మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

ప్రత్యక్షానుమానోపమాన శబ్దాః ప్రమాణాని - న్యాయ దర్శనము

 న్యాయ దర్శనము

‘‘నచతుష్ట్వమైతి హ్యార్థాపత్తి సంభవాభావ ప్రామాణ్యాత్‌’’ 2.2.1.

బతిహ్యార్థాపత్తి సంభవాభావ ప్రామాణ్యాత్‌ R ఐతిహ్యము, అర్థాపత్తి, సంభవము, అభావమునను ప్రమాణమఱు ుండుటచే చతుష్ట్వమ్‌ R ప్రమాణము నాుగేయనుట, న Rతగదు.

(ప్రత్యక్షానుమానోపమాన శబ్దాః (ప్రమాణాని) యని సూత్రించి ప్రమాణము నాుగేయని పూర్వాధ్యాయమున చెప్పియుండుట సరికాదు. కారణమేమన, ఐతిహ్యము. అర్థాపత్తి, సంభవము, అభావము నను మరి నాుగు ప్రమాణమున్నవి. కాబట్టి ప్రమాణము లెనిమిదియని చెప్పవయునని సూత్రాబిప్రాయము. 

‘‘ఇట్లు చెప్పిరి’’ అను పరంపరగావచ్చు నైతిహాసిక జ్ఞానము ఐతిహ్యమనబడును. ఉపపాద్యజ్ఞానము ద్వారా ఉపపాదక క్పన అర్థాపత్తి యనబడును. ఏదిలేకున్న ఏది కుగు నేరదోయదిఉపపాద్యమనబడును. పగట భుజింపని వాడు రాత్రి వేళ భుజింపకున్న స్థూుడు కాజాడు. అతని యందు పీనత్వముమున్నంత మాత్రమున వర్షము తప్పక కుదియును అనుట తగదు. ప్రతిబంధక రహితమగు మేఘమున్న వర్షము కురియును. రోగములేని యొక వ్యక్తి పగు భుజింపక స్థూుడుగానున్న అతడు రాత్రి భ/జించుచున్నాటనుట సిద్ధము. ఇట్లు కారణములేనియెడ కార్యము కుగదన్నపుడు దానికి వీపరీతముగ కారణమున్న కార్యము కుగునని యర్థాపత్తి ద్వారా తెలియను. కారణముండియు ప్రతిబంధకము (అడ్డు) వన కార్యోత్పాదనము కుగకుండుట యర్థాపత్తి కానేరదు. కాబట్టి అర్థాపత్యాభాసము నర్థాపత్తియని యెంచి దోషము జూపుట తగదని భావము .

ప్రతిషేధా ప్రామాణ్యం చానైకాంతి కత్వాత్‌ ’’ 2.2.5.

అనైకాంతికాత్వాత్‌ R వ్యభిచారి యగుటవన, ప్రతిషేదా ప్రామాణ్యమ్‌ R (వ్యభిచారి యగుట వన) అర్థాపత్తి ప్రమాణము కాదను పూర్వపక్ష కథనము (ప్రతిషేధము) ప్రమాణము కాదు. 

‘అర్థాపత్తి ప్రమాణము కాదు. అనైకాంతికమగుట వన’ అను నీ పూర్వపక్ష కతన మిట ప్రతిషేధమనబడును. ఈ ప్రతిషేధముచే నర్థాపత్తి యొక్క ప్రామాణ్యము నిషేధింపబడుచున్నది. కాని యర్థాపత్తియునికి నిషేధింపబడుట లేదు. కాబట్టి యీ ప్రతిషేధము స్వయముగా ననై కాంతికము ` వ్యభిచారియగుటవన పూర్వపక్షి కథనమును సాధింపనేరదు. 

పూర్వపక్షి తన ప్రతిషేధమునకు అర్థాపత్తున్నియు విషయమనక కొండొక యర్థాపత్తియే విషయము అనగా 

‘‘తత్ప్రామాణ్యే వా నార్థాపత్త్య ప్రామాణ్యమ్‌ ’’ 2.2.6.

తత్ప్రామాణ్యే వా R పూర్వపక్షి ప్రతిషేధమనై కాంతికమయ్యు ప్రమాణమగునెడ, అర్థాపత్త్యప్రామాణ్యమ్‌ న R అర్థాపత్తి అప్రమాణము కాదు. 

అనైకాంతికత R (వ్యభిచారిత్వము) కొండొకతావున ప్రమానమగునెడ మా చెప్పు నర్థాపత్తియు ప్రమాణమే యగును. అర్థాపత్తికి విషయము. కార్యోత్పత్తియున్న యెడ కారణము తప్పక ఉండితీరుననుటయే. ప్రతిబంధకమున్నచోట కారణము గార్యము నుదయింపజేయుననుటకాదు. కాబట్టి యర్థాపత్తి ప్రమాణమై యనుమానాంతర్గతమగు ననుటలో నెట్టి దోషమును లేదని వివేకము. 

పూర్వపక్షము: `

అభావము అనుమానాంతర్గతమా? 

‘‘నా భావ ప్రామాణ్యం ప్రమేయాసిద్ధే ః ’’ 2.2.7.

 అభావప్రమాణ్యం R అభావమున ప్రామాణ్యము, న R లేదు, ప్రమేయాసిద్ధేఃR  అభావమునకు ప్రమేయమే లేకుండుటవన.

ప్రతి ప్రమాణమున కేదో యొక ప్రమేయముండి తీరవయును కదా! ప్రమేయములేని ప్రమాణముండదు. ప్రమాణమనగా ప్రమేయ బోధకమనికదా! యర్థము. అభావమనగా లేకుండుట కాబట్టి యది యొకానొక ప్రమేయము నెట్లు బోధింపగదు ? 

ఉత్తరపక్షము : `

‘‘క్షితేష్వక్షణ క్షితత్వా దక్షితానాం

తత్ప్రమేయ సిద్ధేః’’ 2. 28.

క్షితేషు R క్షితులో కలిసియున్న, అక్షితానాం R క్షితు కానివారు, అక్షణక్షితత్వాత్‌ R క్షణాభావమువన తెలియబడుటచే, తత్ప్రమేయ సిద్ధిఃR అభావప్రమాణప్రమేయము సిద్ధించుచున్నది. 

క్షణముతో కూడినవారు క్షితు. లోణమనగా వ్యావర్తకము ` వేరు చేయునది. ఒక గురుకుమున ననేకు బ్రహ్మచాయిన్నారనుకొనుడు. అందుకొందఱు మస్తములో వేదాది గ్రంథము ుంచుకొని తోడి బ్రహ్మచారుతో కలిసి యుపదేశార్థము గురు సమీపమున కేగిరనుకొనుడు. అపుడాచార్యుడు గ్రంథహస్తునెడు క్షణముతో కూడియుండని వారి నిటకు కొనిరమ్మని సంరక్షకునాజ్ఞపింపగా నతడు క్షణ రహితును ` అక్షితును నేరుచేసి యాచార్యుని సమీపమున జేర్చును. ఇట క్షణాభావమే కదా సంరక్షకున కా బ్రహ్మచారు జ్ఞానమును కలిగించినది ? కాబట్టి యభావమునకు ప్రమేయము లేదనుట సరిగాదు. 

ఉత్తర పక్షము : `

‘‘అసత్యర్థే నాభావ ఇతిచేన్నాన్య క్షణోపపత్తేః’’ 2. 2.9.

అర్థే R అభావప్రతియోగియగు క్షణరూప వస్తువు. అసతి R అక్షిత బ్రహ్మచారులో లేకుండుటవన, అభావఃR క్షణాభావము సిద్ధింపనేరదు, (అక్షిత బ్రహ్మచారులో క్షనమే లేకుండుట వన నటక్షణాభావమున్నదనుట యుచితముకాదని భావము) అందుమేని, న R అట్లుకాదు. అన్యక్షణోపపత్తే  ః క్షితబ్రహ్మ చారులోగ క్షణాభావమిట సిద్ధించుచున్నది. 

ఏ వస్తువవెక్కడనుండునో యక్కడనే దాని యభావము నుండవయును. అక్షిత బ్రహ్మచారు హస్తములో వేదాది గ్రంథముండుట యను క్షణమేలేదు. కాబట్టి యిట క్షనాభావ మొప్పదందుమేని సరికాదు. కారణమేమన, ప్రతియోగి స్థముననే యభావముండవయునన్న నియమమొండులేదు. ఒకచోటనున్న వస్తువున కభావము మరియొకచో భించుట లోక సిద్ధము కాబట్టి, అక్షిత బ్రహ్మచారుందుగ లోనము లేకుండుటయు నభావమే. ఆయభావమే వారిని సంరక్షకునకు బోధించి ప్రమాణమగుచున్నది. అభావమిట్లు ప్రమేయవంతమై ప్రమాణమగుటలో నెట్టి దోషమును లేదు. 

పై జెప్పిన విషయమునే స్పష్టపరుపదచి ఛముగా శంకించుచున్నాడు. 

‘‘తత్సిద్ధేరక్షితే ష్వ హేతు ః ’’     2.2.10.

తత్సిద్ధేఃR క్షితులోనున్న క్షణము యొక్క అభావము, అక్షితేషు R క్షితుకాని వారిలో. అహేతుఃR హేతువుకాదు.

క్షణాభావము సిద్ధించినమీదట నది యక్షితుకు బోధకము కాగదుకాని, యది సిద్ధింపక కానేరదు. క్షణముండుగా దాని యభావమెట్లు సిద్ధింపగదు? క్షణముకదు. లేదు అనుట వ్యాఘాతమగును. క్షితులో క్షణముండుటచే లేదనుట చ్లెదు. కాబట్టి క్షణాభావమే సిద్ధింపనపుడది యక్షితు ప్రతిపత్తి (జ్ఞానము) కి హేతువెట్లు కాగదు? 

‘‘న క్షణావస్థితాపేక్షాసిద్ధేః’’ 2.2.11.

క్షణావస్థితాపేక్షాసిద్ధేఃR క్షితులోనున్న క్షణము యొక్క యభావము అక్షితులో సిద్ధించుటవన, న R ప్రతిపత్తి హేతువు కాదనుట తగదు.

క్షణముండు స్థముననే దాని యభావమున్నదనినది సిద్ధింపనేరదుకాని, క్షితులోగ క్షణమునకు అక్షితులో దాని యభావము సిద్ధించుటలో నెట్టి దోషము నుండదు. అక్షితున క్షణాభావము కవారనుటయే కదా! క్షణమొకచోనుండి మరియొకచోదాని యభావమున్నదనుటలో వ్యాఘాతమునుకాదు. కాబట్టి క్షితులో గ క్షణముయొక్కయభావము అక్షితులో సిద్ధించియది ప్రతిపత్తి హేతువగుటలో నెట్టి దోషములేదు.

అయినను ఉన్నది. లేదనుట వ్యాఘాతమే కదాయన, 

‘‘ప్రాగాత్పత్తే రభావోపపత్తేశ్చ’’ 2.2.12.

సూత్రము నందలి చకారము ధ్వంసాదుకుబోధకము. ప్రాగుత్పత్తేR ఉత్పత్తికి పూర్వముండు, అభావోపపత్తేఃR అభావము సిద్ధించుట వన .

పూర్వసూత్రమున జెప్పబడి క్షితులోగ క్షణము యొక్క యభావమే యక్షితులో సిద్ధించుచున్న దనుట రుచింపకున్న, అక్షితులో నాక్షణ మేర్పడుటకు ముందుదాని యభావ ముండునుగదా. ఉత్పత్తికి పూర్వముండు సభావము ప్రాగభావమన బడును. అట్టి ప్రాగభావమైనను ప్రతిపత్తిహేతువు కాగదు.

ప్రమాణ క్షణమును జెప్పుచు నాప్తోపదేశము శబ్దము (‘ఆప్తోపదేశః శబ్దః’ 1.1.7.) అని చెప్పబడినది. ఆ శబ్దము నిత్యమా? యనిత్యమా యని యిపుడు విచారింపబడును. ఆకాశగుణమగు శబ్దము విభువు, నిత్యము, అభి వ్యక్తిదర్మకము నని కొందఱుÑ గంధాదిగుణముతో కూడి ద్రవ్యముతో నుండి యభివ్యక్తి దర్మకమని కొందఱు. ఆకాశగుణమై ఉత్పత్తి వినాశము కలిగి బుద్విలె ననిత్యమని కొందఱుÑ మహాభష్ట్రత సంక్షోభము వన కలిగి యానాశ్రితమై యుత్పత్తి వినాశము కలిగినదని కొందఱు అందురు. కాబట్టి శబ్దము నిత్యమా? యనిత్యమా యని సంశయము  కుగగా అనిత్యమనిసిద్ధాంత పోమును సూత్రించుచున్నాడు. 

‘‘ అది మత్త్వాదైంద్రియకత్వాత్‌ కృతకవదుపచారాచ్చ’’ 2.2.13.

ఆదిమత్వాత్‌ R (ఆదియనకారణము) కారణముగదగుటవన, ఐంద్రియకత్వాత్‌ R ఇంద్రియముచే గ్రహింపబడుటవన, కృతకవదుపచారాచ్చR (కృతకమ్‌ R కార్యము) కార్యమువలె వ్యవహరింపబడుటవనను శబ్దమనిత్యము. 

కారణమువన నేర్పడునది కారణవంతమనబడును. కారణవంతము అనిత్యము. ఉదాహరణము ఘటపటములే. శబ్దము సైతము సంయోగవిబాగాదువన కుగును. కాబట్టి కారణముగదై యనిత్యమగుచున్నది. ఇట్లే దర్శనాంతరమును జెప్పబడినది (‘‘సంయోగవిభాగాచ్ఛబ్దాచ్చ శబ్ద నిష్పత్తిః’’ వై. ద. 2.2.31.)

ఇంద్రియముచే గ్రహింపబడు సంయోగ విభాగాది గుణము నిత్యములైనట్లు శబ్దమును శ్రవణేంద్రియముచే గ్రహింపబడు చున్నది. కాబట్టి యనిత్యమని తెలియుచున్నది. శాస్త్రాంతరమునను ఇట్లే చెప్పబడినది. (‘‘శ్రోత్ర గ్రహణోయో-ర్థ స శబ్దః’’ 2.2.21. వై. ద. )

కృతకము (కార్యము) కృతకమువలె వ్యవమరింపబడును. అకృతకము (నిత్యవస్తువు) కృతక సమానముగ నెన్నడు వ్యవహరింపబడదు. కృతకముగు ఘటపటాదుత్పత్తి వినాశము కవిగా చూడబడుచున్వని. శబ్దము నట్లు వ్యవహరింపబడును. ‘శబ్దము జనించినది. శబ్దము నశించినది’ యనుట వ్యవహారసిద్ధము. కృతకముందు తీవ్ర మందభేద వ్యవహారమున్నట్లు శబ్దమునను. తీవ్రశబ్దము, మందశబ్దమను వ్యవహారము చూడబడుచున్నవి. కాబట్టి శబ్దమనిత్యమని భావము. 

పూర్వ పక్షము : `

పై జెప్పిన హేతువులో దోషమును జూపుచున్నాడు.

‘‘నగటాభావ సామాన్య నిత్యత్వాత్‌ నిత్యేష్వ

ప్యనిత్యవదుపచారాచ్చ’’ 2.2. 14.

ఘటాభావ సామాన్య నిత్యత్వాత్‌ R ఘటాబావము (ద్వంసము), గోత్వాదిసామాన్యము  రెండును నిత్యముగుటవనను. నిత్యేష్వ ష్యఇనత్యవదుపచారాచ్చ R ఆకాశాది నిత్యపదార్థము ననిత్యమువలె వ్యవహరింపబడుటవనను, న R ఆదిమత్త్వాది కారణముచే శబ్దము అనిత్యమనుట తగదు.

ఆది కది (కారణవంతము) యగుటచే శబ్దమనిత్య మనుట సరిగాదు ఘటధ్వంసము ఆదికదిjైునను ఇనత్యముగా చూడబడుచున్నది. ధ్వంసమునకు ప్రతియోగి కాకుండుటయే నిత్యత్వముకదా? (ధ్వంసాప్రతియోగిత్వం నిత్యత్వమ్‌.) ఘటధ్వంసమునకు మర ధ్వంసము కుగనేరదు. కాబట్టి యది ధ్వంసమున కప్రతియోగిjైు నిత్యమనబడుచున్నది. అందువన శబద్మఆదికదగుటచే ననిత్యమనుట వ్యభిచరించుచున్నది. 

ఐంద్రియకమగుటచే శబ్దమనిత్యమనుటకూడ గోత్వాది సామాన్యము (జాతు) ఐంద్రియకముయ్యు నిత్యముగుటచే వ్యభిచంరించుచున్నది. 

ఇట్లే కృతకవదుపచార హేతువును వ్యభిచరించుచున్నది. కారణమేమన, ‘ఆకాశైకదేశమున భూమియున్నది’ యని నిత్యమగు నాకాశమున నేకదేశవ్యవహారము చూడబుచున్నది. ఇట్లు ఆదిమత్వాది కారణము మూడును (శబ్దమనిత్యమని సాధింపనుద్దేశింపబడినవి.) వ్యభిచరించుటచే శబ్ద మనిత్యమనుట తగదు.

ఉత్తరపక్షము : `

‘‘తత్వఖాక్తయోర్నానాత్వవిభాగా దవ్యభిచారః’’ 2.2.15.

తత్వభాక్తయోఃR (నిత్యత్వము) తత్వము, భాక్తమునని, నానాత్వ విభాగాత్‌ R రెండు విధముగుటచే, అవ్యభిచారఃR వ్యభిచారములేదు.

ముఖ్యము గౌనము (తత్వభాక్తము) నని నిత్యత్వము రెండు విధము. ఉత్పత్తి వినాశము లేకుండుట ముఖ్యనిత్యత్వము. ఉత్పత్తియో లేక వినాశమో లేకుండుట గౌణ నిత్యత్వము. ఘటధ్వంనాత్మక అభావము ఆత్మాదు వలె ముఖ్యనిత్యము కాదు. అది యనిత్యప్రాయమే. ధ్వంసమునకు నాశములేకున్నను ఉత్పత్తి కదు. కాబట్టి ధ్వంసాదు నిత్యముగుటచే నాదిమత్వకారణము వ్యభిచరించుననుట యుక్తియుక్తముకాదు.

‘‘సంతానానుమాన విశేషణాత్‌’’  2.2.16.

సంతానానుమాన విశేషణాత్‌ R సామాన్యమనెడి విశేషణము హేతువున చేర్చుటవన, వ్యభిచారములేదు.

అనేక వస్తువులో నొక్కయాకారముగ జ్ఞానము కుగజేయుటచే సామాన్యమిట సంతానమనబడును. (‘బహుష్వేకాకారాబుద్ధిః సంతన్యతే -నేన ఇతి). అనుమాన మన నిటహస్త్రతువు. (అనుమాయతే-నేన ఇతి). విశిష్టీకరణము విశేషణ మనబడును. (విశిష్యతే -నేనేతి).

శబ్దము కేవమైంద్రియకమగుటచే నది యనిత్యము కాదు. సామాన్యవంతమై, మైంస్రదియకమగుటచేనది యనిత్యమని సిద్ధాంతము. గోత్వాది సామాన్యము ఐంద్రియకము (ఇంద్రియగ్రామ్యము) అయినను సామాన్యవంతముకావు గోత్వమనెడి సామాన్యమున గోత్వత్వమనెడి సామాన్యమొండులేదు. శబ్దము శబ్దత్వమనెడి సామాన్యము కదై jైుంద్రియక మగుటచే నది యనిత్యమేయని సూత్రాబిప్రాయము. కాబట్టి గోత్వాది సామాన్యము ఐంద్రియకముయ్యు నిత్యములైనను, శబ్ద మట్లుగాక శబ్దత్వమనెడి సామాన్యముగదై jైుంద్రియక మగుటచే ననిత్యమే యని వివేకము. 

మూడువహేతువున వ్యభిచారమును తొగించుచున్నాడు.

‘‘కారణ ద్రవ్యస్య ప్రదేశశబ్దే నాభిధానాత్‌  2.2.17.

ప్రదేశ శబ్దేన R దేశ పదముచేతర, కారణద్రవ్యస్య R కారణవంత మగు ద్రవ్యము ` సావయవము, అభిధానాత్‌ R చెప్పబడుటవన.

‘ఆత్మప్రదేశము ’ ‘ ఆకావైకదేశము’ నని వ్యవహారము లోకమున జాడబడుచున్నను అందలిప్రదేశేకదేశ శబ్దము ముఖ్యార్థమున ప్రోగింపబడవు. కారణమేమన, ్పవేశైక దేశశబ్దము ముఖ్యముగా నవయవమును ` కారనమును బోధించును. ఆకాశమునగానీ, ఆత్మయందుగానీ యవయవములేవు. కాబట్టి వాని ప్రయోగ మట గౌనమని యెరుంగ వయును. కాబట్టి యాకాశాత్ము కృతకముగు ఘటపటాదిద్రవ్యమువంటివికావు. అవి నిత్యములే. ఆత్మాదు నవయవబోధకముగు ప్రదేశైకదేశ శబ్దము ముఖ్యము కాకపోవటుంబట్టి కృతవపద్వ్యవహార మట వ్యభిచరించుననుట యుక్తి సంగతముకాదు.

పై జెప్పిన హేతువు దోషయుక్తము కాకున్నను అవి సాద్యసాదకములెట్లన.

‘‘ప్రాగుచ్చారణా దనుపబ్ధేః ఆవరణాద్యనుపబ్దేశ్చ.’’

2.2.18.

ఉచ్చారణాత్‌ప్రాక్‌ R ఉచ్చారణకు పూర్వమున, అనుపబ్దేఃR ఉపంభము కాకుండుట చేతను, ఆవరణాద్యనుపబ్దేశ్చ R ప్రతిబంధక ముగు నావరణాయ ుపబ్ధము కాక పోవుటచేతను శబ్దము నిత్యము.

శబ్దము నిత్యమేయగునెడ ఉచ్చరించుటకు పూర్వమని తెలియబడవలెను. అవి తియబడకుండుటకు ప్రతిబంధకముగా నావరణాదులేవైన నున్న వందుమేని యావరణాదున్నట్లైన నవియు తెలియవయును. ప్రతిబంధకము లేక యుచ్చారణకు ముందుబ్ధము కాకపోవుటచే శబ్ద ముచ్చారణాదుచే నుత్ప్నమై యనిత్యమగుచున్నదని స్పష్టమగుచున్నది. కాబట్టి పూర్వ హేతువు శబ్దమునిత్యమని సాధించుటలో నెట్టిపందియములేదు. 

పూర్వ పక్షము: `

‘‘తదనుపబ్ధే రను పంభా రావదణోపపత్తిః’’  2.2.19.

తదనుపబ్ధేఃR ఆవరణాదు యనుపబ్ధి, అనుపంభాత్‌ R ఉపంభము కాకుండుట వన, ఆవరణోపపత్తిఃR ఆవరణాదు ున్నవనుట యెప్పును. 

శబ్దోచ్చారణకు పూర్వముదాని యనుపబ్ధికి కారణము ఆవరణాదు ప్రతిబంధకము గుటచేకాని యనిత్యత్వము కాదు. ప్రతిబంధకము యిన ఆవరాణాదు ుపబ్ధముగుట లేదుకదా యందువేని, వాని యనుబ్ధియు నుపబ్ధమగుట లేదుకదా. కాబట్టి యొక వస్తువు యొక్క యనుపబ్ద్యనుపంభము దాని యునికి బోధించును 

ఆవరణాదు యనుపబ్ధి వన నీవెట్లు వాని యభావము నంగీకరించుచున్నావో యట్లే నేనును ఆవరణదు యనుపబ్ధ్యనుపంభము వన వాని భావము నంగీకరించుచు న్నానని పూర్వపక్షి యభిప్రాయము. కాబట్టి యుచ్చారణకు పూర్వము శబ్ద ముపబ్ధము కాకుండుటకు కారణము దాని నయనిత్యత్వము కాదని భావము. 

‘‘అనుపంభా దప్యనుపబ్ధి సద్భావన న్నా వరణానుప

పత్తి రసుపంభాత్‌ ’’  2.2.20.

అనుపంభాదపి R ఆవరణానుపబ్ధి యుపంభము కాకుండుట వనను, అనుపబ్ధి సద్భావవత్‌ R ఆవరణాద్యనుపబ్ధియున్నదని యంగీకరించినట్లు, అనుపంభాత్‌ R ఆవరణానుపంభమువన, ఆవరణనానుపపత్తిః న R ఆవరణ సద్భావమును సిద్ధింపగదు.

మఱియ ఉచ్చారణకు పూర్వము శబ్దము గ్రహాతీ ఇంపబడకుం డుటకు ప్రతిబంధకముగా నావరణాదుండిన, నందు వన గ్రహింపబడలేదనవచ్చును. కాని యావరణాదు ుపబ్ధముగుట లేదు. వాని యనుబ్ధియట నన్ను దనుటకు కారణము వాని యుపంభారaభావమేకదా? ఉపంభాబావము ఆవరణానుపబ్ధి కదనుటకు హేతువైనట్లు, ఆవరణాదు యుపంభాభావము సైతము వాని సద్భావమును (ఉనికిని) ఎట్లు బోధింపదు? బోధించుననియే భావము. కాబట్టి యావరణముండుటచే శబ్దోచ్చా రణకు పూర్వమది గ్రహింపబడుటలేదుగాని శబ్దములేక కాదు. 

ఉత్తరపక్షము : `

‘‘అనుపంభాత్మకత్వా దనుపబ్ధే రహేతు ః 2.2.21.

అనుపబ్దే ఃR ఆవరణాదు యను పబ్ది, అనుపంభాత్మకత్వాత్‌ R ఆదవరణాద్యుపబ్ద్యభావాతమ్క మగుటవన, ఆహేతుఃR (తదనుపబ్ధేః 2.2.19. అను సూత్రమున జెప్పబడిన ) హేతువు సరికాదు.

ఉపబ్ధమగు వస్తువు ఉన్నందదుము. ఉపబ్ధము కాకున్న లేందందుము. ఇట్లు బ్ధ్యనుపబ్ధు సదసద్విషయము. అనుపబ్ధియన నుపబ్ధ్యభావమే. అభావమగుగట వన నుపబ్ధము కాదని భావము. 

ఆవరణమో సద్వస్తువు ` భావాత్మకము. అట్టిదున్న పక్షమున నుపబ్ధము కావయును. ఉపబ్ధి మగుట లేదు. కాబట్టి లేదనుచున్నాము. ఆబట్టి యనుపంభము వన నావరణాదు న్నవనుట యమేతువు ` పొసగదని భావము. 

పూర్వపక్షము : `

‘‘అస్పర్శత్వాత్‌’’ 2.2.22.

ఆస్పర్శత్తాత్‌ R స్పర్వరహిత మగుటచే, శబ్దము నిత్యము. 

ఆకాశాదు స్పర్శములేనివై నిత్యము నబడుటచున్నవి. అట్లే శబ్దమును స్పర్శములేనిదగుట వన నిత్యమే. 

ఉత్తరపక్షము : `

‘న కర్మానిత్యత్వాత్‌ ’’ 2.2.23.

కర్మానిత్యత్వాత్‌ R స్పర్శ రహితమయ్యి కర్మము అనిత్యమగుట వన, న R శబ్దము స్పర్శలేనిదగుటచే నిత్యమనుట తగదని యర్థము. ’’

స్పర్శరహితమైనద్లె నిత్యమును నియమము లేదు. కర్మము స్పర్వరహితమేకాని నిత్యముకాదు. కాబట్టి శబ్దము నిత్యమనుటకు జెప్పబడిన ఆస్పర్శత్వహేతువు సరికాదు. 

పూర్వపక్షము : `

‘‘సంప్రదానాత్‌’’ 2.2.24.

సంప్రదానాత్‌ R సంప్రదానము వన శబ్దము నిత్యము. 

గురువు శిష్యునకు శబ్దమును సంప్రదానము చేయును. (ఇచ్చును.) శిష/్యడు వానిని గ్రహించును. శబ్దమునిత్యమగు నెడ నియ్యది సంభవింపదు. కాబట్టి శబ్దము నిత్యము. 

ఉత్తరపక్షము : `

‘‘తదంతరాలానుపబ్దే రహేతు ః ’’ 2.2.25.

తదంతరాలానుపబ్ధేఃR గురుశిష్యు మద్య శబ్దమవస్థితము కానందున, ఆ హేతు ః సంప్రదానహేతువు సరికాదు.

సంప్రదీయమాన వస్తువు దాతృపరిగ్రహీత మధ్య (అంతరామున) నవస్థితమైగోచరించును. అంట్లు గురుశిష్యు

` ‘‘నాణు నిత్యత్వాత్‌ ’’

అణనిత్యత్వాత్‌ R అణువు రూపము గదయ్యు నిత్యమగుట వన. న R శబ్ద నిత్యత్వ సాధక హేతువు సరికాదని సూత్రాభిప్రాయము. 

‘ నాణు నిత్యత్వాత్‌’ అనునిది వాస్తవమున సూత్రముకాదు. బాష్యవాక్యము కాబట్టి వార్తి కాదు నియ్యది కానరాదు. అందువన సూత్రము జేర్పనైతి.

మధ్య నిచ్చిపుచ్చుకొను వేళ శబద్దమవస్థితమైయున్న సంప్రదాన హేతువు శబ్దనిత్యత్వమును సాంధింపగదు. కాని యట్లు శబ్దమనస్థితము కాకుండుటవన నీ హేతువు సరికాదు.

పూర్వపక్షము : `

‘‘అధ్యాపనా దప్రతిషేధ ః ’’ 2.2.26.

అధ్యాపనాత్‌ R అధ్యాపనమువన, అప్రతిషేధఃR సంప్రదాన మహేతువనుట సరిగాదు.

గురుశిష్యు మధ్య శబ్దము ప్రత్యక్షముగా గ్రహింపబడకున్నను అనుమానమున నది తెలియనగును. గురువుచే నీయబడి శిష్యునిచే నదిగ్రహింపబడకున్న నధ్యాపనము జరుగనేరదు. గురువుచే సంప్రదీయమాన శబ్దమును శిష్యుడు పొందుటయే యధ్యాపన మనబడునుగదా. కాబట్టి సంప్రదాన హేతువు శబ్దనిత్యత్వమును బోధింపగదని భావము. 

ఉత్తరపక్షము : `

‘‘ఉభయోః పక్షమో రన్యతరస్యాధ్యాపనా దవిప్రతిషేదః’’

2.2.27.

కాబట్టి యంతరామున శబ్దావస్థితి దాని నిత్యత్వమును సాధింపగదనిగదా! పూర్వ పక్షి యభిప్రాయము.

శబ్ద మనిత్యమని సిద్ధాంతించు మేము గురువుచే నీయబడు శబ్దము సంతానవృత్తితో శిష్యుని ప్రాప్తించుట యత్యాపన మందుము. ఇట్లు భయపక్షముందు సిద్ధించు నధ్యాపనము గురుశిష్యు మధ్య బ్దావస్థితిని సాంధించి తద్ద్వారా దాని నిత్యత్వమును సాధించును గాని శబ్దసంతానమును బోధించి యనిత్యవ్వమును సాధింపనేదరని చెప్నఏరము గదా! కాబట్టి యధ్యాపనము నిత్యత్వము సాధింపనేరదని యభిప్రాయము. 

భాష్యకాయి (వాత్స్యాయనుడు) ఆచార్యస్థ శబ్దమంతేవాసిని చేరుట యధ్యాపనమా? లేక, నృత్యోపదేశము వలె గ్రహింపబడిన దాని ననుకరించుట యధ్యాపనమా? యని శంకించి యథ్యాపనము సంప్రదాయమునకు లింగము కాదని నిరాకరించి యుండిరి. 

పూర్వ పక్షము : `

‘‘‘అభ్యాసాత్‌’’ 2.2.28.

అభ్యాసాత్‌ R అభ్యాసము వన శబ్దము నిత్యము.

ఒక్క విషయమునకు సంబందించి యనే క్రియు కుగుట యభ్యాస మనబడును. ఒక శబ్దమును మర మర నుచ్చరింయుటయు, ఒకే రూపము ననే పర్యాయము దర్శించుటయు నభ్యాస మనకబడును. అనేక పర్యాము లొకే శబ్దము నుచ్చరింప వయునన్న నది వయస్థితమై యుండవయును. ఒకచో నవస్థితమై యుండని రూపమును మర మర చూచుట సంభవింపదు గదా ! ‘ ఒక యనువాకమున నేక పర్యాయము అద్యయనము చేయుచున్నాడు ’ అను తావు ందు సమానముగ నభ్యాసము గోచరించిచున్నది. అభ్యాస మనస్థితమునకే సంభవించును. కాబట్టి శబ్దము నిత్యము. 

ఉత్తరపోము : `

‘‘నాన్యతే-ప్యభ్యాసస్యోచారాత్‌’’ 2.2.29.

అన్యతే-పి R శబ్దమనేక మైనను, అభ్యాస్యోపచారాత్‌R అభ్యాసము సంభవ మగుట వన, న R పూర్వపక్షి చెప్పినది సరికాదు.

ఒకే రూప మనేకపర్యాయము దర్శింపబడునట్లు, ఒకే శబ్ద మనేక పర్యాము నుట యభ్యాసము అను నియమము లేదు. శబ్దమొక్కటికాకాక యనేకములైనను అభ్యసింపవీగును. అగ్ని హోత్రాది కర్మము నేకముయ్యు నబ్యసింపబడుచున్నవి. (ద్విర్భుంక్తే ద్విర్జుహోతి. ద్వి రనృత్యత్‌, త్రిరనృత్యత్‌) రెండుమాయిభ/జించుచున్నాడు. రెండు మాయి హోమము చేయుచున్నాడు. మూడుమాయి నృత్యము చేసెను. అనునిల్లి యనేకకర్మందును అభ్యాసమమను జూచుచున్నాము కాబట్టి గురువుచే నీయబడు శమ్దమొక్కటిగా నుండి యభ్యసింపబడుచున్న దను నియమములేదు. గురువుచే నుచ్చరింపబడు శబ్దము సంతానవృత్తితో ననేకము గుచు శిష్యునిచే గ్రహింపబడి పుపఃపునః అబ్యసింపబడును.

ఇట్లు ఒక విషయముననే గాక యనేక విషయమునకు అభ్యాసము సంభవ మగుట వన నభ్యాసహేతు వనై కాంతికమై శబ్ద నిత్యత్వమును సాధించుననుట పొసగదని సూత్రాబిప్రాయము. 

పూర్వపక్షము: `

‘‘అన్యదన్యస్మా దనన్యత్వా దన్య దిత్యన్యతా-భావః’’ 2.2.30.

అన్యాస్మాత్‌ R అన్యముకంటె, అన్యత్‌ R దేనినన్యమనుచున్నావో యది, అనన్యత్వాత్‌ R తనకంటె నన్యముకాదు, కాన, అన్యత్‌ ఇతి R అన్యము అనుదానిలో, అన్యతా -భావఃR అన్యత్వమేలేదు.

‘‘అన్యత్వే-ప్యభ్యాసస్యోపచారాత్‌8 అను సూత్రమున అన్యత్వము కదని యెంచి హేతువునందు వ్యభిచారము చూపబడినది. లోకమున నెచ్చటను అన్యత్వమునునదియే లేదు. ప్రతివస్తువును తాను తనకంటె సన్యము కానేరదు. ఇట్లు ఏ వస్తువునందు నన్యత్వము సిదిÊంపనపుడు పూర్వ సూత్రమున జూపిన దోషము సరికాదని సూత్రభావము.

ఉత్తరపక్షము: `

‘‘తదభావే నాస్త్యననన్యతా తయోరితరేతరాపేక్ష సిద్ధే ః ’’ 

2.2.31.

తదభావే R అన్యత్వమే లేనియెడ, అనన్యతా నాస్తి R అనన్యతయులేదు. తయోఃR అన్యత్వ స్త్రం `అనన్యత్వము, ఇతరేతరాపేక్షసిద్ధేఃR ఒకటియుండిననే మఱియొకటి యుండును.

జగత్తున నన్యత్వమే లేకున్న, అనన్యత్వమును లేదని సిద్ధమగును. అన్యత్వము నపేక్షించియే అనన్యత్వము సిద్ధించును కదా! కాబట్టి యందొకటి లేదుÑ రెండవది కదనుట యసంగతము. మఱియు లోకమున నొక వస్తువు తాను తన కంటె నన్యము కాకపోవచ్చును. కాని మఱియొకదాని కంటె నన్యము కాదనుట యనుభవ విరుద్ధము. నీము తనకంటె నన్యము కాకున్న పీతముకంటె నన్యము కాక యనన్యమే యనుట ఎట్లు పొసగును? కాబట్టి యన్యతా -భావమును సాధింపబూనుట వివేకము కాదు. (స్వాపేక్షయా) తనకంటె నతరము అన్యమే యగును. అందువన 9నా-న్యత్వే-ప్యభ్యా సస్యోపచారాత్‌) అను సూత్రమున జూపబడిన వ్యభిచార దోషముయుక్తమే యని అభిఆపయము.

పూర్వపక్షము : `

‘‘వినాశ కారణానుపబ్ధేః’’ 2.2.32.

వినాశకారణానుపబ్ధేఃR వినాశకారణము భింపనందున.

లోకమున ఘటఘాటాది కార్యము నిత్యము. వాని వినాశ కారణమును మనము జూడగుగుచున్నాము. శబ్దమునకు వినాశకారణము భింపనందువన నదినిత్యమే యని భావము 

ఉత్తర పక్షము : ` (ప్రతిబంధి సమాధానము) 

‘‘ఆశ్రవణ కారణానుపబ్ధేః సతత శ్రవణ ప్రసంగః’’ 2.2.33.

ఆశ్రవణ కారణానుపబ్ధేఃR శబ్దము వినబడకుండుటకుగ కారణము భింపనందువన, సతతశ్రవణ ప్రసంగ R శబ్దమ్లెప్పుడు వినబడుచుండవసి యుండును.

శబ్దము నిత్యమగునెడ న్లెపుడు నది వినబడుచుండయ వయును. నిత్యమై వినబడకుండుటకు కారణమేమి? అట్టి కారణమేదైన నున్న నది తెలియబడవయును కదా! కారణము లేకయే శబ్దము నిత్యమై యుండియునది య్లెప్పుడు వినబడక యప్పుడప్పుడు వినబడుచుండునని కల్పించుట యుక్తము కానేరదు. ఉన్న శబ్దము కారణము లేకయే య్లెపుడు వినబడదని యంగీ కరించు నెడ వినాశకారణము భింపకున్నను శబ్దము నశించ చునేయున్నది కాబట్టి యది యనిత్యమనుటలోను దోషము లేదు.

ప్రతిబంధి యుత్తరము నొసగి ముఖ్య సమాధానమిచ్చుచున్నాడు. 

‘‘ఉపభ్యమానేచానుపబ్ధే రసత్వాదనపదేశః’’ 2.2.34.

ఉపభ్యమానేచ R (మఱియు) శబ్దవినాశ కారణము భించుచుండ, అనుపబ్ధేఃR దానియనుబ్ధి, సఅసత్వాత్‌R లేకుండుటచే, అనపదేశఃR వినాశకారణము భింపలేదనుట సరికాదు.

ఘటాదువలె నుత్పన్నవస్తువు నశించును అను వనను మానము ననుసరించి సంయోగ విభాగాదువననే శబ్దము జనించుచున్నది కాబట్టి తప్ప నశించునని సిద్ధించుచున్నది. అశశ్యముగా నేర్పడు వినాశమయినను కారణములేకున్న నేర్పడనేరదు కాబట్టి వినాశకారణ మూహింపబడును. ఇట్లు కారణముపబ్ధమగుచుండ వినాశకా రణానుపబ్ధివన శబ్దము నిత్యమనుట తగదు. అనుమానము ద్వారా సిద్ధించు వినాశకారణమువన శబ్దము అనిత్యమే యని సూత్రాభిప్రాయము.

పూర్వశబ్ద వినాశమునకు కారణము తరువాతి శబ్దమే. అన్నిటికంటె చివరి శబ్దము తనకంటె పూర్వముండు శబ్దమే వినాశ కారణముగా గలిగియుండునని వివేకము.

వినాశకారణము ప్రత్యక్షముగా సిద్ధింపవయుననవి, 

‘‘పాణి నిమిత్తప్రశ్లేషాచ్ఛబ్దాభావే నానుపబ్ధిః’’ 2.2.35.

పాణినిమిత్తప్రశ్లేషాత్‌ R వాయింపబడి మ్రోగుచున్న కంచుగంటము న్నగు వస్తువుతో చేతినిసంయోగింపజేసినందువన, శబ్దాభావేR శబ్దమునశించుచుండగా, నానుపబ్ధిఃR వినాశకారణము భింప దనుటతగదు.

ఉత్పన్న శబ్దము దేనివన నశించుచున్నదో అదియే దానికి వినాశకారణమనుట నిస్సంశయము. ఒక కంచుగంటను వాయించి యందు శబ్దము బయుదేరినపుడు చేతితో నాగంటను తాకిన వెంటనే శబ్దము నశించుట లోకసిద్ధము. ఇట్లు హస్తస్పర్శమువన శబ్దమునశించుట చూచుచున్నాము. ఇది ప్రత్యక్ష సిద్ధము. కాబట్టి వినాశకారణము భింపకుండుట వన శబ్దము నిత్యమే యనుట చ్లెదు.

‘‘ అస్పర్శత్వా ద ప్రతిషేధః’’ 2. 2.29.

అస్పర్శత్వాత్‌ R శబ్దాశ్రయము స్పర్శింపమీగాని దగుటవన నది నిత్యమేయనుట, అప్రతిషేధఃR ప్రతిషేధముకాదు.

మఱియు‘పాణినిమిత్త ప్రశ్లేషా’ దను సూత్రమున శబ్దమును నశింపజేయుకారణము ప్రత్యక్షముగా సిద్ధించుచున్టశ్రీన్లు రూపింపబడినది. కాబట్టి అస్పర్శత్వమను హేతువు శబ్ద నిత్యత్వమును సాధింపనేరదు ఇట్లు శబ్దమనిత్యమనియే సిద్ధమగుచున్నది. 

‘‘విభక్త్యంతరోపపత్తేశ్చ సమాసే’’ 2.2.37.

(పై సూత్రమంతయు నిందనువర్తించును) సమాసే R వ్యాకరణ శాస్త్రమున ప్రసిద్ధమగు సమాసమునందు, విభక్త్యంతరోపపత్తేశ్చయR పూర్వముండు విబక్తిస్థానములో మఱియొక విభక్తి జనించుట వనను, శబ్దమనిత్యమని సిద్ధించుచున్నది. 

అనేక పదము నొకపదముగాచేసి వ్యవమరించుట వ్యాకరణ శాస్త్రమున సమాస మనబడును. ఇట్లు కొన్ని పదమును జేర్చి యొక్కటిగా జేయునపుడాయా పదములో గ విభక్తి లోపించి మఱియొక విభక్తి యేర్పడును. ఇది యొక శబ్దసంస్కారము. శబ్దము నిత్యమగునెడ నిట్టి సంస్కారము పొసగనేరదు. నిత్యమున తరగు పెరుగు కుగజావవు. సమాసమున నొకవిభక్తి పోవుటయు, మఱియొకటి యట చేరుటయు వ్యాకరణసిద్ధము. కాబట్టి శబ్దమనిత్యమే యని సూత్రాభిప్రాయము. 

ఇంతవరకు శబ్దమనిత్యమని నిర్ణయింపబడినది. ప్రస్తుతమున మఱియొక విషయమును పరీక్షింపదచి ముందుగా సంశయమును ప్రదర్శించచున్నాడు. 

‘‘వికారాదేశోపదేశాత్‌ సంశయంః 2.2.38.

వికారాదేశోపదేశాత్‌ R వికారము, ఆదేశము నను నీ రెండునుపదేశింప బడుటవన, సంశయఃR శబ్దమునగ యొకవర్ణస్థానమున నేర్పడు మఱియొక వర్ణము వికారమా? ఆదేశమా? యను సంశయము కగును.

‘దధ్యత్ర’ (దధిG అత్ర) యనునిట్టి సంధిస్థముందు (ఇకోయణచి) అను నిట్టి వ్యాకరణ సూత్రము ద్వారా ఇకార స్థానమున యకార ముపదేశింపబడుట వ్యాకరణ శాస్త్ర సిద్ధము. సంధిస్థమున ఇకారము ఇత్వమును విడిచి యత్వమును బొందును. ఈ స్థితిని వికారమని కొందఱు పుకుదురు. ఇకారమును విడిచి దాని స్థానమున యకారము ప్రయోగింపబడుట అదేశమని కొందరు చెప్పుదురు. కాబట్టి వికారమా? ఆ దేశమా? యిన సందేహము కుగు టసవ్వభావము. ఇందు వికారమను పూర్వపక్షము. ఆ దేశమనుట సిద్ధాంతమని భావము.

(వికారవాదము)

‘‘ప్రకృతి వివృద్ధౌ వికార వివృద్ధేః’’  2.2.39.

ప్రకృతివివృద్ధౌR ప్రకృతి వృద్ధినొందిన, వికారవివృద్ధేఃR వికార మందును వృద్ధికుగుట వన, ఇకారాదికి కుగు యకారాది వికారముకాదని సూత్రార్థము .

లోకమున మూ పదార్తము (ప్రకృతి) సవృద్ధి యేర్పడిన, ఆనిచే నేర్పడు (వికారము) కార్యము నందును వృద్ధి కుగుట చూచుచున్నాము. సువర్ణమున పెంపుగలిగిన దానిచే నొనరింపబడు భూషణముందును వృద్ధికుగను. క్షరమున నెంత పెంపుగలిగిన దాని వన నేర్పడు దధి (పెరుగ) యందును సంతపెంపు గుగును. దధి, భూషణము క్షీర సువర్ణ వికారముగుట లోక విధితము. ఇట్లే ‘ఇ’ కారమునకు ‘య’ కారము వికారమే యగునెడ ఇకారమున వృద్ధి కలిగినపుడు యకారమునకు వృద్ధి కుగవసి యుండును. అట్లు కుగకుండుట వ్యాకరణశాస్త్రసిద్ధ విషయము. ఎట్లవ, (దధిG అత్రR దధ్యత్ర) ఈస్థమున ‘ఇ’ కారము హ్రస్వము, (సుధీG ఉపాస్యఃR సుధ్యుపాస్యః) ఈ స్థమున ‘ఈ’ కారము దీర్ఘము. ఈ, ‘ఇ’ కార, ‘ఈ’ కారస్థానము నేర్పడు యకారమొకటిగానే యుండును. ఈ రెండవ యుదామరణమున ‘ఈ’ కార స్థానమున నేర్పడు ‘య’ కారమునకును ‘ఇ’ కార స్థానమున నేర్పడు ‘య’ కారమునకును నెట్టి భేదమును లేదు. ఇది వికారమగునెడ ప్రకృతి భూతమగు ‘ఇ’ కారమున వృద్ధి (పెంపు) కుగుటచే ‘య’ కారమునను పెంపు గుగవసి యుండును. అట్లు కుగక పోవుటచే వికారము కాదని యభిప్రాయము. 

పూర్వపక్షము : `

‘‘న్యూనసమధికోపబ్ధేః వికారాణా మహేతు ః 2.2.40.

వికారాణామ్‌ R వికారము (కరార్యము) న్యూనసమధికోపబ్ధేఃR ప్రకృతిభూత (మూª పదార్తముకంటె హెచ్చుతగ్గుగా నేర్పడుట లోకమున చూచుటచే, ఆహేతుఃR ప్రకృతి ననుసరించి వికారమున హెచ్చుతగ్గు కుగవయుననెడి హేతువు సరిjైునదికాదు.

మూపదార్తము (కారణపదార్థము) ననుసరించి మూమున పెంపుగలిగిన పెచ్చుగానేర్పడి, తగ్గుగలిగిన తక్కువగా నేర్పడునదియే వికారమను నియమములేదు. నారికేళ బీజమునుండి యేర్పడు నారికేళాంకురము బీజముకంటె చిన్నదిగా జూడబడుచున్నది. మఱ్ణివిత్తనమునుండి యేర్పడు పటాంకురము విత్తనముకంటె పెద్దదిగా నుండును. కాబట్టి మూముకంటె వికృతులో హెచ్చుతగ్గుండ వనుట సరికాదు. అందువన ‘ఇకార’ స్థానమున ప్రయోగింపబడు యకారము వికారముకాక ఆదేశమే యగునను పొసగదు.

ఉత్తరపక్షము: `

‘‘నాత్యు ప్రకృతీనాం వికార వికల్పాత్‌’’ 2.2.41.

అత్యు ప్రకృతీనామ్‌ R ప్రకృతి పదార్తము భిన్నముయి నపుడు, వికార వికల్పాత్‌ R వికార పదార్థముందును భేదముండవసి యుండుటచే, న R పూర్వోక్తశంక సరికాదు.

‘‘ ప్రకృతి వివృద్ధౌ’’ అనుసూత్రమున ప్రకృతి పదార్థము నను సరించి వికారమున హెచ్చుతగ్గు కుగవయుననుట (ఆదేవవాదుమగు) మా యభిప్రాయముకాదు. ప్రకృతిపదార్థము భిన్నమైనపుడు వికారమును భిన్నము కావసియుండుననుట వ మా యభిప్రాయము.  నారికేళబీజము నుండి పవటాంకురముగానీ వటబీజమునుండి నారికేళముగానీ కుగనేరదు. వటబీజమునుండి పటాంకురమే ఉద్భవించును. అట్లే ‘ఇ’ కారమునకు ‘య’ కారము వికారమగునెడ ‘ఈ’ కారమునకు ‘య’ కారముగాక మరియొకటిjైు యుండవయునఱు. అట్లుగాక ‘ఇ’ కార ‘ఈ’ కారముకు రెంటికిని యకారమే ప్రయోగింపబడుటచే ‘య’ కారము వికారము కాదు.  ఆ దేశమే యగును.

పూర్వపక్షము :`

‘‘ద్రవ్య వికారే వైసమ్యవతÊ వర్ణవికార విక్పః’’ 2.2.42.

ద్రవ్యవికారే వై షమ్యవత్‌ R ద్రవ్యరూపమున వట నారికేళము త్యుముయ్యు విక్షణములైనట్లు, వర్ణవికార విక్పఃR ఇకార ఈకారస్థానమున ప్రయోగింపబడు యాకరాము వర్ణరూపమున సమానముయినను విషమములే.

వ నారికేళ వృక్షము ద్రవ్యభావమున సమానము లైనను, ప్రకృతి (బీజ) భేదమువన వికారముగు నంకురము భిన్నము (విక్షణము) అయినట్లు ఇకార ఈకార స్థాన ప్రయుక్త యకారము ప్రకృతి భేదమువన విక్షణములే యని యెఱుగవయునని వికారవాది యభిప్రాయము. కాబట్టి ఇకార స్థానిక యాకారము వికారమేగాని యా దేశము కానేరదు. 

ఉత్తరపక్షము: `

‘‘ న వికారధర్మానుపపత్తేః’’ 2.2.43.

వికార ధర్మానుపపత్తే ఃR యకారమున వికృతి దర్మము లేకుండుటవన. న R వికారవాది యభిప్రాయము సరికాదు.

వికారములో ప్రకృతిదర్మము కానరానంత వరకు ప్రకృతు భిన్నమైనంత మాత్రముచేత తద్వికారమును బఙ్నములే యనుట యెట్లుపొసగును? వ నారికేళ వృక్షము, వాని మూముగు బీజము భిన్నముగుట భిన్నమునుట తగదు. బీజధర్మము వృక్షమున చూడబడుచున్నది. అందుచే నవి భిన్నమునుట యుచితమే.  యకారమున ప్రకృతి ధర్మముగు హ్రస్వత్వ దీర్ఘత్వము ు కనబడకుండుటచే ఇకార ఈకారములో వచ్చు యకారము వాని వికారము కానేరదు.

ప్రకృతి భూతమగు వస్తువులో నేధర్మముండునో ఆధర్మము కలిగియుండి వ్యూహభేదము (పూర్వరూపము పోయి క్రొత్తరూపము) కుగుట వికారమనబడును. క్షీరము ప్రకృతిభూతమగు వస్తువు. పెరుగుదానికి వికృతి. పెరుగలో ఖీరధర్మమంఉడును కాని క్షీరరూపము పోయి క్రొత్తరూపమొకటి యేర్పడును. కాబట్టి పాకు వికృతి పెరుగు

‘‘వికారప్రాప్తానా మపునరాపత్తేః’’ 2.2.44.

వికారప్రాప్తానామ్‌ R వికృతి రూపము నొందిన ప్రకృతివస్తువు, అఅపునరాపత్తేఃR మర స్వస్వరూపమును బొందవు.

వికారము మర ప్రకృతి రూపమును బొందదు. పెరుగు మర పారూపమును బొందకుండుట లోకవిధితమే కాని, దధ్యత్ర అను పదమున సంధినపేక్షించినపుడు ఇకార స్థానమున యకారమును ప్రయోగింతురు. సంధి నపేక్షింపనపుడు (దధిG అత్ర) ఇకారముచే ప్రయోగింతురు. కాబట్టి ఇకారస్థానమున ప్రయోగింపబడు యకారము దాని వికారము గాక ఆదేశమే యని సూత్రాభి ప్రాయము.

పూర్వ పక్షము : `

‘‘సువర్థాదీనాం పునరాపత్తే రహేతుః’’ 2.2.45.

సువర్ణాదీనాంR  బంగారము మున్నగువని, పునరాపత్తే ఃR నగ రూపమున వికృతముయ్యు మర పూర్వరూపమును బొందుట చూచుచున్నాము. కాబట్టి, ఆహేతుఃR వికృతు మర ప్రకృతిరూపమును బొందవని చెప్పిన హేతువు సరికాదు. 

బంగారము నగరూపమునని కృతరూపమును బొందియు మర స్వస్వరూపమును బొందుచుండుట చూచుచున్నాము. అట్టియెడ వికారము ప్రకృతిరూపమును బొందనేరదనుట తగదు. కాగా యకారము ఇకారవికారముకాదనుటయు హేతుబ్ధము కాదు,

ఉత్తర పక్షము: `

‘‘న తద్వికారాణాం సువర్ణభావావ్యతిరేకాత్‌’’ 2.2.46.

తద్వికారాణామ్‌ R సువర్ణవికారముయిన నగు, సువర్ణభావా వ్యతిరేకాత్‌ R సువర్ణమే కాని, దానికంటె విక్షణమైన వికృతిని బొందలేదు. కాబట్టి, న R వికారము ప్రకృతిరూపమును బొందవని చెప్పిన హేతువు ఆహేతువుకాదు.

ప్రతి య్పవికారమును ప్రకృతిరూపమును బొందదని సమాధానకర్త యభిప్రాయముకాదు. ప్రకృతిదర్మము కలిగియుండి విజాతీయరూపమున పరివర్తించు వికారము మర ప్రకృతి రూపమును బొఇందదని యభిప్రాయము. కాబట్టి క్షీర వికృతి దధిjైునట్లు ఇకార స్థానమునవచ్చు యకారము దాని వికృతికాక యా దేశమే యగును.

‘‘నిత్యత్వే-వికారాత్‌. అనిత్యత్వేచానవస్థానాత్‌’’ 2.2.47.

నిత్యతే R వర్ణము నిత్యముయిన పక్షమున, అవికారాత్‌ R వికారమ సంబవము. అనిత్యత్వేచ R నిత్యముకాని పక్షమున, అనవస్థానాత్‌ R అవస్తాయిత్వము (స్థితి) లేనివగును.

వర్ణము నిత్యములో లేక యనిత్యములో యగును. ఉభయపక్షముందును యకారము వికారమననొప్పదు నిత్య పక్షమున వర్ణము వికృతినొందజాదు. వికృతి నిత్యత్వమునకు విరోధి. అనిత్యమైనచో ఇకారము నశించితరుపరి వచ్చు యకారము ఇకార వికృతియనుట ఎట్లుచ్లొను? ప్రకృతి భూత వస్తువు అవస్థాయిjైు (స్థిరమై)న కదా వికృతి న్‌ిఒందగుగును? కాబట్టి యుభయవిధము నెట్లు చూచినను ఇకార స్థానిక యకారము ఆ దేశమే యననొప్పును. వికారమనుట పొసగదు. 

పూర్వపక్షము : `

వికారవాది వర్ణము నిత్యమును పక్షము నంగీకరించి తనవాదమును స్థిరపరుప నుద్దేశించుచు సమాధానము నిచ్చుచున్నాడు. 

‘‘నిత్యానా మంతీర్రదియత్వాత్‌ తద్ధర్మ వికల్పాచ్చ

వర్ణవికారాణా మప్రతిషేధః’’  2.2.48.

వికారధర్మిత్వే R వర్థము వికారము కవగుచో, నిత్యత్వా భవాత్‌ ః నిత్యము కాజావు. చ  మరియు, కాలాంతరే R వర్ణస్థితి కా ముకంటె భ్నిమైన కాములో, వికారోపపత్తేఃR వికారము కుగు చున్నది. కాబట్టి, ప్రతిషేధఃR వర్ణము నిత్యము, అనిత్య మున ను నుభయపక్షముందును వికారవాద మయుక్తమనుట నిషేధింప బడదు. 

నిత్యవస్తువు స్వరూపము మారజాదు. మారినట్లయిన నవి నిత్యముకావు. నిత్యత్వము, వికారము నను నీ రెండు ధర్మము పరస్పర విరుద్ధము. కాబట్టి యవి రెండు నొక వస్తువున నుండనేరవు. అందువన వర్ణము నిత్యము, వికారవంతము నను పొసగదు.

వర్ణమునిత్యమును పక్షమున నవి స్థాయిత్వము (స్థిరత) లేని వగుటచే వికారము కుగు సమయమున నుండి జావు. కాబట్టి యేది లేదో దాని వికారమెట్లు గుగగదు? వికృతివే ప్రకృతి యుండి తీరవయును. దధిG అత్రయనునపుడు ఇకారముండునుÑ యకారముండదు. దధ్యత్ర యని సంధించి పుకునపుడు యకారముండును, ఇకార ముండదు. అట్టిచో ఇకార యకారముకు ప్రకృతి వికృతి భావమెట్లు చెప్పనగును? కాబట్టి ఇకార స్థానిక యకారముభయపక్షముందును ఆదేశమే యగునుకాని వికారము కాజాదు.

‘‘ప్రకృత్యనియమాత్‌ ’’  2.2.51.

ప్రకృత్యనియమాత్‌ R వర్ణవికారముకు ప్రకృతినియమము లేక పోవుటవనను వికారవాదము యుక్తముకానేరదు.

మఱియు లోకమున, నేది దేనికి ప్రకృతియో యది దాని కెన్నడును వికృతికాక ప్రకృతిగా jనుండుటయే చూచుచున్నాము. ఇట్లే ఏది దేనికి వికృతియో యదిదానికి సర్వదా వికృతియే యగునుÑ గాని ప్రకీతి కానేరదు.

క్షరము దధికి ప్రకృతి. దధి ఓఈరమునకు వికృతి. ఈదధి క్షీరములో నొకప్పుడు దధి క్షీరమునకు ప్రకృతియగుటయు, మరియొక యెడ వికృతి యగుటచు జూడనేరము. క్షరము సర్వదా ప్రకృతియే. దధి వికృతియే.

వర్షవికారములో నిట్టిప్రీకథి వికృతి నియమము కానరావు. ‘దద్యత్ర’ యను స్థమున ఇకార స్థానమున ప్రకృతి, యకారము వికృతియగును. 

` ‘విధ్యతి’ అను స్థమున వకారోత్తర ఇకారము యకాస్థమున ప్రయోగింపబడుచున్నది. కాబట్టి యి యకారము ప్రకృతి, ఇకారము వికృతి యగుచున్నది. కాగా ఇకార యకారము ఒకచో ప్రకృతి భావమును, మరియొకచో వికృతిభావమును పొందుచు ప్రకృతి వికృతి నియమమును వ్యభిచరించు (న్లుంగించు) చున్నవి. కాబట్టి వికార వాదము యుక్తి సంగతము కాదని సూత్రాభిప్రాయము .

` (విద్యతి). వ్యధ R హింసాయం, అను ధాతురూపము, ‘ఇగ్యణః సంప్రసారణమ్‌’ అను సూత్రము నను సరించి వకారోత్తరయకార మునకు ఇకారమాదేశమగును. 


పూర్వపక్షము : `

‘నియమే నియమాన్నానియమః’’  2.2.5.2.

అనియమే R ప్రకృత్యనియమమున, నియమాత్‌ R నియమముండుట వన, అనియమఃR అనియమము, న R లేదు

ఇకార స్థానమున యకరాము, యకారస్థానమున ఇకారము ప్రయోగింపవయునను వ్యవస్థయొకటి వర్ణవికార విషయమున గాననగుచుండుట వన అనియమ మొక్కడ నున్నది? నియమమే కదు.

ఉత్తరపక్షము: `

‘‘నియమానియమవిరోధాదనియమే నియమాదప్రతిషేధః’’

2. 2. 53.

నియమానియమ విరోధాత్‌ R నియమము. అనియమము నను రెండును పరస్పరవిరుద్ధము. (అవి రెండు నొకయధికరణమున నుండజావు) కాబట్టి, అనియమే R ప్రకృత్యనియమమున, నియమాత్‌ R నియమముండుట వన, అప్రతిషేధఃR ప్రకృత్యనియమము కాదనుటతగదు.

ప్రకృత్య నియమములో నొక వ్యవస్థయున్నను ప్రకృతి కుండవసిన నియమమున్నట్లు కానేరదు. నియమమనగా నొక యర్థము నంగీకరించుట. అనియమ మన దాని నిషేధము. కాగా నియమానియమము పరస్పర విరుద్ధములై యొక యధికరణమున నుండజావు. అంగీకృతార్థము, ప్రతిషిద్ధార్థము రెండు నొక్కటి కానేరవుకదా! అనియమములో వ్యవస్థ యున్నంతమాత్రమున అనియమము నియమ మెన్నడును కాజాదు. కాబట్టి ప్రకృతి వికారము కుండవసిన నియమము లేకపోవుటవన ఇకార స్థానిక యకారమాదేశమే కాని వికారమెన్నడును కానేరదు.

(ఆ దేశమే వికారమని వ్యవహరింపబడుట)

‘‘గుణాంతరాపత్త్యుపమర్దహ్రాస వృద్ధిలేశ శ్లేషేభ్యస్తు

వికారోపపత్తే ర్వర్ణవికారాః’’  2.2.54.

గుణాంతరాపత్తి ఃR ధర్మియుండగా దర్మాంతరము కుగుట ఒకానొక పదమున అనుదాత్తముపోయి దాని స్థానమున నుదాత్త మేర్పడుట (ధధ్నా)

ుపమర్దఃR ధర్మిపోయి దాని స్తానమున మరొయొక ధర్మిప్రయోగింపబడుట (ఆస్థిస్థానమున భూప్రయోగము)

హ్రాసఃR దీర్ఘమునకు హ్రస్వము ప్రయోగించుట, (శ్రీసమ్‌)

వృద్ధిఃR హ్రస్వమునకు దీర్థము (ఆచీకమత)

లేశఃR లాఘవము, తగ్గింపు (స్తః)

శ్లేషః ప్రకృతికో, ప్రత్యమునకో యధికముగాచేరుట ః ఆగమము. (సంస్కర్తా)

గుణాంతరా....... శ్లేషేభ్యఃR గుణాంతరాదువన, వికారోపపత్తేఃR ఒకదాని ప్రయోగమున కన్యమును ప్రయోగించుట యను వికారము సంభవిచంఉట వన, వర్ణవికారాఃR ఇట్టితావులో వర్ణవికారమని చెప్పుట తగును.

పైన జూపినట్లు వ్యాకరణ శాస్త్ర రీతి ననుసరించి యా యా స్థముందు కుగు ప్రయోగవిదులో వికార శబ్ద ప్రయోగము చేయబడును.

(పదనిరూపణము)

‘‘తే విభక్త్యంతా ః పదమ్‌ ’’ 2.2.55.

తే R ఆవర్ణము, విభక్త్యాంతాఃR అంతమున విభక్తిగవై పదమ్‌ R పదమని వ్యవమరింపబడును.

విభక్తు రెండు విధము. నామికి. అఖ్యాతికి. నామ విభక్తి ‘సుప్‌’ అనియు అఖ్యాతవిబక్తి) క్రియావిభక్తి ) ‘తిజ్‌’ అనియు ననబడును. ఈ ‘సుప్‌’ ‘తిజ్‌’ు అంతము నందుగ వర్ణము పద మనబడును. వ్యాకరణాచార్యుడు పాణిని (సుప్‌ తిఙతం పదమ్‌) సుబంతము. తిఙంతము పదమని సూత్రించియున్నాడు. ఇట్లు పదము నామము, అభ్యాతము నని రెండు విధముగును.

(పదార్థ నిరూపణమున స:వయము)

‘‘వ్యక్త్యాకృతి జాతి సన్నిధా వుపచారాత్‌ సంశయ ! ’’

2.2.56.

వ్యక్త్యాకృతి జాతి సన్నిధౌ R వ్యక్తి, ఆకృతి, జాతి యను నీ మూడు నత్యం ంతసమీపవర్తు (అవినాభావ వృత్తు) ఆగుటచే, ఉపచారాత్‌ R గోవు అను పదప్రయోగమువన, సంశఃR పదమునకు వ్యక్తి అర్థమా? ఆకృతియా? జాతియా? యని సంశము కుగును. 

లోకమున సర్వత్ర పదమునకు, పదార్థమునకు సంబందప్రాప్తి యుండుటచేతనే పదప్రయోగము చేయబడుచున్నది. వ్యక్తి, ఆకృతి, జాతి యను నివి పదార్తము కాకున్నచో నాయర్థమున ‘పదము’ ప్రయోగింపబడనేరదు. వ్యక్త్యాకృతి జాతు పరస్ప మవినాభావ సంబందము కవిగా తెలియనగుచున్నటవి. గో పదము వన గో వ్యక్తియు, గో జాతియు తదాకృతియు తెలియుటచే నిందు పదమున కర్తమేది యని సంశయము పొడమును.

కొందఱు వ్యక్తి పదార్థమందురు. మరికొందరు ఆకృతియని నుడువుదురు. వేరొక కొందరు జాతి యందురు. వైదికుమాత్రము వ్యక్త్యాకతివిశిష్టజాతి వాకొనుచున్నారు.

గోవుమున్నగు ద్రవ్యము వ్యక్లునియు అవయవ సన్నివేశము ఆకృతియనియు, గోత్వాదు జాతి యనియు వివేకము. 

వ్యక్తియే పదార్తమను వాని సమాధానము.

‘‘యాశబ్దసమూహత్యాగపరిగ్రహసంఖ్యావృద్ధ్యుపచయ

వర్ణసమానానుబంధానం వ్యక్తాపుపచారాత్‌ వ్యక్త్తి ః ’’ 

2.2.57.

యా శబ్ద.. అనుబంధానమ్‌R యచ్ఛాబ్దాదు, వ్యక్తౌ R వ్యక్తి యందు, ఉపచారాత్‌ R ప్రయోగింపబడుటవన, వ్యక్తిఃR వ్యక్తి పదార్తము 

(1) యాశబ్దఃR ‘యా’ అను పదముతో కూడిన వాక్యము (యాగౌస్థిష్ఠతి. యాగౌర్నిసణ్ణా. ఏయావు నిుచున్నదో, ఏ యావుకూర్చున్నదో. ) ఈ వ్యాములో ఆవునకు కూర్చుండుట, నిుచుండు టయను క్రియకు సంబందము తెలియుచున్నది. గోపదమునకు వ్యక్తి అర్థముకాకా ఆకృతి జాతుగునెడ వాని కా క్రియతో నెట్లు సంబంధము పొసగును? వ్యక్తి ద్రవ్యమగుటచే నందు క్రియ గుగనగును. ఆకృతి జాతు నిష్క్రియగుటచే వానికి క్రియతో నన్వయము మీపడదు. కాబట్టి గోపదమున కర్థము దవ్యమగు వ్యక్తియే యని యభిప్రాయము.

(2) సమూహ ఃR సముదాయము (గవాంసమూహః) గోవు సమూహము. ఆవు సముదాయమును చూచి గోసమూ హమనిన నట ద్రవ్యసముదాయ మర్థమగునుకాని జాత్యాకృతు బోధపడవు.

(3) త్యాగః R దానము, తన స్వత్వమును విడిచి యందితరుకు స్వత్వమును కలిగించుట. (యాచకాయ గాందదాతి) యాచకునకు గోవు నిచ్చుచున్నాడు ఇట త్యజింపబడునది ద్రవ్యముకాని జాత్యాకృతు కావు.

(4) పరిగ్రహఃR ఒకనిచే నీయబడిన దానిని ఆదరపూర్వకముగా గ్రహించుట. (గాం పరిగృహ్ణాతి) గోవును గ్రహించుచున్నాడు. ఇట ద్రవ్యమే గ్రహణ యోగ్యముకాని జాత్యాకృతు కానేరవు.

(5) సంఖ్యా R గణన. (వింశతిర్గావః) ఇరువదియావు పదియావు. ఇటను వ్య్రమే.

(6) వృద్ధి ఃR వర్ధ్లిుట. (వర్ధతేగౌః) ఆవు పెరుగుచున్నది. ఇందునను ద్రవ్యమే.

(7) అపచయఃR క్షయము. (గౌరకృశ్యత్‌) గోవు కృశించినది.

(8) వర్ణ ఃR రంగు.

(9) సమాస ఃRR బాగుగా కూర్చుండుట.

(10) అనుబంధ ఃR సరూప ప్రజననము. తనవంటి దానిని జనింపజేయుట. ఇట్టి తావుందన్ని యెడ పదార్థము వ్యక్తియగును కాని జాత్యాకృతు కాజావని సూత్రాభిప్రాయము.

(వ్యక్తినాద నిరాకరణము).

‘‘ న తదనవస్థానాత్‌.’’ 2. 2.58.

తదనవస్థానాత్‌ R యాశబ్దాదు వ్యక్తియందే వ్యవస్థితము కాక పోవుట వన, న R వ్యక్తియే పదార్తమనుట తగదు.

యాశబ్దాదు కేవము వ్యక్తినే బోధించు పక్షమున వ్యక్తి పదార్థము కాగదు. గోవు నిుచున్నది అనినపుడు గోత్వవిశిష్ట గో వ్యఇక్త నిుచున్నది యను నర్థము సూచింపబడును. జాతిరహిత వ్యక్తి మాత్రము నిుచున్నదను వ్యవస్థ యెన్నడును కుగనేరదు. కాబట్టి జాతివిశిష్ట వ్యక్తియే పదార్థము కాగదు.

ఒకానొక పదప్రయోగమున కేవ వ్యక్తియే తెలియబడిన వినువానికి వ్యక్తి మాత్రము బోధపడి జాతి తెలియబడకుండ వసియుండును. లోకమున నట్లు చూచుట లేదు. నిుచుండుట మున్నగు క్రియు జాత్యాకృతుతో నవ్వయింపజావు. కాబట్టి వ్యక్తియే పదార్థమనుటయు సరిగాదు. కారణమేమన, క్రియాగుణము జాత్యాకృతుతో సాక్షాదన్వయము బొందజాక పోయినను వ్యక్తిద్వారా అన్వయింపవీగును. కాబట్టి యే దోషము నుండదని సూత్ర త్పాత్పర్యము. 

వ్యక్తి మాత్రుమ పదార్థముకాక జాతివిశిష్టవ్యక్తి పదార్తమగు పోమున కొన్ని యెడ కేవన వ్యక్తి యందు పద ప్రయోగమే చూడబడుచున్నదన.

‘‘సహచరణ స్ఖాన తాదర్థ్యవృత్త మాన ధారణ

సామీప్య యోగ సాధనాధిపత్యేభ్యో బ్రాహ్మణ

మంచకట రాజసక్తు చందన గంగా శాటకాన్న

పురుషేష్వతద్భావే -పి తదుపచారః’’ 2.2.59.

సహచరణ స్థాన ....... ఆధిపత్యేభ్యఃR సహచరణాదు వన, బ్రహ్మణాద్యర్థము లేకున్నను, అయర్థముం దెట్టా పదము ప్రయోగింపబడుచున్నవో యట్లే, తదుపచారఃR వ్యక్తి మాత్రమర్థము కాకున్నను వ్యక్త్యర్థముననే కొన్ని యెడ ప్రయోగింపబడును.

సహచరణమ్‌ R సాహచర్యము ` అవినాభావ సంబంధము స్థానమ్‌ R స్థితి, తాదర్థ్యమ్‌R తదర్థత, వృత్తమ్‌ R హిత ప్రవర్తనాది సమీపత, యోగఃR గుణాదుసంబంధము, సాధనమ్‌ R హేతువు, ఆధిపత్యమ్‌ R స్వామ్యము.

బ్రాహ్మణ ఃR బ్రాహ్మణుడు, మంచఃR మంచెమీదనున్న వ్యక్తి, కటఃR వీరణము, గంగాR గంగాసమీప్రదేశము, శాటకఃR వస్త్రము. అన్నమ్‌ R ప్రాణమ్‌

ప్రయోగము : ` (యష్టికాన్‌ భోయజÑ బ్రహ్మ దండాన్‌భోజయ) యష్టికును భుజింపజేయుము, బ్రహ్మ దండును భుజింపజే యుము. ఇట్టియెడ యిష్టిక బ్రహ్మాడండ శబ్దముకు వైదిక జ్ఞానోపదేశకులైన బ్రాహ్మణుని యర్థము. యష్టిక బ్రహ్మదండ శబ్దము డండవాచకముయ్యు బ్రాహ్మణార్థమున ప్రయోగింప బడినవిÑ కారణము సాహచర్యము.

(మంచాః క్రోశన్తి) మంచొ కేకువేయుచున్నవి. ఇట మంచెశబ్దము మంచెమీదనున్న వ్యక్తిని తొపును. స్థితి కారణము.

(కట మానయ) కటమును తెమ్ము. కటమనగా చాప. కాని యిట చాప అు్లట కనువైన తుంగను తెమ్ము అని యర్థము. (కటమునకు వీరణమని భాష్యకర్తు ప్రయోగించిరి. వీరణ మనగా తృణ విశేషమని వాచస్పతి మివ్రు భిప్రాయపడుచున్నారు. కాబట్టి నేను తుంగ యని వాడితిని.)

 (యమోరాజా, కుబేరోరాజా) యముడురాజు. కుబేరుడు రాజు. ఇట యను కుబేర శబ్దముకు రాజని యర్థము కాకున్నను రాజువలె ప్రవర్తించు వ్యక్తుయెడ ప్రయోగింపబడినవి.

(అఢకం సక్తవః) అడ్డెడుపేపిండి. మానెడు పేపిండి.

(తులాచందనమ్‌) తుమ్‌ చందనము.

(గంగాయాం గావశ్చరన్తి) గంగలో గోవు మేయుచున్నవి.

(కృష్ణః శాటకః) చీర నుపు.

(అన్నం ప్రాణః) అన్నమే ప్రాణము.

(అయం పురుషః కుమ్‌ ` గోత్రమ్‌) ఇతడు కుము ఇతడు గోత్రము.

ఈ వాక్యముందును పైన జూపినట్లు కొత, బరువు మున్నగా కారణమువన నొకపదము కొండొక విశేషార్థమున ప్రయోగింపబడుట మనము చూచుచున్నాము. కాబట్టి పదమునకు జాతివిశిష్ట వ్యక్తియే యర్థమైనప్పటికి కొన్ని యెడ కేవ వ్యక్తియందు నౌపచారికముగా ప్రయోగింపబడునని భావము. 

(ఆకృతియే పదార్థమనువాదము)

‘‘ ఆకృతిస్తదపేక్షత్వాత్‌ సత్వ వ్యవస్థాన సిద్ధేః’’   2.2.60.

(సత్వఃR గోవుమున్నగు ప్రాణు) సత్వవ్యవస్థానసిద్ధేఃR ఇది గోవు, ఇది అశ్వముÑ అను వ్యవహార వ్యవస్థాసిద్ధి, తదపేక్షత్వాత్‌ః ఆకృతిజ్ఞానము నపేక్షించుట వన, ఆకృతిఃR ఆకృతి పదార్థము.

 ప్రాణు యవయవము నియతమైన సన్నివేశము ఆకృతి యనబడును. అట్టి యాకృతి తెలియనంతవరకు ‘ఇదియావు’, ఇది గుఱ్ఱము’ అను లోకవ్యవహారమే సిద్ధింపదు. ఈ లోక వ్యవహారమును సాధించుటయే శబ్ద ప్రయోజనము. కాబట్టి ఆకృతియే శబ్దమునకు అర్థము. 

(పదమునకు జాతియే అర్థము.)

‘‘ వ్యక్త్యాకృతియుక్తేప్యప్రసంగాత్‌ ప్రోక్షణాదీనాం

మృద్గవకే జాతిః’’  2.2.61.

వ్యక్త్యాకృతియుక్తేపి R వ్యక్త్యాకృతుతో కూడియున్నను, మృద్గవకే ః మట్టితో చేయబడిన ఆవు విషయమున, ప్రోక్షణాదీనాం R ప్రోక్షణము (నీళ్ళు చ్లుట) మున్న గుక్రియు, అప్రసంగాత్‌ R ప్రసక్తము కాకపోవుట వన, జాతిఃR జాతియే పదార్థము.

గోదాన కర్మ విషయమును ‘గోవును ప్రోక్షింపుము’ గోవును ‘తీసికొనిరమ్ము’ ‘గోవునిమ్ము’ అనునిట్టి వ్యవహారము మృణ్మయ గోవు విషయమున ప్రయోగింపబడదు. కారణమేమి? మృణ్మయ గోవునందు వ్యక్తి, ఆకృతియు నుండినను గోత్వమను జాతి యుండదు. ఏదీ లేకుండుటచే పై ప్రయోగము చేయబడుట లేదో అదియే పదార్థము కాగడు. కావున జాతియే పదార్థమని తేుచున్నది. 

మృణ్మయ గోవును సైతము గోవు పదముచే వ్యవహరించునపు డట గోత్వమే యుండదని శంకింపజనదు. గోత్వము నిత్యమైనను ఆకాశమువలె సర్వగతముకాదు.  సాస్నాదుతో కూడిన గోపిండము ందే యుండును. మట్టితో చేయబడిన గోవు (బొమ్మ)లో గోత్వజాతియుండదని అభియుక్తు మతము. గోత్వము లేనియెడ గోపద వ్యవహారమెట్లు పొసగునందురేని వ్రాసిన చిత్రమును చూచి ‘అదిగో ఆవు ‘అదిగో గుఱ్ఱము’ అనునట్లు గౌణప్రయోగము నట స్వీకరించుటచే నెట్టి దోషము లేదు. కాగా, జాతియే పదార్థమని సూత్రాభిప్రాయము.

‘‘నాకృతి వ్యక్త్యపేక్షత్వా జ్ఞాత్యభివ్యక్తేః’’    2.2.62.

జాత్యభివ్యక్తేఃR జాత్యభివ్యక్తి (ప్రత్యక్షముగా కుగు జాతిజ్ఞానము) ఆకృతి వ్యక్త్యపేక్షాత్‌ R ఆకృతితో కూడిన వ్యక్తిజ్ఞానము నపేక్షించుట వన, న R జాతి పదార్తము కాదు.

వ్యక్త్యాకృతు గ్రహింపబడకున్నను జాతిజ్ఞానము కుగునెడ జాతి పదార్థము కాగుగును. వ్యక్తి, ఆకృతియు గ్రహింపబడని జాతిజ్ఞానము కుగనే కుగదు. కాబట్టి, కేవ జాతి పదార్థమనుట యుక్తముకాదు. 

వ్యక్తికానీ, ఆకృతికానీ, జాతికానీ పదార్థముకానిచో నెయ్యది పదార్థమున.

‘‘వ్యక్త్యాకృతి జాతయస్తు పదార్థః’’   2.2.63.

వ్యక్త్యాకృతి జాతయఃR వ్యక్తి, ఆకృతి, జాతియను నీమూడును నొకచోనొకటి, మఱియొకచో మఱియొకటియు ప్రధానతను వహించుచు పదార్థః R పదార్థహగును.

సూత్రమునందలి ‘తు’ పదము గౌణ ప్రాధాన్యభావము నందలి యనియమమును సూచించును. ఒకానొక పదమును ప్రయోగించినపుడా పదముచే వ్యక్త్యాకృతి జాతు మూడును బోధింపబడును. కాని వానిలో నొకటి ప్రధానముగను, మిగిలినవి యప్రధానముగను తెలియను. భేదము వివక్షితమై నపుడు వ్యక్తి ప్రధానమగును. ఉదా : ` ఆవు నిుచున్నది  ఆవు పండుకొని యున్నది. సామాన్యము వివక్షితమగుచో జాతి ప్రధానము ఉదా : ` గోవును కాలితో తన్నరాదు. ఆకృతి ప్రధానస్థమునకు దామరణము Ñ పిండితో గోవును చేయుము. 

(వ్యక్తి నిరూపణము)

‘‘ వ్యక్తిర్గుణవిశేషాశ్రయోమూర్తి ః’’     2.2.64.

గుణవిశేషావ్రయఃR రూపాదిగుణవిశేసము కాశ్రమయిన, మూర్తిఃR వ్యాపకముగాని పరిమాణముగ యుయవసంస్థానాత్మక మైన ద్రవ్యము, వ్యక్తిఃR ఇంద్రియగ్రాహ్యమై వ్యక్తియని చెప్పబడును.

వ్యాపక పరిమాణము కలిగియుండక రూపాది గుణ విశేషము కాధారముగానుండు ద్రవ్యము వ్యక్తియనబడును. ఇంద్రియముచే తెలియబడునది వ్యక్తియని భావము.

(వ్యజ్యతే గృహ్యతే ఇంద్రిjైుః ఇతి వ్యక్తిః )

(ఆకృతి నిరూపణ)

‘‘ఆకృతిర్జాతిలింగాఖ్యా’’       2.2.65.

జాతిలింగాక్యాః జాతి, లింగము (సంజ్ఞ)గా గలిగినది ` జాతిని తొపుట కసాధారణకారణము, ఆకృతిఃR ఆకృతి యనబడును.

దేనిద్వారా జాతియు దాని లింగమును తెలియబడునో యవి యాకృతియని వాత్స్యాయను.

దృష్టి గోచరమగుటయే తడువుగా దేనిద్వారా గోత్వాది జాతి చిహ్నితమగునో ` తెలియబడునో ` యదియే యాకృతి. నియత సన్నివేశముగ యవయవము జ్ఞానము వననే జాతి (గోత్వాది) గ్రహింపబడుచుండుట లోక సిద్ధము. (జాతే రస్త్రీ విషయా దయోపధాత్‌. అష్టా. 4.1.63.) అను వ్యాకరణ సూత్రమును వ్యాఖ్యానము చేయుచు భాష్యకారుడు పతంజలి మహర్షి (ఆకృతి గ్రహణాజాతిః) ఆకృతిచే గ్రహింపబడునది జాతి యని నిర్వచించియున్నాడు. (ఆకృతిఃR అవయవసన్నివేశవిశేషము. గ్రహణం R గ్రహణ సాధనముగా గలిగినది. జాతిఃR జాతియని యర్థము ) అనయవ సన్నివేశ విశేషముచే వ్యక్తపఱపబడినది జాతియని భావము. కాగా, గో మనుష్యాది ప్రాణు శిరః పాణ్యాద్యవ యవము నితయ సన్నివేశమును చూచినపుడు గోత్వమనుష్యాత్వాది జాతులెట్లు తెలియబడుచున్నవో యట్లు బ్రాహ్మణత్వాదికము తెలియబడకుండుటచే నవి జాతుకావు. ఉపాధుని వైదికు సిద్ధాంతము. బ్రాహ్మణత్వాదు యోని వ్యంగ్యముకాని యాకృతి వ్యంగ్యము కావనజ్లెదు. అట్లందుమేని యనేక వ్యంజకము నంగీకరింపవసివచ్చును. మఱియు, ఐతరేయ వ్యాస ప్రభృతి ఋషివర్యులో బ్రాహ్మణత్వ ముండి, యోని (బ్రామ్మణుననకు బ్రాహ్మణి యందు జన్మించు టయను) లేకుండుటచే నట్టివారియెడ జాతి క్షణ మవ్యాప్తమగును. కాబట్టి ఆకృతియే జాతి క్షణము. కాగా బ్రాహ్మణత్వాదు జాతుగావు. 

(జాతినికూపణము)

‘‘ సమాన ప్రసవాత్మికా జాతి ః’’  2.2.66.

సమాన ప్రసవాత్మికా R సమానాకారముగ జ్ఞానమును జనింపచేయ గలిగినది. జాతి ః జాతి యని యర్థము. 

అనేక భిన్నాధికరణములో సమాన జ్ఞానమును కలిగించునది జాతి యని చెప్పబడును. అనేకముయిన ఘటపటాది వస్తువులో ఇది ఘటము, ఇది ఘటము, అనియ అట్లే ఇది పటము, ఇది పటము అని యొకే విధమగు జ్ఞానమును కలిగించునది జాతి యనబడునని సూత్రాభిప్రాయము.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి