మోసుకొచ్చింది ఉంది
వెంట తెచ్చింది లేదు
తీసుకుపోయేది లేదు
ఎందుకీ ఆరాటం
ఎప్పటివరకీ పోరాటం?
పనిలేకుండా రారెవరు
ప్రారబ్దాలు అనే మూట
పట్టుకునే వచ్చాము
కష్టసుఖాలు - బాధలు
సంతోష సౌఖ్యాలు
అనుభవిస్తూనే ఉన్నాము
పాప పుణ్యాలను
మోసుకునే పోతున్నాము...
తెచ్చుకునేవి ...
తీసుకుపోయేవి...
రెండే రెండు
మంచి...చెడు
పుణ్యం...పాపం
ధర్మమార్గంలో నిలవాలి
పుణ్యకార్యాలలో
మునిగితేలాలి
పునీతం అవ్వాలి
రాగద్వేషాలు విడవాలి
కోపాతాపాలని త్యజించాలి
అంతఃకరణ శుద్దితో
ప్రశాంతంగా
హాయిగా జీవించు
పుణ్యగంధంతో
నిరంతరం
శోభించు...
గుభాళించు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి