న్యాయ దర్శనము - ప్రవృత్తిపరీక్ష
‘‘ప్రవృత్తిర్యథోక్తా’’ 4.1.1.
ప్రవృత్తిఃR ప్రవృత్తి, యథోక్తా R క్షణసూత్రమునంవర్నింపబడిన విధమున పరీక్షింపబడిన ట్లెంచవయును.
క్షణసూత్రమున (1.1.17.) వాగాదును గురించి వివరముగా జెప్పియుండుటచేతను, వాని యారంభమననేమో ప్రసిద్ధమగుటవనను, సంవయము కుగనందునను ప్రస్తుతమిట పరీక్షింపవసిన విషయమేమియులేదని భావము.
‘‘తథాదోషా ః 4.1.2.
తథాదోషా ఃR ప్రవృత్తివలె దోసము నని యర్థము.
(దోషవిభాగము)
‘‘ తత్త్రైరాశ్యం రాగద్వేషమోహార్థాంతరభావాత్’’ 4.1.3.
రాగద్వేష మోహార్తాంతరభావాత్ R రాగద్వేష మోహము భిన్నము గుటచే, తత్త్రైరాశ్యం R దోషము మువ్విధము.
కామక్రోధాది దోసము నేకములైనను న్నియు మువ్విధము విభజింపనగును (1) రాగము (2) ద్శేషము (3) మోహము, కామము, మత్సరత, స్ప ృహ, తృష్ణ, లోభము, మాయ, దంభము నను వివి రాగమున చేరును. క్రోధము, ఈర్ష్య, అసూయ, ద్రోహము, అర్షముÑ అభిమానము, ద్వేషమున చేరును. విపర్యయమురాగ సంశయము, మానము, ప్రమాదమునను నివి మోహమున నంతర్భావముగును, కాబట్టి రాగ, ద్వేష, మోహముని దోషము మువ్విధము.
రతి నభిషించుట కామము తన ప్రయోజనమును చూడకయే యితరు యభిమతమును చెరుపనెంచుట మత్సరత పరు ద్రవ్యమును గ్రహించు కోరిక స్ప ృహ. తనకు ప్రాప్తించని దానిని కోరుట తృష్ణ. ప్రమాణ విరుద్ధముగా పరధనము నుపమరింపగోరు లోభము. విశేషలాభేచ్ఛ మాయ. కపటముతో తన గొప్పతనమును ప్రకటింపగోరుట దంభము. శరీరేంద్రియాధిష్ఠానము వికృతికి హేతువగు ద్వేషవిశేషము క్రోధము. (సాధారణ) ఉమ్మడి వస్తువునందు ఇంతరు యభినివేశమును వారించుటకు హేతువగు ద్వేష విశేషము ఈర్ష్య యనబడును. పరుగుణమును సహింపలేకుండుట అసూయచెడుగు చేయవయునను కోరిక ద్రోహము. అపకారమును క్షమింపలేమి అమర్షము. అపకారము చేసినవాని నేమియు చేయలేక తన్నుదా ద్వేషించుట అభిమానము. భ్రాంతి జ్ఞానము విపర్యయము ఒక ధర్మియం దనేక విరుద్ధ ధర్మజ్ఞానము సంశయము. లేని గుణమును తనలో నారోపించుకో ‘తాను గొప్పవాడ’ననుకొనుమామను. భావము కర్తవ్యము చేయకుండుట ప్రమాదము ననబడును.
పూర్వపక్షము : `
‘‘నైక ప్రత్యనీక భావాత్ ’’ 4.1.4.
ఏక ప్రత్యనీక భావాత్ R ఆత్మతత్వబోధమనునదొక్కటే విరోధిగా గవగుటవన, నR దోషము మువ్విధము కావు.
ఆత్మ తత్వజ్ఞానము కుగగానే మోహముగానీ, రాగ ద్వేషముగానీ యుండనేరవు. రాగద్వేషాదుకు ఆత్మ తత్వజ్ఞానము విరోధి ` నివర్తకము. రాగద్వేషాదు పరస్పరము భిన్నములై మువ్విధముగునెడ నొక యాత్మతత్వ జ్ఞానముచే నివర్తింపబడుటెట్లు సంభవించును? ఒకటి నివర్తకమయిన నివర్త్యము నొక్కటియే యగును. వివర్తకమొక్కటిjైు నివర్త్యము నేకముయిన రాగద్వేసాదులేకాక తదితర ఘట పటాదు నివృత్తి కావసి వచ్చును. కాబట్టి రాగద్వేషాది దోషము మువ్విధముకాక ఒకేవిధ మన వయునని భావము.
ఉత్తరపక్షము : `
‘‘వ్యభిచారా దహేతు ః ’’ 4.1.5.
వ్యభిచారాత్ R అనైకాంతికమగుటవన, అహేతు R పూర్వోక్త హేతువు సరిగాదు.
ఒకదానిచే నివర్తింపబడునవి పరస్పర భిన్నము కాగూడదను నియమములేదు. ఒకే పాకసంయోగమవన రూపరసగందస్పర్శు మారుచుండుట జూచుచున్నాము కాబట్టి ‘ఏకప్రత్యనీక భావాత్’ ఒక్కటే విరోధిగాగవగుట వన త్రైరావ్యము కాదనుట యుక్తముకాదు.
‘‘తేషాంమోహః పాపీయాన్ నామూఢస్యేతరేతరోత్పత్తేః’’ 4.1.6.
నామూఢస్యR మూఢునకు. ఇతరేతరోత్పత్తేఃR రాగద్వేషము ుత్పన్నముగుటవన, తేసాం R రాగద్వేషమోహములో, మోహఃR మోహమనెడి దోషము, పాపీయాన్ ః R మిక్కిలి పాపము.
మోహమున్న చోటనే రాగద్వేషము కుగును. అది లేనియెడ నవియుగవు. మోహనిమిత్తకము రాగద్వేషము నుట దీనివన బోధపడుచున్నది. రాగద్వేషము సంసారమునకు హేతు, భూతములైన శుభాశుభ ప్రవృత్తుకు మూము గుటచే మోహము మిక్కిలిపాపము. కార్యముకంటె కారణమున దోషమెక్కుడంగీ కరించుట యుక్తము. కాబట్టి ఆత్మతత్వజ్ఞానముద్వారా మందు మోహమును తొగింపవయును. మోహముతొగిన రాగ ద్వేషము స్వయముగానే తొగును.
పూర్వపక్షము: `
‘‘నిమిత్త నైమిత్తిక భావా దర్థాంతర భావో
దోషేభ్‌య ః’’ 4.1.7.
నిమిత్తనైమిత్తిక భావాత్ R కార్య కారణభావమువన, మోహము, దోషేభ్య R దోషముకంటె, అర్థాంతరభావఃR భిన్నము
రాగద్వేషముకు మోహము నిమిత్తమగునెడ, మోహము రాగద్వేషముకంటె భిన్నముకావసియుండును, కాన దోష మనబడరాదని భావము, నిమిత్తనైమిత్తికము పరస్పర భిన్నముగును. చాక్షుషజ్ఞానమునకు నిమిత్తమగు ప్రకాశము దానికంటె భిన్నమగుట నిశ్చిత సిద్ధాంతము. కాబట్టి మోహము దోషములో పరిగణింపబడరాదు.
ఉత్తరపక్షము : `
‘‘న దోషక్షణావరోధాన్మోహస్య’’ 4. 1. 8.
దోషక్షణావరోధాత్ R దోషక్షణముచే నవరుత్థమగుటచే, మోహస్య R మోహమునకు, అర్థాంతరభావము, న R లేదు.
(‘‘ ప్రవర్తనాక్షణాదోషా ః’’ 1.1.18.) అనెడి సూత్రమున దోషక్షణము వర్ణింపబడినది. ఆ క్షణముచే మోహమును క్షింపబడుచున్నది దోషక్షణము దోషము కాని దానిని నిరోధింపజాదు. కాబట్టి మోహమును దోషమే.
మోహము దోషమగునెడ రాగద్వేషముకు సమానజాతీయమగుటచే వానికి నిమిత్త మెట్లగునన,
‘‘నిమిత్తనైమిత్తికభావోపపత్తేశ్చత్యు జాతీయానా
మప్రతిషేధః’’ 4.1.9.
త్యుజాతీయానామ్ R నజాతీయములో, నిమిత్తనైమిత్తికభావో పపత్తేశ్చ R కార్యకారణభావ ముపపన్నమగుట వన, అప్రతిషేధఃR నిమిత్తము కాదనుట యుక్తముకాదు.
దండము ఘటమునకు నిమిత్తము, దండ ఘటము రెండును ద్రవ్యముగుట సమానజాతీయములే. అయినను నిమిత్తనైమిత్తిక భావమున కెట్టి లోపమును లేదు. అట్లే మోహము రాగద్వేష సజాతీయ మైనంతమాత్రమున నదివానికి నిమిత్తమగుటలో నెట్టి దోషమును లేదు. సజాతీయము నిమిత్తనైమిత్తికభావము నందజా వను నియమము లేదని సూత్రాభిప్రాయము. కాబట్టి మోహము దోషము కంటె నర్థాంతరముకాదు.
(ప్రేత్యభావక్షణము)
‘‘ఆత్మనిత్యత్వే ప్రేత్యభావసిద్ధిః’’ 4.1.10.
ఆత్మనిత్యత్వే R జీవుడు నిత్యమైన, ప్రేత్యభావసిద్ధిఃR ప్రేత్యభావము (పునరుత్పత్తి) సిద్ధించును.
పునరుత్పత్తి ప్రేత్యభావ మనబడును. పునరుత్పత్తియన చచ్చి మర పుట్టుట ` పూర్వవరీరమును విడిచి మరియొక శరీరమును గ్రహించుట. ప్రత్యగాత్మ (జీవుడు) అనిత్యమైన నిది సిద్ధింపదు. జీవుడు నిత్యముగాక శరీరముతో బాటు నశించునేని శరీరాంతర గ్రహణము పొసగదు. జీవుడు నిత్యడేయని పూర్వగ్రంథమున ననేక విధము సిద్ధపరుపబడినది. కాబట్టి ప్రేత్యభావమును సిద్ధించినట్లే. విశేషించి పరీక్షింపదగిన యవసరములేదని భావము.
(వస్తువుయుత్పత్తి)
‘‘వ్యక్తాద్‌వ్యక్తానాం ప్రత్యక్షప్రాణాణ్యాత్’’ 4.1.11.
ప్రత్యక్షప్రామాణ్యాత్ R ప్రత్యక్షప్రమాణ సిద్ధమగుట వన, వ్యక్తాత్ R భావపదార్థమువన, వ్యక్తానాం R భావపదార్థము యుత్పత్తి జరుగును.
మృత్తికవన ఘటము, తంతువునుండి పటము, బీజమునుండి యంకురము కుగుచుండుట ప్రత్యక్షగమ్యము. ప్రత్యక్ష సిద్దము నిష్టము లేకున్నను నంగీకరింపక యేకిరిని శక్యముకాదు. ఇట్లు భావపదార్థము (ఉనికిగ వస్తువు) నుండి భావపదార్థము ుత్పన్నముటగుచుండుట ప్రత్యఓఆది ప్రమాణ సిద్ధము. కావున ప్రపంచమునగ సర్వ భావపదార్థమును కొండొక యదృష్ట భావపదార్థ మూకముగా నుద్భమ్లిచున్న ట్లంగీకరింప వసివచ్చును. ఆ భావపదార్థమే జగత్తునకు మూకారణము ` ప్రకృతి యనబడును. సత్పదార్థమునుండియే సత్పదార్థ ముత్పన్నమగు నని వైదికు మతము. కావుననే ఛాందోగు ‘‘సదేవసోమ్యేదమ గ్రాసీత్’’ అన్నారు. కాబట్టి ప్రత్యఓఆది ప్రమాణముద్వారా సత్పదార్థమునుండి సత్పదార్థ ముత్పన్నమగునని యంగీకరింప బడుచున్నది.
పూర్వపక్షము : `
‘‘న ఘటాద్ ఘటానిష్పత్తేః ’’ 4.1.12.
ఘటాత్ R వ్యక్తమగు ఘటమునుండి, ఘటానిష్పత్తేఃR మఱియొక ఘటముత్పన్నము కాకుండుటవన, న R వ్యక్తమునుండి వ్యక్తముత్పన్నమగుననుట సరికాదు.
వ్యక్తమునుండి వ్యక్తముత్పన్నమైననొక ఘటము నుండి మఱియొక ఘట ముత్పన్నము కావయును అట్లగుటలేదు. కాబట్టి వ్యక్తము నుండి వ్యక్తముత్పన్నముకాదు.
ఉత్తరపక్షము : `
‘‘వ్యక్తాత్ ఘటనిష్పత్తే రప్రతిషేధః’’ 4.1.13.
వ్యక్తాత్ R వ్యక్తమగు కపాము వన, ఘటనిష్పత్తేఃR ఘటముత్పన్న మగుచుండుటవన, అప్రతిషేధఃR వ్యక్తమువన వ్యక్తము కుగదనుట సరికాదు,
వ్యక్తమువన వ్యక్తము కుగునన, వ్యక్తకారణ పదార్థమువన వ్యక్తకార్య పదార్థము కుగునని యభిప్రాయము. అందువన వ్యక్తకార్యమువన మఱియొక కార్యము కుగుకున్నను దోషములేదు. ఘటోత్పత్తికి కారణభూతముయిన కపాలాది వస్తువు వ్యక్తములేకదా?
పూర్వపక్షము : ` (శూన్యవాది)
‘‘అభావాద్ భావోత్పతిర్నానుపమృద్య ప్రాదుర్భా
వాత్ 4.1.14.
నానుపమృద్య R కారణమును నశింపజేసి, ప్రాదుర్భావాత్ R కార్య ముత్పన్నమగుటవన, అభావాత్ R అభావమునుండి, భావోత్పత్తిఃR భావము జనించును.
బీజము నశించినమీదట అంకుర మేర్పడుచున్నది. కాబట్టి కారణ నాశానంతరము కార్యము జనించుచున్నదని తెలియుచున్నది. కారణ నాశము భావము కాజాదు. కాబట్టి యభావమునుండి భావము జనించుచున్నది.
ఉత్తరపక్షము : `
‘‘వ్యాఘాతా దప్రయోగః ’’ 4. 1.15.
వ్యాఘాతాత్ ః విరుద్ధార్థకమగుటవన, అప్రయోగఃR నశింపజేసి పుట్టుచున్నందువన అను ప్రయోగము సరికాదు.
కారణమును నశింపజేసి కార్యము పుట్టుచున్నదని కదా శంకాభిప్రాయము! అట్లయిన నశింపజేయునది యుండిన కదా! నశింపజేయగుగును. కాబట్టి నశింపజేసి పుట్టుచున్నదన నర్థమేమి? పుట్టునది పుట్టక ముందుండదుకదా? లేనిది నశింపజేయుటెట్లు? ఉండిన పుట్టుచున్నదన నర్థమేమి? కాబట్టి (ఉపమృద్యప్రాదుర్భవతి) నశింపజేసి పుట్టుచున్నదనుట నిరర్థక ప్రయోగమగును.
పూర్వపక్షము : `
‘‘నాతీతానాగతయో ః కారకశబ్ద ప్రయోగాత్’’ 4.1.16.
అతీతానాగతయో ఃR కారణ కార్యక్షణముగ భూత భవిష్య ద్విషయముందు, కారక శబ్దప్రయోగాత్ R కర్మ, కర్త అది కారక శబ్దమును గౌణముగా ప్రయోగించుట వన, నR పూర్వోక్త ప్రయోగము అనర్థముకాదు.
కారణము నశించి కార్య ముత్పన్నమగును. కారణ నాశానంతరము కార్య ముత్పన్నమగు ననుటలో కర్మ కారకము, కర్త ృకారకము ప్రయోగింపబడినవి. ఈ కారకము లిట అనంతర్యముచే బోధించును. ఇంతియగాని, కారణ కార్యముకంటె భిన్నముగా నొక వస్తువిట కారణమును నశింపజేసి కార్యము నుద్భవింపజేయునని కానీ, అదే కార్యముగా నుద్భవించునని కానీ యుద్ధేశింపబడలేదు. కాబట్టి కారణము నశించి కార్యము ప్రాదుర్బవించునని ప్రయోగించుటలో దోషములేదు.
ఉత్తరపక్షము: `
‘‘ న వినష్టేభ్యో -నిష్పత్తేః ’’ 4.1.17.
వినష్టేభ్యఃR వినాశము పొందినవానినుండి, అనిష్పత్తేఃR కార్యము జనింపనందువన, న R పూర్వోక్తము సరికాదు.
నశించిన కారణము కార్యమును కుగజేయవు. విద్యమాన కారణము వననే కార్యముత్పన్నముగును. వినష్టకారణము వన కార్యము జనించుపక్షమున కర్షకు వినష్ట బీజమును క్షేత్రము నేవిత్తరు? కారణవినాశమున భేదముండదు కాబట్టి, పరివిత్తనము వన గోధూమాంకురము, యవబీజమువన శ్యాం కురము లేకుగవు? భిన్న బీజము వన భిన్నాంకురము ుద్భ వించుటకు బీజమున విశిష్ట శక్తియొకటి యంగీకరింపవసి వచ్చును. అట్టిశక్తి విద్యమాన వస్తువున నుండును గాని నశించినదానియం దుండజాదుకదా? కాబట్టి పూర్వోక్త ప్రయోగ మయుక్తముకాకున్నఉ వినష్ట కారణమువన కార్యోత్పత్తి కుగుననుట పొసగదు. కారణము కార్యమున నన్వయింప వసియుండును. వినష్టతంతువు పటమున నెట్లు సమన్వయము పొందగవు? కాబట్టి యభావమువన భావముద్బవించునను ప్రమాణవిరుద్ధము.
‘‘‘ క్రమనిర్దేశా ద ప్రతిషేధః’’ 4.1.18.
క్రమనిర్థేశాత్ R (బీజము యొక్క పూర్వాపరావస్థలిట క్రమమనబడును.) ఉపమర్ధ పదముచే నిట్టిక్రమము నిర్దేశింపబడుట వన, అప్రతిషేధ ఃR భావమునుండి భావ ముత్పన్న మగుననుట ప్రతిషేధింప బడదు.
బీజోపమర్దము బీజనాశముగా నంగీకరింపుము. బీజము నందు రెండు దముండును. వాని సంయోగము పూర్వావస్థయనబడును. భూసలిలాది సంబంధమువన కుగు వాని విభాగము అపరావస్థ యనబడును. ఈ పూర్వాపరభావవే యుపమర్ద మనబడును. ఇట్లు బీజ మొక యవస్థనుండి మరియొక వయస్థనుబొంది క్రమముగా నంకుర మగును. అందువన భావమునుండి భావముద్భవించు ననుటలో దోషము లేదు. ఇట్లు సర్వభావ పదార్థము కాది భావపదార్థము ప్రకృతి యనబడును.
(ఈశ్వరుడు జగత్కర్త)
‘‘ ఈశ్వరః కారణమ్ పురుష కర్మాఫ్య దర్శనాత్ ’’ 4. 1.19.
పురుష కర్మాఫ్య దర్శనాత్ R జీవు చేయు వుభాశుభ కర్మము నైష్ఫ్య జ్ఞానమువన, ఈవ్వర ఃR క్లేశకర్మ విపాకాశయముచే నస్ప ృష్టుడు, నిరతిశయ జ్ఞానక్రియాశక్తి సంపన్నుడునగు నీవ్వరుడు, కారణమ్ R ముఖ్యకారణము.
రాజుగాని, వ్యవస్థాపకుడు గాని లేని రాజ్యమున మనుజు తాముచేయు వుభాశుభ కర్మముకు తగిన ఫమును పొందజారు. లోకమున పురుషు తాము చేయు కర్మముకు తగిన ఫమును సుఖ దుఃఖ రూపమున పొందుచుండుట జూచుచు న్నాము. జన్మము మొదు కొందఱు సుఖము నను భవించుట, మఱికొందఱు దుఃఖము ననుభవించుట, వేరొక కొందరు సుక దుఃఖము ననుభవించుటయు జూచుచున్నాము. గదా! ఈ యనుభవము కర్మము లేక కుగనేరవు. ప్రకృతి జడమగుటచే దానిచేగాని, జీవులొనరించు కర్మముచేగాని యిట్టి వ్యవస్థ యేర్పడజాదు. ఆకస్మికముగా నిట్టి ఫలారంభము కుగుననుటయు యుక్తముకాదు. జీవాత్ములే స్వయముగా తమతమ కర్మముకు తగు ఫము వ్యవస్థ యొనరించుకొందు రందుమా! వార్పశక్తిమంతు. కాబట్టి యీ విలోణమై, బోక్తృభోగ్యమైన జగత్తున కధిష్ఠాతయన నొప్పు సర్వశక్తిమంతుడగు సర్వేశ్వరుడొక డంగీకరింపబడుచున్నాడు. జీవు చేయు కర్మానుకూముగా నీవ్వరుడు శావ్వతకామునుండి యీ ప్రకృతి నధిష్టించియుండి దీనిని దృశ్యమాన జగత్తుగా నిర్మించుచున్నాడు. భోక్తగు జీవును నిర్మిత జగత్తునందు జన్మమునంది తమతమ కర్మముకు తగు ఫమును యథాసమయ మనుభవించుచున్నారు.
ఆ యీవ్వరుడీ చరాచర జగత్తునకు జీవనళహేతువగుటచే ప్రాణ శబ్దముచే వ్యవహరింపబడును. శాసించుటచే శాసకుడు ` రాజు. సర్వ మతని వశమున నుండును. సర్వ విద్య కాకరమగు వేదముం దిట్లే వర్ణింపబడి యున్నది.
(‘‘ప్రాణాయనయోయస్యసర్వమిదంవ శే’’) అధర్వ 11.2.41.
ఇట్లే యుపనిషత్తుందును వర్ణింపబడియున్నది.
‘‘నవాఅయమాత్మా సర్వేషాం భూతానా మధిపతిః
సర్వేషాం భూతానాంరాజా’’ బృహ. 2.5.15.
పూర్వపక్షము : `
‘‘ న పురుషకర్మాభావే ఫలానిష్సత్తేః’’ 4.1.20.
పురుష కర్మాభావే R జీవుడుచేయు కర్మము లేకున్న, ఫలా నిష్పత్తే ఃR ఫము కుగనందున, న R ఈవ్వరుడు కారణముకాదు.
అన్వయ వ్యతిరేకము కార్య కారణ భావమును నియమించును. జీవకర్మయున్న ఈవ్వరునివన జగత్తు ఉత్పన్నమగును.లేకున్న కుగదు. ఇట్లు పురుషకర్మ జగత్తున కన్వయ వ్యతిరేకముగా కారణమని తెలియుచున్నది. కాబట్టి పురుసకర్మయే జగత్కారణ మగును కాని యీవ్వరుడుకాదు.
ఉత్తరపక్షము: `
‘‘తత్కారితత్వా దహేతు ః ’’ 4.1.21.
తత్కారితత్వాత్ R కర్మయున్నను నీశ్వరునిచే జగత్తు నిర్మింపబడుట వన అహేతు ఃR పూర్వోక్తహేతువు సరికాదు.
జగదుత్పత్తికి కర్మ నిమిత్తమైనను నది స్వతంత్రకారణముకాదు. కర్మ జడము. అది చేతనముచే నధిష్ఠింపబడక స్వతంత్రముగా నొకింతయు నిర్మింప సమర్థము కానేరదు. జడమగుటచేత ప్రకృతియే జగత్తును నిర్మింపజూనపుడు పురుషకర్మ మెట్లు నిర్మింపగదు? నిరతిశయముయిన జ్ఞాన క్రియాశక్తు కవాడగుటచే లోకపతి పరమేశ్వరుడే యీ విచిత్ర జగత్తును భోగ్యముగా నిర్మింప గుగుచున్నాడు.
పురుషకర్మ జగద్వైచిత్య్రమునకు కారణమగును కాని జగత్కర్తకానేరదు. ఈశ్వరుడే కర్త కాగడు.
(స్వభావ వాదము)
‘‘ అనిమిత్తతో భావోత్పత్తి ః కంటకతైక్ష్ణ్యాది దర్శనాత్ ’’ 4.1.22.
కంటకతైక్ష్ణ్యాది దర్శనాత్ R నిమిత్తము లేకయే కంటకాదుందు తైక్ష్ణ్యము మున్నగునవి చూడబడుటవన, అనిమిత్తత ః R కారణము లేకయే స్వభావముగా, భావోత్పత్తిఃR కార్యపదార్థమున్నియు పుట్టుచున్నవి.
కంటకమున తీక్ష్ణత, మయూరమున చిత్రవర్ణము స్వభావముగా నేర్పడుట చూచుచున్నాము. అట్లే లోకమున నుత్పన్నముగు వస్తువు (భావము) నని తంపవయును. ఒకటి నిమిత్తము లేకయే జనించిన తక్కినవి జనింపవనుట యుక్తముకాదు. కాబట్టి భావపదార్థమున్నియు నిమిత్తము లేకయే జనించుచున్నవి.
ఉత్తరపక్షము : ` (ఛముతో)
‘‘అనిమిత్తా నిమిత్తత్త్వాన్నా నిమిత్తత ః’’ 4.1.23.
అనిమిత్త నిమిత్తత్వాత్R అనిమిత్తమే నమిత్తమగుటవన అని మిత్తత ఃR నిమిత్తము లేక, న R భావోత్పత్తి కుగదు.
అనిమిత్తమువన భూవోత్పత్తి కుగునని చెప్పుచు ననమిత్తమును కారణముగా నంగీకరించుచున్నావుకదా! అట్టి యెడ భావోత్పత్తి నిర్నిమిత్తమనుటెట్లు పొసగును?
ఉత్తరపక్షము : ` (వాస్తవము)
‘‘నిమిత్తా నిమిత్తయో రర్థాంతర భావాదప్రషేధః’’ 4.1.74.
నిమిత్తానిమిత్తయోఃR నిమిత్తము, అనిమిత్తముననువిని, అర్థాంతరభావాత్ R భిన్నార్థము గుటవన, అప్రతిషేధఃR భావోత్పత్తి నిర్నిమిత్తమనుట యుక్తముకాదు.
ప్రత్యక్ష ప్రమాణముచే సిద్ధించుదానిని స్వీకరింపకుండుట శక్యముకాదు. ప్రతి భావకార్యమునకును నిమిత్తములేవో, యనిమిత్తములేవో రెండును తెలియనగును. ప్రత్యక్షముగా నివి తెలియకున్న ననుమానముచే నైనను తెలియనగును. ప్రతికార్యమును కారణజన్యమగుటచే కొండొక కార్యమనిమిత్తక మనుటతగదు. స్వభావముచేతనే కార్యము సిద్ధమగుచుండ కారణము నంగీకరింపనే? యనుట యుక్తముకాదు. స్వభావమనేమి? దాని కావ్రయమేది? స్వభావమున కొక యాశ్రయముండవయునుగదాఔ ఆ యావ్రయమే నిమిత్తమగును. కాబట్టి భావోత్పత్తి నిర్నిమిత్తమనుట యుక్తముకాదు. ప్రకృతినామమున వర్త్లిుననాది భావపదార్థము నుండి పురుషకర్మ ననుసరించి యీవ్వరుని ద్వారా భావోత్పత్తి కుగుననియే యంగీకరింపవయునని భావము.
(సర్వ మనిత్యమను వాదము)
‘‘ సర్వమనిత్యముత్పత్తి వినాశధర్మకత్వాత్ ’’’ 4.1.25.
ఉత్పత్తి వినాశధర్మకత్వాత్ R ఉత్పత్తి వినాశధర్మము కదగుట వన, సర్వమ్ R భావజాతమంతయు, అనిత్యం R అనిత్యము.
ఉత్పత్తి వినాశము కది యనిత్యము. భావ పదార్థము న్నియునుత్పత్తి వినాశవంతములే. కాబట్టి సర్వభావము ఘటాదువలె ననిత్యములేయని సూత్రార్థము.
ఉత్తరపక్షము :`
‘‘నానిత్యతానిత్యత్వాత్ ’’ 4.1.26.
అనిత్యతా నిత్యత్వాత్ R సర్వగతమగు ననిత్యత నిత్యమగుటవన, న R సర్వమనిత్యముకాదు.
సర్వము ననిత్యమందువేని, సర్వమునందొక యనిత్యత్వ మను దర్మ మంగీకరింప వయును కదా! ఆ యనిత్యత్వము నిత్యమా? లేక యనిత్యమా? చెప్పవసి యుండును. అనిత్యమందువేని, యానిత్యముకాని యనిత్యత కావ్రయము నిత్య మనవసివచ్చును. అందువన సర్వ మనిత్యమనుట తగదు. నిత్యమందువేని సర్వమ నిత్యమను ప్రతిజ్ఞకు భంగము వాట్లిును. కాబట్టి సర్వ మనిత్యమనుట యుక్తి విరుద్ధము.
పూర్వపక్షము : `
‘‘దతనిత్యత్వమ్ అగ్నేర్దాహ్యం వినాశ్యానువినాశివత్ ’’ 4.1.27.
అగ్నేఃR అగ్ని, దామ్యం R దమింపదగు కాష్ఠాదును, వినాశ్యR నశింపజేసి, అనువినాశివత్ R వెంటనే నశించునట్లు, తదనిత్యత్వమ్ R అనిత్యత్వము నిత్యముకాదఱు.
అగ్ని తన కావ్రయమగు దామ్యమును నశింపజేసి యనంతరము తాను నెట్లునశించునో యట్లే యనిత్యత్వమును తన కాశ్రయమగు సర్వమును నశింపజేసి తదుపరి తానును నశించును. కాబట్టి యనిత్యత యనిత్యమే యగును. అందువన ననిత్యత కావ్రయమగు సర్వము నిత్యమగుననజనదు. అది పూర్వమే నశించును. కాబట్టి సర్వము అనిత్యమే.
ఉత్తరపక్షము : `
‘‘నిత్యస్యాప్రత్యాఖ్యానం యథోపబ్ధి వ్యవస్థానాత్’’ 4.1.28.
యథోపబ్ధి వ్యవస్థానాత్ R ప్రమాణము నను సరించి వ్యవస్థిత మగుటవన, నిత్యస్య R నిత్యమగు భావపదార్థము, అప్రత్యాక్యానం R నిరాకరింప సంభవముకాదు.
ప్రమాణము ద్వారా యేది యుత్పత్తి వినావ ధర్మముకదిగా సిద్ధముకాదో యది నిత్యమగును ఏది యుత్పత్తి వినాశ ధర్మకమో యది యనిత్యము. ఇట్లు ప్రమాణము ద్వారా వ్యవస్థితమై యుండి దానిని నిరాకరింప నేరికి నిశక్యము కాదు. ప్రకృతి పురుషేశ్వరు ుత్పత్తివినాశ ధర్మకము ని ప్రమాణము ద్వారా సిద్ధింపనందున నవి యనిత్యముననొప్పదు. కాబట్టి సర్వమనిత్య మనుట ప్రమాణ సిద్ధముకాదు.
(సర్వనిత్యత్వవాదము)
‘‘సర్వంనిత్యం పంచభూత నిత్యత్వాత్ ’’ 4.1.29.
పంచభూత నిత్యత్వాత్ R పంచభూతము నిత్యముగుటవన, సర్వం R ఘటపటాది సర్వవస్తు జాతము, నిత్యం R నిత్యము
దృశ్యమాన వస్తుజాత మతయు పాంచభౌతికము. భూతము నిత్యముగుటవన సర్వము నిత్యమని భావము
‘‘నోత్పత్తి వినాశ కారణోపబ్ధే ః’’ 4.1.30.
ఉత్పత్తి వినాశకరాణోపబ్ధేః R ఉత్పత్తి వినాశకారణముపబ్ధము గుటవన, న R సర్వము నిత్యముకాదు.
వినాశోత్పత్తుకు కారణము భించు వస్తువు నిత్యమొన్నడును కానేరదు. నిత్యమన వినాశోత్పత్తు లేనిదనికదా యర్థము ! గటపటాదు యుత్పత్తి వినాశకారణము ప్రమాణగమ్యము గుటవన సర్వనిత్యవాద మయుక్తము.
పూర్వపక్షము : `
‘‘త్లక్షణావరోధా దప్రతిషేధః ’’ 4.1.31.
త్లక్షణావరోధాత్ R ఘటపటాది సర్వవస్తు వ్రాతము భూత క్షణముచే నవరుద్ధ మగుటవన, అప్రతిషేధ ఃR సర్వము నిత్యమే.
ఘటపటాదు భూతస్వభావము కవగుటచే భూత క్షణముచే నవియు నవరుద్ధము (క్షతము) గుచున్నవి. భూతము నిత్యము గుటవన తత్స్వభావము కలిగి, త్లక్షణ క్షితముయిన సర్వవస్తువును నిత్యము కాకుండు టెట్లు పొసగును? కాబట్టి నిత్యములే.
ఉత్తరపక్షము : `
‘నోత్పత్తి తత్కారణోపబ్ధేః ’’ 4. 1.32.
ఉత్పత్తి తాత్కారణోపబ్ధేఃR ఉత్పత్తి వినాశముకు కారణము ప్రత్యక్షముగా నుపబ్ధము గుటవన, న R నిత్యమనుట తగదు.
ఉత్పత్తి వినాశము, వాని కారణము దేనికి ప్రత్యక్షముగా నుపబ్ధము గుటవన, న R నిత్యమనుట తగదు.
ఉత్పత్తి వినాశము, వాని కారణము దేనికి ప్రత్యక్షముగా భించునో యా వస్తువు నిత్యమెన్నడును కాదు. ఘట పటాదు కన్నిటికి నుత్పత్తి వినాశమును, తత్కారణమును ప్రత్యక్షము గుటచే నవి నిత్యమునుట ప్రమాణ విరుద్ధము. కాబట్టి సర్వనిత్యవాద మసంగతము.
పూర్వ సూత్రమున నుత్పత్తి వినాశ కారణోపబ్ధి హేతువుగా గ్రహింపబడినది. ఈ సూత్రమున నుత్పత్తి వినాశము యుపబ్ధియు, ఉత్పత్తి వినావకారణోపబ్దియు, హేతువుగా గ్రహింపబడుటచే పునరుక్తి దోషములేదు.
ఉత్పత్తి వినాశముయు, తత్కారణముయు నుప బ్ధి స్వప్పో పబ్ధివలె భ్రమయే కాదన,
‘‘ న వ్యవస్థానుపపత్తే ః’’ 4.1.33.
వ్యవస్థానుపపత్తేఃR ‘ఇది కారణము’ ‘ ఇది కార్యము’ నను లోక సిద్ధమగు వ్యవస్థ వ్యర్థమగును. కావున, న R భ్రమకాదు.
స్వప్నమున గోచరించు భావములో కార్యకారణ వ్యవస్థయొండు కానరాదు. క్రమరహితముగా ననేకభావముందు యుగపద్గోచరము గుచుండును. కాని లోకమున ‘నిది కారణము. ఇది కార్యము’ నను వ్యవస్థ ప్రత్యక్షపూర్వకమై యుపపన్నమగుచుండ స్వప్పోపబ్ధివలె భ్రమయనుట పొసగదు. కాబట్టి సర్వనిత్యవాదము ప్రమాణ సంగతముకాదు.
(అవయవ వాదము)
‘‘ సర్వంపృథగ్ భావక్షణ పృథక్త్వాత్.’’ 4.1.34.
భావక్షణ పృథక్త్వాత్ R (క్ష్యంతే భావాః ఏభిః ఇతిభావ క్షణాని అవయవా ః ఇతియావత్) భావక్షణము న నిట నవయవము. వానినానాత్వము వన, సర్వమ్ R ఘటపటాది వస్తుజాతమంతయు, పృథక్ R భిన్నము.
‘రూపాదుకంటె వేరుగా ద్రవ్యమనునది యొకటి లేదు. అవయవముకు మించి యవయవియను భావమెండులేదు ’ అని పృథగ్వాదు మతము. అందువన రూపాది క్షణావయవము లొక్కటిగాక యనేకము. వాని సముదాయములే ఘటపటాది భావము. కాబట్టి యవియు ననేకములే యగుననని భావము.
(తన్మత నిరాకరణము)
‘‘నానేకక్షణై రేక భావ నిష్పత్తేః’’ 4.1.35.
అనేక క్షణైఃR అనేకావయవముచే, ఏకభావ నిష్పత్తే ఃR అవయవి యను నొక భావోత్పత్తి కుగుటవన, న R సర్వము (అనేకము) కాదు.
ఆవుదాని యవయవముకంటె భిన్నముకానిపక్షమున నావుచే చేయబడు కార్యము తదవయవముచే సంపాదింపబడవ యును. ఇట్లే ఘటాదుచే నగు జలానయనాదికార్యము తదవ యవముచే సంపన్నము కావయును. అట్లేన్నడును కాజాదు. కాబట్టి యవయవము వన నుత్పన్నమగు నవయవి యొకటి వేరుగానుండును. అది యొక్కటే కాని యనేకము కాదని భావము.
విలోన కార్యమును సంపాదించినంత మాత్రమున నవయవ ముకంటె నవయవి భిన్నమన నక్కఱలేదు, అవయవముకంటె నవయవ సముదాయము విక్షణ కార్యసంపాదకము కావచ్చునన,
‘‘క్షణ వ్వవస్థానాదేవా ప్రతిషేధ ః ’’ 4 . 1. 36.
క్షణ వ్యవస్థానాత్ R ప్రతిభావమునకు నవయవము వేరు వేరుగా వ్యవస్థితముయి యుండుట వన, అప్రతిషేధఃR అవయవి నిరాకరణము సంగతముకాదు.
‘ ఇవి ఘటమున కవయవము’ ‘ఇవి గోవున కవయవము’ ‘ఇవి వస్త్రమునకు’ నని భిన్నభిన్నముగా నవయవము లొక్కొక్క వస్తువునకు వ్యవస్థితములై గ్రహింపబడుట వన, అవయవముకంటె భిన్నముగా నవయవియొకటి యున్నట్లంగీకరింపక తప్పదు. కాబట్టి ప్రతివస్తువు భిన్నమనుట తగదు.
(అభావవాదము)
‘‘సర్వమభావో భావేష్విత రేతరాభావసిద్ధేః’’ 4.1.37.
భావేషు R భావపదార్థముందు, ఇతరేతరాభావసిద్ధేఃR ఆన్యో న్యాభావము సిద్ధించుటవన, సర్వమ్ R సమస్తవస్తుజాతము, అభావఃR అభావమే.
మట్టింకుడ, బంగారు కుండము. అనుతావులో మట్టికి కుండకు, బంగారమునకు కుండమునకు తాదాత్మ్యము కదు. అందువననే వానిలో సామానాథికరణ్యమునున్నది. కాబట్టి సామానాధికరణ్యమున్న తాదాత్మ్యమున్న ట్లంగీకరింపవలెను. ప్రతి భావపదార్థమునకు నభావముతో సామానాధి కరణ్యము లోకమున చూడబడుచున్నది. ఉదా: ` అఘటము పటము. ఘట మపటు, గో వవనశ్వము, అశ్వమగోవు. దీనింబట్టి ఘటాభావము. (అఘటము), పటము సమానాధి కరణము. అశ్వాభావము (అనశ్మము) గోవు సమానాధి కరణము, కాబట్టి ఘటాభావమునకు పటమునకు తాదాత్మ్యమున్న దనవయును. ఇట్లే అశ్వాభావమునకు గోవునకు తాదాత్మ్యమంగీకరింప వయును. అందువన గోఘటము అభావమునుట సిద్ధము. ప్రతీతి ననుసరించి లోకమున భావ వ్యవస్థ యేర్పడును. కాబట్టి పై ప్రతీతు ననుసరించి ప్రతిభావపదార్థమును అభావ తాదాత్మ్యమై యభావమన నొప్పునని భావము.
(తన్మతనిరాకరణము)
‘‘న స్వభావ సిద్ధేర్భావానామ్’’ 4. 1. 38.
భావానామ్ R గోఘటాది భావము, స్వభావ సిద్ధే ః R స్వబావముగానే సిద్ధించుట వన, న R సర్వ మభావము కాదు.
గోఘటాదు స్వభావముగానే సిద్ధించుచున్నవి.. గోవు గోత్వముతో సిద్ధింపకున్న దాని యభావమెట్లు సిద్ధించును? గోవు అభావాత్మక మగునెడ నది స్వభావమైన గోత్వముతో నెన్నడును సిద్ధింపనేరదు. అభావము గోత్వాది ధర్మము కాశ్రయము కాజాదు. గోవు అనవ్వము: ఘటము అపటము : అనునిట్టి ప్రతీతివన గోఘటము భావాత్మకము ని సిద్ధింపవు. ఇట్టి ప్రయోగముందలి సామానాధికరణ్యము వన గోవు అవ్వముకంటె భిన్నమనియు, ఘటము పటము కంటె వేరనియు బోధ కుగునని యంగీకరింప వయును. కాని యవి యభావాత్మకము నవసిన యవసరము లేదు. పై ప్రయోగము వన అవ్వమున గోత్వముకాని, పటమున ఘటత్వముగాని లేదని తెలియునుకాని, అభావమెట్లుబోధ పడగదు? గోవునందు గోత్వము, ఘటమున ఘటత్వము నుండి ననియే బోధయగును. కాబట్టి సర్వమభావముకాదు.
పూర్వపక్షము : `
‘‘ న స్వభావ సిద్ధిరాపేక్షికత్వాత్’’ 4.1.39.
ఆపేక్షికత్వాత్ R పరాపేక్షసిద్ధిగ వగుటవన, స్వభావసిద్ధిఃR స్వభావముద్వారా సిద్ధికవి, న R కావు.
గోఘటాది భావపదార్థము న్నియు భిన్నస్వభావము కవి. లోకమున భిన్న స్వభావము కవివరము నపేక్షింపక సిద్ధింపవు. దీర్ఘము నపేక్షింపని హ్రస్వముకానీ, హ్రస్వము నపేక్షింపని దీర్ఘము కానీ, పుత్రుడు లేక తర్రడిగానీ సిద్ధింపనేరరు. కాబట్టి భావపదార్థము స్వభావ సిద్ధమునుట ఒక విరుద్ధము. ఇట్లు భావమున్నియు పరాపేక్షలేక సిద్ధింపనందున గోఘటాదు నశ్వాదు నపేక్షింపక సిద్ధింపవు. సాపేక్ష సిద్ధి వాస్తవము కాదు. అందువన సర్యమవాస్తవమే.
ఉత్తరపక్షము : `
‘‘వ్యాహతత్వాదయుక్తమ్.’’ 4.1.10.
వాహతత్యాత్ R అన్యోన్యావ్రయముతో వ్యాహతమగుట వన, ఆయుక్తమ్ R భావము లాపేక్షికము నుట యుక్తము కాదు.
అశ్వాదిభావము గోఘటాదు నపేక్షించిన గోఘటాది భావము శ్వాదిభావాపేక్షికము కావు. స్ఫటికలోహితము (ఎఱుపు) కుసుమ లోహితము నపేక్షించునుకాని, కుసుమలోహితము స్ఫటికలోహితము నపేక్షింపదు. అట్లుకాక అశ్వాదిభావము గోఘటాది భావమును, గోఘటాదు శ్వాదిభావము నపేక్షించు నందువేని అన్యోన్యావ్రయ దోష మేర్పడును అన్యోన్యాశ్రయమున నొకభావమును సిద్ధింపనేరదు. హ్రస్వదీర్థాదు నుపమించి దోషములేదన వనుపడదు. హ్రస్య దీర్ఘాదును గ్రహణ సమయమున పరస్పర మపేక్షించినను స్వోత్పత్తి విహయమున నొండొంటి నపేక్షింపవు. ఇట్లే పితాపుత్రాదు జన్య జనక భావమును బోధించుటలో పరస్పరాపేక్షయున్నను స్వోత్పత్తి కన్వోన్యాపేక్ష యుండదు. కాబట్టి భావము స్వసిద్ధియందు పరాపేక్షికము నుట యుక్తముకాదు. అందువన సర్వనుభావ మనుట చ్లెదు.
‘సర్వము నేక కారణకమగుటచేనెకము. అందువన సర్వత్ర ఏకత్వ సంఖ్యా నియమముండవయును’ అనుట సంఖ్యైకాంతవాదము అనబడును. దాని నిరాకరణము.
‘‘సంఖ్యైకాంతాసిద్ధి ః కారణానుపపత్త్యుపపత్తిభ్యామ్ ’’ 5.1.41.
కారణానుపపత్త్యుప పత్తిభ్యామ్ R నిఔ సహాయమగు నేకాకి కారణముపపన్నము కాపోవుట వనను, ససహాయ కారణ ముపపన్న మగుట వనను, సంఖ్యైకాంతాసిద్ధి ఃR సంఖ్యైకాంత వాదము సద్ధింపదు.
ఒకే తత్వము కారణమగుటవన నీసర్వమునేకమే యనిన ప్రశ్నింపవయును. నిఃసహాయమా? లేక ససహాయమా? యని ప్రశ్నింపవయును నిఃసహాయమనిన, నానావిధ జగత్తున కది కారణమనుట యుక్తముకాదు. ససహాయ మనినదానికి సహాయమగునది పదార్థమా? అపదార్థమా? యని యడుగవలెను. అపదార్థమనుట తగదు. అపదార్థమయిన నది స్వయముగా లేనిదై యితరమునకు సహాయమెట్లు చేయగదు? పదార్థమే యనిన, ద్వితీయ పదార్థ మంగీకరించినట్లగును, అందువన సంఖ్యైకాంతవాదము సిద్ధింపనేరదు.
పూర్వపక్షము : `
‘‘న కారణావయవ భావాత్ ’’ 4.1.4.2.
కారణావయవ భావాత్ R ఒకే తత్వము కారణమైనను దాని కవయము ుండుటవన, నR సంఖ్యైకాంతవాదము సిద్ధింపదనుట తగదు
నానావిధమగు నీజగత్తునకు కారణము ససహాయము కాదు. సిఃసహాయమే. నిఃసహాయమగు నేకకారణము నానా విధ కార్యజాతమునెట్లు పుట్టింపగదని ప్రశ్నింతురేని, నా కారణమున ననేక కార్యోత్పాదక సామర్ధ్యముగ యనేకావయవమున్నవని యంగీకరింతుము. కాబట్టి దోషములేదు.
ఉత్తరపక్షము: `
‘‘నిరవయవత్వా దహేతు ః ’’ 4.1.43.
నిరవయవత్వాత్ ః సర్వమునకు కారణమైన యేకతత్వము నిరవయవ మగుట వన, అహేతుఃR కారణమున నవయవము ుండుట వన, నను హేతువు అహేతువు.
అవయవము కది సావయవ మనబడును. సావయవము కార్యమగును. కారణమగుకాదు. సర్వమునకు కారణమగు నేకతత్వము సావయవమయిన నది కార్యమగును కాని కారణముకాదు. సర్వమునకు కారణము నిరవయవమే యని యంగీకరింపబడినది. అట్టిది నిఃసహాయమగుచో ననేకవిధ కార్యజాతమునుత్పన్నము చేయనేరదు. ససహాయ మనిననేకకారణము కాకపోవుటచే సర్వమే మను సంఖ్యైకాంత వాదము సిద్ధింపనేరదు.
ప్రత్యేభావమును పరీక్షించి తరువాత ఫమును పరీక్షింపదచి ముందు సంవయించుచున్నాడు.
‘‘సద్యఃకాలాంతరేచ ఫనిష్పసత్తే ః సంవయః’’ 4.1.44
సద్యఃR వెంటనే. కాలాంతరేచ R కాలాంతరమునను, ఫనిష్పత్తేఃR ఫప్రాప్తి దర్శనము వన, సంశయఃR అట్ని హోత్రాది కర్ము సద్యః ఫములా? లేక కాలాంతర ఫములాయని సంవయము కుగుచున్నది.
పాకమునకు ఫము తండుపచనము. అది సద్యః ఫము. కృష్యాదికర్మముకు ఫము సస్యనిష్పత్తి కాలాంతరమున సిద్ధించును. అందువన అగ్ని హోత్రాది విహికర్ము, సురాపానాది నిషిద్ధకర్మఉును సద్యఃఫములా? లేక కాలాంతర ఫములా? యని సంశయము వొడమును.
కర్మనిష్పత్త్యనంతరమున నవ్యవహితకాము సద్యః కాము. కర్మనాశానంతరకాము కాలాంతరము. కర్మనాశౌనంతరమున నెన్నడో ఫనిష్పత్తి కలిగిన నదృష్టము దానికి ద్వారా మగునని వివేకము.
సద్యః ఫనిష్పత్తి పూర్వపక్షముకాగా సమాధానము.
‘‘న సద్యః కాలాంతరోప భక్షగ్యత్వాత్ ’’ 4. 1. 45.
కాలాంతరోపభోగ్యత్వాత్ R కాలాంతరమున నుపభోగ్యము గుటవన, విహిత ప్రతిషిద్ధ కర్మకు, నసద్యఃR సద్యఃఫ నిష్పత్తి కుగదు.
అగ్ని హోత్రాది కర్ము విహితము. సురాపానాదు నిషిద్ధము. విహితముకు ఫము స్వర్గము. నిషిద్ధముకు ఫము నరకము. స్వర్గనరకము సుఖదుఁఖ విశేషములే. అవివెంటనే కుగనేరవు. కొండొక ఫవిశేసము సిద్ధింపవయునన్న దేశకా విశేషము పేక్షింపబడును. కాబట్టి అగ్ని హోత్ర సురాపానాదు వన కుగు ఫము కాలాంతరముననే కుగునని భావము.
పూర్వపక్షము : `
‘‘కాలాంతరేనా నిష్పత్తిః హేతువినాశాత్ ’’ 4.1.46.
హేతు వినాశాత్ R హేతువు నశించుటవన, కాలాంతరేణ R కాలాంతరమున, అనిష్పత్తిఃR ఫనిష్పత్తికాదు.
కారణముండిన కార్యముత్పన్న మగును. కారణము నశించిన కార్యముజనింపదు. ఫమునకు కారణము కర్మము. అది కాలాంతరమున నుండదు. నశించును. కారణాత్మక కర్మము నశించిన ఫ ముదయింప నేరదు. కాబట్టి కాలాంతరమున ఫనిష్పత్తి యనుట యుక్తము కాదు.
ఉత్తరపక్షము : `
‘‘ప్రాఙ్ నిష్పత్తేర్వృక్షఫవత్ తత్ స్యాత్’’ 4.1.47.
వృక్షఫవత్ R వృక్షఫమువలె, ప్రాఙ్ నిష్పత్తే R ఫలోత్పత్తికి పూర్వమే కర్మనశించినను, తత్‌స్యాత్ R స్వర్గాదిపద వాచ్యఫ ముద్భవించును.
ఒకడు ఫము నపేక్షించి వృక్షమునకు సేచనాది కర్మ నాచరించును. ఆకర్ము నశించిన తదుపరి కాలాంతరమున నతనికి వృక్షమునుండి ఫము భించును. సేచనాదికర్మ నశించినను దానివన రసద్రవ్యముత్పన్నమై యది ఫరూపమున కాలాంతర మున నుత్పన్న మగుచున్నది. అట్లే అగ్ని హోత్రాది కర్ము నశించినను వానివన దర్మాదర్మక్షణము గ యదృష్ట ముత్పన్నమై కాలాంతరమున స్వర్గాత్మక ఫము నిష్పన్న మొనర్చును. ఈయదృష్టమునే మీమాంసకుగు ‘అపూర్వము’ అందురు. అట్లయిన నదృష్టముచే ఫము నిష్పన్నమగును కాన కర్మవన కాదని యనరాదు. కర్మకు ఫమునకు మధ్య అదృష్టము వ్యాపార మనబడును. కర్మ వ్యాపారి యగును. వ్యాపార నిష్పన్నము వ్యాపారి నిష్పన్నము కాకపోదు అట్లంగీకరింపమేని, అనుమాన ప్రమాణము నందు, లింగ దర్శనానంతరము వ్యాప్తి స్మరణకలిగినగాని యనుమితి కుగదు. అట్టియెడ అనుమితి వ్యాప్తిస్మరణజన్య మగుటచే హేతుజన్యము కాదందుమేనియది లైంగికజ్ఞాన మననొప్పదు. కాబట్టి కర్మవన నదృష్టము ద్వారా కాలాంతరమున ఫనిష్పత్తి కలిగినను దోషము లేదు.
కర్మవన జనించు నీ ఫము నిష్పత్తికి పూర్వమున్నదా? లేదా? యని జిజ్ఞాసకుగగా పూర్వపక్షము : `
‘‘నాసన్నస న్నసదసత్ సదసతోర్వైధర్మ్యాత్ ’’ 4.1.48.
(ఈ సూత్రమున ‘ఉపాదాన నియమాత్, ఉత్పత్త్యసంభవాత్’ అను రెండు హేతువు కల్పింవయును.)
ఉపాదాన నియమాత్ R కొండొక కార్యముద్భవింపవయుననిన కొండొకకారణ విశేషము నుపాదానముగా గ్రహింపవసిన నియమముండుటవన, నుత్పన్నమగుటచు పూర్వము ఫము, అసత్‌న R అసత్తుకాదు. ఉత్పత్త్య సంభవాత్ R ఉన్నది యుత్పన్నము కానేరదు కాబట్టి, సత్ R ఉత్పత్తికి పూర్వము సత్తు, న R కాదు, సదసత్ న R ఉత్పత్తికి పూర్వము సదసత్తును కాదు. సదసతోర్వైధర్మ్యాత్ R సత్తు అసత్తు నను రెండును విరుద్ధముగుటవన.
ఘట ముత్పన్నమగుటకు పూర్వము మృత్తికలో నది లేకున్న దాని నుత్పన్న మొనర్చుటకు మృత్తికనే యే గ్రహింపవలెను? ఘటము మృత్తికలో లేనట్లు తంతువులో నుండదు. బంగారములో నుండదు. ఇట్లే యితరముందు నుండదు. అట్టియెడ ఘటోత్పత్తికి నుపాదాన కారణముగా మృత్తికనే యే గ్రహింపవసి యుండును? తంతువు నేగ్రహింపరాదు? మృత్తిక తప్ప తదితరుము ఉపాదానముగా గ్రహింపకుండు నియమమెందుకు? నియమ ఉపాదానముగా గ్రహింపకుండు నియమమెందుకు? నియమ ముండుటచే ఘటోత్పత్తికి పూర్వము ఘటము లేదు అన మీకాదు.
ఉత్పత్తికి పూర్వము కార్యము (సత్) ఉన్నదందుమా! అదియునొప్పదు. సత్తాసంబంధమునే యుత్పత్తి యుందుము. కాబట్టి యుత్పత్తికి పూర్వమే సత్తనిస‘సత్తు’ మర సత్తుఎట్లు కాగదు? ఉత్పత్తికి పూర్వమేయుత్పన్నమైయున్న పునరుత్పత్తి యెట్లు సంభవమగును? కాదని భావము. కాబట్టి యుత్పత్తికి పూర్వము కార్యము ‘సత్తు’ అనరాదు.
సదసత్తనియు ననమీపడదు. సదసత్తు రెండును పరస్సర విరుద్ధము గుటచే నవి యొక్కమారుగ సంభవింపవు. కాబట్టి యుత్పత్తికి పూర్వము కార్యము ‘సదసత్’ అనియు నన మీపడదని భావము
ఉత్తరపక్షము : `
‘‘ ఉత్పాదవ్యయ దర్శనాత్ ’’ 4.1.49.
ఉత్పాదవ్యయ దర్శనాత్ R ఉత్పత్తికి పూర్వము కార్యోత్పత్తి వినాశము చూడబడుట వన, కార్యము ‘సదసత్’ అనియే యంగీత రింపవయును.
ఉత్పత్తికి పూర్వము కార్యమసత్తయిన నది యెన్నడు నుత్పన్నము కానేరదు. కుందేటికొమ్ము ఎన్నడైన జనింపగదా? కాబట్టి ‘సత్’ విద్యమాన మందుమేని యది నశింపనేరదు. కార్యముత్పన్నమైన శించుట జూచుచున్నాము. అందువన కార్యముత్పత్తికి పూర్వమసత్తు కాదుÑ సత్తుకాదు. కాని సదసత్తనియే యంగీకరింపవయును.
సదసత్లుఉ ఒకే మాటెట్లు సంభవింప గవన,
‘‘బుద్ధిసిద్దంతు తదసత్’’ 4.1.50.
తదసత్ R సదసత్తులో నొకటగునసత్తు, బుద్దిసిద్ధంతు R బుద్ధి సిద్ధమే ` బుద్ధిసహమే.
కార్యముత్పత్తికి పూర్వమే రూపమున సత్తనుచున్నామో యదే రూపమున నసత్తనిన పరస్పర విరుద్ధము గుటచే సదసత్తు లొకక్షణమున సంభవింప వనుట యుక్తమే. కాని మేమట్లు చెప్పము. కార్య ముత్పత్తికి పూర్వమొక రూపమున సత్తు, మరియొక రేపమున నసత్తు నగుటలో నెట్టి దోషము నుండదు. బుద్ధిచే నంగీకరింప వచ్చును. ఉత్పత్తికి పూర్వము కార్యము కారణరూపమున సత్తనియు, కార్యరూపమున నసత్తనియు నంగీకరించిన బుద్ధివిరోద ముండనేరదుకదా ! కాబట్టి యుత్పత్తికి పూర్వము కార్యము ‘సదసత్’ రూపమున నుండు నని సహభావము సంభవమే.
పూర్వపక్షము : `
‘‘ఆవ్రయవ్యతి రేకాద్ వృక్ష ఫవ దిత్యహేతుః’’ 4.1.51.
ఆవ్రయవ్యతిరేకాత్ R కర్మావ్రయమైన శరీరము ఫపర్యంతము వృక్షమువలె నియమముగా నుండకపోవుటం జేసి, వృక్షఫవదిత్య హేతుఃR వృక్షఫమువలెనను దృష్టాంతము సరికాదు.
జసేచనాది కర్మ కావ్రయమైన వృక్షము ఫలోద్గమ పర్యంత ముండునట్లు అగ్నిహోత్రాది కర్మ కావ్రయమైన శరీరము స్వర్గాది సుఖవిశేష ప్రాప్తి పర్యంత ముండునను నియమములేదు. శరీరము నశ్వరము. నేడున్న శరీరము రేపుండునని యెవరెఱుగుదురు. ఆవ్రయము నశించిన ఫమెట్లు సంభవింపనగును? కాబట్టి వృక్షఫమువలెనను దృష్టాంతము యుక్తముకాదు.
ఉత్తరపక్షము : `
‘‘ప్రితేరాత్మాశ్రయత్వా దప్రతిషేధః’’ 4.1.52.
ప్రీతే R సుఖదుఃఖాత్మకమగుఫమునకు, ఆత్మావ్రయత్వాత్ R ఆత్మ యాశ్రయమగుట వన, ఆప్రతిషేధఃR దృష్టాంతము ఆయుక్తము కాదు.
విహిత కర్ముగాని నిషిద్ధకర్ముగాని యనుష్టించుట వన కుగు నుదృష్టము ఆత్మయందు జనించును ఆ యదృష్టజన్యమగు ఫమును ఆత్మనే యావ్రయించును. ఆత్మ నిత్యమగుటవన నది ఫపర్యంత ముండును. కాగా, వృఓ దృష్టాంతమవిరుద్ధమే.
పూర్వపక్షము : `
‘‘న పుత్ర పశు స్త్రీ పరిచ్ఛద హిరణ్యాన్నాది
ఫనిర్దేశాత్ ’’ 4.1.53.
పుత్ర..... ఫనిర్దేశాత్ R పుత్ర ` పశు ` స్త్రీ ` వస్త్ర ` హిరణ్య` అన్నాదు ఫముగా నిర్దేశింపబడుట వన, న R సుఖ దుఃఖము ఫముకాదు.
పుత్ర పశ్వాదు కర్మ ఫముగా నిర్దేశింపబడుచుండుటవన సుఖ దుఃఖాత్మకము ఫముగా జెప్పి యది యాత్మాశ్రయమగుటవన దృష్టాంతమున దోసము లేదనని పొసగదు.
ఉత్తరపక్షము : `
‘తత్సంబంధాత్ ఫ నిష్పత్తేస్తేషు ఫవదుపచారః’’ 4.1.54.
తేషు R పుత్రాదు, ఫవదుపచారఃR ఫముగా నిర్దేశించుట యౌపచారికము ` గౌణము. కారణమేమన? తత్సంబంధాత్ R పుత్రాదు సంబంధమున, ఫనిష్పత్తి ఃR ఫలోత్పత్తికుగుచున్నది.
అన్నము ప్రాణము, ఆయువు ఘృతము, నాగలి జీవనము. అనుతావుందు అన్నాదు ప్రాణాదుకు సాధనము యినను ప్రాణాదు గానే ప్రయోగించుటకు కారణము వానికిగ సాధ్యసాదన భావసంబంధమే. అట్లే సుఖదుఃఖాత్మకమగు ఫము పుత్రాది సాదన సాద్యము. సాదనమును సాధ్యమగు ఫరూపమున నటనట ప్రయోగించు గౌణప్రయోగమని తెలియవయును. కాబట్టి దోషములేదు.
(దుఃఖపరీక్షము)
‘‘వివిద బాధనాయోగాత్ దుఃఖ మేవ జన్మోత్పత్తి’’ 4.1.55.
వివిద బాధనా యోగాత్ R నానావిధ దుఃఖమేవ R దుఃఖమే.
జన్మకుగుట వన ననేక దుఃఖము వాట్లిుచున్నవి. జన్మయేలేకున్న నిష్టవియోగము, ననిష్టసంప్రాప్తియునను దుఃఖవ్రాతము సంభవింప నేరదు. కాబట్టి నానా బాధకు సాధనమైన యీ జన్మ దుఃఖమేయనుట యుక్తము.
పూర్వపక్షము :`
‘‘వివిద బాధనానువృత్తే ర్వేదయతః పర్యేషణ దోషా
దప్రతిషేధః’’ 4.1.57.
వేయదతఃR దుఃఖ మధ్యమున సుఖము ననుభవవించు వానికి, పర్యేషణ దోషాత్ R తృష్ణా దోషమువన, వివిధ బాధనానువృత్తేఃR నానా విద దుఃఖము పునః పునః సంభవించుట వన, అప్రతిషేధః జన్మము దుఃఖమే యనుటను ప్రతిషేదింప వనుపడదు.
ప్రాణి కొండొంకవేళ సుఖము ననుభవించుచున్నను, తృష్టావశమున ననేక దుఃఖముకు మాటిమాటికి లోనగు చున్నాడు. ప్రతిక్షణము సుఖమనుభవింప వయుననికోరియు సుఖమును పొందజాడు. సుఖ మొకప్పుడు సంప్రాప్తించినను మిక్కిలి కష్టసాద్యము, నతిస్వ్పము నగును. భించియు వియగమగును. తృష్ట ప్రతిక్షణము వర్థ్లిును. అందుపై రాగ ద్వేష మోహాదు ద్వారా అనేక దుఃఖము ుప్పత్లిును. మద్యలో నొంకింత సుకము కల్గినను విషాక్తదుగ్ధమువోలి, దుఃఖ భష్ట్రయిష్ఠతచే నావరింపడి హేయమై తోచును. అందువన నదియు దుఃఖముననే చేర్పబడును. కాబట్టి దుఃఖమే జన్మమనుట ప్రతిషేధార్హము కానేరదు.
‘‘దుఃఖవికల్పే సుఖాభిమానాచ్చ.’’ 4.1.58.
దుఃఖ వికల్పే R దుఃఖాభావమున, సుఖాభిమానాచ్చ R సుఃఖము నారోపించుటవనను.
మఱియు దుఃఖము మధ్య సుకము కుగుచున్న దనుట వాస్తవముకాదు. దుఃఖము కుగకుండుటను సుఖమని చెప్పుచున్నారు. దుఃఖ రూపాంతరమును గ్రహింపక యవివేకు సుఖముగా నుడువుదురు. కాముకు ప్రణయ కహముచే కుపితగు కురంగలోచన శిరః పాదతాడనమును సుఖ విశేషసాధనముగా నెంచు లోకవిదితము కాదా వాస్తవమున పాద తాడనము సుఖ సంపాదకమెట్లు కాగదు? అయినను మూఢబుద్ధు ` కాముకు దానసుఖము ననుభవింతురు. వివేకు వివిధ బాధనతో ననుషక్తమై యుండుటచే జన్మము దుఃఖమేయని భావింతురు. కాబట్టి జన్మము దుఃఖమే యనుట యుక్తమే.
పూర్వపక్షము : ` (అపవర్గ పరీక్షణము)
(‘‘ ఋణక్లేశ ప్రవృత్త్యను బంధా దపవర్తాభావః’’ 4. 1.5.9.
ఋణక్లేశ ప్రవృత్త్యనుబంధాత్ R ఋణముతోను, క్లేశముతోను, ప్రవృత్తితోను సంబంధముండుటవన, అపవర్గాభావః R ఆత్మకు మోక్షములేదు.
(ఋణంగ్‌హవై జాయతేయో-స్తి, సజాయమానేవ దేవేభ్య ఋషిభ్యః పితృభ్యోమనుష్యేభ్యః శత. 1.7.5.1.) అను నిట్టి వాక్యముద్వారా ఉత్పన్నవ్యక్తికి ఋణముండుట తెలియుచున్నది. ఇట్టి ఋణానుబంధ మున్నంత వరకు నాత్మకు అపవర్గ ముండజాదు.
తైత్తిరీయసంహితలో (జాయమానోవైబ్రాహ్మణ స్త్రిభిర్ ఋణవాజాయతేబ్రహ్మచర్యేణార్షి భ్యోయజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః ఏష వా అనృణో యఃపుత్రీయజ్వా బ్రహ్మచారీ’’ 6.3.10.) ‘మనుష్యుడు పుట్టుచు మూటిచే ఋణి యగుచున్నాడు. బ్రహ్మచర్యముచే ఋషి ఋణమును అగ్ని హోత్రాది యజ్ఞము నాచరించుటచే దేవృణమును సంతతిద్వారా పితృణమును తీర్చుకొనుచున్నాడని యున్నది.
‘‘ ఋణాని త్రీణ్యపాకృత్యమనో మోక్షేనివేశయేత్
అయపాకృత్యమోక్షంతు సేవమానో పతత్యధః’’
మూడు ఋణమును తీర్చి మోక్షసాధనమున మనస్సు నుంపవయును. ఆనృణ్యమును సంపాదింపక మోక్షమును సాధింప యత్నించి యధః పతితుడగునని మనుస్మృతి. ఇట్లు జీవితమున్నంత వరకు నానృణ్య సంపాదనకై యత్నించిన మోక్షసాధన మెన్నడు చేయగుగును? శాస్త్రమున నగ్ని హోత్రాదు (ఏతద్వై జరామర్యం సత్రం యదగ్ని హోత్రం జరవాహ్యేవాస్మాద్ ముచ్యం తేమృత్యునావా జరామరణ పర్యంత మాచరింప దగిన సత్రముగా వర్ణింపబడియున్నవి. ఇంతియగాక, అవిద్య అస్మితము, రాగము ద్వేషము అభినివేశము నను క్లేశము నుండియు విడివడ వయును. కాబట్టి క్లేశాదుచే సంబద్ధుడై మరణించినవాడు మరవానితో నేపుట్టుచుండును. అందువన క్లేశముండగా నాత్మకుమోక్ష ముండదు.
మఱియు, పుట్టినదాది మరణపర్యంత మొక్కక్షణమైన నూరకుండక యేదేని చేయుచుండును. ఇట్టి ప్రవృత్తి సంసారమునకు మూము. అందువనను మోక్షప్రాప్తి లేదు.
పూర్వపక్షము : `
‘‘ప్రధానశబ్దానుపపత్తే ర్గుణ శబ్దే నానువాదో
నిందాప్రశంసోపపత్తేః’’ . 4. 1.60.
నిందా ప్రశంసోపపత్తే ఃR వివక్షిత నిందాప్రశంస ుపపన్నము గుటవన, ప్రధానశబ్దానుపపత్తేఃR ఋణశబ్దమిట ప్రధానము కాకుండుట చేతను, గుణశబ్దేనానువాద ః గఃణార్థమున ప్రయోగింపబడినది.
ముఖ్యవృత్తితో స్వార్థమును ప్రయోగింపబడు శబ్దము ప్రధాన మనబడును. ఉదా : ` అగ్ని దాహకము. గోవు గంగడోుకది. ఇట అగ్ని గో శబ్దము స్వార్థమున ముఖ్య వృత్తితో ప్రయోగింపబడినవి. క్షణావృత్తితో ప్రయోగింపబడు శబ్దము గుణశబ్ద మనబడును. ఉదా: ` ‘ ఈ బాుడు నిప్పు’ ‘ ఈ మానవకుడు సింహము’. ఇట ‘నిప్పు’ ‘సింహము’ ననురెండు శబ్దము లోణావృత్తితో బాునియందు ప్రయోగింపబడి గుణశబ్దము నబడును. ఇట్లే ‘‘ఋణంహజాయతేయో-స్తి’’ అనువాక్యముందు ప్రయోగింపబడిన ఋణశబ్దము ప్రధాన శబ్దముకాదు. ఒకడు మర తాను తీసికొన దగినదని యెంచి యొక వస్తువు నన్యున కిచ్చును. అన్యుడును దానిని మర తనకిచ్చిన దాత కీయదగినదిగా దానిని గ్రహించును. ఇట్లు అప్పుగా నిచ్చి పుచ్చుకొను తావుందు ఋణశబ్దము ప్రధానమగును. అన్యత్రగౌణ మగును. అప్పుగా నిచ్చిపుచ్చుకొను తావుందు ప్రధానముగా వాడబడు ఋణ శబ్దమిట వాక్యముందు గౌణముగా ప్రయోగింప బడినది. (ఋణంహ జాయతే...) ఇత్యాది వాక్యముందు అనృణిjైు పుట్టియు, కర్మచేయకున్న ఋణము గ్రహించిన వానివలె ఋణియని నిందింప బడునుÑ కర్మచేసిన అనృణియని ప్రవంసింపబడుననియే వాక్యార్థము. పై వాక్యము ఋణానుబంధమును తొపక, యథాశక్తిని నియమపూర్వకముగా కర్మము ననుష్ఠించుటయే బోధించును. ఈ యభిప్రాయమునే (ఏతద్వైవజ్జరామర్య సత్రంయదగ్నిగ హోత్రం......’ ) వాక్యమున జెప్పబడిన జరామర్యవాదము పోషించును. వక్తి కవానిచే యావజ్జీవము అగ్ని హోత్రాది వైదికకర్మము కవానిచే యావజ్జీవము అగ్ని హోత్రాది వైదికకర్మము నుష్ఠింప దగిన వనియే యిందలి తాత్పర్యము. నియమ పూర్వకముగా వైదికకర్మ ననుష్ఠించుట యపవర్గ సాధనమునకు విరుద్ధమును కానేరదు. కాబట్టి ఋణానుబంధము వన నసవర్గాభావము సిద్ధించునను యుక్తము కాదు.
సన్యాసుకు అగ్ని హోత్రాది కర్మానుష్ఠానము లేనందువన వారికి మోఓము లేదనవయుననిని,
‘‘సమారోపణాదాత్మ న్యప్రతిషేధ ః’’ 4.1.61.
ఆత్మని R తనశరీరమున, సమారోపణాత్R అగ్నును సమారోపణ చేయుటవన, అప్రతిషేధ ఃR సన్యాసు కపవర్గము ప్రతిషేధింప జనదు.
చతుర్థావ్రముయిన పరివ్రాజకు బాహ్యముగా నగ్ని హోత్రాది వైదిక కర్మ నాచరింపరు. వా రుపకరణము నన్నిటిని సన్యసింతురు కావున కర్మానుష్ఠానము ముండును. కర్మ సంపాద్య ఫలాదు నా మహానుభావు చక్కగానాలోచించి నిర్వేదమును బొందినవారై, నిఃశ్రేయసమును పొందగోరి సన్యాసము నంగికరింతురు. అట్టియెడ కర్మలోపము కాకుండుటకై కర్మ సాధనమగు నగ్నిని తమ యుందారోపించుకొందురు. బామ్యముగాక శరీరమునందే కర్మ నాచరింతురని భావము. జీవన నిర్వాహార్థము.యదృచ్ఛాలాభ సంతుష్టులై భిక్షాచర్యము నొనరించును ప్రాణము నపానము నందును, అపానమును ప్రాణమునందును హోమము చేయుచుందురు. ఇదియే సన్యాసు చేయు నగ్ని హోత్రము దీనినే కర్మఠు దేవయజ్ఞమందురు. సన్యాసు నిత్యముచేయు వేదధర్మోపదేశము వారికి బ్రహ్మయజ్ఞము. దీనిని స్వాధ్యాయమందురు. (స్వాధ్యాయోవై బ్రహ్మయజ్ఞః’’ శత. 11.5..8.3.) వైదిక మర్యాద న్లుంఘింపకుండుట సన్యాసుకు పితృయజ్ఞము ఆత్మ భావనతోనే ప్రాణిని పీడిరపకుండుట వారికి భూతయజ్ఞము. ప్రాణు యుపకారార్థము దేశమున న్లెయెడ భ్రమించుచు, చెంత జేరిన జిజ్ఞాసువుకు సంశయమును బోనాడి తత్వ జ్ఞానమును కలిగించు వారి కతిథియజ్ఞమగును. ఇట్లు చతుర్థాశ్రమవాసు, పరివ్రాజకును నగ్నిగ హోత్రాది కర్మను స్వాత్మయందు అనుష్ఠించుచుందురు కావున వారి కపవర్గము ప్రతిషేధించుట యుక్తముకాదు.
సన్యాసును కర్మానుష్ఠాన పరుయిన కర్మఫము ననుభవింపవసిన వారగుచే మోక్షము సిద్ధింపదన,
‘‘పాత్రచయాంతా నుపపత్తేశ్చ ఫలాభావః’’ 4.1.62.
పాత్రచయాంతానుపపత్తేశ్చ R పాత్రచయ మంతమునగ కర్మయనుపపన్న మగుటవన, ఫలాభావ ఃR ఫముండదు.
మరణించినకర్మటుని హస్తాద్యవయవములో ‘జుహూ’ ప్రభృత్యగ్ని హోత్ర పాత్ర నుంచవయునను నియమము గ కర్మను నియమపూర్వకముగా నాచరించు వారికే స్వర్గాది క్షనముగ ఫలాదు భించును. ఫము నర్థించు వారిట్టి పాత్ర చయాంతకర్మ నామరణ మనుష్ఠింతురు. చతుర్థాశ్రము ట్టి కామ్యకర్మ నాచరింపరు. వారు పాత్రాద్యుపకరణమును త్యజించి బ్రహ్మనిష్ఠు గుదురు. లోకోపకారార్థము వారాచరించు దర్మోపదేశాది కర్ము మోక్షమున కభ్యంతర కరమగు ఫమును కల్పింజావు. వారు ‘‘తేహస్మపుత్రేషణాయాశ్చలోకైషనాయాశ్చవ్యుత్థాయాథ భిక్షాచర్యం చరన్తి’’ అనువాక్యముందుపదేశించి నట్లు ఈషణ(కోరిక) ను విడిచి కర్మపరు గుదురు కాబట్టి ఫదాయకముకావు. కావున నగ్నిగహోత్రాది కర్మను సన్యాసు లాచరించినను వారి కవి ఫదాయకము కాక పోవుట వన మోక్షసిద్ధికెట్టి యాటంకము నుండబోదు.
‘‘నుషుప్తస్యస్వప్పాదర్శనే క్లేశాభావవ దపవర్గః’’
4.1.63.
నుషుప్తస్య R సుషుప్తిని బొందిన వ్యక్తికి, స్వప్నాదర్శనే R స్వప్నము వన కుగు దుఃఖము లేకుండుట వన, క్లేశాభావవత్ R క్లేశము కుగనట్లు ఆపవర్గఃR మోక్షము సిద్ధించును.
సుషుస్తియందు క్లేశానుబంధమున్న జాగ్రత్స్వప్నావస్థందువలె జీవికి కష్టము కుగ వయును. క్లేశమున్న దుఃఖముండకపోదు. దుఃఖము లేదననిన క్లేశసంబంధము లేదని భావము. సుషుప్తియందు క్లేశము లేదనుట లోకసిద్ధము. కాగా సుషుప్తి క్లేశానుబంధము లేనిదైనట్లు అపవర్గనుము. క్లేశరహితమని యెఱుంగ వయును తత్వజ్ఞానము వన క్లేవము విచ్ఛిన్నముయి యపవర్గము సిద్ధించునఱు కాబట్టి క్లేశానుబంధము వన నుపవర్గలేదనుట యుక్తముకాదు.
‘‘నప్రవృత్తి ఃః ప్రతిసంధానాయహీనక్లేశస్య’’ 4.1.64.
హీనక్లేశస్య R తత్వజ్ఞానము వన క్లేశము నశించినవానికి, ప్రవృత్తిఃR ప్రవృత్తి, ప్రతిసంధానాయ R పూర్వజన్మము పోగా ఉత్తరజన్మము నారంభించుట ప్రతిసంధాన మనబడును. అందుకు నR సమర్థముకాదు.
బ్రహ్మవిదుగు తత్వజ్ఞు తత్వజ్ఞాన వశమున క్లేశమును విచ్ఛిన్న మొనర్తురు. అట్టివారి కంతిమదేహమున నేర్పడు ప్రవృత్తి పునర్జన్మ నారంభింపనేరదు. క్లేశమునెడి పొట్టుతో కప్పబడి యున్నపుడే కర్మయనెడి వరిబీజము జన్మరూపమగు మొక నారంభింప గుగును. పొటÊఉట ఈయబడిన బియ్యపు గింజ యంకురింపజానట్లు క్లేశవిచ్ఛిన్నానంతర ప్రవృత్తి జన్మారంభకము కానేరదు. కాబట్టి ప్రవృత్యనుబంధము వన నపవర్గము సిద్ధింపద నుట యుక్తిసహము కాదు.
పూర్వపక్షమ : `
‘‘న క్లేశ సంతతేః స్వాభావికత్వాత్ ’’ 4.1.65.
స్వాభావికత్తాత్ R అనాది యగుట వన, క్లేవసంతతేఃR క్లేవ సంతానమనకు, న R తత్వజ్ఞానమువన విచ్చేదము లేదు.
ఆకాశాదు నాదు గుటవన విచ్ఛిన్నము కావు. అట్లే క్లేశము ననాదుగుటవన తత్వజ్ఞృానము చేత నని విచ్ఛిన్నముగు ననుట పొసగదు.
ఉత్తరపక్షము: `
‘‘ప్రాగుత్పత్తే రభా వానిత్యత్వవత్ స్యాభావికే ప్యనిత్యత్వమ్
4.1.66.
ప్రాగుత్పత్తే రభావానిత్యత్వవత్ Rః ఉత్పత్తికి పూర్వము క్షీరాదుందు గ దధ్యాదు యభావము అనిత్యమైనట్లు, స్వాభివికే -పి R క్లేవము నాదులైనను, అనిత్యత్వము R తత్వజ్ఞానమువన నవి నశించును.
ఉత్పత్తికి పూర్వము కారనమున నుండు కార్యాయోగము (ప్రాగభావము) అనాదిjైుజూఊనను కార్యముత్పన్న మగటుచే తడవుగా నశించును. అట్లే క్లేశ సంతతియు స్వాబావికము (అనాది) అయినను తత్వజ్ఞానమువన నశించును. కాబట్టి దోషము లేదని భావము.
(కేÊ్లశనాశ విధానము)
‘‘అణుశ్యామతా-నిత్యత్వవద్వా’’ 4.1.67.
వా R లేక, అణుశ్యామతానిత్యత్వవత్ R పార్థివ పరమాణువు నందలి శ్యామత్వము అనాదిjైునను నశించుచున్నట్లు క్లేశ సంతతియు నశించును.
పార్థివ పరమానువులోని శ్యామత యనాదియయ్యు పాక వశమున నశించునట్లు క్లేశసంతతి స్వాబావికము (అనాది) అయినను తత్వజ్ఞానమువన నశించును. అందువన మోక్షోపబ్ధి కెట్టి యాటంకము నుండదు.
‘‘ న సంక్పనిమిత్తత్త్వాచ్చరాగాదీనామ్ ’’ 4.1.67.
రాగాదీనామ్ R రాగాదిక్లేశము, సంక్ప నిమిత్తత్త్వాచ్చ R సంక్ప హేతుకము గుటవన, న R నివృత్తి లేదనతగదు.
రాగాదు మిథ్యాఆ్ఞనము వననే కుగును. తత్వ జ్ఞానము వన మిథ్యాజ్ఞానము నశించిన, దానివన కుఉ రాగాదును నశించును. నిమిత్తమే లేకున్న నైమిత్తము లెట్లుండగవు? కాబట్టి మిథ్యాజ్ఞానముతో బాటు తన్నిమిత్తకముయిన రాగాది క్లేశము నివర్తింపగా మోక్షము సిద్ధించు ననుటలో నావంతయు దోసములేదని సూత్రాభిప్రాయము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి