మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

ప్రమాణ తర్క సాధనోపాంభః - వాదక్షణము - న్యాయ దర్శనము

 న్యాయ దర్శనము

వాదక్షణము : `

‘‘ ప్రమాణ తర్క సాధనోపాంభః, సిద్దాంతావిరుద్ధః

పంచావయవోపపన్నః పక్ష ప్రతిపక్షపరి గ్రహో వాదః’’   1.2.1.

ప్రమాణ తర్క సాధనోపాంభఃR ప్రత్యక్షాది ప్రమాణము ద్వారా, వానికనుకూలించు తర్కముద్వారాను, తనపక్షమును సాధించుచు పరపక్షమును నిషేధించు నట్టిదియు, సిద్ధాంతా విదర్ధుఃR సిద్ధాంత పదార్థమును విరోధింప నట్టిదియు, పంచావయవోపపన్నఃR ప్రతిజ్ఞాది పంచావయవము ప్రయోగము గదియు, పక్షప్రతిపక్ష పరిగ్రహఃR వాది ప్రతివాదుచే ‘‘ ఆత్మకదు ` ఆత్మలేదు’’ అనునిల్లి పక్ష ప్రతిపక్షము కదియునగు కథావిశేషము (చర్చ) వాదఃR వాదమనబడును,

అనేకు లొకచోగూడి విషయమును విచారించుచు జేయు వాక్యరచన ‘కథ’ యనబడును. ఆ కథయు వాదము, జ్పము. వితండ, యని మువ్విధము. అందు, స్వపక్ష సాధనము పరపక్ష ప్రతిషేధము ననునీరెండును ప్రత్యక్షాది ప్రమాణముతోను వాని కనుకూలించు తర్కముతోను చేయబడుచు ఆ తర్కము తామంగీకరించిన శాస్త్రమునకు విరుద్ధము కానివైయుండి, అవసరమని తోచినయెడ ప్రయోగించు న్యాయవాక్యము ప్రతిజ్ఞాదిపంచావయవముతో కూడియున్న పక్షమున నట్టి కథకు వాదమని పేరు. 

అనధిగత తత్వావబోధము (తనకింత వరకు తెలియని యొకానొక  తత్వము నెఱుంగుట), సంశయ నివృత్తి, అధ్యవ సితాభ్యనుజ్ఞానము (నిశ్చితార్థము నంగీకరించుట) యను నీ మూడుఫము నభిషింకు నొక శిష్యుడు తనగురువుతో గానీ, తోడి బ్రహ్మచారుతోగానీ చేయుచర్చ (కథావివేషము) ` వార్తలాపము, తత్వనిర్ణయమే ఫముగా గదైన పక్షమున వాద మనబడును. ఇందొకరినొకరు జయించుట కానీ, ఓడిరచుటకానీ యుండనేరదు.

జ్ప క్షణము : `

‘‘యథోక్తోపపన్న శ్చజాతిని గ్రహస్థానసాదనోపాంభో

జ్ప ః ’’ 1.2.2.

యతోక్తోపపన్న ఃR పూర్వము చెప్పన వాదక్షణముతో కూడినదై, ఛ....... సాదనోపాంభఃR ఛము. జాతి, నిగ్రహస్థానము వీని ద్వారా స్వపక్షమును స్థాపించుటయు, పరపక్షమును నిషేధించుటయు గ కథావిశేషము ` వార్తాలాపము, జ్పఃR జ్పమనబడును.

ఇందు వాది ప్రతివాదు తమతమ పక్షమును సాధింతురు. ఇతరు పక్షమును ఖండితురు ` ప్రతిషేధింతురు. తమపక్షమును సాధించుటలోను ఇతర పక్షమును ఖండిరచుటలోను వీలైనట్లు ప్రత్యక్షాది ప్రమాణము, తర్కము, ఛము, జాతి, నిగ్రహస్థానము వీనినన్నిటిని ప్రయోగింతురు. ఇట్టివాక్య సమూమమే జ్పమనబడును. ఈ జ్పమున వాదమునందు ప్రయోగింపనట్టి ఛము, జాతి, నిగ్రహస్థానము ప్రయోగింప బడును.

 ఛజాతి నిగ్రహస్థానము ననేమో ముందుజెప్పబడును.

వితండాక్షణము: `

‘‘సప్రతిపక్షస్థాపనాహీనో వితండా.’’ 1.2.3.

ప్రతిపక్షస్థాపనాహీనఃR ప్రతివాదిచేస్వీకరింప బడిన పక్షము ప్రతిపక్ష మనబడును. దానిని ప్రమాణాదు ద్వారా సాధించుట స్థాపనయన బడును. అట్టిసాదన రహితమైన, సఃR ఆ జ్పము, వితండా R వితండయనబడును.

పూర్వసూత్రమున వర్నింపబడిన జ్పక్షణమే త్రబీపి పక్షస్థాపలేనిదై వాదిని జయించు బుద్ధితో నడుపబడిన వార్తాలాపము గదగుచో వితండ యనబడును. ప్రతివాది తన సిద్ధాంతమును స్థాపింపక వాది సిద్ధాంతమును ప్రమాణ తర్క ఛ జాతి నిగ్రహస్థానము ద్వారా ఖండిరప నెంచిన వితండ యనబడునని సూత్రాభిప్రాయము. మఱియుసంక్షేపముగా జెప్పిన, స్వపక్షమును స్థాపింపక పరపక్షమును ఖండిరచుటయే ఫముగాగ వార్తాలాపము  (కథావిశేషము) వితండయనబడును.

హేత్వాభాసము : `

‘‘సవ్యభిచార విరుద్ధ ప్రకరణ సమస సాధ్యసమ

కాలాతీతా ః హేత్వాభాసాః’’ 1. 2. 4.

హేత్వాభాసా ః R హేతుక్షనము లేకుండి హేతువువలె తోచునవి. పక్షసత్వము, సపక్షసత్వము, విపక్షాసత్వము, అబాధితత్వము, లేక పంచమ్యంతాది సామాన్యక్షనము కలిగియుండుటచే హేతువువలె తోచునవి హేత్వాభాసమునబడును.

ఆ హేత్వాభాసము సవ్యభిచారము, విరుద్ధము, ప్రకరణ సమము, సాధ్యసమము, కాలాతీతమునని jైుదు విధము.

ఇందు ప్రకరణసమమునకు సత్ప్రతిపక్షమనియు’ సాధ్యసమమునకు అ సిద్ధమనియు, కాలాతీతమునకు బాధిత మనియు నామాంతరము గవు.

వానిలో సవ్యభిచారము : `

‘‘అనైకాంతికః సవ్యభిచారః’’ 1.2.5.

అనైకాంతికఃR (ఒకచో నియతముగా నుండునది ఏకాంతికము దానికి విపరీతముగానుండునది అనైకాంతికము.) అనియతముగా నుండునది, సవ్యఇచారఃR సవ్యభిచార మనబడును.

ఏ వస్తువు (సాధ్యము) సాధింపబడుచున్నదో అదియొకయంతము. దానియభావము రెండవయంతము. ఇట్లు సాధ్యముండుచోటు నొకయంతముగను, సాధ్యములేని చోటునొక యంతముగను మనమూహింపవచ్చును. దీనినే సంస్కృతమున సాధ్యవంతము సాధ్యాభావవంతము నని చెప్పవచ్చును. ఇట్లీ రెంటిలో  నొకదానియందు నియతముగా నుండని హేతువు అనై కాంతికము ` సవ్యభిచార మనబడును.

ఏ హేతువు సాధ్యమున్నచోట (సాధ్యవతి) నుండి సాధ్యాభావమున్నచోటను (సాధ్యాభావవతి) నుండునో ఆ హేతువు సవ్యభిచార హేత్వాభాస మనబడునని సూత్రాబిప్రాయము.

ఒకచోట వ్యవస్థితము కాకుండుట వ్యభిచార మనబడును వ్యభిచారముతో కూడినది సవ్యభిచారమనబడును.

ఉదాహరణము : ` శబ్దము నిత్యము స్పర్శములేనిదగుట వన స్పర్శముగ ఘటపటాదు అనిత్యముగా చూడబడుచున్నవి. స్పర్శము లేకుండుట వన శబ్దము నిత్యమని సాధింపనెంచి, ‘స్పర్శము లేనిదగుటవన’ అను హేతువు నిట గ్రహించిన నదిహేతువుగా సవ్యభిచార హేత్వాభాసమగును. కారణ మేమన : శబ్దము నిత్యము అను తావున నిత్యత్వము సాధ్యముÑ అనిత్యత్వము సాధ్యాభావము. స్పర్శము లేని దగుట వన నను నీహేతువు సాధ్యాభావముగ ` అనిత్యమయిన బుద్ధియందును గదు. కాబట్టి యిది యహేతువు ` హేత్వాభాసము.

విరుద్ధ హేత్వాభాసము : 

‘‘సిద్ధాంత మభ్యుపేత్య తద్విరోధీ విరుద్ధః’’ 1.2.6.

సిద్ధాంత మభ్యుపేత్య R సాధనీయధర్మము ` సాధ్యము సిద్ధాంత మనబడును. దానినంగీకరించి, తద్విరోధీ R దానిని విరోధించు స్వభావము గ ` సాధ్యాభావ స్థమున నుండు హేతువు, విరుద్ధఃR విరుద్ధహేత్వాభాసమనబడును.

ఉదాహరణము : ` ఈ హ్రదము (మడుగు ) వహ్నిమంతము, హ్రదత్వము కదగు వన. ఇక్కడ వహ్ని సాధ్యము. హ్రదత్వము  హేతువు. హ్రదత్వము హ్రదమును నుండును. అక్కడ వహ్ని యుండనేరదు. కాబట్టి యీ హ్రదత్వము సాధ్యాభావ స్థముననుండి విరుద్ధ హేత్వాభాస మనబడును.

ప్రకరణ సమము : `

‘‘యస్మాత్ప్రకరణ చింతా స నిర్ణయార్థ మప దిష్ట ః 

ప్రకరణ సమ ః ’’ 1.2.7.

యస్మాత్‌ R సమాన బముగ మరియొక హేతువుచే నిరోధింపబడిన సామర్థ్యముగ యే హేతువు వన, ప్రకరణచింతాR (సాధ్యాశ్రయమగు పక్షము ప్రకరణ మనబడును ఆప్రకరణకు సంబంధించినచింత) పక్షము (ప్రకరణము) సాధ్యమున కాశ్రయమా లేక ఆనాశ్రయమా? యనుజిజ్ఞాస కుగునో, సఃR ఆహేతువు, నిర్ణయార్థమ్‌ R పక్షము సాద్యాశ్రయమేయన ఇనిర్ణయించుటకు, అపదిష్టఃR ప్రయోగింపబడినచో, ప్రకరణము ఃR ప్రకరణసమము`  సత్ప్రతిపక్ష హేత్వాభాసమనబడును.

విమర్శ నధికరించు పక్ష ప్రతిపక్షము ప్రకరణమని భాష్యకాయి (వాత్స్యాయనుడు).

పక్షమున (సాధ్యవంతమున) సాధ్యనిర్ణయార్థమై ప్రయోగింపబడిన హేతువునకు ప్రతికక్షిగా మఱియొక హేతువున్న పక్షమున ప్రథమ హేతువు సత్ప్రతిపక్ష ` ప్రకరణసమహేత్వాభాస మనబడును.

సాధ్యాబావమును సాధించుహేతువు ప్రతికక్షిగా నే హేతువునకుండునో ఆ హేతువు ప్రకరణ సమహేత్వాభాసము.

ఉదాహరణము : ` శబ్దమనిత్యముÑ నిత్యధర్మము భింపకుండుట వన శబ్దము నిత్యముÑ అనిత్య ధర్మము భింపకుండుట వన. 

ఇందు నిత్యధర్మముకానీ, అనిత్యదర్మముకానీ భింపనందున శబ్దము నిత్యమా? అనిత్యమా? అనుసంశయము కుగుచున్నది. నిత్యమో అనిత్యమో నిర్ణయింపజానందున నీ మేతువు ప్రకరణ సమము నబడును.

సాధ్యసమహేత్వాభాసము : `

‘‘సాధ్యావిశిష్టస్సాద్యత్వాత్సాధ్యసమః’’ 1.2.8.

సాధ్యత్వాత్‌ ః సిద్ధముకాకుండుట వన నేహేతువు, సాధ్యా విశిష్టఃR సాద్యముతో త్యుమో అది, సాధ్యసమఃR సాద్యసమహేత్వాభాస మనబడును.

ఏ హేతువు (స్వరూపతః) సిద్ధముకాదో అది సాధ్యము వలెనే సిద్ధము చేయదగినదగుటచే సాద్యసమ మనబడును. దీనినే అసిద్ధహేత్వాభాసమనియు నందురు.

ఉదాహరణము : ` తమస్సు (అందకారము) ద్రవ్యము, గతి గదగుటవన, ఇందు గతిగదగుటవన అనుహేతువు సాద్యసమము. కారణమేమన, అందకరాము ద్రవ్యమనుట సాధింపదగిన విషయమెట్లో అట్లే అంధకారమున గతి ` గమనము ` చనము నున్న దటను సాదింపదగినవిషయమే. ఉభయ పక్షమువారును, అందకారము చలించునను విషయము సిద్ధమని యంగీకరింపరని భావము.

కాలాతీతము : `

‘‘కాలాత్యయాపదిష్ట ః కాలాతీతః’’ 1.2.9.

కాలాత్యయాపదిష్టఃR హేతువును ప్రయోగించుకాము కామనబడును. దాని నతిక్రమించి ప్రయోగింపబడు హేతువు, కాలాతీతఃR కాలాతీత మనబడును.

ఉదాహరణము ` వహ్ని అనుష్ణముÑ ద్రవ్యమగుట వన, శబ్దము నిత్యముÑ సంయోగవ్యంగ్యమగుటవన,

ఇట భేరీదండ సంయోగమువన శబ్దము వ్యంగ్యమగును. సంయోగమువన కుగు నీశబ్దము మనము గ్రహించువేళ సంయోగముండదు. ఆ సంయోగ మంతకుపూర్వమే కుగును. సంయోగసమయమున మనము శబ్దము గ్రహింపము. అనంతరమున గ్రహింతుము. వ్యంగ్య వ్యంజకము రెండు నొక్కకామున గ్రహింపబడవు.

ఆలోకసంయోగము రూపవ్యంజకము. ఆలోకరూపము రెండు నొకేసమయమున జూడబడును. శబ్దమట్లు కాదు. కాబట్టి యీ హేతువు కాలాతీతమగును. దీనిని బాధిత హేత్వాభాసమనియు నందుఉ. అనగా నీ హేతువు ప్రత్యక్షాదిప్రమాణముచే బాధింపబడును. ఇక్కడ జూపబడిన యుదాహరణములో మొదటి యుదామరణమున ద్రవ్యమగుటవన వహ్ని యనుష్ణమనుట ప్రత్యక్ష ప్రమాణ బాధితము

ఛ క్షణము : `

‘‘వచనవిఘాతో-ర్థ వికల్పోపపత్త్యాఛమ్‌ ’’

12.10.

అర్తవికల్పోపపత్త్యా R వాదికిష్టమైన (అభిప్రేతమైన) యర్థమునకు విరుద్ధమైన యర్థమును కల్పించుటయే క్షణముగాగ యుక్తితో,, వచనవిఘాతఃR వాదిచే ప్రయోగింపబడిన వాక్యమును దుష్టమొనర్చుట, ఛమ్‌ R ఛమనబడును.

వాదియే యభిప్రాయమును మనమున నిడుకొని యొక వాక్యమును ప్రయోగించునో ఆ యభిప్రాయమునకు విరుద్ధమైన యర్థము నా వాక్యమునకు కల్పించి యా వాక్యమును వ్యర్థమొనర్చుట ఛమనబడునని సూత్రాభిప్రాయము,

ఛ విభాగము : `

‘‘తత్‌ త్రివిధం వాక్ఛం సామాన్యచ్చ ముపచార

చ్ఛంచ’’ 12.11.

తత్‌ ః పై జెప్పిన ఛము వాక్ఛము, సామాన్యచ్ఛాము, ఉపపచార చ్ఛము నని మూడు విధము,

అందు వాక్ఛము : `

‘‘ అవిశేషాభిహితే-ర్థే వక్తురభిప్రాయాదర్థాంతర

క్పనా వాక్ఛమ్‌ ’’ 1.2.12.

అవిశేషాభిహితే R శబ్దశక్తి వన ననే కార్థమునిచ్చు శబ్ధము అవిశేష మనబడును. అట్టి శబ్దముచే చెప్పబడిన అర్థే R అర్థమునందు, వక్తు ః R వాదదికి, అభిప్రాయాత్‌ R ఇష్టమైన దానికంటె, అర్థాంతర కల్పానా R భిన్నమైన మఱియొక యర్థమును కల్పించుట, వాక్చమ్‌ R వాక్ఛ మనబడును.

అనేకార్థకమగు నొక శబ్దమును కొండొక యర్థమును తొపనుద్దేశించి యొకడు ప్రయోగింప, ప్రయోక్తయభి ప్రాయముకంటె భిన్నార్థము నాశబ్దమునకు కల్పించుట వాక్ఛమనబడునని సూత్రాభిప్రాయము.

ఉదామరణము : ` ‘‘ఇతడు నవకంబుడు’’. అను వాక్యమును ‘ఇతడు క్రొత్త కంబళి కవాడ’ ను నర్థమును బోధింపదచి యొకడు ప్రయోగింప, ఆ వాక్యమునకు తొమ్మిది కంబళ్ళు కవాడని యర్థమును కల్పించి ఈదరిద్రునకు రెండఱు కంబళ్లైన లేవే తొమ్మిదియెటనుండి వచ్చినవని యాక్షేంపించుట వాక్ఛమగును.

‘‘సంభవతో-ర్థ స్యాతిసామాన్యయోగా ద సంభూ

తార్థక్పనా సామాన్యచ్ఛమ్‌. 1.2.13.

సంభవత ః R సంభావింప వీగు, అర్థస్య R వాదిచే ప్రయోగింపబడిన వాక్యార్థమును ప్రతిషేధించుట కొరకు, అతిసామాన్యయోగాత్‌ R సంభావింప వయిన అర్థముకాక సామాన్యదర్మమును పురస్కరించుకొని వీయినట్టి, సఅసంభూతార్థ క్పనా R అసంభవమైనట్టి అర్థమును కల్పించుట, సామాన్యచ్ఛమ్‌ R సామాన్యచ్ఛ మనబడును.

ఒక సామాన్యదర్మమును పురస్కరించుకొని వాది తాత్పర్యమునకు  విషయమైన యర్థమునకు విరుద్ధార్థమును కల్పించుట సామాన్యచ్ఛమని సూత్రాబిప్రాయము.

ఉదాహరణము : ` దూరమునుండి వచ్చుచున్న శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యపర్యుగు దయానంద భగవత్పాదును చూచి యొకడు ‘‘వీరాఁ జగద్విఖ్యాతకీర్తు! అఖిజనవంద్యు! దేశాత్మోద్ధారార్థము పై దికధర్మము నుపదేశించు పరివ్రాజకు !’’ అని సహచరుతో నన నందొకరు ‘పరివ్రాజకునకు దేశాత్మోద్ధారార్థము వైదికదర్మోపదేష్టృత్వము సంభవమే ’ యని యనెననుకొనుడు. అంతట నొక ఛవాది, పరివ్రాజకునకు వైదిక ధర్మోపదేశము సంభవమేని, కరుగదా! యెందరో పరివ్రాజకు నేడు భారతమున వారియందున పరివ్రాజకత్వము కదుగదా? కాని, వారిలో నెందఱు సత్కారార్హు? బకబిడావ్రతులై భారత భూమికి భారభూతులై యున్నారే ! వారెట్టరు వైదిక దర్మోప దేశకులేనా? అని యెదుర్కొనుఉను. ఇక్కడ వాదిచే హేతువుగా నుద్దేశింపబడని పరివ్రాజకత్వసామాన్యమును వైదిక ధర్మోపదేశమునకు హేతువుగాగొని యాక్షేపించుట సామాన్యచ్ఛమని సూత్రాభిప్రాయము.

ఉపచారచ్ఛము : `

‘‘ధర్మవిక్పనిర్దేశే అర్థ సద్భావ ప్రతిషేధ ఉపచారచ్ఛమ్‌’’

1.2.15.

ధర్మవిక్ప నిర్దేశే R (శబ్ద వృత్తుయిన ‘శక్తి ` క్షణ’ు ఇక్కడ ధర్మ పదమున వ్యవహరింపబడినవి. ) శక్తి  ` క్షణా వృత్తులో నొకదానిచే నిర్దేశింపబడిన శబ్దమున, అర్థసద్భావప్రతిషేదఃR రెండవ వృత్తిచే నట్టి యర్థ మా శబ్దమునకు లేదని ఖండిరచుట, ఉపచారచ్చమ్‌ ` ఉపచారచ్ఛ మనబడును.

శబ్దమున నర్థబోధకవృత్తు రెండు గవు. ఒకటి శక్తి. రెండు క్షణ. ఇందు శక్తి ముఖ్యవృత్తి. లోణగౌణ వృత్తి. ఇటిÊ్ట రెండు వృత్తులో నొకదానిని మనస్సున నిడుకొని వాదిచే ప్రయోగింపబడిన శబ్దమునకు మఱియొకదానితో నాయర్థమును కాదనుట ఉపచారచ్ఛమనబడునని సూత్రాభిప్రాయము. 

ఉదాహరణము : ` క్షణావృత్తి నుద్దేశించి ‘‘మంచొ (అరచుచున్నవి) కేకు పెట్టుచున్నవి ’’ అనియొకడన, శక్తి వృత్తి ననుసరించి ‘‘మంచెలెట్లు కేకు పెట్టగవయ్యా? మంచెమీదనున్న మనుజు కేకు పెట్టుచున్నారు కాని ’’ యని ఖండిరచుట ఉపచారచ్ఛమగును

ఇట్లు ఛము మువ్విధముని నిరూపించి యంతకంటె నెక్కువ తక్కువకావని ధుృవపరుప పూర్వపక్ష మొనర్చుచున్నాడు సూత్రకారుడు. 

‘‘వాక్ఛమేవో పచారచ్ఛం తదవిశేషాత్‌ ’’ 1.2.15.

ఉపచారచ్ఛము, వాక్ఛమేవ R వాక్ఛమే. తదవిశేషాత్‌ R వాక్ఛముకంటె భిన్నము కాకుండుట వన .

వాక్ఛమున వాదిచే ప్రయోగింపబడిన శబ్దమున కర్థాంతరము కల్పించి ఖండిరచుటనుÊ, ఉపచారచ్ఛమునను వాది ప్రయోగించువబ్దమునకు దతభిప్రేర్థమునకంటె భిన్నార్థము కల్పింపబడును. వాక్ఛము, ఉపచార్ఛము రెండు వేరుగావు.

ఖండన సూత్రము : `

‘‘న తదర్థాంతరభావాత్‌,’’ 1.2.16.

న R వాక్ఛము ఉపచారచ్ఛముకాదుÑ కారణమేమి? తదర్థాంతర భావాత్‌ R ఆరెంటిలోను భేదముండుట వన.

వాక్ఛ ` ఉపచారచ్ఛములో సామాన్య దృష్టికి భేదము కన్పింపకున్నను వానిలోచా భేదముకదు. వాక్ఛమున శక్తివృత్తిచే బోధింపబడిన అర్థము వక్తివృత్తిచే బోధింపబడిన అర్థాంతరముచే ఖండిరపబడును, ఉపచారచ్ఛమున శక్తివృత్తిచే బోధింపనెంచిన యర్థము క్షణావృత్తిచే కల్పితమగు అర్థముచేతను, క్షణావృత్తిచే బోధింపనెంచిన యర్థము శక్తివృత్తి కల్పితార్థముద్వారాు ఖండిరధిబడును. కాబట్టి రెండును భిన్నముని సూత్రాభిప్రాయము.

‘‘ అవిశేషేవా కించిత్సాధర్మ్యాదేకచ్ఛ ప్రసంగః’’

1.2.17.

వా R మరియు, కించిత్సాదర్మ్యాత్‌ R ఏ కొంచెపు సమానక వననో, అవిశేషే R భేదము లేదన్నచో, ఏకచ్ఛ ప్రసంగఃR ఒకేఛ మనవసివచ్చును.

పై జెప్పిన భేదమతిస్వ్పమనియెంచి వాక్చలోపచార చ్ఛములో భేదములేదని యెంచిన పక్షమున సామాన్యచ్ఛమును సైతము భిన్నముగా నెంచక ఒక్కటే ఛమని యెంచవసివచ్చును. కాబట్టి యత్కించిద్భేదమును గూఢ భేదముగానెంచి సూత్రకారుడు ఛము మూడు విధముని వర్ణించియున్నాడు.

జాతిక్షణము : `

‘‘సాధర్మ్యవైధర్మ్యాభ్యాం ప్రత్యవస్థానం జాతి ః ’’

1.2.18.

సాదర్మ్య వైదర్మ్యాభ్యామ్‌ R సమాన విశేషధర్మము ద్వారా, ప్రత్యవస్తానమ్‌ R వాదిస్థాపిత సాద్యధర్మమును ఖండిరచుట, జాతిఃR జాతి యనబడును.

వాఇఏ స్థాపింపబడిన సాద్యధర్మమును ఖండిరచుటకు వ్యాప్తిరహితమగు హేతువును గ్రహించుట జాతియనబడును.

నిగ్రహస్థాన క్షణము : `

‘‘విప్రతిపత్తి రప్రతిపత్తిశ్చ నిగ్రహస్థానమ్‌,’’ 1.2.19.

విప్రతిపత్తి ఃR విరుద్ధ జ్ఞానము , అప్రతిపతిÊఃR ఆరంభింపవవసిన యెడ ఆరంభింపకుండుట, (వాది సాధించిన దానిశ్రీని దూషించుటయో, వాది దూషించిన దానికి సమాధానము చెప్పుటయో ఆరంభ మన బడును. అట్లు చేయకుండుట ఆనారంభము ` అప్రతిపత్తి). నిగ్రహస్థానమ్‌ ` నిగ్రహస్తాన మనబడును.

పరుడు చెప్పినదానిని సరిగాగ్రహింపక వీపరీతముగ గ్రహించుటయు, పరుడుస్థాపించిన దానిని ఖండిరపకుండుటయు పరాజయమునకు కారణము, కాబట్టి విప్రతిపత్తి ` అప్రతిపత్తి యనుని నిగ్రహస్థానము నబడును

జాతి నిగ్రహస్థానము లెన్నియన :

‘‘ తద్వికల్పాజ్జాతి నిగ్రహస్థాన బహుత్వమ్‌.’’ 1.2.20.

తద్వికల్పాత్‌ ః సాధర్మ్య వైదర్మ్యము ద్వారా చేయుఖండనము వనను, విప్రతిపము అప్రతిపత్తు అనేకవిధముగుటవనను, జాతినిగ్రహస్థాన బహుత్వమ్‌ R జాతి, నిగ్రహస్థానము నేక విధము.

పై జెప్పిన జాతి నిగ్రహస్థాన క్షణములోగ బేధము ననుసరించి జాతినిగ్రహస్థానము నేక విధముని సూత్రాభి ప్రాయము.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి