మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

జాతి నిగ్రహము - న్యాయ దర్శనము

న్యాయ దర్శనము

పూర్వాధ్యాయముందు ప్రమాణ ప్రమేయము పరీక్షింపబడినవి. ఈ యాధ్యాయమున జాతి నిగ్రహమును పరీక్షింపవదచి ముందు జాతిని విబాగించుచున్నాడు.

సాధర్మ్యవైధర్మ్యోత్కర్షాపకర్షవర్ణ్యావర్ణ్యవిక్ప సాధ్య

ప్రాప్త్యప్రాప్తి ప్రసంగ ప్రతిదృష్టాంతానుత్పత్తి సంశయ

ప్రకరణ హేత్వర్థాపత్త్యవిశేషోపపత్త్యుప బ్ధ్యనుపబ్ధి నిత్యా

నిత్య కార్యసమాః’’  5. 1.1.

సాధర్మ్యసమము, వైధ్మ్యసమము, ఉత్కర్షసమముర అపకర్షసమము, వర్ణ్యసమము, అవర్ణ్యసమము. విక్పసమము, సాధ్యసమము, ప్రాప్తిసమము, అప్రాప్తిసమము, ప్రసంగసమము, ప్రతిదృష్టాంత సమము, అనుత్పత్తిసమము. సంశయ సమము. ప్రకరణసమము, హేతుసమము, అర్థాపత్తిసమము, అవిశేషసమము, ఉపపత్తిసమము, ఉపబ్ధిసమము, అనుపబ్ధిసమము, నిత్యసమము. అనిత్యసమము, కార్యసమము, అను నీ యిరువది నాుగును జాతిలోగ భేదము.

వారి సాద్యధర్మమును స్తాపించుటకు హేతువుప్రయోగించినచో ప్రతివాది దావిని నిషేధింపగోరి ప్రయోగించు అసమర్థహేతువు జాతి యనబడును. అది యిరువదినాుగు విధము. 

అందుసాధర్మ్య వైధర్మ్య సమము :

‘‘సాధర్మ్య వైధర్మ్యాభ్యాముపసంహారే తద్ధర్మ విపర్య

యోపపత్తేః సాధర్మ్య వైధర్మ్య సమౌ’’  5. 1.2.

సాధర్మ్యవైదర్మ్యాభ్యామ్‌ R సమాన విశేషధర్మము ద్వారా, ఉపసంమరే R పక్షమున సాధ్యధర్మము నుపసంహరింపగా, తద్ధర్మ విపర్యయోపపత్తేఃRR సాధ్యదర్మప్రతిషేధము సిద్ధించినందువన, సాధర్మ్యవైధర్మ్యసమఃR సాదర్మ్యవైధర్మ్య సమము అనబడును.

వారి అన్వయవ్యాప్తిగ సాధర్మ్యముతో పక్షము నందు సాధ్యధరమ్మఉ నుపసంహరింపగా, ప్రతివావది సాధర్మ్యముతోనే సాధ్యమును ఖండిరప నుంకించి సాధర్మ్య సమజాతి యనబడును.

వాది వ్యతిరేక వ్యాప్తిగ వైధర్మ్యముతో పక్షమునందు సాద్యమును సాధింప, ప్రతివాది వైధర్మ్యముతోనే దానిని ప్రతిషేధింపగోరిన నది వైధర్మ్య సమజాతి యన బడును.

సాధర్మ్య సమమున కుదామరణము : `

శబ్దము అనిత్యము. ప్రయత్న జన్యమగుట వన. ఏది ప్రయత్న జన్యమో యది అనిత్యము. ఘటమువలె శబ్దము ప్రయత్న జన్యమే. అందువన నది అనిత్యము. శబ్దము, ఘటము నను నీ రెంటిలోను ప్రయత్న జన్యత్వమును సామాన్య ధర్మమున్నది. దాని తీనాధారముగా గొని శబ్ద మనిత్యమని సాధింప, జాతివాది మరియొక సమాన దర్మముతో శబ్దము నిత్యమనును.

శబద్మఉ నిత్యము, అస్పర్శమగుటవన, ఏది యస్పర్శమో యది నిత్యము. ఆత్మవలె శబద్మఉ అస్పర్శమే అందువన నది నిత్యము. ఇట శబ్దము, ఆత్మ అను నీరెంటియందును గ అస్పర్శత్వమను సమాన ధర్మమును తీసికొని యవి నిత్యముని సాధించెను.

ప్రయత్న జన్య సామ్యముచేత ఘటాదువలె శబ్దము అనిత్యమేకాని, అస్పర్శత్వ సామ్యముచేత ఆత్మవలె శబ్దము నిత్యముకాదని సాధింపగ శిశేష హేతువు ఇట చూపబడ లేదు. అట్టి విశేషహేతువు లేనంతవరకు కొండొక దర్మసామ్యముచే నొకవస్తువు అనిత్యమైన మరియొక దర్మసామ్యముచే నిత్యమేకాదని జాతివాది మతము.

వైధర్మ్య సమమున కుదామరణము : `

శబ్దము అనిత్యము ప్రయత్న జన్యమగుటవన, ఏది ప్రయత్న జన్యముకాదో యది నిత్యము. ఆత్మవలె శబ్దమట్లు ప్రయత్న జన్యము కాకపోదు ` కాబట్టి శబ్దము అనిత్యము

జాతివాది:` శబ్దము నిత్యము అస్పర్శమగుటవన, ఏది అస్పర్శము కాదో అది యనిత్యము. ఘటాదువలె, శబ్దము అస్పర్శముగాక పోదు. కాబట్టి శబ్దము నిత్యము.

‘‘గోత్వాద్గోసిద్ధివత్‌ తత్పితద్ధిః’’ 5.13.

గోత్వాత్‌ R గోత్వము (సాస్నాదిమత్యము) వన, గోసిద్ధివత్‌ R గోవుసిద్ధించినట్లు, తత్సిద్ధిఃR శబ్దమున అనిత్యత్వమును సద్ధించును.

సామాన్య విశేషదర్మము మాత్రమే సాధ్యమును సాధించునని చెప్పినచో జాతివాది వాదము యుక్తమే యగును సాధ్యముతో స్వభావముగా సంబద్ధమయిన ధర్మమునే సాధనముగా చెప్పియన్నందున జాతివాది ఖండనము యుక్తముకాదు. సాద్యవ్యాప్తి విశిష్ట సాధనము సాద్యసాధక మగును. జాతివాది ప్రయోగించిన హేతు వట్టిదికాదు.

శబ్దమును అనిత్యత్వము సాధ్యము. దానికి హేతువు ప్రయత్న జన్యత్వము. ఇది సాధ్యవ్యాప్తి విశిష్ట హేతువు. ఎటనెట ప్రయత్నజన్యత్వముండునో అట అనిత్యత్వము. తప్పకయండును. ఇందు వ్యభిచార ముండనేరదు. కాబట్టి సాధ్యసాదనము.

జాతివాదిహేతు వట్టిదికాక వ్యభిచరిత మగును. శబ్ధమున నిత్యత్వము. సాద్యము. అస్పర్శత్వము హేతువు. ఎట నెడ అస్పర్శత్తముడునో అట నిత్యత్వ ముండవయును. కదా! అది ఆత్మయందున్నను, బుద్ధియందులేదు. బుద్ధియంద స్పర్శత్వమున్నదికాని నిత్యత్వములేదు. కాబట్టి అస్పర్శత్వ హేతువు వ్యభిచరిత మగుచున్నది. సాధ్యసాధనము కాజాదు ఉత్కర్షసమ ఆది జాతిషట్కము :`

‘‘ సాధ్యదృష్టాంతయోర్థర్మ వికల్పాదుభయ సాధ్యత్వా 

చ్చోత్కర్షాపకర్ష వర్ణ్యావర్ణ్య విక్పసాధ్యసమాః’’  5.1.4.

సాధ్య దృష్టాంతయోఃR (సాధ్యము ` పక్షము ) పక్షమునందు, దృష్టాంతమునందును, ధర్మవికల్పాత్‌ R నానావిధ ధర్మక్పనవన

ఉభయసాద్యత్వాచ్చR పక్ష దృష్టాంతము రెండఱును సాద్యముగుట వన, ఉత్కర్షాపకర్ష వర్ణ్యావర్ణ్యవిక్ప సాధ్యసమాఃR ఉత్కర్షసమము, అపకర్షసమము, వర్ణ్యసమము, అవర్ణ్య సమము, విక్పసమము, సాధ్యసమము అను నారు జాతిభేదము లేర్పడుచున్నవి.

(1)  పక్షమున సాద్యమగు సిద్ధముచేయగా, దృష్టాంత సామ్యముతో నట ననిష్టదర్మము. నుపాదించుట ఉత్కర్షసమ మనబడును. ఉదా: ` శబ్దము అనిత్యము. ప్రయత్న జన్యమగుటవన. ఘటము వలె. ఇట శబ్దము పోము అనిత్యత్వము సాధ్యము ఘటము దృష్టాం తము. ప్రతివాది :` ప్రయత్న జన్యమగుటచే ఘటమువలె శబ్దము అనిత్యమగునెడ, ఘటమువలె శబ్దము రూపవంతము కావ యును. ఘట సాహ్యమున ఘటమువలె రూపవంతము కాకున్న అనిత్యమును కానేరదని భావము.

(2) పక్షమునందు సామ్యబముచేత విద్యమాన ధర్మమున కభావము నాపాదించుట అపకర్ష పనుము. వాది : ` శబ్దము అనిత్యము. ప్రయత్నజన్య మగుటవన ఘటమువలె. జాతివాది: ` శబ్దము అశ్రావణము Ñ ప్రయత్న జన్యమగుట వనÑ ఘటమువలె ఇట ప్రయత్న జన్యసామ్యము చేత ఘటము వలె శబ్దమనిత్యమైన, అట్టి సామ్యముచేతనే ఘటము అశ్రావణము. కాబట్టి శబ్దమును అశ్రావణము కావయును. అశ్రావణము కాని యెడ అనిత్యమును కాదని యభిప్రాయము. 

(3) దృష్టాంతమున పక్షధర్మము నాపాదించుట వర్ణ్యసమము.  వాది : ` శబ్దము, అనిత్యమ ప్రయత్న జన్యమగుటవన, ఘటమువలె, జాతివాది: ` ప్రయత్న జన్యతాసామ్యము వన ఘటమువలె శబ్దము అనిత్యమైన, (ఇట శబ్దము పక్షము, అనిత్యత్వము సాధ్యము) పక్షమైన శబ్దమునందలి ప్రయత్న జన్యత్వ సామ్యము ఘటమునందుండుట వన, ‘ఘటము అనిత్యము’ అని వర్ణింపుము. అట్లు వర్ణింపవేని శబ్ద మనిత్యమనియు వర్నింపవదుÑ అని ప్రతిషేధము.

ఘటమ నిత్యమని వర్ణించిన ఘటము దృష్టాతము కాక పక్షమగును. పక్షమున సాధ్యము సందిగ్ధమై ` అసిద్ధమై యుండునుÑ అని యంగీకరించి నట్లగును అట్లంగీకరించిన దృష్టాంతముగా దానిని ప్రయోగింప మీండదు. కారణమేమనÑ దృష్టాంతమున సాధ్యము సందిగ్ధముగా నుండక నిశ్చితముగా సిద్ధమై యుండును. కాబట్టి ఘటము దృష్టాంతము కాని పక్షమున, వాది తన సాద్యమును సిద్ధింపజేయుటకు దృష్టాంతము నంగీకరింపకపోవుటచే నసమర్తడగునని భావము.

(4) పక్షమున దృష్టాంతధర్మాపాదనము అవర్ణ్యసమము. 

వాది : `  శబద్మఉఅనిత్యముÑ ప్రయత్నజన్యమగుట వన ఘటమువలె జాతివాది : ` ప్రయత్న జన్య సాధర్మ్యము వన ఘటమువలె శబ్ద మనిత్యమదువేని, ఆ సాదర్మ్యము వననే ఘటమునందువలె శబ్దమునందు అనిత్యత్వము అసందిగ్ధమే ` నిశ్చితమే యగును. నిశ్చితమే యనిన శబ్ద మనిత్యమని శబ్దమున ననిత్యత్వము సాధింపనే? అని యెదుర్కొనును. 

(5) సాధనధర్మముతోకూడిన దృష్టాంతమునందు, ధర్మాంతర దర్శనమువన, పక్షమునందు సాధ్యధర్మవిక్పము నాపాదించుట ` విక్ప సమము. వాది : ` శబ్దము అనిత్యము. ప్రయత్న జన్యమగుటవన ఘటమువలె. జాతివాది : ` ప్రయత్న జన్యమయిన ద్రవ్యములో ఘటకర్పరము పురుషము గాను. దుకూలాద ుదు మృదుముగాను చూడబడుచున్నవి. ఘటాదులో మృదుపరుష విరుద్ధ దర్మమున్నట్లు ప్రయత్న జన్యమగుటచేత శబ్దమునందును నిత్యత్వము, అనిత్యత్వము నను విరుద్ధధర్మఉ ుండవయును. కాబట్టి శబ్దము నిత్యము నగును.

(6) పక్ష దృష్టాంతము సామ్యము చేత సాధ్యత్వము నాపాదించుట సాధ్యసమము.  వాది : ` శబ్దము అనిత్యము. ప్రయత్నజన్యమగుటవన, ఘటమువలె. జాతివాది : ` శబ్దము ఘటమువంటిదిjైున ఘటము శబ్దమువంటి దనుటలో సందేహము లేదు. అట్లయిన శబ్దము అనిత్యమనుటెట్లు సాధ్యవిషయమో ఘటము సైతమట్లే సాధ్యవిషయమగును. ఘటమనిత్యమనుట సాధ్యము కాదందువేని శబ్దము అనిత్యము. ఘటమువలె నను టెట్లు పొసగును? సొసగదు.

ఇటీÊ సూత్రమున సాధ్య దృష్టాంతము ధర్మవిక్పము వన నైదు జాతిభేదము, పక్షము దృష్టాంతము రెండును సాధ్యమనుటవన సాధ్యసమమను నొకజాతిభేదమును వర్ణింపబడినవని వివేకము.

‘‘కించిత్‌ సాధర్మ్యా దుపరసంహారసిద్ధేః వైధర్మ్యా

దప్రతిషేధః’’ 5.1.5.

కించిత్సాదర్మ్యాత్‌ R వ్యాప్తితో కూడిన సాధర్మ్యము వన, ఉపసంహారసిద్ధేఃR పక్షమున సాద్యసాదనము సిద్ధిచుటవన, వైధర్మ్యాత్‌ R వ్యాప్తిరహితమైన సాధర్మ్యమువన, అప్రతిషేధ ః పక్షమున సాధ్యవిపర్యయము సిద్ధింపనేరదు.

ప్రయత్న జన్యత్తము అన్యిత్వముతో వ్యాప్తమై యున్నది . జాతి వాదిచే చెప్పబడిన రూపాదు అట్లు వ్యాప్తము కావు. కాబట్టి యతని వాదము నిస్సారము.

(1) ప్రయత్న జన్య మనిత్యమైనట్లు, ప్రయత్న జన్యమైనదంతయు రూపవంతముకాదు. ఉదా :` కర్మ ప్రయత్న జన్యమే కాని రూపవంతముకాదు.

(2) ప్రయత్నజన్యమయిన అశ్రావణము కావయునను నియమములేదు. శబ్దధ్వంసము ప్రయత్నజన్యమేకాని అశ్రావణము కాదు. శ్రావణమే.

(3) ప్రయత్నజన్యమైనది యనిత్యమనుటలో సందిగ్ధమని కాని, అసందిగ్ధమని కానీ నియమింపవనుపడదు, ఘటము ప్రయత్నజన్యమేÑ కాని దాన ఇయనిత్యత్వము సందిగ్ధమెన్నడు కాదు. నిశ్చితమే. కాని శబ్దము ప్రయత్న జన్యమైనను, అది నిత్యమా? యనిత్యమా? యని సందేహింపబడుచున్నది వాది ప్రతివాదుకు విరోధములేని తావుందు సందేహము కుగదు. విరోధబుద్ధి యున్న యెడ సందేహము కుగును ఘట మనిత్యమనుట ఇరువురకు సమ్మతమే ????? ఘటమున ననిత్యత్వము సందిగ్ధముకాదు. శబ్దము..?????? సందిగ్ధమగుచున్నది. 

(4)  ప్రయత్న జన్యము నిత్యమనుటయు తగదు. ఘటాదు ప్రయత్న జన్యములేÑ కాని నిత్యము కావు.

(5) సాధర్మ్య మున్నంతమాత్రము నిది యిట్లే యుండవయునని కానీ, నిది యిట్లుండరాదని ప్రతిషేధించుట కానీ వనుపడదు.

‘‘సాధ్యాతిదేశాచ్చ దృష్టాంతోపపత్తేః’’  5. 1.6.

సాధ్యాతిదేశాత్‌ R సాధ్యాతి దేశమువన, దృష్టాంతోపపత్తేఃR దృష్టాంత ముపపన్నమగుటచే ప్రతిషేధము తగదు.

(ఒక వస్తు ధర్మమునకు మఱియొక వస్తువునందు గ సంబంధము అతిదేశ మనబడును.) ఘటము ప్రయత్న జన్యమై యనిత్యమైనట్లు శబ్దము సైతమనియన్న శబ్దమున ఘటము యొక్క అభేదమును అతి దేశించినట్లగును. అట్టియెడ శబ్దము వలె ఘటము సైతము అనిత్యమని సాధింపవసి యుండును. దృష్టాంతదార్‌ ష్టాంతములో భేదముండుట తప్పనిసరికాబట్టి యభిన్నమునుట తగదు. కాబట్టి అభేదము నతిదేశింపజనదు. ఘటమునగ అనిత్యత్వ ధర్మము నదతిదేశించి నంత మాత్రమున దర్ము భిన్నముని సాధింపబడవు. కాబటిÊ పక్షమున సాదనీయ దర్మ విపర్యయము పొసగదని భావము.

ప్రాప్త్యప్రాప్తి సమము : `

‘‘ప్రాప్యసాధ్య మప్రాప్యవాహేతోః ప్రాప్త్యా-విశిష్ట 

త్వాత్‌ అప్రాప్త్యా-సాదకత్వాచ్ఛ ప్రాప్త్య ప్రాప్తి 

సమౌ  5.1.7.

సాద్యం R సాధ్యధర్మ విశిష్టమును (పక్షమును) ప్రాప్యR చేరికాని, అప్రాప్యనా R చేరకకానీ, హేతో ఃR హేతువు సాధ్య సాధకమైన, ప్రాప్త్యప్రాప్తిసమౌ R ప్రాప్తిసమ జాతిభేదముగును. కారనమేమన, ప్రాప్త్య R హేతువు సాద్యప్రాప్తి చే, అవిశిష్టత్వాత్‌ R విశేషభేదము లేనిదగుటవన, అప్రాప్త్యాచ R సాద్యమును చేరకపోవుటచేతను, అసాధకత్వాత్‌ R సాధింపనందువన.

శబ్దము అనిత్యము. ప్రయత్న జన్యమగుటవన. అనుస్థమున ప్రయోగింపబడిన హేతువు సాద్యమునుచేరి సాధించునా? లేక చేరకయే సాధించునా? సాద్యమును చేరి యందు మేని హేతువు సాద్యములో కలిసి సాద్యమేయగును. సాద్యసాధనముకు భేదమే లేకుండును. అట్టియెడ దేనికేది సాద్యమగును? భేదము లేకున్న సాద్యసృాదనభావ ముపపన్నము కాదు. కాబట్టి హేతువు సాద్యముతో చేరి దానిని సాధించు ననుట తగదు. చేరకయే సాధించునందుమా? అన్నియు సన్నిటిని సాధింపనగును. ఈ సాధ్యమున కిదియే సాధకమున చేరక దానిని సాధించుననుటయు నొప్పదని భావము. ఇట్లు ప్రాప్తి క్షణ అప్రాప్తిక్షణ హేతు సాధర్మ్యముతో నెదుర్కొనుటను ప్రాప్తిసమము అప్రాప్తి సమము అందురు. 

‘‘ఘటాది నిష్పత్తి దర్శనాత్‌ ’’ 5.1.8.

‘‘ఘటాది నిష్పత్తిదర్‌వనాత్‌ R సాద్యమును చేరి దండాది సాధనము ఘటాదు నుత్పన్నముచేయుట చూచుచున్నాము కావున ప్రతి షేదము తగదు.

హేతువు పక్షము నందుండకున్న నది యసిద్ధమగును. కాబట్టి పక్షమును చేరి హేతువు సాధకమగును. డండ చక్రాదు హేతువు అవి పక్షభూతమైన మృత్తికను చేరి ఘటాదు నుత్పన్నము చేయును. దండాదు మృత్తికను చేరినంత మాత్రమున మృత్తికకు అభిన్నము కావు. కాబటిÊ టఅభిన్నములైన సాద్యసాధకభావము సంభవము కాదనరాదు.

ప్రసంగసమ ` ప్రతిదృష్టాంత సమ జాతిభేదము : `

‘‘దృష్టాంతస్య కారణానపదేశాత్‌ ప్రత్యవస్థానాచ్చ

ప్రతిదృష్టాంతేన ప్రసంగ ప్రతిదృష్టాంతసమౌ’  5.1.9.

దృష్టాంతస్య R దృష్టాంతము, కారణాపనపదేశాత్‌ R సాద్యంవతం మనుటకు ప్రమాణము చెప్పకపోవుట వన, ప్రతిదృష్టాంతేన Rప్రతికూట దృష్టాంతముతో, ప్రత్యవస్థానాన చ  సాద్యవిపర్యయము నాపాదించుట వనను. ప్రసంగ ప్రతిదృష్టాంతసమౌ R ప్రసంగసమ ` ప్రతి దృష్టాంతసమజాతి భేదము.

పక్షమునందు సాద్యమున్నది ఋజువు చేయుటకు గాను ఘటము నుదామరింతురు గదా ! అట్టి ఘటమునందు సాద్యమున్నదని చెప్పుటకు ప్రమాణము చెప్పవసియుండును. అట్లు చెప్పబడదు. పక్షమునందు సాధ్యమున్నదా? లేదా? యని ప్రశ్నించుట కవకాశమున్నట్లు దృష్టాంతము నందును సాధ్యధర్మమున్నదా? లేదా యని యడుగుట కవకాశము లేకపోలేదు. కాబట్టి దానికి ప్రమాణ మొసంగ వయును. ఇత్తురేని నట మర ప్రమాణప్రసక్తి గుగును. ఇట్లనవస్థ యేర్పడ గదని యెదుర్కొనుట ` పక్షమున సాధ్యాభావము నుపపన్న మొనర్చుటకు చేయు ప్రసంగము` ప్రసంగ సమము.

శబ్దము అన్యితము Ñ ప్రయత్న జన్యమగుటవన, ఘటమువలె. అనుస్థమున ఘటము దృష్టాంతము. ఆకాశము ప్రతిదృష్టాంతము ఘటమువలె శబ్దమనిత్యమైన ఆకాశము వలె శబ్దము నిత్యమే కాదని కేవము ప్రతికూ దృష్టాంతముతోనే సాధ్యాభావమును సాధింపనెంచుచు హేతువు నుపేక్షించుట ప్రతిదృష్టాంత సమము.

‘‘ ప్రదీపోపాదాన ప్రసంగనివృత్తివత్‌ తద్వినివృత్తిః’’  5. 1.10..

ప్రదీపోపాదాన ప్రసంగ నివృత్తివత్‌ R ప్రదీపమును దర్శించుటకు మరొయొక దీపమును గ్రహింపవయునను ప్రసక్తి నివృత్తి చెందినట్లు, తదివ్వనివృత్తి ఃR దృష్టాంతము సాద్యవంతమని ఋజువు చేయుటకు ప్రమాణగ్రహణ ప్రసంగమును నివర్తించును.

ఘటపటాది ద్రవ్యమును చూచుటకు దీపమును గ్రహింతుము. ఆ దీపమును చూచుటకై మరియొక దీపము గ్రహింపనవసర ముండదు. అది స్వయముగానే తెలియబడును. అట్లే పక్షము సాధ్యమును సిద్ధింపజేయుటకు దృష్టాంతమును గ్రహింతుము. కాని దృష్టాంతమున సాధ్యమున్నదని రూపింపవేరొక దృష్టాంతము గ్రహింప నవసరముండదు. దృష్టాంతమున సాద్యమున్నట్లంతకు పూర్వమే నిశ్చయింపబడును. అట్లు నిశ్చిత సాధ్యము కదియే దృష్టాంత మన బడును. సందిగ్ద సాద్యమెన్నడు దృష్టాంత మనబడదు. అది పక్షమే యనబడును, కాబట్టి దృష్టాంతమున సాధ్య సాధనమునకై ప్రమాణము చూపవయునని యెదుర్కొనుట యుక్తము కాదు.

‘‘ ప్రతి దృష్టాంతహేతుత్వేచ నా హేతుర్దృష్టాంతః’’ 5.1.11.

ప్రతిదృష్టాంత హేతుత్వేచ R ప్రతిదృష్టాంతము సాధకమగు నెడ, దృష్టాంతఃR వాదిచేనీయబడిన దృష్టాంతము, నా హేతుఃR అసాధకముకాదు.

ప్రతి దృష్టాంతమెల్లో దృష్టాంతమునటేÊ యగుటవన, ప్రతిదృష్టాంతము సాధకమగునెడ దృష్టాంతమును సాధ్యసాధక మగును. దృష్టాంతము సాధకముకాక ప్రతిదృష్టాంతమే సాధకమగు ననుటకు విశేష హేతువు చెప్పవసి యుండును. అట్లు చెప్పలేదు దృష్టాంతము సాధ్యసాదక మనుటకు వివేష హేతువున్నది అదే సాద్యవ్యాప్తి. సాధ్యవ్యాప్తి ప్రతిదృష్టాంతమున నుండదు. కాబట్టి ప్రతిదృష్టాంతము సాధకము కాదు.

అనుత్పత్తి సమక్షణము : `

‘‘ప్రాగుత్పత్తేః కారణాభావాదనుత్పత్తి సమః’’ 5.1.12.

ఉత్పత్తేఃప్రాక్‌ R ఉత్పత్తికి పూర్వము, కారణాభావాత్‌ R సాదకమైన హేతువు లేకుండుటవన, అనుత్పఇ్తనమఃR అనుత్పత్తి సమజాతి భేదమగును.

శబ్ద మనిత్యముÑ ప్రయత్నానంతరీయక మగుటవన, ఇట, శబ్ద మనిత్యమైన నది యుత్పత్తి దర్మము కదనవయును. అగుచో నుత్పత్తికి పూర్వమనుత్పన్నమగును. శబ్ద ముత్పన్నము కానపుడు దానియందనిత్యత్వమును, సాధించు ప్రయత్నానంతరీయకత్వమను హేతువును లేదని యొప్పుకొనక తప్పదు. ఇట్లు ప్రయత్నానంతరీయ కత్వాభావము వన శబ్దము నిత్యమని సద్ధించును కాని యనిత్యము కాదు. అనుత్పన్న తంతువు పటమునకు కారణము కాజానట్లు, శబ్దోత్పత్కి తీఇపూర్వము అనుత్పన్న ప్రయత్నానంతరీయకత్వమును అనిత్యత్వమునకు కారణము కాదని అనుత్పన్నమైన హేతు సాదర్మ్యముతో సాధ్యవిపర్యయమును సాధింప నెంచుట అనుత్పత్తి సమజాతిభేద మనబడునని భావము. 

‘‘తథాభావాదుత్పన్నస్య కారణోపపత్తేర్న కారణ

ప్రతిషేధ ’’  5. 1.13.

ఉత్పన్నస్య R ఉత్పన్నమైన తదుపరి, తథాభావాత్‌ R సాద్యధర్మా వ్రయముగా సందేహింపబడుటవన, కారణోపపత్తేఃR హేతువు పపన్న మగుటవన, కారణప్రతిషేధఃన R కారణనిషేధము యుక్తము కాదు.

శబ్ద ముత్పన్నమైన తరువాతనే యం దనిత్యత్వము సాద్యముగా సాధింపబడును. ఉత్పత్తికి పూర్వము శబ్ద మనిత్యమని యెవరును సాధింపబోరు. ఉత్పన్న శబ్దమునందు ప్రయత్నానంతరీయకత్వమను హేతువుపపన్న మగుటలో నెట్టి యాటంకమును లేదు. కాబటిÊ పై ప్రతిషేధము నిర్హేతుకము. సంశయసమము :`

‘‘సామాన్య దృష్టాంతయో రైంద్రియకత్వే సమానే

నిత్యానిత్య సాధర్వామ్యత్సంశయ ః ’’  5. 1.14.

సామాన్య దృష్టాంతయోఃR పక్షముననుండు సామాన్యము దృష్టాంతమునను నీ రెండును, ఐంద్రియకత్వే R ఇంష్ట్రద్రియగ్రాహ్యము టగుటలో, సమానే R సమానముకాగ, నిత్యానిత్యసాధర్మ్యాత్‌ R నిత్యమైన సామాన్యము యొక్కయు, అనిత్యమైన దృష్టాంతము యొక్కయు సాధర్మ్యమువన, సంశయః R సంశయసమజాతి భేదము.

నిత్యానిత్యము సామ్యముచేత పక్షమున సాధ్యసంశయుము నుద్భావించుట సంశయసమ మగును.

శబ్ద మనిత్యము. ప్రయత్నానంతరీయకమగుటవన, ఘటమువలె. ఇట శబ్దము పక్షము. అందలి సామాన్యము శబ్దత్వము. శబ్ద మైర్రదియక మగుటచే తదగ్గత సామాన్యము (శబ్దత్వము) ను ఐర్రది యకమే (ఇంద్రియగ్రాహ్యమే). కాని యది నిత్యము. దృష్టాంతముగా నొసగబడిన ఘటమును ఐంద్రియకమే. కాని యది యనిత్యము. ఇట్లు అనిత్యమైన శబ్దము, నిత్యమైన శబ్దత్వమనెడి సామాన్యము, రెండును ఇంద్రియ గ్రాహ్యములే. అందు ఘటసామ్యముగ ప్రయత్నాంతరీయకత్వ హేతువుచే శబ్దమున అనిత్యత్వము నిర్ణయింతురేని, నిత్యమైన శబ్దత్వము, అనిత్యమైన ఘటము నను నీ రెండిటి సామ్యమముగ ఐంద్రియకత్వ హేతువుచే శబ్దమున అనిత్యత్వమే సందేహింపరు? సందేహము కుగదేని నిర్ణయమునుకుగదని యొకదర్కొనుట సంశయసమ మనబడును.

‘‘సాధర్మ్యత్‌ సంశయో న సంశయో వైధర్మ్యాదుభ

యథాచ సంశయో-త్యంత సంశయ ప్రసంగోనిత్యత్వా

నభ్యుపగమాచ్చ సామాన్యస్యాప్రతిషేధః’’ 5.1.15.

సాధర్మ్యాత్‌ R సామానధర్మజ్ఞానము వన, సంశయే R సంశయము కలిగినప్పటికి, నసంశయఃR సంశయము కుగుట సంభవింపదు. వైధర్మ్యాత్‌ R విశేషధర్మ జ్ఞానమువన, ఉభయథాచ R సాదర్మ్య వైధర్మ్యజ్ఞానము వనను, సంశయే R సంశయము కుగునని, అత్యం సశయఃR అత్యంత సంశయ ప్రసక్తికుగును, సామన్యస్యచ R విశేష ధర్మజ్ఞాన సహితమైన సాధర్మ్యజ్ఞానము, నిత్యత్వానభ్యుప గమాత్‌ R నిత్యసంశయ హేతువని యంగీకరింపనందున, అప్రతిషేధఃR సాద్యప్రతిషేధము తగదు.

సమానధర్మజ్ఞానముమాత్రమే సంశయమునకు కారణమయిన, నిత్యానిత్యములైన శబ్దత్వ ఘటోభయ సాధారణ ధర్మమైన ఐంద్రియక త్వ జ్ఞానమువన సంశయము కుగును. కాని సమానదర్మజ్ఞానము సంశయకారణము కాదఱు. విశేష ధర్మజ్ఞానము లేని సామాన్య ధర్మజ్ఞానము సంశయమునకు కారణము. శబ్దమున నైంద్రియకత్వ సాధర్మ్యజ్ఞానమున్నపుడు అనిత్యత్వ సాధకమయిన కృతకత్వమేనెడి విశేష దర్మజ్ఞానము లేకపోలేదు. అది యున్న సంశయము కుగనేరదు. శిరః పాన్యాద తీఇశిశేష ధర్మజ్ఞాన మున్నపుడు ఉన్నతత్వాది సామాన్య థర్మజ్ఞానము స్థాణువా? పురుసుడా? యను సందేహము కలిగింపలేదుకదా ! విశేష ధర్మజ్ఞాన మున్నపుడును సామాన్య దర్మజ్ఞానము సంశయము కలిగించునెడ సంశయము విచ్చిన్నము కానేరదు. కారణమైన సాదర్మ్యజ్ఞానముండ కార్యమైన సంవయము నశింపనేరదని భావము. విశేష ధర్మజ్ఞాన సహితమయిన సామాన్య ధర్మజ్ఞానము సంశయమునకు కారణముగా నంగీకరింప బడదు. కాబట్టి సంశయము నుద్భావించి పక్షమున సాధ్యమును ప్రతిషేధించుట యుక్తము కాదని భావము.

ప్రకరణసమక్షణము : `

‘‘ఉభయ సాధర్మ్యాత్‌ ప్రక్రియా సిద్ధేః ప్రకరణ సమ ః’’  5.1.16.

ఉభయ సాదర్మ్యాత్‌ R నిత్యానిత్యోభయముతో సాధర్మ్యముండుట వన, ప్రక్రియాసిద్ధే ః R ప్రకరణము సిద్ధించుటవన, ప్రకరణ నమఃR ప్రకరణ సమమగును.

వాది అనిత్యసాదర్మ్యముతో పక్షమున సాధ్యమను సాధిం ప్రతివాదినిత్యసాధర్మ్యముతోను, వాది నిత్యసాదర్మ్యముతో సాధ్యమును పక్షమున సాధింప ప్రతివాది యనిత్యసాధర్మ్యముతోను సాధ్యాభావ మును సాధింప యత్నించుట ప్రకరణసమ మనబడును.

వాది : ` శబ్దమనిత్యము, ప్రయత్నానంతరీయకమగుట వన ఘటమువలెనని శబ్దమున ననిత్యత్వము సాధింపగా, జాతివాది :` భవ్దము నిత్యము శ్రవణగ్రాహ్యమగుట వన శబ్దత్వము వలెనని శబ్దమున నిత్యత్వమును సాధించును. వాది : ` శబ్దము నిత్యము. శ్రావణ మగుటవన, శబ్దత్వము వలెనని, జాతివాది : ` శబ్ద మనిత్యము. ప్రయత్నానంత రీయకమగుటవన, ఘటమువలె ననును.

‘‘ప్రతిపక్షాత్ప్రకరణ సిద్ధేః ప్రతిషేధా నుపపత్తిః 

ప్రతిపక్షోపపత్తే ః ’’  5.1.17.

ప్రతిపక్షోపపతేÊ తఃR ప్రతిపక్ష ముపపన్నమగుటవన, ప్రతిపక్షాత్‌R ప్రతిపక్ష సాదనమువన, ప్రకరణసిద్ధేః R ప్రతిపక్షము సిద్ధించుట వన, ప్రతిషేధానుపపత్తి ఃR వాదిపక్షము ప్రతిఘటింపబడదు. 

నిత్యానిత్యముగు ఉభయసాధర్మ్యముద్వారా తన పోము సిద్ధించుననిచెప్పు ప్రతివాది వాదిపక్షసిద్ధిని సైత మంగీకరించిన వాడగును. ప్రతివాదిచే నుపపాదింపబడు రెండు పక్షములో నొకపక్షము వాదిదిjైు యుండును. కావున నట్లంగీకరింప తప్పదు. కాబట్టియీ ప్రతిషేధము నిరుపయోగమని భావము.

అహేతుసమ క్షణము : `

‘‘త్రైకాల్యాసిద్దేర్హేతో రహేతు సమ ః ’’  5. 1.18.

హేతో ః R సాధనము, త్రైకాల్యాసిద్ధే ః R సాధ్యమునకు పూర్వోత్తర సమకాముందు సాదకముగా సిద్ధింపనందున, అహేతుసమ ఃR అహేతు సమమగును.

శబ్దమనిత్యము. ప్రయత్నానంతరీయక మగుటవన, ఘటమువలెనని వాది ప్రయోగించును. ఇట ప్రయత్నానంతరీకయక మను నీ హేతువు సాద్యమునకు పూర్వమేర్పడునా? లేక తరువాతనా? పూర్వమందువేని హేతుత్వమే సిద్ధింపదు. సాధ్యము లేనిది హేతువుదేనికి? సాధ్యమన హేతుమంతము, హేతుమంతము లేనిది హేతువెట్లు సిద్ధించును? తరువాత సిద్ధించునందువా? అదియును పొసగదు. సాధ్యము ముందే సిద్ధించిన హేతువు (సాధకము) తరువాత సిద్ధించి చేయునదేమి? సాద్యమును సిద్ధింపజేయుట కే కదా సాధన ముపయోగించును? సాధ్యముతో హేతువునకు సహభావ మందువా? అదియు నిరర్థకమే. హేతువు హేతుమతము నను రెండును ఒకే సమయమున నెట్లేర్పడగవు? సమభావము కవానిలో నేది దేనికి కారణమో, దేనికెయ్యది కార్యమో నిశ్చయించు టెట్లు సవ్యదక్షిణ శృంగములో సాధ్యసాధన భావ మంగీకరింపనగునా? యని యిట్లు హేతువును అహేతువుగా నిరూపించి ప్రతిగటించుట అహేతుసమమనబడును.

‘‘న హేతుత ః సాద్యసిద్ధేస్త్రైకాల్యాసిద్ధిః’’ 5.1.19.

హేతుత ఃR సాధనమువన, సాద్యసిద్ధేఃR సాద్యము సిద్ధించుట వన, త్రైకాల్యాసిద్ధి ఃR హేతువు త్రికాముందు సిద్ధింపదనుట, న R తగదు.

దేనివన నేది సిద్ధించునో యది దానికంటె ముందుండవ యుననునది నియమము. హేతువువన సాద్యము సిద్ధించుట ప్రత్యక్షవిషయము. ప్రత్యక్షమున ప్రవ్ను తగవు. సాద్యము లేనపుడు దేనికి హేతువని ప్రశ్నించుటయు తగదు. ఏది సాధింపబడునో దానికిది హేతువని చెప్పనగును కదా? కాబట్టి హేతువు త్రికాము ందు సిద్ధింపదనుట అయుక్తము. 

‘‘ప్రతిషేధానుపపత్తేశ్చ ప్రతిషేద్ధవ్యాప్రతిషేధ ః’’ 5. 1.20.

ప్రతిషేదానుపపత్తేశ్చ R ప్రతిషేధ ముపపన్నము కాకుండుట వనను, ప్రతిషేద్ధవ్యాప్రతిషేధఃR హేతు ప్రతిషేధము అయుక్తము. 

హేతువు సాద్యమునకు పూర్వముకాని, పరమునకానీ, తోడ్తోకానీ, సిద్ధింపదనిని, ప్రతివాదిచే చేయబడు హేతు ప్రతిషేధము సైతము, తాను ప్రతిషేధింపవదచిన హేతువు కంటె పూర్వ ` పర ` సమకా ములో నెట్లు సిద్ధించునో చెప్పవసియుండును హేతువుకంటె పూర్వమే ప్రతిషేధ మనిన దేనికది ప్రతిషేధము ? తరువాత ననిన ప్రతిషేద్ధవ్యమగు హేతువు పూర్వమే ప్రతిషేధింపబడిన తరువాత ప్రతిషేధమెందుకు? సమభావమనిన నేది దేనికి ప్రతిషేధము? కాబట్టి ప్రతిషేధము నిర్యుక్తికకము. 

అర్థాపత్తిసమక్షణము : `

‘‘ అర్థాపత్తిత ః ప్రతిపక్షసిద్ధే రర్థాపత్తిసమ ః ’’ 5. 1.21.

అర్థాపత్తిత ఃR అర్థాపత్తిచే, ప్రతిపక్షసిద్ధేఃR ప్రతిపోము సిద్ధిం

చుటవన, అర్థాపత్తిసమః అర్థాపత్తిసమ మనబడును.

పక్షమున సాధ్యాభావము సిద్ధమొనర్చుటకు అర్థాపత్తి సాధర్మ్యముతో ప్రతిఘటించుట అర్థాపత్తి సమమగును.

శబ్ద మనిత్యము ఘటమువలె ప్రయత్నానంతరీయక మగుటవన నని ప్రయోగింప, ఘటసామ్యమువన శబ్దమనిత్య మయిన నాకాశమతఱుఓ సస్పర్శత్వ సామ్యముండుట వన శబ్దము నిత్యమని తేుచున్నదని యర్థాపత్తితో చేయు ప్రతివాదిప్రతిషేధము అర్థాపత్తిసమ మనబడును’

‘‘ అనుక్తస్యార్థాపత్తే ః పక్షహానేరుపపతిÊ ంతరనుక్తత్వా

దనైకాంతిక త్వాచ్ఛార్థాపత్తేః’’ 5. 1.22.

అనుక్తత్వాతÊ R ప్రతివాదిచే చెప్పబడక పోవుటవన, అర్థాపత్తేశ్చ R అర్థాపత్తివన ప్రాప్తించుట వనను, అనైకాంతికత్వాత్‌ R ఒకేపక్షము నియతము కాకపోవుటవన, అనుక్తస్య R ఉక్తముకాని దంతయు, అర్థాపత్తేR అర్ధాపత్తివన, పక్షహానేఃR ప్రతి పక్షహానికి, ఉపపత్తి ఃR ఉపపత్తి కుగును.

వాక్యార్థము నుపపాదించు సామర్థ్యము కలిగిన చోటుననే వాక్యార్థము అనుక్తమయినను అర్థమువన సిద్ధించును. ‘దేవదత్తుడు బము కలిగియున్నాడుÑ పగట భుజింపడు’ అనిన రాత్రియందు భుజించుచున్నాడని అర్థాపత్తివన తెలియును. ఇట్టయెడ సామర్థ్యము గోచరించును. కాని ప్రకృతమున వ్యభిచరింపని సాధర్మ్యముతో సాధ్యము (శబ్దమున ప్రయత్నాంతరీయకత్వ సాదర్మ్యముతో అనిత్యత్వము ) సాధింపగా నిత్యత్వమును వ్యభిచరించు అస్పర్శత్వ సాధర్మ్యముతో భవ్దమున నిత్యత్వము అర్థాపత్తివన సిద్ధించుననుట యుక్తముకాదు. దేవదత్తుని బమున రాత్రి భోజన మెట్లు సమర్థించునో ‘శబ్దము అనిత్యమ’న ‘శబ్దము నిత్యము ’ అను నర్థమట్లు సమర్థింపబడదు. సామర్థ్యము లేనియెడ సయితము అర్థాపత్తివన కొండొక యర్తము కల్పింప నిష్టమగుచో, ప్రతివాది పక్షమునకÊఏ హాని కుగును. అతడు శబ్దము నిత్యమనిని శబ్ద మనిత్యమని అర్థాపత్తివన నుపపన్న మగునుకదా? కాబట్టి యీ ప్రతిషేధము నిరుపపన్న మని భావము. 

అవిశేష సమక్షణము : `

‘‘ఏకదర్మోపపత్తే రవిశేషే సర్వావిశేష ప్రసంగాతÊ

సద్భావోపపత్తే రవిశేష సమ ః ’’ 5.1.23.

ఏకధర్మోవపత్తేః దృష్టాంత సాధర్మ్యము పక్షమున సిద్ధించుట వన, అవిశేషే R పక్షదృష్టాంతము సమానముకాగా, సద్భావోపపత్తేఃR సత్తాఖ్య ధర్మమంతట సిద్ధమగుటవన, సర్వావిశేష ప్రసంగీత్‌ R సర్వము సమానమనెడి ప్రసక్తి కుగుటవన, అవిశేషసమఃR అవిశేష సమమగును.

ప్రయత్నానంతరీయకత్వసామ్యమున ఘటసమానమై శబ్దమనిత్యమగునెడ, సత్తా సామ్యమువన నన్నియు నన్నిటితో సమానము గును. అట్లు కాదందువేని శబ్దము ఘట సమానమైన యనిత్యము కానేరదు. ప్రయత్నానంతరీయకత్వ సామ్యమున శబ్దము గటసామ్యమై యనిత్యమగును కాని సత్తాసామ్యమున సర్వభావపదార్థ ము పరస్పర సామ్యములై సర్వము సమానమగుననుట సరికాదందువేని యందు కు ప్రమాణము చెప్పవసియందువని ప్రతిఘటించుట అని శేషసమ మనబడును.

‘‘క్యచిత్‌ తద్దర్మోపపత్తే ః క్వచిచ్చానుపపత్తేR ప్రతి

షేధాభావ ః ’’  5.1.24.

క్వచిత్‌ R ఒకానొకతావున, తద్దర్మోపపత్తేఃR అవిశేష హేతుదర్మ ముపపన్నమగుటవన, క్వచిచ్చR మఱియొకతావున, అనుపపత్తేఃR అవిశేష హేతుధర్మమనుపపన్న మగుటవన, ప్రతిషేధాభావ ఃR ప్రతిషేధము సిద్ధింపదు.

శబ్దము పక్షము. ఘటము దృష్టాంతము. ఈ రెంటియందును ప్రయత్నానంతరీయకత్వమును దర్మము విశేష హేతువగును. ప్రయత్నానంతరీయకత్వమునకు అనిత్యత్వము వ్యాపకము. ఎట ప్రయత్నానంతరీయకత్వముండునో యట అనిత్యత్వముండును. అను నిట్టివ్యాప్తి కావ్రయమై ప్రయత్నానంతరీయకత్వమనెడి హేతువు శబ్దఘటములో సామ్యము (అవిశేషత) సంపాదించుచున్నది. అట్లే సత్తాధర్మము వ్యాప్తి కావ్రయమైనచో సామ్యమును సంపాదింపగుగు దర్మము మఱియొకటి యేదిగదు? అట్టి ధర్మము సిద్ధింపదు కారణమేమన : నిత్యత్వము సత్తావ్యాపక ధర్మమందుమేని యది దృష్టాంతముతో నుపపన్నము కావసియుండును కాని అట్లు కాజాదు. ‘సర్వము నిత్యము. సత్తావంత మగుటవన అనిన దృష్టాంతముగా నీయగ వస్తు వొండేమిగదు? సర్వము పక్షములో చేరును. పక్షములో చేరినదానిని దృష్టాంతముగా గ్రహింపమీ పడదు. పక్షము సందిగ్ధసాధ్యము. దృష్టాంతము నిశ్చితసాధ్యము కది. సర్వము సందిగ్థ సాధ్యావ్రయ మైన నిశ్చితసాధ్యము కది. సర్వము సందిగ్ధ సాధ్యాశ్రయమైన నిశ్చితసాధ్యమున కాశ్రయమెయ్యది? దృష్టాంతము లేక హేతువు సాద్యసాదకమెట్లగును? కాబట్టి సత్తాసామ్యముతో సర్వము అవిశేష మగుటచే శబ్దము నిత్యమగునని ప్రతిఘటించుట యుక్తివిరుద్ధమగునని భావము.

ఉపపత్తి సమక్షణము : `

‘‘ఉభయ కారణోపపత్తే రుపపత్తిసమ ః’’ 5.1.25.

ఉభయ కారణోపపత్తే ఃR పక్షప్రతిపక్షహేతూపప్తివన, ఉపపత్తిసమఃR ఉపపత్తిమమగును.

శబ్ద మనిత్యమని సాధించుటకు ప్రయత్నానంతరీయ కత్వ హేతువు సిద్ధించిన, ‘శబ్దము నిత్యము అస్పర్శమగువన ఆకాశమువె’ నని ప్రతిపక్ష సాదక హేతువు సిద్ధించును. విశేష హేతువు లేనందునశబ్ద మనిత్యమేకాని నిత్యము కాదనరాదని ప్రతిఘటించుట ఉపపత్తిసమ మనబడును.

‘‘ఉపపత్తి కారణాభ్యనుజ్ఞానా దప్రతిషేధ ః’’ 5.1.26.

ఉపపత్తి కారణాభ్యనుజ్ఞానాత్‌ R వాదిపక్ష సిద్ధికి కారణము నంగీకరించినందున, అప్రతిషేధ ఃR ప్రతిషేధము అయుక్తము. 

ఉభయ పక్షువు హేతువు నంగీకరించువాడు వాది పక్షమును నంగీకరించును కాని ప్రతిషేధింపడు, అంగీకరింపని పోమున ‘ఉభయకారణోపపత్తివన’ అని ప్రయోగించుటయే తగదు. హేతువు నంగీకరించి సాద్యము నంగీకరింపకుండుటలో ర్థమేమి? హేతువు R వ్యాప్యము నంగీకరించిన సాద్యము (వ్యాపకము) నంగీకరించినట్లే యగును. రెండు హేతువు ుపప్నములైనను శబ్దము నిత్యము, అనిత్యము ననుట పొసగదు. అట్లనుట పరస్పర వ్యాఘాతమగును. ఉభయ కారణోపపత్తివన అనిత్యత్వము వ్యాహతమగునెడ నిత్యత్వమును వ్యాహతమగును. కాబట్టి ఉపపత్తిసమముతో ప్రతిఘటన అసంగతమని భావము. 

ఉపబ్ధి సమక్షణము : `

‘‘నిర్దిష్ట కారణాభావే -.ప్యుపంభాదుపబ్ధిసమః’’ 5.1.27.

నిర్దిష్టకారణాభావే -పి R వాదిచే చెప్పబడిన హేతువు లేకున్నను, ఉపంభాత్‌R సాధ్యముపబ్ధమగుట వన, ఉపబ్ధిసమఃR ఉపబ్ధిసమమగును.

పక్షమున నొకచో హేత్వసిద్ధిని చూపుట యుపబ్ది సమమన బడును. వాయు వశమున చెటఱ్టుకొమ్మ విరిగిన నపుడు శబ్దముత్పన్నమైనశించును. దానింబట్టి శబ్దమనిత్యమని తెలియుచు న్నది. అందువన, శబ్ద మనిత్యమని ప్రయత్నానంతరీయకత్వ హేతువుచే సాధించు టయుక్తముకాదు. ప్రయత్నానంతరీయకత్వ హేతువే శబ్దానిత్యత్వమును సాధించునెడ శాఖాభంగమువన శబ్ద మనిత్యమని తెలియబడకుండవయును. తెలియబడుచుండుట చేత శబ్దమనిత్యము ప్రయత్నానంతరీయకమగుటవన నని సాధించుట అయుక్తకమని ప్రతిఘటించుట ఉపబ్ధిసమము.

‘‘కారణాంతరాదపి తద్ధర్మోపపత్తే రప్రతిషేధః’’ 5.1.28.

కారణాంతరాదపి R మఱియొక హేతువువనను, తద్ధర్మోపపత్తేఃR సాధ్యధర్మము సిద్ధించుట అయుక్తము కాదు కాబట్టి, అప్రతిషేధ ఃR దోషము లేదు.

ఏ శబ్దమున ప్రయత్నానంతరీయకత్వము వన అనిత్యత్వము సిద్ధింపదో అట మఱియొక కృతకత్వము మున్నగు హేత్వంతరమున నది సిద్ధింపగదు కృతకముకాని శబ్దమొండునులేదు. కాబట్టి దోసము లేదు. ఒక కారణముచే సిద్ధించు సాధ్యము మఱియొక కారణమునగ కారణత్వమును వారింపజాదు. కాబట్టి యుపబ్ధిసమయుక్తమని భావము. 

అనుపబ్ధిసమము : `

‘‘తదనుపబ్ధే రనుపంభాదభావసిద్ధౌ తద్విపరీతోపపత్తే 

రనుపబ్ధి సమః’’ 5.1.29.

తదనుపబ్ధేఃR ప్రతిబంధకానుపబ్ధి, అనుపంభాత్‌ R ఉపంభముకానందున, అభావసిద్ధౌR అభావము సిద్ధింపగా, తద్విపరీతో పపత్తేఃR ప్రతిబంధకోపబ్ధి యుపపన్నమగుటవన, అనుపబ్ధిసమఃR అనుపబ్ధిసమమగును.

నేనుత్రవ్వుటకుముందు భూమియందు జముండియు మృత్తికాదు ప్రతిబంధకము గుటవన నుపబ్ధముకాదు. అట్లే ఉచ్ఛారణకు ముందు శబ్దముండియు ప్రతిబంధకము వన నుపబ్ధ మగుటలేదు. అంతియే కాని ‘యనిత్యమగుట వనకాదు, అనినుడువ మీలేు. కారణమేమన జమునకు మృత్తిక ప్రతిబంధకమున్నట్లు శబ్దమునకు ప్రతిబంధకమేదియు కానరాదు. కాబట్టి శబ్దము నుచ్చరించుటకు పూర్వమది లేదనియే యెంచవ యునని వాది సిద్ధపరుప, ప్రతివాది ప్రతిబంధకానుపబ్ధివన శబ్దాభావము సిద్ధించిన, ప్రతిబందకానుపబ్ధియు నుపబ్ధము కానందున ప్రతిబంధకానుపబ్ధ్యభావమును సిద్ధించును. అనగా ప్రతిబంధకోపబ్ధి సిద్ధించును. కాబట్టి శబ్దముండియు నుపబ్ధము కాకున్నదని ప్రతిఘటించుట అనుపబ్ధి సమమగును.

‘‘అనుపంభాత్మ కత్వాదనుపబ్ధే రహేతు ః’’ 5.1.30.

అనుపబ్ధే ఃR ఆవరణాది ప్రతిబంధకానుపబ్ధి, అనుపంభాత్మ కత్వాత్‌ R (ప్రతిబందకోపబ్ధ్యభావమిట నుపంభము) అనుపంభ స్వరూక మగుటవన ` అభావ స్వరూపమగుటవన ననిభావము అహేతుఃR ప్రతిబంధకానుపబ్ధి అనుపంభ మగుటవన నను హేతువు ప్రతిబంధకోపబ్ధికి సాధకము కాదు.

దేనికేది విషయమో యది దాని యస్తిత్వమును తొపును. నాస్తిత్వమను తొపదు, ఉపబ్ధికి విషయము కభావము. అనుపబ్దికి విషయము అభావము. ఆవరణాది ప్రతిబంధకానుపబ్ధి అభావా త్మకము. అందుప్రవర్తించు అనుపంభము దాని యభావత్మఉ నెట్లు తీసివేయ గుగును? కాబట్టి, ఆవరణాది ప్రతిబంధకానుపబ్ధి అనుపంభము వన ప్రతిషేదింప బడనిదై ప్రతిబంధకోపబ్ధికి సాధనమెట్లు కాగదు? కాజాదు. అందువన ప్రతిబంధకము లేనందున ఉచ్ఛారణకు పూర్వము శబ్దము లేదనియే సిద్మగునని భావము 

‘‘జ్ఞాన వికల్పానాంచ భావాభావసంవేదనా దధ్యా

త్మమ్‌ ’’  5.1.31.

ఆధ్యాత్మమ్‌ R మనస్సుతో, జ్ఞానవికల్పానాం R జ్ఞాన విశేషము, భావాభావ సంవేదనాత్‌ R సత్వాసత్వము తెలియుటవన, అహేతుః అనుపబ్ధ్యనుపంభమువన నను హేతువు సరికాదు.

మనస్సు ద్వారా జ్ఞానము భావము తెలియబడినట్లు వాని యభావమును తెలియబడును. (ఏ యింద్రియముచే నే విషయము గ్రహింపబడునో యందలి జాతీయు, దాని యభావమును నాయింద్రియము చేతనే గ్రహింపబడునను నియమమిందు ప్రయోజకము.) ఆవరణాది ప్రతిబంధకానుపబ్ధియు జ్ఞానాభావమేÑ కావున నుపబ్ధి (జ్ఞానము) వలె నదియుమనస్సుచే గ్రహింపబడుచున్నది. ఆవరణాద్యుపబ్ధిలేదని తెలియుచున్నది. కాబట్టి, ఆవరణానుపబ్ధి సిద్ధించి తదనుప ంభము సిద్ధింపనందున, ఉచ్చారణకు పూర్వము శబ్దము లేకయే యుపబ్ధము కాకున్నదని తెలియుచున్నది. అందువన ననిత్యమనియు ధ్రుపమగుచున్నదని భావము. 

అనిత్యసమము : `

‘‘సాదర్మ్యాత్త్యుధర్మోపపత్తే ః సర్వానిత్యత్వ ప్రసంగా

దనిత్యసమః’’ 5. 1.32.

సాధర్మ్యాత్‌ R దృష్టాంత సాదర్మ్యమువన, త్యుధర్మోపపత్తేఃR పక్షమునందు దృష్టాంతమునకు సమానమైన దర్మముపపన్నమగుట వన, సర్వానిత్యత్వ ప్రసంగాత్‌ R సర్వము అనిత్యము కావసిన ప్రసక్తికుగును. కాబట్టి, అనిత్యసమఃR అనిత్యసమమగును.

పక్షమునందు సాద్యదర్మ విపర్యయమును సాధించు నిమిత్తము దృష్టాంతసాదర్మ్యముతో సమస్తభావ పదార్థము నిత్యముని యుద్భావించుట అనిత్య సమమగును. 

ప్రయత్నానంతరీయకత్వ సామ్యముచే ఘటమువలె శబ్ద మనిత్యమగునెడ, ఘటము నందలి సత్వగుణ (ఉనికి) సాదర్మ్యముతో సర్వభావ పదార్తములే అనిత్యము కావు? కావనుపక్షమున శబ్దమును అనిత్యము కానేరదు. ఘటమునందలి కొండొక ప్రయత్నానంతరీయకత్వ) గుణ సామ్యముచే శబ్దము అనిత్యమగును కాని, వేరొక (ఉనికి` సత్వ్రగుణ సామ్యమమఱుచే నితర భావపదార్తము అనిత్యము కావనుటకు విశేషహేతువేమి? యని ప్రతిఘటించుట అనిత్యసమముగును.

‘‘సాదర్మ్యాదసిద్ధేః, ప్రతిషేధాసిద్ధిః, ప్రతిషేధ్య

సాధర్మ్యాత్‌ ’’ 5. 1.33.

సాధర్మ్యాత్‌ R దృష్టాంత సాదర్మ్యము వన, అసిద్దేఃR పక్ష మున సాధ్యము సిద్ధింపని పక్షమున, ప్రతిషేధ్య సాధర్మ్యాత్‌ R వాదిపక్ష  సాధర్మ్యము వన, ప్రతిషేధాసిద్ధి ఃR ప్రతివాది పక్షమును సిద్ధిపందు.

 శబ్దమనిత్యమని వాదిపక్షము సర్వమనిత్యమని ప్రతివాది పక్షము. శబ్ద మనిత్య మనుటకు వాది ఘటమును దృష్టాంతముగా గ్రహించుచున్నాడు. ఘటమునందలి ప్రయత్నానంతరీయకత్వ ధర్మసామ్యమున శబ్దమున ననిత్యము సిద్ధింపని పక్షమున, వాదివలె ప్రతివాది తానును ప్రతిజ్ఞా ద్యవయవమును ప్రయోగించి (సర్వమనిత్యము. సత్వముగ దగుటవన ఘటమువలె) దృష్టాంతమునందలి సత్తాసాదర్మ్యముతో సర్వమనిత్యమనుటయు సిద్ధింపదు. కాబట్టి ప్రంతివాది ప్రతిషేదము నిరర్థకమని భావము. 

‘‘దృష్టాంతేచ సాద్యసృాదనభావేన ప్రజ్ఞాతస్యధర్మస్య హేతు 

త్వాత్తస్య చోభయథాభావాన్నావిశేష ః ’’  5.1.34.

దృష్టాంతే R దృష్టాంత స్థమున, సాధ్యసాదనబభావేన R సాద్య వాష్ట్ర్యప్యమని, ప్రజ్ఞాతస్య R నిశ్చయముగా తెలియబడిన, ధర్మస్యR ధర్మము, హేతుత్వాత్‌ R హేతువగుటవన, తస్యచ I అదర్మము, ఉభయథాభావాత్‌ R కొండొకదానితో సమానముగను, మరియొక దానితో విశిష్టముగను ఉండుట వన, అవిశేషఃR సాద్యవ్యాప్యము కాని ధర్మము, న R హేతువుకాదు.

ఒక దర్మము సమానమైనను లేక విశిష్టమైనను, దృష్టాంతమునందు సాద్యమును విఇచియుండదు. సాధ్యవ్యాప్యము అని తెలియబడని పక్షమున ఆ హేతువు సాద్యసాధకము కానేరదు. ప్రయత్నానంతీర యకత్వ మనెడి సమాన దర్మము ఘటమునందు, అనిత్యత్వ మనెడి సాధ్యదర్మమున కవినా భావి (సాద్యవ్పాప్యము) అని తెలియబడుచున్నది. ఆకబట్టి యది పక్షమున ` శబ్దమున అనిత్యత్వమును సాధించుచున్నది. సత్వదర్మము సాధ్యావినాభావి ` సాద్యవ్యాప్యముకాదు. కారణమేమ, ఆత్మాకాశాదులో సత్వమున్నది కాని అనిత్యత్వము లేదు. కాబట్టి అది వ్యభిచారాధర్మము. అందుచే నదియనిత్యత్వ సాధకము కానేరదు. కాబట్టి ప్రతివాది ప్రతిఘటన యుక్తి సంగతము కాదని భావము. 

నిత్యసమమము :  `

‘‘నిత్యమనిత్య భావాదనిత్యే నిత్యత్వో పపత్తేర్నిత్య

సమ ః ’’ 5.1.35.

అనిత్యే R అనిత్యత్వము సాద్యముగా గ వస్తువునందు, ననిత్యమ్‌ R ఎ్లపుడు, అనిత్యభావాత్‌ R అనిత్యత్వ ముండుటవన, నిత్యత్వో పపత్తేఃR నిత్యత్వము సిద్ధించుటవన, నిత్యసమః నిత్యసమమగును.

ప్రతయ్నానంతరీయకత్వమేతువుచే శబ్దమునందు సాధింపబడెడి అనిత్యత్వము నిత్యమా? లేక యనిత్యమా? అనిత్యమగునెడ శబ్దము నిత్యమగును కాని యనిత్యముకాదు. అనిత్యత్వమునందలి యనిత్యత పోయిన నిత్యత్వము సిద్ధించునని భావము. లేక అనిత్యత్వము నిత్యమందువేని దర్మనిత్యతవన దర్మిjైున శబ్దము నిత్యమగుట సుంతైన సందేహముండదు కాబట్ట యుభయ విధమును శమ్దము నిత్యమే యగునన తీఇప్రతిఘటించుట నిత్యసమమగునని భావము. 

ధర్మముయొక్క నిత్యా నిత్యభావ విక్పము ద్వారా ధర్మియందు నిత్యత్వమును సాధించు నిత్యసమము.

‘‘ప్రతిషేధ్యే నిత్యమనిత్యభావా దనిత్యే అనిత్యత్వోస

పత్తే ః ప్రతిషేధాభావ ః ’’  5.1.36.

ప్రతిషేధస్త్ర్య R ప్రతిషేదింపదగిన శబ్దమునందు, నిత్యం R ఎ్లప్పుడు, అనిత్యభావాత్‌ R అనిత్యత్వముండుటవన, అనిత్యే R అనిత్యమయిన శబ్దమునందు, అనిత్యత్వోపపత్తేఃR అనిత్యత్వము సిద్ధించుటవన, ప్రతిషేధాభావ ఃR ప్రతిషేధము సరికాదు. 

ప్రతివాదిచే ప్రతిషేధింపదగు శబ్దమును న్లెపుడు ననిత్యత్వ ముండుననుటచే నది యనిత్యమగుచున్నది. ఎ్లపుడు ననిత్యభావముతో దేనికి సంబంధముండునో యది యనిత్యము అనిత్యభావ సంబందము దేనికుండునో అది నిత్యము అనుట వ్యాహత మగును. అనిత్యత్వ మనుధర్మము. 

నిత్యమగుటచే దానికాశ్రయమైన దర్మియు నిత్యము అనుట యుక్తముకాదు. అనిత్యత్వ మన ధ్వసంము కాబట్టి శబ్దము ధ్వంస ప్రతియోగి యగును. ప్రతియోగి దేనికది ప్రతియోగియో దానికి ఆవ్రయము కాదు. ఘటాభావమునకు ఘటము ప్రతియోగి భూతము అట్లే ద్వంసమును అభావాంతర్గత మగుటచే నది ప్రయోగియడు శబ్దాశ్రితము కాజాదు. కాబట్టి శబ్దము అనిత్యము.

కార్యసమము : `

‘‘ప్రయత్నకార్యానేకత్వాత్‌ కార్యసమః’’ 5.1.37.

ప్రయత్నకార్యానేకత్వాత్‌R ప్రయత్నముచే సంపాదింపదగిన కార్యమునేకముగుటవన, కార్యసమఃR కార్యసమమగును.

హేతువునకు రెండఱు అర్థముకల్పించి తద్ద్వారా పోము నందు సాద్యసంవయము నాపాదించుట కార్యసమ మనబడును. శబ్దమనిత్యము ఘటమువలె ప్రయత్నానంతరీయక మగుట వన. ఇట ప్రయత్నానంతరీయక మన ప్రయత్నకార్యమని గదా యర్థము ! ప్రయత్నము వన కుగుకార్యము రెండు విధముగా నుండును. ఒకచో ప్రయత్నకార్యము కపామునుండి ఘట ముత్పన్న మగుట మఱియొకచో, మృత్తికాదును తొగించి జమును అభివ్యక్తపరుచు(ఉన్నదానిని బయటపెట్టుట). కాబట్టి ప్రయత్నానంతరీయకత్వము శబ్దమున్పున్నము చేయుచున్న దనుటకంటె నభివ్యక్తము చేయుచున్నదని యే యనరాదు? ఉత్పాద్యమగుటచే అనిత్యమందుమేని అభివ్యజ్యమగుటచే నిత్యమని చెప్పుట కబ్యంతరమేమి? అని సందేహము కలిగించుట కార్యసమ మనబడును.

‘‘కార్యాన్యత్వే ప్రయత్నాహేతుత్వ మనుపబ్ధికార

ణోపపత్తే ః’’ 5.1.38.

అనుపబ్ధి కారణోపపతేÊ తఃR అనుపబ్ధికి కారణముపపన్న మగుట వన, కార్యాన్యత్వే R ప్రయత్నకార్యము నేకము యినను, ప్రయత్నా హేతుత్వం R శబ్దాభివ్యక్తియందు ప్రయత్న హేతుత్వము ఉపపన్నము కాదు.

ఒక వస్తువుండియు తెలియబడకుండుటకు ఆవరణాది వ్యవధాన ముండవయును భూమిలో జమున్నది. కాని యది యున్నట్లు తెలియకుండుటకు వ్యవధానము కల్పించు ఆవరణమము మృత్తికాదుండును. ఆ యావరనము తొగిన జము  అభివ్యక్తమగును. అట్లే శబ్ద మభివ్యక్తమయిన దాని కావరణమున్నట్లు తెలియవయును. అనుపబ్ధికి హేతువైన ఆవరణాదును పోగొట్టి ప్రయత్ని మభివ్యక్తికి కారణమగును కాని సాక్షాత్తుగా కాదు. శబ్దమునకు వ్యవధానమున్నట్లే తెలియదు. కాబట్టి ప్రయత్నము దానిని అభివ్యక్తపరుచుటెట్లు? ప్రయత్నకార్యము నేకముయినను శబ్దమభివ్యక్తమనుట యుక్తము కాదని భాము. 

ప్రతివాది జాతిని ప్రయోగించి సిద్ధాంతమును ప్రతిఘటించినపుడు వాది శాస్త్రమునం దుపదేశించినట్లు సత్యమైన సమాధానము నిచ్చుటకే యత్నింపవయును. తాను కూడా జాతిని ప్రయోగించి అసదుత్తరము నొసంగుట తగదు అట్లుగాక యిరువురును జాతి ప్రయోగము నాశ్రయించిన నట్టి ప్రసంగము తత్వ నిర్ణయమును జేయజాదు. తత్వ నిర్ణయమునకు విఘాతకమైన చర్య యెట్లుండునో తెలిపి శిష్యుకు హితవు చూకూర్పదచి పరమ కారుణికుడైన మహిర్షి సూత్రము నారంభించుచున్నాడు. 

‘‘ప్రతిషేధే -పి సమానోదోషః’’ 5.2.39.

ప్రతిషేధే -పి R ప్రతిషేధ హేతువునందును, సమానఃR స్థాపనా హేతువునకు సమానమైన, దోషఃR అనైకాంతిక దోషముండును.

తత్వనిర్ణయార్థ మారంభింపబడిన చర్య (కథ) యందు ప్రవృత్తుడై ప్రథమపక్షము నవంబించిన యొకవ్యక్తి, ‘శబ్దము అనిత్యము ఘటమువలె, ప్రయత్నానంతరీయకమగుటవన’ అని ప్రయోగిం చును. ద్వితీయపక్షావంబిjైున మరియొకవ్యక్తి జాతిని ప్రయోగింపదచి, పూర్వహేతువును ప్రతిఘటించుచు, ‘ప్రయత్న కార్యము నేకము గుట వన, అని ప్రతిషేధ హేతువును ప్రయోగించును. తృతీయ పక్షమున ప్రతమ స్థాపనాహేతువాది ‘శబ్ద ముపబ్ధము కాకుండుటకు గ ఆవరణాదు ుపబ్ధము కాకుండుటవన నాహేతువు వ్యభిచరింప’దని సదుత్తర మీయక, నా హేతువు (శబ్దమభివ్యక్తమగుటవన) వ్యభిచారి యందువేని ‘ప్రయత్న కార్యానేకత్వ’ మను నీహేతువును శబ్దమునందలి యనిత్యత్వము మాత్రము ప్రతిషేధించుచున్నది. సర్వమును ప్రతిషేధింపదు. కాబట్టిjైునై కాంతికమగునని ప్రతిఘటించును.

‘‘సర్వత్రైవమ్‌’’ 5.1.40.

ఏవమ్‌ R పైజెప్పిన కార్యసమమను జాతి స్థానమునందువలె సర్వత్ర R ఇతరజాతి ప్రయోగస్థముందును అసదుత్తరమీయవచ్చును. తత్వనిర్ణయము నభిషించు స్థాపనాహేతువాది ప్రతివాది యెట్టిజాతిని ప్రయోగించినను తానుమాత్రము జాతిని ప్రయోగింపడు. తత్వము నభిషింపని వాని కట్టి నియమముండదు. ప్రతివాది యెట్టిజాతిని ప్రయోగించినను తానను జాతినవంభించి యసదుత్తర మీయ దగును. స్థాపనాహేతువాది తృతీయపక్షమున సమాధానాభాసము చెప్పగా జాతివాది చతుర్థపక్షమున ప్రతిఘటించును.

‘‘ప్రతిషేధవిప్రతిషేధే ప్రతిషేధదోషవద్దోషః’’ 5.1.41.

ప్రతిషేధ దోషవత్‌ R నాచే చేయబడిన ప్రతిషేధమున వ్యభిచార దోషమున్నట్లు, ప్రతిషేధ విప్రతిషేధే R నీచే చేయబడిన విప్రతిషేధమునందును, దోషఃR అనైకాంతిక దోషముకదు.

నా ప్రతిషేధమున ననై కాంత దోషమున్న నీ విప్రతిషేధమునందు నట్టి దోషమే యండునని ప్రతిఘటించును, పంచమ పక్షమున స్థాపనాహేతువాది :

‘‘ప్రతిషేధం సదోష మభ్యుపేత్య ప్రతిషేధ విప్రతిషేధస్త్ర

సమాన దోషప్రసంగో మతానుజ్ఞా’’  5.1.42.

ప్రతిషేధం R తనచే చేయబడిన ద్వితీయ పక్షమును, సదోష:R దోషయుక్తమని, అభ్యుపేత్యR అంగీకరించి, ప్రతిషేధ విప్రతిషేధస్త్రR తృతీయ పక్షమున, సమానదోష ప్రసంగః R చెప్పబడిన సమానదోష ప్రవస్తి, మతానుజ్ఞాR మతానుజ్ఞయగును. మతమును అంగీకరించుట.

ప్రతివాదినగు నీవు నా చెప్పబడిన హేతువున గ దోషము నుద్ధరించి యుటుపై నా చెప్పి ప్రతిషేధమున దోషము నాపాదింపవయును. అట్లు చేయక ‘‘నా ప్రతిషేధము దోషయుక్తమైన నీ పక్షమును సదోషమే’’ యని నీదోషము నంగీకరించుటయే మతానుజ్ఞయగును. మతానుజ్ఞ నిగ్రహస్థానము. కాబట్టి నిగ్రహింపబడితివి ` ఓడిపోయితివి.

‘‘స్వపక్షక్షణాపేక్షోపపత్త్యుపసంహారే హేతునిర్దేశే

పరపక్షదోషాభ్యుపగమాత్‌ సమానోదోషః’’  5.1.43.

స్వపక్ష........... ఉపసంహారే R వాదిపక్షము నిమిత్తము కాగా పుట్టిన దోషమును పోనాడకయే పరపక్షమున నట్టి దోషము కదను నుపసంహారమును, హేతునిర్దేశే R హేతువుగా ప్రయోగించిన, పరపక్షదోషాభ్యుపగమాత్‌ R ప్రతిపక్షదోసము నంగీకరించుట వన సమానోదోషఃR మతానుజ్ఞయనెడి దోషము సమానమే.

ప్రతిపక్షినైన నాదోషయుక్త ప్రతిషేధము నంగీకరించి వాదిపక్షమునను అట్టి దోషమే కదని దోషము నాపాదించుటచే మతానుజ్ఞ యను నిగ్రహస్థానమునకు నేను గురిjైునట్లు, వాదివైన నీవును నీస్తాపనాహేతువు సదోషముగా నంగీకరించుచు నాచే చేయబడిన ప్రతిషేధమునందు నట్టి దోషమునే యుద్భావించినందున నీవును మతానుజ్ఞయను నిగ్రమస్థానమునకు గురిjైుతివి. కాబట్టి యిరువురి దోషమును సమానమే యని ప్రతివాది యనును.

ఈ చర్చయందు ప్రథమ తృతీయపంచమ పక్షము వాదివి. ద్వితీయ చతుర్థ షస్ఠ పక్షము ప్రతివాదివి ఈ పక్షము న్నియుఉ పౌనరుక్త్యము. మతానుజ్ఞ మున్నగు దోషయుక్తములే . అందువన నొక్కపక్షమును సాద్యసాదకము కానేరదు. కాబట్టి యిట్టికథ(చర్చ) వన తత్వనిర్ణయము కాజాదని వివేకము.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి