హిందుత్వాన్ని కొల్లగొడుతున్న దురాక్రమదాడులు
రామాయణ, మహాభారతగాథలు అపూర్వ సాహితీ సంపదలుగా భావిస్తూ తలపై మోస్తున్న దేశ ప్రజలు...!!! వేలయేళ్ళ ఋషి పరంపర.... భారతభూమే మాతృభూమిగా భావిస్తున్న హిందువులకు ఈ ఉపఖండంలో స్వాతంత్ర్యం వచ్చాక కూడా స్వాభిమానానికి గండిపడింది. అవమానాలు, పోరాటాలు, సెక్కులరిజం ముసుగున అరదండాలు. క్రైస్తవ యూరఫ్ఖండం మతమార్పిళ్ళు - వ్యాపారధోరణి, ఇస్లామ్ దేశాల మతతీవ్రత - విస్తరణకాంక్ష, సూడో సెక్కులరిస్తు స్వదేశీ, విదేశీ గ్యాంగ్ అనేవి మనకు పొంచి ఉన్న ప్రమాదాలు హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్ళు. మన పాఠ్య పుస్తకాల్లో భారతదేశాన్ని వాస్కోడిగామా కనుగొన్నాడు. అమెరికాను కొలంబస్ కనుగొన్నాడు అన్న వాక్యాలను చదువుతాం. ఇదెంతవరకు నిజమంటారు? వేలాది సంవత్సరాల చరిత్ర కల్గిన మనదేశాన్ని వాస్కోడిగామా మే 20వ తేదీ 1498న కనుగొనడం నిజమేనా?
నిజానికి 15వ శతాబ్దంలో ఐరోపాఖండంలో స్పైన్, పోర్చుగల్ రెండు మాత్రమే శక్తివంతమైన దేశాలుగా ఉండేవి. ఈ పోర్చుగల్ మాఫియా గ్యాంగ్ కు వాస్కోడిగామా లీడర్. దోపీడీ ముఠా నాయకుడు మనదేశానికి హీరో ఎలా అయ్యాడు? ఇలాంటి మరొకతను స్పెయిన్లో ఉండే కొలంబస్. స్పెయిన్, పోర్చుగల్ మధ్య జరిగే ఓడల దొంగతనాలకు, ఘర్షణలకు, దోపిడీలకు ఈ ఇద్దరే కారణం. అయితే ఈ గొడవల పరిష్కారం కోసం వీళ్ళు వారి 'మతధార్మికమండలి'ని సంప్రదించేవారు. క్రీ.శ 1492లో వీళ్ళ మధ్య వచ్చిన 'దోపిడీపంపకం' ఘర్షణ నివారణకు ఆనాటి సిక్స్ పోఫ్ ఓ డాక్యుమెంట్ ద్వారా నిర్ణయించి కట్టడి చేశాడు. ఆ డాక్యుమెంట్ ప్రకారంగా ప్రపంచంలోని తూర్పు భాగాన్ని పోర్చుగల్ మూఠాకు, పశ్చిమ భాగాన్ని స్పెయిన్ ముఠాకు నాటి చర్చి అధికారి అప్పజెప్పాడు. ఈ ఒప్పందం ప్రకారం వాస్కోడిగామా సముద్రం ద్వారా ప్రయాణం చేసి తూర్పు దేశాల వైపు కొలంబస్ పశ్చిమ దేశాల వైపు ప్రయాణం చేశారు. దోచుకోవడానికి చర్చి స్వయంగా దస్తావేజును సిద్ధం చేయడం గమనించదగ్గ విషయం.
1492లో కొలంబస్ అమెరికా చేరగా 1498లో వాస్కోడిగామా భారత్ కు చేరాడు. దాదాపు 14 సం||లు అమెరికా 'మాయా సంస్కృతిని అనుసరించే 'రెడ్ ఇండియన్ల'ను లూటీ చేసిన కొలంబస్ స్పెయిన్‌కు తరలించారు. స్పెయిన్ సైన్యం అమెరికా పై దాడి చేసి 10 కోట్ల మంది రెడ్ ఇండియన్లను చంపింది. ఈ రోజుకు అమెరికా మూలరాసులైన 'రెడ్ ఇండియన్స్' 65 వేల మంది మాత్రమే మిగిలారు. ఇక వాస్కోడిగామా 1498లో కేరళలోని క్యాలికట్ రేవును చేరగా అక్కడి పాలకుడైన ' జామోరీస్' స్వాగతం పలికాడు. వ్యాపారం కోసం కొంత స్థలం ఇమ్మని అడిగిన వాస్కోడిగామా చివరికి ' జామెరీన్'ను హత్య చేశాడు. అప్పటికి తూర్పు ఆగ్నేయాసియా, అరబ్ దేశాలకు వ్యాపారం చేసే మన భారతీయ ఓడలపై పన్నులు విధించడం, చెల్లించని ఓడలను నముద్రంలో తొక్కి వేయించాడు వాస్కోడిగామా. క్రమంగా వాస్కోడిగామా అక్కడ సముద్ర వ్యాపారం మొం తన కనుసన్నల్లోకి తెచ్చుకొని వెళ్ళేటపుడు ఏడు ఓడల నిండా బంగారు నాణేలను నింపుకొని వెళ్ళినట్లు అక్కడి దస్తావేజులు సాక్ష్యం ఇస్తున్నాయి. మూడుసార్లు భారత్ నుండి 22 ఓడల నిండుగా బంగారు నాణాలను దోచుకెళ్ళాడు. ఇదంతా ఐరోపా ఖండానికి పాకింది.
14, 15 శతాబ్దాల్లో ఐరోపా దేశాలన్నీ దుర్భర దారిద్ర్యంలో ఉన్నాయి. అక్కడ పరిశ్రమలు, పంటలు లేవు. ఎప్పుడైతే పోర్చుగీసు నుండి వచ్చిన వాస్కోడిగామా తీసుకెళ్ళిన ధనరాశులు అక్కడివారు గమనించారో, భారత్ లో సంపదకు కొదువలేదని మనదేశానికి దోపిడీ చేయడానికి వ్యాపారం ముసుగులో వచ్చారు. వాళ్ళను చూసి ఫ్రాన్సు నుండి ఫ్రెంచి వాళ్లు, డచ్ వాళ్ళు, చివరకు ఆంగ్లేయులు కూడా వచ్చారు. వీళ్ళ మధ్యల పోటీ పెరిగి చివరకు ఆంగ్లేయులు పై చేయి సాధించారు. ఆంగ్లేయులు దోపిడీ చేసే ముఠాకు ఓ అందమైన పేరు పెట్టుకున్నారు. దాని పేరు “ఈస్ట్ ఇండియా కంపెనీ” వాస్కోడిగామా క్యాలికాట్ తీరం ద్వారా దోపిడీ చేస్తే వీళ్ళు గుజరాత్ లోని సూరత్ ద్వారా తమ కుట్రకు పదును పెట్టారు. సంపన్న రాష్ట్రమైన సూరత్ ప్రాంత నవాబుకు జేమ్స్ కూపర్ మరో 6 మంది అధికారులు అర్జీ పెట్టుకుని వ్యాపారానికి స్థలం సంపాదించారు. ఈ రోజుకూ “కూప విల్లా” పేరుతో మనం చూడవచ్చు. చివరకు 1612లో స్థలం ఇచ్చిన సూరత్ నవాబునే హత్య చేయించారు. మెల్లగా సూరత్ వాళ్ల చేతిలోకి వెళ్ళింది. వరుసగా మద్రాస్, ఆగ్రా, కలకత్తా, దిల్లీ అన్ని ప్రముఖ స్థలాలు వారి చేతిలోకి వెళ్ళింది.
1750లో దాదాపు ఈస్ట్ ఇండియా కంపెనీ దేశమంతా తన అధికారాన్ని హస్తగతం చేసుకొంది. అయితే శిరాజుద్దేలా బ్రిటీషు వాళ్ళతో 'ప్లాసీ యుద్ధం' చేశాడు. అధికార దాహం, అవినీతి రెండూ ప్లాసీయుద్దంలో మన ఓటమికి కారణం. 34 కోట్ల జనాభా ఉన్న భారతీయులు 50వేల జనాభా ఉన్న ఆంగ్లేయులకు ఎలా దాసులు అయ్యారు? 18వేల సైన్యం ఉన్న సిరాజుద్దేలా కేవలం 300 సైన్యం చేతిలో ఎందుకు హతమయ్యాడు? నాడు ప్లాసీ యుద్ధంలో బ్రిటీషు సైన్యం తరపున యుద్ధానికి వచ్చిన రోబర్ట్ క్లైవ్ బ్రిటీష్ పార్లమెంటుకు రెండు ఉత్తరాలు అనేక అశ్చర్యకర విషయాలను బయటపెట్టాయి. “సిరాజుద్ధాలా సైన్యం 18 వేలు ఉంది. నాకు సైన్యం కావాలని” క్లైవ్ లండన్ పార్లమెంట్ కు లేఖ రాస్తే అక్కడి పార్లమెంట్ అతనికి జవాబు ఇచ్చింది.
1757లో ఆంగ్లేయులు ఫ్రాన్స్ లో నెపోలియన్ బోనా పార్టీతో యుద్ధం చేస్తున్నారు. కాబట్టి “మేం ఎలాంటి అదనపు సైన్యం పంపుతాం” అని సమాధానం ఇచ్చారు. దాంతో క్లైవ్ ఇద్దరు గూఢచారులను సిరాజుద్దేలా సైన్యంలో డబ్బుకు, అధికారానికి లొంగిపోయేవాళ్ళు ఎవరున్నారో కనిపెట్టమన్నారు. వాళ్ళకు సిరాజుద్దేలా సైన్యంలో 'మీర్ జాసర్' అప్పనంగా దొరికాడు. బెంగాల్ ప్రాంతానికి నీవే నవాబువు అనీ, ఈ సింహాసనం నీదే అని ఆశ జూపారు. అంతే 1957 జూన్ 23న సిరాజుద్దేలా 18 వేల సైన్యాన్ని సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్ బ్రిటీషు వాళ్ళ ముందు 'ఫోర్ట్ బిలయం'లో సరెండర్ చేశాడు. 10 రోజులు సైన్యాన్నికి అన్నపానాదులు లేకుండా చేసి 11 రోజు దారుణంగా చంపివేశారు. తర్వాత మీరా జాసర్ బెంగాల్ నవాబు అయ్యాడు. దేశాన్ని ఫణంగా పెట్టి అధికారం సంపాదించాడు. ఇప్పటికీ భారతదేశ లౌకిక కూటమి అంతా మీ జాఫర్ వారసులే! అధికారాన్ని అలాగే సంపాదించాలనుకుంటున్నారు. భారతదేశ గౌరవం, సార్వభౌమత్వం తాకట్టు పెట్టైనా సరే అధికారం సంపాదించాలనుకొంటున్నారు.
బ్రిటీషు వాళ్ళ కుటిలనీతి అలా 1947 వరకు సాగింది. 6 లక్షల మంది వీరులు ఈ దేశం కోసం రక్తతర్పణం చేశారు. అందులో భగత్ సింగ్, నేతాజీ, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి వీరులెందరో ఉన్నారు. కొందరు విప్లవ భావాలతో, మరికొందరు శాంతియుతంగా పోరాటం చేశారు. మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చి, బ్రిటీషువాళ్ళు భౌతికంగా విడిచివెళ్ళినా ఇక్కడి హిందువుల మెదళ్ళ నిండా బ్రిటీషు మనస్తత్వం చొప్పించి వెళ్ళారు. అందుకే ఇక్కడి సంస్కృతి ధ్వంసం చేయడానికి పాశ్చాత్య సంస్కృతి పేరుతో క్రైస్తవ వ్యాపార సంస్కృతిని మనకు అంటగట్టారు. సాంకేతిక పరిజ్ఞానం పేరుతో కొన్ని తినే తిండి రూపంలో కొన్ని, సౌందర్యసాధనాల రూపంలో మరికొన్ని ఆంగ్ల విద్యావిధానం పేరుతో, దౌత్యనీతి పేరుతో కశ్మీర్ పేరుతో బ్రిటీషు వారు మన మెదడు నిండా సంచరిస్తూనే ఉన్నారు. నయా ఉదారవాద సంస్కృతిని మన దేశంలో వ్యాప్తి చేయడానికి బ్రిటీషువాళ్ళకు విదేశీ కమ్యూనిష్టులకు 'జవహర్‌లాల్ నెహ్రూ' అద్భుతమైన ఉపకరణంగా పనికి వచ్చారు. చైనా పట్ల నెహ్రు అవలంభించిన విధానాల వల్ల 1962లో భూభాగాన్ని కోల్పోయాం. ఇందులో నెహ్రూతో పాటు, కమ్యూనిస్టు భావజాలం ఉండి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమీనన్ నాటి రక్షణ మంత్రికో పాపం ఉంది. అలాగే కాశ్మీర్ నాటికీ ఓ అపరిష్కృత సమస్యగా మారడానికి నెహ్రు - మౌంట్ బాటన్ల వ్యక్తిగత ఒప్పందమే కారణం!
నెహ్రూ తర్వాత ఇందిర వచ్చినా ఆమె కొంత గట్టిగా వ్యవహరించినా రాజకీయ, అధికార పిపాస ఆమెకు కూడా ముస్లిం సంతుష్టీకరణ వైపు మొగ్గేటట్లు చేశాయి. అలాగే తదనంతరం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్థిక సరళీకరణ విధానలు దేశానికి అశనిపాతం అయ్యాయి. ఉదాహరణకు 1977లో మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వంలో జీరో టెక్నాలజీకి చెందిన 840 ఉత్పత్తుల జాబితా తయారైంది. మల్టీనేషనల్ కంపెనీల వస్తువులపై నిబంధనలు కఠినంగా ఉండి, నిఘం ఉండేది. మన్మోహన్ సింగ్ ఆ నిబంధన రద్దు చేసి దేశంలోకి మల్టీనేషనల్ కంపెనీలను అనుమతించాడు. దేశం తెలియకుండా పాశ్చాత్య కంపెనీల పేరుతో క్రైస్తవ వ్యాపారుల చేతిలోకి వెళ్ళిపోయింది. డా|| మన్మోహన్ సింగ్ ప్రపంచబ్యాంక్ లో పదేళ్ళు పని చేసినందున వారి ప్రాపకం కోసం ప్రాకులాడాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అతని ఆర్థికమంత్రిత్వానికి ధోకలేదు. కాబట్టే మనదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు క్రైస్తవ కంపెనీలు మల్టీ నేషన్ కంపెనీల పేరుతో మన్మోహన్ సింగ్ అనే మహాద్వారం గుండా ప్రవేశించాయి. 1947 నుండి 1991 మధ్య కాలంలో అన్ని విదేశీ కంపెనీలు మనదేశంలో ప్రవేశించాయి. 17వ శతాబ్దంలో చివరి మొఘల్ల పాలనలో ఈస్ట్ ఇండియాను ఆహ్వానించినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఉదారీకరణ, ప్రపంచీకరణ పేరుతో మల్టీనేషనల్ కంపెనీలకు ద్వారాలు తెరచింది.
అమెరికాకు చెందిన కోల్గేట్ పామోలివ్ 1937లో కేవలం లక్షాయాభైవేల పెట్టుబడితో మనదేశంలో వ్యాపారం ప్రారంభించి ప్రస్తుతం సంవత్సరానికి 100 కోట్లు ఆదాయం గడిస్తోంది. 1990 దశకంలో అమెరికాకు చెందిన పెప్సికోలా 40 కోట్లతో మనదేశంలో వ్యాపారం ప్రారంభించి ప్రస్తుతం సంవత్సరానికి 250 కోట్లు సంపాదించడం గమనార్హం. ఈ కోకాకోలా తయారుచేసే అన్ని పానీనయాల్లో సోడియం బెంజైట్, పొటాషియం సల్ఫేట్, ఫాస్ఫరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, యుటిలేటెడ్ హైడ్రాక్సి అనిసోల్, బీటాకెరటీస్ వంటి రసాయన పదార్థాలను వాడుతున్నారు. ఇవన్నీ కాన్సర్ రోగానికి దారితీసే రసాయనాలే! ఇప్పటి వరకూ పెప్సికోలా పదివేల టన్నుల వ్యర్థాలను అమెరికా నుంచి తీసుకువచ్చి మనదేశ పర్యావరణాన్ని పాడుచేస్తున్నది. అలాగే టూత్ పేస్టు, సబ్బులు, షేవింగ్ క్రీములు, పిజ్జాలు, బర్గర్ల లో వేసే అడిక్టెడ్ పదార్థాలు.... ఇవన్నీ భారత హిందువుల ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టి ఆరోగ్యాన్ని పాడుచేసేవే. ఆరోగ్యం పాడైతే మళ్ళీ వాళ్ళ మందుల కంపెనీల ఔషదాలనే వాడాలి. ఆర్థికంగా దెబ్బతింటే వాళ్ళే మనకు ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు ఇస్తారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ మరో రూపమైన ఆంగ్లేయ-క్రైస్తవ ముఠాను వెళ్ళగొట్టడానికి ఆరు లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే మన నాయకులే ఈ రోజు విదేశాలు “పెట్టుబడి పెట్టండి స్వాగతిస్తాం” అంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటినా మన పరిశోధనల మీతా, మన పెట్టుబడుల మీద మనకు పట్టులేని పరిస్థితి. 'లౌకికవాదం' పేరుతో మన నాయకులు అవలంభించే ఓట్ల రాజకీయం, సంతుష్టీకరణనే దీనికి కారణం. అతి పెద్ద హిందూ జనాభా ఉన్న భారత ఉపఖండం నుండి వ్యాపారం పేరుతో డబ్బు సంపాదిస్తున్న కంపెనీలు పెద్ద ఎత్తున వారి వ్యాపారం సాగటానికి మన దేశంలో రకరకాల పద్ధతుల్లో ఏజెంట్లను తయారు చేస్తున్నది. మానవ హక్కుల సంఘాల పేరుతో ఈ దేశంలోని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం, హక్కుల పేరుతో భారత సైన్యాన్ని అనుమానించి అవమానించడం, దేశప్రజల మనస్సులను మకిలి చేయడానికి ప్రచార ప్రసార మాధ్యమంలో స్లీపింగ్ వ్యాపారాలు చేయడం, వాళ్ళ భోగవస్తువులను అమ్మ కాలను పెంచుకోవడానికి విదేశీ సంస్కృతి వ్యాప్తి చేయడం - అది వ్యాప్తి కాకుండా అడ్డుకొంటున్న హిందుత్వ మూలవాదాన్ని దెబ్బతీయడం వీళ్ళ పని. శ్రీరామజయంతిని రామనవమిగా, శివజయంతిని శివరాత్రిగా, కృష్ణజయంతిని కృష్ణాష్టమిగా జరుపుతాం. అలాగే హిందువులంతా సంప్రదాయబద్ధంగా జన్మదినోత్సవం జరుపుకొంటాం. కానీ మల్టీనేషనల్ కంపెనీలు కేకుల్లో కలిపే పదార్థాలను అమ్ముకోవడానికి "కేక్” చేసే సంస్కృతిని పుట్టినరోజులో ప్రవేశపెట్టారు. పిజ్జాలు, బర్గర్లలో వాడే 'ఇంగ్రీడెంట్స్'ను అమ్మడానికి వీటిని మనదేశంలో విస్తుృతపరచారు. మాంసాన్ని కె.ఎఫ్.సి పేరుతో అమ్ముకొంటున్నారు. హిందూ సంస్కృతిని భ్రష్టుపట్టించడానికి రకరకాల పద్ధతులను వాళ్ళు అవలంభిస్తున్నారు.
క్రైస్తవ మత వ్యాప్తికి ఈ కంపెనీలే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. చర్చ్ చేసే అకృత్యాలను తమప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా సున్నితంగా చూపిస్తాయి. అదే ఇతరులు వాళ్ళను ప్రశ్నిస్తే గోరంత విషయాన్ని కొండంతగా ప్రచారం చేస్తారు. వారు మానసికంగా హిందువుల మెదళ్ళను సున్నితంగా మార్చడానికి విద్యా విధానాన్ని చేతిలోకి తీసుకున్నారు. 1835 ప్రాంతంలో లార్డ్ మెకాలే అనే ఆంగ్లేయ విద్యాధికారి ఈ దేశ సంస్కృతికున్న మూలాలను తెలుసుకోవాలనుకున్నారు. కేవలం 15 సం||లు ఇరాకను ముస్లింలు పాలిస్తే అది ముస్లిం దేశంగా మారిపోయింది. కేవలం 17 సం||లు ఇరాన్ ముస్లిమ్ పాలన చేస్తే ఆ దేశంలో ముస్లి రాజ్యం ఏర్పడింది. 21ఏళ్ళు మాత్రమే ఈజిప్టు మార్చగలిగారు. 50 ఏళ్ళు ఐరోపాను క్రైస్తవులు పాలించగా అది క్రైస్తవఖండం అయ్యింది. 300 ఏళ్ళు ముస్లింలు, 150 ఏళ్ళు ఆంగ్లేయులైన క్రైస్తవులు పాలించినా హిందూ సంస్కృతి చెక్కు చెదరకపోవడానికి కారణాలు ఏమిటా అని ఆలోచించాడు మెకాలే. అందుకే 1600 మంది అధికారులను వినియోగించి భారతదేశం మొత్తం తిరిగి సర్వే చేయమన్నాడు చివరికి. మన మూలాలన్నీ మన విద్యావిధానం, ధర్మంలోనే ఉన్నాయనుకొన్నాడు. ఆ విద్యను, సంస్కృతిని, ధర్మాన్ని ధ్వంసం చేసే చట్టం రూపొందించాడు. అదే “ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ బ్రిటీషు ప్రభుత్వం చేత రూపొందింపజేశాడు. 1858లో కాన్వెంట్ స్కూళ్ళలో మనకు విద్య నేర్పించాలనే ప్రయత్నం చేశాడు. క్రైస్తవ మత విద్యనే అందులో ప్రధానం. తాను భారతదేశంలో విద్య ద్వారా అమలుపరచాలనుకొన్న దుర్మార్గపు ఎత్తుగడలనన్నింటిని 2-2-1835నాడు బ్రిటీషు పార్లమెంట్ ను ఉద్దేశించి పంపిన నోట్ లో చూడవచ్చు. భారతీయ విద్యను ధ్వంసం చేయాలంటే భారతీయ భాషలను ధ్వంసం చేయాలనుకొన్నాడు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత శాస్త్రీయమైన, పురాతనమైన భాషగా పేరొందిన సంస్కృతం స్థానంలో ఆంగ్లాన్ని రుద్దేశారు. భారతీయ భాషలన్నింటికి మూలమైన సంస్కృత భాషపై బురద జల్లించాడు.
ఈ రోజు మేధావులుగా పేరొందిన వాళ్ళు సంస్కృతాన్ని ద్వేషిస్తారు. అలాగే భారతీయ యువకుల్లోని వీర్యశక్తిని ధ్వంసం చేయడానికి క్రికెట్ అనే ఆటను సృష్టించారు. భారతీయ క్రీడలతో ఆరోగ్యంగా ఉండే మన యువతను ఆటలు ఆడకుండా చూసేందుకు మాత్రమే పరిమితం చేశారు. అమెరికి, ఫ్రాన్స్, జపాన్, చైనా, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేషియా లాంటి ఏ దేశంలో లేని క్రీడ మనకు దిగుమతి చేశారు. హిందూ యువకులను ఆ క్రికెట్ ఆట, దాని చుట్టూ జరిగే వ్యాపారం మత్తులో ముంచేసారు. ఈ ఆటలో బెట్టింగ్లు మొదలై దేశంలో ఈ చీకటి వ్యాపారుల వద్ద నల్లధనం చాలా ప్రోగయింది. నల్లకుబేరులంతా నల్లధనాన్ని సౌదీ అరేబియా ద్వారా స్విస్ బ్యాంక్ లకు తరలిస్తున్నారు. ఈ డబ్బు సౌదీ అరేబియా దాటడానికి అక్కడి తీవ్రవాదులకు డబ్బు ముట్టజెపుతున్నారు. వారు ఇస్లామిక్ టెర్రరిజంతో ప్రపంచాన్ని భయకంపితులను చేస్తున్నారు. ఈ క్రికెట్ ఆటను ఎక్కువగా మల్టీనేషనల్ కంపెనీలే ప్రమోట్ చేయడం విశేషం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి