అశోక చక్ర, కీర్తి చక్ర, సూర్య చక్ర పురస్కారాలను శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారాలుగా విజేతలకు అందజేస్తారు . దేశాల యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన దేశ సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారం మహావీర్ చక్ర.
2021 నుంచి పరమవీరచక్ర, అశోక్‌చక్ర అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారం రూ. 10 లక్షల నుంచి రూ.కోటికి పెంచుతున్నట్లు ప్రకటించారు - కీర్తి చక్ర, మహావీర చక్ర అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారం రూ.8 లక్షల నుంచి రూ.80 లక్షలకు, అలాగే .. వీర్ చక్ర, శౌర్య చక్ర అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారం రూ.6 లక్షల నుంచి రూ.60 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు
సాధారణంగా గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంలో ఈ పురస్కారాలను అర్హత పొందిన వారికి ప్రకటిస్తారు. - ఇప్పటి వరకు 21 వీరులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసారు. అందులో 14 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కితే ఏడుగురు స్వయంగా అందుకొన్నారు. సైనిక సేవ పూర్తయిన తర్వాత యూనిఫాం అనుమతి ఉండదు. సైనిక సేవ పూర్తయిన తర్వాత పరిచయ పత్రం మారిపోతుంది
2021- మహావీర్‌చక్ర:
బి.సంతోష్ బాబు (కల్నల్ )
2021- కీర్తిచక్ర : సంజీవ్‌కుమార్ (సుబేదార్),
పింటూకుమార్ (సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్),
శ్యాంనారాయణ్ సింగ్ యాదవ్ (సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్),
వినోదకుమార్ (సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్),
రాహుల్ మాథుర్ (సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్)
2021- వీర్‌చక్ర:
నుదూరామ్ సోరెన్ (నాయబ్ సుబేదార్),
కె.పళని (హవల్దార్),
తేజీందర్‌సింగ్ (హవల్దార్),
దీపక్‌సింగ్ (నాయక్),
గురుతేజ్ సింగ్ (సిపాయి)
2021- శౌర్యచక్ర:
అనూజ్ సూద్ (మేజర్),
ప్రణబ్‌జ్యోతి దాస్ (రైఫిల్‌మ్యాన్),
సోనమ్ శెరింగ్ తమాంగ్ (పారాట్రూపర్),
అర్షద్ ఖాన్ (ఇన్‌స్పెక్టర్ - జమ్మూకశ్మీర్),
ముస్తాఫా బారా (ఎస్‌జీసీటీ -జమ్మూకశ్మీర్),
నజీర్ అహ్మద్ కోలీ (ఎస్‌జీసీటీ - జమ్మూకశ్మీర్),
బిలాల్ అహ్మద్ మాగ్రే (స్పెషల్ పోలీసు ఆఫీసర్- జమ్మూకశ్మీర్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి