మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

కరోనా వాక్సిన్ సందేహాలు అపోహలు

కరోనా వాక్సిన్ టిప్స్ 

కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ - రెండూ కూడా క‌రోనా వైర‌స్‌పై స‌మ‌ర్థంగా ప‌నిచేస్తున్నాయి 

కోవాగ్జిన్ ఇన్‌యాక్టివేటెడ్ ప్లాట్‌ఫాంపై త‌యారైంది. 

కోవిషీల్డ్ వైర‌ల్ వెక్ట‌ర్ ప్లాట్‌ఫాంపై ఆధార‌ప‌డి ఉంటుంది. 

రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్‌ను మాత్ర‌మే తీసుకోవాలి.

రెండు టీకాల‌ను క‌లిపి తీసుకోవ‌డం మంచిది కాదు. 

గ‌తంలో క‌రోనా బారిన ప‌డిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. 

దీనివ‌ల్ల యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉత్ప‌త్తి అవుతాయి. 

క‌రోనా నుంచి కోలుకున్న రెండు వారాల‌కు రెండో డోస్ తీసుకోవ‌చ్చు. 

అదే మొద‌టి డోస్ తీసుకోక‌ముందు క‌రోనా వ‌స్తే.. రిక‌వ‌రీ అయినా 28 రోజుల త‌ర్వాత‌నే వ్యాక్సిన్ వేసుకోవాలి.

మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత ఒక్కోసారి 28 రోజుల్లో రెండో డోస్ తీసుకోవ‌డం కుదరకపోతే 

6 నుంచి 8 వారాల్లోపు రెండో డోస్ తీసుకోవాలి. 

వ్యాక్సిన్ వేసుకుంటే కొంత‌మందికి ఒళ్లు నొప్పులు, తేలిక‌పాటి జ్వ‌రం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, కీళ్లనొప్పులు వంటివి రావ‌చ్చు. 

కంగారు పడాల్సిన పని లేదు ఇవ‌న్నీ రెండు నుంచి మూడు రోజుల్లో త‌గ్గిపోతాయి. 

టీకా తీసుకున్న వారికి కూడా తిరిగి క‌రోనా సోకే అవకాశం ఉంటుంది. 

వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా మాస్కులు ధ‌రించ‌డం తప్పదు 

సామాజిక దూరంతో పాటుగా ఇతర ఆరోగ్య పద్ధతులు పాటిస్తూ ఉండాలి తప్పదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి