మైదా వంటకాలు మానండి
-------------------------------------
చపాతి, పరోట, రుమాలీ రోటి, తందూరీ రోటి వంటి వాటి తయారీకి ఎక్కువగా మైదాను ఉపయోగిస్తుంటారు
మైదాతో చేసే పదార్థాలు చూడ్డానికిఎంతో తెల్లగా, తినడానికి ఎంతో రుచిగా ఉండటం దాని అతి వినియోగానికి కారణం.
గోధుమ పిండిని పాలీష్ చేసి, కొన్ని రసాయనాలను కలిపితే మైదా పిండి తయారవుతుంది
పాలిష్ చేయడంవల్ల మైదా పిండికి మెత్త దనం వస్తుంది
క్లోరైడ్ గ్యాస్, బైంజయిల్ పెరాక్సైడ్ లాంటి రసాయనాల మిక్సింగ్‌వల్ల మైదా పిండికి తెల్లదనం వస్తుంది.
ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరం.
మైదాలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది.
చైనాతోపాటు, యూరప్ దేశాలు బెంజయిల్ పెరాక్సైడ్ వాడకంపై నిషేధం విధించాయి.
మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండటం వల్ల పొట్ట వస్తుంది.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే అందులో పీచు పదార్థం ఉండాలి.
మైదాలో పీచుపదార్థం ఉండదు కాబట్టి మైదా త్వరగా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది.
దీనివల్ల పేగుల్లో పుండ్లు పడే ప్రమాదం ఉన్నది.
పుండ్లు ముదిరితే క్యాన్సర్ లాంటి వ్యాధులకు దారితీస్తాయి.
మైదాతో చేసిన పదార్థాలను తిన్నప్పుడు అవి మన పేగులకు అతుక్కుపోతాయి.
అతుక్కున్న వాటిలో హానికర క్రిములు ఉత్పత్తయ్యి ఇన్ఫెక్షన్‌లను కలుగజేస్తాయి.
మైదా పిండివల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి.
గుండె జబ్బులు వస్తాయి
మహిళలల్లో బ్రెస్ట్ సంబంధ సమస్యలు వస్తాయి
మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి