లాభం లేదు. ఈ కుర్రాడు వద్దు. చేయలేడు.  ఈ పాత్రకి ఇంకెవరినైనా వేసుకుందాం’ - అన్నారు.  అప్ప్పుడు అక్కడున్నవారంతా “అయ్యయ్యో పాపం అంతపని చేస్తే ఎలా - కుర్రాడి భవిష్యత్తు దెబ్బతింటుంది. అతని ‘లైఫ’ పోతుంది. మరో ఛాన్సు యిచ్చి చూడండి” - అని సలహా ఇచ్చారు. అలాగే ఆ మరునాడు మళ్లీ అదే సన్నివేశాన్ని ఆయన మీద చిత్రీకరించడం, ఆ షాట్ ఓకే అవడం జరిగింది.  ఆ చిత్రంతోనే ఆయనకు మంచిపేరు వచ్చింది.

ఆ సినిమాలో నేను కూడా చాలా శ్రమ పడ్డాను.  ముఖ్యంగా ఆఖరు దృశ్యాల్లో అభిమన్యుడు చనిపోయాడని తెలిసినా, లేదు అతడు పోలేదు. బతికే ఉన్నాడనే భ్రాంతిలో నటించడం... చాలా డిఫికల్టు సీను అది. జి. వరలక్ష్మి, ఎస్. వరలక్ష్మి, ఎన్.టి.రామారావు వంటి మహా నటీనటులందరూ నా చుట్టూ ఉంటారు.  వాళ్ల మధ్యలో కేంద్రబిందువు నేను. ఇంక ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఊహించుకోండి. నాకు జ్వరం వచ్చేసింది. అప్ప్పుడు వి. మధుసూదనరావు గారే ధైర్యం చెప్పి, రామారావు గారి నటనను క్షుణ్ణంగా పరిశీలించి, అలాగే చేయమన్నారు.  అలా అంత గొప్పవాళ్ల శిక్షణలో తయారయ్యాం మేమంతా.

శోభన్‌బాబు, నేనూ కలిసి నటించిన మరో చిత్రం “కల్యాణమండపం” (1971). కన్నడంలో నిర్మితమైన ‘గజ్జెపూజ’ ఆధారంగా తెలుగులో తీసిన చిత్రం. కన్నడంలో కల్పన ధరించిన పాత్రను తెలుగులో నేను ధరించాను.  ఆ చిత్రంలో నేను నటిస్తున్నప్ప్పుడు ‘గ్లామర్ పాత్రలు ధరించే అమ్మాయి... ఇంత బరువైన పాÊఉరతను పోషింగలదా’ - అని సందేహపడ్డారు కొంతమంది.  అపపటికీ నేను చెప్పేశాను. “నేను బాగా చెయ్యలేను అనిపిస్తే మీరు వేరే ఎవరినన్నా చూసుకోండి’ - అని. ఎలాగైతేనేం ఆ చిత్రంలో పట్టుదలతో కృషిచేసి నటించాను. చిత్రం విజయవంతమైంది.  అప్ప్పుడన్నారు ‘జెమినీ’ బాలూగారు, “కొన్ని కొన్ని కీలకమైన సన్నివేశాలల్లో కల్పన కన్న కాంచన బాగా చేసింది’ - అని. వి. మధుసూదనరావు గారు నా నుండీ మంచి ఫెర్మామెన్సు రప్పించడానికి చాలా శ్రమ పడ్డారు.  నేనొచ్చిన కొత్తలో కెమెరా ముందు నుంచుని చెప్పింది చెప్పినట్టు చేయడం తప్ప, పాత్రల పరిశీలనా జ్ఞానం లేదు. ఒకవేళ స్వల్పంగా ఉన్నా ఆధునిక సాంఘిక వ్యవస్థలో యువతుల ప్రవర్తన మాటలతీరు మాత్రమే కొద్దిగా తెలుసు.  ఈ విధంగా ఆయన దగ్గర కొచ్చిన నేను తెలుగు సంభాషణలు చెప్పడంలో తొలిసారిగా షాక్ తిన్నాను.

అదీగాక “వీరాభిమన్యు” పౌరాణిక చిత్రం. పాత్రల హావభావ విన్యాసాల్లో సంభాషణల ఉచ్ఛారణలో నేనెరిగిన దానికి పూర్తిగా భిన్నమైన వైవిధ్యంతో గూడిన ‘శిల్పం’ ఉంది. దానికి అవసరమైన ధోరణిలో చెప్పడానికి నేను చాలా కష్టపడ్డాను.  తెలుగు అమ్మాయినై యుండి తెలుగు డైలాగ్ చెప్పలేకపోవడమేమిటి అన్న ఆయన కామెంట్ నాకు షాక్‌నిచ్చింది. 

అనర్గళంగా ఇంగ్లీషు, తమిళ భాషలు మాట్లాడగలిగిన నేను నా మాతృభాషను సరిగా ఉచ్ఛరించలేక పోతున్నానన్న వ్యాఖ్య నా హృదయం మీద దెబ్బతీసిన మాట నిజం.  అయినా కృంగిపోలేదు నేను. పట్టుదల పెరిగింది.  ఆనాడు ఆయన నా మీద ప్రయోగించిన విమర్శనాస్తం “పవిత్రబంధం”, “ఆత్మగౌరవం”, “కల్యాణ మండపం” చిత్రాల్లో మంచి పాత్రలు నేనే స్థితికి ఎదిగింది.  అప్పట్నుంచి ఆఖరి సినిమా దాకా కూడా నేను ఏ పాత్రను నిర్వహిస్తున్నా, ఎంతో ఓర్పుతో ఆయన నేర్పిన మార్గదర్శక సూత్రాలను మననం చేసుకుంటూనే పాత్ర స్వభావాన్ని నిశితంగా చూడ్డం, అందులోంచి ఉత్పన్నమయ్యే రసావేశావస్థల్ని పసికట్టడం, పరిశ్రమించి వాటిని సొంతం చేసుకోవడం. ఆ అవస్థలకు అనుగుణమైన విధంగా సంభాషణల్ని ఉచ్ఛరించడం, ఇలాంటి అన్ని విషయాల్లోనూ నేను ముందుకు నడిచాను. మధుసూదనరావు దర్శకత్వంలోనే “మనుషులు మారాలి” (1969), “పేదల బ్రతుకులు” (1981) అనే చిత్రాల్లో కూడా చాలా మంచి పాత్రలే చేశాను.

ఆ రోజుల్లో పరిశ్రమలోని ఆర్టిస్టులందరికీ వేషాలుండేవి. ముఖ్యంగా ఆరోజుల్లో హీరోలు నలుగురే. రామారావుగారు, అక్కినేని గారు, శోభన్‌బాబు, కృష్ణ వీళ్లే. ఈ రోజు జూఖీలిజీగి లీళిగి రిరీ బి ¿లిజీళి. అయితే అప్ప్పుడలా కాదు. ఒక సినిమా అంటే ఒక కుటుంబం లాంటిది. సూర్యకాంతం, నిర్మలమ్మ, జగ్గయ్య... ఇలా అందరం కలిసి ఒకే సినిమాల్లో విభిన్న భూమికల్ని ధరించేవాళ్లం.  దర్శక నిర్మాతలే ఫలానా కారెక్టరుకు ఫలానా వాళ్లు అని నిర్ణయించేవారు. మేము కూడా సంస్థ మంచిదై, సబ్జెక్టు మంచిదైతే ఒప్ప్పుకుఏ వాళ్లం.  అలా నిర్మాతల్ని, దర్శకుల్ని కాదనుకోలేక గెస్ట్ పాత్రలూ ధరించాను.  ఒక చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు చిత్రంలో ‘గెస్ట’ లు గా ‘గెస్ట’ పాత్రలు పోషించడం విచిత్రం. ఆ విచిత్రాన్ని అప్పటి రోజుల్లో మొదటిసారిగా చూపించారు దర్శకులు తాతినేని రామారావు. జమున, జయలలిత, గిరిజ, సూర్యకాంతం, గీతాంజలి, ఛాయాదేవి... ఇలా అప్ప్పుఙడు డిమాండులో ఉన్న మేమంతా “నవరాత్రి” (1966) లో ఓ పిచ్చాసుపత్రి సీన్‌లో నటించాం. గెస్ట్‌లుగా ఎవరినో చూపించడం దేనికి... తారల్ని చూపిస్తే బావుంటుందని సావిత్రిగారు సలహా ఇస్తే, మమ్మల్ని సంప్రదించి, ఒప్పించి రప్పించారు తాతినేని రామారావు.

అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన నాయికగా నటించిన మొదటి చిత్రం “ఆత్మ గౌరవం” (1966). అంతేకాదు నేటి ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ గారు తొలిసారిగా దర్శకుడుగా పరిచయమైన చిత్రమÖ, ఆయన దర్శకత్వంలో మొదటిసారిగా నేను నటించిన చిత్రమÖ అదే కావడం మరో విశేషం.  ఈ చిత్రంలో నాది చాలా టిపికల్ రోల్. గ్లామర్ ప్లస్ నటనకు అవకాశమున్న పాత్ర.  సావిత్రి, షావుకారు జానకి... వీళ్ల రేంజ్ రోల్ అది. నటించాలి - నటించినట్టు కనబడకూడదు, అందులో లీనమైనట్లు నటించాలి. నిజంగా సావిత్రి, షావుకారు జానకి... వీళ్లు మహా నటీమణులు. మాదేముంది మాదంతా జుబీబీరిఖిలిదీశిబిజి జూదీశిజీగి. ఏదో ఒక  ఉద్యోగం లాగా...అది గాకపోతే ఇది, ఇది గాకపోతే అది... కానీ వాళ్లు చాలా స్టగుల్ పడి నచ్చారు ఇండస్టీకి.  అందుకే నటన ఒక తపస్సు వాళ్లకు. ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తారు.  జానకి గారి చెల్లెలుగా “మంచి కుటుంబం” (1968) చిత్రంలో నటించాను.  జానకి గారి నట విశ్వరూపం ఆ సినిమాలో కన్పిస్తుంది.  ఆమె నటన చూసి నేను చాలా నేర్చుకున్నాను.  ముఖ్యంగా కారెక్టర్ ఇన్వాల్వ్‌మెంటు ఆమె నుండే నేర్చుకోవాలి. మా ఇద్దరి కాంబినేషన్‌లో “మనసే అందాల బృందావనం” ఇప్పటికీ ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న పాట. అందుకే జానకి గారిని, సావిత్రి గారిని ప్రజలు ఇప్పటికీ అనుకుంటుంటారు.

ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు మాకు ఒక స్కూలు టీచరు లాంటివారు. జోక్స్ వేసేవారు అవసరమైన చోట వాతా పెట్టేవారు.  అయితే ఆ సమయంలో వారి సలహాలు మాకు చాలా అవసరం కూడా. “ఆయన కాంబినేషన్‌లో నేను కథానాయికగా చిత్రాల్లో నటించాను. “ధర్మదాత” (1970), “పవిత్రబంధం” (1971), “మంచివాడు” (1974) తదితరాలు మా జంటకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఆయన కాంబినేషన్‌లో “మంచి రోజుý£చ్చాయి” (1972) చిత్రంలో చాలా సంఘర్షణాత్మక పాత్రను పోషించాను.  అహంకారం, రోషం, పశ్చాత్తాపం ఈ భావాలన్నీ ఏక కాలంలో పలికించేందుకు అవకాశమున్న ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.  దర్శకులు వి. మధుసూదనరావు 2007లో నేను అక్కినేని నాగేశ్వరరావు 84 వ జన్మదినోత్సవాల్లో ‘రాగ సప్తస్వరమ’ నిర్వహణలో స్వర్ణ కంకణాన్ని అందుకోవడం నాకు ఆనంద దాయకమైన విషయం.

ఇక చెప్ప్పుకోవాల్సింది డా॥ నందమÖరి తారక రామారావు గారి గురించి. ఆయన షూటింగ్ సెట్టులో ఉన్నాడంటేనే మేమంతా గప్‌చిప్‌గా ఉండిపోయే వాళ్లం. కారెక్టర్, డైలాగ్ వీటి మీదే మా దృష్టంతా ఉండాలి. ఆయన నిద్రపోతూ అలా మమ్మల్ని ఓరకంటితో చూసేవారు. మేమంతా అడ్వాన్సుగా మేకప్‌లో ఉండాలి. లేకుంటే ఆయన చేతిలో ఇక అయిపోయామన్న మాట.  ఆయన సరసన “డాక్టర్ ఆనంద” (1966), “శ్రీకృష్ణావతారం” (1967), “కలిసొచ్చిన అదృష్టం” (1968), “తాతమ్మ కల” (1974), “శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర” (1984) తదితర చిత్రాల్లో కథానాయికగా నటించాను.  ఆయన దర్శకత్వంలో “దానవీర శూర కర్ణ” (1977) చిత్రంలో సుభద్రగా నటించాను. క్లెíమాక్సు సీన్‌లో అభిమన్యుడు (బాలకృష్ణ) చనిపోయి ఉంటాడు.  ధర్మరాజాది పాండవులు, శ్రీకృష్ణుడు అందరి ముందూ అభిమన్యు శవబ మీద పడి రోదిస్తూ, వాళ్లను “మీరింత మంది ఉండీ ఈ పసివాణ్ణి కాపాడలేక పోయారా?” అని నిలదీసే ఘట్టం. రామారావు గారు నా దగ్గర కొచ్చి “ఏమండీ! కాంచనగారూ ఏడవడానికి సిద్ధంగా ఉన్నారా?” అని హుందాగా అడిగారు.  నేను సౌమ్యంగా, ఆర్దంగా చేయాలేమోననుకుని ఆ ఉద్దేశ్యాన్నే కనబరిచాను.  ఆయన “లేదు లేదు మీలో ఆవేశం బరస్ట్ అయిపోవాలన్నారు”. వారి ఆజ్ఞమేరకు అలాగే చేశాను.  నాకు జ్వరమొచ్చేసింది. నిజంగా ఎన్.టి. రామారావుగారు ఒక దీక్షతో ఆ సినిమాను రూపొందించారు. ఆ సినిమా షూటింగ్‌లో కేవలం నిమ్మరసాన్నే తీసుకునే వారాయన. అదేమిటండీ అని అడిగితే “అదంతే” అనే వారాయన.  అంత తపస్సు చేసారాయన.  అందుకే ఆ సినిమా ఘన విజయం సాధించింది.  

అప్ప్పుడప్ప్పుడూ టీ.వీ.లు చూస్తుంటే ఆ మహనీయులందరూ గుర్తుకు వస్తుంటారు నాకు. రామారావు గారు, శివాజీ గణేశన్ గారు, భానుమతి గారు, శాంతకుమారి గారు, జెమినీ గణేశన్ గారు... వీళ్లందరినీ చూసి ఏడ్చుకుంటూ ఉంటాను. నా దురదృష్టం వీళ్లందరినీ ఆఖరి రోజుల్లో చూడలేకపోయాను.  వాళ్లంతా మన లెజెండ్స్.

రామారావు గారు ప్రజల కష్టసుఖాలోÊ్ల కూడా పాలు పంచుకునే వారు.  రాయలసీమ క్షామ నివారణార్థం, సైనికుల సంక్షేమ సహాయార్థం... ఇలా అనేక మార్లు రాష్టమంతా పర్యటించి నిధులు వసూలు చేసి ప్రభుత్వానికి అందించారు.  ఆ టీమ్‌లో నేను కూడా ఉన్నాను.  సావిత్రి, రాజ సులోచన, దేవిక, జగ్గయ్య, ఘంటసాల, ఛాయాదేవి, పుండరీకాక్షయ్య... ఇలా అప్పటి సినీ ప్రముఖులంతా జోలెపట్టి చందాలు వసూలు చేశాము. అలా రాష్టమంతా పర్యటించి వచ్చిన తర్వాత స్టార్‌నైట్ కార్యక్రమాలు జరిగేవి.  మేమంతా ఎంతో ఉత్సాహంగా పాý£్గనే వాళ్లం. జమున గారు రాష్టమంతా ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకం ఆడించారు. అందులో నేను, సుజాత (భీష్మ ఫేం), రమోలా అందరం పాý£్గనే వాళ్లం. జమున గారు చాలా అంకితభావమున్న నటి. ఒకసారి శ్రీకృష్ణతులాభారం నాటకం ఆడుతుంటే ప్రేక్షకుల్లో ఎవరో ఒక తుంటరి పెద్దరాయి విసిరాడు. అది సరాసరి ఆమె ముఖం మీదే పడి, చిన్నపాటి గాయం అయింది.  అయినా నాటకం రసాభసా కాకుండా బాధకు ఓర్చి నాటకాన్ని రక్తి కట్టించారు జమున గారు. హైదరాబాదు వెళ్తే తమ ఇంట ఆతిథ్యమివ్వకుండా ఏ ఆర్టిస్టును వదిలిపెట్టదామె.  పాతవాళ్లంటే అంత ప్రేమ జమున గారికి. పైగా మేమంత పుట్టపర్తిలో తరచూ కలుసుకునే వాళ్లం.

ఎ.సి. త్రిలోక్ చందర్ దర్శకత్వంలో తెలుగులోనూ, తమిళంలోనూ తయారైన చిత్రం ఏ.వి.యం. వారి “అవేకళ్ళు” (1967). తెలుగులో కృష్ణ హీరో అయితే తమిళంలో రవిచంద్రన్ హీరో - రెండు భాషల్లో నేనే కథానాయికని. అబ్బ చాలా అవస్థ పడ్డాను అప్ప్పుడు. కృష్ణ, రవిచంద్రన్‌లు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి షూటింగ్ ముగించుకుని వెళ్లి పోయేవారు.  నేను మాత్రం ఇరుక్కు పోయేదాన్ని. వేరే ఏ చిత్రం షూటింగ్‌లోనూ పాý£్గనడానికి వీలు లేకుండా పోయేది.  అస్సలు రెస్ట్ ఉండేది కాదు. ఆ సమయంలోనే నాకు జ్వరం కూడా వచ్చేసింది.  అయినా రాత్రి పగలూ షూటింగ్‌లో పాý£్గనేదాన్ని. అప్పట్లో కృష్ణ కొంచెం భయపడే వారు. కొత్తకదా! నేనే ఆయనకి ధైర్యం చెప్పి ప్రోత్సహించే దాన్ని. ఆయన చాలా మంచివారు. ఆ తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో ఐదు చిత్రాý£చ్చాయి. “నేనంటే నేను” (1968), “వింత కాపురం” (1968), “తల్లీ కొడుకులు” (1973) వంటి చిత్రాలు మా కాంబినేషన్‌లో ఎలా విజయం సాధించాయో అందరికీ తెలిసిందే! ముఖ్యంగా “నేనంటే నేనే” చిత్రంతోనే కృష్ణంరాజు గారు విలన్‌గా మారారు.  ఆయన హీరోగా వచ్చి విలన్‌గా మారి... మళ్లీ హీరోగా నిలదొక్కుకొని నిర్మాతగా మారటం, చాలా మంచి సినిమాలు తియ్యటం... ఇవన్నీ నాకు ఈ రోజున గొప్ప జ్ఞాపకాలే.

ఇలా హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లోనే కేటాయింపు నృత్యాలూ చేశాను.  ముఖ్యంగా అంజలీ పిక్చర్సులో. అంజలీదేవి గారన్నా, ఆదినారాయణ రావు గారన్నా నాకు చాలా ఇష్టం.  వారి మాటను కాదనలేక “సతీసుమతి” (1967) లో వాంప్ రోల్ వేశాను. మళ్లీ వారి పిక్చర్ “భక్త తుకారాం” (1973) లో ‘పూజకు వేళాయెరా’, ‘సరిసరి వగలు తెలిసెను గడుసరి’ పాటలకు  వాంప్ నృత్యాలు చేశాను.  అలాంటిదే “కంచుకోట” (1967) కూడా.

“మాయామచ్ఛీంద్ర” (1975) చిత్రంలో నేను మోహినిగా ఒక నృత్యం చేశాను. అప్పటికే నేను ‘హీరోయిన’ గా ముఖ్యమైన పాత్రలు ధరిస్తూ చాలా బిజీగా ఉండేదాన్ని.  ఆ సమయంలో పింజల సుబ్బారావు గారి ఆఫీసు నుండి వెంపటి పెదసత్యం గారు ఫోన్ చేసి, “అమ్మాయ్... నువ్వు నాకోడాన్సు చేసి పెట్టాలి” అన్నారు.  ‘అంతపెద్ద పిక్చర్ తీస్తూ మంచి కేరక్టర్ ఇవ్వకుండా డాన్స్ ఏమిటండీ’ - అని, “మీరెన్ని రోజులైనా తీసుకోండి. కానీ నాకు మాత్రం హీరోయిన్ పారితోషికం ఇవ్వాల్సిందే” - అని చెప్పాను. చివరకు హీరో రామకృష్ణ గారి ద్వారా కబురు పంపారు.  నేను అంగీకరించి నృత్యం చేశాను.  ఆ డాన్సు చిత్రీకరణ సమయంలో నేను ఏదో వ్రత దీక్షలో ఉన్నాను. అంచేత ఏమీ ఆహారం తీసుకోకుండా నియమనిష్ఠలతో ఉండేదాన్ని. అలాగే డాన్సు చేసాను. చిత్రం ఏమిటంటే ఆ చిత్రంలో నేను చేసిన నాట్యం చూసి ఎంతోమంది బావుందని  చిత్రాన్ని కొనుక్కున్నారు.  వారిలో ఎం.ఎస్. రెడ్డిగారు కూడా ఉన్నారు. తీరా విడుదలైన తర్వాత ఆ పాట - నా డాన్సు తప్ప ఏదీ బాగాలేదని ప్రేక్షకులు సినిమాను తిప్పికొట్టారు.  ఎం.ఎస్.రెడ్డి గారైతే “నీ డాన్సు చూసి మోసపోయాం. ఆ కథేంది, ఆ తియ్యడమేంది, నిలువునా మునిగిపోయాం” అని వాపోయారు పాపం.

ఎం.ఎస్.రెడ్డి గారికి ఎందుకనో నేనంటే చాలా అభిమానం.  ఎక్కడ కన్పించినా చాలా ఆప్యాయంగా పలుకరించేవారు. ఈ మధ్య 2009 లో అనుకుంటా... తిరుపతి నగరంలో ‘సప్తగిరి’ ప్రధాన సంపదాకులు డా॥ శైలకుమార్ గారి సలహా మేరకు అప్పటి తి.తి.దే. పాలకమండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నన్ను చాలా ఘనంగా సత్కరించారు. స్వామి సన్నిథిలో సత్కారమంటే మాటలా, నా జీవితంలో మధురమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే సన్మానమది. ఆ సభలో ఎం.ఎస్.రెడ్డి గారు కూడా పాý£్గన్నారు.  ఆయన నన్ను చూడగానే, 1975 లో నా గురించి ఒక పద్యం రాశాడట. అది అప్ప్పుడు విన్పించడానికి వీలు లేకపోయిందట, మళ్లీ ముప్ఫెí ఐదేళ్ల తరువాత ఆ సభలో నన్ను చూసి ఆ పద్యం ఆలపించి ఈ మాయామచ్ఛీంద్ర కథ చెప్పారు. అంత సహజకవి ఆయన. చాలా చాలా ఆశువుగా పద్యాలు చెప్పేస్తారాయన.

ఇంకా నేను “బందిపోటు దొంగలు” (1969), “దేవుడు చేసిన మనుషులు” (1973), “రాజారమేష” (1977), “ఇంద్రధనస్సు” (1978) చిత్రాల్లో చాలా మంచి కేటాయింపు నృత్యాలు చేశాను.  ముఖ్యంగా తెలుగులో ఎల్.ఆర్. ఈశ్వరికి మంచి గుర్తింపు తీసుకువచ్చిన ‘మసక మసక చీకటిలో’ పాట నాపై చిత్రీకరింపబడిన విషయం నాకు ఆనందాన్ని కలిగిస్తుంటుంది. అదే విధంగా తమిళంలో కూడా “శివందమణ” అనే తమిళ చిత్రంలో ఎల్.ఆర్.ఈశ్వరి నాకు పాడిన పాటýకే అక్కడా పాపులర్ అయింది.  ఇది యాదృచ్ఛికమే అయినా సంతోషం కలిగించే సంఘటన.

తెలుగులో నేను సుమారు 80 చిత్రాల్లో నటించి ఉంటాను. తెలుగు, తమిళం కన్నడం, మలయాళం, హిందీ అన్ని భాషల్లో కలిపి సుమారు 150 చిత్రాలు చేశాను. పౌరాణికం, సాంఘకమే గాక కాంతారావు గారితో కలిసి “దేవకన్య” (1968), “అందం కోసం పందెం” (1971), “వీరపూజ” (1968) వంటి జానపద చిత్రాలు కూడా చేశాను.  ఇంకా జగ్గయ్య, చంద్రమోహన్ (మరపురాని కథ, 1967), సతీష్ ఆరోరా (నీతి నిజాయితీ, 1972) వంటి హీరోలతో కూడా నటించాను.  తెలుగులో నా ఆఖరి చిత్రం “ఆనందభైరవి” (1984). ఈ చిత్రానికి  గాను ఉత్తమ నటిగా ‘వంశీ’ అవార్డు అందుకున్నాను.

ఈ సినిమా తర్వాత నేను సినిమా రంగం నుండే గాక ఈ లోకం నుండే అజ్ఞాతంగా వెళ్లిపోవాల్సి వచ్చింది.  పరిస్థితులు అలా వచ్చాయి.  ఒక్కోసారి మనం సాధించే విజయాలు కూడా మనకు హానినే చేస్తాయి.  ఒకసారి జీవితంలో అనుకోనంత విజయం వస్తే దానితోపాటు ఎన్నో అసూయలు, ఈర్ష్యలు, బంధు మిత్రుల ఆశ్రయింపులు - ఇవన్నీ కలిపితే ఆ విజయానికి ఆనందించే బదులు కుంగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. సరిగ్గా నాకదే జరిగింది. నా తల్లిదండ్రుల ప్రేమానుబంధాన్ని నేను ఆశిస్తే... నా ద్వారా లభించే అంతస్తును మాత్రమే వారు ఆశించారు. అప్పట్లో వాళ్ల ధన దాహాన్ని తీర్చలేక అలసిపోయాను. జీవితంలో స్థిరపడాలన్న నా ఆలోచనకు వారే అడ్డుపడ్డారు. ఏ స్తీ అయినా తల్లిదండ్రుల నుంచీ ఏం కోరుకుంటుందో నేనూ అదే కోరుకున్నాను. ఆప్యాయంగా అక్కున చేర్చుకునే ఒక వెచ్చని స్పర్శ, నీకు మేమున్నామన్న నమ్మకం... ఇవే నాకు కరువయ్యాయి.  అమ్మా, నాన్న ఇద్దరూ అనునిత్యం వాళ్లలో వాళ్లే పోట్లాడుకునే వారు. డబ్బును వృధాగా ఖర్చు చేసేవారు. పోనీ వ్యసనాలున్నాయంటే అనుకోవచ్చు. దేనికి ఖర్చు చేస్తారో అర్థమయ్యేది కాదు.

సినీ తారగానే కాదు, ఒక స్తీగా కూడా నేను చాలా కోల్పోయాను.  నేను గాఢంగా ఆశించిందేదీ నాకు అందకుండా పోవడమే నా జీవితంలో గొప్ప విషాదం. నా తల్లిదండ్రులు చివరకు పెళ్లి చేసుకొని స్థిరపడాలన్ని నా కోరికను కూడా నాకు మిగలనివ్వకుండా చేశారు.  దాంతో నా బ్రతుకు ఎడారిలో ఎండమావి అయింది. నిజంగా మా వాళ్లకు నా ఆస్తి మీదే ఆసక్తి ఉందని నేను ఊహించలేదు.

ఎప్ప్పుడో, ఎన్నాళ్లకో శృంగేరి వెళ్లినప్ప్పుడు మా అమ్మగారు మా నాన్నగారితో “నా పెళ్లి సంగతే ఎత్తవద్దనడం” విన్నాను. నేను షాకయ్యాను. అప్ప్పుడనుకున్నాను.  ఇన్నాళ్లు నేనో అగాధంలో ఉన్నానని అప్ప్పుడు చూసుకున్నాను, ఆస్తులు, అప్ప్పులు వగైరాలన్నీ. అన్నీర అప్ప్పులే, తాకట్టులే. ఏంటిదంతా అని అడిగి నావల్ల కాదని చెప్పేశాను.  ‘ఇక వీళ్లతో లాభం లేదు, వీళ్లను నేను బాగు చేయలేను - ఎటైనా దూరంగా వెళ్లిపోయి నా జీవితం నేను చూసుకోవాలి జాగ్రత్తపడాలి’ అని అన్పించి 1989 డిసెంబరులో బెంగుళూరు వచ్చేశాను.  బెంగుళూరు నాకు మొదట్నుంచీ అలవాటే. అక్కడ కన్నడంలో ఎక్కువ సినిమాలు చేశాను. కనుక ప్రదేశం గానీ, భాషగానీ నాకు సమస్య కాలేదు. పైపెచ్చు అక్కడే మా చెల్లెలు కుటుంబం ఉంటోంది గనుక వచ్చేశాను.

ఏదో మొండి ధైర్యంతో వచ్చేశాను.  సరే ఇలా నా బాధల్లో నేనుంటే, కొన్ని పత్రికలు నా మీద కొన్ని వదంతుల్ని సృష్టించాయి. దీనివల్ల నా కన్నా నా అభిమానులు చాలా బాధపడ్డారు.  నేను బెంగుళూరు వచ్చేశాక కొంత ఖాళీ సమయం చిక్కింది.  మా ఇంటి చుట్టూ దేవాలయాలే. వినాయకుడి గుడికి తరచూ వెళ్లేదాన్ని. దైవ ప్రార్థనలో మునిగిపోయేదాన్ని. మా నాన్నకు ఎదురుగా నిలబడగల శక్తినివ్వమని ఆ భగవంతుని మనసారా వేడుకునేదాన్ని. ఆలయంల మెట్లను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ పెట్టడం మన పూజా విధానం. నేను అదే చేసేదాన్ని. సినిమా వాళ్లంటే మొదట్నుంచీ ప్రేక్షకులకు ఒక రకమైన, ఉత్సాహం కదా! అందుకనే ‘నమ్మ కాంచనమ్మ’ అంటూ కన్నడిగులు నేను గుడికి వెళ్తుంటే మొదట్లో ఆశ్చర్యంగా చూస్తూ విస్మయాన్ని ప్రకటించేవారు. ఆ పరంపరలో నేను భక్తితో గుడిమెట్లు నా పాటికి నేను శుభ్రం చేసుకుంటుంటే, దాన్ని దీనస్థితిగా అభివర్ణిస్తూ వార్తలు రాశారు. అది చాలా తప్ప్పు. ఆ ఆలయ ధర్మకర్త కోర్టుకు వెళ్దామన్నాడు. నేనే వద్దన్నాను. ఎందుకంటే అప్పటికే లిటిగేషన్లతో, కోర్టులతో విసిగిపోయి ఉన్నాను.  పైగా అవన్నీ వ్యర్థమనిపించాయి.  జీవితంలో ప్రతి విషయంలోనూ రాజీ పడుతున్న సమయమది.  అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు.

సరే ఎకాఎకిన చెన్నెí నుండీ బెంగుళూరు వచ్చేశాను కదా, ఎలా బ్రతకాలో తెలీదు. ఎందుకు బతుకున్నానో తెలిస్తే కదా, ఎలా బ్రతకాలనే ప్రశ్న ఉదయిస్తుంది. సరే ఆలోచించాను. సరే బెంగుళూరులో నాకో బిల్డింగు ఉండేది. ఆ భవనాన్ని ఆసరా చేసుకొని న్యాయపోరాటం చేసి సాధించాను. ఆ తర్వాత బిల్డర్స్‌ను సంప్రదించి ఫ్లాట్స్ కట్టించి - అలా జీవించడం మొదలుపెట్టాను

నేను నటించిన “కల్యాణ మండపం” లో ఓ సంభాషణ నా జీవితానికి సరిగ్గా సరిపోతుంది.  అందులో నేనో దేవదాసి కూతురి పాత్ర ధరించాను. జీవితంలో అనుకోకుండా ఓడిపోయి, ప్రేమించిన యువకున్ని వివాహం చేసుకోలేని దుస్థితిలో - తల్లి (అంజలీదేవి) ఒడిలో తలపెట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తాను.  “ఏమిటమ్మా ఇదంతా?” అంటూ నా తల్లి దీనంగా అడిగిన ప్రశ్నకు నేను ఆ చిత్రంలో చెప్పిన జవాబు ఒక్కటే! “తక్కువ పూజలు చేసి ఎక్కువ ఫలితాలు ఇవ్వమంటే ఆ దేవుడు మాత్రం కరుణిస్తాడా? అందుకే వచ్చే జన్మయినా బావుండాలని ఆ పరమాత్ముడిని మనసారా వేడుకుందాం, సేవించుకుందాం”. ఎప్ప్పుడో నలభై ఏళ్ల క్రితం సినిమాలో చెప్పిన సంభాషణలు ఈనాటి నా జీవితానికి చాలా దగ్గరగా, వాస్తవంగా ఉండటం చాలా చిత్రం కదూ! అందుకే ఆ పరమాత్ముని సేవకే అంకితమయ్యాను. డబ్బుమీద వ్యామోహం  ఎప్ప్పుడూ లేదు, అయితే ఈ మధ్య విరక్తిని పెంచుకున్నాను. అందుకే గుళ్లు, గోపురాలు, యాత్రలు ఇలా గడిచిపోతోంది జీవితం. నా సోదరి శ్రీమతి గిరిజా పాండేతో కలిసి చెన్నెíలోని మా ఆస్తిని కొంత తిరుమల తిరుపతి దేవస్థానానికి 2010 లో విరాళంగా సమర్పించేసి ప్రశాంతంగా ఉన్నాను.  ఈ మధ్య మళ్లీ బెంగుళూరు నుండీ చెన్నెí వచ్చేశాను.  ఎంతైనా పుట్టిన ఊరు కదండీ! ఎంత హాయిగా ఉందో! రాజశ్రీ, రాజసులోచన, కుచలకుమారి... ఇలా నా పాత స్నేహితురాళ్ల మధ్య ఎంతో ఉల్లాసంగా కాలాన్ని గడిపేస్తున్నాను.


షావుకారు జానకి.....

‘కథానాయికగా ప్రేక్షకుల నీరాజనాలు పొందడానికి ఆకాశం నుంచి దిగిరావాల్సిన అవసరం లేదు. అప్సరసల్లాంటి అందం లేకపోయినా అభినయచాతుర్యం, పాత్రౌచిత్యం ఉంటే కథానాయికగా రాణించవచ్చని నిరూపించిన ఏకైక నటీమణి జానకి, యాభై ఆరు సంవత్సరాల క్రితం విడుదలైన ‘షావుకారు’ చిత్రం శంకరమంచి జానకిని ‘షావుకారు జానకి’ని చేసింది. ఎన్నో రకాల పాత్రలు ధరించినా ఏ ఇమేజ్‌కూ, ఏ మÖసకూ పరిమితం కాకుండా తనదైన ప్రత్యేకబాణీని సంతరించుకున్న విలక్షణ నటి ఆమె. ఆనాటి ముగ్ధ జానకికి ఈనాటి బామ్మ జానకికి మధ్య కాలంలో తన అనుభవాలను, అనుభూతులను జ్ఞాపకాల పుటల్లోంచి ఏరి మనకందిస్తున్నారు....

‘తెలుగుటాకీ పుట్టిన సంవత్సరంలోనే నేను పుట్టాను. అంటే నా వయసు ఎంతో మన తెలుగు సినిమా వయసూ అంతే (12.12.1931). మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. సనాతన బ్రాహ్మణ కుటుంబం. శచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావుగార్లు నా తల్లిదండ్రులు. నాన్న రాజమండ్రిలో గవర్నమెంట్ పేపరు ఎక్స్‌పర్టు అండ్ కెమికల్ ఇంజనీరుగా పనిచేసేవారు. నాకు ముగ్గు అన్నదమ్ములు. ఇద్దరు చెల్లెళ్లు.

మా నాన్న ఉద్యోగరీత్యా అనేక ఊర్లూ మారుతూ వుండేవారు. అలా కలకత్తా, బీహారు, అస్సాం, అన్నీ తిరిగేశాం. మేము కలకత్తాలో ఉండగానే నా చెల్లెలు కృష్ణకుమారి పుట్టింది. కృష్ణ ఎంతో అందంగా, ముచ్చటగా ఉండేది. నేను అందంగా ఉన్నట్టు నాకెవ్వరూ చెప్పేవారు కాదు. అయితే నేను u£ద్దుగా ఉటానని మాత్రం అనేవారు. మా నాన్న నా చలాకీతనాన్ని, మాటకారితనాన్ని ఎంతో మెచ్చుకునే వారు. నాకు మొండితనం, మంకుపట్టు బాగా ఉండేవి. నేను అన్నకున్నది ఏదైనా సరే జరిగి తీరాల్సిందే.

మేము 1944లో మద్రాసు వచ్చేశాం. అవి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. యుద్ధానికి భయపడి అందరూ మద్రాసు ఖాళీ చేసి వెళ్లిపోతున్న సమయంలో మేం మద్రాసులో దిగాం. బోగ్ రోడ్డులో ఇప్పుడు శివాజీగణేశన్ ఇంటికి నాలుగు ఇళ్లకు అవతలగాఉన్న ఇంట్లో కాపురం ఉండేవాళ్లం. మద్రాసు వచ్చిన మొదట్లో ఓ సంవత్సరం పాటు హైస్కూలులో చదివాను. తర్వాత మెట్రిక్ పరీక్షకు చదువుదామని ఆంధ్రమహిళాసభలో చేరాను. అక్కడ దుర్గాబాయిగారు ఉండేవారు. నా మీద ఆవిడకు మంచి అభిమానం ఉండేది. శ్రద్ధగా చదువుతాననీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాý£్గంటానని నన్ను మెచ్చుకునేవారు.

1945లో మద్రాసు ఆలిండియా రేడియో చిన్నపిల్లల కార్యక్రమంలో పాý£్గనేందుకు మా చెల్లెలు కృష్ణ, నేనూ వెళ్లాం. మా ఇద్దర్నీ ఓ పాట పాడమన్నారు. “ఊగాలి ఉయ్యాల.... తాటి రెమ్మలపై నిలవాలి, తారల తలపై తన్నాలి” అనే పాట పాడినట్టు గుర్తు. పాట పాడి ప్రోగ్రాం ముగిసింతర్వాత బయటకి వచ్చాం. “ఇప్పుడు పాడింది మీ యిద్దరేనా” అంటూ ఇద్దరు పెద్దవారు మా దగ్గరకు వచ్చారు. ఔనన్నాం. రేడియో నాటికల్లో పాý£్గనమని అడిగారు. నేను సరేనన్నాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జనమంచి రామకృష్ణ. బుచ్చిబాబుగార్లని తెలిసింది. నాలుగైదు రోజుల్లోనే డా.రాజమన్నార్ ‘పంజరంలో చిలుక’ నాటకంలో నటించడానికి కాంట్రాక్టు పంపారు.

ఆ నాటకానికి పాతికరూపాయల చెక్కు తీసుకున్నాను. నా తొలి సంపాదన అది. దాన్ని చూస్తూ గర్వంతో పొంగిపోయాను. ఆ తర్వాత పాలగుమ్మి పద్మరాజు ‘పట్నవాసం’ ధారావాహిక నాటకంలో మంచి పాత్ర ఇచ్చారు. తక్కువ కాలంలోనే నా బాంకు బేలన్స్ అరువందల రూపాయలకు వచ్చింది. అందులోంచి నా మొదటి పారితోషికం జ్ఞాపకంగా పాతిక రూపాయలుత ఈసి బంగారు ఉంగరం కొనుకున్నాను.

మద్రాసు ఆకాశవాణిలో రేడియో అన్నయ్య, అక్కయ్య, వింజమÖరి సీతాదేవి, టి.జి.కమలాదేవి, తెన్నేటి హేమలత, ఎ.పి.కోమల, కొంగర జగ్గయ్య, సిహెచ్.నారాయణరావు, ఎస్వీరంగారావు, గుమ్మడి.... మొదలైన వారందరితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాý£్గన్నాను. నాకు మొదటినుండీ నా వాచకమే ప్లస్ పాయింట్. ఓ సారి రేడియోలో నా వాయిస్ విని సరాసరి రేడియో స్టేషన్‌కే వచ్చారు. బి.ఎన్.రెడ్డి గారు. అంత పెద్దాయన రేడియోలో నా వాచకం వినడం, అది గుర్తుంచుకుని ప్రశంసించడం మరవలేను.

ఒకసారి బుచ్చిబాబుగారింటికి వెళ్లాను. అక్కడ బి.ఎన్.రెడ్డి గారు ఉన్నారు. “నువ్వెవరి పిల్లవమ్మాయ్?” అని ప్రశ్నించారు. ‘టేకుమళ్ల వారమ్మాయిని” అన్నాను నేను.

“సినిమాల్లో వేషం వేస్తావూ?” అన్నారాయన.

“మా నాన్నగారు పళ్లు రాలగొడ్తారు” అన్నాను.

అప్పుడు కె.వి.రెడ్డిగారి దర్శకత్వంలో ‘గుణసుందరి కథ’ నిర్మిస్తున్నారు. నాయికగా వేయమన్నారు. నేను ఇంట్లో భయపడి వద్దన్నాను. అప్పుడు నాకు నిండా పదిహేనేళ్లు లేవు. తెల్లగా బక్కపలచగా వాల్జడ వేసుకుని తిరుగుతుండేదాన్ని. ఈ రోజున అన్పిస్తుంది ‘ఎందుకు ఆ పాత్ర ఒద్దన్నానా?’ అని.

నాకు 5.11.1947న శంకరమంచి శ్రీనివాసరావు గారితో వివాహమయ్యింది. మా వారు రేడియో ఇంజనీరుగా పినిచేసేవారు. వాళ్లింట్లో ఆయనే చిన్నవాడు. ఆస్తిపంపకాల్లో వారికి అన్యాయం జరిగింది. అప్పట్నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. పట్టెడన్నం కోసం పాట్లు పడడం అంటే అప్పుడె తెలిసొచ్చింది. నా భర్త సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఆ పరిస్థితుల్లో నేను కూడా సంపాదిస్తే అనే ఆలోచన మెదిలింది.

ఆ ఆలోచన రాగానే కొడవటిగంటి కుటుంబరావు, కొమÖ్మరి పద్మావతి గార్ల ప్రోత్సాహంతో బి.ఎన్.రెడ్డి గార్ని కలిశాను. ఒకనాడు ఆయనే వేషం వెయ్యమంటే ‘అమ్మో’ అన్న నేను మÖడేళ్ళ తర్వాత ఆయన దగ్గరకి వెళ్ళి ‘నేను సినిమాల్లో వేషం వేస్తాను’ అని చెబితే ఆశ్చర్యపోయారాయన. ‘ఉన్నట్టుండి వచ్చి సినిమాల్లో వేషం కావాలంటే నేనెక్కడ తేనూ” అన్నారు బి.ఎన్.గారు’ ‘అప్పుడడిగారుగా’ అన్నాను.

‘ఐతే ఉండు. మావాళ్లు ‘విజయా ప్రొడక్షన్స’ అనే సంస్థ స్థాపించి పిక్చరు తీయబోతున్నారు. అందులో ఏమన్నా ప్రయత్నిస్తాను” అని నన్ను నాగిరెడ్డిగారి దగ్గరకు పంపించారు. అప్ప్పుడు వారు “షావుకారు తీసే ప్రయత్నంలో ఉన్నారు.

చక్రపాణి, ఎల్.వి.ప్రసాద్‌గార్లు నాకు మేకప్ టెస్ట్ చేయించి తర్వాత కబురు పంపుతాం వెళ్ళమన్నారు. కొన్నాళ్ళ తర్వాత పిలుపొచ్చింది. ఏదో చిన్న వేషం ఇస్తారని అనుకున్నాను. ‘నువ్వే మా కథానాయికవి’ అని చెప్పడంతో ఆనందంతో నోట మాట రాలేదు. అలా విజయాసంస్థలో హిరోహిన్‌గా అడుగుపెట్టాను. నా తొలి సినిమాకు గాను అందుకున్న పారితోషకం రెండువేల ఐదువందలు.

ఆనాటి సినిమా ధోరణుల ప్రకారం నాకు చెప్ప్పుకోదగ్గ గ్లామర్ లేదు. పీలగా, పొట్టిగా ఉంటానని అనేవారు. నా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం, నటనపట్ల, సినిమాకళపట్ల నాకున్న గౌరవభావం ఇలాంటి అంశాలేవో నిర్మాతలకు నన్ను కథానాయకిగా ఎన్నుకోవడానికి దోహదంచేసి ఉండాలి. ‘షావుకారు’ తర్వాత విజయావారి మరే చిత్రంలోనూ నాకు నటించే అవకాశం లభించకపోయినా, ఆ చిత్ర నిర్మాణంలో నేర్చుకున్న పాఠాలే నా చలనచిత్ర జీవితానికి మంచి పునాది ఏర్పడటానికి దోహపడ్డాయని ఇప్పటికి భావిస్తాను.

‘షావుకారు’ గురించి అప్పటి ‘తెలుగుస్వతంత్ర’ పత్రికలో సంపాదక భీష్మలైన ఖాసా సుబ్బారావుగారు ‘కుటుంబస్త్రీల సినీ రంగప్రవేశం’ అని రాస్తూ అందులో నా నటన గురించి గొప్పగా రాశారు. ఆ విషయాలు నాకిప్పటికీ ఆనందాన్ని కల్గిస్తుంటాయి.

‘షావుకారు’ తర్వాత నటిగా ఇంకా నేను నిలదొక్కకముందే మా రెండో  అబ్బాయి వెంకటరమణ పుట్టాడు. పచ్చి బాలింతరాల్ని. సరైన ఆహారంలేక బలహీనంగా ఉండేదాన్ని. ఐనా బ్రతుకు తెరువుకోసం సినిమాల్లో వేషాలకు అవకాశం కోసం ప్రయత్నించడం మానలేదు. ఆ రోజుల్లో జెమినీగణేశన్‌గారు జెమినీ సంస్థల్లో ఆర్టిస్టులను ఎంపిక చేసే ‘కేస్టింగ్ మేనేజర’గా ఉండేవారు. నేను జెమినీ సంస్థల్లో నటించడానికి అవకాశాలకోసం ప్రయత్నించినప్ప్పుడు తప్పక కబురుపెడతానన్నారు. ఆర్. నాగేంద్రరావు దర్శకత్వంలో ‘ముగ్గురు కొడుకులు’ ప్రారంభిస్తుండగా కబురు పంపారు. జెమినీ వాసన్‌గారు నన్ను చూడగానే కోడలి పాత్రకు ఎంపిక చేశారు.

ఆ తర్వాత ఆదర్శం (1952), ప్రపంచం (1953) చిత్రాల్లో నటించాను.

నేను ఆలిండియా రేడియోలో బాలానందం కార్యక్రమంలో పాý£్గనే రోజుల్లో కొంగర జగ్గయ్యగారు అక్కడి వార్తలు చదువుతూ ఉండేవారు. ఆయన కంఠస్వరం, ఉచ్ఛారణా విధానం విని ఆయన అభిమానంగా మారిపోయాను. అలా నేను అభిమానించే  జగ్గయ్యగారితో కలిసి సినిమాల్లో నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఆయనతో ముందడగు, అన్నతమ్ముడు (1958), రెండు కుటుంబాల కథ(1970) వంటి ఎన్నో చిత్రాల్లో కలిసి నటించాను. మా కాంబినేషన్‌లో వచ్చిన ‘కోడెకారు చిన్నవాడా’, ‘మ్రోయించవే హృదయవీణ....’ పాటలు ఆ రోజుల్లో చాలా పాపులర్ అయ్యాయి.

నేను చలనచిత్ర రంగంలో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్న రోజుల నాటి సంగతి. ఒక అద్దె ఇంటికోసం వెదుకుతూ... థౌజండ్‌లైట్స్ ప్రాంతంలోని షఫీమహ్మద్ రోడ్డులో మేడమీద ఒక పోర్షన్ ఖాళీగా ఉందంటే జెమినీగణేశ్‌గారితో కలిసి వెళ్లాను. ఆ మేడ కింద పోర్షన్‌లో ఒక అందమైన యువతి గౌనులాంటిది వేసుకుని చలాకీగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది.

“ఈ అమ్మాయి పేరు సావిత్రి. సినిమా ఆర్టిస్టే” అని పరిచయం చేశారు. జెమినీగణేశన్. ఆరోజు నా కంటిముందు మెరుపుల మెరిసిన సావిత్రి ఈ తర్వాత ఎంతో సన్నిహితురాలైంది. మేమిద్దరం కలసి నటించిన తొలిచిత్రం ‘ఆదర్శం’.

తర్వాత కన్యాశుల్కం(1955)లో తను మధురవాణిగా వేస్తే నేను బుచ్చమ్మగా నటించాను. చరణదాసి (1956), మంచిమనసులు(1962), డాక్టర్ చక్రవర్తి(1964) లాంటివి మేం కలిసి నటించిన మరికొన్ని చిత్రాలు.

సావిత్రిలో నన్ను విశేషంగా ఆకర్షించిం ఆమె నటిగా రాణించడానికి చేసిన కృషి. ఆమె తన వ్యక్తిగత విషయాలు తరచుగా నాతో చెబుతుండేవారు. ఆమె శ్రేయోభిలాషిగా - సన్నిహితులు సైతం చెప్పడానికి సాహసించని సలహాలు, మందలింపులు నా ధోరణిలో నేను చెప్పేదాన్ని. నాపట్ల ఎంతో గౌరవంతో అన్నీ ఓపికతో వినేది. అంతా విన్నాక “మీకున్నంత ధైర్యం, ఆత్మవిశ్వాసం నాలో లేవండీ!” అనేది బేలగా....

సావిత్రికి మంచిపేరు తెచ్చిన వినోదావారి ‘దేవదాసు’(1953) చిత్రంలో పార్వతి పాత్రకు మొదట నన్ను అనుకున్నారు. రిహార్సల్సు జరిగాయికూడా. అయితే కారణాంతరాల వల్ల ఆ పాత్ర నేను మిస్సయ్యాను. అది నిజంగా నా దురదృష్టమే.ఎందుకంటే ‘ఓ దేవదా’ పాట రిహార్సల్స్ ఎంతో బాగా వచ్చిందో... కారణం లేకుండా తీసేయటం.... ఆవేషం పోయినందుకు పదిరోజులు ఏడ్చాను. ఆ తర్వాత ఎప్ప్పుడో గోగినేని వెంకటేశ్వరరావు నన్ను తీసేయడానికి కారణాల్ని వివరించినట్టు జ్ఞాపకం. ఒక వేళ నేను దేవదాసులో నటించి ఉంటేనా నా నటజీవితం ఏ మలుపు తిరిగి ఉండేదో!


అక్కినేని నాగేశ్వరరావుగారితో కలిసి నటించిన తొలిచిత్రం ‘రోజులు మారాయి’ (1954). అందులో నాది గడుసైన పల్లెటూరి పాత్ర. ‘పిల్ల’ అంటే జ్ఞాపకమొస్తోంది. ఆ చిత్ర నిర్మాణ సమయంలో తాపీ చాణక్యగారు నన్ను అప్యాయంగా ‘పిల్లా’ అని పిలుస్తూ ఉండేవారు. పాత్రలకు తగిన పాత్రధారులిన ఎంపిక చేయడంలో ఆయన చాలా సమర్థులు. ‘రోజులుమారాయి’లోని రాధ పాత్రకు నన్ను ఎన్నుకోవడం గురించి చెప్పినప్పుడు - నా కళ్లు, కంఠస్వరం ప్రత్యేక ఆకర్సణులుగా చెప్పేవారు. ‘నీ ముఖకవళికల్లో అనేక భావాలు పలుకుతాయి. నీ చుబుకం కూడా మాట్లాడుతుంది’ అనేవారు.

ఆ చిత్రంలోని ‘ఏరువాకా సాగారో’ పాటకు వహీదారెహమాన్ డాన్స్ చేసింది. ఆమె డాన్స్ చేస్తున్న తీరు చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే అక్కినేనిగారితో ‘ఈ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంటుందని’ అన్నాను. ‘రోజులు మారాయి’ విజయోత్సవం హైదరాబాదులో జరిగినప్పుడు అక్కడి ‘రిట్జ’ హోటల్‌లో మా అందరినీ సారథి అధినేత రామకృష్ణప్రసాద్ గారు గురుదత్‌గారికి పరిచయం చేసారు. అలా పరిచయమైన వహీదాను చూసి, మాట్లాడి హిందీలో అవకాశం కల్పించారు ఆయన. ఆ తర్వాత ఆమె ఎంత ఎత్తుకు ఎదిగారో అందరికీ తెలిసిందే. అలా వహీదారెహమాన్ గురించి నా అంచనా నిజమైనందుకు ఆనందింస్తుంటాను. తర్వాత ఎన్.టి.రామారావుగారితో జోడిగా ‘జయసింహ’లో నటిస్తే వహీదాకు డబ్బింగ్ చెప్పాను కూడా.

‘రోజులుమారాయి’ని తమిళంలో ‘కాలం మారిపోచ్చి’ పేరుతో నిర్మించినప్పుడు నా పాత్రను అంజలీదేవిగారు వేశారు. చిత్రం ఏమంటే ఇతర భాషల్లో నిర్మించినప్పుడు మాతృకలోని నా పాత్ర మరెవరినో వరించేది.

నాకు తెలుగులో కంటే తమిళంలో మంచి పేరొచ్చింది. ఎంజిఆర్, శివాజీ, జెమిని మొదలైన వాళ్లందరితోనూ కథానాయికగా చేశాను. ఎంజిఆర్‌తో నేను నటించిన చిత్రాలు కొన్నే అయినా అన్నీ పూరు తెచ్చుకున్నవే. ఆయన నటించిన నూరో చిత్రం ‘ఒళి విళక్కు’లో నేను ప్రధాన పాత్ర ధరించాను. ఆ చిత్రంలో కథానాయకుడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు భగవంతుడ్ని ప్రార్థిస్తు ఒక పాట పాడే సన్నివేశం ఉంది. ‘నా ప్రాణాలు తీసుకుని ఆయనకు జీవం పోయమని’ ఆ పాట అర్థం. ఎంజిఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్లినప్పుడు ఆ చిత్రానికి, అందులోని ఆ సన్నివేశానికి విశేషమైన ప్రాధాన్యం ఏర్పడింది. ‘ఒళి విళక్కు’ విడుదలైన తర్వాత ఒకరోజు ఆయనే స్వయంగా తన కారులోని ‘ఎమర్జెన్సీ లాంప’ను నాకు బహూకరిస్తూ ‘పన్బట్ట గుణ చిత్రనటిగై’ అని పొగిడి ‘మీ ఇంట్లో ఎప్పుడూ దీపం వెలుగుతూ, నలుదిశలా కాంతులు ప్రసరిస్తూ ఉండాలి’ అని దీవించారు.

శివాజీగణేషన్ గారితో మొట్టమొదటిగా నేను ‘పావై విళక్కు’ అనే చిత్రంలో నటించగా, ముందుగా విడుదలైన చిత్రం మాత్రం ‘పడిక్కాద మేదై’. ఈ చిత్రమే తెలుగులో ‘ఆత్మబంధువు’గా వచ్చింది. తెలుగులో ఆ పాత్ర సావిత్రి వేసింది. అలాగే తమిళంలో నాకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన చిత్రం ‘ఇరుకోడు గళ’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కలెక్టర్ జానకి’ పేరుతో నిర్మించారు. అందులో నటించమని కె.బాలంచందర్ అడిగినా తమిళంలో నా బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాను. వారు శారదగారిని కూడా అడిగారు. ఆమె కూడా ఎందుకనో నటించలేదు. చివరకు జమున ఎంత మహోన్నతంగా ఆ పాత్రను చేశారో మీరంతా ఎరిగిందే. ‘కలెక్టర్ జానకి’ తమిళ చిత్రానికి 12 అవార్డులు వచ్చాయంటే దాని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఆరుద్రగారు ‘మంచికుటుంబం’ (1968) శతదినోత్సవ సభలో ‘జానకి త్యాగరాజకీర్తన’ లాంటిది. ఎలాగంటే త్యాగరాజస్వామి తెలుగువాడైనా, ఆయన కీర్తనలకు తమిళులే ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. అలాగే జానకి ప్రతిభకు ఎక్కువ గుర్తింపు తమిళ చిత్రాల ద్వారానే లభించిందని’ ప్రశంసించారు.

శివాజీగణేషన్ తమ సొంత చిత్రం ‘పుదియపరవై’ (సింగపూర్ సి.ఐ.డి)లో ఓ వినూత్నమైన పాత్రను ధరించే అవకాశం కల్పించారు. అత్యాధునికంగా కన్పించే గాయని పాత్ర అది. ఆ చిత్రం నాకు స్వదేశంలోనే గాక సింగపూర్, హాంకాంగ్, టోక్యో మొదలైన దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చింది. ఆయా దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి తమిళ ప్రేక్షకులు ఆ పాత్రను గుర్తుచేస్తూ అభినందించేవారు.

ప్రముఖ వీణా విద్వాంసులు ఎన్.బాలచందర్ గారి దర్శకత్వంలో నేను నటించిన ‘ఏది నిజం?’ (1956) చిత్రానికి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. చరణదాసి (1956), భాగ్యరేఖ (1957) లాంటి చిత్రాల్లో హాస్యపాత్రల్ని కూడా ధరించాను. భాగ్యరేఖలో నటిస్తుండగా ఒక సంఘటన జరిగింది. నిజానికి నేను షూటింగ్‌కు హాజరు కావడంలో ఎప్పుడూ ‘పంక్చుయాలిటీ’ పాటిస్తాను. కానీ ఒకరోజు కాస్త ఆలస్యయంగా వెళ్లాను. అప్పటికే ఎవరేం చెప్పారో.... బి.ఎన్.రెడ్డిగారు విపరీతంగా కోప్పడ్డారు. నాకు ఏడుపొచ్చేసింది. షూటింగ్ పూర్తయ్యాక ‘మా అబ్బాయికి బుజ్జగించి స్కూల్‌కు పంపేసరికి ఆలస్యమైందని’ వివరించాను. ఆయన విషయం అర్థం చేసుకుని ‘ఐయామ్ సారీ జానకీ’ అన్నారు.

కొన్నిసార్లు పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా తీరిక ఉండేది కాదు. గుర్తొచ్చినప్పుడల్లా తల్లడిల్లి పోయేదాన్ని. అయితే అలాంటి కొన్ని విషయాలు జీవితంలో రాజీ పడటాన్ని నేర్పాయి. ఇంట్లోకి అడుగుపెట్టగానే నేను నటినన్న సంగతి మర్చిపోయేదాన్ని. గృహిణి బాధ్యతలు నెత్తిన వేసుకునేదాన్ని.

నేను నిర్మాతగా రెండు సినిమాలు నిర్మించాను. బెంగాల్‌లో ఉత్తర్ ఫల్గుణి నిర్మించిన ‘మమ్‌త’ ఆధారంగా తమిళంలో కె.బాలచందర్ దర్శకత్వంలో ‘కావియతలైవి’ తీశాను. బెంగాల్‌లో సుచిత్రాసేన్ తల్లీ కూతుళ్లుగా నటించిన ఆ పాత్రల్ని నేనే ధరించాను. కానీ ఆ చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేదు. రెండవది కూడా ‘రంగరాట్టనమ’ అనే తమిళ చిత్రమే.

ఇక నా పాత్రల పరంగా వివరించాల్సి వస్తే ఎన్నో విభిన్న పాత్రలు నన్ను వరించాయి. అక్కినేనితో నటించిన బాటసారి (1961). మంచిమనసులు (1962) డాక్టర్ చక్రవర్తి (1964), అక్కాచెల్లెళ్లు (1970), మంచికుటుంబం (1968) చిత్రాల్లో నేను వేసినవన్నీ డిఫరెంట్ కారెక్టర్స్. ఒక స్త్రీ వివిధ కోణాల్లో ఏ విధంగా సంఘర్షణ పడుతుందో, ఆ కోణాలన్నీ ఆయా పాత్రల్లో ప్రదర్శించి గుర్తింపు పొందగలిగాను.

కేరక్టర్ ఆర్టిస్టుగా నాకు మొదటి చిత్రం ‘ఉండమ్మా u£ట్టుపెడతా’ (1968). ఆ తర్వాత వేములవాడ భీమకవి (1976), ఖైదీబాబాయ్ (1974), యవ్వనం కాటేసింది, తాయారమ్మ-బంగారయ్య (1979) లాంటివి చాలానే ఉన్నాయి.

ఎన్.టి.రామారావుగారు నన్ను ఎంతో గౌరవించే వారు. అంతెందుకు వారి ‘ఎన్.ఏ.టి’ ఎంబ్లెమ్‌లో వంఎకటేశ్వరస్వామి పక్కన శ్రీదేవిగా ఉన్నది నేనే. ఆయనకు గౌరవ డాక్టరేట్ వచ్చినప్పుడు మద్రాసు సెంటినరీ హాలులో ఏర్పాటు చేసిన సభలో ఆయన గురించి ప్రధానోపన్యాసం చేసిందీ నేనే. ‘సంసారం ఒక చదరంగం’ చిత్రంలో నేను చేసిన ‘చిలకమ్మ’ పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డును కూడా ఆయన చేతుల మీదుగానే అందుకున్నాను.

నిజానికి ‘షావుకారు’ తర్వాత కె.వి.రెడ్డిగారు నన్ను పిలిచి ‘నువ్వు సినిమాలకు పనికిరావు. గ్లామరు, పర్సనాలిటీ ఇవేవీ లేవు. వచ్చిన దారినే వెళ్లిపో’ అన్నారు. ఆ రోజు నుండి నాలో నాకే ఓ తెలియని పట్టుదల పెరిగింది. నటిగా రాణించాలని ఎంతో శ్రమించాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాను.

‘సినిమాలకు పనికిరానంటూ’ తేల్చేసిన కె.వి.రెడ్డిగారే 1961లో విడుదలైన శ్రీవేంకటేశ్వర మహాత్మం’లో నేను పోషించిన ఎరుకల సాని పాత్రని చూసి నా నటనను మెచ్చుకొని, ఆయన అన్న మాటల్ని వెనక్కి తీసుకున్నారు. ఆ సోది పాత్రను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు చూసి, ముచ్చటపడి రెండుసార్లు రిపీట్ చేసి మరీ వేయించుకుని చూశారట. పి.పుల్లయ్యగారు అది ఎంతో గొప్పగా చెప్పేవారు. జవహర్‌లాల్ నెహ్రూ, రాధాకృష్ణన్ వంటి జాతీయ నాయకుల చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం మరిచిపోలేని అనుభూతిగా నేను భావిస్తుంటాను. 1946లో ఆంధ్ర మహిళా సభలో చదువుకునే రోజుల్లో గాంధిగారు అక్కడికి వచ్చినప్పుడు దుర్గాబాయి దేశ్‌ముఖ్ నన్ను, నా స్నేహితురాల్ని వారికి వలంటీర్లుగా నియమించారు. మహాత్మాగాంధికి నేను సేవ చేయగలిగానని ఇప్పటికీ గర్వపడుతుంటాను.

సినిమా పరిశ్రమలో ఉన్నా నేను రంగస్థలాన్ని మరవలేదు. కె.బాలచందర్ ఆధ్వర్యంలో రాగిణి క్రియేషన్స్ తరఫున ‘నీర్‌కుమిళి’ (నీటిబుడగ), ‘మెళగువత్తి’ (కొవ్వొత్తి), ‘ఎదిర్ నీచ్చల’ (ఎదురీత), అనే తమిళ నాటకాల్లో నటించాను. తానా సభల్లో భమిడిపాటి వారి ‘తరం అంతరం’ ప్రదర్శించాను.

తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలన్నిటిలోనూ కలిపి మొత్తం 380 చిత్రాలు చేశాను. అన్ని పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. మన వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని నిలబెట్టే అంశాల్లో వాయిస్ ఒకటి అని నేను విశ్వసిస్తుంటాను. ‘మంచి కుటుంబం’లో నేను మాట్లాడిన ఇంగ్లీషు, ‘సంసారం ఒక చదరంగం’లో చిలకమ్మ పాత్రలో యాస, ‘గాంధీపుట్టినదేశం’, ‘మనుషులు మారాలి’లోని ఆ హూందాతనం.... ఇవన్నీ నన్ను ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేశాయి. ఈ రోజుల్లో అన్నీ అరువు తెచ్చుకునేవే అని నా అభిప్రాయం.

మంచి భోజనం చేస్తూ సన్నిహితులతో గడపడమంటే నాకు చాలా ఇష్టం. మేము బ్రాహ్మణుల మైన ఒకప్పుడు నేను మాంసాహారినే! అయితే 1995లో పుట్టపర్తి వెÞ£్ళచ్చాక పూర్తి శాఖాహారిగా మారిపోయాను. సత్యసాయిబాబా నా ఇష్టదైవం. వారే నాకు గ్రేట్ ఫిలాసఫర్, అవసరమైన సమయంలో నా జీవితంలోకి ప్రవేశించి మానసిక ప్రశాంతతను ప్రసాదించారు. ఒకసారి బాబా సమక్షంలో వేలాది మంది భక్తుల ముందర ప్రసంగించాల్సి వచ్చింది. అప్పుడు అంతమందిలో బాబా నన్ను ఉద్దేశించి “జానకి ఒక విచిత్రమైన వ్యక్తి. అనుకున్నదే అంటుంది. అన్నదే చేస్తుంది. జీవితంలో ఎన్నో దాటుకుని నా చెంతకు వచ్చింది’ అన్నారు. ఇంతకంటే నాకేం కావాలి? అంతా వారి దయ. నటిగా నిర్మాతలను గానీ, దర్శకులను గానీ సెట్స్ మీద ఏనాడూ నేను బాధ పెట్టలేదు. డి.ఎల్.నారాయణగారు ‘దేవదాసు’లో నన్ను నిష్కారణంగా తొలగించినా అవేవీ మనసులో పెట్టుకోకుండా మళ్లీ ఆయనకే ‘కన్యాశుల్కం’లో బుచ్చమ్మ పాత్రను చేశాను కదా! ఆ బుచ్చమ్మ పాత్రకు ఈ మధ్యే నేను గురజాడ స్మారక అవార్డు అందుకున్నాను.

నాకు ముగ్గురు పిల్లలు. యజ్ఞప్రభ, కృష్ణశచి, అబ్బాయి వెంకటరమణ. యజ్ఞప్రభ కూతురే వైష్ణవి. కొన్ని సినిమాల్లో నటించి పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయి సంతోషంగా ఉంది. రెండో అమ్మాయిని రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారి అబ్బాయికి ఇచ్చి చేశాం. కాని పెళ్ళయిన ఆరేళ్లకే గుండెపోటుతో మా అల్లుడు పోయాడు. అదో దురదృష్టకరమైన సంఘటన. మా కూతురు తన కొడుకుతో విదేశాల్లో ఉంటోంది. మా అబ్బాయి ఇండస్ట్రీయల్ ఇంజనీర్‌గా అమెరికాలో స్థిరపడ్డాడు. మనవళ్లూ మనవరాళ్లందరూ జీవితంలో సెటిలైపోయారు. నా పిల్లలు సినిమాల్లోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలాగా వెండి తెరకు దూరంగా పెంచాను కూడా. నేను ఏ పని చేసినా దానికో బలమైన కారణం ఉంటుంది. ఎవరిదగ్గరా ఏమీ ఆశించే తత్వం కాదు కాబట్టి ఎక్కడా అవమానం పొందలేదు.

నేను ప్రస్తుతం బెంగళూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గబ్బలాల గ్రామంలో మా చెల్లెలు కృష్ణకుమారి ఎస్టేట్‌లో ఉంటున్నాను. ఆ ఎస్టేట్‌లోనే 800 చదరపు అడుగులు కొనుక్కుని మంచి ఇల్లు కట్టుకుని దానికి ‘సాయికుటీర’ అని పేరు పెట్టుకున్నాను. నేను పెంచిన తోటలో, నేను పెంచిన కూరగాయలు తింటూ హాయిగా ఉన్నాను. తీరిక సమయాల్లో కృష్ణకుమారితో కలిసి పాతజ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఉంటాను. మా అమ్మ చనిపోయి పదేళ్లయింది. ఆమె చివరి కోరిక నేను, చెల్లీ కలిసి ఉండాలని. నాకిప్పుడు 75 ఏళ్లు వచ్చేశాయి. ఈ మధ్య కన్నడ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి గాని మోకాలు చిప్ప అరిగిపోవడం వల్ల గబగబా నడవలేక పోతున్నాను. అదొక్కటే అసంతృప్తి. అవసరం మేరకు సంపాదించాను. అపాత్ర దానం చేయకుండా అవసరమైన వారికి గుప్తంగా సాయం చేస్తుంటాను.

ఎన్ని సాధించినా, ఎన్నేÞ£్ళచ్చినా ఇంట్లో వాళ్లకు నేను ఇప్పటికీ ‘జానూ’నే. అభిమానులకు ‘షావుకారు అమ్మాయి’నే. తెలుగు సినిమా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సంవత్సరంలోనే నా జీవిత వజ్రోత్సవం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను పెంచి పెద్ద చేసిన పరిశ్రమకు, పరిశ్రమను పోషిస్తున్న లక్షలాది ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. 


రక్తకన్నీరు సీత..........

ఆ రోజుల్లో విశేష ప్రచారం పొందిన నాటకం ‘రక్త కన్నీరు’. ఆ నాటకంలో ప్రముఖ పాత్ర ‘సుందరి’ ఆ పాత్రను తలచుకుంటేనే  మన కళ్లముందు నటీమణి సీత సాక్షాత్కరిస్తుంది. ఒకటికాదు, రెండుకాదు ఆరు దశాబ్దాల ఆమె జీవితం కళామతల్లితో పెనవేసుకు పోయింది. రంగస్థలంపైనే కాదు వెండి తెరపై కూడా ఓ వెలుగు వెలిగింది. తాను జీవితాంతం నటించి పేరు ప్రఖ్యాతలు పొందిన ‘రక్త కన్నీరు’ నాటకాన్నే, ఇంటిపేరుగా స్థిరపరుచుకున్న విలక్షణ నటి సీత. 70ఏళ్ల వయసులో నలుపు తెలుపు చిత్రాల జ్ఞాపకాలతో హైదారాబాదులోని హిమాయత్ నగర్‌లో కాలం గడుపుతోది. పాత్ర చిన్నదైనా ఏదైనా అతి సమర్థవంతంగా నటించి పేరు తెచ్చుకున్న  సీత జ్ఞాపకాలు ఈ వారం .....

నేను 1935 సంవత్సరంలో విజయదశమిరోజు జన్మించాను. మా స్వస్థలం కాకినాడ. అయినా నేను పెరిగింది మాత్రం u£ంబాయి, మద్రాసు నగరాల్లోనే. మా తల్లిదండ్రులు నన్ను రాజాశాంతో గారికి దత్తత యిచ్చారు. అలా రాజాశాంతో, ఆయన సతీమణి లీలాబాయి గార్లు నాకు పెంపుడు తల్లిదండ్రులు. మా నాన్నగారైనా రాజాశాంతో ఆరోజుల్లో బాగా పేరున్న నిర్మాత. ఆయన పేరుతో తమిళనాడు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక పెద్ద అవార్డు కూడా యిస్తోంది.

మా అమ్మ లీలాబాయి కూడా కళాకారిణే. ఆమె మÖకీ చిత్రాల్లో నటించేవారు. అలా మా అమ్మనాన్నలిద్దరూ సినిమా పరిశ్రమలోనే వుండటం వల్ల నాకు ఆవాసన అబ్బింది. మÖడు సంవత్సరాలు u£ంబాయిలో పెరిగి, నాకు  నాలుగో ఏట మద్రాసు వచ్చేశాను. మా అమ్మ నన్ను సినిమా నటిగా  చూడాలని చాలా కలలు కనేవారు. ఆ రోజుల్లో సినిమా నటి అంటే ఈ రోజుల్లాగాకాదు, అదో పెద్ద తతంగం. నాట్యం, గానం రెండూ ఖచ్చితంగా వచ్చి వుండాలి. అందువల్ల శేషాద్రి అయ్యార్ గారి వద్ద శాస్త్రీయ సంగీతం, వెంపటి చిన సత్యం గారి వద్ద కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. నేను బాలనటిగాననే సినీరంగప్రవేశం చేశాను. సుబ్రమణ్యం (బేబీ సరోజ తండ్రి) గారు నిర్మించిన “త్యాగభూమి” (తమిళం) చిత్రంలో తొలిసారిగా నటించాను. తర్వాత నా పదేళ్ల వయసు వరకూ చదువుకుంటూ వుండిపోయాను. ఆ సమయంలోనే మరో మహత్తర అవకాశం నన్ను వెదుక్కుంటూ వచ్చింది. అదేమంటే నాకు వాహినీ సంస్థలో నటిగా అవకాశం లభించడం. “యోగివేమన” (1947) చిత్రంలో మోహనాంగి (ఎం.వి.రాజమ్మ) చెల్లెలు కనకాంగిగా నటించాను. అంతేకాదు ‘ఏమేమొ చేసేవురా’ అనే జావళీ పాడుకున్నాను. కె.వి.రెడ్డిగారి దర్శకత్వం, చిత్తూరు వి.నాగయ్య, లింగమÖర్తి, ఎం.వి.రాజమ్మ వంటి మహానుభావుల నటసాహచర్యం నాకు మంచి అనుభవం, సినీ పరిజ్ఞానాన్ని తెచ్చి పెట్టింది. అయితే “యోగివేమన” కంటే ముందే “సీతారామజననం” (1944)లో నటించాను. పాత్ర పేరు మాత్రం జ్ఞాపకం లేదు. 

“యోగివేమన” తర్వాత భరణీవారి “రత్నమాల” (1948)లో సురభి బాలసరస్వతితో కలసి ‘వగలాడి నిను చేరురా’ అనే నాట్యగీతంలో నర్తించాను. ఆ గీతం కూడా మేము పాడుకున్నదే. అది గ్రాంఫోను రికార్డుగా కూడా విడుదలైంది. వెంటనే “లైలామజ్ను” (1949)లో భానుమతిగారి జనానా లో ఒకరుగా ప్రధాన పాత్ర పోషించాను. “అనగనగా ఒక ఖాన” అనే పాట నాపై చిత్రీకరించిందే. వీటన్నిటి తర్వాత వాహినీ వారి “గుణసుందరికథ” (1949)లో సింగారి పాత్ర పోషించారు. రేలంగి, గోబేరు సుబ్బారావులను కవ్విస్తూ మహేంద్రమణి వుండే దారిని కాపలా కాసే యక్షిణి పాత్ర అది. రేలంగి, గోబేరు సుబ్బారావులను కవ్విస్తూ, ‘నేను సింగారినే’ అనే పాట పాడాను. “గుణసుందరి” తర్వాత చాలా బిజీ అయిపోయాను. వ్పుియావారి ప్రథమచిత్రం “షావుకారు” (1950)లో డాన్సర్ మాణిక్యం పాత్ర పోషించాను. ‘సరసులకిది మేరా’, ‘విరహవ్యధ మరచుకథ’ అనే రెండు పాటలు జోగారావుపైన, నాపైన చిత్రీకరించినవే. కథలో చాలా కీలకమైనన పాత్ర అది. కథా నాయకుడు (ఎన్.టి.రామారావు)ను జైలుకు పంపించే వాంప్‌టచ్ పాత్ర నాకు చాలా మంచిపేరు, తర్వాత్తర్వాత మరిన్ని పాత్రలు తెచ్చిపెట్టింది.  కొంతకాలం నన్ను “షావుకారు సీత” అనే పిలిచేవారు. ఆ పరంపరలోనే “స్వప్నసుందరి” (1950  కస్తూరి శివరావు సరసన), “లక్క్ష్మమ్మ” (1950  శోభనాచల), “నవ్వితే నవరత్నాలు” (1950), “మాయాలమారి” (1950), “చిన్నకోడలు”, “సావాసం” (1951), “దేవదాసు” (1953), “పెద్దమనుషులు”, “మేనరికం”, “పరివర్తన” (1954), “జయసింహ” (1956), “నలదమయంతి”, “మాయాబజార” (1957), “భట్టీవిక్రమార్క” (1960) మొదలైన చిత్రాలన్నిటిలోనూ నటించాను. వేసినవి హాస్యపాత్రలే అయినా పెద్దనటీనటులందరూ మమ్మల్ని గౌరవించేవారు. అంటే ఒకటి, హాస్యమన్న పేరుతో అప్పటికింకా ‘సెక్స’కి విప్పిచూపడం, బూతు పాడడం అన్న నిర్వచనం రాలేదు. కన్ను గీటుతో, కొనగోటితో పులకరింతలెత్తించేవారు దర్శకులూ, నృత్యదర్శకులూ. హాస్యపాత్రలకు కూడా కథలో ఇంటర్‌లింక్ వుండేది. ఉదాహరణకు “భట్టీవిక్రమార్క”లో రేలంగితో వేసినా కేవలం హాస్యమే కాదు, కథానాయిక ప్రభావతి (అంజలీదేవి)ని మాంత్రికుడి (ఎస్వీరంగారావు) బారినుండి కాపాడే కీలక బాధ్యత నాది, “నలదమయంతి”లో చాకలిదాని పాత్ర అయిన, దమయంతి (పి.భానుమతి)ని ఆదుకుని ఆశ్రయం కల్పించే పాత్ర. ఇలా కామెడీ కతలో అంతర్భాగంగా కథలల్లే వారు ఆనాటి రచయితలు. పింగళి నాగేంద్రరావు, సదాశివబ్రహ్మం, జంపన. ఇలా ఎంతటి మహానుభావులు వాళ్లు. సదాశివబ్రహ్మం గారైతే “ఏం సీతమ్మా... నీ కోసమే రాశానమ్మా, చాకుల్లాంటి డైలాగులు” అనేవారు. పేకేటిశివరాం, అడ్డాల నారాయణరావు, రేలంగి, కస్తూరి శివరావు, జోగారావు, కనకం, లక్క్ష్మీకాంతం, గిరిజ, సూర్యకాంతం... ఇలా హాస్యం కోసమనే ఓ ప్రత్యేక నటవర్గముండేది. మేమంతా తీరికసమయాల్లో మా పాత్రల గురించి చర్చించుకునే వాళ్లం. అవసరమైతే రచయితను ఒప్పించి కథను కూడా మార్పించే వాళ్లం. ఒకరోజు, రెండ్రోజులు, అవసరమైతే నెలలు నెలలు కూడా రిహార్సల్సు చేసేవాళ్లం. ఈవ్వాళ ఇండస్ట్రీ చాలా మారిపోయింది. అదొక విలాసాల మాయామహల్.. మేము అలా కాదు. సీనియర్లు అంటే గౌరవించే వాళ్లం. ఇప్పుడలా కాదుT, జూనియర్స్‌కు సీనియర్స్ అంటే u£త్తిగా గౌరవం లేదు. ఒక జూనియర్ నటితో, “ఈమె మీ కంటే సీనియర్ అమ్మా..” అని పరిచయం చేస్తే, కనీసం ఒక మర్యాద పూర్వక నమస్కారం కూడా చేయకుండా, అలా చూసి వెళ్లిపోతుంటారు. అది నాకు బాధేస్తూ వుంటుంది. పి.శాంతకుమారి, ఎం.వి.రాజమ్మ, ఎస్.వరలక్క్ష్మి, కన్నాంబ, టి.జి.కమలాదేవి... ఇలా సీనియర్ నటీమణులంటే మాకెంతో గౌరవముండేది. వాళ్లు సెట్లోకి వస్తున్నారంటేనే మాకోవిధమైనన భయమొచ్చేసేది. అలా వుండేది. నిర్మాత అంటే ఇంక స్కూలు హెడ్మాస్టర్ కిందే లెక్క. నిర్మాతల్ని గౌరవించే రోజులు పోయాయి.  అసలు నిర్మాత పచ్చగా వుంటేనే కదండీ, మా ఆర్టిస్టులు బాగుంటాం అది లేదా!

ఏదో ఉద్వేగం ఆపుకోలేక ఎక్కడో వెళ్ళిపోయాను, సారీ.... అసలు విషయానికి వచ్చేస్తాను-

తెలుగులో సుమారు వంద చిత్రాలకు పైనే చేసినా నాకు సంతృప్తినిచ్చినది రెండే “షావుకారు”, “దేవదాసు”. నాకు నటిగా స్థిరత్వాన్ని తెచ్చింది మొదటిదైతే, “దేవదాసు”లో మనోరమ పాత్ర చాలా గొప్పది. పార్వతి (సావిత్రి) స్నేహితురాలు పాత్ర అది. దేవదాసు తాగి చెడిపోతున్నాడని, వచ్చి కాపాడమని పార్వతికి ఉత్తరం రాశేపాత్ర. కథలో కీలకపాత్ర. ఈ రెండు నాకు ఇష్టమైనవి. నేను ఒక్క తెలుగులోనే గాక తమిళంలో కూడా “కృష్ణభక్తి”, “లవంగి” మొదలైన చిత్రాలు చేశాను. హిందీలో “జయసింహ” (డబ్బింగ్)లో నటించాను.. ఇక నాపై చిత్రీకరించిన పాటలు- ‘బంగరు u£మ్మా భలే జోరుగా’ (భలేరాముడు), ‘మురిపెము మీరు మీ కోరిక తీర’ (జయసింహ), ‘లల్లిలలా’ (మాయాబజార్) వంటివన్నీన నన్న sTÖ నాటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేశాయి. 

నాకు సినిమారంగం కంటే నాటక రంగమే సంతృప్తి నిచ్చింది. నాటకాల్లో ఓ వెలుగు వెలిగాను. అసలు నాటకాల కోసం కొన్ని సినిమాలు కూడా వదులుకున్నాను. నా మొదటి నాటకం ఏడేళ్ల వయసులో వేశాను. చెన్నపురి ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రదర్శితమైన ‘మోహినీ రుక్మాంగద’లో ధర్మాంగద పాత్ర పోషించాను. అప్పటినుంచి ‘రంగూన్‌రాధ’, ‘శ్రీకృష్ణతులాభారం’ (నళిని), ‘చింతామణి’ (చిత్ర) మొదలైన నాటకాలన్నీన కొన్నిన వందలసార్లు ఆడాను. ఆ రోజుల్లో శివాజీగణేషన్ నటించిన “మనోహర” చాలా విజయవంతమైన చిత్రం. ఆ చిత్రాన్ని నాటకంగా రూపొందిస్తే, నేను, పద్మనాభం, కొంగర జగ్గయ్యగార్లు చాలాసార్లు ప్రదర్శించాం. పోతే నా జీవితంలో అత్యం ప్రధానఘట్టం ప్రముఖ నటుడు సి.నాగభూషం గారితో నా వివాహం జరగడం. 11.03.1956లో మా వివాహమయ్యింది. మేమిద్దరం సినిమాల్లో బిజీగా వున్నా కూడా డ్రామా ట్రూపు నిర్వహించేవాళ్లం. అప్పటికే ఆయన ప్రజానాట్యమండలిలో చాలా క్రియాశీలక పాత్ర వహించేవారు. అలా ఆయనలోని ÅకమÖ్యనిస్టుభావజాలం నాకు ఒంటబట్టింది. అందువల్ల ప్రజాభ్యుదయ నాటకాలే వేయాలనుకున్నాం. సరిగ్గా ఆ సమయంలోనే తమిళంలో ఎం.ఆర్.రాధగారు ప్రదర్శించి, విజయం సాధించిన “రక్తకన్నీరు” నాటకం మా వారిని విపరీతంగా ఆకర్షించింది. దాని స్క్రిప్టు సంపాదించి, పాలగుమ్మి పద్మరాజు గారితో అనేక మార్పులూ, చేర్పులు చేయించి స్వతంత్ర నాటకంగా రూపొందించారు. అందులో సుందరి పాత్ర నాది. వాంప్ తరహా పాత్ర. హీరో తన భార్య ఇందిరను అలక్ష్యం చేసి సుందరి పంచన చేరుతాడు. సుందరి వంచనకు గురై, పశ్చాత్తాపడే హీరో పాత్రను మావారే పోషించేవారు. ఇందిర పాత్రలో వాణిశ్రీ, శారద, డబ్బింగ్ జానకి... చాలాకాలం పాటు మా ట్రూపులో నటించేవాళ్లు. 1958లో రవిఆర్ట్‌థియేటర్స్ ప్రారంభించాం. మా నాటకం అశేష ప్రజానీకం ఆదరాభిమానాలు పొంది మా ఇద్దరి యింటిపేరుగా ‘రక్తకన్నీరు’ స్థిరపడిపోయింది. మొత్తం ఐదువేలకు పైబడి ‘రక్తకన్నీరు’ ప్రదర్శించి వుంటాం.

వాణిశ్రీ, శారద, మీనాకుమారి (హాస్యనటి).. ఈ మువ్వురికీ రక్తకన్నీరు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. వాణిశ్రీ అప్పటికి సినీ పరిశ్రమకి చాలా కొత్త. ఏవో చిన్నచిన్న పాత్రలు వేస్తూ వుండేది. సంభాషణలు ఉచ్ఛరించడంలోను, ఆహార్యవిషయాల్లోనూ నేను ఎన్నోసార్లు తర్ఫీదŠT ఇచ్చేదాన్ని. అలాగే శారద కూడా మా నాటకాల సమయంలో నా నుంచి ఎన్నో నటనలో మెళుకువలు అడిగి తెలుసుకునేది.

మావారుగానీ, నేను గానీ ఎవర్నీ యాచించలేదు. ఎవరి ముందూ చేయి చాచలేదు, వేషాలు వచ్చినపుడు నటించాం, రానప్పుడు  మానుకున్నాం. సినిమాల్లో విరామం లేకుండా పనిచేస్తున్న రోజుల్లో కూడా, నిర్మాతల్ని ఒప్పించి ప్రతినెలా మొదటివారం ‘రక్తకన్నీరు’ ప్రదర్శించుకునేవాళ్లం. మా అమ్మాయి భువనేశ్వరి పుట్టినప్పుడు ఓ ఆరునెలలు తప్ప, రక్తకన్నీరు ప్రదర్శితమైన (1958-1974) పదహారు సంవత్సరాలు విరామనేది లేకుండా నేను సుందరి పాత్రలో నటించాను, ఆ తర్వాత నటించడం మానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూdమానేసి, ట్రూపు నిర్వహన చూసుకునే దాన్ని. 1986లో ఈ నాటకాన్ని చివరిసారిగా ప్రదర్శించారు మా వారు. ఆ రోజుల్లో రిహార్సల్స్ కఠోర పరిశ్రమలా వుండేది. కొన్ని కొన్ని సార్లయితే అదో హౌస్ అరెస్టులా అనిపించేది. అయితే ప్రదర్శన మాత్రం పెళ్లి వేడుకలాగా సాగిపోయేది. మా నాటక బృందమంతా ఒక కుటుంబం లాగా కలసిమెలసి వుండేవాళ్లం. లేకుంటే ‘రక్తకన్నీరు’ అంత సుదీర్ఘకాలం ప్రదర్శించడం సాధ్యమయ్యేది కాదు. ‘రక్తకన్నీరు’ నాటకం తొలిప్రదర్శన నెల్లూరులో యిచ్చాం. తర్వాత అమలాపురంలో ప్రదర్శించినపుడు వజీర్ అనే కాంట్రాక్టర్ మాకు ఇచ్చింది కేవలం 450 రూపాయలే. కానీ నాటకం పేరు తెచ్చుకుంటున్న కొద్దీ పారితోషికం కూడా పెరుగుతూ వచ్చింది. 450 రూపాయల నుండి 11,000 రూపాయల వరకూ తీసుకునేవాళ్లం. మా ట్రూపు ఒక ప్రత్యేక వ్యానుతో సర్కస్ కంపెనీలాగా వుండేది. సంవత్సరానికి ఎనిమిదినెలలు క్రమం తప్పకుండా నాటకమాడేవాళ్లం. మద్రాసు నుంచి మధ్యప్రదేశ్ వరకూ మా రవిఆర్ట్‌థియేటర్స్ తిరగని చోటంటూలేదు. విజయవాడ సి.పి.ఐ. మహాసభల సందర్భంగా తెల్లవారు ఝామున 5 గంటలవరకూ ‘రక్తకన్నీరు’ ప్రదర్శించాం. అంటే ఎప్పటి కప్పుడు సంభాషణల్ని నాగభూషణంగారు మార్చేశేవాళ్లు. దాంతో జనాలు ఎగబడేవారు. ఆయన నాటకంలో విసిరేవిసుర్లు వినడానికి జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఒకసారి గుడివాడలో ప్రదర్శన జరుగుతుండగా తెలిసినన అంశాన్నే అడుగుతావెందుకు అనడానికి ‘బ్రహ్మానందరెడ్డి కులమేది అని అడగాలా’ అన్న నాగభూషణం గారి డైలాగ్ గందరగోళం సృష్టించింది. కత్తులు, కర్రలతో కొంతమంది రంగస్థలం పైకి దూసుకొచ్చి నానాహంగామా చేసేశారు. ఆయన నాటకంలో విసిరే వ్యంగ్యాస్త్రాలు ప్రదర్శనకే ముఖ్య అలంకారాలుగా వుండేవి. ఎమర్జెన్సీ  రోజుల్లో ‘రక్తకన్నీరు’లోని సంభాషణలపై ప్రభుత్వం కన్నేసివుండేది. అంటే ప్రజల్ని రెచ్చగొట్టి, చైతన్యం తెస్తామేమోనని భయం. ఇంటెలిజెన్సీ అధికారులు పై అధికారులకు రిపోర్టులు పంపేవారు. వాళ్లు వచ్చి స్క్రిప్టు అడిగితే, ఆడిగేదే ఆలస్యం స్క్రిప్టు ఇచ్చేసేవారాయన. ఎందుకంటే అందులో వుండేది ఏ రోజు తెరపై చెప్పేవారు కాదు గదా! అంతా స్పాంటేనియస్ డైలాగులే. అలా స్క్రిప్టు యిచ్చేసినా, ప్రదర్శనలో మళ్లీ మామÖలే ఆయన మార్కు చురకలు. ఒక్కోసారి అధికారులు కూడా ప్రదర్శనలో నిమగ్నమైపోయి వచ్చిన సంగతి మరచిపోయిన సందర్భాలు కోకొల్లలు. ఉదాహరణకు “ఈ ఊళ్లో దోమలు ఏనుగుల్లా ఉన్నాయి. మునిసిపాలిటీవాళ్లు బాగా ప్రేమతో పెంచుతున్నారులా వుంది” అన్న డైలాగ్ మునిసిపాలిటీ వాళ్లకు కంపరం పుట్టించినా, ప్రేక్షకుల చప్పట్లతో హోరెత్తేది.

నాటక ప్రదర్శనలో మావారు చాలాఖచ్చితంగా వుండేవారు. టిక్కెట్లు లేకుండా ఉచితంగా ఎవరినీ అనుమతించేవారు కాదు. ఒకసారి శ్రీకాళహస్తిలో ఈ టిక్కెట్ల విషయం పోలీసుకాల్పుల వరకూ వెళ్లింది. ప్రదర్శన సమయానికి చాలామందే ఆడిటోరియం ముందర జనం ఒకజాతరలా పోగైపోయారు. దాంతో ప్రదర్శన విజయవంతమైనట్లేనని మేమనుకున్నాం. కానీ వాళ్లంతా ఉచితంగా తమను థియేటర్లోకి అనుమతించాలని గగ్గోలు మొదలు పెట్టారు. ససేమిరా వీల్లేదని మేం పట్టుబట్టాం. దాంతో వాళ్లు రాళ్లు విసిరారు. ఆ కొట్లాటలో పోలీసులు జోక్యం చేసుకుని గాలిలోకి కాల్పులు జరిపే దాకా వ్యవహారం సద్దుమణగలేదు. ఈ హడావుడిలో మేముంటే, లోపల ఒక సంఘటన జరిగింది. ఆ జనాల్లో ఎటుపోవాలో అర్థం గాక వాణిశ్రీ స్టేజిమీదే నిలబడిపోయింది. ఆమెకు ధైర్యం చెప్పే మిషతో ఒక పెద్దమనిషి అసభ్యంగా ప్రవర్తించడానికి ఉపక్రమిస్తున్నాడు. అది గమనించిన నేను అతడి చెంప చెళ్లుమనిపించాను. అతనిపై పోలీసు కేసు, మా సంజాయిషీలు వగైరాలన్నీ జరిగాయి. ఇలా ఎన్నో సంఘటనలు వున్నాయి చెప్పుకుంటే. 

ఒక “రక్తకన్నీరు” మాత్రమే కాదు, “పాపం పండింది”, “బికారి రాముడు’, ‘కోతలరాయుడు’, ‘కలికాలం’ వంటి నాటకాలనీÊ్న ఆడాము. వాటిల్లో కూడా నేను ప్రధాన పాత్రే వహించాను. మావారు కొన్ని సినిమాలుT సొంతంగా నిర్మించారు కూడా. “బికారి రాముడు” (1961), “నాటకాలరాయుడు” (1969), “ఒకేకుటుంబం” (1970), “ప్రజానాయకుడు” (1972), “భాగస్తులు” (1975), “ప్రేమచేసిన పెళ్లి” (1978) చిత్రాలు ఆయన నిర్మించినవే. అయితే “బికారిరాముడు”, “నాటకాలరాయుడు” రెండూ బి.ఆర్.నాయుడుగారి భాగస్వామ్యంలో నిర్మించినవి.

తెలుగులో నేను మా చిత్రాల్లో కాకుండా నటించిన చివరిచిత్రం “సంతోషి మాత వ్రత మహాత్మ్యం” (1984). మళ్లీ చాలా సంవత్సరాలకు “నేనేరా పోలీస”, “రియల్‌స్టోరీ” (2000) చిత్రాల్లో నటించాను. నేను డబ్బింగ్ ఆర్టిస్టును కూడా. చాలా మందికి తెలీదు. మోడరన్ థియేటర్స్ వాళ్లు నిర్మించిన  “ఆలీబాబా నలభైదొంగలు” (1954)చిత్రంలో ఎం.ఎన్.రాజంకు తెలుగులో డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్ ఆర్టిస్టుగా నా చివరి చిత్రం “ఏకలవ్య” (1982). అందులో ఆదోని లక్క్ష్మికి డబ్బింగ్ చెప్పాను. ఆ మధ్య టీవీ సీరియల్స్‌లో కూడా నటించాను. “రుతురాగాలు”, “శివలీలలు”, “విధి”, “భార్యాభర్తలు” మొదలైన సీరియల్స్‌లో నటించాను. మాకు ఇద్దరు పిల్లలు - అమ్మాయి భువనేశ్వరిని ప్రముఖ దర్శకుడు ఎస్.డి.లాల్ కుమారుడైన మీర్‌కు యిచ్చి వివాహం చేశాం. మా అల్లుడు మీర్ కూడా టెలివిజన్ రంగంలో కెమురామాన్, ఎడిటర్, దర్శకుడుగా వున్నాడు. వాళ్లకు ఇద్దరు మగపిల్లలు. నా కొడుకు సురేంద్ర కూడా సినిమాల్లకు కెమెరామాన్‌గా వున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు. నా మనవడు హోటల్ మేనెజ్‌మెంట్ పూర్తి చేశాడు. మనవరాలు డిగ్రీ చదువుతోంది.

ప్రస్తుతం నా కొడుకు దగ్గరే వుంటున్నాను. మనవళ్లు, మనవరాళ్లతో ప్రశాంతంగానే గడుపుతున్నాను. దాదాపు పరిశ్రమకు దూరంగానే వున్నాను. అయినా నాటక, సినీ, టీవీ, డబ్బింగ్ రంగాల్లో ఉన్నపేరు నిలుపుకుంటే చాలు. ఈ మధ్యే హైదరాబాదలో “దేవదాసు”కు యాభై ఏళ్లు పూర్తయ్యాయని, అందులో నటించిన నాకు సన్మానం చేశారు. ఇంకా ఏదో నటించాలి, చేయాలి అనుకుంటాంగానీ, పరిశ్రమ మునుపటిలా లేదు. పాత ఆర్టిస్టుల్ని కూడా చూడాలని వుంటుంది. ఏదో ఒక స్వర్ణయుగం కళ్లముందరే మాయమై పోయినట్లు వుంటుంది. ఏం చేద్దాం! కాలాన్ని వెనక్కి తిప్పలేం కదా! 


కైకాల సత్యనారాయణ...... అమ్మో ‘సత్తిగాడు’

నేను 25.10.1935న కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో మాతామహుల ఇంట జన్మించాను. శ్రీమతి సతారామమ్మ, కైకాల లక్క్ష్మీనారాయణ గార్లు నా తల్లిదండ్రులు.

సాధారణన వ్యవసాయ కుటుంబంలో పుట్టినన నేను 1951 వరకు అమ్మమ్మగారి ఇంట్లోనే పెరిగాను. రోజూ రెండున్నర మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళి గుడ్లవల్లేరులో చదువుకున్నాను. చదువుకునే  రోజుల్నుండి కూడా నేను నాటకాలు వేస్తూ ఉండేవాడిని. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ‘ప్రేమలీలలు’ అనే నాటకంలో విలన్ వేషం వేశాను. అదే నా తొలి రంగస్థల అనుభవం.

అప్పట్లో ‘ప్రభాకర్ నాట్యమండలి’ అనే రంగస్థల నాటకాల కంపెనీ ఉండేది. అందులో నేను రెండు సంవత్సరాలు హీరోగా కొనసాగాను. ఒకసారి విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో పినిశెట్టి గారి ‘పల్లెపడుచు’, ఆత్రేయ గారి ‘ఎవరు దొంగ’ ప్రదర్శించడానికి మా నాటక బృందమంతా వెళ్ళాం. అప్పుడు నాటకం చూస్తున్న వారంతా ‘అరే ఈ కుర్రాడు ఎన్టీఆర్‌లా ఉన్నాడే, రామారావుగారి తమ్ముడా?’ అని అనుకుంటున్నారు. సరే ప్రదర్శనలు పూర్తయిపోయాయి. నేను మేకప్ రూంలోకి వెళ్ళగానే, జనమతా వచ్చేసి ‘రామారావు గారికి మీరు ఏమవుతారంటూ’ ప్రశ్నల వర్షం కురిపించారు. డా. గరికపాటి రాజారావు గారు ఆ నాటక పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరు. ఆయన నా దగ్గరకు వచ్చి- సినిమాల మీద ఆసక్తి ఉందా!’ మీరు ‘ఊ’ అంటే ఇప్పటికిప్పుడు నాతో మద్రాసు తీసుకువెళతాను” అని అన్నారు. నాకు ఇంట్రస్ట్ లేదండీ అన్నాను.

నేను ఇంట్రస్ట్ లేదు అనడానికి ఒక కారణం ఉంది. మా కుటుంబం మొత్తంలో అప్పట్లో ఎవరూ డిగ్రీ వరకు చదువుకోలేదు. 1955లో డిగ్రీ పూర్తయిపోయింది. చాలా ఉద్యోగాలకు దరఖాస్తులు పెడితే ఎక్కడా ఉద్యోగం రాలేదు. చివరికి హైస్కూల్లో క్లర్కు పోస్టుకి కూడా దరఖాస్తు పెట్టాను. అదీ రాలేదు. దాంతో రాజమండ్రిలోని మా కలప హోల్‌సేల్ డిపోకి వెళ్ళి పనిచేయమన్నారు మా నాన్నగారు. అక్కడ మÖణ్ణెల్లు ఉన్నాను. ఈలోగా ఉత్తరం వచ్చింది. ఎల్.వి.ప్రసాద్ గారు ‘కొడుకులు - కోడళ్ళు’ చిత్రం తీస్తున్నారు. మీకు ఇంట్రస్ట్ ఉందా? ఉంటే రండి అని నా బాల్యమిత్రుడు కె.ఎల్.ధర్ (కానూరి లింగాధరరావు) రాశారు. అది మా నాన్న గారికి చూపించి ‘సినిమాల్లోకి వెళ్ళానా? వద్దా?’ అని అడిగాను. మా పెదనాన్న అంజయ్యగారు ‘తప్పకుండా వెళ్ళు, అక్కడగాని విజయం సాధించలేకపోతే మన వ్యాపారం ఉండనే ఉంది’ అని ప్రోత్సహించారు. నాకు బాగా జ్ఞాపకం 22.9.1956న మద్రాసు మహానగరంలోకి అడుగుపెట్టాను.

ఎన్నో అవకాశాలు వచ్చినట్టే వచ్చి దూరమై పోయేవి. ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రెండు పూటలా తింటి తినటానికి నేను ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. విసుగుపుట్టి ఇంటికి తిరిగి వెళ్ళిపోదామనుకున్నాను. అయితే సినిమాలలో నటిస్తానని ఊళ్ళో గర్వంగా చెప్పి మరీ మద్రాసు వచ్చాను కదా! అయితే అందుకే ఒక చిన్న వేషం అయినా సరే వేయకుండా ఇంటికి తిరిగి వెళితే అందరూ నవ్వుతారనే బాధ ఎక్కువైంది. చివరి ప్రయత్నంగా ‘వినోదా’ అధినేత డి.ఎల్.నారాయణ దగ్గరికి వెళ్ళి ‘చాలామంది అవకాశం ఇస్తామన్నారు. కానీ ఒక్కరూ ఇవ్వలేదు. మీరైనా చిన్న వేషం ఇప్పించండి’ అని ప్రాధేయపడ్డాను. ‘నీ ఫొటోలు ఏవైనా ఉన్నాయా’ అని అడిగారు. డి.ఎల్. వెంటనే నేను ఫోటోలు చూపించాను. వాటిని చూసి ‘బాగానే ఉన్నావు కానీ నా దగ్గర హీరో వేషం తప్ప ఇంకోటి లేదే’ అన్నారు డి.ఎల్.నా ఉత్సాహమంతా నీరుగారిపోయింది. చిన్న వేషమే ఇవ్వని వారు హీరో వేషం ఇస్తారా? ఒక వేళ ఇవ్వమని అడిగితే అత్యాశ అనుకుంటారేమోనని నాలో నేను మధనపడిపోయాను. ఇంతలో డి.ఎల్.గారే ‘ఇదిగో అబ్బాయ్. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ నువ్వు చిన్నవేషం వేయలేదు కదా!’ అనడిగారు. ‘లేదండీ” అని చెప్పాను. ‘అలా అయితే నా చిత్రంలో హీరో వేషం నీకే ఇస్తాను’ అన్నారు. నా నోట మాట రాలేదు, కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.

కలో నిజమో తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్న నన్ను చూసి “నిజంగానే హీరో వేషం ఇస్తానయ్యా.’ అయితే ఒక షరతు. నువ్వు వేరే చిత్రాలలో చిన్న వేషాలు వేయకూడదు” అన్నారు డిఎల్. నేను సరేనన్నాను. 19.6.1958న నాకు మేకప్ టెస్ట్ జరిగింది. జూన్ 26న అగ్రిమెంట్ రాసుకున్నాం. జూలై 2న ‘సిపాయి కూతురు’ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.

జమునగారు హీరోయిన్.  ఆ చిత్రం ఆర్థికంగా విజయవంతం కాలేదు. జమునగారు అప్పటికే పేరున్న కథానాయిక. ఆమె పక్కన కొత్తవాడు హీరోగా ప్రజలు ఊహించలేకపోయారు. దొరక్క దొరక్క ఒక అవకాశం దొరికిందనుకుంటే అది కాస్తా ఫ్లాపవడంతో మద్రాసు వదిలేసి వెళ్ళిపోదామనుకున్నాను. అయితే డిఎల్‌గారు ‘ఇక ముందు నువ్వుబయటి చిత్రాల్లో నటించవచ్చు” అని విడుదల పత్రాన్ని ఇచ్చారు. సరిగ్గా అప్పుడే ఎస్.డి.లాల్‌గారు విఠలాచార్య గారి సిఫారసుతో ‘సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి’ (1960) చిత్రంలో ముద్దురు రాజకుమారులలో ఒకరిగా అవకాశం ఇచ్చారు. అందుకని వారు నాకు గాడ్‌ఫాదర్ లాంటి వారు. జీవితంలో నేను ఆయనను మరచిపోతే కృతఘ్నుడి కింద లెక్కే.

అలా విలన్‌గా శ్రమిస్తున్న రోజుల్లోనే మొదటి సారిగా మహానటుడు ఎస్వీరంగారావు గారితో కలిసి ‘ఆటu£మ్మలు’ (1966) అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం షూటింగ్‌లో ఆయన కాంబినేషన్‌లో మొదటిరోజు అది. ఎందుకనో నాలో కొంత బెరుకుతనం ఆవహించింది. ఫస్ట్‌సీన్ రిహార్సల్ కొంచెం భయంభయంగానే చేశాను. దాంతో ఆయన ‘ఛీ..... డైలాగ్ ఇలాగేనా చెప్పేది?’  అంటూ నా చేతిలోని డైలాగ్ పేపరులాక్కొని, డైలాగ్స్ ఎలా చెప్పాలో చెప్పారు. ఆ రోజు నా పరిస్థితి ఎలా అయ్యిందంటే... నా కసలు డైలాగులు చెప్పడమే రాదేమోననుకునే స్థాయికి వెళ్ళిపోయాను. నాలో నేనే కుమిలిపోయాను. నేను అంత చేతగాని వాడినా అనిపించింది. వెంటనే ‘నా పెర్‌ఫార్మెన్స్‌కి రంగారావుగారే అభినందనలు తెలియజేసే స్థాయికి ఎదగాలి’ అని మనసులో నిర్ణయించుకున్నాను. 

ఇది జరిగినన కొన్నేళ్ళకు ఓ రోజు నేను విక్రంస్టూడియోలో ఓ షూటింగ్‌లో సెట్‌లోకి వెళ్తుండగా ఎస్వీఆర్ గారు నన్ను చూసి కారాపి, నా దగ్గరకు వచ్చారు. “కంగ్రాట్స్ సత్యనారాయణా! రాత్రే ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) చూశాను. చాలా గొప్పగా చేశావయ్యా. అందులో ఓ నటుడుగా నాకు నేను ద్వితీయశ్రేణి మార్కులు వేసుకున్నాను. నీకు ప్రథమ శ్రేణి ఇచ్చాను” అన్నారు. జీవితంలో ఎన్నడూ కలగని ఆనందం ఆ రోజున నాకు కలిగింది. అందుకనే ఈనాటికీ మధురజ్ఞాపకంగా ఉండిపోయింది. ‘జంజీర’ చిత్రాన్ని ఎన్టీఆర్‌గారు హీరోగా ‘నిప్పులాంటి మనిషి’ (1974) పేరుతో ఎస్.డి.లాల్ గారి దర్శకత్వంలో తెలుగులో పునర్నిర్మించారు వై.వి.రావుగారు. ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర షేర్‌ఖాన్. ఆ పాత్రను నా చేత చేయించమని ఎస్వీ రంగారావుగారే స్వయంగా నిర్మాతకు చెప్పి నాతో నటింపజేశారు. తర్వాత ఆ పాత్రకి విపరీతమైన ఆదరణన లభించింది, ‘స్నేహమేరా జీవితం’ పాట ఈ చిత్ర విజయానికి యాభై శాతం దోహదం చేసిందని చెప్పవచ్చు.

ఇక నన్ను ప్రోత్సహించి నటుడుగా నెలబెట్టడంలో ఎన్.టి.రామారావుగారు తీసుకున్న శ్రద్ధ నా జీవితంలో మరువలేనిది. ఆయన తన ‘శ్రీకృష్ణపాండవీయం’లో రుక్మి పాత్ర ఇచ్చి మొదట ప్రోత్సహించారు. ‘తమ్ముడూ’ అంటూ ఎంత ప్రేమతో పిలిచేవారు. మా ఇద్దరి తొలిచిత్రం ‘తిరుపతమ్మ కథ’ (1963). ‘శ్రీకృష్ణావతారం’ (1967)లో నాకు రామారావుగారి చలవవల్లే దుర్యోధనుడి పాత్ర లభించింది. వారి సొంత చిత్రం ‘దానవీరశూరకర్ణ’ (1977)లో నేను భీముడుగా నటించాను. అప్పట్లో కృష్ణగారి ‘కురుక్షేత్రం’, ఎన్.టి.ఆర్‌గారి ‘దానవీరశూరకర్ణ’ పోటాపోటీగా నిర్మించబడ్డాయి. ఆ సమయంలో ఆ చిత్రంలో నటించేవారు ఈ చిత్రంలో నటించకూడదని ఇరుపక్షాల వారు నిబంధన పెట్టారు. అలాంటి పరిస్థితులలో రామారావుగారు నన్ను పిలిచి భీముడి వేషం వెయ్యమన్నారు. నేను సరేనన్నాను. ‘కురుక్షేత్రం’లో నటించకూడదన్నారు. “నాకూ దుర్యోధనుడి పాత్ర పోషించాలనే కోరిక ఉంటుంది కదా!” అని నసిగాను. వెంటనే ఆయన “సరే! రెండూ చూసుకో!” అన్నారు. ఆ విధంగా ఇటు ‘దానవీరశూరకర్ణ’లోనూ, అటు ‘కురుక్షేత్రం’లోనూ నటించిన ఏకైక నటుణ్ణి అయ్యాను.

మా ఇద్దరికీ పోలికలుండడం నా పూర్వజన్మ సుకృతం. మొదట్లో కొన్ని సినిమాల్లో రామారావుగారికి డూప్‌గా కూడా నటించాను. కానీ ఎవరూ గుర్తుపట్టలేదు. ‘రాముడు-భీముడు’, ‘గోపాలుడు-భూపాలుడు’ మొదలైన చిత్రాలు నేను వారికి డూప్‌గా నటించిన చిత్రాలు.

“సినిమాల్లో మనం అన్నేళ్ళు ఎంత అనుబంధంగా ఉన్నామో, రాజకీయ రంగంలో కూడా అలా కలిసిమెలిసి ఉండాలని నా వాంఛ. నేను బతికున్నంతవరకు నా పక్క కుర్చీటో నువ్వు నాకు తోడుగా ఉండాలి” అంటూ రాజకీయాల్లోకి నన్ను ఆహ్వానించారాయన. అయితే సకాలంలో అది నాకు సాధ్యపడలేదు. అదొక్క లోటు మాత్రం నా జీవితంలో ఉండిపోయింది. 

విలన్ వేషాలతో తెలుగు పరిశ్రమను అలరిస్తున్న రోజుల్లో నాలోని నటనా ప్రతిభను వెలికితీసిన దర్శకుడు కె.విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో నిర్మించిన ‘శారద’ (1973) తెరకు నన్న మరో రూపంలో చూపెట్టింది. భర్త చనిపోయాడని తెలియక ఎదురుతెన్నులు చూస్తూ ఉన్న చెల్లెలికి నిజం చెప్పలేక, విషాదాన్ని దిగమింగుకోలేక కుమిలి పోయే అన్నయ్య పాత్ర అది. ఆ చిత్రం నన్ను చాలా మంచి నటుడిగా పరిశ్రమలో నిలబెట్టింది. నేను నటించిన చిత్రాల్లో నాకు బాగా నచ్చిన చిత్రమది. ఆ కోవలోనే ‘అత్తగారు కొత్తకోడలు’ (1968). ‘సంసారం-సాగరం’ (1974) నాకు బాగా సంతృప్తినిచ్చిన చిత్రాలు.

ఇంకా ఎన్నో మంచి పాత్రలు ఇవ్వాళ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గుండె ఝల్లుమంటుంది. ఇవన్నీ చేసింది మనేమేనా అని- విఠలాచార్య గారి పుణ్యమా అని విలన్‌గా తెరపై స్థిరపడిపోయాను. నా విలన్ వేషాలకు ‘అమ్మో సత్తిగాడు’ అంటూ జనం జడుసుకునేవారు. నేను విలన్ వేషాలు వేస్తున్న రోజుల్లోనే ఒక రోజు స్నేహితులతో సెకండ్ షో సినిమా చూసి వస్తున్నాను. మా ముందు నడుస్తున్న ఒకావిడ ‘ఆ సత్తిగాడు కనిపిస్తే వెనకాలే వెళ్ళి పొడిచేయాలనిపిస్తుందే’ అని పక్కామెతో అనడం నాకు వినిపించింది. తిట్లు, చివాట్లు విలనిజానికి సర్టిఫికెట్లని నాలో నేను సమర్థించుకున్నాను. ఔట్‌డోర్ షూటింగ్‌లకి వెళ్తే ‘నీకు అక్కా చెల్లెళ్ళు లేరా.... ఎందుకురా బాబూ! అలా ఆడకూతుళ్ళను హింసబెడతావు’ అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ‘ఏడ్చే పిల్లలను సత్యనారాయణ వచ్చి తీసుకెళ్ళిపోతాడు’ అని బెదిరించిన మాటలూ విన్నాను. ఇవన్నీ నా కెరీర్‌లో నాకు పూర్తి సంతృప్తినిచ్చినన సందర్భాలుగానే నేను భావిస్తుంటాను.

నాకు భార్య, నలుగురు పిల్లలు. ఎంత దారుణమైన ప్రతినాయక పాత్రలు వేసినా నా పిల్లలపై అలాంటి ప్రభావాలు పడలేదు. అసలు వాళ్ళెప్పుడూ నటనపైనన ఆసక్తి కనబరచలేదు. కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తూ, నా పిల్లల మంచిచెడ్డలు గమనిస్తూ, నా పిల్లల మంచిచెడ్డలు గమనిస్తూ, నాకు నిరంతరం తోడుగా ఉండే నా అర్థాంగి దొరకడం నా కత్యంత ఆనందదాయకం. ఎందుకంటే నన్ను ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ సుఖద్ణుఖాల్లో పాలుపంచుకుని ఒక సమతౌల్యస్థితిని నా గృహంలో కల్పించింది నా సతీమణి. అందువల్లే ఈ రోజున అందరం హాయిగా ఉన్నాం. ఆ మధ్య మా కుటుంబ సభ్యులంతా కలిసి మా దంపతులకు చేసిన షష్ఠిపూర్తి ఉత్సవం కూడా నా హృదయాన్ని ఉప్పొంగింపజేసేదే. మాటల్లో చెప్పలేని ఆనందమది. నా ఇద్దరు కూతుళ్ళు, కొడుకులు, మనుమళ్ళు, మనుమరాళ్ళు, నా చెల్లెల్లు, తమ్ముడు, అందరూ పాలుపంచుకుని మాకు షష్ఠిపూర్తి జరిపారు. అదేవిధంగా నా జన్మస్థలం లాంటి గుడివాడలో కనకాభిషేకం చేసిన సంఘటనన మరచిపోలేనిది. ఆ రోజు నన్ను, నా భార్యను ఊరంతా ఊరేగించి అభిమానులు పలికిన జేజేలు ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తునే ఉన్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి. నాలోని మనిషికైనా, కళాకారునికైనా? ఈ జన్మకిది చాలు. ఇంకా ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందాను. అందరూ నన్నడిగే ప్రశ్న ‘మీకు ఎందుకు పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు రాలేదు’ అని. నిజానికి రెండేళ్ళ క్రితమే ఈ ప్రభుత్వం వాటికి నా పేరు సిఫారసు చేసి పంపినా నాకివ్వలేదు. ఇవన్నీ అలంకారాలే. ఇన్నికోట్లమంది అభిమానులు తమ హృదయాల్లో ‘నవరస నటనాసార్వభౌమ’ అని పిలుస్తూ, చెరగని సుస్థిరమైన స్థానాన్నిచ్చారు. అది చాలు నాకు.