న్యాయ దర్శనము
పూర్వాహ్నికమున జాతి పరీక్షింపబడినది. ఇందు నిగ్రహస్థానము పరీక్షింపబడవసి యున్నది. ముందుగా విభజించుచున్నాడు.
‘‘ ప్రతిజ్ఞాహాని ప్రతిజ్ఞాంతరం ప్రతిజ్ఞావిరోధః ప్రతి
జ్ఞాసంన్యాసో, హేత్వంతర మర్థాంతరం నిరర్తక మవి
జ్ఞాతార్థమపార్థక మప్రాప్తకాం న్యూన మధికం
పునరుక్త మననుభాషణ మజ్ఞాణ మప్రతిభా విక్షే
పో మతానుజ్ఞా పర్యనుయోజ్యోపేక్షణం నిరనుయో
జ్యానుయోగో -పసిద్ధాంతో హేత్వాబాసాశ్చ నిగ్ర
హస్థానాని ’’ 5. 2. 1.
ప్రతిజ్ఞాహాని మున్నగు నామము గలిగినవి యిరుపదిరెండు నిగ్రహస్థానము. ప్రతమాధ్యాయమునందు (1.2.19) నిగ్రహస్థాన క్షణము సామాన్యముగా చెప్పబడినది. పై జెప్పిన ఇరువది రెండు నిగ్రహస్థానములో అననభాషణము, అజ్ఞానము, అప్రతిభ, విక్షేపము, పర్యనుయోజ్యోపేక్షణము, అను నీjైుదును అప్రతిపత్తి నిగ్రహస్థానము నియు, మిగిలినవి విప్రతిపత్తి వాచ్యమునియు నెంచవయును.
‘‘ప్రతిదృష్టాంత దర్మాభ్యనుజ్ఞా స్వదృష్టాంతే
ప్రతిజ్ఞాహాని.’’ 5.2.2.
స్వదృష్టాంతే R వాది తన పోమున, ప్రతిదృష్టాంత ధర్మాభ్య నుజ్ఞాR ప్రతవాది పక్షధర్మము నంగీకరించుట, ప్రతిజ్ఞాహానిఃR ప్రతిజ్ఞాహాని యనబడును.
శబ్ద మనిత్యము ఇంద్రియగ్రాహ్యమగుటవన, అని వాది ప్రయోగింప, నిత్యమైన సామాన్యము ఇంద్రియగ్రాహ్యమే కదా? కాబట్టి నిత్యవమేకాదని ప్రతివాది యెదుర్కొనిన, ప్రతివా యపాదించిన అనైకాంతిక దోషమును పోనాడ లేక, అట్లయిన ‘శబ్దము నిత్యమే కానిమ్ము’ అని వాది యంగీకరించిన ప్రతిజ్ఞాహాని నిగ్రహస్తానమగును. ఇదియోటమికి స్థానము.
‘‘ప్రతిజ్ఞాతార్థప్రతిషేధే ధర్మవికల్పాత్తదర్థనిర్దేశః
ప్రతిజ్ఞాంతరమ్’’ 5.2.3.
ప్రతిజ్ఞాతార్థప్రతిషేధస్త్రR వాదిచేప్రతిజ్ఞ చేయబడిన అర్థము ప్రంతివాది ప్రతిషేధింప, ధర్మవికల్పాత్ R దృష్టాంత ప్రతిదృష్టాంతము ధర్మబేధము వన, తదర్ధనిర్దేశఃR ప్రతిజ్ఞాతార్థమును దృష్టాంత ధర్మవిశిష్టముగా నిర్దేశించుట, ప్రతిజ్ఞాంతరమ్ R ప్రతిజ్ఞాంతరము.
‘ ఘటమువలె ఐంద్రియకమగుటవన శబ్దమనిత్యమ’ని వాది ప్రయోగింప, ‘సామాన్య మైంద్రియకమైనను నిత్యముకదా! యని ప్రతివాది వ్యభిచారమును చూపును. అప్పుడు వాది, ‘సామాన్య మైంద్రియకమయ్యు సర్వగత మగుటచే నిత్యమగును. కాని, ఘటము ఐంద్రియకమేకాని సర్వగతము కాదు. కాబట్టి యనిత్యమగును. అందువన ‘ఘటము సర్వగతముకాక యనిత్యమైనట్లు శబ్దమును అసర్వగతము అనిత్యమగును’ అని ప్రతిజ్ఞను మార్చును. ముందు ‘శబ్ద మనిత్యమ‘నియు, తదుపరి ‘అసర్వగతమగు శబ్ద మనిత్య మ‘నియు ప్రతిజ్ఞ చేయును. కాబట్టి పరోక్తదోషమును బోగొట్టదచి పూర్వప్రతిజ్ఞాతార్థమున విశేషణము జేర్చి మర ప్రతిజ్ఞ జేయుట ప్రతిజ్ఞాంతర మనబడును.
‘‘ ప్రతిజ్ఞాహేత్వోర్విరోధ ః ప్రతిజ్ఞావిరోధః’’ 5.2.4.
ప్రతిజ్ఞ హేతువు నను నీరెంటియందునుగ పరస్పర విరోధము ప్రతిజ్ఞావిరోధ మనబడును.
ప్రతిజ్ఞకు హేతువుతోను, హేతువునకు ప్రతిజ్ఞతోను విరోధము ప్రతిజ్ఞావిరోధ మనబడును ‘ద్రవ్యము గుణప్యతి రిక్తము అని ప్రతిజ్ఞ చేసి ‘రూపాదుకంటె వేరుగా నుపబద్హఉ కానందున’ అని హేతువగా చెప్పిన, నిట ప్రతిజ్ఞాహేతువు పరస్పర విరుద్ధము గును.
‘‘పక్ష ప్రతిషేధే ప్రతిజ్ఞాతార్థాపనయనం ప్రతిజ్ఞా
సంన్యాసః’’ 5.2.5.
పక్షప్రతిషేధస్త్ర R హేతువునందు వ్యభిచార దోషమునుద్బావించుట ద్వారా, పక్షము నాఓఏపింపగా, ప్రతిజ్ఞాతార్థాపనయనం R ప్రతిజ్ఞా తార్థమును విడుచుట, ప్రతిజ్ఞాసంన్యాసఃR ప్రతిజ్ఞాసంన్యాస మనబడును.
శబ్దమనిత్యము, ఐంద్రియక మగుటవన, అని వాది ప్రయోగింప, ప్రతివాది ఐంద్రియకమైన సామాన్యము నిత్యమగుచున్న దని వ్యభిచార దోసము నుద్భావింపగా నాదోషమును పోగొట్టదచి ‘శబ్దమనిత్యమని యనువారెవరు?’ అని తన ప్రతిజ్ఞను మరుగుపరచ యత్నించును అట్టియెడ ప్రతిజ్ఞా సంన్యాస నిగ్రహస్థాన మగును.
‘‘అవిశేషోక్తే హేతౌ ప్రతిషిద్దే విశేష మిచ్ఛతో
హేత్వంతరమ్ ’’ 5.2.6.
అవిశేషోక్తే R విశేషరహితరముగా చెప్పబడిన, హేతఃR హేతువు, ప్రతిషిద్ధే R ప్రతిషేదింపబడగా, విశేష మిచ్ఛతఃR హేతు దోసమును పోగొట్టుటకై దానికి విశేషణము చేర్చుకోరిక గలిగిన హేత్వంతరమ్ R హేత్వంతర నిగ్రహస్థానమగును.
శబ్ద మనిత్యము, ఐంద్రియక మగుటవన అని హేతువును ప్రయోగించి హేతువున వ్యభిచార దోసమును జూపి ప్రతిఘటింప ‘సామాన్యవంతమై ఐంద్రియమగుటవన’ నని హేతువున విషేశణమును జేర్చిదోషమును దిద్దుకొనుట హేత్వంతర నిగ్రహస్థానము.
‘‘ప్రకృతాదర్థాద ప్రతిసంబద్ధార్థ మర్థాంతరమ్ ’’ 5.2.7.
ప్రకృతాత్ అర్థాత్ R వివాదగ్రస్తమైన ప్రస్తుతవిషయముకంటె, అప్రతిసంబద్దార్తమ్ R అన్యమైన అసంబద్ధార్థ విషయమును చెప్పగోరిన, అర్థాంతరమ్ R అర్థాంతర నిగ్రహస్థాన మగును.
వాదిగానీ, ప్రతివాదిగానీ ప్రయోగించిన హేతువు నందు వ్యభిచారాది దోసము గ్రహింపబడినపుడు దానిని దాచుటకు గాను ప్రస్తుత విషయమును విడిచి యసంబధ్ధ విషయమును ప్రస్తావించుట అర్థాంతర నిగ్రహస్థాన మనబడును.
‘శబ్దము నిత్యము. అస్పర్శమగుటవన’ అని ప్రయోగింప సుఖ మస్పర్శమేకాని నిత్యము కాదని హేతువున వ్యభిచార ముద్బావింపగా, హేతువు హినోతి ధాతువునకు ‘తున్’ ప్రత్యయము చేర్చిన సిద్ధమగును. ఇది కృదంతము. నామము, ఆక్యాతము, ఉపసర్గము, నిపాత్ నని పదము నాుగు విధము. సుబంతము నామము. కృదంతము ఆక్యాతము.’ అని యేమోమో యసంబద్ధ ప్రసంగము లాడుటకు ప్రారంభించిన అర్థాంతర నిగ్రహస్థాన మగును.
‘‘వర్ణక్రమ నిర్దేశవన్నిరర్థకమ్’’ 5.2.8.
వర్ణక్రమ నిర్దేశవత్ R వర్ణక్రమమున నున్నట్లుక్షరమును ప్రయోగించుట, నిరర్దకమ్ నిరర్ధకము.
శబ్దము నిత్యము జబగడద వన’ నని యర్థములేని యక్షరమును క్రమముగా ప్రయోగించుట నిరర్థక నిగ్రహస్థానమనబడును.
‘‘పరిషత్ప్రతివాదిబ్యాం త్రిరభిహిత మప్య విజ్ఞా
మవిజ్ఞాతార్థమ్ ’’ 5.2.9.
త్రిరభిహితమపి R ముమ్మారు వాదిచెప్పినను, పరిషత్ప్రతివాదిఖ్యాం R మద్యస్లు ద్వారా గాని, ప్రతివాదిచే గాని, అవిజాతమ్ R తెలియబడకున్న, అవిజ్ఞాతార్థమ్ R అవిజ్ఞాతార్థమగును.
పరు కజ్ఞానము నాపాదించిన తనకు జయము కుగునన భ్రమపడి మధ్యస్థుకుగానీ, ప్రతివాదికిగానీ ముమ్మారు చెప్పినను తెలియని విదమున క్లిష్టపదమును ప్రయోగించుట గానీ, వేగముగా నుచ్చరించుటగానీ అవిజ్ఞాతార్థ నిగ్రహసానమగును.
‘‘పౌర్వాపర్యాయోగాదప్రతిసంబద్దార్థ
మపార్థకమ్’’ 5. 2.10.
పౌర్వాపర్యాయోగాత్ Rపూర్వాపర సంబంధములేని, అప్రతి సంబద్దార్థమ్ R పరస్పర మన్వితముకాని పదమును ప్రయోగించుట, అసార్థకమ్ R అపార్థక మనబడును.
పదము క్లిష్టము కాకున్నను. అతివేగముగా నుచ్చరింపబడకున్నను. అన్వితము కానిపూర్వపర సంబంధములేని పదమును ప్రయోగించుట అపార్థకనిగ్రహస్థాన మనబడును.
వాచ్చార్తములేని పదప్రయోగము నిరర్థక మనియు సముదాయార్థము లేని ప్రయోగము అపార్థక మనియు వివేకము.
‘‘అవయవవిపర్యాస వచన మప్రాప్తకామ్’’ 5.2.11.
అవయవ విపర్యాసవచనమ్ R ప్రతిజ్ఞాది అవయవ వాక్యమును క్రమము విడిచి ప్రయోగింఎచుట, అప్రాప్తకామ్ R అప్రాప్తకా మనబడును.
అనుమాన వ్యామున, ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము, ఉపనయము, నిగమనము నను క్రమమునవయవమును ప్రయోగింపవయును. అట్టిక్రమమును విడిచి ప్రయోగించుట అప్రాప్తకా మనబడునని భావము.
‘‘హీన మన్యతమే నాప్యవయవేన న్యూనమ్ ’’ 5.2.12.
అన్యతమేనాపి R అవయవములో నొక్క, అవయవేన హీనమÊ R అవయవము తక్కువైనను. న్యూనమ్ R న్యూనమనబడును.
అనుమాన వాక్యమున ప్రయోగింప వసిన ప్రతిజ్ఞాది అవయవము నొక్కటిjైునను ప్రయగోఇంపకుండుట న్యూననిగ్రహస్థాన మనబడును.
‘‘హేతూదాహరణాధిక మధికమ్’’ 5.2.13.
హేతూదాహరణాధికమ్ R హేతువుగానీ ఉదామరణముగానీ యధికముగా ప్రయోగించిన, అధికమ్R అధికమనబడును.
శబ్దమునిత్యము, శబ్దత్వము కలిగియుండుట వన, శ్రావణత్వము కలిగియుండుట వనను, అని రెండు హేతువును ప్రయోగించుట, అధిక నిగ్రహస్థాన మనబడును. ఒకేహేతువు వననర్తము సిద్ధింపజేయుదునని యధిక హేతువును ప్రయోగించిన నిగృహీతుడగును. అట్టి నియమమును ముందుగా నంగీకరింపక అర్థసిద్ధిని బపరచుట కనేక హేతువును ప్రదర్శించుట నిగ్రమస్థానము కానేరదని భావము
‘‘ శబ్దార్థయో ః పునర్వచనం పునరుక్తమన్యత్రామ
వాదాత్ ’’ 5.2.14.
అన్యత్రానువాదాత్ R అనువాద స్థమున తప్ప, శబ్దార్థయోఃR శబ్దార్థమును, పునర్వచనం R మరచెప్పు, పునరుక్తమ్ R పునరుక్తమనబడును.
అనువాద స్థమున తక్క తదితరమున, పూర్వచ్చాదిత శబ్దమును మర నుచ్చరించుట, పునరుక్త మనబడును. శబ్దపునరుక్తము. అర్థపునరుక్తము నని యది రెండు విధము ‘శబ్దము అనిత్యముÑ శబ్దమనిత్యము, అనిని శబ్దపునరుక్తము, ‘శబ్దమనిత్యముÑ ‘నాదమువినాశి’ అనిని అర్థపునరుక్తము.
‘‘అర్థాదాపప్న స్య స్వవబ్దేన పునర్వచనమ్’’ 5టగడబ2.1 తదవ5.
అర్థాత్ R అర్థమువన, అపన్నస్యR ప్రాప్తమైన దాని, స్వశబ్దేన అయర్థమునుచెప్పు శబ్దముచేత, పునర్వచనమ్ R మరచెప్పుట, అర్థపునరుక్తము.
మేఘము లేక వర్షింపదుÑ అని ‘‘మేఘమున్న వర్సించు’’ అని చెప్పుట అర్థపునరుక్తమనబడును. ఇట్లే, స్థూుడగు దేవతద్తుడు దినమున భుజింపడని ‘రాత్రి భోజనము చేయును’ అనుటయు, అర్థపునరుక్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి