మొత్తం పేజీ వీక్షణలు

23, ఆగస్టు 2024, శుక్రవారం

వైరస్ నివారణోపాయాలు

 వైరస్ నివారణోపాయాలు 

---------------------------------

వైరస్ అనేది జీవి కాదు. ఇది ఒక నిర్జీవి.

ఇది కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే.

వైరస్ చాలా బలహీనమైనది అలాగే ఎంతో తేలికగా విచ్చిన్నమయ్యేటటువంటిది

తనకు రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం పెరుగుతుంది .

దీనిని చంపడం అనేది జరుగదు. 

దానంతట అదే క్షయం కావాలి 

వైరస్ క్షయం అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది.

ఇది కంటి, ముక్కు, గొంతు లోని కణాలతో చేరినపుడు అది జన్యు కోడ్ ను మార్చుకొని కణాలను చైతన్య వంతమైనవిగా చేస్తూ  సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది. 

సబ్బు, డిటర్జెంట్స్ నుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది. 

25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి కొవ్వును కరిగిస్తుంది 

వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం ఉన్నది.

నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించగలం.

కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. 

65% తగ్గని ఆల్కహాల్‌ మిశ్రమాల  ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీటి మిశ్రమం  వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేస్తుంది 

హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. 

శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు.

ఏంటిబయాటిక్స్ బాక్టీరియాను మాత్రమే  చంపగలవు.

వైరస్ నిర్జీవి కనుక దానిని ఏంటి బయాటిక్స్ నిర్వీర్యం చేయలేక పోయినా వాటి నిర్మాణాన్ని కుదించగలవు. 

యూవీ రేస్ వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేయగలవు - కానీ ఇవి చర్మంపై పడితే ( మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వస్తుంది 

ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించలేవు.

వైరస్ లు చల్లని వాతావరణంలో, చీకటిలో వాటి అస్తిత్వాన్ని కొనసాగిస్తాయి.  

పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసుకోవాలి.

తక్కువ వెలుతురు, గాలి కలిగిన  ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి