మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

సూరిగాడు story

 శ్రీరస్తు    శుభమస్తు         అవిఘ్నమస్తు

(తుసి వంట చేసుకుంటుంది)
(సూరి బయటి నుండి వచ్చాడు)
సూరి:` అమ్మా ! అమ్మా ! అమ్మా!
తుసి:` (లోప్నుంచి వస్తూ) అబ్బబ్బా! ఏట్రా ఆ అరుపు?... అంత గట్టిగా అరుత్తావేటి?..ఏటైందిరా సూరిగా?...
సూరి:` ఏం కాలేదమ్మా... నాకు అర్జంటుగా 3 రూపీస్‌ కావాలే... అదేనే మూడురూపాయు కావామ్మా... న్యూస్‌ పేపర్‌ కొనుక్కోవాలి. త్వరగా ఇవ్వమ్మా..
తుసి:` ఏటీ... నూస్‌ పేపర్‌ కొంతావా....డబ్బులేటయినా సింతసెట్టుకు కాత్తాయనుకుంతన్నవా?...నా కాడ లేవు.. ఎళ్లు...(వెళ్లబోయింది)
సూరి:` అమ్మా అమ్మా ఆగమ్మా నా మాట వినమ్మా...ఈ రోజు టెన్త్‌క్లాస్‌ రిజల్ట్స్‌ వస్తాయమ్మా... పేపర్లో ఏస్తారే...డబ్బుల్లేవంటే ఎట్టాగే? నేను పరీక్ష పాసయ్యింది, లేంది తొసుకోవద్దా?..తొసుకోవాంటే పేపరు కొనుక్కోవద్దూ...
తుసి:` (ఆనందంతో) ఏటీ?.... నువ్వు పరీక్ష పాసయ్యింది లేంది పేపర్లో ఏత్తారా?... మా అయ్యే మా అయ్యే ఉండు! ఇప్పుడే ఇచ్చేత్తానుండి... ఆ మాట ముందే సెప్పవేరా?(కొంగులో ఉన్న డబ్బు తీసిస్తుంది సూరి గాడికి సంతోషంగా)
సూరి:` థాంక్సమ్మా! మా అమ్మ మంచిది... మా అమ్మ మంచిది (వెళ్లబోయాడు)
తుసి:` ఓ రయ్యా! జాగ్రత్తగా ఎళ్లు... నారీు బస్సు మా జోరుగా తిరుగుతూ ఉంతాయ్‌... తాగుబోతు సచ్చినోళ్లు తాగేసి నారీు తోుతా ఉంతారు....
2
ఈ మందు సారాయి దుకానాు పూరగ ఎత్తేస్తేగాని తాగుబోతునాయాళ్లు తిక్క కుదురుద్ది. జాగ్రత్తగా ఎ్లరారోరయ్యా...
సూరి:` అమ్మా! యు డోంట్‌ వరీ... అమ్మా (వెళ్లబోయాడు)
తుసి:` ఆ... పిచ్చి సన్నాసి (వంటింట్లోకి వెళ్లింది. రాముడు బయటినుండి వచ్చాడు. చేతిలో చెర్రాకోు, ఓ కర్రా ఉన్నాయి. వాటిని పక్కనబెట్టి గుడిసె పక్కనున్న లొట్టిలోని నీళ్లతో చేతు కాళ్లు కడుక్కొని దండెం మీద తుండువాతో తుడుచుకుంటూ బయటకొచ్చి మంచం మీద కూర్చుని...)
రాముడు: ఒసే తుసీ అన్నమెట్టు... సాపకూర వండమన్నాను... వండినవేటి?..
తుసి:` (చిరుకోపంగా...) ఆ మాటంతానికి సిగ్గులేదా మావా నీకు? పొద్దుటా నుంచి వాంతుయి నీరసంగా నానుంటే సాప కూరొండావా పెళ్లావా అంతానికి నోరెట్టా వచ్చిందయ్యా నీకు?...
రాముడు:` (సంతోషంగా...) ఏటే వాంతుయితున్నావేటే?....నిజవేనేటి?... మరి సెప్పవే? ఓ కన్నూ కన్నూ కాదని ఓ కొడుకు కొడుకు కాదని మా చ్మీదేవిలా ఓ ఆడప్లి కూడా ఉంటే...
తుసి:` ఏటీ ఆడపిల్లా? ఎవరికీ?..
రాముడు:` నీళ్లోసుకుంతున్నాను అని సెప్పినోళ్లకి... (నవ్వి) అంతే మనకేనే పిచ్చిమొగమా....
3
తుసి:` ఏటి నేనా పిచ్చిదాన్ని! నువ్వేనయ్యో నాను రోజు నీళ్లు పోసుకుంతునే ఉన్నాను.
ఆ మాటనడానికి సిగ్గెక్కడలేదయ్యో నీకు? మొదటిదానికి మొగుడే లేదయ్యా అంటే కడదానికి కళ్యాణం ఎప్పుడు అన్నట్టుగా ఉంది నీ యవ్వారం. ఒంట్లో బాగో లేక నాకు వాంతువుతుంటే కడుపొచ్చిందా పెళ్లామా అని ఎకసెక్కాలాడుతున్నావా? అయినా ఈ వయస్సులో నీకా ఆలోచనఏవిటి?
రాముడు:` వయసుదేవుంది దీని సిగదరగ మనసుండాలేగాని ఏతంటవ్‌? (తుసిని దగ్గరగా తీసుకోబోయాడు. విడిపించుకుంటుంది. మళ్లీ లాక్కుని కౌగిలించుకుంటాడు. రాముడు కౌగిలిలో ఉంటుంది తుసి)
తుసి:` ఏటి మావా? ఏటైనాది నీకీరోజు?....ఓ రెచ్చిపోతన్నావు?...
రాముడు:` ఓ ఆడప్లి కావాని కోరిక పుడుతుందే (కౌగిలించుకుంటాడు)
తుసి:` సాల్‌సాల్లే సంబడం ఎవరైనా ఇంటే నవ్విపోతారు. సూరిగాన్కి పెళ్లిజేస్త కోడలొస్తుంది. మనవళ్లు, మనవరాళ్లు పుట్టబోయే ఈ వయస్సులో ప్లిు కావాంట ప్లిు... అయానా మావా నీకో సంగతి సెప్పడం మర్సిపోనాను. మొన్న మా అన్న వచ్చినపుడు
4
నాతో ఒక మాటన్నాడు మావా...
రాముడు:` ఏటన్నాడే?..
తుసి:` మన సూరిడాన్ని ఆడి కూతురు గౌరికిచ్చి పెళ్లి సేయమని అడిగాడు మావా..
రాముడు:` మరి నువ్వేటి అన్నావే?...
తుసి:` ఆ నేనేటంతాను మావా?... సూరిగాడి పరీచ్చయిం తర్వాత ఆలోసిద్దామన్నాను మావా...
రాముడు:` అయితేటి సూరిగాడికి పెళ్లి సేత్తవా?
తుసి:` సేత్తే తప్పేటి?...
రాముడు:` తప్పా! తప్పున్నర. ఆడిరకా సిన్నగుంటడే... బాగా సదువా. గొప్ప గొప్ప సదువు సదవా పెద్ద ఆఫీసరయ్యిపోవాలె....
తుసి:` ఉట్టికెక్కలేనమ్మ సర్గానికెక్కుతానందట. రెండుపూటలా కడుపునిండా బువ్వే లేదుగానీ సదివిత్తాడట...సదివిత్తాడు.. ఏటి సదివిత్తావ్‌?....
రాముడు:` చస్‌ నీ యవ్వ... మా ముసలోడు... మా అయ్య మా అయ్య గూడ ఇదే మాటన్నాడే... పదోక్లాసు పాసయింతర్వాత సదువుకుంతాన్రో ఓరయ్యో అంతే మనకాడ డబ్బులెక్కడివిరరయ్యా మనకు సదువుచ్చిరావురా అయ్యా అని ఎద్దు
5
బండి అప్పసెప్పి తోుకుంటూ బతకరా అన్నాడు. ఫలితం ఏటే ఉప్పుకుంటే ఉల్లిపాయకుండదూ.... ఉల్లిపాయకుంటే ఉప్పుకుండదు. ఒసే తుసీ! మనమెన్ని కష్టాు పడైనా సరే బాగా సదివించి మంచి జీవితాన్నందించాలే... మనలాగ ఉండకూడదే.
తుసి:` (ప్రేమగా...) మావా... నా కొడుకు గొప్పవాడైతాడంటే నాకు మాత్రం ఇష్టంలేదా ఏటి?... కాకపోతే అంత డబ్బు యాడ నుంచి తెస్తావా అని....
రాముడు:` తుసీ! మన ఆలోచన మంచిదైనపుడు భగవంతుడే దారి సూపిత్తాడే... కష్టాన్నీ భరించాలే ` మనిద్దరము రూపాయుగా మారిపోదామే. ఎదిగే వాడి జీవితానికి మనం మెట్లుగా మారిపోదామె. పైకెదిగి మన సూరిగాడు ` మన బతుకుల్ని బాగు సేత్తాడే. ఆడు కార్లో ఇంటికొచ్చి బోయ్‌మని ఆరన్‌కొట్టి కారు దిగి మెట్లెక్క డాబా మీదికి ఎళ్లిపోతాఉంటే....
తుసి:` మనింట్లో మెట్లాడివి మావా?... అటక తప్పా?....
రాముడు:` ఛీ నీయవ్వా ఆడాఫీసరయితే ఈ ఇంట్లో ఉంటాడనుకుంతున్నావేటి? ` పెద్ద డాబాకడతాడే...
తుసి:` అంటే మావా... మన పెసిడెంట్‌గారిలాంటిదా?
రాముడు:` చస్‌ పెసిడెంట్‌గారి డాబాకన్నా పెద్ద డాబా కడతాడే.
6
తుసి:` మావా... మావా... మొన్న పెసిడెంటుగారింటికెళితే ఒసే తుసి ` గచ్చుతూడ్సెళ్లవే అంది అమ్మగారు... మావా అది గచ్చనుకుంతన్నవేటి?.. అద్దమంత నున్నగా ఉంది...
రాముడు: ఓసి పిచ్చి మొహమా! దాన్నే గ్రానైట్‌ మోజాక్‌ ఫ్లోరింగ్‌ అంతారే...
తుసి:` అట్టాగా! మావా మావా సూరిగాడిరటికి కూడా అట్టాంటి గచ్చేయిద్దాం..
రాముడు:` ఒక గచ్చేంటి ఏ.సీ. చేయిత్తాడు.
తుసి:` అంటే ఏటి మావా?...
రాముడు:` అంటే ఎండాకాంలో బయట ఎండ. ఇంట్లో శీతాకాం అంటే స్లగాందించే మిషనన్నమాట. అంతేకాదు... ఓ డైనింగ్‌ టేబుల్‌... ఆ టేబుల్‌ కూడా మనిద్దరం కూసొని బువ్వ తింటూ ఉంటే...
తుసి:` డేెనింగ్‌ టేబుల్‌ అంటే ఏటి మావా?....
రాముడు:` బువ్వ తినే బల్లే.... మనకెవరొడ్డికిత్తారనుకుంతన్నావే...
తుసి:` ఇంకెవరు?...మావా మన కోడుప్లి...
రాముడు:` చ నీ యవ్వా... కోడు పిల్లెందుకొత్తాదే?.... కుక్కు... కుక్కు... ఒడ్డిత్తాడే...
తుసి:` కుక్కా?
రాముడు:` చీ... పల్లెటూరిదానా.... కుక్క కాదే...కుక్కంటే అన్నం పెట్టే వంటమనిషి.....
7
తుసి:` అమ్మయ్యా! నాకు సాకిరి తప్పదన్నమాట...
రాముడు:` అవునే! మనం బువ్వ తిన్నాక యిష్ణుమూర్తులోరు పాసముద్రం మీద తొంగున్నట్టుగా మనం మంచం మీద తొంగుటామన్నమాట. అబ్బ కాళ్లు నొప్పెడుతున్నాయే...
తుసి:` సీమాచ్చిమిదేవిలాగా నన్నుపట్టమంటావా?...
రాముడు:` ఛీ... నీ యవ్వా ఇపుడు కాదే ` అప్పుడు అప్పుడు మనం ముసలివారైపోతాం గదా! కాస్త కాళ్లు పట్టవే తుసీ నెప్పులెడుతున్నాయి అంతాను.
తుసి:` అపుడు నాను మాత్రం ముసలిదాన్ని గానేటి? నాకు మాత్రం సేతు నొప్పట్టవేటి?..
రాముడు:` ఆ.... అ్లదేమాట నువ్వంతవ్‌...అపుడు నాను ఒరే కుక్కూ ... ఇలా రారా అంతాు. ఏంటి బాబూ అంటాడు. కూసింత కాళ్లు పట్టరా అంతానా... పట్టనూ అంతడు. పడతావా లేదా అని లాగి తంతాను. (కుండను తంతాడు పగిలిపోతుంది)
తుసి:` ఓ మ్మో ఓ మ్మో ఎంతపని జేసినవ్‌ మావా ఆూ లేదు సూ లేదూ కొడుకు పేరు సోమలింగమూ అని ఏటో కు కనేసినావు. బంగారం లాంటి కుండ
8
పగగొట్టేసినవు...
రాముడు:` ఏటోన ఆడు సదువుకుని గొప్పోడయితేనే ఇయన్నీ అనుభవించొచ్చని ఆసే..
(ఇంతలో సూరిగాడు పేపరు పట్టుకొస్తాడు)
సూరి:` అమ్మా ! అమ్మా నేను ఫస్టుక్లాసులో పాసయ్యానే! ఇదిగో నా ఫోటో ఈ పేపర్లో ఏసారే సూడు (సంతోషంగా గుండ్రంగా తిరుగుతాడు)
తుసి:` ఏమయ్యోయ్‌! సూరిగాడి ఫోటో పేపర్లో ఏసారంట గదా! నాకోసారి సూపించు..
రాముడు:` (పేపరు చూపిస్తూ...) ఫోటో ఏయటమేగాదే... ఏట్రాసారో సదువుతానినూ... ఇశాపట్నం జిల్లా మాడుగు గ్రామంలో శ్రీధరరాముడు కొడుకు సూర్యనారాయణ అంటే మన కొడుకు సూరిగాడు ఇశాపట్నం జిల్లాలో ఫస్టు ర్యాంకులో పాసయ్యాడు. ఆరొంద (600) మార్కుకి అయిదువంద తొంబై మార్కు సాధించి (590) రాష్ట్రంలోనే మొట్టమోదటి ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. ఇన్నావంటే తుసీ... 600 మార్కుకి 590 మార్కులే. అంతేకాదు, సూర్య నారాయణ తండ్రి అంటే నాను (గర్వంగా) బండి తోుకుంటూ బతికే ఓ సామాన్య కుటుంబీకుడు అవటం విశేషం ` ఇన్నావా ఈ రాముడు పేరు గూడా పేపర్లో ఏసారే ఆడు నా కొడుకే మరి.

9
తుసి:` (బుగ్గ నొక్కుతూ) నీ కొక్కడికేనేటి? నాక్కూడా కొడుకే... మా అయ్యే!  ఒరే సూరిగా ఈ పేపరు జాగ్రత్త... లోపలికెళ్లు (తదేకంగా తనకొడుక్కేసి చూస్తుంది)
రాముడు:` అట్టా సూత్తావేటి ఎర్రిమొగమా? దిష్టి నీళ్లు తీసుకురా! దిష్టి తీయా (దిష్టి తీస్తారు) (పూజారి ప్రవేశం) సామీ ఇదంతా నీ దయే సామీ...(పేపరు చేతిలో ఉంటుంది)
పూజారి గారు దండాు బాబూ...తమకు నిండా నూరేళ్లు బాబూ! నానే తమకాడికి ఎళ్లిపోవచ్చేద్దామనుకున్నాను తమరే వచ్చారు పూజారి గారూ. మా సూరిగాడు పస్టు క్లాసులో పాసయ్యాడు బాబూ... మన జిల్లాకే గాదు రాష్ట్రం మొత్తానికే ఫస్టు బాబూ...ఉండండి పేపరు సూపిత్తా నుండండి బాబు...
పూజారి:` ఒరేయ్‌ చూశానురా! చాలా సంతోషంగా ఉంది. భగవంతున్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడురా... నష్టపోడురా...
తుసి:` ఓరయ్యా.. పూజారి గారి కాళ్లకు మొక్కరా ఆశీర్వదిస్తాడు.
సూరి:` మాతృదేవోభవ (తల్లి కాళ్ళకు ముందుగా దణ్ణం పెడతాడు. తరువాత తండ్రి కాళ్ళకు దణ్ణం పెట్టి ఆఖరుగా పూజారిగారికి దణ్ణం పెడతాడు) పితృదేవోభవ ఆచార్య దేవోభవ....
10.
విద్యాభివృద్ధిరస్తు ` ఒరేయ్‌ రాముడు నీ కొడుకు చాలా తెలివైనవాడురా ` మంచి అభివృద్ధిలోకి వస్తాడు. ముందు తల్లి పాదాకు నమస్కరించి తరువాత తండ్రికి నమస్కరించి ఆతరువాత గురువైన నాకు నమస్కారం పెట్టాడురా... అదిరా చదువుకుంటే వచ్చే జ్ఞానం, సంస్కారమూనూ..
రాముడు:` తుసి... వాన్ని లోపలికి తీసుకువెళ్లు... (వెళ్లిపోతారు రాముడు బ్ల తీసుకువచ్చి పూజారయ్యకు వేసి తాను కింద కూర్చుంటాడు. కూర్చోండి పూజారయ్య గారు... పూజారయ్యగారు ఇపుడేటి సేయమంటారు?..
పూజారి:` ఏ విషయంలోరా?...
రాముడు:` మా సూరిగాడి సదువు విషయంలో బాబో...పై సదువు ఏటి సదివిస్తే బాగుంటుందో తమరు సెప్పండి బాబు... మీరేది సెప్తే అది సేత్తాను.
పూజారి:` బాగా ఆలోచిస్తే సూరిగాన్ని ఐటిఐలో చేర్పిస్తే మంచిది.
రాముడు:` అంటే టర్నరు... ఫిట్టరు... ఎ్డరు... అంటారు అవేనా బాబూ...(తుసి దిష్టి తీసి బయటకు తెచ్చి పెరట్లో పోస్తుంది)
పూజారి:` ఆ... వాటినే వృత్తి విద్యా కోర్సుంటారు....
11
రాముడు:` అబ్బే అట్టాంటి సదువు కాదు బాబూ... గొప్ప సదువు సదివించానుకుంటున్నా...
తుసి:` అవును బాబూ గొప్ప సదువు సదవా...
పూజారి:` చదవచ్చు... వాడు బాగా చదువుతాడు గూడాను... కాని ఫలితం ఏమిటి?..
రాముడు:` గొప్ప ఉద్యోగం జేత్తాడు బాబూ...
తుసి:` బోలెడంత డబ్బు సంపాదిత్తాడు బాబూ...
రాముడు:` కార్లు కొంతాడు.
తుసి:` డాబాు కడతాడు... అద్దం లాంటి గచ్చు వేయిస్తాడు.
రాముడు:` పూజారయ్యగారూ.. మీ గుడినికూడా బాగుసేయిత్తాడు బాబు (పూజారి నవ్వాడు)
పూజారి:` మర్మం లేని మీ మాటు వింటుంటే ` సగటు మనిషి తన ప్లి భవిష్యత్తు గురించి ఎంత ఆశ పెట్టుకుంటారో ఇప్పుడర్థమవుతుందిరా...
రాముడు:` అలా ఆశపడటం తప్పంటారా బాబు గారూ?...
పూజారి:` తప్పననురా... ఆశ లేకపోతే మనిషి బ్రతకడం అసాధ్యంరా... జీవితంలో ఆశనేది ఉండి తీరాలి...రేపటి గురించి తీయటి కు కనాలి. కాదనను... వర్తమానంలో ఉండి భవిష్యత్తు గురించి ఆలోచించాలిగానీ... భవిష్యత్తు గురించి అతిగా ఆశ పెట్టుకోకూడదురా ` ఆలోచించకూడదు...అలా ఆలోచిస్తే అది అత్యాశే అవుతుంది... అది అనర్థాకి తావుతీస్తుంది.
రాముడు:` మీ మాటు...
12
పూజారి:` లోతు నీకర్థం కావట్లేదు కదూ?... నా ఉద్దేశం ఏమిటంటే... గొప్పగొప్ప సదువు సదివించే ఆర్థిక స్థోమత నీకు లేదంటాను...
తుసి:` నిజమే బాబూ... ఆ మాట నానూ సెప్పాను... కాని మామావే ఇనిపించుకోవట్లేదు..
రాముడు:` ఒసేయ్‌ పెద్దతో మాట్లాడేటపుడు నువ్వు మధ్యలో రాకు... పో.. లోపలికి పో...
పూజారి:` ఒరేయ్‌ రాముడు.. కొడుకు భవిష్యత్తు ఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రులిద్దరికీ ఉంటుందిరా ` ఉండాలి కూడానూ...
రాముడు:` నిజమే బాబూ... రేపటి గురించి ఈ రోజు ఆలోచించుకుంటే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది. బాబూ నా కో చిన్న సందేహం.. మీరెన్నో ఏళ్లుగా దేవున్ని పూజిస్తున్నారు కదా! దేనికోసం బాబూ?....
పూజారి:` ఇహలోకంలో సుఖం ` మరలోకంలో మోక్షం వస్తుందని...
రాముడు:` (వెంటనే...) అది నమ్మకమేగా... లేక ఖచ్చితంగా చెప్పగరా?...
పూజారి:` నిజమే ఓరకంగా నమ్మకమే ` కాని నా ఆలోచనలో ఓ తృప్తి ఉంది. నీ ఆలోచన దురాశే అవుతుందిరా...
రాముడు: ఏ ఎందుకని బాబూ...
పూజారి:` ఒరేయ్‌ రాముడూ నీ కెలా చెప్పాలో అర్థం కావటం లేదు. (ఆలోచించి) పదివే రూపాయు
13
పెట్టి ఒక గేదెను కొన్నావనుకో ` ఆ గేదె రోజుకు ఒక లీటరు పాలే ఇచ్చిందనుకో ` లాభమా? నష్టమా?
తుసి:` పదిమే పెట్టి గేదెను కొంటే లీటరు పాలిస్తే నష్టమే గద బాబూ..
రాముడు
రాముడు:` ఆ అంతే గదా!
పూజారి:` కదా! చాలా బాగా చెప్పారు. ఓ క్ష రూపాయు ఖర్చు పెట్టి నీ కొడుకును చదివించారనుకో ఉద్యోగం రాలేదనుకో ` లాభమా? నష్టమా?
తుసి:` నష్టమే!
రాముడు: అంత డబ్బు ఖర్చుపెట్టి చదువుకుంటే నష్టమొస్తుందా? మరి నష్టమొచ్చే చదువులెందుకు బాబూ? అందరూ సదువుకుంటారు?
పూజారి:` నష్టం మనలాంటి వాళ్లకేరా? డబ్బున్న వాళ్లక్కాదు. వాళ్ల ప్లిు చదువుకుంటే నష్టం రాదు.
రాముడు:` మీ మాటు మరీ ఇసిత్రంగా ఉన్నయ్‌ బాబూ. లాభనష్టాు అందరికీ సమానమే బాబూ. డబ్బు గలోడు సదువుకుంటే నాభమా? డబ్బులేనోడు సదువుకుంటే నష్టమెలావస్తుంది బాబు?
పూజారి:`ఎలా వస్తుందంటే ` డబ్బున్నోళ్ల ప్లిు సదువుకుంటే ంచం ఇస్తే ఉద్యోగం వస్తుంది. పెళ్లి చేస్తే కట్న మొస్తుంది. నువ్వు ంచమిచ్చి ఉద్యోగం కొనలేవు. పెళ్లిజేస్తే నీ కొడుకుకు క్ష రూపాయ కట్నం రాదు. మరి నువ్వు పెట్టిన పెట్టుబడికి నష్టమేగా వస్తుంది.
(సంచీ పట్టుకుని వెళ్లబోతాడు)
14
తుసి:` పూజారయ్య చెప్పిన మాటల్లో నిజముంది మామా...
రాముడు:` నువ్వు నోరుముయ్యే ` పూజారయ్యగారు మరీ భవిష్యత్తు గురించి నాకు భయంకరంగా చెబుతున్నారు. ఏది ఏమైనా నా కొరిడుకును మాత్రం సదివించి తీరుతాను. ఇన్నాళ్ళు మీరు చెప్పినవన్నీ యిన్నాను. ఇదొక్క విషయంలో నేను వినను. వినలేను బాబు..
పూజారి:` సరే! ప్రజ్వరిల్లిపోతున్న భవిష్యత్తుమీద నీకున్న ఆశ ఆశయం అనే గుఱ్ఱానికి నేను సంకెళ్లు వేయలేనురా నిన్ను భగవంతుడు ఆశీర్వదించాని మన:స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంటర్మీడియెట్‌లో ఎం.పి.సి. గ్రూపులో చేర్పించరా?.. ఇంతకీ వాడేమంటాడో కనుక్కో
తుసి:` సూరి! నాయనా సూరి (పిలిపింది సూరి వచ్చాడు)
పూజారి:` నాయనా సూరి! నువ్వేం చదవానుకుంటున్నావ్‌?
సూరి:` నాన్న చదివించగలిగితే ఇంజనీరింగ్‌ చదవానుకుంటున్నాను గురువుగారు.
రాముడు:` సదివించగలిగితే అనకురా! నువ్వు సదవగలిగితే నాను సదివిస్తాను.
సూరి:` సరే! చదువుతా నాన్నా!
పూజారి:` మరింకేం శుభస్య శీఘ్రం. అలాగే కానివ్వండి. ఓ 30 మే దగ్గర పెట్టుకోండి. వెల్లి అప్లికేషన్‌ తెచ్చుకోరా నే వస్తాను. (పూజారి వెళ్లిపోయాడు. సూరి గాడు కూడా` రాముడు అప్లికేషన్‌కు డబ్బులిస్తాడు.)
15
తుసి:` ముప్పైమే యాన్నుంచి తెస్తావ్‌ మావా?
రాముడు:` (తుసి చెంపను నిమిరి దుద్దు చూస్తాడు) మనసుండాలేగాని మార్గం దొరక్కపోదు. దుద్దు బాగా నీరట్టిపోయినయే.
తుసి:` అర్థమయింది మావా? ఈ రెండు దుద్దుమ్మితే ముప్పై మే రావుగా మావా?..
రాముడు:` నాకు తెలియదేటి? మనిషికి బంగారం వ్ల అందం రాదే! అయినా తుసి బంగారం లాంటి నీకు బంగారం ఎందుకే దుద్దు తీసేసినా నీ మొకంలో అందం ఏ మాత్రం తగ్గలేదే. చందమామలాంటి నీ మొకానికి మచ్చలాగ ఆ ముక్కుపుడక ఎందుకే?
తుసి:` (నవ్వి) అర్థమైంది మావా (తుసి లోపలికి వెళ్లబోతుంది)
రాముడు:` ఆగు తుసి ఎద్దు మువ్వ సప్పుడైనట్టుందే.
తుసి:`ఎద్దు సప్పుడు కాదు మావా అది. నా కడియాకున్న మువ్వ సప్పుడు.
రాముడు:` అంత మోత మోగే ఆ కడియాలెందుకే నీకు?
తుసి:` (మువ్వు తీసిస్తుంది) కానీ కడియాు మాత్రం రావు మావా?
రాముడు:` ఏం ఫరవాలేదే నేం దీత్తాగా! (పుపుతాడును మంచం కోడుకు కట్టి రెండో పక్క లాగుతాడు. కడియాు విడిపోయాయి. తుసి ఏడ్చింది)
యాడవకే తుసి సూరిగాడు సదువుకుని ఉద్యోగం సేత్తే ఈ ఎండి కడియాలేంటే బంగారు  కడియాల్జేయిత్తాడే (అని కౌగిలించుకుంటాడు. తుసి మంగళసూత్రాు గుచ్చుకుంటాయి)
16
తుసి:` మావా ఇది మాత్రం అడక్కు మావా...
లైట్స్‌ ఆఫ్‌...
(సూరిగాడు కాలేజికి బయుదేరుతున్నాడు. తుసి వెనకాలే వచ్చి క్యారేజి ఇస్తుంది. సూరిగాడు బయటికెళ్లి మళ్లీ లోపలికొస్తాడు)
సూరి:` అమ్మా
తుసి:` ఏంట్రా?
సూరి:` ఏం లేదమ్మా...
తుసి:` ఏం లేకపోతే కాలేజికి వెళ్లు. ఏవన్నా ఉంటే సెప్పు...
సూరి:` అమ్మా అమ్మా నాకో సైకిల్‌ కొనవే....
తుసి:` నువ్విలా అ్లరి పెడితే మావ్ల కాదురా...
రాముడు:` (బయటి నుండి లోపలికి వస్తూ) ఏట ఏటయినాది?....ఏవంటున్నాడు మన కాలేజి దొరబాబు?..
తుసి:` దొరే! దొరబాబే.... అందుకే కాలేజి నడిచ్లెలేడంటా... ఈ కాలేజి సదువులొద్దయ్యా అంటే విన్నావు కావు. ఇప్పుడు సూడు వాడేమంటన్నాడో?....
రాముడు:` సూటిగా ఏదీ సెప్పవు కదా... ఏటైందో సెప్పవే...
తుసి:` ఏటో నానెందుకు సెప్పటం... సూరిగాన్నే అడుగు...
రాముడు:` ఏట్రా సూరి?.. ఏటి సంగతి?...
సూరి:` ఏం లేదు నాన్నా... మనింటి కాడ్నుంచి కాలేజి 5 కిలోమీటర్లు దూరం ఉంది నాన్నా... అక్కడికి నడిచి వెళ్లడం కష్టంగా ఉంది నాన్నా....ప్రెసిడెంట్‌ గారబ్బాయిని చూడు... హాయిగా స్కూటర్‌ మీద వస్తాడు. అందుకే నాన్నా నాకో సైకిు కొనిపెట్టు నాన్నా... ప్లీజ్‌ నాన్నా.. (రాముడు సూరిగాని వంక చూసి...)
17
రాముడు:` పాత సైకిల్‌ కొనుక్కోవాల్సిన కర్మ నీకేంటిరా?.. ఈ పూటకి నువ్వు కాలేజికి నడిచెళ్లు.. కొత్తదే కొంటాను సైకిల్‌...
సూరి:` మా నాన్న మంచోడు... థాంక్యూ నాన్నా... అమ్మా నాన్న కొత్త సైకిల్‌ కొనిపెడతానన్నాడు. రేపట్నుంచి కాలేజికి కొత్త సైకిల్‌ మీద రయ్యంటూ వెళ్లిపోతాను. (సూరిగాడు వెళ్లిపోయాడు)
తుసి:` అవునయ్యా... ఆడికి కొత్త సైకిల్‌ కొనిపెడతానని ఆశ పెట్టావ్‌ ` ఎట్టా కొంటావ్‌...నీ కాడ డబ్బులెక్కడివి?..
రాముడు:` నా దగ్గర డబ్బుల్లేని మాట నిజమే! మన కష్టాు ప్లికు తెలియనీయకూడదే! తెలిస్తే ఆ్ల మనసు బాధ పడుతుంది. ఆడితోపాటు సదువుకునే పెసిడెంట్‌ గారబ్బాయి స్కూటర్‌ మీదొతుంటే ఈడు ....పైగా పెసిడెంట్‌ గారి అబ్బాయికన్నా మనవాడికి మార్కులెక్కువగా వచ్చాయి. ఆడి కోరిక న్యాయం అయ్యింది. వాడేమన్నా స్కూటర్‌ కొనమాన్నాడా? సైకిు కొనియ్యమన్నాడు...అది కూడా పాతది!
తుసి:` అవునయ్యా .. వాడేమీ ఆకాసం వంక సూసి నడవట్లేదు. నేమీదే నడుస్తున్నాడు. ఆడి కోరిక సిన్నదే కావచ్చు ` కాని మనం తీర్చలేం కదా ` సైకిల్‌ కొనడానికి ` నా దగ్గర అమ్మడానికి ఏమున్నాయయ్యా పుస్తొ తప్ప...
రాముడు:` నీ ఒంటిమీదున్న బంగారం వెడి వస్తువు మిగ్చపోయినందుకు బాధ పడకు ` అమ్మటానికి నీ ఒంటి మీద ఏమీ లేకపోయినా ఎడ్లున్నయే....
తుసి:` మావా ` మా అయ్య నాకేటి ఆస్తి ఇవ్వలేదు. మీ అయ్య నీకూ ఆస్తి ఇవ్వలేదు. మనకున్న ఆస్తల్లా ఆ యెడ్లే కదా...
18
మనమెలాగయ్యా బతికేది?
రాముడు:` మన బతుకుకోసం సూరిగాడి భవిషత్తు నాశనం చేయకూడదే. ఒక ఎద్దు నమ్ముతానే తుసీ సగం డబ్బు పెట్టి దున్నను కొంటాను. మిగతా డబ్బుతో సైకిు కొంటాను. కాలేజి ఫీజు కట్టేస్తాను. ఎద్దును, దున్నను బండి కట్టి డబ్బును సంపాదిత్తాను.సూరిగాడు ఉద్యోగం సేత్తే టాక్టరు కొనుక్కోవచ్చే.
(సూరిగాడు ప్రవేశం)
సూరి:` అమ్మా! అమ్మా! నాకు గుండెల్లో నెప్పిగా ఉందమ్మా..
తుసి:`రాముడు: ` ఏటయ్యా గుండెలో నెప్పిగా ఉందా! ఇట్టరారయ్యా... ఇట్టారా! (మ,చం మీద పడుకోబెట్టింది)
తుసి:` మావా! అట్టా సూత్తా నిబడ్డావేటి మావా? ఓ పారి పూజారయ్యగారిని పిుచుకురా! ఎళ్ళు మావా ` బేగెళ్లుమావా... (రాముడు వెళతాడు)
సూరి:` (బాధపడుతూ) అమ్మా ఊపిరి... అమ్మా... అమ్మా ఊపిరాడటం లేదమ్మా అమ్మా గుండెల్లో నెప్పిగా ఉందమ్మా...
తుసి:` ఓమ్మో ఓమ్మో బిడ్డ నరకయాతన పడిపోతన్నాడు. నేనేటి సేతునురయ్యో నానేటి సేతును తల్లీ అమ్మా దుర్గమ్మ తల్లీ నా బిడ్డను కాపాడు తల్లీ. పొర్లి దండాు పెడతాను తల్లి నీకు మొక్కు తీర్చుకుంటాను తల్లి మాట తప్పను తల్లి . ఈ గండం నుంచి నా కొడుకును కాపాడు తల్లి.్ర
సూరి:` అమ్మా ! అమ్మా ! అబ్బా అమ్మా ఇక్కడ ... ఇక్కడ... చేత్తో రాయమ్మా.. (తుసి గుండెమీద రాస్తుంది. పూజారి గారు వచ్చి సూరిగాడ్ని పరీక్ష చేస్తాడు)
రాముడు:` పూజారయ్యగారూ గట్టి మందులివ్వండిబాబూ
పూజారి:` రాముడు ఇది నా వైద్యానికి తగ్గే జబ్బు కాదురా! పట్నం తీసుకెళ్ళి పెద్దాసుపత్రిలో చూపించు. ఇదిగో ప్రస్తుతానికి ఈ డబ్బుంచు. దారి ఖర్చుకు
19
రాముడు:` (పూజారిగారికి దండం పెట్టి ` డబ్బు చూసుకుని.. బాబూ)
పూజారి:` (రాముడి భుజం తట్టి....) త్వరగా వెళ్ళండి.
లైట్స్‌ ఆఫ్‌
(తుసి కొడుకు సూరికి అన్నం పెడుతూ ఉంటుంది)
(ఇంతలో కానిస్టేబుల్‌ ప్రవేశం)
కానిస్టేబుల్‌:` ఇక్కడ సూరిగాడెవడూ?
తుసి:` (కానిస్టేబుల్‌ వైపు చూసి...) ఎందుకు బాబూ?.. (అని లేచి నుంచుని వణికిపోతూ...) కొడుకుని చూపిస్తుంది)
కానిస్టేబుల్‌:` (సూరిగాడి చేయి పట్టుకుని) పదరా.
సూరి:` (చేయి వదిలించుకుని, అమ్మను కౌగిలించుకుని) అమ్మా! (అరిచాడు)
తుసి:` బాబు ఎందుకు బాబు సూరిగాడ్ని తీసుకెళుతున్నావు?
కానిస్టేబుల్‌:` ఆడికి పెళ్ళి సేద్దామని రారా
తుసి:` ఆడు సేసిన తప్పేంటిబాబూ?  ఆడెలాంటి తప్పు సేయడు బాబు
కానిస్టేబుల్‌:` ఈడు తప్పెందుకు సేత్తడు. సేయడు (సూరిగాడు భయపడి ఏడుస్తాడు)
తుసి:` మరెందుక ఆడ్ని తీసుకెళ్తన్నారు?
కానిస్టేబుల్‌:` నోర్ముయ్‌! ఏటే తెగరెచ్చి పోతున్నావ్‌... నానెవర్ని?.. పోలీసోన్ని... నాకు కోపమొచ్చి,దంటే మాటల్తో సెప్పను.. లాటీతో సెప్తాను. (అని సూరిగాని చేయి పట్టుకొని లాఠి పైకెత్తాడు. సూరిగాడు ఏడుస్తూ కిందపడ్డాడు. తుసి పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకును కౌగిలించుకుంటుంది. ఏటే సెంటిమెంటా? అవి మాకుండవ్‌ జాలి, కరుణ, ప్రేమ, కళ్ళలో నీళ్లు అవి మాకుండవ్‌ ` ఉంటే ఆడు పోలీసోడు కాలేడు...లే... లే నీయవ్వా నా లాఠీ నీ ఒంటిమీద
భరతనాట్యం చేసిందనుకో ` నీ రైక చినుగుద్ది..
20
తుసి:` మీరేమైనా సేయండి బాబూ.... ఆన్నెందుకు పట్టుకెళ్తున్నారో సెప్పండి బాబూ....
కానిస్టేబుల్‌:` ఏటే ఓ నోరు బాగా లెగుస్తుంది. రెచ్చి పోతున్నావేటి? నాను మీ ఇంటికొచ్చానని రెచ్చిపోతున్నావా? ఎంతైనా ఇంటికొస్తే మీర్రెచ్చిపోతారు. మీరు పోలీస్‌స్టేషనుకొస్తే మేం రెచ్చిపోతం. మీ ఇంటికొచ్చినపుడు అమ్మా అయ్యా అంటాం.. పోలీస్‌ టౌన్‌లో నీ యమ్మ నీ యాలి వెదవ... వెదవనం....ఛీ ఛీ ఎంతైనా మీ ఇు్ల కదా తిట్టన్లే... ఇక్కడ తిట్టకూడదు రూల్స్‌ ఒప్పుకోవ్‌... వద్దులే ఆ తిట్లన్ని మీరు నేర్సుకుంటారు. మా భాష ` పామిణ్యం తగ్గిపోద్ది. ఇంతకీ అన్ని ఒదవ్‌ ఆడేం సేసాడో సెప్పమంటవ్‌? అదే నీ పాయింట్‌ సెప్తా ఇనుకో! నువ్‌ బుద్ధిమంతుడనుకుంటున్న నీ కొడుకు ` పెసిడెంట్‌గారబ్బాయి ` ఆడిపేరేంట్రా
సూరి:` శేఖర్‌
కానిస్టేబుల్‌:` ఆ శేఖర్‌ ఆడినేం చేసావో నువ్వే జెప్పరా?
సూరి:` నేనేం జేయలేదు.
కానిస్టేబుల్‌:` నువ్వేం జేశావ్‌.. నువ్వేం జేయలేవ్‌ కత్తి ఆడి పీకమీద పెట్టావ్‌... అదే వాడి పీక నరికింది.
కానిస్టేబుల్‌:` ఇప్పుడేటి సేయమంటావ్‌ సెప్పవే కత్తి ఆడిపీక నరికిందని కత్తిని అరెస్ట్‌ చేయమంటావా? కత్తి ఈడి సేతిలో ఉంది కాబట్టి ఈడ్ని అరెస్ట్‌ సేయమంటావా? ఏటి సేయమంటావో నువ్వే సెప్పు... ఇదేనే లా పాయింటు...లే అడ్డులే అని సూరిగాడ్ని పట్టుకోబోయాడు.. సూరిగాడు
21
(దొరక్కుండ లోపలికెళ్ళిపోయాడు... సూరిగాన్ని పట్టుకోవడానికి కానిస్టేబుల్‌ వెళుతుంటే తుసి కానిస్టేబుల్‌ కాళ్లు పట్టుకుంది. కానిస్టేబుల్‌ పడబోయాడు)
కానిస్టేబుల్‌:` నీ యవ్వ ఒదులే...కిందపడి సచ్చేవోన్ని.. సూడబోతే నువ్వు నన్ను మడ్డర్‌ సేసేట్టున్నవు.
తుసి:` ఏటి బాబు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోనాది. నా కొడుకు అట్టాంటోడు కాదు బాబు.
కానిస్టేబుల్‌:` ఆడు మడ్డర్‌ సేయకపోవడం నువ్వు సూసావా? పోనీ నేను సూసానా? మనమెవ్వరం సూల్లేదు. అయిన బమైన ఎవిడెన్సుంది. అందుకే అన్ని అట్టుకెళ్తున్నా. ఏయ్‌ సూరిగా బయటికి రారా నా కొడకా! ఏవే ఆడ్ని పట్టుకోవడాన్కి ఇంట్లోకెళ్ళాననుకో ఏ తుపు సాటునో నిబడి కసుక్కుమని కత్తితో నన్ను చంపుతాడు. నానెల్తానేటి? నాన్లెను ` ర్సూు ఒప్పుకోవు ` నువ్వెళ్లి పట్రాయే.
రాముడు:` (రాముడు సూరిగాన్ని భుజం మీద చేయి వేసుకుని ఇంట్లోంచి వస్తున్నాడు)
తుసి:` మావా! సూడు మావా! సూరిగాడు ...సూరిగాడూ... పెసిడెంట్‌ గారబ్బాయిని సంపాడని ఈ పోలీసాయన అంటున్నాడు. ఇదుగో మా కెవరూ అండలేరనుకుంతున్నావా? మా మావ... ఆడు కర్ర పట్టాడనుకో (పైట చెంగు బిగించి)  నీ కర్ర బద్దయిపోద్ది రా! ఇప్పుడు రెస్టు చెయ్‌ (అంటూ రాముడి పక్కకెళ్ళి పోయింది) రాముడి కుడిచేయి సూరిగాడి మీదుంది ఎడమచేయి తుసి మీదుంది. ఇద్దర్నీ నడిపించుకుంటూ ముందుకొచ్చాడు. సూరిగాన్ని ఎగాదిగా చూసి, ఒకసారి తుసి వైపు కూడా చూసి సూరిగాడ్ని పోలీసువైపు తోసాడు. పోలీసోడు సూరిగాన్ని పట్టుకున్నాడు.
కానిస్టేబుల్‌:` సెబ్బాస్‌! నిజాయితీ అంట ఇది కలియుగంలో కూడా ఇలాంటి సత్యహరిచ్చంద్రుంటారని నీ మొగుడు ఋజువు చేసాడే! ఈ భారతదేశ చరిత్రలో నా కొడుకు నేరం చేసాడు. వాడిని అరెస్టుచేయండీ అంటూ పోలీస్‌ స్టేషన్‌కొచ్చి కంప్లైంటిచ్చిన ఏకైకై వ్యక్తే నీ మొగుడు.
22
తుసి:` భుజం మీదున్న రాముడి చెయ్‌ తీసేసి ఆశ్చర్యంగా నువ్వు రిపోర్టిచ్చావా మావా?
కానిస్టేబుల్‌:` ఇవ్వటమే కాదే మరో మహత్తరమైన ఘనకార్యం చేసాడు. ఏమిటో తెల్సా?  పారిపోతున్న నీ కొడుకును ఈ పోలీసోడికి అప్పజెప్పాడే. హాట్సప్‌ హరిశ్చంద్ర! వందనం ధర్మరాజా! నీ లాంటొళ్ళు ఈ దేశంలో పెరిగిపోతే పోలీసు అవసరం ఉండదు. మా రిక్రూట్‌మెంట్‌ుండవు. అమ్మో! యువర్‌ వెరీ డేంచరస్‌. పదరా శిబిచక్రవర్తి కొడకా! (సూరిగాన్ని లాక్కెళుతున్నాడు)
సూరి:` అమ్మా! నేనా హత్య చేయలేదమ్మా! నాన్న అబద్దం చెబుతున్నాడమ్మా! నాన్న మాటు నమ్మొద్దమ్మా(పోలీసు సూరిగాన్ని తీసుకెళ్ళి పోతాడు)
తుసి:` నాయనా సూరి! సూరీ ` మడి సన్యాసం చేస్తే భగవంతుడితో సెప్పుకుంటాం. భగవంతుడే అన్యాయం సేత్తే ఎవడితే సెప్పుకోవాలి. (ఏడుస్తుంది). ఈ పెపంచకంలో ఎన్నో ఇంతు సూసాం కానీ ` కన్న తండ్రే చేయని నేరాన్ని చేసినట్టు సెబుతున్న సిత్రం ఇక్కడే ఇప్పుడే జరిగిపోయింది. మావా నువ్వు మడిసివా? మృగానివా? ఇన్నాళ్లు ఈ మృగంతోనా నేను కాపురం చేసింది. తప్పు ` మృగం తన ప్లిల్ని తను సంపుకోదు. నువ్వు మృగానికన్నా హీనుడవి మావా! (రాముడు నవ్వుతున్నాడు) నవ్వుతున్నావా తల్లి హృదయం కడుపుతీపితో త్లడిల్లిపోతుంటే తండ్రిగా నువ్వు నవ్వుతున్నావా మావా! మావా నిజం చెప్పు! సెప్పుమావా! సూరిగాడు ఈ హత్య చేయలేదు కదూ
23
రాముడు: చేశాడు! సూరిగాడే ఈ హత్య చేశాడు.
తుసి:` (కళ్ళు పెద్దవి చేసి...భయంకరంగా అరిచింది)
మావా.. నువ్వు మడిసివికాదు... నరరూపరాక్షసుడివి...కాదు కాదు.. అంతకన్నా నీచుడివి.
(పూజారయ్య ఆతృతగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. తుసి పూజారయ్యను చూసి పరగున వచ్చి ఆయన కాళ్ళమీద పడిరది.) అయ్యా పూజారయ్యగారూ! నా కొడుకు సూరిగాన్ని రక్షించండి బాబు...
పూజారి:` తుసీ లే... లేలే ..అసలేం జరిగింది?
తుసి:` ఏటి జరిగిందో నాకేం తొసు బాబూ ` మీరు నమ్ముకునే దేవుడిమీద ప్రమాణం చేసి చెప్పండి? నా సూరిగాడు హంతకుడా బాబూ?
పూజారి:` ఆ మాట ఎవరన్నారే?
తుసి:` ఎవరో కాదు బాబు.. సూరిగాన్ని కన్న తండ్రే అన్నాడు.
పూజారి:` ఏంటి రాముడన్నాడా?...
రాముడు:` తమరు....కూర్చోండి బాబూ (చుట్ట తీసి క్చాుకుంటాడు)
పూజారి:` ఇది స్థిమితంగా కూర్చునే సమయమట్రా?... పైగా చుట్టకాుస్తున్నావా?... ఇది చుట్ట కాల్చే సమయమా త్రాష్టుడా?....
రాముడు:` ఏటి సేయమంటారండీ?.... వాడు హత్య చేసిన మాట నిజం...
పూజారి:` నీచుడా! ఆ మాటనడానికి నాలికెట్టా వచిచందిరా? అది నాలికా తాటిమట్టా?.... వారం రోజునుంచి మంచం మీద పడుకున్న నీ కొడుకును ఈ హత్య చేసాడంటే ఊళ్ళో ఎవరూ అంగీకరించట్లేదురా! అలాంటిది కన్న తండ్రివి నువ్వు. వాడు హంతకుడంటావా?
రాముడు:` అవును బాబు... ఆ పెసిడెంటుగారబ్బాయి శేఖర్‌ని నా కొడుకు సూరిగాడు సంపడం నేను కళ్ళారా  సూసానుబాబూ...
24
పూజారి:` ఒరే రాముడు నువ్వు మాట్లాడుతున్న మాట్లేనా ఇవి నీకేదో గాలిదయ్యం సోకిందిరా! ఒరేయ్‌ ఇద్దరు ప్లిు కొట్టుకుంటున్నప్పుడు ఓడిపోయినవాడు. ఏమంటాడో తొసా ఉండు. మా నాన్నకు చెబుతాను అంటాడు. ఎందుకో తొసా ` తనతండ్రి తనకు రక్షణ కల్పించి కాపాడతాడు అని నమ్ముతాడు కనుక ` కానీ తాను చేయని నేరానికి దండిరచిన తండ్రి గురించి ఆ కొడుకేమంటాడో తొసా? ` వీడి కడుపున ఎందుకు పుట్టానని బాధ పడతాడు. ఒరేయ్‌ మనకు పుట్టిన ప్లిు మన కడుపున పుట్టినందుకు గర్వపడాలేకాని బాధ పడకూడదు. నువ్వు చేసిన ఈ దుర్మార్గపు పనికి తండ్రిస్థానాన్ని కోల్పోయావురా (రాముడు నవ్వుతాడు)
తుసి:` ఇందాకట్నుంచి ఆడు అట్టాగే నవ్వుతున్నాడు బాబూ ఇది నవ్వాల్సిన సమయమా బాబూ?....
పూజారి:` తుసి `తల్లిగా నీ హృదయమేమిటో తొసు కానీ తండ్రిగా వీడి హృదయమేమిటో తెలియటం లేదు. ఒరేయ్‌ రామడు నువ్వెందుకు చెప్పావో వేమిటోగానీ ` నువ్వు అబద్దం మాత్రం చెప్పావో ఏమిటో గాని ` నువ్వు పోలీస్టేషన్‌కెళ్ళి నీ కొడుకు హత్య చేయలేదన్న నిజాన్ని నువ్వు చెప్పి తీరాలి. వెళ్లు వెళ్లురా ఇంతకంటే నేనేం చెప్పగనమ్మా వాడికి?.. నేను అశక్తుడను. (పూజారయ్య వెళ్లిపోతాడు... రాముడు పొగాకుతో చుట్ట చుట్టుకుంటున్నాడు. తుసి హృదయ విదారకంగా ఏడుస్తుంది.)
తుసి:` నా కొడుకు సూరిగాడ్ని పొలీసులేమి చేస్తున్నారో...ఆడికసలే ఒంట్లో బాగోలేదు. ఆడిపుడు ఎట్టా ఉన్నాడో దేవుడా...దేవుడా ( రాముడు అగ్గిపెట్టె తీస్తాడు. చుట్ట వెలిగించుకుందామని ` అందులో ప్లుండవు. అగ్గిపెట్టె విసిరేస్తాడు) బువ్వేమైనా తిన్నాడో లేదో ` అయ్యా సూరిగా నువ్వు మా కడుపున పుట్టిన నేరానికి ఎన్ని కట్టాలొచ్చినయ్‌రా?...
25
రాముడు:` ఏయ్‌ ఏటా ఏడుపు?... సుట్ట వెలిగించుకోవాలిగాని.. ఎళ్లి అగ్గిపెట్టె పట్రా...
తుసి:` (కోపంతో కళ్లు ఎర్రచేసి) అగ్గిపెట్టె కావాలా? (తేవడానికి వెళుతూ... ఏదో ఆలోచించి ఆగి..) మావా నీకు సూరిగాడి మీద కోపమా ` నేకపోతే ఆడునీకు పుట్టలేదని అనుమానమా?..
రామడు:` తుసీ... హరిశ్చంద్రుడు అబద్దమాడాడని సెప్పు నమ్ముతా ` ధర్మరాజు అధర్మం చేసాడనాని చెప్పు నేను నమ్ముతా ` కానీ నా తుసి పతివత కాదంటే నాను మాత్రం నమ్మనే ` నువ్వు గంగానదిలా పవిత్రమైనదానివే ` నువ్వు ఆ భగవంతుడు నాకిచ్చిన వరప్రసాదానివే (అని కౌగలించుకోబోయాడు ` తుసి అతడ్ని విదిలించుకుని దూరంగా పోయింది)
తుసి:` వద్దు... నన్ను ముట్టుకోవద్దు... నీ వాడిన మాటు నిజమే అయితే ` మన సూరిగాడు ఆ హత్య చేయలేదని ఒక్కసారి సెప్పుమావా....
రాముడు:` ఆ మాట మాత్రం తండ్రిగా నేనలేను... సూరిగాడు హంతకుడు. ముమ్మాటికీ సూరిగాడు హంతకుడే ( నా మెదడులో నరాు చిట్లిపోతున్నాయి. కట్టుకున్న భార్య అసహ్యించుకుంటుంది. కన్న కొడుకు కఠినంగా మాట్లాడుతున్నాడు. గురువులాంటి పూజారయ్యగారు శపించి వెళ్ళిపోయారు. ఏమిటీ పరిస్థితి? ఎందుకు నేను ముద్దాయిగా నిబడుతున్నాను...ఏది ఏమైనా తండ్రిగా నా బాధ్యతను మాత్రం నేను నిర్వహిస్తాను.
(తుసి మంచం మీద పడుకుంది.. పూజారయ్యగారు ప్రవేశించారు)
26
పూజారి:` తుసీ! తుసీ! (పూజారి గారి మాటవిని తుసి మంచం మీదినుంచి లేసింది. పూజారి మంచం మీద కూర్చున్నాడు. తుసి కింద కూర్చుంది)
తుసి:` పూజారయ్యగారూ... మా సూరిగాడు ఎలా ఉన్నాడు...
పూజారి:` చేయని నేరానికి ` జైల్లో పెట్టిన సూరిడాగు ఎలా ఉన్నాడంటే ఏం చెప్పమంటావే ` తల్లి ఒడిలో నిద్దురపోవాల్సిన వయసులో కటిక నేమీద పడుకున్నాడు.
తుసి:` నేను వాడి పక్కలో పడుకుంటేనేగానీ ` వాడు నిద్దురపోయే కాదు ` దీపం ఆర్పేస్తానురా అంటే ` చీకటంటే నాకు భయమేవ అమ్మా అనేవాడు ` వాడిమీద నేను చేయి వేయందే నిద్దురపోయే వాడు కాదు ` అటువంటి నా కొడుకు చీకటిగదిలో ఎట్టా నిదురపోతున్నాడో ` అయ్యా పూజారయ్యగారు. ఇంతకీ మా సూరిగాడితో మాట్లాడారా లేదా బాబూ?
పూజారి:` మాట్లాడానే...
తుసి:` (సంతోషంగా..) ఏటన్నాడు బాబూ?..
పూజారి:` అమ్మను చూడాని ఉందన్నాడు.
తుసి:` బాబూ సూరీ..
పూజారి:`నాన్నను చంపానుందన్నాడు. ఆట పాటతో  కేరింతు కొట్టాల్సిన ఈ వయసులో
నాన్న మీద పగతీర్చుకోవాని ఆలోచిస్తున్నాడు.ఈ సృష్టిలో ఎక్కడా జరగని విచిత్రమైన సంఘటన ఇక్కడ జరుగుతుంది తుసీ! కొడుకు నేరస్థుడని అబద్ధం చెప్పి జైుకు పంపించాడు తండ్రి ` తండ్రిని ఎలా చంపాలో అని జైల్లో ఉన్న కొడుకు ఆలోచిస్తున్నడు కొడుకు ` దీని పర్యవసానం ఏమిటో?  ఇంతటి విషమ పరిస్థితిని సృష్టించిన ఆ సృష్టికర్తకే తెలియాలి. అసు రాముడులో ఇంతటి మార్పు ఎందుకొచ్చిందంటావ్‌ తుసీ?..
27
తుసి:` ఏమోనయ్యా! ఆడి ఊసే నా దగ్గర ఎత్తకండి (చిరాగ్గా)
పూజారి:` అదేంటే వాడు నిన్ను కట్టుకున్నవాడు కదా!
తుసి:` కాదు. ఎప్పుడైతే సూరిగాన్ని జైుకు పంపించాడో ఆనాటినుంచి వాడు నా భర్త కాదు బాబూ...
పూజారి:` రాముడూ... పేరుకు తగ్గట్టు శ్రీరామచంద్రుడనుకున్నాను. రామువారి పేరు పెట్టుకున్నందుకు ఉత్తర రామాయణంలో జరిగిన సన్నివేశం ఇక్కడ పునరావృతమవుతుంది. తండ్రి రాముడికి ` కొడుకు వకుశకు యుద్ధం జరిగింది. తిరిగి అదేవిధంగా ఈ తండ్రి రాముడికి ` కొడుకు సూరిగాడికి యుద్ధం జరుగుతోంది ` ఆ యుద్ధాన్ని సీత ఆపగలిగింది. ఈ యుద్ధాన్ని నువ్వే ఆపగగాలి తుసీ! నువ్వు ఒక్కసారి జైుకెళ్లి సూరిగాడితో మాట్లాడకూడదూ?..
తుసి:` వెళ్లలేను బాబూ! జైల్లో ఉన్న  నా కొడుకును చూడలేను బాబూ...వాడు పెద్ద పెద్ద సదువు సదివి గొప్పోడవుతాడనుకున్నానుగానీ ` చేయని నేరానికి ఇలా జైుపాలైపోతాడని అనుకోలేదు బాబూ ` పూజారయ్యగారూ ఆన్నెలాగైనా రచ్చించండి బాబు..
పూజారి:` రచ్చించానే ... లాయరు దగ్గరకెళ్లానే..
తుసి:` ఏటన్నారు బాబూ ఆళ్ళు?..
పూజారి:` కన్న తండ్రి సెప్పిన సాక్షాన్ని కోర్టు బంగా విశ్వసిస్తుందట.
తుసి:` తండ్రి సాక్షాన్ని నమ్మే కోర్టు ` తల్లి సాక్షాన్ని ఎందుకు నమ్మదు బాబూ?...
28
పూజారి:` నిజమేనే తుసీ! ఈ విషయం నేనూ ఆలోచించలేదు (నవ్వాడు) కొడుకు అపరాదని తండ్రి ` నిరపరాదని తల్లి ` ఇంతవరకు ఏ కోర్టులోనూ ఏ జడ్జీ ఈ విచిత్రమైన సన్నివేశాన్ని చూసి ఉండరు.
తుసి:` పూజారయ్యగారూ! ఈ యిసయంలో నాకు అండగా నిబడాలి ` నాకోసం కాదు బాబూ... మీ శిష్యుడు సూరిగాడి కోసం.
పూజారి:` నిబడతానే కానీ...
తుసి:` డబ్బుకోసం మీరేటి ఆలోచించకండి...(మెడలో మంగళ సూత్రాు తెంచబోయింది)
పూజారి :` వద్దు తుసీ దాన్ని తెంచకు...
తుసి:` ఏం బాబూ... మన భారతీయ సాంప్రదాయం ఒప్పుకోదా? మనువాడినవాడే బంధాన్ని తెంచుకుంటుంటే నేను మాత్రం ఈ బంధాన్ని తెంచుకోవడానికి ఎందుకు భయపడాలి బాబూ?..
పూజారి:` వద్దమ్మా! అంత పని మాత్రం చేయకు ` ఎగోలా ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తా! పదమ్మా లాయరు దగ్గరకెళదాం...(వెళుతూ ఉండగా రాముడొచ్చాడు)
రాముడు:` తుసీ! ఒసే తుసీ... పూజారయ్యగారూ... మీరు కూడా ఈన్నే ఉన్నారా... తుసీ పద హాస్పిటల్‌ కెళదాం...
తుసి:` ఒద్దు.. నువ్వేం మాట్లాడకు... నీ మాటవీ పట్టించుకోను... ఒద్దు... నీతో ఎక్కడికీ రాను.. వెళ్లిపో..పో పో వెళ్లిపో...
రాముడు:` అది కాదే....
తుసి:` ఒద్దు! నాతో మాట్లాడొద్దు... మనిషి జన్మ ఎత్తలా?... సిగ్గుండాయ్యా మడిసికి (గట్టిగా) నీ నీడ కూడా చూడడానికి కూడా నా కిట్టం లేదు. వెళ్లు... పూజారయ్యగారూ ` వాడినిక్కడ్నుంచి వెళ్లిపొమ్మనండి (ఆవేశంగా అరుస్తుంది)
29
పూజారి:` (ఆవేశంగా ఉన్న తుసి మాటు విని ` ఒక్క క్షణం మౌనం వహించి ` తుసిని సముదాయించి ` మెళ్లిగా రామున్ని చూసి వెళ్లిపొమ్మనన్నట్టుగా సైగచేసాడు చేతితో).
రాముడు:`(దిగ్భ్రాంతి చెందాడు) పూజారయ్యగారూ... మీరు కూడా నన్ను వెళ్లిపొమ్మంటున్నారా? నా తుసి ఎన్నెన్ని మాటందో విన్నారుగా! నాను మడిసినే కాదట! నాకు మనసే లేదంటా! పూజారయ్యగారూ మీరే సెప్పండి?.. నేను మనిషిని కానా? నాకు హృదయం లేదా? తుసి లేకుండా నేను బ్రతకలేను. అది నాకు దేవుడిచ్చిన వరప్రసాదం బాబూ (పూజారయ్య కాళ్ల మీద పడ్డాడు.)
పూజారి:` (రాముడు తన కాళ్ల మీద పడకుండా పక్కకు జరుగుతాడు) నీకు కన్నీళ్లు కూడా ఉన్నాయా? (వ్యంగ్యంగా ప్రశ్నించాడు)
రాముడు:` పూజారయ్య గారూ... మీరు.... మీరు.. ఇదేనా నన్నర్థం చేసుకున్నది?... నానూ మనిసినే బాబూ.. (కళ్ల నీళ్లు తుడుచుకున్నాడు) తుసీ! సూరిగాడెవడే... ఆడు నాకు కొడుకు... ఆడు మన కొడుకే... మన కొడుకు... ఆడి మీద ఎన్నెన్ని  ఆశు పెట్టుకున్నానో నీకు తొవదటే?.. పూజారయ్యగారూ... సూరిగాన్ని ఐటిఐలో జేర్పించరా అని మీరు సహా ఇస్తే...ఒద్దు బాబూ... ఆన్ని పెద్ద పెద్ద సదువు సదివించాన్న ఆశయంతో మీ మాట కాదన్నాను గానీ మీమీద గౌరవం లేక కాదు బాబూ... నేనూ, తుసి రూపాయుగా చిట్లైనా సరే ఆడ్ని పెద్ద పెద్ద సదువు సదివించానుకున్నా బాబూ... ఒసేయ్‌ తుసి! నేను తంతే పగిలిన కుండనే సూసావ్‌ గానీ ` సూరిగాడి మీద నేను పెంచుకున్న
30
కొండంత ఆశను చూడలేక పోయావే.... నాకు తెలిసినంతవరకూ ఆడ్ని జాగ్రత్తగానే సూసుకుంతున్నానే... పూజారయ్యగారూ నా సూరిగాడికి గుండెనొప్పొచ్చి గిగిలా కొట్టుకుంటుంటే పట్నంలో పెద్దాసుపత్రికి తీసుకెళ్లరా అని సెప్పారు. దారి ఖర్చుకు కూడా తమరే ఇచ్చారు కదా బాబూ ఆస్ప్రత్రికి తీసుకెళ్లాను.
లైట్స్‌ ఆఫ్‌
31
(రాముడు హాస్పిటల్లో కూర్చున్నాడు. కొడుకు సూరిగాడ్ని ఎక్జామిన్‌ చేసిన డాక్టర్‌ బైటికొచ్చాడు)
రాముడు:` డాక్టర్‌గారు వాడికేమైందండి?..
డాక్టర్‌:` మీ అబ్బాయికి గుండెలో ఒక వాల్వ్‌ పనిచేయటం లేదయ్యా... ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయాలి అంటే... గుండెకు ఆపరేషన్‌ చేయాలి. అలా చేయకపోతే వాడు బతకడు...
రాముడు:` బాబూ! అలా అనకండి బాబూ వాడు బతకాలి... వెంటనే ఆపరేషన్‌ సేయండి.
డాక్టర్‌:` చాలా డబ్బు ఖర్చవుతుంది మరి!
రాముడు:` డబ్బు కోసం సూడకండి బాబూ ఎంతవుద్ది బాబూ
డాక్టర్‌:` రెండు క్షవుతుంది.
రాముడు (షాక్‌) రెండు క్షలా?... రెండు క్షల్లేకపోతే సూరిగాడు సచ్చిపోతాడు. సూరిగాడు  లేకపోతే నేను బతకలేను. డాక్టర్‌బాబూ నా కొడుకును ఎలాగైనా బతికించండి... నా కొడుకును బతికించండి.
డాక్టర్‌:` డబ్బు తీసుకురావయ్యా ఆపరేషన్‌ చేస్తాను...
రాముడు:` రెండు క్షు నేనాన్నుంచి తేగను బాబూ?...
డాక్టర్‌:` ఏమో! నాకేం తొసు? డబ్బుల్లేకపోతే ఆపరేషన్‌ జరగదు.
రాముడు:` ఆపరేషన్‌ చేయకపోతే?....
డాక్టర్‌:` సింపుల్‌... నీ కొడుకు చనిపోతాడు...
రాముడు:` (డాక్టర్‌ కాళ్లమీద పడి...) అంత మాట అనకండి బాబూ.. నా ఇు్ల, వాకిలి, ఎద్దూ, బండి.. ఆఖరికి నా పెళ్ళాం మంగళసూత్రం కూడా అమ్మేసి ఓ పాతికమే తేగను బాబూ....నా కొడుక్కి ఆపరేషన్‌ చేసి బ్రతికించండి బాబూ....
డాక్టర్‌:` ఏంటి?.... ఇదేమన్నా కూరగాయ బేరమనుకున్నావా?........ బేరాలాడుతున్నావ్‌...వెళ్లు..... వెంటనే వెళ్లి ఆ రెండు క్షు తీసుకురా...లేదంటే నీ కొడుకు బతకడు...
32
రాముడు:` అంత మాటనకండి బాబూ... మా సూరిగాన్ని ఎట్టాగైనా బతికించండి బాబూ..
డాక్టర్‌:` నా కాళ్లు వదు (తంతాడు)
కాంపౌండర్‌:` సార్‌.... మిమ్మల్ని చీఫ్‌ డాక్టర్‌ మల్లారెడ్డి గారు అర్జంటుగా పిుస్తున్నారు సార్‌...
(రాముడు డాక్టర్ని వెళ్లనివ్వకుండా మళ్లీ కాళ్లు పట్టుకుంటాడు. కాంపౌండరు వాడిని బంగా తోసేస్తాడు. రాముడు దూరంగా వెళ్లి పడతాడు.)
లైట్స్‌ ఆఫ్‌
33
నా కొడుకు బ్రతకడు... నా కొడుకును బ్రతికించేవారెవ్వరూ లేరు. ఇది యిసపూరితమైనలోకం. ఈ లోకంలో నాయం లేనే లేదు. ఏడ అన్యాయం జరుగుతుందో ఆడ దేవుడుంటాడని పూజారయ్యగారు చెప్పారు...కాని ఏడా కనిపించడే?... అంతా ఉత్తిదే.. నాను పేదోడిని కదా.. పేదోడికి దేవుడు కనిపించడేమో... పేదోడికి రాకూడని రోగమొస్తే ఆడు సావాల్సిందేనా?...
ఆపరేషన్‌ సెయ్యనని ఆ డాక్టర్‌ తన్నేసి మరీ సెప్పాడు. అంత డబ్బు నా కాడ లేదు. నా కొడుకు సచ్చిపోవాల్సిందే... సచ్చిపోతాడు. నాది ఎదవ జన్మ... నా కొడుకును బతికించుకోలేకపోతున్న...సామీ ఆడ్నెట్టాగో నాను కాపాడలేను గానీ తీస్కెల్లిపో సామీ.. తీస్కెల్లిపో... ఆడు సచ్చిపోతాడు తీస్కెల్లిపో సామి...
(క్లు సీసా)
(ఇంతలో కాంపౌండర్‌ వస్తాడు) 100 నోట్లు 3
కాంపౌండర్‌:` భలే మంచి రోజు.. పసందైన రోజు.. రోజూ డబ్బులిట్టాగే రావాలా... నా జేబు నిండా...
(రామున్ని చూసి పారిపోబొయ్యాడు)
రాముడు:` ఆగు... ఆగు.. నా కొడక.. ఆగు సీసాతో కొట్టానంటే సచ్చిపోతావ్‌ ఆసుపత్రిలో నన్ను తోసేత్తార్రా?... ఇప్పుడు నిన్నెవరు కాపాడతార్రా?... నా కొడుకెలాగు సచ్చిపోతాడు. ఇంక ననెవరికోసం బతకాలిరా?.. పేదోడి పాణం అంత సుకనా? ఇప్పుడు సెప్పు నీ పాణం అంటే నీ కెంత ఆస?... నా కొడుకు మీద నా కెంతాస ఉండాలిరా?.. నీ లాంటి ఎదమ బతక్కూడదురా... సంపేత్తారోరేయ్‌.. (సీసా ఎత్తుతాడు)
కాంపౌండర్‌:` రాముడు... ఆగు నా మాట విను (గట్టిగా)
(మైకులో కొడుకునెలా బ్రతికించుకోవాలో లోలోప చెప్తాడు)
34
రెండు చ్చ రూపాయు నేకపోతే ఆపరేషన్‌ సెయ్యరు... ఆపరేషన్‌ సెయ్యకపోతే నా కొడుకు సూరిగాడు బతకడు. నా కొడుకుని ఎట్టా బతికించుకోవాలో తెనీదు... నా కొడుకు బతకడు ` నా కొడుకు సచ్చిపోతాడు. సచ్చిపోతాడు.
ఒక్కగానొక్క కొడుకు సచ్చిపోతాడన్న మాట నా గుండెల్లో మంటరేపింది. తట్టుకునే బాధ మరిచిపోటానికి తాగాను. సరిగ్గా ఆడ ఆడనే కనిపించాడు కాంపౌండర్‌. నన్ను తన్నేసి డాక్టర్‌ ముందు అవమానం చేసాడు. ఆడే ` ఆడే ఆడ్ని సూడంగానే కోపం తట్టుకోనేక ఆడ్ని సంపేద్దామని సీసా పైకెత్తాను. ఆడు పాణభయంతో గజగజలాడాడు. నీ కొడుకును బతికించే మార్గం చెబుతాను
నన్ను సంపొద్దని కాళ్ల ఏళ్ల పడ్డాడు. వొగ్గేసాను. మోసాన్ని మోసంతోనే నెగ్గాని పెద్ద ఆసుపత్రిలో జరిగే లొసుగున్నీ సెప్పాడు. అంతేకాదు నుగుర్ని కత్తితో నిర్ధాక్షిణ్యంగా సంపిన ఖైదీకు ఖూనీ కోర్లకు నేరస్తుకు పెద్దాసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్‌ సేత్తారని సెప్పాడు. సేసేదేమిటి లేక మనూరొచ్చాను. ఊళ్లో గంగానమ్మ బావికాడ జనం గుమిగూడారు. ముఠా తగాదావ్ల పాత కకచ్చవ్ల పెసిడెంట్‌గారిబ్బాయి శేఖర్‌ని ఎవరో సంపేసారు. కాంపౌండర్‌ అన్న మాటు నా సెవిలో గింగురుమన్నాయి. పెసిడెంట్‌గారి అబ్బాయి శేఖర్‌ హత్య నా కొడుకు పేరిట వరంగా మారింది. ఆ హత్యను ఓ ఆయుధంలా ఉపయోగించుకొన్నాను.
35
ఆహత్య నా కొడుకు సూరిగాడే సేసాడని పోలీస్‌ కంప్లేట్‌లో ఇచ్చాను. సెయ్యని నేరాన్ని సూరిగాడే సేసాడని చెప్పాను.
(చప్పట్లు) డబ్బు గూడందే సేత్తో కత్తి పట్టుకోమన్న డాక్టర్లే ఇప్పుడు ఉచితంగా ఆపరేషన్‌ సేత్తున్నారు. ఈ విషయం నీతో చెబ్దామని వస్తే నా మాటలేమి పట్టిచ్చుకోకుండా నన్ను వెళ్లిపొమ్మని అవమానం సేసావు. భరించానే... ఇంత సెప్పినా తుసీ నువ్వు నమ్మకపోతే నేనెందుకు బతకాలే?.. ఎవరికోసం బతకాలే సచ్చిపోతానే... సచ్చిపోతానే (త నేకి కొట్టుకుంటాడు)
36
తుసి:` మావా నన్ను క్షమించు మావా! సూరిగాడికి తండ్రివి వామా! మా పాలిటి దేవుడివి మావా!
రాముడు:` అలా అబద్ధం సెప్పకపోతే మన సూరిగాడు బతకడే. వాడి మీదున్న మమకారాన్ని కొంత కాం చంపుకోకపోతే వాడు శాశ్వతంగా మనకు దూరమైపోతాడే...
తుసి:` నా సూరిగాడు బతకాలి మావా! వాడు కొన్ని సంవత్సరాు ఏరే ఊళ్లో ఉన్నాడని సరిపెట్టుకుందామయ్యా... పద మావా జైుకెళ్లి ఆడ్ని సూద్దాం.. లేకపోతే నీ మీద కోపం పెంచుకొంటాడు...
రాముడు:`సెప్పిందంతా ఇని... మొదటికొత్తున్నావ్‌... ఆడు జైళ్లో యాడున్నాడే....ఆసుపత్రిలో ఉన్నాడే... డాక్టర్లు ఆనికి ఆపరేషన్‌ సేత్తున్నారే..
(లెటర్‌ బాక్స్‌తో కాంపౌండర్‌ ప్రవేశం)
కాంపౌండర్‌:` రాముడూ నీ కొడుకు ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యింది. సూరిగాడు బతికాడు. కాదు కాదు ఓ పేదోడి కొడుకు మృత్యువును జయించాడు (ఏడుస్తాడు)
రాముడు:` నిజమే బాబు... నా కొడుకుని బతికించింది కూడా పేదవాడే బాబూ... గొప్ప సదువు సదువుకున్న డాక్టర్లు కాదు బాబూ ` పేదవాడి ప్రాణానికి మివ ఉందని నిరూపించిన గొప్పోడివి నువ్వే కదయ్యా.... నా కొడుకుని బతికించుకోవడానికి సహా చెప్పిన దేవుడివయ్యా నువ్వు... ఈ స్వీటు నువ్వు తినాలి. (అని స్వీటు కాంపౌండరు నోట్లో పెడతాడు) పూజారయ్యగారు మావాడు బతకడానికి మీ సాయం కూడా చాలా ఉంది కాబట్టి ఈ స్వీటు మీరూ తీసుకోండి.
37
పూజారి:` నా కొద్దు.
రాముడు:` ఏం బాబూ... ఇది మీ మడికి పనికిరాదా....
పూజారి:` అది కాదురా!
రాముడు:` సూరిగాడు బతకడం మీకిష్టం లేదా?...
పూజారి:` నీ కొడుకును బతికించుకోవాన్న ఆలోచన నీ దృష్టిలో న్యాయమేమోగానీ బతికించుకున్న విధానాన్ని మాత్రం నేను అంగీకరించలేకపోతున్నా. అందుకే ఈ స్వీటు నేను తీసుకోను. అబద్దాలాడి చట్టాన్ని నీకు అనుకూంగా మార్చుకుని నీ కొడుకును నువ్వు బతికించుకున్నావ్‌...
తుసి:` ఏం మా కొడుకును బతికించుకోవడం తప్పా?...
పూజారి:` అందరూ మీలాగే ఆలోచిస్తే న్యాయం ధర్మం చట్టం స్వార్థానికి బలైపోతాయి.
రాముడు:` బాబూ.. మీకు సెప్పేతంటడివోన్ని కాదు గానీ బాబూ.. ఈ పపంచకంలో నాయం ఏడుంది బాబూ? ఏంటి బాబూ నాయం ` ధర్మం ` చట్టం (నవ్వి) అవి ఎక్కడ ఉన్నాయి బాబూ గొప్పోళ్ల జేబుల్లో నిదురపోతోంది బాబూ... అన్ని సోట్ల స్వార్థం రాజ్యమేుతోంది బాబు. స్వార్థం నేకపోతే ఒకనాడు హంతకుడిగా ముద్రపడినోడ్ని నేడు హంతకుడు కాదంటున్నారు.
38
ప్రత్యక్షంగా ఎన్నో నేరాు ఘోరాు సేసినటువంటి ఎంతోమంది నేరస్తు ఖైదీు ఖూనీకోర్లు ` టర్రరిస్టు బడా బడా రాజకీయ నేరస్తు కుం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో దేశం పేరుతో భాష పేరుతో సునాయాసంగా తప్పుకుంటున్నారు బాబూ ... అంతెందుకు సివరాఖరుకి ఉరిశిక్ష నుండి కూడా తప్పించుకుంటున్నారు బాబు...
అలాంటిది సెయ్యని నేనారికి నా కొడుకును అబద్దం సెప్పి బతికించుకోవడం తప్పా బాబూ బతికే హక్కు అందరికీ ఉంది బాబూ...
అసు ఆడు నేరం ఏడ సేసాడు బాబూ?.... సేయలేదు బాబూ నా కొడుకుని బతికించుకోవాన్న మమకారంతో అబద్ధం సెప్పాను. వాడి పాణాు కాపాడడమే ముఖ్యం అనుకున్నాను బాబూ. పాణా మీదకు వచ్చినపుడు కొన్ని కొన్ని సందర్భాలో అబద్దాలాడచ్చని మన పెద్దు ఏనాడో సెప్పారో కదా బాబూ.... నిజం దానంతటదే నికడ మీద తొవకపోతదా అనుకున్నాను బాబు. అనుకోకుండా పరిస్థితున్ని అనుకూలించి నా కొడుకును బతికించుకోడానికి సహకరించినయి బాబు. ఇప్పుడు సెప్పండి బాబు నేను సేసింది తప్పా?..... ఆలోసించండి బాబూ... మీరూ ఆలోసించండి..బాబూ...
తెర
శుభం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి